చిత్రలిపి

నవ్వుకుంటున్నావా…. నీవు ???

-మన్నెం శారద

గోళాలు దాటి  అనంత దిగంతాలకేగిన నీకు 

మాలిన్యపు డబ్బాలు  తెచ్చి పూస్తున్న 

కాలుష్యపు  రంగులు చూసి ….!

ఇదేమిటయ్యా ఈ జనం …..

వారి వారి మనసులోని  విషపు రక్తం 

నీ కీర్తి బావుటా పై నిలువునా వెదజల్లుతున్నారు !

ఎవరు నువ్వు ???

ఆడుతూ ఆడుతూ ….

పాడుతూ పాడుతూ …

చిలిపిగా గెంతుతూ …

చిందులు తొక్కుతూ …

కష్యదాటి  కర్మఫలం తో …

మా మధ్యమసలిన  మహామనిషివి కావా …

నీకు కులమేమిటి …మతమేమిటి !

నువ్వొక చీకటి ఆకాశంలో  జివ్వున వెలిగిన మెరుపువి 

 గాఢపు మబ్బుల అంచున మెరిసే జలతారు అంచువి !

నీపాటకి మైమరచి  కరుగుతున్న రసజ్ఞ మేఘాల కొసలు పట్టుకుని 

చిలిపిగ క్రిందకి దూకే 

అపురూప దివ్యజలానివి !

అప్పుడే  లేలేతకిరణాలు సోకి 

వికసిస్తున్న పవిత్ర పారిజాతానివి 

.అసలు నీగురించి చెప్పడానికి  ఏ పదకోశం లో మాటలు లేవు !

నువ్వు నువ్వే ….

అవును ముమ్మాటికీ నువ్వు నువ్వే !

నువ్వొక పాటవి !

నువ్వొక మాటవి !నువ్వొక నవ్వువి 

నువ్విక మాకెన్నడూ దొరకని  అపురూప దివ్య బాలాగాంధర్వుడివి ..

…నవ్వుకోకు మరి మా అజ్ఞాన తిమిరాన్ని చూసి !!!



*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.