image_print

జీవితం అంచున – 24 (యదార్థ గాథ)

జీవితం అంచున -24 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి టూరిస్ట్లకు అనుమతి లేదని కేవలం ఆస్ట్రేలియా పౌరుల కోసమే రిపాట్రియేషన్ ఫ్లైట్స్… అమ్మకు వీసా వచ్చిన నాటి వార్త. ఆస్ట్రేలియా పౌరుల వెంట తల్లి, తండ్రి, స్పౌస్ రావచ్చని మూడు రోజుల్లో మార్పు చెందిన వార్త. ప్రయాణీకులు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని వుండాలన్న నిబంధన. వెంటనే అమ్మకు రెండో డోసు ఇప్పించేసాను. అయితే రిపాట్రియేషన్ ఫ్లైట్స్ లో మాదాకా అవకాశం […]

Continue Reading

జీవితం అంచున – 23 (యదార్థ గాథ)

జీవితం అంచున -23 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి భక్తి అనే పదానికి నాకు నిజమైన అర్ధం తెలియదు… ప్రపంచాన్ని నడిపించే ఒక సూపర్ నేచురల్ పవర్ కి దేవుడని పేరు పెట్టుకోవటం తప్ప. ఆ దేవుడిని కష్టనష్టాల్లో ప్రార్ధించుకోవటం తప్ప. ఆ రోజు GYDడయాగ్నొస్టిక్స్, పద్మారావునగర్లో అమ్మ వీసా మెడికల్స్ అప్పాయిం ట్మెంట్ దొరికింది. అంత క్రితం జరిగిన సైకియాట్రిస్ట్, న్యూరాలొజిస్ట్, కార్డియాలొజిస్ట్ ల ప్రత్యేక కన్సల్టేషన్ల విషయం బయల్పడకుండా, అమ్మకి […]

Continue Reading

వాన తడపని నేల (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వాన తడపని నేల (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -ఝాన్సీ కొప్పిశెట్టి మేడమీద ఆరుబయట నీలాకాశపు పందిట్లోతెలిమంచు పరదాల సందిట్లో మిణుకు మిణుకు మంటూ మెరిసే తారల ముంగిట్లో చంద్రుని వెన్నెల కౌగిట్లో పాతకాలపు నవారు మంచం పైన వెల్లకిలా పడుకుని సిరిచందన రవితో పరవశంగా మాటాడుతోంది. పేరుకి తగినట్లే సిరి, చందనాల మేళవింపు ఆ మోము. మొబైల్లో రవి సెక్సీ గళానికి, అతని రొమాంటిక్ భావాలకు, అతడి వేడి ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు […]

Continue Reading

జీవితం అంచున – 22 (యదార్థ గాథ)

జీవితం అంచున -22 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి పీక్స్ ఆఫ్ స్ట్రెస్ ఎలా వుంటుందో నాకు అనుభవంలోకి తెచ్చింది అమ్మ. అమ్మ ఆరోగ్య పరీక్షలు, స్పెషలిస్ట్ అప్పాయింట్మెంట్లు, స్కాన్లు, అమ్మ పాస్పోర్ట్ రెన్యువల్, ఆ పైన వీసాకి అప్లై చేయటం…అన్నీ ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాలే. అమ్మ వీసా మెడికల్స్ గురించైతే చెప్పలేని ఆందోళన. ఏ మాత్రం తేడాగా వున్నా వీసా రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, అమ్మను కనిపెట్టుకుని వుండటం, […]

Continue Reading

జీవితం అంచున – 21 (యదార్థ గాథ)

జీవితం అంచున -20 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఎంతో ఉద్విగ్నంగా ఇల్లు చేరుకున్నాను. నా కలల్లో కనిపించే అమ్మకూ, నా కళ్ళ ముందున్న అమ్మకూ పోలికే లేదు. గంభీరమైన అమ్మ విగ్రహం శుష్కించి పోయి వుంది. ఈ రెండేళ్ళ కాలంలో ఆమెను వృద్దాప్యం, ఒంటరితనం కృంగతీసాయో లేక ఆమె మానసిక అస్వస్థత కారణంగా చిక్కి పోయిందో కాని చాలా బలహీనంగా వుంది. అమ్మ చిన్నబోయిన మొహంతో, చప్పిడి దవడలతో, ప్రాణం కళ్ళల్లో […]

