image_print
subashini prathipati

పట్టించుకోనింక!! (కవిత)

పట్టించుకోనింక!! -సుభాషిణి ప్రత్తిపాటి గుచ్చే ఎగతాళి చూపుల ముళ్ళు,పడదోసే అడుసులాంటి మాటలుఅన్నీ దాటుకుంటూ…నన్నుచేరిన గెలుపు పిలుపు నాకేం కొత్తకాదు.ఏళ్ళ తరబడి పాతుకుపోయిన అహం,తుఫాన్ లో ఊగే ఊడలమఱ్ఱి లామహోగ్రంగా మాటలతో విరుచుకుపడ్డా..నిబ్బరంగా ఎదిగే నాపై పిడుగై కురవాలనుకున్నా…కలతల కన్నీళ్ళను కవితల్లో నింపుతూ కదిలే నాకు నువ్వేంటనే ….కుఱచ సంబోధన కొత్తగా అనిపించదు.నా ఆలోచనాలోగిలి అనంతాకాశమై..రెక్కలు చాచిన కొద్దీ సరిహద్దులు లేని విశ్వం నన్ను తనలోకి ఆహ్వానిస్తుంటే….నన్నింకా సగమంటూ పెట్టే పెనుకేకలు పాతాళంనుంచి వినబడుతున్న భావన…నా చూపంతా విశ్వైక్యం పైనే…ఆ పిలుపుల […]

Continue Reading

రసహృదయాలు – రాగ రంజితాలు

రసహృదయాలు – రాగ రంజితాలు -డా. కొండపల్లి నీహారిణి గరికపూలెత్తిన నేలమీద నడకలు నేర్చిన నీవు జాతి వైరుధ్యాల మాటలనే మూటలుగా ఎత్తుకోవుగానీ గోడకేసిన బంతి నీచేతికే వచ్చినట్లు ఇక్కడేవో కొన్ని ఉత్తుంగ తరంగ భావాలు శుభారంభాల కోసం ఓ పండగ కొత్తగా మళ్ళీ వచ్చింది. ఇంటిముందు పూలమొక్కను ఎందుకు నాటుతున్నామో తెలిసీ తెలియనితనంతో మొత్తం సముద్రాన్నంతా ఎత్తిపోసినట్లు పెళ్ళి గురించి ఏవేవో అధిక ప్రసంగాలు షడ్రసోపేతమైన జీవితాన్ని కావాలనుకునేప్పుడు ఒకరికోసం ఒకరు వస్తు గుణేపంతంగా మారుతుండాలి […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-16 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-16 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి నింగిని తాకుతోన్న మంటల వృక్షాలు ఆగి ఆగి చటుక్కున విచ్చుతోన్న జ్వాలా తోరణాలు రేకులు రాలుస్తున్న నిప్పురవ్వలు జూలు విదిల్చి ఆవులిస్తున్న మృగరాజు ఒళ్ళు విరుచుకొంటున్న క్రూరత్వం నిశ్శబ్ద శకలాలు చిట్లి జారిన శబ్దం తాను కాల్చకుండానే దహించుకుపోవటాన్ని అడవితీగల్ని అందుకొని ఎగబాకి అబ్బురంగ చూస్తోన్న వానర సమూహాలు రెండు నాలుకల ప్రహసనాల్ని చూస్తూ నివ్వెరపోతూ నాలుకల్ని దాచేసుకొంటోన్న సర్పాలు ముందున్నవి కదిలిపోతున్న దారిలో […]

Continue Reading

ఎప్పటికి వస్తుంది స్వేచ్ఛ ?

ఎప్పటికి వస్తుంది స్వేచ్ఛ ? -శ్రావణి బోయిని పుట్టగానే ఆడపిల్ల అన్నారు … నేను పుట్టగానే అమ్మని తిట్టారు … పక్కవారి తప్పు ఉన్నా, నా వైపు వేలు చూపిస్తారు ….. నల్లగా పుట్టినందుకు వివక్షతో చూసారు … పెరుగుతున్నపుడు ఇంటి నుండి బయటకి వెళ్ళకు అన్నారు … చదుతున్నపుడు చదివి ఎవరిని ఉద్ధరిస్తావ్ అన్నారు… ఆడుకునే వయసులో అబ్బాయిలు ఉంటారు జాగ్రత్త అన్నారు… కాలేజీకి వెళ్ళే వయసులో చూపులు  జాగ్రత్త అన్నారు… మనసుకి నచ్చినట్టు ముస్తాబు […]

Continue Reading
Posted On :

నెట్టింట్లగాదు, నట్టింట్ల (కవిత)

నెట్టింట్ల గాదు, నట్టింట్ల -డా. కొండపల్లి నీహారిణి మాటతూలుల మూటలుగట్టే మాయాజాల మర్మాల లోహ లోకంలో ఇప్పుడు వెలగాల్సింది నెట్టింట్లగాదు , నట్టింట్ల ! అరాచక క్రియా విధ్వంసకాల్లో అరచేతి అందాలబొమ్మగా గాదు మెట్టినింటి కీర్తికి, పుట్టినింటిప్రతిష్టవుగా! నెట్టింట్లగాదు నట్టింట్ల ! మనోమందిర ప్రాంగణాన , మానవమాన తీరంపై నిలిచిన నావ సంసారసాగరానిదే గనక అయితే మెత్తటిమాటై, గట్టి నిర్ణయమై శక్తియుక్తుల నాన్నవై , వెరవని పనివై నెరసిన తలలకు తల్లీదండ్రివై , ఈ నిరాదరణ అలల […]

Continue Reading

ఓ కవిత విందాం! నువ్వు- నేను

నువ్వు-నేను  -యలమర్తి అనూరాధ నిశ్శబ్ద సంగీతాన్ని అవలోకిస్తూ నువ్వు గిన్నెల శబ్దాలతో వంటింట్లోఉక్కిరిబిక్కిరవుతూ నేను అందమైన ఊహల్లో ఎగిరిపోతూ నువ్వు రేపటి పనిని ఈరోజుకే కుదించుకుంటూ నేనుజాగింగ్ లో ఆరోగ్యాన్ని పెంచుకుంటూ నువ్వుఅంతులేని పనితో శుష్కించిపోతూ నేనుఆర్డర్లు వేయటంలో బిజీగా నువ్వు అమలుచేయడంలో ఖాళీ లేకుండా నేనుఅభివృద్ధి పథంలో మహిళలు.. పేపర్లో చదువుతూ నువ్వు నీ షూస్ కి పాలిష్ చేస్తూనా ఆఫీసుకు వేళవుతోందని నేను ఆ పనికి సిద్ధమవుతూ నువ్వు వ్యతిరేకత మనసు నిండా ఉన్నా ఒప్పుకుంటూ నేనునిద్రకు చేరువ కావాలని తపనలో నువ్వుఅలసిన మనః శరీరాలనుసేదతీర్చుకోవాలని […]

Continue Reading
Posted On :

పూల పరిమళ స్నేహం (కవిత)

పూల పరిమళ స్నేహం -కోడం పవన్ కుమార్ ఇన్నేళ్ళ మన స్నేహంఈ మధ్య కాలంలోనీ కళ్ళలో అస్పష్ట దృశ్యాలు కనిపిస్తున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రేమైక జీవనంఈ మధ్య కాలంలోనీ గుండె స్పందనలు లయ తప్పుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన పలకరింపుఈ మధ్య కాలంలోనీ పెదవులపైన మాటలు చిగురుటాకులా వణుకుతున్నాయెందుకు ఇన్నేళ్ళ మన ప్రతి కలయికలోఒక మొక్క జీవం పోసుకునేదిఒక ఆత్మీయత టీ కప్పును పంచుకునేదిఒక బాధ మేఘమై ఆకాశంలో పరుగులు పెట్టేదికాలం క్షణాల్లో కరిగికలుసుకున్న చోట తీపి గురుతును వదిలేదిమైదాన ప్రాంతాలను వదిలిమహానగరాలను దాటిమెరీనా తీరం వెంట అలలై దూకేవాళ్ళంఅలసి అలసి […]

Continue Reading
subashini prathipati

ఎదురుచూస్తున్నా…! (కవిత)

ఎదురుచూస్తున్నా…! -సుభాషిణి ప్రత్తిపాటి అణువై ఊపిరిపోసుకున్న క్షణాలనుంచే ఆరంభం..నేను ఆడనేమోనన్న అనుమానపు దృక్కులు,ఆ దృష్టి దోషం తగలకుండా..భావిసృష్టిని మార్చగలనని బలంగా సంకల్పించి…అవతరించాను అమ్మగా! అడుగడుగునా ఆంక్షలముళ్ళు,గుచ్చే దాహపుచూపుల రెక్కలుకత్తిరించే అనలాయుధంగా …అక్షరాన్ని ఆరాధిస్తూ ఆకాశమంత ఎదిగాను. కఱకురాతి పయనం దాటి….సహధర్మచారిణిగా సహగమించాను,ఊడలమఱ్ఱి లా పాతుకుపోయినఆ అహం ముందురాలని నా దుఃఖాశ్రువుల లెక్క తేల్చలేను,నా మరోసగం మరమనిషని..అర్థమైనా వెనుతిరుగలేని సనాతనం నా ప్రత్యణువులో…నిరతాగ్నిగా వెలుగుతోంది!! అయినా…అద్వైతం కోసం, కంచెలు లేని కలలసాకారం కోసం,జ్వలించని,  కన్నీటి కడలిని మోయని కలికి కనుల కోసం,కళ్ళు విప్పని నాటి నా […]

Continue Reading
jayasree atluri

ప్రేమంటే!!!

