ఎందుకు(కవిత)
-లక్ష్మీ దేవరాజ్
కంటికి కనిపించని జీవి
కంటి మీద కునుకు లేకుండా చేస్తుంటే
మార్స్ వరకూ వెళ్ళిన మనిషి
మౌనంగా మిగిలిపోయాడేం?
ఎంతో కష్టపడి ఇష్టంగా కూడబెట్టిన డబ్బు
ఆరోగ్యాన్ని మాత్రం కొనలేదని
మరోసారి మరచిపోయాడేం?
డైనోసార్లు….సరే ఎప్పటివో
పులులు మాత్రం నిన్నమొన్నేగా
కాలగర్భంలో కలిసిపోతుంటే
అంటీముట్టనట్టున్న మనిషి
ఇప్పుడెందుకిలా అల్లాడిపోతున్నాడు?
ప్రకృతి నేర్పే పాఠం కష్టమే
ఇది మన దురాశ వల్ల కలిగిన నష్టమే
ఇకనుంచైనా
బాహ్య శుభ్రంతో పాటు
అంతఃశుభ్రంపై ఆలోచన పెడదాం
అలాగే
ప్రపంచంలో మనతోపాటు సంచరించే
ప్రతీజీవి ప్రాణంఖరీదు
మనిషి ప్రాణంతో సమానమే అని ఒప్పుకుందాం
*****
ఫోటో ఆర్ట్: రమేష్ పొతకనూరి
‘బాహ్య శుభ్రంతో పాటు
అంతఃశుభ్రంపై ఆలోచన పెడదాం..’ ఎంత బాగా చెప్పారో!
కరోనా వంటి మనుషులున్న మాట వాస్తవం. మన అందరి జీవితాల్లోనూ ఎదురౌతూనే వుంటారు..అలాటి వారు ఇక నైనా మారతారని ఆశిద్దాం.
అభినందనలండి.
Thank you so much
Thanks Lakshmi Garu. My heart and brain worked together with joy in responding to your beautiful post. One of my passions is Telugu literature. But passion remained as passion with no time to learn and explore for my satisfaction.
చాలా బాగా చెప్పారు లక్ష్మీ గారు!
నా ప్రయత్నంగా – జాగృతా దృక్పథం తో :
నాగరికత నెపంతో నిత్యాన్వేషణ కృతిలో
పురోగతి పోంతతో ప్రకృతి విరుద్ద ప్రాకృత్యములతో
వికృత విన్యాస దుశ్చర్యా ప్రక్రియ తో
మానవ మనుగడ మననం పుడమిశోక కారకం.
ప్రకృతి ప్రతీకార వైపరీత్య విళయం, విశ్వవినాశాన ప్రళయం.
Wow. Greatly said with beautiful words. I bow down to your command in the language, Naveen