స్వప్న వీధిలో…

-డి.నాగజ్యోతిశేఖర్

రోజూ రెప్పలతలుపులు మూయగానే …
నిద్రచీకటిలో గుప్పున వెలుగుతుందో నక్షత్రమండలం!

కలతకృష్ణబిలాల్ని కలల లతల్లో చుట్టేసి…
దిగులు దిగుడుబావిని దిండుకింద పూడ్చేసి
ఒళ్లు విరుచుకుంటుందో వర్ణప్రపంచం!

ఊహాల్ని శ్వాసల్లో నింపి…
ఊసుల్ని పూలలోయల్లో  ఒంపి…
మనస్సు మూట విప్పుతుందో
వినువీధి!

ఆ వీధి మధ్యలో పచ్చటి చెట్టయి నవ్వుతుంటుంది నా మస్తిష్కం.!
ఆ సందు చివర కురులారాబోసుకుంటుంది
నా నవ్వుల వెన్నెల కెరటం!

నడి వీధిలో నవ్వేెంటనే
ఆధిపత్యపు స్వరాలు లేవు!
ఆకాశపు అంచుల్లో నువ్వేెంటనే అమావాస్యపు హద్దులు లేవు!

నిశ్చల తరంగమై….
నాలో నేనే సంగమిస్తూ…
నిశ్శబ్ద తురగమై…
నాలోకి నేనే పయనిస్తూ….
ఎంతకీ తరగని స్వప్నవీధిలో  ఆమనిపాటొకటి ఆలపిస్తూ…
మెలకువకూ.మెలకువకూ
మధ్య నాతో నేనే సంభాషించుకుంటూ…
అలా…అలా…సాగిపోతూనే ఉంటాను!
నన్ను నేనే అప్రతిహతంగా దర్శించుకుంటాను!

*****

ఆర్ట్: మన్నెం శారద

Please follow and like us:

3 thoughts on “స్వప్న వీధిలో… (కవిత)”

  1. గీతా మేడం గారికి,పత్రికా సిబ్బందికి,చక్కటి బొమ్మను వేసిన శారదా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  2. గీతా మేడం గారికి,పత్రికా సిబ్బందికి,చక్కని బొమ్మను గీసిన శారదా మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు

  3. గీతా మేడం గారికి,పత్రికా సిబ్బందికి ధన్యవాదాలు

Leave a Reply

Your email address will not be published.