Continue Reading

జీవితం అంచున – 20 (యదార్థ గాథ)

జీవితం అంచున -20 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ అలిగింది. కరోనా సోకితే అల్లకల్లోలమెంతోగాని అమ్మ అలిగితే నా మనసంతా అతలాకుతలం అయిపోతోంది. అసలు నాకేమీ నచ్చటం లేదు. నా భావాన్ని మీకు చెప్పటానికి నా భాషాపటిమ చాలటం లేదు. ఎప్పుడూ శాశించే అమ్మ, నేను ప్రశ్నించానని అలిగింది. ఫోనులో ఎంత పిలిచినా పలకదు. ఒంటరిగా వుంటే మోగే ఫోను వంక అభావపు చూపు చూస్తుంది. పక్కన మరెవరయినా వుంటే వాళ్ళను […]

Continue Reading

జీవితం అంచున -19 (యదార్థ గాథ)

జీవితం అంచున -19 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ పాలవాడు పాలు వేయటం మానేయటానికి కారణాలు ఆలోచిస్తోంది. ఇప్పుడు అమ్మ దృష్టిలో నాతో సహా అందరూ అనుమానాస్పదులే…అందరూ శతృవులే. అమ్మకు చురకత్తుల్లాంటి కెమెరాల నిఘాలో తను శత్రు కూటమిలో చిక్కుకు పోయిన భావన. పాలవాడు రాకపోవటానికి కారణం ఇంట్లో పెట్టిన కెమెరాలని అమ్మకి అనుమానం రాజుకుంది. పాలవాడు రావటం మానేసాడని పాలు కాశి తెస్తున్నాడని నాకు ఫిర్యాదు చేసింది. “పాలవాడికి కరోనా […]

Continue Reading

జీవితం అంచున -18 (యదార్థ గాథ)

జీవితం అంచున -18 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఇప్పుడు మహా శూన్యానికి మారు రూపంలా వుంది అమ్మ. అప్పటికి మూడు రోజులయ్యింది పాలవాడు కనిపించక. ఉదయాన్నే పొగమంచులో దిగంతాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ వెన్నెల గానాన్ని ఆలాపిస్తూ అతని స్మరణలో బాల్కనీలో కూర్చునే అమ్మ అస్తమించే శశిని, ఉదయించే రవిని ఒకేసారి చూడటం జరుగుతోంది. కాని నులి వెచ్చని ఊహలతో తన మనసులో వెన్నెల కురిపించే వాడి జాడే లేదు. అయినా ప్రేమ […]

Continue Reading

జీవితం అంచున -17 (యదార్థ గాథ)

జీవితం అంచున -17 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ పడక్కుర్చీలో కూర్చుని ఏదో పలవరిస్తోంది. అంతలోనే అమ్మ బోసినోటితో బుంగ మూతి పెట్టింది. కెమెరాలలో చూడగలనే కాని వినలేని నేను జూమ్ చేసి శ్రద్దగా చూడనారంభిం చాను. ఎందుకో అమ్మ పరవశంగా చేతులు ముందుకు చాచింది. జగన్మోహన ఆనందం కెంపులై ఆమె చప్పిడి బుగ్గల్లో ఎర్ర మందారమై తణుకులీను తోంది. అమ్మ ఏదో రహస్యం చెబుతున్నట్టుగా ముందుకు వంగి గుసగుసగా కలవరించింది. […]

Continue Reading

జీవితం అంచున -16 (యదార్థ గాథ)

జీవితం అంచున -16 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అన్ని కార్యకలాపాలు వదిలేసి అమెరికా టైముని ఇండియా టైములోకి తర్జుమా చేసుకుంటూ తెల్లవార్లూ మొబైల్లో కెమెరాలు చూస్తూ కూర్చున్నాను. అమ్మ పసిపిల్లలా ముడుచుకుని ఆద మరిచి పడుకుంది. నేను రాత్రంతా నిద్రపోతున్న అమ్మను ఆర్తిగా చూస్తూనే కూర్చున్నాను. పసితనంలో నా ఒంటి మీద వెంట్రుకలు రాలిపోవటానికి, ఒళ్ళు నున్నగా చేయటా నికి  బలంగా నలుగు పెట్టి రుద్దిన ఆ చేతులు నిద్దట్లో కూడా […]