ప్రేమంటే!!! -జయశ్రీ అట్లూరి ప్రేమంటే!!! రెండక్షరాలే అయినాజీవితంజీవితానికిసంక్షిప్త నిర్వచనం పంచుకునేదే అయినాపంచేద్రియాలు పనిచేయటానికిబిందు కేంద్రం భావం బహుముఖంవ్యక్తిగతంఅయినా ఏకోన్ముఖం మాట మాధుర్యంఛలోక్తులు విసిరే చనువుకన్నీళ్ళు తుడిచే ఆర్తికన్నీళ్ళు పెట్టే ఏకత్వం కళ్ళు మూసుకున్నాతెలిసే స్పర్శఆద మరవటానికినిద్ర పోవటానికి భరోసా నిరాశలో వెన్నుతట్టినిలబెట్టే జీవన దీపంమనసులో స్థిరమైన స్థానంమరొకరిని నిలపలేని అశక్తత నాకు కావలసిందిముఖం లేని నా రేఖాచిత్రాన్నిగోడెక్కించిఆరాధించటం కాదు నన్ను గుర్తించే నీచేతిస్పర్శ నిన్ను నిలవేసే నా చూపునన్ను నిలువరించే నీ విహ్వలతనీకు నాకు మధ్య మనం చెరిపేసిన గీత మన మనసు లోతుల్లోనిస్వాతి ముత్యపు చిప్పఅందులో మనం దాచుకున్నముత్యం లాంటి ప్రేమ అరిగినకొద్దీ పెరిగేది […]

Continue Reading
Posted On :

కొడిగట్టిన దీపం (కవిత)

కొడిగట్టిన దీపం -ములుగు లక్ష్మీ మైథిలి నడుస్తున్న దేహం పై రాబందులు వాలుతాయిబతికి ఉండగానే నిలువునా చీల్చి చెండాడతాయిఆకలి తీరగానే నిర్దయగా వదిలేస్తాయితనువు అచేతనంగా మిగులుతుందిఆప్యాయతల తాలుకు కట్టిన తాయెత్తులు,రక్షరేకులు ఫలించవెందుకో?!..చలనం లేని ఆ దేహం కోసం కొన్ని నేత్రాలు అశృపూరితాలవుతాయికొన్ని చూపులు అగ్ని కురిపిస్తాయిసాయంత్రానికి వాడవాడలా కొవ్వొత్తులు ప్రశ్నిస్తాయిఏవేవో గొంతుకలు నినదిస్తాయి…తనరాక కోసం ఎదురుచూస్తున్నకళ్ళు…నిదురను వారిస్తున్నాయి..ఇంటి దీపం ఎక్కడ కొడికడుతుందేమోననీఆకాశంలో వెన్నెల ముఖం మసకబారిందినిన్నటిదాకా ఆడిపాడిన మేనుఇనుపహస్తాల గోట్లకు గాటుపడి రక్తమోడుతోంది…రాకాసుల కసికివారి కంటి వెలుగు శిథిలమైందినిండు పున్నమిని మాంసపుముద్ద […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-15 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి స్మశానమైపోతోన్న ఇసుక తిన్నెల్లో జండా కొయ్యల్లా నిల్చున్న విరిగిన బొమ్మజెముళ్ళ దారిలో కాందిశీకులై పొలిమేరలు దాటుతోన్న జనం శిబిరాలు చేరి తలదాచుకొంటున్నా ముఖాల్నిండా ఆర్తి పరచుకొని అంగరఖా చాటున గుళ్లు నింపిన తుపాకీల్లా మృత్యువుని సవాలు చేస్తూ ఆకాశానికి చూపులు ఎక్కుపెట్టే ఉన్నారు రాబందుల రెక్కల చప్పుడుకి పెట్రేగిపోతూ బంధుజనాల మృత్యువాసన వంటినిండా పూసుకొంటూ ఆకల్ని మింగేస్తున్న పూనకంతో ఊగిఊగి ఆదమరుపుగా రెప్పవాలిస్తే నిద్రాలింగనంలో […]

Continue Reading

ఎడారి స్వప్నం (కవిత)

ఎడారి స్వప్నం -డి. నాగజ్యోతి శేఖర్ నేను కొన్ని పూలఉదయాలను దోసిట పట్టి ఎదనింగికి పూయాలనుకుంటా….అంతలో…ఓ చీకటి చూపుడువేలేదో ముల్లై దిగుతుంది!పూల రెక్కల నిండా నెత్తుటి చారికలు!  కొన్ని కలల తీగల్నీకంటిపొదరింటికి అల్లాలనుకుంటా….ఓ మాటల గొడ్డలేదోపరుషంగా  నరుకుతుంది!తీగల మొదళ్లలో గడ్డకట్టిన వెతల కన్నీరు!  కొన్ని ఆశల చైత్రాలను మూటకట్టి స్మృతుల అరల్లో దాచాలనుకుంటా…!ఓ ఉష్ణ శిశిరమేదో జ్వాలయి మండుతుంది…!పచ్చటి జ్ఞాపకాల ఒడిలో గాయాల బూడిద!  కొన్ని శ్వాసల్ని ఉత్తేజ స్వరాలుగా కూర్చిగెలుపు పాటను రాయాలనుకుంటా..!ఓ అహాల అపశృతేదో ఆవహించి  కర్కశంగా ధ్వనిస్తుంది!ఊపిరిగీతం గొంతులో  […]

Continue Reading

అగ్నిశిఖ (కవిత)

అగ్నిశిఖ –కె.రూపరుక్మిణి నువ్వు ఏమి ఇవ్వాలో అది ఇవ్వనే లేదు తనకేం కావాలో తాను ఎప్పుడూ చెప్పనే లేదు..! నువ్వు అడగనూలేదు ..! నీలో నీతో లేని తనకు ఏమివ్వగలవు? కొసరి తీసుకోలేని ఆప్యాయతనా..!కోరి ఇవ్వలేనితనాన్నా.!మురిపెంగా పంచలేని లాలింపునా.!నిశీధిలో కలిసిపోయిన ఆమె చిరునవ్వునా..!!ఏమివ్వగలవు..?? ఎప్పుడైనా గమనించావా.. ఆమెని ఆ చిలిపికళ్ళలోని…                  లోతైన భావాన్ని….వర్షించలేని మేఘాలని..                   ఆ మాటలలో కలవరపాటుని నిన్ను ఎడబాయలేక             […]

Continue Reading
Posted On :

నువ్వెక్కడ (కవిత)

నువ్వెక్కడ -లావణ్యసైదీశ్వర్ సమానత్వం మాట అటు ఉంచుచట్టసభలో కాలుమోపేందుకైనా నీకిక్కడ అనుమతి పత్రం దొరకదునువ్వెంత గొంతు చించుకున్న హుక్కులు తగిలించుకున్న కాగితపు ముక్కలనుండి నీ ధిక్కారస్వరం బయటకు వినపించదు.. చూపుడువేలు మీది సిరాచుక్కలో నిన్ను కోల్పోయిన నీ నీడ లింగవివక్ష వలలో చిక్కుకుపోలేదా..సాధికారతకు అర్దం చెరిపిన నిఘంటువులో నిన్ను నిన్నుగా ఖైదు చేయలేదా.. రాజకీయం ఎప్పటిలాగానే రంగులు మార్చుకుంటూ పాత ఎజెండాల మీద పల్చగా పరుచుకుంటుంది..దరిలేని ప్రవహామదినిస్సహాయంగా కరిగిపోతున్న నీ పేరిక్కడ ఏవ్వరి తుది తీర్పులోనూ వినిపించదు..అసంకల్పితంగా కొన్ని చేతులు మాత్రం […]

Continue Reading

నదిని నేనైతే (కవిత)

నదిని నేనైతే -నస్రీన్ ఖాన్ ప్రపంచమంతా నా చిరునామా అయినప్పుడు నా ప్రత్యక్ష అంతర్థానాల కబుర్లెందుకో ఈ లోకానికి? అడ్డుకట్టలు ఆనకట్టలు నా ఉత్సాహ పరవళ్ళు నిలువరించాలని చూసినా పాయలుగా విస్తరించడం తెలుసు వాగులూ వంకలూ పిల్ల కాలువలుగా ప్రవహించడమూ తెలుసు పుట్టుకతోనే ఉనికి ప్రకటించుకునే నేను ముందుకు సాగేకొద్దీ జీవరాశులెన్నింటికో ఆలవాలమౌతాను సారించిన చూపంత పచ్చదనం పశుపక్ష్యాదుల దాహార్తి తీర్చే చెలిమ నా ప్రతిబింబమైన ప్రకృతి నాలో చూసుకుంటూనే ముస్తాబై పరవశిస్తుంది అలసట ఎరుగని పయనం […]

Continue Reading
Posted On :
rajeswari diwakarla

పేండమిక్ అమ్మ (కవిత)

పేండమిక్ అమ్మ -రాజేశ్వరి దివాకర్ల సూర్యుని తూరుపు కిటికీ తలుపుల వారకు పరచుకున్న నీడలన్నింటిని గరిక చీపురు కట్టతో చిమ్మేసి జన వాసాల వీధులను శుభ్రం చేసేందుకు విస విసల చీరకుచ్చిళ్ళను నడుం చుట్టుకు బిగించేసి వచ్చేసింది విధులకు  ఏమాత్రం తప్పని పుర సేవకి పెద్దమ్మ పేండమిక్ అమ్మ. ఎరుపు విచ్చిన వెలుగులో తెలుపు గౌను గుండె తడిని వత్తుకుంటూ ఊయలలో పాపని ఊరుకో బెట్టమని విడువలేక  అమ్మకు అప్పగిస్తూ మరి ఏ బిడ్డకు తల్లి ఎడబాటు […]

Continue Reading

తడిలేని నవ్వు ( కవిత)

తడిలేని నవ్వు -లక్ష్మీ కందిమళ్ళ గరుక విలువ చేయని జీవితం ఎడారిలా మారిన గుండె గొంతులోనే ఆగిన మాటలు శాసిస్తున్న శాసనాల ఊబిలోఉక్కిరిబిక్కిరవుతూ… ఒక నిన్ను ఒక నన్ను తిరగవేస్తున్న చరిత్ర  ఒక సూర్యోదయంతో ఒక చంద్రోదయంతో తప్పని జీవిత పయనం తడిలేని నవ్వుతో అలా… ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

మేలుకొలుపు (కవిత)

