image_print

హ్యాపీ న్యూ ఇయర్! (కవిత)

హ్యాపీ న్యూ ఇయర్! -బండి అనూరాధ హఠాత్తుగా మాయమైన ఎవరో..ఇంటి ముందు నడుచుకుంటూ మరెవరో..లోనికింకి బయటపడని మరింకెవరో.. చుట్టూ పచ్చదనంలోకి నిన్ను లాగేఅక్కడే వాలిన ఒక పక్షి! ఇలాగా!?కొంత నొప్పిని, కథలోకోకవిత్వంలోకో చొప్పించడం! మరి నువ్వు చూసుకుపోతున్నప్పుడుదారి నిన్ను చూసి నవ్వినట్లనిపించిందా?పక్కలమ్మట గడ్డిపూలనయినా పలకరించావా? సైడు కాలువలో నుండీ బయటకొచ్చీ లోపలికి గెంతులేసే కప్పల సంగతీ?నీలోని బెకబెకల సంగతో మరి!ఆకలేస్తోందా..? అక్షరాలని ఇక కట్టేసిదారిన పంటపొలాలకేసి చూస్తోన్నావా.. మరి వాళ్ళకు తప్పదు; కోత కొయ్యాలీ,.. కుప్పవెయ్యాలీ,..నూర్చాలీ,..  హేయ్…నువ్వు ఇక కవితల్ని తూర్పారపెట్టుకోమాటలజాలిని పొట్టులా విసురుకో Happy new year!! ***** బండి అనూరాధపేరు […]

Continue Reading
Posted On :

దిగులు కళ్ళు (కవిత)

దిగులు కళ్ళు -బండి అనూరాధ దిగులు కళ్ళు చుక్కలని పోల్చుకోలేవు.చీకటి ఇల్లు వెన్నెలని చదువలేదు. పనికిమాలిన తత్వాలకిపేర్లు పెట్టుకుంటూఇంకా నువ్వు వెళ్ళిన వైపే చూస్తూ అక్షరాలతో,  అనేకానేక చింతలతోకాలయాపన చేస్తున్నా. మిగులుగా జీవిస్తూ పోతానుకానీఅప్రమేయతలోనూ సత్యమొకటి ఉంటుంది. అడుగు అడుగుకీ నిబద్ధత చప్పుడుని చేస్తుంది. ఇక,.. ఏ తెల్లారగట్టో కోడి కూస్తుంది.మసకవెలుతురికి చూపు జారుతుంది. అప్పుడు,.. కలల జాడ ఒక ప్రశ్నై పొడుస్తుంది.కళ్ళ ఎరుపు ఒక జవాబై మిగులుతుంది. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా […]

Continue Reading
Posted On :

అయినా సరే! (కవిత)

అయినా సరే! -బండి అనూరాధ చిగురించి పండి ఎండి రాలి..ఆకుల వంటి వారమే మనం కూడా. ఒక్కోసారి,ఒళ్ళు జలదరించే సత్యాల్లోకి తొంగిచూస్తేనిద్రపట్టని రాత్రుళ్ళలోకి వెళ్ళిపడతామేమోననిఈవలిగానే పట్టీపట్టనట్లుండిపోతాం. భ్రమల నేలలో అన్నీ బరువే అనుకునితేలికగా ఊపిరి తీసుకుంటూచెట్లనీడలో పడిన ప్రాణంలాతెరిపినపడుతూ… ఒక నిద్రకి, కలల చెట్లని పట్టుకెళ్ళివాడని పూలను కోసుకుంటూనిజంలా బ్రతికేస్తూ… వనాలలో వైనాలన్నీ పగటికి పూసివెర్రి నవ్వొకటి నవ్వుకుంటాం. రాలడం తెలియదుగా..ఎప్పుడో..!! ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా […]

Continue Reading
Posted On :

గాయం రంగు (కవిత)