Continue Reading

జీవితం అంచున -15 (యదార్థ గాథ)

జీవితం అంచున -15 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ప్రతీ కథకు ఓ ప్రారంభం వుంటుంది… ఆ ఆరంభం గతంలోనో.. గత జన్మలోనో… ఈ కథకు ఇది ప్రారంభం కాదు. కేవలం ఓ అస్థిమిత రోజుకి మాత్రమే ఇది సాక్ష్యం. అస్థిమత్వం ఏమీ శాశ్వతం కాదు… చుట్టం చూపుగా అపుడప్పుడూ వచ్చి పలకరించ వచ్చు. ఆ పలకరింపునే మా నర్సింగ్లో మానసిక అస్వస్థత అంటారు. అది డెమెన్షియా కావచ్చు లేదా రిట్రోగ్రేడ్ అమ్నీసియా […]

Continue Reading

జీవితం అంచున -14 (యదార్థ గాథ)

జీవితం అంచున -14 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అసలు గమ్యానికి ముందు మరో మజిలి. అయినా అసలు గమ్యం అనుకుంటామే కాని, ఈ జీవి చేరాల్సిన తుది మజిలీకి ముందు తాత్కాలిక మజిలీలే ఇవన్నీ. భూగోళం రెండో వైపెళ్ళినా మానసగోళంలో మార్పేమీ రాలేదు. కుటుంబం మారినా అమ్మ పాత్రలో వైవిధ్యమేమీ లేదు. ‘నా’ అన్న వైయక్తికమెపుడూ భవబంధాల ముందు దిగదుడుపే కదా. చిగురించి పుష్పించే కొమ్మలువృక్షానికెపుడూ వసంతమే. ప్రదేశం మారిందే తప్ప […]

Continue Reading

జీవితం అంచున -13 (యదార్థ గాథ)

జీవితం అంచున -13 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి పెద్దమ్మాయి దిగులు మొహంతో ఇంటికి వచ్చింది. నేను నా వరకే ఆలోచిస్తున్నాను కానీ, నేను లేకుండా ఏడాది పాప, ఇద్దరు స్కూలుకి వెళ్ళే పిల్లలతో రెండు స్వంత క్లినిక్స్ నడుపుతున్న అమ్మాయికెంత ఇబ్బంది. పైగా నేను ఒక నిర్ణీత సమయానికి తిరిగి వస్తానన్న ఆశ లేదు. వెళ్ళటం ఎంత కష్టమో ఈ పరిస్థితుల్లో తిరిగి ఈ నేల మీద అడుగు మోపటం కూడా […]

Continue Reading

జీవితం అంచున -12 (యదార్థ గాథ)

జీవితం అంచున -12 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి నేను చేసే కోర్సు అమ్మకు ఉపయోగపడుతుందని ఆశ పడ్డానే తప్ప అమ్మ అవసరానికి నేను పక్కన లేకపోవటం నన్ను క్షణం నిలవ నీయలేదు. పిల్లి పిల్లలను చంకన వేసుకుని తిరిగినట్టు నేనెప్పుడూ అమ్మ వయసును కూడా ఖాతరు చేయకుండా అమ్మను వెంటేసుకుని దేశదేశాలు తిరుగుతుండే దానిని. ఈ సారే ఎందుకో అమ్మ ఇండియా నుండి నాతో బయిలుదేరకుండా నా వెనుక ఓ నెలలో […]

Continue Reading

జీవితం అంచున -11 (యదార్థ గాథ)

జీవితం అంచున -11 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి శిశిరం వసంతం కోసం కాచుకున్నట్లు ఆరేసి రోజుల ఎదురు చూపుల తరువాత బుధవారం వచ్చేది. ఆరు రోజుల రొటీను నుండి ఇష్టమైన ఆహ్లాదకరమైన మార్పు. ఆ ఇష్టమే రోటీనయితే మళ్ళీ అంత ఉత్సాహం వుండదేమో… బుధవారం ఇంటి పని, వంట పనికి సెలవు. ఆస్ట్రేలియాలో గ్రాసరీ షాపింగ్ చేయటం లేదా పిల్లలను దింపటం వరకేనా నా ఔటింగులు అని ఇంత వరకూ పడిన […]

Continue Reading

జీవితం అంచున -10 (యదార్థ గాథ)

