image_print

కంటి నీరు (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

కంటి నీరు (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -డా. లక్ష్మీ రాఘవ “అక్కా, నీవిలా ఏడ్చకుండా పడుకుండి పోతే బావను చూడటానికి వచ్చిన వాళ్ళు ఏమను కుంటారు?” మెల్లిగా చెవిదగ్గర చెప్పింది కామాక్షి. కళ్ళు తెరవకపోయినా నవ్వు వచ్చింది మాలతికి. ఏడిస్తేనే బాధ ఉన్నట్టా? తను ఇన్ని నెలలూ ఎంత బాధపడింది వీరికి ఎవరికైనా తెలుస్తుందా? బలవంతాన కళ్ళు తెరిచి లేచి కూర్చుంది. వచ్చిన వారు శంకరంతో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ కళ్ళు తుడుచుకుంటున్నారు. […]

Continue Reading
Posted On :

బోన్సాయ్ (కవిత)

బోన్సాయ్ -డా. లక్ష్మీ రాఘవ బలంగా ఉన్న విత్తుని నేను ఎక్కడపడ్డా ధృడంగా ఉంటా..అనుకున్నా ఆప్యాయత అనే నీరు పుష్కలంగా దొరుకుతుందనుకున్నా ఏపుగా ఎదగాలన్న కోరికతో ఉన్నా విస్తరించి నలుగురికీ ఆశ్రయం ఇచ్చే లక్షణాలు కలిగి ఉన్నా అందుకే అన్నీ దొరికాయని మట్టిని తోసుకుంటూ బలంగా బయటికి వచ్చా. సూర్య కాంతి అందం నన్ను మురిపించి రా అంటూ చేయి చాచింది. ఆహారం సమకూర్చుకుంటూ ఇంకాస్త పైకి లేచి చుట్టూ చూసా.. అందమైన ప్రపంచం పరికరిస్తూంటే పడిందో […]

Continue Reading
Posted On :

మారాల్సిన దృశ్యం (కథ)

మారాల్సిన దృశ్యం(కథ) -డా. లక్ష్మీ రాఘవ “రా.. రా.. ఇప్పటికి వచ్చావు …” తలుపు తీస్తూ ఎదురుగా నిలబడ్డ సవిత చేతి నుండీ సూట్కేసు అందుకుని గెస్ట్ రూమ్ వైపు నడిచింది రజని. “ఈ ఊరికి మా హెడ్ ఆఫీసు షిఫ్ట్ అయ్యింది. నాకు ఇక్కడ ఆఫీసులో మూడు రోజుల పని ఉందంటే, వెంటనే నిన్ను చూడచ్చనుకుని బయలుదేరా..”అన్న సవితతో “పోనీ, నాకోసం వచ్చావు..”అంది రజని సంతోషంగా. “బయట నుండీ మీ ఇల్లు చాలా బాగుంది…మీ స్టేటస్ […]

Continue Reading
Posted On :

అతను (కథ)

అతను (కథ) -డా. లక్ష్మీ రాఘవ గేటు ముందు కారు ఆగిన చప్పుడైతే వంటింట్లో నుండీ హాలు కిటికీ వైపు తొంగి చూసింది వర్ధని. కారు దిగి లోపలకు వస్తున్న వ్యక్తిని చూసి చట్టుక్కున పక్కకు జరిగి ఒక్క క్షణం నిలబడింది. వెంటనే త్వరగా వంటింట్లోకి వెళ్ళింది. మరు నిముషంలో కాలింగ్ బెల్ మ్రోగింది. తలుపు తీసిన వర్ధనిని చూస్తూ… “బాగున్నావా వర్ధినీ?” అనడిగాడు అతను. జవాబు చెప్పాలనిపించక తల ఊపింది… అతను సోఫాలో కూర్చుంటూ “బాబు […]

Continue Reading
Posted On :

పోరాటం (కథ)

పోరాటం (కథ) -డా. లక్ష్మి రాఘవ గేటు శబ్దం అయింది. వాచ్ మాన్ గేటు తెరుస్తున్నట్టుగా వినిపించి పరిగెత్తుకుంటూ కిటికీ దగ్గరికి వచ్చింది సునీత. అమ్మతో బాటు మూడేళ్ళ చైత్ర కూడా వెళ్ళింది. కారు పార్క్ చేసి అవుట్ హౌస్ లోకి వెడుతూ ఒక నిముషం కిటికీ ని చూస్తూ నిలబడ్డాడు ప్రకాష్. చైత్ర చెయ్యి ఊపుతూ “డాడీ” అనటం అద్దాల కిటికీలోంచి లీలగా వినిపించింది. సునీత చెయ్యి పైకి ఎత్తింది “హలో” అంటూఉన్నట్టు. డా ప్ర […]

Continue Reading
Posted On :