గాయం రంగు -బండి అనూరాధ బద్ధకం, మగతా, పలు మీమాంశల మధ్యగా కళ్ళుతెరవ చూస్తాను.లోపలెవరో నెగడుని రగిలించినట్లుకళ్ళ మంటలు; కొంచ మాగాక, పక్షులు ఇక ఊరుకోవు.ఒక కిటికీ పక్కగా జామచెట్టూ;మరో కిటికీ పక్కగా వేపచెట్టూ;గది మొత్తం, ఆ రెంటి పై తిరుగాడే పక్షుల భాషే! ఇక నిజంగా లేవబోతానా! అజ్ఞాత చిత్రకారులెవరో, రకరకాల అసంపూర్తి కాన్వాస్లని వదిలిపోయిన చోటులోనే తిరుగాడుతున్న రాత్రికల ఇంకానా కళ్ళలో సజీవచిత్రమై ఉంది. మరి పూర్తి మెలకువలో, అంతా అయోమయం.తెర మొత్తం నీలమూ తెలుపు బూడిదరంగు.ఎర్రని వృత్తంలో ప్రాణం. పశ్చిమంకి […]

Continue Reading
Posted On :

Expiration (కవిత)

Expiration -బండి అనూరాధ వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. ఈ దిగులునూ పట్టుకునివెళ్ళవలసింది.చేతులు ఖాళీలేకపోతేనేం.మనసు అరలో కుక్కుకునైనాపోవలసింది. ఏకాంతాలదొంతరని తివాచీలా పరచి రాజసంగా నడిచి వెళ్ళిపోయావు. దేదీప్యమాన జ్ఞాపకాల రత్నాలు నలిగి అలిగి ప్రకాశించడం మానేసాయి.  మళ్ళీ వస్తావని నా చుట్టూ ఉన్న ఏ పరిసరమూ నమ్మదు. నేనెలా నమ్మేదీ.  మోహం సడలి మైకం వదిలిహ్మ్ ..మజిలీలుండవు.  ముగింపులే ఉంటాయి. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. […]

Continue Reading
Posted On :

ఆలాపన (కవిత)

ఆలాపన -బండి అనూరాధ నిదానంగా కురిసే ప్రేమని పెనుగాలులు అసలేమీ చెయ్యలేవు. దీపాలు కొండెక్కడం మామూలుకాదు. నానాతంటాలూ పడి ఏదో అనాలని చూస్తారుకానీ కాంతిలో తేలిపోతారు ఎవరివి హృదయాలని వెతకకుఎక్కడ మనుష్యులూ అని తిరుగకువిరిగిపోయిన ముక్కల్లో లెక్కలు చూడకుదూరమైనసూదుల్లాంటిభావాల్లో తలనుదూర్చినిన్ను నువ్వు గుచ్చుకోకుగ్రహించుదారంలేనివి ఆధారాలు కావెప్పుడూ  అయినా పలకరింపుల్లేని ప్రేమల్లో విహరించడంద్వంద్వాల్లో మరణించడంఇప్పుడసలేమీ బాగోదు సంధిచేసేవాళ్ళకి తెలియదువిసిరివెయ్యబడిన రాళ్ళు మునిపటిలా దొరకవనిఎరవేసేవన్నీ వ్యర్ధవెన్నెలప్రయత్నాలనీనూ పెనుగాలులు నిజాలని కరుచుకుని ప్రేమని తెలుసుకునే రోజొకటి రావొచ్చుప్రయాణం తప్పనప్పుడు, ప్రేమ మృత్యువంత అందంగా ఉండితీరుతుంది. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! “డ్రీమీ ఐస్”

https://youtu.be/iHPzR__jS60 డ్రీమీ ఐస్ -అనూరాధ బండి వాళ్ళు నా స్వప్నాల పై నీళ్ళు చిలకరిస్తునే ఉన్నారు.నా దారులనిండా ముళ్ళు పరచి ఉంచారు.వాళ్ళెలా ఊహించి ముందుగా అక్కడికి చేరారా యని ఆశ్చర్యపోయాను.తెలుసు నాకు, మరి అదే ముళ్ళలో వాళ్ళు వెనుకకి మరలలేరని. వాళ్ళిక్కడ లేరని నేను ముందుకు వెళ్ళడం విరమించి గుప్పెడు గింజలను తీసుకుని చుట్టూ విసిరాను.కొన్ని పక్షులు వచ్చి చేరాయి.వాటి కిలకిలల మధ్య నేను కొత్తచిగురులేసుకున్నాను.అవి తినగా మిగిలినవన్నీ మొలకెత్తి పెరుగుతున్నప్పుడునాలో వసంతం వెయ్యిరకాల ధ్వనులను  చేసింది. కొత్త పనులు నేర్చుకున్నాను, […]

