దేహచింతన (కవిత)
దేహచింతన –చల్లపల్లి స్వరూపారాణి నిజానికి మీకో దేశాన్నే యివ్వాలనుకున్నాదేహాన్నిచ్చి పాఠ్య పుస్తకం అవుతున్నా చచ్చినాక పూడ్చుకోడానికి ఆరడుగుల నేలకోసం యుద్ధాలు చేసే సంతతివైద్య విద్యార్దీ!యిది దేహం కాదు, దేశం ఈ దేహాన్ని జాగ్రత్తగా చదువు!దేశం అర్ధమౌతాది పేగుల్లో అర్ధశాస్త్రముంది చూడు చర్మం సుకుమారి కాదు వెన్నపూసల మర్దనా నలుగుపిండి స్నానం యెరగదు అయినా కళ్ళల్లో ఆకాంతి యెక్కడిదో ఆరా తియ్ !యిక గుండెకాయ గురించి యేమి చెప్పను!యెన్ని కొంచెపు మాటలు రంపంతో కోశాయో!ఆ గాయాలే సాక్ష్యం వూపిరితిత్తులు నవనాడులు కాసింత గౌరవం కోసమే కొట్టుకునేవి ఈ దేహానికి తలకంటే పాదాలే పవిత్రం రాళ్ళూ రప్పల్లో చెప్పుల్లేకుండా తిరుగాడిన కాళ్ళు యెదురు దెబ్బలతో నెత్తురు […]
Continue Reading