image_print

“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల

“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల (బంగారు ఆచార్యులు గారి “ప్రశ్న” కవితా ఖండికపై పరామర్శ) -వి.విజయకుమార్ ఒక కవితా ఖండికకు వినూత్నంగా “ప్రశ్న” అనే శీర్షిక  కావడమే ఒక చైతన్యం. ప్రశ్నించడం అంటేనే చైతన్యం. బంగారు ఆచార్యులు గారు వామపక్షవాది. వామ పక్షీయుల దృక్కోణం ఎప్పుడూ సమాజ హితాన్ని కోరుతుంది. ఉద్యమ నేపథ్యంతో, ప్రజా సంబంధాలతో, క్షేత్రస్థాయిలో అనేక పోరాటాల్లో స్వయంగా పాల్గొని సోషలిస్టు మార్గంలో సమాజం నడవాలని ఆకాంక్షిస్తూ, నడుస్తున్న చరిత్రలోని అమానవీయ, అన్యాయపు […]

Continue Reading
Posted On :

విజయ కథ రంగనాయకమ్మ గారి పుస్తకం పై సమీక్ష

‘విజయ’ కథ! (ఒక నవలికా, ఒక పెద్ద వ్యాసమూ, 9 చిన్న వ్యాసాలూ, కలిపిన సంపుటం) -వి.విజయకుమార్ విజయ కథ పేరుతో ఇటీవల రంగనాయకమ్మ గారు ఒక పుస్తకాన్ని వెలువరించారు. విజయకధ 22 ఏళ్ళ వయసులో రాసిన కథ అయినప్పటికీ, అప్పటికి మార్క్సిజం గురించి విని ఉండనప్పటికీ, పెళ్లి చూపుల తంతును తిరస్కరిస్తూ, – పరస్పరం కలిసి మాట్లాడుకో వడం ద్వారా, – అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా – ‘పెళ్లి’ అనే కాంటాక్ట్ లోకి రావలసిన అవసరాన్ని […]

Continue Reading
Posted On :

నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం)

నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం) -వి.విజయకుమార్ నిన్నటి సుమాన్ని నేను మ్రోవితో కడపటి తుషారాన్ని గ్రోలి వేచివున్నాను పుష్పలావికలు నా మృత్యు గీతాన్నాలపించడానికి రానే వచ్చారు కడపటి హేమంత తుషారపు మృత్యు నీడ పరచుకుంది చల్లగా శరత్ చంద్రుడి వీక్షణం దోబూచులాడుతోంది మెల్ల మెల్లగా నిన్నటి సుమసౌరభాలింకా నాలో సజీవంగా రేపటి సుగంధాలకది అవస్యమై ఉండగా నా మరణ గీతిక పల్లవిని పాడుకుంటూ విచ్చేసిన విరికన్నియలు ఇంకా ఆగమించే మగువలకోసం స్వాగత […]

Continue Reading
Posted On :

“దోని గంగమ్మ” కథ పై పరామర్శ

దోని గంగమ్మ – హృదయంపై కొలువయ్యే గోదారమ్మ! (ప్రపంచ కథా వేదికపై ప్రధమ బహుమతి పొందిన రత్నాకర్ పెనుమాక రాసిన “దోని గంగమ్మ” కథపై చిరు పరామర్శ) -వి.విజయకుమార్ ప్రపంచ స్థాయిలో కథ అనగానే ముందుగా గుర్తొచ్చే కథ గాలివాన. పాలగుమ్మి పద్మరాజు గారి ఆ కథని అవార్డు సినిమాల్ని గ్రేట్ ఎక్సపెక్టేషన్స్ తో చూసి వెలితికి గురైనట్టే కథ చదివాక నాకు అప్పట్లో నిజం చెప్పొద్దూ కొంచెం వెలితిగా ఫీలయ్యాను. నిజానికి కథా ప్రపంచంతో నాకున్న […]

Continue Reading
Posted On :

ది బిచ్ (అమ్మ తల్లి)

ది బిచ్ (అమ్మ తల్లి) -వి.విజయకుమార్ నాకు ముందే తెలుసు నువ్వీ వీధిలో నెలలు నిండి భారంగా తిరుగుతున్నప్పడే యేదో ఒక రోజు గంపెడు బిడ్డలతో ప్రత్యక్షమౌతావనీ ముత్యాల్లాంటి పసిబిడ్డల్ని వేసుకుని దీనంగా చూస్తూ నా అశక్తతను ప్రశ్నిస్తావని! కడుపు నిండా పాలు తాగి వళ్ళో ఈ బుజ్జిగాడు గోముగా గీరుతూ వెచ్చని పరుపు మీద గుర్రుగా చూస్తూ ఈ దేశపు దొరబాబులా వెచ్చగా ఇక్కడ! నెల కూడా నిండని నీ పసికూనలు వర్షపు చినుకుల్లో ముద్దయి […]