 మేలుకొలుపు -రాజేశ్వరి రామాయణం ఆశల కావడి భారందేహపు విల్లును నిలువెల్లా విరిచేస్తుంటేవూహాల రంగుల సౌధంకళ్లెదుటే  పెళ్లలుగా విరిగిపడుతుంటేనీకంటూ మిగిలిన ఓ క్షణంనిన్నిపుడు ప్రశ్నిస్తోంది నీదికాని కలల్ని మోసుకొనికాలాన్నంతా రెప్పలపై కూరుకొనిఎదురుపడ్డ ముళ్ళన్నిటినీ పూవులుగా పులుముకుంటూఆకలి దప్పులు తాగేశావ్ నువ్ విసిరేసిన విశ్రాంతి శాశ్వతంగా నిన్ను అక్కున చేర్చుకుంటున్న వేళబాసలు చేసిన బంధం బరువుగా నిట్టూరుస్తూప్రాణం పోసిన పాశం మేఘాల అంచున రంగుల లోకపు హంగులకు కావలి కాస్తోంది ఎప్పుడైనా కనీసం ఒక్కసారైనా నుసిగా మారే కర్పూరానికి వెలుగొక్కటే కాదు ఆసాంతం మసిచేసే గుణముందని తెలిపావానువ్వుగా మారిన […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-14 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-14 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి వెలుగురేఖలు ఆవలిస్తూ చీకటి దుప్పటిని విసిరికొట్టి తూరుపుగట్టు ఎక్కి విచ్చుకోకముందే రాత్రంతా భయం ముసుగు కప్పుకొన్న కళ్ళు తడితడిగా నిరీక్షణ ముగ్గుల్ని ముంగిట్లో పరిచి వార్తాపత్రికలోని అక్షరాల్ని చూపుల్తో ఏరుకొంటూ ఏరుకొంటూ ఉండగానే కన్నీరు ఆవిరైపోతూ దేశాంతరాలు పట్టిపోతోంది ఆకాశానికీ నేలకీ మధ్య ఎక్కడో నిప్పులవాన కురుస్తోంది అక్షరాలన్నీ వేడెక్కి కళ్ళనిండా ఎరుపు జ్వాలల్ని ప్రతిబింబిస్తున్నాయి పొట్ట నిండా ఆందోళన ఆమ్ల ద్రావణమై పొర్లిపోతోంది […]

Continue Reading

ఓ కవిత విందాం! భ్రమప్రమాదములు

ఆమె నిషేధ స్థలాలు -షాజహానా అందరి ముందు నవ్వొద్దు దేన్నయినా దాచుకోవచ్చు నవ్వెట్లా..? ఎవరికీ కనపడకుండా ఎన్ని రోజులుగానో ముఖంలో దాచిపెట్టిన దాదీమా నవ్వు.. అమాస అర్ధరాత్రి చీకటిలో పెదవుల కొమ్మలపై పూసిన నిశ్శబ్ద పూల నక్షత్రాలు.. ఇప్పటికీ ఆస్మాన్ లో చెక్కు చెదరలేదు..! కారణం లేకుంట తన కోసమే తను నవ్వుకున్న నవ్వు నాకు చెప్తూ ఆమె నవ్విన నవ్వుకు ప్రతి రూపాలే అవన్నీ…! చిక్కని చీకట్లో మెరిసే మిణుగురులు ఆ ఒంటరి సంచరిత నవ్వులు.. ఎవరివో…? ఏ నిషేధ వో..? […]

Continue Reading

గోదావరి- ఒక పయనం ( కవిత)

గోదావరి- ఒక పయనం -ఎస్. జయ గోదావరి నవ్వుల గలగలలు కవ్విస్తుంటే వెంట వెళ్ళాం కాపలా కాసే భటుల్లా తెల్ల మబ్బుల గొడుగులు పట్టుకొని బారులు తీరిన ఆకుపచ్చని కొండలు దారంటా పరిచిన నురగల మల్లెలు చిన్ని చిన్ని సుడిగుండాలు నవ్వే గోదావరి బుగ్గల్లో సొట్టలు సన్నని సవ్వడితో అలలు మెలమెల్లగా విరిగిపడుతూ అంతలోనే కలిసిపోతూ గాజుపలకల్లా మెరిసిపోతూ కొండల అంచుల్లో అలలు ఆకుపచ్చని రంగులో తలుకులీనుతూ   నవ్వుల పారిజాతాలు వెదజల్లుకుంటూ కాసేపు సుదీర్ఘాలోచనలతో మరికొంతసేపు […]

Continue Reading
Posted On :

ఓ కవిత విందాం! ఆమె నిషేధ స్థలాలు

ఆమె నిషేధ స్థలాలు -షాజహానా అందరి ముందు నవ్వొద్దు దేన్నయినా దాచుకోవచ్చు నవ్వెట్లా..? ఎవరికీ కనపడకుండా ఎన్ని రోజులుగానో ముఖంలో దాచిపెట్టిన దాదీమా నవ్వు.. అమాస అర్ధరాత్రి చీకటిలో పెదవుల కొమ్మలపై పూసిన నిశ్శబ్ద పూల నక్షత్రాలు.. ఇప్పటికీ ఆస్మాన్ లో చెక్కు చెదరలేదు..! కారణం లేకుంట తన కోసమే తను నవ్వుకున్న నవ్వు నాకు చెప్తూ ఆమె నవ్విన నవ్వుకు ప్రతి రూపాలే అవన్నీ…! చిక్కని చీకట్లో మెరిసే మిణుగురులు ఆ ఒంటరి సంచరిత నవ్వులు.. ఎవరివో…? ఏ నిషేధ వో..? […]

Continue Reading
Posted On :
jayasri

యుద్ధం పుల్లింగమే (కవిత)

యుద్ధం పుల్లింగమే -జయశ్రీ మువ్వా కాలాన్ని గుప్పిట పట్టి పంటి కింద్ర తొక్కిపట్టిఇదిగో ఇప్పుడిప్పుడే రెక్కల సవ్వడి గుర్తుపడుతున్నాం వెన్నెలను అద్దంలో ఒంపి తృప్తిపడుతున్నాంనక్షత్రాలను పెదాలపై అతికించుకునిఆనందంలోకి అడుగుపెడుతున్నాం నాలోనూ రక్తమే ప్రవహిస్తోందనిఆకశాన్ని అంగిట్లో దాచేస్తున్నాం రంగాలన్నీ రంగరించి గుటుక్కున మింగేస్తూపాదాలకు పరుగు నేర్పిస్తున్నాం శరీరం పై మచ్చలన్నీ మాయమైన సంతోషంలోకొత్త వలసపక్షులైరెక్కలు కూర్చుకున్నాం ఆదిమ నుంచి అంచలంచలుగా అందరూ ఎదుగుతూనే ఉన్నారునువ్వూ అతీతం కాదు నీ మత మౌఢ్యం మాత్రంఅదిగో పురిటిదుర్వాసన నుంచి ఇంకా శుద్ధి కాలేదుఅందమైన బలపాలు అరచేతి పలకలో అరిగే క్షణాలనొదిలినిప్పులు […]

Continue Reading
Posted On :

Unfinished Art (కవిత)

Unfinished art -సుభాషిణి తోట కాలం వాగులా సాగిపోతుంటుందినన్ను ఆగనియ్యదు సాగనియ్యదుక్షణ క్షణం కుదుపులే ఆ నీటి పయనానఒక్కటంటే ఒక్క మంచి జ్ఞాపకము మిగిలి ఉండదుమిగిలి ఉన్నవి అన్ని సగం వరకే సాగి ఏ రాతి ఘట్టానికో చిక్కుకొని ఆగిపోతాయ్..చిట్టడివి లో ఉంది ఆ వాగునేనొక పడవనుఅందులో అన్ని ఆలోచనల పుస్తకాలేఆత్రంగా ఉంటుంది జీవంచావు కేకలుచుట్టూఅరణ్యరోదన ల మధ్య నేనొక ఒంటరిగా మిగిలిపోతాపుస్తకం గాలి రెపరెపలకు తెరుచుకుంటుందిఅందులో ఇలా రాసి ఉంది…”O Death i cannot die”చాలు ఒక పదమో […]

Continue Reading
Posted On :

ఎంత బాగుందో! ( కవిత)

ఎంత బాగుందో! -శ్రీ సాహితి ఈ ముసురులో భలే చల్లావు నీ చూపును… అదును చూసి మొలకెత్తింది కవితగా అది నీ పెదాలకు చేరి సువాసనాలతో తీపి శబ్దలుగా సంచరిస్తుంటే ఎంత బాగుందో! ఎప్పుడో వ్రాసిన ఉత్తరం.. ఆమెను తలుస్తూ పోస్ట్ చేయడం మరిచాను. ఆలేస్యంగా ఆమెకందిన నా అక్షరాలు ఆమె నవ్వును వెంటనే తిరిగి పోస్ట్ చేశాయి. నా మాటను రాళ్లతో తరిమికొట్టావు… ప్రేమకొద్దీ పరిగెత్తాను.. గాయం మాయకుండానే మళ్లివచ్చాను మళ్ళీ తరమాలని చూశావు…కానీ నీ […]

Continue Reading
Posted On :
gattu radhika mohan

నువ్వు పరిచిన ముళ్లపానుపు (కవిత)

నువ్వు పరిచిన ముళ్లపానుపు -గట్టు రాధిక మోహన్ ఉదయాలను,రాత్రులను కట్టగట్టి నాకు నేనే అవుతూ నీ వాసన లేని ఓ కొత్త ప్రపంచంలో బతకాలనుకొని కరిగిపోయే రంగులను ముఖానికి అద్దుకొనికొన్ని నవ్వులని పూయిస్తాను. ఎందుకోగని… ఆ నవ్వులను చూసి కూడా నువ్వు అర్థంలేని చూపులతోపోలికల కోసం వెతుకుతుంటావుఅసూయ లోయలో పడిపోతూ ఉంటావు. సారూప్యం లేని ఆ చూపులకి…ఆ పోలికలకి…ఆ అసూయలకి…ఏం చెయ్యాలో తోచని నేను నాలోని నేనుతో కలిసి ఓ సారి పక్కున నవ్వుకుంటాను. కానీ…నవ్వులా కనబడే ఆ నవ్వులో ఎన్ని మేఘాలు నల్లటి దుప్పటిని కప్పుకొని దాక్కున్నాయనే రహస్యం నీకెప్పటికీ అంతుబట్టదు! ఇప్పుడు ఆ మేఘాల […]