Continue Reading
Posted On :

సమయం (కవిత)

సమయం -బండి అనూరాధ ఎండకి గొంతెండిన మొక్కలకి నీళ్ళిస్తూ సాయంత్రంలో నేను.మొక్కలకి పైగా సాయంత్రంపై వీచే గాలుల్లో గూళ్ళకి చేరుతూ పక్షులు. ముసురుకుంటున్న చీకట్లలో సమయం.రాత్రిని అంటుకుంటున్న చలిగాలులు.బయటకి చూస్తే నలుపు. గుబురుచెట్ల మధ్యన అంధకారం.మొదళ్ళ మౌనం. ఇంకొంచం గడిచిన సమయం.మరింత సాగిన రాత్రి. నడినెత్తిన సగం చంద్రుడు.అరవెన్నెల్లో ఆకాశం. లోపలా బయటా ఒకే నిశ్శబ్దం. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. […]

Continue Reading
Posted On :

Raw Beauty (కవిత)

Raw Beauty -బండి అనూరాధ ఈ పొద్దూ వానొచ్చినదితనదారిన తాను పోయినదిఎవరి దారిన వాళ్ళు పోవాలిగా ఇక్కడ మిగిలినది చూస్తే- కొంత మట్టీ కొంత ఇసుకాకొన్ని రాళ్ళూ మరికొన్ని మొక్కలూవిరిసిన ఒకే ఒక రోజా పువ్వు పాకుడుపట్టిన పాతగోడ,..తడికి మరింత పచ్చగా మెరుస్తూగాయమంత పచ్చిగా.. గోడకు పాకించిన మనీప్లాంట్ ఆకులనుండీఅప్పుడప్పుడూఒక్కో మిగులు వాన చుక్కా.. నా కళ్ళు ఇక విదిలించలేని చినుకులేనా అవి!?ఎవరో తమ అసలుకి పోయారు.నొప్పై, ఇదిగోనేను ఇలాగ నవ్వుతున్నానా!? పట్టిచూడడం అందం.పట్టించుకోకపోవడం పెను విషాదం. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం […]

Continue Reading
Posted On :

మేరీ (కథ)

మేరీ -బండి అనూరాధ ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఉదయం ఎనిమిది అయ్యింది. కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ వరండాలో కూర్చున్నాను. గేట్ తీసుకుని ఒకమ్మాయి వస్తోంది. ఎవరన్నట్లు ఆరాగా చూస్తుంటే, నమస్కారమమ్మా నా పేరు మేరీ అంది. ఏమిటన్నట్లు చూసా. మీ దగ్గర పనిచేసే దుర్గ వాళ్ళ చెల్లెల్ని అమ్మా అంది. మరి నాతో ఏమయినా పని ఉందా అన్నాను. అక్క, సుందరి గారి ఇంట్లో పనిచేసి వచ్చేలోగా మీతో మాట్లాడమనింది అమ్మా. పోనీ […]

Continue Reading
Posted On :

Eye opener Poem

Eye opener Poem -Anuradha Bandi  Flow with things, Be friendly with thoughts, Imagine people and scenarios. Flow with signs of love, live with emotions and Finally, Flow with ur feelings. Baby trace life as it is. In middle go through the interior of your heart and the exterior of your facts. sometimes you’re infant, you’ll […]

Continue Reading
Posted On :

నిర్ణయం (తృతీయ ప్రత్యేక సంచిక కథ)

నిర్ణయం (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -బండి అనూరాధ నిద్రపట్టట్లేదు. అశాంతి. ఏవేవో ఆలోచనలు. కొంత ఏడుపవుతుంది. కొంత భయమవుతుంది. లైటేస్తే, హ్మ్ ,..  చీకటి పళ్ళునూరుతుంది. వెలుతురు వెక్కిరిస్తోంది.  హ హ్హ హ్హా. నాకెందుకో నవ్వొస్తూంది. మరింత నవ్వు. ఏడుపునెక్కువ చేసే నవ్వా ఇది, తక్కువ చేసేదా. ఇంత నవ్వాక, నవ్వడమయ్యాక భయం పోతుందా. పిచ్చాలోచనలు అటకెక్కుతాయా. శాంతి పవనాలు వీచి నిద్రొస్తుందా. ఏంటి? నేను నిజంగా పిరికిదాన్నా. అంత పిరికిదాన్నే అయితే ఈపాటికి చచ్చిపోయి […]