జీవితం అంచున -10 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఉరకలేసే ఉత్సాహంతో రెండో వారం కాలేజీకి తయారయ్యాను. నేను బయిల్దేరే సమయానికి అప్పుడే రాత్రి షిఫ్ట్ ముగించుకుని వచ్చిన అల్లుడు కారు బయటకు తీసాడు. “పోయిన వారం అమ్మాయి దింపినప్పుడు నేను దారి జాగ్రత్తగా గమనించాను. గూగుల్ మ్యాప్ సాయంతో నేను వెళ్ళగలను..” అన్నాను అల్లుడితో లోలోపల ఒంటరిగా వెళ్ళటానికి కొంత భయంగా వున్నప్పటికీ. “లేదు మమ్మీజీ.. యూనివర్సిటీ రోడ్డు చాలా ప్రమాదకరమైన […]

Continue Reading

జీవితం అంచున -9 (యదార్థ గాథ)

జీవితం అంచున -9 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి రాణి వెడలె రవితేజములలరగ… ఆనందోత్సాహములు మోమున వెల్లి విరియగ… ఓహ్… మీకు తెలియదు కదూ అమ్మ పెట్టిన నా అసలు పేరు ఝాన్సీ రాణి. అయ్యగారిని కట్టుకున్నాక ఇంటి పేరు మార్చుకోవటమే కాకుండా నా పేరులో సగాన్ని తొలిగించేసి వారికి స్థానం కల్పించి ఝాన్సీ శ్రీనివాస్ గా మారాను. ఐడీ కార్డు స్కాన్ చేస్తేగాని కాలేజీ ముఖద్వారం తెరుచుకోదు. ఇండియాలో పాడుబడిన ప్రభుత్వాఫీసులో […]

Continue Reading

వాడని నీడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ)

వాడని నీడలు  (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కథ) -ఝాన్సీ కొప్పిశెట్టి మొబైల్ నిర్విరామంగా మోగుతోంది. ఆ మోతలో ప్రశాంతత లేదు. అందులో ఆరాటం, దూకుడు నా సిక్స్త్ సెన్స్ కి సుస్పష్టంగా వినిపిస్తోంది. అయినా నేనుప్రశాంతంగానే “హలో” అన్నాను. “ఏమిటి, నువ్వు ఆల్ ఇండియా రేడియోలో కథ వినిపించనన్నావుట…” ఆవేశంలో మూర్తిగారి గొంతు అదురుతోంది. ఎటువంటి పలకరింపు లేకుండా వేడిగా, దురుసుగా అడిగారు. నాకు ఉన్న మగ స్నేహితులు ఒక చేతి వేళ్ళ లెక్కింపుకి […]

Continue Reading

జీవితం అంచున -8 (యదార్థ గాథ)

జీవితం అంచున -8 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి భయభక్తులతో బాల్యం, కఠిన నిబంధనల్లో కౌమార్యం, ప్రేమకు అర్ధం తెలియని అయోమయంలో యవ్వనం గడిచిపోయాయి. యవ్వనపు మావి చిగుర్లు చిగురించీ చిగురించకనే దాంపత్యంలో బంధింపబడ్డాను. ప్రేమ ఊసులు, ప్రియ సరాగాలు తెలియ కుండానే తల్లినై పోయాను. నవరసాల్లో జీవితంలో మానసికోల్లాసానికి ఎరువులైన రసాల కరువులోనే రెండొంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు అమ్మమ్మను కూడా అయ్యాక ఆరు పదుల నేను టేఫ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ […]

Continue Reading

ముందడుగు

ముందడుగు – ఝాన్సీ కొప్పిశెట్టి “శారద.. విడో ఆఫ్ శ్రీనివాస్” అలసటగా ఆఫీసు నుండి తిరిగి వస్తూ గేటుకి తగిలించి వున్న పోస్ట్ బాక్సులో నుండి తీసిన కవరు పైన పేరు చదివిన శారద మనసు ఒక్క క్షణం స్తబ్దు అయిపోయింది. మొట్ట మొదటిసారిగా తన పేరుతో జత చేయబడ్డ ‘విడో’ అనే కొత్త విశేషణం వంక విచిత్రంగా చూసింది. శారద విడో ఆఫ్ శ్రీనివాస్ అయి ఇరవై రోజులే అయ్యింది. వైఫ్ ఆఫ్ శ్రీనివాస్ గా […]