Continue Reading

రంగు మబ్బులు (కవిత)

రంగు మబ్బులు -డా. శ్రీనాథ్ వాడపల్లి ఒక ఎనిమిది వసంతాల పూర్వం. ఓ చీకటి రాత్రి ఒక చైనీయుడు పారిస్ థియేటర్లో సంగీతం వాయిస్తూంటే పియానో మెట్ల మీంచి వచ్చిన కమ్మని కవిత్వంలో  నువ్వెందుకు లేవు? మేఘాల మాటున దాక్కున్నావు కదూ !చీకటి నలుపులో పోల్చుకోలేక పోయాను ఇప్పటికైనా కనుక్కొన్నాను. మొత్తానికి నిన్ను రంగుల మబ్బులతో కలపగలిగాను.  ***** డా. శ్రీనాథ్ వాడపల్లిSrinath Vadapalli, Born in Vizianagaram, Andhra Pradesh. Parents: Vadapalli Lakshminaraya Acharyulu, Seethamma. Phd in New Media, Masters in Printmaking, Bachelors in Painting. Presently working with the Educational Services Commission of New […]

Continue Reading
gavidi srinivas

కళ్ళలో ఒక నది (కవిత)

 కళ్ళలో ఒక నది -గవిడి శ్రీనివాస్ కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి . లోపలి మనిషి ఒక్క సారీ బహిర్గత మౌతుంటాడు. అంతర్ధానమౌతున్న  విలువల ముందు జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా కడగబడుతున్న క్షణాల్లో ఇంకో పార్శ్వముగా దివ్య రేఖలు అద్దుతుంటాయి . చెదిరిపోని  ఊహలు గూళ్ళను నిర్మిస్తాయి . అల్లుకున్న తపనలు చిగురులు తొడుక్కుంటాయి . ఒక దాహం నది తీర్చినట్లు ఒక ఎండని చెట్టు ఆపినట్లు కాలం దొంతరల్లో ఒక ప్రయత్నం ఎన్నో కాంతుల్ని విసురుతుంది . శ్రమ ఉదయించడం లో విజయాలు తడుతుంటాయి. […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-13 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-13 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి శ్వాస ఆడటంలేదు ఆక్సిజను వాయువంతా ఇగిరిపోయిందేమో వాతావరణం మంటలతో జ్వలిస్తోంది ఉక్కుబూట్ల కింద శవాలు విరుగుతున్న చప్పుడు విన్పిస్తోంది శిబిరాల కింద నిప్పులు దాక్కున్నాయి పరదాల చాటున ఎండిపోయిన కళ్ళు ఏడవటం మర్చిపోయాయి జనమేజయుని సర్పయాగంలోని సమిధల్లా కందకాలలో సగం కాలిన ఎముకల కుప్పలు కమురుకంపుల్ని వెదజల్లుతున్నాయి మృతవాసనల్ని పీల్చుకొని బొమ్మజెముడు పువ్వు ఎర్రగా విచ్చుకొంది విస్తరిస్తున్న పిశాచ సామ్రాజ్యాల్ని కీర్తిస్తూ రాబందులు రాగాలాపనలతో […]

Continue Reading

తప్పని తరింపు (కవిత)

తప్పని తరింపు -చందలూరి నారాయణరావు రెపరెపలాడే చూపులే ఎగిసే కెరటాలు. మిణుకుమనే మాటలే దుమికే గుర్రాలు. అరిగిన ఎముకలనే ఆసరాగా బతికే ఆశ పాదాలను ములుకర్రతో అదిలించి ఇరుకు దారిలోనూ ఉరుకుపట్టిస్తుంది. ప్రకృతి చట్టానికి లోబడే వయసు వదర ముప్పులో చిక్కినా… లోపలి మనసులో గుండెల్లో కొండలు పేలినా దారి నడకల్ని కూల్చినా కొట్టుకుపోని జీవసంబంధానికి కొనఊపిరికి మిణుకుమిణుకులను ముడేసి ఆఖరి క్షణాలకు రెపరెపలను పెనేసి… ఉక్కుబంధంతో తెగినచోట తపన తాపడంతో తనువు తహతహలాడటం ప్రతి ఒక్కరి […]

Continue Reading

విముక్తి (కవిత)

విముక్తి -మమత కొడిదెల మళ్లీ ఆట మొదలెట్టడమెందుకని అంటూనే ఇన్ని పల్లేరుగాయల్ని నువ్వు నా చేతుల్లో పోసినప్పుడు నొప్పికంటే ఎన్నో రెట్లు సంతోషాన్నిచ్చావని అబద్ధమే చెప్పాను. అయినా, నిజం చెప్పడానికి నాకు నువ్వు ఏమవుతావని? తడి ఆరిన కళ్ళ వెనుక ఆటలో నిన్ను గెలిపించి అబద్ధం నాకు మిగిల్చిన పొడిబారిన ఊదా రంగు పొరవి తప్ప? ఎర్ర రాతి కొండల వెంబడి దిక్కుతోచక తిరుగుతూ నా ప్రేమను కనుమలలో పాతిపెట్టేసిన ఆ క్షణంలోనేనా విముక్తి కోసం నువ్వు […]

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

పద్మవ్యూహం (కవిత)

పద్మవ్యూహం -లక్ష్మీ కందిమళ్ళ అనగనగా ఒక కథముగింపు తెలీని కథ ఆ కథలో ఎన్నో విషయాలు న్యాయం, అన్యాయం సంతోషం, దుఃఖం స్వర్గం, నరకం  ఇకఆ కథలోకి ప్రవేశించాక తిరిగి బయటికి వచ్చే దారి వుండదు అదో పద్మవ్యూహం  అలా సాగుతూ వుంటుంది ఆ కథ  చివరికి ఆ కథ ఎక్కడికి తీసుకెళ్ళుతుందో నీకు తెలీదు తెలుసుకునే అవకాశం వుండదు  అందుకే అది ముగింపు తెలీని కథ. ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-12 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-12 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి పిపీలకమని చులకన చేసేలోపునే బలవంతమైన సర్పం చలిచీమల బారిన పడనే పడింది చరిత్ర పునరావృతమౌతూనే వుంది ఇప్పుడు పిచ్చుకల మీద బ్రహ్మాస్త్రాలు ప్రయోగింపబడుతున్నాయి పావురాల్ని పట్టేందుకు వలపన్ని గింజలేయటం విన్నాం ఇదెక్కడి తిరకాసో వేటు వేసి శవాలకు గింజలు చల్లటం ఇప్పటి చిత్రమౌతోంది జనభక్షణ చేస్తూనే పవిత్రతని చాటుకొంటున్నాం నరమాంసం భుజిస్తూ ఎముకల్ని మెళ్ళో అలంకరించుకొంటూనే సాధుపుంగవులమని నీతిబోధలు చేస్తున్నాం అదేమి చిత్రమో! వేలెడులేని […]

Continue Reading
gavidi srinivas

ఈ వేళ రెక్కల మధ్య సూర్యోదయం (కవిత)

ఈ వేళ రెక్కల మధ్య సూర్యోదయం -గవిడి శ్రీనివాస్ ఒక  పక్షి నా ముందు రంగుల కల తొడిగింది . ఆకాశపు హరివిల్లు మురిసింది . చుక్కలు వేలాడాయి కాసింత వెలుగు పండింది . సీతాకోక చిలుకలు వాలాయి ఊహలు అలంకరించుకున్నాయి . ఈ రోజు ఆశ తొడుక్కుంది క్షణాలు చిగురిస్తున్నాయి . అడుగు ముందుకు వేసాను లక్ష్యం భుజం తడుతోంది . ఈ వేళ  రెక్కల మధ్య సూర్యోదయం తీరాల్ని దాటిస్తూ నా లోపల  ఉషస్సుల్ని నింపింది .   ***** గవిడి శ్రీనివాస్గవిడి శ్రీనివాస్  […]

Continue Reading
Komuravelli Anjaiah

ఫోటో (కవిత)

ఫోటో -కొమురవెల్లి అంజయ్య పుట్టి పెరిగిన ఇల్లు ఇప్పుడు పాడుబడని పాత జ్ఞాపకం పెంకుటిల్లయినా హాలు గోడలు ఫోటోల కోటలు నవరసాల స్మృతులు చెక్కు చెదరని గుండెధైర్యాలు గోడల దిష్టి తీసేందుకు సున్నాలేసినప్పుడు దిగొచ్చిన ఫోటోలు దాచుకున్న యాదుల్ని దులపరించేవి దుమ్ము కణాలై ఒక్కో ఫోటో తుడిచే కొద్దీ జ్ఞాపకాలు చుట్టాలై అలుముకునేవి చిరిగిపోయిన గతం గూడు కట్టుకునేది పిలవడానికి అన్ని ఫోటోలే అయినా దేని దర్జా దానిదే దేని కథ దానిదే దేని నవ్వు, దేని […]

Continue Reading

మారెమ్మల శోకం

మారెమ్మల శోకం -జూపాక సుభద్ర సీత , రామున్ని సిటెం గూడా యిడువక అడవికి అడుగిడిoది సావిత్రి సత్య వంతుని సాయిత కోసం ఎముని ఎంటబడి ఎదిరించింది ద్రౌపది ఒంటరి మంటల మొసాడక పతులతో పాదచారియై పయనమైంది దమయంతి దాపు కోసమేకారడివికి  నలునితో నడిచింది లక్ష్మీదేవయితే , విష్ణువు గుండెల గుంజ పాతి అడ్డ బిటాయించింది పార్వతమ్మ శంకరయ్య శరీరాన్ని సగం బడ పకడ్బందీగా పట్టా చేస్కున్నదిసరస్వతమ్మ బ్రహ్మ నోటిని కుటీరంగకోట గట్టుకున్నదిగంగా దేవమ్మ శివుని నెత్తిమీదనే మెత్తేసుకున్నది గీళ్లంతా మొగల నీడ లేకుండా నెగుల లేని విహంగీలు.గిసొంటి వాసాలు, ఆవాసాలు గోడలు, గోదాములు […]

