వాన (కవిత)
వాన -సంధ్యారాణి ఎరబాటి ముసురుపట్టిన వాన కురుస్తుఉంటే గుండెల్లో ఎదో గుబులైతాది గరం గరంగా తిందామంటూ నోరేమో మొరబెడుతాది దోమనర్తకీలు వీధుల్లో భాగోతాలు మొదలెడతాయి మ్యాన్ హోలులు సొగసరిప్రియురాళ్లలా నవ్వుతూ నోరంతా తెరుస్తాయి గుంతలన్నీ నిండి నిండుచూలాలవుతాయి వీధులన్నీ గోదారిలా వయ్యారాలు పోతాయి.. రోడ్డులన్ని పుటుక్కున తెగిపోతాయి దారులన్నీ కర్ఫ్యూ పెడతాయి.. మురికి కాలువలన్నీ ఒక్కసారే ఉరికి ఉరికి పారుతాయి వీధి చివరి బజ్జీల బండి తీరిక లేకుండా వెలుగుతుంది మూలన ముదురుకున్న ముసలమ్మ మరికాస్త ముడుచుకుంటుంది […]
Continue Reading