Continue Reading

జీవితం అంచున -7 (యదార్థ గాథ)

జీవితం అంచున -7 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి మనిషికి ఆనందంలో కలిగే ఉత్సాహానికి, దిగులు వలన కలిగే నిస్సత్తువకి ఎంత వ్యత్యాసం..? ఒక్కసారిగా అన్నింటి పైన ఆసక్తి తగ్గి నన్ను నైరాశ్యం ఆవహించేసింది. అర్ధ శతాధిక వసంతాల జీవితచక్రం కళ్ళ ముందు గిర్రున తిరిగింది. రక్తపాశాలు, పేగు బంధాలు, స్నేహ సాంగత్యాలు, అనేకానేక పరిచయాలు, కీర్తి శేషమైన ప్రియ బంధాలు… ఒక్కొక్కటిగా రీలు మారుతూ కనుమరుగవుతున్నాయి. జీవితం ఇంతేనా అనే వైరాగ్య […]

Continue Reading

I wanna walk… (Poem)

I wanna walk… -Jhansi Koppisetty I was flying like an angel.. But a great fall broke my ankle..! Till then I was fulfilling everyone's wishes.. Had to wake up to my senses with all the stitches..! Ankle broke three ways.. Added bonus dislocation sideways..! Plates and screws were all used.. Doctors pinned and stapled bones […]

Continue Reading

జీవితం అంచున -6 (యదార్థ గాథ)

జీవితం అంచున -6 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అనారోగ్యంలో మనిషిని వైరాగ్య భావన అమాంతం ఆవహించేస్తుంది. అప్పటి వరకూ వున్న ఉత్సాహాన్ని చప్పగా చల్లార్చేస్తుంది. మనిషిలో అనారోగ్యం కన్నా అనారోగ్యంగా వున్నామన్న ఆలోచన పెనుభూతంలా కబళించేసి మానసికంగా కృంగదీసేస్తుంది. క్వాన్టిఫెరాన్ TB పరీక్ష ఫలితాలు కాళ్ళ కింద భూమిని కదిలించేసాయి. లో లెవెల్ పాజిటివ్. ఎమర్జెన్సీ అటెన్షన్ అంటూ GP నుండి పిలుపు వచ్చింది. ఒక్కసారిగా నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. […]

Continue Reading

జీవితం అంచున -5 (యదార్థ గాథ)

జీవితం అంచున -5 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Care for one… that’s love. Care for all… that’s nursing. కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది. మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను. ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా… నా కంటి […]

Continue Reading

జీవితం అంచున -4 (యదార్థ గాథ)

జీవితం అంచున -4 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Every great dream begins with a dreamer.. ఎప్పుడో ఎక్కడో చదివిన కోట్. అవును. చిరకాల కల. నిశిరాతిరి నిద్దట్లో కల… వేకువజాము కల… పట్టపగటి కల… వేళ ఏదయినా కల ఒకటే. మనది కాని విదేశీయుల విశ్వవిద్యాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు మోపుతానా అని మనసు ఒకటే ఉవ్విళ్లూరుతోంది. నర్సింగ్ విద్యార్థి ఊహే నా వయసును అమాంతం రెండింతలు తగ్గించేసింది. మనలో […]

Continue Reading

జీవితం అంచున -3 (యదార్థ గాథ)

జీవితం అంచున -3 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Future is always a mystery… మనిషి టెక్నాలజీ పరంగా ఎంత పురోగతి సాధించినా రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోలేడు కదా. రాత్రి కమ్మిన దిగులు మేఘాలకు ఎప్పుడో అపరాత్రికి పడుకున్నానేమో చాలా ఆలస్యంగా లేచాను. ఆ రోజు శనివారం సెలవు కావటం వలన అందరూ ఇంట్లోనే వున్నారు. అల్లుడు స్టడీ రూములో కూర్చుని కంప్యూటర్ నుండి ఏవో ప్రింట్ ఔట్స్ తీస్తున్నాడు. […]

Continue Reading

జీవితం అంచున -2 (యదార్థ గాథ)