Continue Reading
Posted On :

జెన్నీ మార్క్స్

జెన్నీ మార్క్స్ -వి.విజయకుమార్ “మానవాళికి అన్నింటికన్నా ఎక్కువ ప్రయోజనం చేకూర్చగల పనిని ఎంచుకున్న ట్లయితే, ఎటువంటి భారాలు మనల్ని కుంగదీయలేవు. ఎందుకంటే అవి అందరి ప్రయోజనం కోసం మనం చేసే త్యాగాలు; అప్పుడు మనం అనుభవించేది అల్పమైన, పరిమితమైన, స్వార్థపూరితమైన ఆనందం కాదు. మన ఆనందం లక్షలాది ప్రజలకు చెందుతుంది, మన పనులు నిశ్శబ్దంగానే అయినా శాశ్వతంగా జీవిస్తాయి. మన బూడిద పై ఉత్తమ మానవుల వేడి కన్నీళ్ళు వర్షిస్తాయి.” పదిహేడేళ్ళకే ఇలా కమిటైపోయిన, ఆస్తిపాస్తులు అంతగా […]

Continue Reading
Posted On :

ఉయ్యాల్లో టెర్రరిస్ట్

ఉయ్యాల్లో టెర్రరిస్ట్ -వి.విజయకుమార్ ష్…పారా హుషార్ వీడు మామూలోడు కాడు పనిపిల్ల బుగ్గ కొరికిన కీచకుడు పక్కింటి పిల్ల కొంగు లాగిన దుశ్శాసనుడు తాత మొహాన్నే ఫెడీల్ మని తన్నిన కర్కోటకుడు! సాధించుకోవడం ఎలానో ఎరిగిన కిమ్ వాడు లేస్తూనే జాకీ చానై కిక్ బాక్సింగ్ మొదలెడతాడు చిట్టి రాముడై శరాలు సంధిస్తూ యుద్ధానికి సిద్ధమంటాడు ఎడం కాలితో భూగోళాన్నీ కుడికాలితో చందురుడ్ని అలవోకగా తంతూ వళ్ళు విరుచుకుంటాడు మోనార్క్ నంటూ విర్ర వీగుతాడు బజ్జున్నప్పుడే వీడు […]

Continue Reading
Posted On :

తెల్లారని రాత్రి (రంగనాయకమ్మ నవలిక & వ్యాసాల సంపుటి సమీక్ష)

తెల్లారని రాత్రి -వి.విజయకుమార్ (ఒక నవలిక & 19 వ్యాసాల సంపుటి) సమీక్ష రంగనాయకమ్మ గారు ఇటీవల కాలంలో, వెంట వెంట జరిగిన ఆపరేషన్ల కారణంగా, అనివార్యంగా ఇంట్లోనే మంచానికి పరిమితమై వుంటూ, తమ రచనా వ్యాసంగాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తనకు సేవలు అందించడానికి వచ్చిన మీనాక్షి అనే నర్స్ తో ముచ్చటిస్తూ ఆమె జీవితంలోకి తొంగిచూసిన కథా నేపథ్యమే తెల్లారని రాత్రి. ఈ సంపుటిలో 120 పేజీలు, దాదాపు అర్థ భాగం, అడపాదడపా […]

Continue Reading
Posted On :

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం)

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం) -వి.విజయకుమార్ గర్భస్రావాలు నిన్ను మరవనివ్వవు చేతికందినట్లే అంది, చేజారిన బిడ్డల జ్ఞాపకాల తలపులు మరపురానివ్వవు, పిసరంతో, అసలెంతో లేని జుత్తుతో తడియారని మాంసపు ముద్దలవి, గాయకులో, శ్రామికులో ఎప్పటికీ శ్వాసించని వారు. నువ్వెప్పటికీ దండించలేని వాళ్ళు, అలక్ష్యం చెయ్యని వాళ్ళు మిఠాయిలిచ్చి ఊరుకోబెట్టనూ లేవు. చీకే వారి బొటనివేలి చుట్టూ ఎప్పటికీ ఒక పట్టీని కూడా చుట్టలేవు వొచ్చే దయ్యాల్ని తరిమేయనూ లేవు. […]

Continue Reading
Posted On :

నిరంతర యాత్రికుడు: ఒక అంతరంగ అన్వేషణ (కే వి వి ఎస్ మూర్తి నవలపై సమీక్ష)

