Perhaps, This is a Testing Time
-English Translation: Nauduri Murthy
-Telugu Original: Kalekuri Prasad(Yuvaka)
Just that…
I am not too ambitious to gallop away,
At the same time, don’t want to stay put where I am
Biding time, doing nothing worthwhile.
Holding a cryptic clue in my hands
I walk towards a distant dawn.
Perhaps, this is a testing time.
These life’s attractions are the real shackles
And hurdles. Let them!
I may be physically weak but strong mentally.
My mind and heart are
As sharp as razor’s edge
There is a galore of abhorring scenes afore
Insufferable acts of cruelty and violence.
Once more, like a wild flower
Rising from their midst, and
Sneaking through the cracks of graves
I resurrect, carrying the weaponry of words
That break the bubble to unfurl
The flags in colorful spectra.
By I, I mean, you, me and all of us.
(The last poem of Kalekuri Prasad)
బహుశా ఇది పరీక్షా సమయం
-కలేకూరి ప్రసాద్(యువక)
ఊరకే
ఉరికురికిపోవాలని ఉబలాటమేమి లేదు
అట్లని నిలబడ్డ చోటనే నుంచోని
మీనమేషాలు లెక్కబెట్టాలనీ లేదు
ఒక సాంద్రసంకేతాన్ని అరచేతిలో పట్టుకుని
సూర్యుడు వైపు నడుస్తున్నాను
బహుశా ఇది పరీక్షా సమయం
కాని ఏ జీవనమోహాలు ఆటంకాలు
అవరోధాలు వస్తే రానియి
బలహీనుడినే కాని స్థిరచిత్తుడను
హృదయం మెదడు
పదునెక్కిన ఖడ్గంలా వున్నాయి
కళ్ళముందు అనేకనేక బీభత్సదృశ్యాలు
సహించలేని క్రూర అకృత్యాలు
వీటిమధ్య నుంచి మళ్ళొక్కసారి
సమాధుల పగుళ్ళలోంచి
మొలుచుకొచ్చిన గడ్డిపువ్వులా
నీటిబుడగను పగలకొట్టి
ఇంద్రధనుస్సు జెండాలెగరేసిన అక్షరాలను
ఆయుధాలుగా చేబూని వస్తున్నాను
నువ్వే నేను నేనే నువ్వు మనందరం …
( ఆఖరి కవిత, అసంపూర్ణం , రచన కాలం 2013 , రాతప్రతి ఆధారం )
*****