జీవితం అంచున -2 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి తరువాతి మూడు రోజులు మూడు యుగాల్లా గడిచాయి. ఒకటే రెస్ట్లెస్ నెస్… రెస్ట్లెస్ నెస్ అంటే ఏమిటంటారా… నాకు అప్పుడప్పుడూ కలిగే కుదురుంచని ఒక అస్థిమిత భావన. అది కలిగినప్పుడు విసుగ్గా వుంటుంది… ఏ పని పైనా ధ్యాస వుండదు. మాట్లాడుతున్నా ఆ మాటలు నావి కావు. టీవీలో సినిమా చూస్తున్నా నా కళ్ళు దానిని గ్రహించవు. చదువుతున్నా తలకెక్కదు. తింటున్నా నాలుకకు […]

Continue Reading

జీవితం అంచున -1 (యదార్థ గాథ)

జీవితం అంచున -1 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి   PROLOGUE  Life is taking up challenges  Life is achieving goals Life is being inspiration to others And age should not be a barrier for anything….           అనగనగా అప్పట్లో పంథొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఓ అమ్మాయి తెల్లని కోటు, చల్లని నవ్వుతో రోగుల గాయాలు […]

Continue Reading

ఫెమినిజం

ఫెమినిజం – ఝాన్సీ కొప్పిశెట్టి అది రోజూ బయిల్దేరే సమయమే… శాంతమ్మ టిఫిన్ బాక్సు సర్దుతోంది. వైదేహికేదో తప్పు చేస్తున్న భావన…బస్సు మిస్ అవుతావంటూ, ఆఫీసుకి లేటవుతావంటూ శాంతమ్మ తొందర చేస్తోంది. వైదేహిని తను చేయబోతున్న దొంగ పని కలవర పెడుతూ చకచకా తెమలనీయటం లేదు. అక్కడికి వెళ్ళాలన్న తపనే తప్ప ఆమెకు అందమైన చీర కట్టుకుని ప్రత్యేకంగా తయారవ్వాలన్న ధ్యాస కూడా లేదు. ఓవర్ ప్రొటెక్టివ్ తల్లి వంక అక్కసుగా చూసింది. కరుణామయిగా పేరుగాంచిన తన తల్లికి ఎందుకంత […]

Continue Reading

అందీ అందని ఆకాశం (కవిత)

అందీ అందని ఆకాశం (కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి ఓ కవి ‘మధుశాల’ లోతుల్లో మునిగి వున్నాన్నేను అదేమిటో… మనసు పొరల్లో దాచుకున్న ఇష్టమైన అనుభవాలన్నీ అనుభవంలోకి వచ్చాయి..! జ్ఞాపకాల పొరల్లోని కౌగిలింతల స్పర్శలు చిక్కటి స్నేహాలు జో కొట్టిన హస్తాలు… ఎందుకో మరోసారి పితృస్వామ్యం పైన అక్కసు ఎగిసిపడింది..! పురుషుడు ఆడమాంసపు ఆఘ్రాణింపుపై రాసినా వేశ్యల భోగలాలసపై మనసు పడినా ప్రియురాళ్ళ ఓణీల్లోని అందాల్లో ఓలలాడినా అన్నీ స్వానుభవాలేనని ఒత్తి పలికినా ఆక్షేపణ లేదు ఈ పితృస్వామ్య […]

Continue Reading

నువ్వేంటి…నా లోకి…(కవిత)

నువ్వేంటి…నా లోకి…(కవిత) -ఝాన్సీ కొప్పిశెట్టి నువ్వేంటి ఇలా లోలోకి.. నాకే తెలియని నాలోకి… నేనేమిటో నా పుట్టుక పరమార్ధమేమిటో ఏ పుట్టగతులనాశించి పుట్టానో అసలెందుకు పుట్టానోనన్న అన్వేషణలో నేను… గాలివాటుతో ఊగిసలాడే నా చంచల చిత్తం సత్యాసత్యాల చిక్కుముడిలో చిక్కడిన నా అంతరంగం వాటిపై జరిగే అనేకానేక దురాక్రమణలు నా ఉనికితనపుటంచుల్లో భయాందోళనలు నా తెలిసీ తెలియనితనపు తప్పటడుగులు… నా మకిలంటిన మనసుకి విహ్వలించిన నేను నన్నథిక్షేపించే నాపై నేనే ప్రకటించుకునే యుద్దాలు నాలో నేనే సాగించే […]

Continue Reading