జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు (చివరి భాగం)

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు (చివరి భాగం)  -వెనిగళ్ళ కోమల అమెరికాలో స్నేహితులు మా ఇద్దరికీ ముఖ్యమైన మిత్రులు ప్రొ.ఆలపాటి కృష్ణకుమార్, జ్యోతిర్మయి. వారితో ఇండియాలో పరిచయమైనా ఇక్కడ మాకు వారితో స్నేహం గాఢమయింది. వారింటికి (గెయితీస్ బర్గ్) తరచు వెళ్ళి రోజంతా గడుపుతాము. కృష్ణ కుమార్ గారు సౌమ్యులు. నెమ్మదిగా అనేక విషయాలు ఇన్నయ్యతో చర్చిస్తుంటారు. ఇక జ్యోతిర్మయి రకరకాల వంటలు ఓపిగ్గా మాకు చేసి పెడుతుంటారు. ఎప్పుడూ వారింట్లో ఎవరో ఒకరు స్నేహితులు బస...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-12

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-12 -వెనిగళ్ళ కోమల డి. ఆంజనేయులు డి. ఆంజనేయులు ఇన్నయ్యకు చిరకాల మిత్రులు. తెలుగు, ఇంగ్లీషు భాషల మీద మంచి పట్టుగల రచయిత, జర్నలిస్టు, క్రిటిక్, పి.ఐ.బి.లో పనిచేశారు. మద్రాసులో నివాసం. పెద్ద గ్రంథాలయం ఏర్పరచుకున్నారు. ఆంజనేయులుగారి ఏకైక పుత్రిక శాంతిశ్రీ చిన్నప్పటి నుండి నవీన, రాజుతో మంచి స్నేహితురాలుగా మెలుగుతూ వచ్చింది. ఇప్పడు పూనా యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసరు. తెలుగు, తమిళ, మరాఠీ, ఇంగ్లీషు అనర్గళంగా మాట్లాడుతుంది. మంచి వక్త...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-11

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-11 -వెనిగళ్ళ కోమల రాజు ఢిల్లీ నివాసం యూరప్ లో ఉన్నప్పుడే “హిందూస్థాన్ టైమ్స్” ప్రతినిధులు రాజును వారికి ఆర్ధిక, పరిశ్రమలకు సంబంధించిన దిన పత్రికను ప్రారంభించమని కోరారు. రాజు తన మాతృదేశానికి ఏదైనా తన వంతు చేయాలనే తలంపుతో ఉన్నాడు. తాను పుట్టినదేశం, తనకు చదువు సంధ్యలిచ్చిన దేశం పట్ల తనకు కర్తవ్యం ఉన్నదనే భావంతోనే హిందూస్థాన్ టైమ్స్ వారి ఆహ్వానాన్ని అంగీకరించాడు. రాజు తెలివితేటలు, శక్తి సామర్ధ్యాలు, “ది వాల్...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-10

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-10 -వెనిగళ్ళ కోమల కాలేజ్ సర్వీస్ అన్వరుల్ – ఉలుం కాలేజీలో వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేది. మా డిపార్ట్ మెంట్ హెడ్ ఎ.ఎం.వాఛా స్టాఫ్ ను ఆదరించేవారు. అందరిచేత పనిచేయించటంలో నేర్పరి. కష్టజీవి. ఎప్పుడూ సెలవుపెట్టి ఎరగడు. తన పుట్టిన రోజున మాకు పార్టీలిచ్చేవాడు. ఇప్పటికీ అది కొనసాగుతున్నది. రాఘవేంద్ర మాన్వీ, క్రిస్టీనా, జాఫ్రీ – అందరం ఒక కుటుంబ సభ్యులుగా అమెరికాలో పెరిగేవాళ్ళం. నేను క్రిస్టీనా ఖమరున్నీసా బేగం (ఎకనామిక్స్) స్నేహంగా...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-9