Continue Reading
Posted On :

Mischievous Poem

Mischievous Poem -Anuradha Bandi  When I crawl into east,Sun starts walking.He smiled dramatically. When sky of East start changing shades accordingly to Sun,I suspected clouds may be falling in love. Colours varies like my mindset vary.So I visualize each in flow of life. Fixed programming of East to West isInteresting daily Drama for me,so that I live in […]

Continue Reading
Posted On :

పరంపర (కవిత)

పరంపర -బండి అనూరాధ మరలిపోయినాయధాస్థితిలో తిరిగి నిన్ను నిలిపే కాలస్ప్రుహ ఏదో వెన్నునంటే ఉంటుందెందుకో. ఆగి చూసుకుంటే-విడిచివచ్చినవేం పెద్ద బాధించవు.అంతర్లీనమై కొంత దుఃఖాన్ని నిక్షిప్తం చేస్తాయ్. అంతే. కొంచం సమయం చిక్కి వెనుకకి ప్రయాణమై చూసుకోలనుకుంటేఒక్క అద్దముంటుంది లోన. అంతే ముందుకుపోయే ఉత్సాహమో చింతనోఏదయితేనేం ఒక కొనసాగింపుకిక్షణాల ముస్తాబుని గురించివేడుకయిన గొంతుతో-ఒక పాటలానోకన్నీటి చరణమంత రాతతోనోచెప్పుకుపోతుంటావు. అంతే అపరిపక్వ పగళ్ళలో పగుళ్ళనూ చూసిపరిపక్వ రాత్రుళ్ళల్లో చీకటినీ చూసాకవెన్నెలకి చలించలేదని అమాసకి పున్నమి ఊసుల్ని కథలుగా గుచ్చాక ఓ నా అసమతుల్య ప్రపంచమా!- జీవనమనోవికాస సాఫల్యతకైఏ సమాజంవెంట నేనిపుడు ప్రయాణించాలీ?ఎక్కడ! మళ్ళీ […]

Continue Reading
Posted On :

మేకప్ (కవిత)

మేకప్ -బండి అనూరాధ మరోసారి గాయాలని పిలుద్దాంరహస్య చల్లగాలితో హృదయాల్ని లాలిద్దాంకాస్త కుదురుకున్నట్లు ధైర్యాన్ని ప్రకటిద్దాంలోలోపల బావురుమనే కరువుని పక్కకిజరుపుదాం రేకులురాలిన గులాబీలకి ముఖాలనంటిద్దాంముళ్ళని తాకిన మనసుల కథలని దాటిద్దాంపచ్చని ఆకుల వెచ్చని శ్వాసన నిదురిద్దాంఅద్దాల్లో నిజాలకు నీడలు కల్పిద్దాం చూసినకొద్దీ ఎముంటుందీ చీకటి తప్పవెలుగులుచిందే ముఖాలు ఎన్నీ భూమండలమ్మీదఅయినా ఎందుకో దుఃఖాన్నంతా తలగడకిద్దాంచిరునవ్వుతో కాలంపై యుద్ధం చేద్దాం ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా […]

Continue Reading
Posted On :

మీను (కథ)

మీను -బండి అనూరాధ శీతాకాలం అంటే నాకు చాలా ఇష్టం. బద్ధకాన్నీ చలినీ పోగొట్టే తెల్లారగట్ట చలి మంటలంటే మహాఇష్టం. ఇప్పుడు ఈ ఖాళీ అప్పుడు చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళి రావడంవల్ల కొంత పూడుతోంది. నిజమయిన అమాయకత్వంలో అప్పటి ఆ అల్లరి రోజులు ఇలా ఉండేవీ అలా ఉండేవీ అనుకోవడంలో ఉన్న తృప్తి ఎంత బావుంటుందో. అప్పటి ఆటలూ పాటలూ వేరేలే ఎంతయినా.. ఇప్పుడు పిల్లలకి ఎంతచెప్పినా ఏమనర్ధమవుతుందీ.. చెబితే వింటారా అని అసలు.       […]

Continue Reading
Posted On :