నిరంతర యాత్రికుడు: ఒక అంతరంగ అన్వేషణ -వి.విజయకుమార్ (కే వి వి ఎస్ మూర్తి గారి నిరంతర యాత్రికుడు నవలపై చిరు పరామర్శ) ఏ మనిషి జీవితం అయినా ఒక నిరంతర ప్రయాణం. ఆటుపోటుల్లేని సముద్రాన్ని ఎలా ఊహించుకోలేమో సుఖ దుఃఖాలు లేని జీవితం కూడా ఊహకందని విషయం. సంతోషమూ, విషాదమూ రెండూ పడుగు పేకల్లా కలగలిసిన జీవితమనే కాన్వాస్ మీద వెలుగులే కాదు నీడలు సైతం తారట్లాడుతూ ఉంటాయి. ప్రతీ జీవితం వర్ణ వివర్ణాల సమ్మిళితం. […]

Continue Reading
Posted On :

ఇవీ మన మూలాలు (కల్లూరి భాస్కరం) పుస్తక సమీక్ష

ఇవీ మన మూలాలు – పుస్తక సమీక్ష -వి.విజయకుమార్ (కల్లూరి భాస్కరం గారు రాసిన “ఇవీ మన మూలాలు” గ్రంథం పై సమీక్ష) మానవ ప్రస్థానం గురించీ, మరీ ముఖ్యంగా “మన” మూలాల గురించీ తెలుగులో ఒక సాధికారిక గ్రంథంగా ఇటీవల విడుదలైన కల్లూరి భాస్కరం గారి “ఇవీ మన మూలాలు” ఎందుకు చదవాలో చెప్పేముందు వారి మాటలు వినండి. “మన విశ్వాసాలూ, ఇష్టా ఇష్టాలూ, రాజకీయ అవసరాలదీ కాకుండా, శాస్త్ర పరిశోధనల్లో జ్ఞానానిది పైచేయి అయినంతవరకూ; […]

Continue Reading
Posted On :

పడమటి దిక్కున వీచిన వింజామర ఈ సెలయేటి దివిటీ!

పడమటి దిక్కున వీచిన వింజామర ఈ సెలయేటి దివిటీ! -వి.విజయకుమార్ (కె. గీత గారి సెలయేటి దివిటీ పై చిరుపరామర్శ) కొండ వాలున నించుని ఆకాశం కేసి చూస్తూన్నప్పుడు నిరాధార జీవితం మీద ఒక వాన పూల తీగొచ్చి పడి పరిమళభరితం చేసినట్టు ఏ చిన్న అనుభవాన్నైనా రాగ రంజితం చేసి, ఒక్కో పద హృదయం పై పుప్పొడి పరిమళాలద్ది, వర్ణ శోభితాలైన సీతాకోకచిలుక లేవో అనుభూతుల మకరందాలను అందుకోకుండా పోతాయా అనుకుంటూ అన్వేషి స్తుంది కవయిత్రి […]

Continue Reading
Posted On :

వెలిబతుకుల నిషిద్ధాక్షరి అర్ధనారి ( బండి నారాయణస్వామి అర్థనారి నవలా సమీక్ష)

వెలిబతుకుల నిషిద్ధాక్షరి అర్ధనారి (బండి నారాయణస్వామి అర్థనారి నవలా సమీక్ష) -వి.విజయకుమార్ “…మగ శరీరాలలో దాక్కున్న ఆడతనాలు గోడలు పగలగొడుతున్నాయి. గీతలు చెరిపేస్తున్నాయి. ప్రవాహపు ఒడ్డుల్ని తెగ్గొడుతున్నాయి. వారు గలాటా చేస్తున్నట్టు లేదు. దేనినో అపహసిస్తూ ఉన్నట్టున్నారు. దేనిని? లోకాన్ని! సమాజాన్ని! పితృస్వామ్యంలో మగ కేంద్రాన్ని!          జీవిత యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు, కుటుంబానికి, ఊరికి వెలి అయిన వాళ్లు, సమాజం గేలి చేసిన వాళ్ళు, శరీరమే పరిహాసాస్పదమైనవాళ్లు!       […]

Continue Reading
Posted On :

నాగరీక పంకిలాన్ని కడిగేసిన బతుకు చిత్రం- రేవతి రాసిన ఒక హిజ్రా ఆత్మ కథ

నాగరీక పంకిలాన్ని కడిగేసిన బతుకు చిత్రం- రేవతి రాసిన ఒక హిజ్రా ఆత్మ కథ -వి.విజయకుమార్ ఇవ్వాళ తృతీయ ప్రవృత్తి గురించి మాట్లాడటం మరీ అంత ఘోరమైన విషయమేమీ కాదు! నిన్న మొన్నటిదాకా వారి పట్ల సానుభూతిని కలిగివుండటం, వారి సమస్యల పట్ల మాట్లాడటం కూడా ఒక వింత! రక్త మాంసాలూ, హృదయ రాగాలూ అన్నీ వున్నా జెనిటిక్ ఇంజనీరింగ్ లో జరిగిన యే అపసవ్యత వల్లో అటు పురుషుడి లక్షణాలనో, ఇటు స్త్రీ లక్షణాలనో సంపూర్ణంగా […]