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-9 -వెనిగళ్ళ కోమల నవీన మెడిసిన్ పూర్తవుతుండగా హేమంత్ తో వివాహం జరిగింది. అతను నిజాం కాలేజి గ్రాడ్యుయేట్. ఇండియన్ ఎంబసీ, వాషింగ్టన్ లో ఉద్యోగిగా ఉన్నాడు. అతను ప్రపోజ్ చేసిన మీదట నవీన ఇష్టపడింది. అతను సెలవులకు హైదరాబాద్ వచ్చి ఉన్నాడు. ఇన్నయ్యకు ఆ పెండ్లికి అభ్యంతరం లేకపోయింది. జనవరి 12, 1988న రిజిస్టర్ వివాహం జరిగింది. జూబ్లీహిల్స్ క్లబ్ లో డిన్నర్ ఇచ్చాము. వ్యవధి లేకపోవటాన నా వాళ్ళంతా ఊళ్ళ...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-8

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-8 -వెనిగళ్ళ కోమల రాజు పుట్టుక గురించి నాకొక గట్టి విశ్వాసం ఉన్నది. నేను, కనకమణి స్కూలు లైబ్రరీకి ఇంగ్లీషు పుస్తకాలు కొనటానికి ఒకనాడు ఆబిడ్స్ వెళ్లాము. పుస్తకాలు సెలక్షన్ అయ్యింది. లంచ్ చేద్దామని నిజాం కాలేజికెదురుగా ఉన్న ఓరియంట్ రెస్టారెంట్ కి వెళ్ళాము. పదార్ధాలు ఆర్డరిచ్చి మాట్లాడుకుంటున్నాము. నాలో అతిసన్నని కదలిక అనిపించింది. గర్భం సూచన అది అనిపించింది. భోజనం సహించలేదు. ఓరియంట్ రెస్టారెంట్ కి ఒక ప్రత్యేకత ఉండేది. ఎలీట్...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-7

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-7 -వెనిగళ్ళ కోమల వివాహం, పిల్లలు, బాధ్యతలు అన్నయ్యకు చదువుతుండగానే పెండ్లయింది. మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో డి్గ్రీ చదివారు. ముగ్గురు పిల్లల తండ్రయ్యారు. తార, నాగమణి, కృష్ణమోహన్ – వదిన ఎంపికే ముగ్గురి పేర్లు. పెంచే విధానం గూడా ఆమెకు తోచినట్లే. ఆ తరుణంలో మా అమ్మ నాకూ శ్యామలక్కకూ పెండ్లి విషయం నాన్న, అన్నయ్య శ్రద్ధ పట్టటం లేదని కొంత బెంగ పడింది. స్నేహితుల పెళ్ళిళ్ళ విషయంలో చూపే శ్రద్ధ మాపట్ల...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-6

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-6 -వెనిగళ్ళ కోమల ఒకనాడు వెల్మా, నేను బస్ మిస్ చేసి మార్కెట్ కు అడ్డదారిన నడిచి వెళుతూ ఉన్నాం. నలుగురు యువకులు ఆ దారినే వెళుతూ ఉన్నారు. వెల్మా గళ్ళెగా పెద్దదానిలాగా ఉంటుంది. నేను అప్పుడు బక్కగా ఉండేదాన్ని. తనకు తెలుగు రాదు గనుక ఇద్దరం హిందీలో కబుర్లాడుకుంటూ నడిచాం. ఆ అబ్బాయిలు తెలుగులో మా మీద కామెంట్స్ పాస్ చేస్తూనే నడిచారు. మాకు అర్థం కాదని గాబోలు – ‘ఈమె...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-5

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-5 -వెనిగళ్ళ కోమల నాకు 8 ఏళ్లుంటాయి  నేను గెంతుతూ ఆడుతున్నాను. బజారు తలుపు తెరుచుకుని ఒకాయన కాషాయవస్త్రధారి (యువకుడే) వచ్చాడు. నాన్నను చూచి – ఈ అమ్మాయి అడవిలో కళ్ళు మూసుకుని కూర్చున్నా అన్నం దొరుకుతుంది అన్నాడు. నాన్న అతని మాటలు నమ్మాడని కాదుగాని అతను నాన్నను ప్లీజ్ చేయటానికి వాడిన సమయస్ఫూర్తి నచ్చి అతనికి 2 రూపాయలు (అప్పుడది ఎక్కువ) యిచ్చి పంపాడు. దానధర్మాలు చేయటం, చందాలు విరివిగా ఇవ్వటం...