Continue Reading
Posted On :
Ramakrishna Sugatha

ఆమె ఒంటరిగా నడిరేయి నడవదు (కవిత)

ఆమె ఒంటరిగా నడిరేయి నడవదు -రామకృష్ణ సుగత ఆమె ఒంటరిగా నడిరేయి నడస్తుందంటె కళ్ళుకి నిప్పు తగిలించికొని అలాయి చేస్తుండాలి విమర్శకుల వీధిలో శబ్దాలను అమ్మినట్టు సులభం కాదు ఆడదానయ్యేది పూరించిన దేహం కాలిపోయిన ఆత్మ వసంతానికి విసిరిన రాయి కొంచం తడిచి వచ్చుండాలి ఆమె ఒంటరిగా నడిరేయి నడస్తుందంటె బట్టలువేసిన నగ్నం తో పాటు భావాలు వీధికి దిగి ఉండాలి చనిపోయిన కడుపుని ఆకలి ఓదార్చినట్టు సులభం కాదు ఆడదానయ్యేది పనుల జీతం మరణించిన కోరిక […]

Continue Reading
Posted On :

స్వదేశం (కవిత)

స్వదేశం -కుందుర్తి కవిత విదేశంలో ఉంటూ దేశభక్తిమీద కవితేంటని  మొదట వ్యంగ్యంగా నవ్వుకున్నా… ఆలోచనలు ఏదో అజెండా తో గిర్రున వెనక్కి తిరిగి జ్ఞాపకాల వీధిలో జెండా పాతాయి… పదిహేనేళ్ళ నా పూర్వం పరదేశంలో తన పునాదులు వెతికింది!! ఆరునెలలకు మించి ఇంటికెళ్ళకపోతే మనసు మనసులో ఉండకపోవడం… మన దేశం నుంచి ఎవరొచ్చినా సొంతవాళ్ళలా మర్యాదలు చేయడం… మన జాతీయ హస్తకళలతో ఇంటినంతా నింపుకోవడం మన దేశపు చిన్ని భాగాన్నైనా ఇంట్లో బంధించామని పొంగిపోవడం… పిల్లలకి దేశభక్తి పాటలు నేర్పుతూ , “ఏ దేశమేగినా, ఎందుకాలిడినా” అని మైమరిచి పాడటం.. జణగణమన  తరువాత జై హింద్ కి ప్రతీసారీ అప్రమేయంగా చేయెత్తి జై కొట్టడం… ఇవన్నీ  దేశాభిమానానికి నిదర్శనం కాదా?! మన సినిమాల ప్రీమియర్ షోల కి వెళ్ళి ఈలలు వేయడం నుంచీ… మార్స్ మంగళ్ మిషన్ సఫలానికి  గుండె గర్వంతో ఉప్పొంగిపోవడం వరకూ..!! ఆనాటి క్రికెట్ వరల్డ్ కప్పులో టీం ఇండియాకి  పై కప్పులెగిరేలా ఛీర్ చేయడం నుండి మొన్న ఒలంపిక్సులో సింధు కంచుపతాకానికి  కంచు కంఠంతో అరవడం వరకూ !! అన్నిట్లో  దేశారాధరోదన వినిపించలేదా ?! కాషాయవన్నె ధైర్యం వెన్నంటే ఉంచుకుని తేటతెల్లని మమతలు మనసులో నింపుకొని అభివృద్ధికై పచ్చటి శుభసంకల్పంతో ధర్మసందేశాన్ని విస్తరించే విహంగాలై  వినీలాకాశంలో విహరిస్తూ త్రివర్ణ తత్వాన్ని త్రికరణశుద్ధిగా పాటిస్తున్న మనం.. ప్రవాసంలో కూడా స్వదేశ ఛాయలనే కదా వెతుక్కుంటున్నది?! దేశభక్తుడంటే… దేశాన్ని ఉద్ధరించే […]

Continue Reading
Posted On :

అన్నీ తానై.. (కవిత)

అన్నీ తానై.. -చందలూరి నారాయణరావు సూర్యుడు నాకు గుర్తుకు రాడు. నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడు నాకు అవసరం అనుకోను. నాలో పూసిన ఓ శశి ఉంది గాలితో నాకు పనే లేదు నాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టిని ప్రత్యేకంగా తాకేదు లేదు. నాకై నడిచే ముద్రలో సంతోషాలే అన్నీ వానలో తడిసే పనే ఉండదు నాకు జ్ఞాపకాల జల్లుకు కరువేలేదు. నాకు నాతోనే పనిలేదు నాలో ఉన్న నీవు కొరత కావు. ***** చందలూరి […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-11 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-11 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి కొత్త మిలీనియం ఉత్సవాల పచ్చదనం ప్రజల ఆలోచనల్లో ఇంకా వసివాడనేలేదు కొత్తగా విచ్చుకొన్న చిగురాశలు రక్తచందనమైపోయాయి అప్పుడే మిలీనియం బేబీని కన్న తల్లి పేగు పచ్చిదనం ఇంకా తగ్గనేలేదు అప్పుడే తెగిన పేగు కనుకొలకులకు గుచ్చుకొని చూపు విలవిలా కొట్టుకుంటూనే ఉంది మానవ నిర్మిత మహాసౌధాలు కూలిన దృశ్యం కంటిపాపలో తాజాగా కదుల్తూనే ఉంది కానీ – భవితవ్యం రూపుదిద్దిన ఆశాసౌధాలు కన్నవారి గుండెల్లో […]

Continue Reading

తల్లివేరు (కవిత)

తల్లివేరు -డా. తంగిరాల. మీరా సుబ్రహ్మణ్యం పడమటి తీరాన్ని చేరిన పక్షులు తొడుక్కున్న ముఖాలే తమవనుకున్నాయి .పాప్ లు,రాక్ లు,పిజ్జాలు,కోక్ లు పక్కింటి రుచులు మరిగాయి  .సాయంకాలం మాల్ లో పొట్టి నిక్కర్ల పోరీలు అందాల కనువిందులు .సిస్కో లో పని చేసినా, సరుకులే అమ్మినా డాలరు డాలరే!  కడుపులో లేనిది కావలించు కుంటే రాదని ,నలుపు నలుపే గానీ తెలుపు కాదని ,పనిమంతుడి వైనా ,పొరుగునే వున్నా ,పరాయి వాడివే నని ,తత్వం బోధపడే సరికి చత్వారం వస్తుంది.  అప్పుడు మొదలవుతుంది అసలైన వెతుకులాట .నేనెవరినని మూలాల కోసం తనక లాట .జండా పండుగలు,జాగరణలు ,పల్లకీ సేవలు,పాద పూజలు ,భామా కలాపాలు,బతుకమ్మ పాటలు  అస్థిత్వ ఆరాటాలు .  రెండు పడవల రెండో తరానికి  ఆవకాయ అన్నప్రాసనం ఉదయం క్వాయిర్ క్లాసు,సాయంత్రం సామజ వరగమన మన బడి గుణింతాలు, రొబొటిక్స్ ప్రాజెక్ట్ లు  అటు స్వేఛ్ఛా ప్రపంచపు పిలుపులు, ఇటు తల్లి వేరు తలపులు. ***** తంగిరాల మీరాసుబ్రహ్మణ్యం -పేరు: కె.మీరాబాయి ( కలం పేరు: తంగిరాల.మీరాసుబ్రహ్మణ్యం ) చదువు: ఎం.ఏ; పి.హెచ్.డి; సిఫెల్ మరియు ఇగ్నౌ నుండి పి.జి.డిప్లొమాలు. వుద్యోగం: ఇంగ్లిష్ ప్రొఫ్.గా కె.వి.ఆర్.ప్రభుత్వ కళాశాల,కర్నూల్ నుండి పదవీవిరమణ రచనలు: కథలు:- 1963 నుండి ఇప్పటిదాకా 200 పైగా కథలు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రముఖ పత్రికలలో నవలలు 4 ( ఆంధ్రప్రభ, స్వాతి మాస పత్రికలలో) కథాసంకలనాలు:- 1.ఆశలమెట్లు 2.కలవరమాయె మదిలో,3.వెన్నెలదీపాలు,4.మంగమ్మగారి […]

Continue Reading

నైరూప్యం లేదా అధివాస్తవికత (కవిత)

నైరూప్యం లేదా అధివాస్తవికత  -డా. శ్రీనాథ్ వాడపల్లి రోజూ రాత్రి మొదలవ్వగానే ఒక విచిత్రమైన కల.  ముక్కూ మొహం తెలీని ఓ కొమ్మ పూల చెట్టు కింద ప్రేమని తుంచుకొంటూ నాకూ కొన్ని మొగ్గలు రహస్యంగా  అయితే ఆమె ప్రేమిస్తున్నట్టు అర్ధం చేసుకున్నట్టు  –  కనిపించదు. అలా అని – ఏమీ తెలీదని కాదు. పునరుజ్జీవన కాలం వర్జిన్ కళ్ళకు నా మూసిన కళ్ళలో బొట్టు రహస్యం తెలుసు.  నలుపాతెలుపాచామన ఛాయా ?పేరు కూడా తెలీదు.  ఉంటే అది నాకు నచ్చిన పేరే ఉంటుందని నా నమ్మకం.  గుమ్మం ముందు మట్టిగోలెం లోచిట్టి పువ్వు  పేరైనా అంబరంలో మినుకు తారకైనానీలి సముద్రంలో బిందువైనా  కావొచ్చు ఏదైనా నాకు నచ్చేదే.  అరచేతి చందమామతో గారాబంగా చేతులు చాపుతానుబంగారం అంటూ.  హఠాత్తుగా ఓ కీచు గబ్బిలం గోడకు కొట్టుకొన్న శబ్దం నన్ను నిద్రలేపుతుంది. ***** డా. శ్రీనాథ్ వాడపల్లిSrinath […]

