image_print

ఓ కథ విందాం! “సేద్యం ధీర భోజ్యం”

https://youtu.be/KEJ4WkRFMec ఓ కథ విందాం! సేద్యం ధీర భోజ్యం రచన & పఠనం – లలిత గోటేటి మెరుస్తున్న కళ్ళు నావైపే చూస్తున్నాయి. నిజానికి క్లాసులో ఉన్న యాభైమంది విద్యార్ధులు నేను చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటున్నారు . కానీ అందరిలోకీ ప్రత్యేకంగా ఆ రెండు కళ్ళలో ఏదో మెరుపు ,గొప్ప జిజ్ఞాస, జీవనోత్సాహం నాకు తెలుస్తోంది. మరుక్షణమే నా మనసు పాఠం చెప్పే ఏకాగ్రతలోకి జారిపోయింది. విలియం వర్డ్స్ వర్త్ అద్భుత రచన ‘డేఫ్ఫోడిల్స్’ పద్యంలోని […]

Continue Reading

దీక్ష (తృతీయ ప్రత్యేక సంచిక కథ)

దీక్ష (తృతీయ ప్రత్యేక సంచిక కథ) -లలిత గోటేటి             సమయం  సాయంత్రం నాలుగు గంటలు అయింది. అనుకున్నట్టుగానే డ్రైవర్ రాజు వచ్చేశాడు. నేను విజయనగరం వచ్చి  ఇరవైనాలుగు  గంటలు గడిచింది.నిన్న రాత్రి  జరిగిన నా కజిన్ కూతురు పెళ్లి కి వచ్చాను. నిజానికి పెళ్లి కంటే శాంతిని చూడాలన్నదే నా కోరిక. విజయనగరంలో పెళ్లి అనగానే నా మనసు ఎగిరి గంతేసింది. జీవితం ఎంత పొడుగ్గా సాగి నా, […]

Continue Reading

ఎరుక (కథ)

ఎరుక -లలిత గోటేటి మార్గశిరమాసం  సాయంత్రం  ఐదు గంటలకే చలి నెమ్మదిగా కమ్ముకుంటోంది. శ్రీధర్  కారు ఊరు దాటింది. రోడ్డుకు ఇరు పక్కలా  విస్తరించుకున్న చింత చెట్లు ఆకాశాన్ని కప్పుతున్నాయి. కనుచూపు మేర  పచ్చగా అలుముకున్న వరిచేలు, పొలాల్లో పని చేసుకుంటున్న మనుషులు అక్కడక్కడ కనబడుతున్నారు. తాను ఎక్కడికి వెళుతోంది  తనకే తెలియదు అనుకున్నాడు శ్రీధర్. కారును ఓ పక్కగా ఆపి,డోర్ లాక్ చేసి,చుట్టూ పరికిస్తూ నిలబడ్డాడు. చేను గట్టునున్న కాలిబాట మీద నడుస్తూ ముందుకు వెళ్ళాడు. […]

Continue Reading

జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)

 జీవితానురక్తి (కె.వరలక్ష్మి ఆత్మకథ “తొలిజాడలు” పుస్తక సమీక్ష)   -లలిత గోటేటి హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వారు ప్రచురించిన కె. వరలక్ష్మి గారి ఆత్మ కధ ‘’తొలిజాడలు’’ చదవడానికి నాకు వారం రోజులు పట్టింది.  ఇంత మంచి కధారచయితగా ఆమెను ఎదిగించిన  ఆ నేపధ్యం ఆమె బాల్యం ఎటువంటివి అన్న కుతూహలంతో నేను ఈ పుస్తకాన్ని చదివాను. ‘’జగ్గంపేట’’ గోదావరి  జిల్లాలోని ఓ పల్లెటూరు. ఇది రచయిత పుట్టి పెరిగిన, చాలా సంవత్సరాలు  ఇక్కడే గడిపిన ప్రాంతం. […]

Continue Reading

గమనం (కథ)

గమనం -లలిత గోటేటి “ఈ రోజు పనమ్మాయి రాలేదా? భర్త అడిగిన ప్రశ్నలో పనమ్మాయి గురించిన ఆరా కంటే “నువ్వింకా తెమలలేదా” అన్న భావమే ధ్వనించింది ఉమకు “టైమ్ ఎనిమిదిన్నర అయ్యింది” అన్నాడు అసహనంగా సుధాకర్. ఈ చలి వాతావరణానికి రాత్రంతా దగ్గుతూండటం చూస్తూనే వున్నాడు. తానొక యంత్రంలా తిరుగుతూండాలి కాబోలు. ఒక్కరోజు కూడా ఈ యంత్రం ఆగకూడదు మరి. ఇద్దరు చిన్న పిల్లల్ని లేపి, స్కూల్కు సిద్ధం చేసి, పాలు, టిఫిన్ పెట్టి వాళ్ళకు లంచ్ […]

Continue Reading

ఆలాపన (కథ)

ఆలాపన        -గోటేటి లలితా శేఖర్ సంధ్య ముఖంలో  అందం, ఆనందం ఒకదానితో ఒకటి   పోటీపడుతున్నాయి . “ సూర్య మెసేజ్ పెట్టారా?……….నిజంగానేనా……?”   ఉద్వేగంగా అడిగాను. సంధ్య నవ్వుతూ   అవునన్నట్టు తలూపింది. “ జ్యోతీ …….” వీలుచూసుకుని వస్తావా? నిన్ను  చూడాలని ఉంది. “ అంటూ  సంధ్య పెట్టిన  మెసేజ్  చూసుకుని  రెండు రోజులు  ఆఫీసుకి లీవ్ పెట్టి   రాజుతో చెప్పి బయలుదేరాను..  హైదరాబాద్ నుంచి విజయవాడకు  ప్రయాణం చేసిన  సమయమంతా సంధ్య […]

Continue Reading