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-4

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-4 -వెనిగళ్ళ కోమల చిన్నపిల్లల్ని పోగేసి చింతగింజలాట ఆడేదాన్ని ఇంటర్ చదివేటప్పుడు. అన్నయ్య ‘నిన్ను ఇలా చూచినవారెవరూ ఇంటర్ చదువుతున్నావంటే నమ్మరు’ అనేవాడు. ఐదురాళ్ళ ఆట కూడా మొదలు పెట్టా. నొక్కుల జుత్తు పెద్దగా, ఒత్తుగా ఉండేది. చిక్కు తీసుకోలేక పీకి, కత్తిరించి పడేస్తుంటే అన్నయ్య – నీకెందుకింత చక్కని జుట్టు వచ్చిందో గాని నులకతాడు పేనినట్లు పేనుతున్నావు అని కోప్పడేవాడు. మంచి దువ్వెన తెచ్చి ఇచ్చాడు.  ఇంటర్ లో 10 మంది...
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-3

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-3 -వెనిగళ్ళ కోమల సీతమ్మ పెద్దమ్మ ఒంటరి. అమ్మమ్మ నాటి నుండి స్నేహమట. అమ్మమ్మ, తాతయ్యలను నేను ఎరుగను. అది నా జీవితంలో లోటుగానే ఉండేది. ఆమె మా యింట్లో పెద్ద తోడుగా సహాయపడేది. అన్నయ్య తెనాలిలో చదువు కుంటుంటే దగ్గర ఉండి వండి పెట్టింది. నా పెండ్లి దాకా ఉన్నది పెద్దమ్మ. మేమంతా గౌరవించి, ప్రేమించిన సీతమ్మ పెద్దమ్మ. నాన్నగారి తరఫున తాతయ్య, బాబాయిలు, నాగమ్మత్తయ్య ఎక్కువ వచ్చిపోతుండేవారు. నాన్న స్థితిమంతుడవటాన...
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-2

జీవితమే నవీనం అనుభవాలు -జ్ఞాపకాలు-2 -వెనిగళ్ళ కోమల పెద్ద మామయ్య అంటే నాన్నకు యిష్టం.  మాకందరికీ చనువు ఉండేది. మామయ్యలు అమ్మ ఒకరినొకరు ప్రాణప్రదంగా చూసుకునేవారు. పెదమామయ్య సౌమ్యుడు. ఏ పని చేసినా నీటుగా, అందంగా చేసేవాడు. తాటిజీబుర్లతో ఎంతో ఉపయోగంగా ఉండే చీపుర్లు కట్టేవారు. నులక, నవారు, మంచాలు నేయటంలో నేర్పరి. దీపావళికి ఉమ్మెత్తకాయలు తొలిచి ప్రమిదలుగా చేసి, నూనెపోసి వెలిగించి ద్వారాలకు అందంగా వేలాడదీసేవాడు. ఉండ్రాళ్ళతద్దెకూ, అట్ల తద్దెకూ మా రెండో యింట్లో మోకులతో...
komala

జీవితమే నవీనం – అనుభవాలు-జ్ఞాపకాలు-1

జ్ఞాపకాలు-1 -వెనిగళ్ళ కోమల నాన్న తన మూడవ ఏట మూల్పూరు పెంపు వచ్చారట. పెంచుకున్న వారు అఫీషియల్ గా దత్తత నిర్వహించి నాన్న అసలు యింటి పేరు మార్చలేదు. పెంచి బాధ్యతలు, ఆస్తులు అప్పగించారు తప్ప. అందువలన మూల్పూరులో మేము  ఒక్కళ్ళమే వెనిగళ్ళవాళ్ళం. అంట్లు, సూదకాలు మా దరికి రాలేదు మూల్పూరులో. మాది ఏకఛత్రాదిపత్యం మూల్పూరులో. పెద్దింటి వారుగా ఊరంతా గౌరవించేవారు. అలా అమ్మా, నాన్నా నడుచుకున్నారు మరి! అమ్మకు ఎనిమిదవ ఏట నాన్నతో (18ఏళ్ళు) పెండ్లి...