Continue Reading

సాధికార స్వరం

https://youtu.be/Jo5UDV0jkQA సాధికార స్వరం -శిలాలోహిత ఒకప్పుడు నేనెక్కడున్నాను అని ప్రశ్నించుకునే తరుణం శతాబ్దాల పాటు సాగుతున్న అణచివేతల సారాన్నంతా గుక్కపడుతున్న కాలం ఇప్పుడు సముద్రాన్ని ఈదిన రోజులు పెనుతుఫాన్లకి ఎదురొడ్డిన రోజులు స్త్రీలంటే కొలతల సమూహం కాదని ఒక మనిషిని తనలాంటి తోటి మనిషేనని తెలియజెప్పిన కాలజ్ఞానం బానిసత్వానికి సంకెళ్ళువేసి పావురపు రెక్కలతో నక్షత్ర వీధిని చేరి, అన్నింటా గెలిచి తనహేతుబద్ధ వాదనతో నిజాల్ని వెల్లడించింది ఇప్పుడిప్పుడే కొత్త కొత్త న్యాయసూత్రాలను బట్టీయం వేస్తున్న వారి డొల్లతనాన్ని, […]

Continue Reading
Posted On :
gavidi srinivas

నలిగే క్షణాలు (కవిత)

 నలిగే క్షణాలు -గవిడి శ్రీనివాస్ గూడు విడిచిన పక్షి మాదిరి తపనపడ్డ క్షణాలు  నలిగిపోతున్నాయి . తుఫాను వీచినట్లు ఎడారులు ఎత్తిపోసినట్లు ఇంటికి దూరమైన పిల్లలు హాస్టల్ లో  వేలాడుతున్నారు. గుండెను తడిపే పలకరింపు కోసం దూర భారాన్ని దింపుకోవటం కోసం కన్నీటి తీగలు చెవిలో మోగుతున్నాయి . కొన్ని చేరువ  కావలసినపుడు కన్నీటి చినుకులూ కురుస్తాయి . ఈ కాసింత కాలాన్ని ఓపిక మీదే ఆరేయాలి కన్నవారి కలలు పిల్లల్లో పిల్లల కలలు ఆప్యాయతల్లో వాలుతుంటాయి . రాత్రులు కన్నీటి […]

Continue Reading

హమ్ యాప్ కె హై కౌన్

హమ్ యాప్ కె హై కౌన్ -ప్రసేన్ ఎవరికుండదు చెప్పు… ఎందుకుండదు చెప్పు! కండముక్కలేని బక్కనాయాలకూ సిక్స్ పాక్ తో పుట్వ చూసుకోవాలనీ కురూపసి అష్టావక్రికీ సల్మాన్ తోనో టామ్ క్రూయిజ్ తోనో చుమ్మా ఏవీ ఏస్కోవాలనీ అప్పలమ్మకూ మిస్ యూనివర్స్ కిరీటం కొట్టే జిఫ్పవ్వాలనీ గోటింబిళ్ళాడలేని గొట్టంగాడికీ వరల్డ్ కప్పెత్తిపట్టిన బ్రేకింగ్ న్యూసవ్వాలనీ కదల్లేనోడికీ మారథాన్నడిచే క్లిప్పవ్వాలనీ ఎడ్డమ్మకు కౌన్ బనేగా కరోడ్పతి నెగ్గిన పిక్ అవ్వాలనీ ఎవరికుండదు చెప్పు ఎందుకుండదు చెప్పు ఫికర్ నహీ గురువా ప్రతి […]

Continue Reading
Posted On :
లక్ష్మీ కందిమళ్ళ

ఎరుక (కవిత)

ఎరుక -లక్ష్మీ కందిమళ్ళ ఎప్పటికప్పుడు ఎరుక కలిగించే సత్యం అదినిశ్చల తటాకంపై నిలిచిన ప్రశాంతతపక్షిలా విహరిస్తున్న వాక్యం సరికొత్త రాగంలో ఉదయాన్ని గుప్పిట పడుతూ ఋతువుల ఆగమనం  ఆశగా చిగురిస్తూ తుమ్మెదలాగా రెక్కలు ఆడిస్తూ బోసినవ్వుల అమాయకత్వంతో మళ్ళీ మళ్ళీ స్వచ్ఛంగా సహజంగా మత్తుగా కలల రంగులను అద్దుకొనిపూల రేకులను ముద్దాడుతూ శాంతి, సాంత్వనవెలుగు వచనాలుగా.. ***** కందిమళ్ళ లక్ష్మికర్నూలు గృహిణి సాహిత్యాభిలాష (చదవడం,రాయడం) ప్రవృత్తి: కవిత్వం రాయడం

Continue Reading

అమ్మ బహుమతి! (కవిత)

అమ్మ బహుమతి! -డా|| కె. గీత నిన్నా మొన్నటి శిశుత్వంలోంచి నవ యౌవ్వనవతివై నడిచొచ్చిన నా చిట్టితల్లీ! నీ కోసం నిరంతరం తపించే నా హృదయాక్షరాలే అక్షతలుగా నిన్ను ఆశీర్వదిస్తున్నా నీకు పద్ధెనిమిదో పుట్టినరోజు శుభాకాంక్షలు! నీ చిన్నప్పుడు మొదటి టీకా రాత్రి నువ్వు కింకపెడుతూ ఏడుస్తున్నపుడు తడిసిన నా భుజాన కన్నీళ్లు నావే వచ్చీరాని నడకల్తో నాకోసం గేటు దగ్గిర కాపలా కాసి వీథి చివరకి పరుగెత్తుకొచ్చి పడ్డప్పుడు నీ మోకాలి మీద చివికిన రక్తం నాదే నీ ముద్దు ముద్దు మాటలు ఇంకా తాజాగా నా గుండెల్లో రోజూ పూస్తూనే ఉన్నాయి నీ బుల్లి అరచేత పండిన గోరింట నా మస్తకంలో అందంగా అప్పటి నుంచీ అలా వేళ్లాడుతూనే ఉంది క్రమశిక్షణా పర్వంలో నేను నిన్ను దార్లో పెట్టడం పోయి నువ్వు నన్ను దూరం పెట్టినపుడల్లా మథనపడ్డ క్షణాలు గుండె చాటునెక్కడో చురుక్కున పొడిచినా అంతలోనే గువ్వ పిట్టవై నా భుజాన నువ్వు గారాల కువకువలాడినప్పుడల్లా మొలిచిన మందహాసం ఇప్పటికీ నా పెదాలనంటుకునే ఉంది నువ్వంటే ఉన్న ఇష్టానికి చాలని మాటల చాటున కన్నీళ్లు కేంద్రీకృతమైన అమ్మ మనసు ఉంది ఆడపిల్లంటే నేనే కదూ! నువ్వు నాలోంచి మొలిచిన ధృవ తారవు కదూ! ప్రపంచంలోకి ఉరకలేస్తూ అడుగుపెట్టే పద్ధెనిమిదో ఏట నిన్ను చూస్తే కలల్ని అలలుగా ధరించి ఆకాశంలోకి రెక్కలొచ్చిన పిట్టలా ఎగిరిన జ్ఞాపకం వస్తూంది దారంటా గుచ్చుకున్న ముళ్లతోనే విరిగిపడ్డ రెక్కల్ని కుట్టుకున్న ధైర్యమూ జ్ఞాపకం వస్తూంది జాగరూకురాలివై ఉండు తల్లీ! చీకట్ల కోరలు పటపటలాడించే […]

Continue Reading
Posted On :

పాదుకా పట్టాభిషేకం (కవిత)

పాదుకా పట్టాభిషేకం -పద్మ సత్తిరాజు పేరుకే మనం ఆకాశంలో సగం మనకంటూ ఒక అస్తిత్వానికి మాత్రం తగం మనువు మన జీవిత పరమార్థాన్ని శాసిస్తాడు మనువు మన జీవిత గమనాన్నీ గమ్యాన్నీ మార్చేస్తుంది పని పంచుకోమని అడిగితే మండిపడుతుంది సంఘం ఎందుకంటే మరి కార్యేషు దాసి నియమానికి భంగం కరణేషు మంత్రి పదవి ఇచ్చారని పొంగిపోకేం ఫలితం తేడా వస్తే నింద మనకే ఇక భోజ్యేషు మాతకు జరగగల అతి పెద్ద మేలు వంకలు పెట్టకుండా ఉంటే […]

Continue Reading
Posted On :

ఏకాంతం..!! (కవిత)

ఏకాంతం..!! -శివ మంచాల ఏకాంతం కావాలని సరైన సమయం కోసం అనువైన స్థలం కోసం వెతుకుతున్నాను! అక్కడొక బాల్యం కనపడింది..ఆడుకుంటూ పాడుకుంటూ తిరుగుతుంది ఎర్రని ఎండలో చెట్టునీడ దొరికినంత సంబరపడ్డానుపట్టుకోబోయాను దొరకలేదు..దాని వెనక పరుగెత్తి పట్టుకోబోయానునాకంటే వేగంగా పరుగెత్తుతుంది అదిఅప్పుడర్ధమయ్యింది..దానంతట అది పరుగెత్తట్లేదనిబాల్యానికి ఇష్టం ఉన్నా లేకపోయినా తల్లి తండ్రుల ఇష్టానికే దాన్ని బలవంతంగా లాగుతుంటారని! అమ్మ నాన్నల లాలనలలోఆటా పాటలతో బాల్యం సాగిందనేగానిమనం కోరుకున్న ఏకాంతం ఎక్కడుందని..?ఎవరిష్టానికి వారు పిల్లల్ని పెంచాలనుకుంటారుగానిబాల్యం ఇష్టా ఇష్టాలు ఎవరు గమనించారని..?పిల్లల ఇష్టా ఇష్టాలను గమనించలేనప్పుడు..గొడ్డుబోతుల్లా మిగిలిపోక.. బిడ్డల్ని కనటం […]

Continue Reading
Posted On :

సైరంధ్రి (దీర్ఘ కవిత) (గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి , తెలుగు సేత: డా. సి. భవానీదేవి)