Continue Reading
Posted On :

నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా

నోబెల్ సాహితీ పురస్కార గ్రహీత ఆనీ ఎర్నా మగువల నిషిద్ధ జ్ఞాపకాల స్వేచ్ఛా గీతిక -వి.విజయకుమార్           ఆనీ ఎర్నాకి ఇప్పుడు ఎనభై రెండేళ్ళు. ఆమెను నోబెల్ వరించడంతో సాహిత్య లోకమంతా ఆమె వైపు ఒక్కసారిగా అవాక్కయి చూట్టానికి పెద్ద కారణమే ఉంది, “తన అంతః చక్షువుతో వైయక్తిక స్మృతిపథంలోని మూలాల, ఎడబాట్ల, సమిష్టిగా ఎదురొడ్డే అడ్డుగోడల్ని ఛేదిస్తూ శోధించే స్పష్టతకూ, సాహసానికీ” నీరాజనాలు పడుతూ ఈ తొలి ఫ్రెంచ్ మహిళామణికి […]

Continue Reading
Posted On :

వేదనాగ్ని లో పుటం పెట్టిన అక్షరాలే హైమవతి కవిత్వం! (నీలిగోరింట కవిత్వ సమీక్ష)

వేదనాగ్ని లో పుటం పెట్టిన అక్షరాలే హైమవతి కవిత్వం!    -వి. విజయకుమార్ స్త్రీవాద కవిత్వంలో చెరగని సంతకం మందరపు హైమావతి. ఆంధ్రజ్యోతి ‘ఈ వారం కవిత’ ఒక నాటి యువ కవితా హృదయాల వేదిక. యువ కలాల యవనిక. పేజీ నిండుగా పరచుకొని అడుగు ముందుకు పడకుండా ద్వారం దగ్గరే నిలవరించే కవితా డోలిక. ఎన్ని హృదయాల్ని అలరించేదో, ఎందరి వేదనల్ని పలికించేదో, ఎందరి స్వప్నాల్ని ఉయ్యాల లూగించేదో! “సర్పపరిష్వంగం”  ఒక రోజు తొలిపేజీపై వచ్చి […]

Continue Reading
Posted On :

ఇదీ ఓ అమ్మ కథే! (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన)

 ఇదీ ఓ అమ్మ కథే! (ద్వితీయ వార్షిక సంచిక కథల పోటీ రచన) – వి.విజయకుమార్ మనసంతా దిగులుగా వుంది. నిన్నటిదాకా చీకూ చింతా లేకుండా ఏదో రాసుకుంటూనో, చదూకుంటూనో కాలక్షేపం చేస్తూ వెళ్లిపోతున్న జీవితం అనుకోకుండా ఒక మలుపు తిరిగింది. చాలా గిల్టీగా వుంది! నేను చేసిన ద్రోహం ఇంత మంది మర్యాదస్తుల్ని నొప్పిస్తున్నదని తెలిసేలోగా ఘోరం జరిగింది. హృదయాన్ని కెళ్ళగించే బాధ ఒక పట్టాన విడివడక వెంటాడుతోంది. నేను చేసిన నేరం నన్ను ముద్దాయిని […]

Continue Reading
Posted On :

అంగార స్వప్నం (ఊర్మిళ కవితా సంకలనంపై సమీక్ష)

 అంగార స్వప్నం ( ఊర్మిళ) కవితా సంకలనంపై చిరు పరామర్శ    -వి. విజయకుమార్ ఊర్మిళ పలవరించిన అందమైన రంగులకల ఈ అంగార స్వప్నం! ఈ నులివెచ్చని కల దొంగిలించబడిందో లేదో తెలీదు కానీ, దొంగిలించిన కలని భుజాన వేసుకొని అటు తిరిగే పరిశుద్ధాత్ములు ఎందరో, అంటిన మరకలు తుడుచుకొంటో ఎప్పటిలాగే యీ ‘నేను’ లు ఎందరో! అటుచేతిరాతలు పోయాయ్, అనుభూతుల్ని కవిత్వీకరించుకొని, ఉల్లిపొర కాగితపు హృదయం మీద అందంగాపరిచి, అందించిన వాటిని ఆప్యాయంగా స్పృశించి, అమ్మలా […]

Continue Reading
Posted On :