image_print

వేకువలో చీకటిలో (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)

https://youtu.be/PNp_UUjR7J0 వేకువలో చీకటిలో -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం ” నీకు బొత్తిగా బాధ్యత తెలియడం లేదు. ఎన్ని సార్లు చెప్పాను అంతంత అన్నం పారేయవద్దు అని” పొద్దున్నే భార్య మీద విరుచుకు పడ్డాడు సత్యం. పనిమనిషికి వేసిన గిన్నెలలొ ఒక గిన్నె నిండా అన్నం కనబడడం తో ఒళ్ళు మండి పోయింది అతనికి.. “రాత్రి మీరు మామూలుగా భోజనం చేస్తారు అనుకుని వంట చేసాను. తీరా చూస్తే మీరు కడుపులో బాగాలేదు అన్నం వద్దు అని మజ్జిగ తాగి […]

Continue Reading

“వెనుతిరగని వెన్నెల” డా.కె.గీత నవలపై సమీక్ష

“వెనుతిరగని వెన్నెల” డా.కె.గీత నవలపై సమీక్ష   -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం నెచ్చెలి పత్రిక వ్యవస్థాపక సంపాదకురాలిగా డా. గీత సాహిత్యాభిమానుల మనసులలో తన స్థానం సుస్థిరం చేసుకున్న కవయిత్రి, రచయిత్రి. గీత ఎంతో ప్రేమగా తెచ్చి ఇచ్చిన నాలుగు వందల అరవై పేజీల తన మొదటి నవల “వెనుతిరగని వెన్నెల “ రెండు చేతులతో జాగ్రత్తగా అందుకున్నాను. నన్ను తన ఆత్మీయురాలిగా భావించి ఇచ్చిన బహుమానం అది. నాకు గౌరవంగా భావించాను. నవల పేరు ఎంత ఆసక్తికరంగా […]

Continue Reading

తల్లివేరు (కవిత)

తల్లివేరు -డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి .పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి  .సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు .సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే!  కడుపులో లేనిది కావలించు కుంటే రాదని ,నలుపు నలుపే గానీ తెలుపు కాదని ,పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని ,తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది.  అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట .నేనెవరినని మూలాల కోసం తనక లాట .జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు ,భామా కలాపాలు,బతుకమ్మ పాటలు  అస్థిత్వ ఆరాటాలు .  రెండు పడవల రెండో తరానికి  ఆవకాయ అన్నప్రాసనం ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు  అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు. ***** తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం -పేరు: కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం ) చదువు: ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు. వుద్యోగం: ఇంగ్లిష్ ప్రొఫ్.గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల,కర్నూల్ నుండి పదవీవిరమణ రచనలు: కథలు:- 1963 నుండి ఇప్పటిదాకా 200 పైగా కథలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ పత్రికలలో నవలలు 4 ( ఆంధ్రప్రభ, స్వాతి మాస పత్రికలలో) కథాసంకలనాలు:- 1.ఆశలమెట్లు 2.కలవరమాయె మదిలో,3.వెన్నెలదీపాలు,4.మంగమ్మగారి […]

Continue Reading

Kishan’s Mom (2nd Annual Issue Competetion Story)

Kishan’s Mom (2nd Annual Issue Competetion Story) -Meera subrahmanyam Even before our car came to a halt in front of Quail Run elementary school , Aravind took off the seat belt and was ready to jump out .” No need to walk me me up to the gate mama! I can go” he said in […]

Continue Reading

జీవితం ఒకవరం (తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం కథ)

జీవితం ఒకవరం -తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం మెడ లోని నగలు సవరించు కుంటూ, కొంగుకు ఉన్న జరీ పూవులు బాగా కనబడే లాగా పమిట చెంగును ముందుకు తెచ్చి నడుము దగ్గర దోపుకుంటూ హడావిడిగా కళ్యాణ వేదిక వైపు కదులు తున్న ముత్తైదువులను చూస్తూ చిన్నగా నిట్టూర్చింది నీరజ. ఒంటి మీద ఉన్న పట్టు చీర, మెడలోని హారం బరువుగా తోస్తున్నాయి. సాదాగా వుండే చీర కట్టు కుంటూ వుంటే , కూతురు శశి వచ్చి ” పెళ్ళికి […]

Continue Reading

స్నేహహస్తం (కవిత)

 స్నేహహస్తం -డా.తంగిరాల మీరా సుబ్రహ్మణ్యం ఎన్నుకున్నావో ? ఎదురొచ్చానో! శూన్యం నిండిన నా ఎదలోనికి సంపెంగల తావివై తరలివచ్చావు స్నేహ సుగంధమై పరిమళించావు. మమత కరువై బీటలు వారిన నా మనసుపై ప్రేమ జల్లువై కురిసావు ముద్ద ముద్దలో మమకారం రంగరించి మధువు తాపి మాలిమి చేసుకున్నావు ఆకాంక్షల కౌగిలివై కమ్ముకున్నావు వ్యామోహపు మత్తువై హత్తుకున్నావు నీ ఆలింగనంలో మైమరచిన నన్ను నిస్సంకోచంగా నెట్టివేసావెందుకు? నీవు నేను మమేకమనుకున్నా నా గుండె ఆలాపన వింటున్నావనుకున్నా నీ నీడ […]

Continue Reading

దుర్గ (కథ)

దుర్గ                                                       –డా.తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం అర్థరాత్రి దాటింది. అలసిన దేహాలను మత్తు నిద్ర ఆవహించే వేళ. నడిచి, నడిచి పుళ్ళు పడిన పాదాలు కదలలేమని మొరాయిస్తుంటే , ఆకలి పేగులను ఎండిపోయిన సద్ద రొట్టెతో బుజ్జగించి, రైలు పట్టాల వెంట […]

Continue Reading