సైరంధ్రి (దీర్ఘ కవిత) గుజరాతీ మూలం , హిందీ అనువాదం : డా. వినోద్ కుమార్ జోషి తెలుగు సేత: డా. సి. భవానీదేవి ఒకటవ సర్గ : వివశసంధ్యలో నిరాలంబ గగనం నిస్పంద నిగూఢ సమీరం అధోముఖమై నిలిచిన యువతి వ్యగ్రమానస సంకలిత! తనపేరునే తలచుకుంటూ నిట్టూరుస్తున్నది సైరంధ్రి హస్తినాపుర సామ్రాజ్ఞికి ఎన్నడెరుగని  అవమానం! విరాటనగరం, విరాటరాజు అజ్ఞాత అనూహ్య దేశం అసలు దాచిన రహస్యరూపం ఆబద్ధ అసత్యవేషం ! అడుగులు సాగటంలేదు చకోరనేత్రాలు  సుంతయినా  […]

Continue Reading
Posted On :

ఎవరతను? (కవిత)

ఎవరతను? -అరుణ గోగులమంద తెలిసిన ముఖంలానే ఉన్నాఅతెనెవరో ఎంతకీ గుర్తురాదు.కాలేజీ గేటుబయట గోడకు బండిపెట్టుకుని కళ్ళలో ఎదురుచూపులు పాతుకొని ..నాకోసం వెతికిన..ఆనాటి అతనేనా.”ఈ ఏడాది ఎలా ఐనా మనపెళ్ళైపోవాలినిన్ను పోగొట్టుకోలేను ప్రమీలా”అని నా చేతుల్లో మొహం దాచుకుని ఏడ్చిన.. అతనేనా? యూరిన్ టెస్ట్లో పాజిటివ్ రిజల్ట్.పెళ్ళై రెండునెలలు.పీజీ మొదటిఏడాది..చదువు పూర్తికాని అగమ్య గోచర స్థితినిస్సహాయత మోస్తున్న పాదాలు.మాట్లాడ్డానికేం లేదు..మెల్లగా బండెక్కి..అతని వెనకే కూర్చున్నాడ్రైవ్ చేస్తున్న అతనెవరో గుర్తురాదు.కనీసం.. పరిచయమున్న జ్ఞాపకమైనా..రాదు. గదిలోంచి రానీయడు అతనుగది బయట తోడేల్లా ఆమెసిగ్గులేని జన్మ,ఎంతసేపూ గదిలోనే “వాడికేం మగాడు,దీనికుండక్కర్లా..చీ..!”పొరుగింటామెతో […]

Continue Reading
Posted On :

ఒకరు లేని ఇంకొకరు (కవిత)

 ఒకరు లేని ఇంకొకరు -భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మ లేని నాన్న….. వెలిగించని దీపంలా రాశిపోసిన  పాపంలా వెలుగే లేని లోకంలా మూర్తీ భవించిన శోకంలా శబ్దం లేని మాటలా పల్లవిలేని పాటలా పువ్వులులేని తోటలా నవ్వులులేని నోటిలా శిధలమైన కోటలా గమనం తెలియని గమ్యంలా పగలులేని రాత్రిలా ఉంటారు. నాన్న లేని అమ్మ …… వత్తిలేని ప్రమిదలా ప్రమోదం లేని ప్రమదలా కళ తప్పిన కళ్ళలా మమతలు ఉడిగిన మనసులా ఒరలేని కత్తిలా పిడిలేని […]

Continue Reading

ఆమె కవితలు (కవిత)

ఆమె కవితలు -పాలపర్తి ఇంద్రాణి   ఆమె ఉల్లాసాన్నిఉడుపులుగాధరించి వచ్చిందివారు ఆమెనుబాధించలేక పోయారు ఆమె వైరాగ్యాన్నిచేత పట్టుకు వచ్చిందివారు ఆమెనుబంధించలేక పోయారు. ఆమె వినయాన్నివెంట పెట్టుకు వచ్చిందివారు ఆమెనువేధించలేక పోయారు. ఆమె జీవితాన్నితపస్సుగా మార్చుకుందివారు మూతులుతిప్పుతూతొలగిపోయారు. 2.  నేను వివేకము విచక్షణ ఉన్న ఈశ్వర సృష్టితప్రాణినిఅని ప్రకటించావునువ్వు అది వినిటింకర వంకరనాగుపాములునంగిరి నంగిరివానపాములుహిహ్హిహీఅని నవ్వి హింగిరి హింగిరిగానీ వెంట పడ్డాయిఅప్పుడు నువ్వువంటిట్లో దూరిచెంచాల వెనుకమిల్లి గరిటెల వెనుకదాక్కున్నావు నీ అమ్మఅమ్మమ్మవాళ్ళ అమ్మఅందరూ అక్కడేనక్కి ఉండడం చూసిఆశ్చర్య పడ్డావు అంతలో,నువ్వు ఎక్కడదాక్కున్నావోకనిపెట్టేసిననాగు పాములువాన పాములువాళ్ళందరినీపొగిడినట్టేనిన్నూవంటింటి కుందేలుఅని వేనోళ్ళ […]

Continue Reading

అమ్మా (‘పరివ్యాప్త’ కవితలు)-8

అమ్మ (‘పరివ్యాప్త’ కవితలు)-8 -డొంకెన శ్రీశైలం ఒడిలో కూచుంటే అమ్మ ఉగ్గన్నం తినిపించింది తన జోలపాటలతో నేను నిదుర పోయాకే అమ్మ నిదురపోయేది నాకు సుస్తీ చేస్తే అమ్మ పస్తులుండి కనపడని దేవుళ్ళకు కానుకలిస్తానని మొక్కుకునేది ఓనమాలు నేర్పి బడికి పంపేది అమ్మ వేడన్నం నాకు సద్దిగట్టి సల్దిఅన్నం సర్దుకు తింటుంది అమ్మ ఆనవాలు లేక ఆస్తినంతా అమ్మేసి బతుకుబాట చూపి ఓ ఇంటివాన్ని చేసింది అమ్మ వరిచేను ధగ్గర అమ్మ వంట దగ్గర అమ్మ వడ్డించే […]

Continue Reading
Posted On :

నిన్నర్థం చేసుకుంటున్నాను (కవిత)

నిన్నర్థం చేసుకుంటున్నాను -కోడం పవన్ కుమార్ ఇవాల్టిదాకా నీవింకా నన్నర్థం చేసుకోలేదనుకున్నానుఇకనుంచి నేను నిన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను వంటగది తాలింపు వాసనలోనీ చెమట సౌందర్యం కానరాలేదుతలలోంచి గుప్పెడు మల్లెలు మత్తెక్కిస్తుంటేనీవొక మాంసపు ముద్డగానే కనిపించావుఇంట్లో ఇంటిచుట్టూ పరుచుకున్నలెక్కలేనన్ని నీ పాదముద్రల్లోశ్రమ సౌందర్యాన్ని గుర్తుపట్టలేకపోయానుఇంట్లోని అన్ని అవసరాలను చూసుకునేమరయంత్రంగానే భావిస్తూమాటల కీ ద్వారా నా అవసరాలను సమకూర్చుకున్నానువిశ్రాంతి కోసమోనిద్ర కోసమోపడకమీద నడుం వాల్చితేనాలోని కోర్కెకు అక్కరకొచ్చేఅపూర్వమైన కానుకగానే భావించానుపురిటినొప్పులతో మెలికలు తిరుగుతుంటేమొలక పూసిన ఆనందభాష్పాలు నీ కంటినుంచి రాలుతుంటేస్త్రీగా నీ బాధ్యత తీరిందని కొట్టిపడేశానునీ ఇష్టాయిష్టాల ప్రమేయం లేకుండాగాల్లో గిరికీలు కొడుతున్న నన్నుఓ వేణునాదాన్ని చేద్దామన్న నీ […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-10 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-9 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి నాగరికతల మధ్య భాస్వరమై మండుతున్న ఘర్షణ లోయల గుండా లావా ప్రవాహమై దేశాల మధ్య చేరి రాతిగోడగా ఎప్పుడైంది? సంస్కృతిని కాల్చేస్తున్న నిప్పురవ్వ రాజ్యాల్ని రగిల్చే కుంపటిగా ఎప్పుడు మారింది? అభిప్రాయాల్ని చీల్చేస్తున్న కత్తుల బారకేడులు విరిగి పౌరగుండెల్లో ఎప్పుడు గుచ్చుకొన్నాయి? ఉన్నచోటునే గింగరాలు తిరిగే బొంగరంలా అంతర్గతంగా సాగే వర్ణపోరాటం అంతకంతకూ పెరిగి పెరిగి సామాజికాన్ని, జాతీయాన్ని దాటి మూడోపాదాన్ని అంతర్జాతీయం మీద […]

Continue Reading

అన్నీ తానై.. (కవిత)

అన్నీ తానై.. -చందలూరి నారాయణరావు సూర్యుడునాకు గుర్తుకు రాడు.నాలో ఉదయించే వెలుగు వేరు.. చంద్రుడునాకు అవసరం అనుకోను.నాలో పూసిన ఓ శశి ఉంది గాలితోనాకు పనే లేదునాకై మొలిచిన నవ్వుల చెట్టుంది. మట్టినిప్రత్యేకంగా తాకేదు లేదు.నాకై నడిచే ముద్రలో సంతోషాలే అన్నీ వానలోతడిసే పనే ఉండదు నాకుజ్ఞాపకాల జల్లుకు కరువేలేదు. నాకు నాతోనే పనిలేదునాలో ఉన్న నీవుకొరత కావు. ***** చందలూరి నారాయణరావుపుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం […]

Continue Reading

ఒంటరి బందీ (కవిత)

ఒంటరి బందీ -శ్రీధర రెడ్డి బిల్లా ఊళ్ళో మా ఇంటి ప్రక్క, ఉండేదొక ఒక అక్క! ఒక యేడు పెద్దది ఆ అక్క బడిలో ఒకే క్లాసు నేనూ,అక్క!   ఆటలు,చదువుల్లో తనెప్పుడూ మేటి బడిలో తనకెవరూ లేరు పోటీ! మేము కలిసే ఆటలాడుకునేది, కావాలనే తను ఒక్కోసారి ఓడేది!   ఓ రేగుచెట్టుండె మాఇంటిముందున పండ్లకోసం ఎక్కేటోళ్లం కొమ్మకొమ్మన! పురుగుల్లేని దోరపండొక్కటి దొరికినా, కలిసి తినేటోళ్ళం కాకెంగిలిన!   నేను కొత్తచొక్కా వేసుకున్నా, మురిసిపోయేది నాకన్నా […]

Continue Reading

ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా (కవిత)

ఎన్ని దుఃఖాలు ఇంకా ముసురుతున్నా -గవిడి శ్రీనివాస్ కాలం కనుబొమల మీద అలల్లా  పరిచయాలు కదులుతుంటాయి . కొన్ని లెక్కలు సరిపడి ముడిపడతాయి కొన్ని నిజాలు జారిపడి వేరుపడతాయి కృత్రిమ పరిమళాల మధ్య బంధాలు నలిగిపోతున్నాయి . కొన్ని ఆర్థిక తూకాల్లో తేలియాడుతుంటాయి . ప్రతి చిరునవ్వు వెనుక ఒక వినియోగపు ప్రణాళిక పరచుకుంటుంది . అంతా పరాయీకరణ లో విలవిలలాడుతున్నాం . ఒంటరి పోరాటం లో అవాంతరాల మధ్య శక్తి గా వెలగటం కార్య దీక్షకు […]

Continue Reading

పడవలసిన వేటు (కవిత)

పడవలసిన వేటు -శ్రీనివాస్ బందా తెగిపడిన నాలిక చివరగా ఏమన్నదో పెరకబడిన కనుగుడ్డు ఏ దౌష్ట్యాన్ని చూసి మూసుకుందో లేతమొగ్గ ఎంత రక్తాన్ని రోదించిందో అప్పుడే తెరుచుకుంటున్న గొంతు ఎంత ఘోరంగా బీటలువారిందో చచ్చిందో బతికిందో అనుకునేవాళ్లు పొలంలోకెందుకు విసిరేస్తారు చిదిమేటప్పుడు చలించనివాళ్లు చిన్నపిల్ల అని ఎందుకనుకుంటారు కలెక్టివ్‌గా గంతలు కట్టుకుని దుర్గకీ కాళికీ లక్ష్మికీ ఉత్సవాలు చేస్తాం గదిలో ఏనుగు చుట్టూ గుడ్డోళ్ళం సమస్యకి అనేక రంగులు పూస్తాం నా సుఖప్పిల్లో కింద మూలుగు నొక్కేసుకుని […]

Continue Reading
Posted On :

దగ్ధగీతం

https://www.youtube.com/watch?v=P8SzxdqbYAk దగ్ధగీతం  -ఘంటశాల నిర్మల తల్లీ! నిలువెల్లా కాలి ముద్దమాంసమై నడిరోడ్డున కుప్పపడింది నువ్వు కాదు – కణకణలాడే కన్నీళ్ళలో ఉడికి కనలిన వేలూలక్షల అమ్మానాన్నల గుండెలు! అనేకానేక సామాజిక రుగ్మతల కూడలిలో ఒక ఉన్మత్త మగదేహం నీ మీద విసిరిపోసిన పెట్రోల్ – పెట్రోలా – నిండా ఇరవయ్యేళ్ళు లేని పిచ్చివాడు బాహాటంగా స్ఖలించిన విషమది! ప్రేమముసుగులోనో – కుదరనప్పుడు కాంక్షగానో – దారికి రాకుంటే ద్వేషంగానో నిన్ను ముంచెత్తే నిప్పులనది!! బడిమిత్రుడితో బాంధవ్యమనుకున్నావేమో కానీ […]

Continue Reading
Posted On :

ఆమె ఇపుడొక శిల్పి (కవిత)

ఆమె ఇపుడొక శిల్పి  -పోర్షియా దేవి ఆమెని  కొంచెం అర్ధం చేసుకోండి ఎప్పటికీ ఒకేలా ఉండడానికి ఆమేమీ పనిముట్టు కాదు మారకుండా ఉండడానికి ఆమేమీ తాంజావూరు చిత్రపటం కాదు  తరతరాల భావజాల మార్పులను ఇంకించుకున్న మోటబావి తాను అంతరాల సంధి కాలాలను మోస్తున్న ముంగిట ముగ్గు కదా తాను అవును ఆమె ఇప్పుడు మారుతుంది ఎందుకంటే కొత్త నీరు వచ్చి పాతనీరు పోయినట్టు కాలప్రవాహంలో తాను కూడా ప్రవహిస్తుంది ఎంతకాలమింకా ఇతరుల కోరికలకు అనుగుణంగా తనను తాను మలచుకుంటుంది ఇకనైనా తనకే సొంతమైన తన ఊహలకు రూపమిచ్చుకోవాలి కదాజనవాక్యం తనవాక్యంలా పలికిన ఆ చిలకపలుకులనిక ఆపేసి తన గొంతు తానే శృతి […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-9 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి పర్వత పంక్తుల నడుమ యుద్ధనేత్రం విచ్చుకొంది క్షిపణి విత్తనాలు విస్ఫోటన పొగవృక్షాల్ని సృష్టిస్తున్నాయ్‌ శవాలగుట్టల మీంచి లేచిన మతంవాసన వాతావరణాన్ని విషపూరితం చేస్తోంది గాలిలో ప్రవహిస్తున్న ఉన్మాదం శిరస్త్రాణాన్నీ, కరవాలాన్నీ ధరించి ప్రపంచ జైత్రయాత్రకు బయల్దేరుతోంది గోళీకాయ లాడుతోన్న పసివాడు తుపాకీలో తూటాల్ని నింపటం మొదలెట్టాడు అక్షరం ఆకారాన్ని తెలియని పసిది సిగ్గుతో మెలికలు తిరుగుతూ వేళ్ళని గుండెల్లో దాచుకొని జనానాలోకి పారిపోతోంది నైతికత్వం […]

Continue Reading

వదిలొచ్చేయ్… (కవిత)

వదిలొచ్చేయ్… -డి.నాగజ్యోతిశేఖర్ రాతిరి దుప్పట్లో విరిగిన స్వప్నాలని ఎత్తి పారబోసిగుండెదోసిలిని ఖాళీ చేయాలని …. దుఃఖపు వాకిట్లోకూలబడిన నిన్నటి ఆశల ముగ్గునిహత్తుకొని ఓ కొత్త వర్ణాన్ని అద్దాలని…. పెరట్లో పాతిన బాల్యపుబొమ్మని వెలికి తీసిపచ్చని కలల్ని పూయాలని… వంటింటి కొక్కేనికి గుచ్చిన ఆత్మనోసారి తిరిగి గాయపు దేహంలో కి ఆహ్వానించాలని… తెగిన నక్షత్రపువాక్యాలనిపదం పదంగా కూర్చుకొనినీదైన కవితొకటి రాయాలని….వసి వాడని పూల ఋతువొకటి ఆలింగనం చేసుకొనిరాలిన గతాలని సమాధి చేయాలని….ఎంతగా తపించావోనాకు తెలుసు!మరెంతగా దుఃఖించావోఅదీ తెలుసు! నువ్వొస్తావని…నువ్వుగా వస్తావనిఎన్ని రాత్రుల్ని హత్య చేసిఉదయాలకు ఊపిరిపోసానో….ఎన్ని శిశిరాలను […]

Continue Reading

ఓటమి దీపం

ఓటమి దీపం -నారాయణ స్వామి వెంకట యోగి ఎక్కడో దీపం పెట్టి మరెక్కడో వెలుతురుని కోరుకోగలమా  ఎక్కడో, ఎప్పుడో గెలుస్తామేమోనన్న ఆశ ఉంటె యుద్ధం మరో చోట ఎందుకు చెయ్యడం ఎందుకు ప్రతిసారీ చీకటి లోకి అజ్ఞాన సుఖంతో కూరుకుపోవడం  మనం వెలిగించిన దీపం మనని దాటి వెళ్ళకపోవడం వెలుతురు తప్పు కాదు కదా  దీపం నీడల్ని కూడా దాటలేని మన అడుగుల  తప్పేమో అని తడుతుందా మనకు ఎప్పటికైనా  ప్రతిసారీ ఓటమీ,ఓటమిని చూసి ‘మురిసి’ పోవడమేనా మనకు గెలుపు లేదా లేక అసలు గెలవడమే రాదా  గెలిచినా గెలుపును నిలుపుకోవడం రాదు గనకఓటమే నయమా  అందుకే మన ప్రయాణం ఎప్పుడూ గెలుపును ‘ఇతరుల’ పరం చెయ్యడానికో  లేదూ లక్ష్యానికి సగంలో ఆగిపోవడానికి మాత్రమేనా  ఎవరు ఎక్కడ ఎందుకు మిగిలిపోతారో  ఎవరు ఎవరితో ఎక్కడిదాకా ప్రయాణిస్తారో ఈ చిమ్మచీకట్లో ఏ […]

Continue Reading

నెత్తురివ్వు ఊపిరవ్వు(కవిత)-విజయ “అరళి”

నెత్తురివ్వు ఊపిరవ్వు -విజయ “అరళి” కాయపు కుండలో తొణికిసలాడే జీవజలం నెత్తురు!! కటిక నలుపు, స్పటిక తెలుపు పసిమి రంగు మిసిమి ఛాయల తోలు తిత్తులన్నింటిలో ఎరుపు రంగు నెత్తురు!! కులం లేదు మతం లేదు జాతి భేదమసలే లేదు రాజు లేదు పేద లేదు బతికించేదొకటే నెత్తురు!! నువ్వెంత, నేనింత వాడెంత, వీడెంత హెచ్చుతగ్గుల ఎచ్చుల్లో ఉరుకులాడే నెత్తురు!! అన్యాయం, అక్రమాలు పగలు, ప్రతీకారాలు తెగనరికే తన్నులాటల తెగ పారే నెత్తురు!! ఉరుకు పరుగు జీవితాల […]

Continue Reading
Posted On :

పల్లె ముఖ చిత్రం (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

పల్లె ముఖచిత్రం  (నెచ్చెలి ద్వితీయ వార్షికోత్సవ ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – రామా రత్నమాల నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ హేమంత హిమ సుమజల్లులో తడిసే  అందచందాలు సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి రంగవల్లులై విరిసిన ముంగిళ్ళు పాలికాపు పొలికేకతో పొలాల వైపు పయనించే పద సవ్వడులు రజని చెక్కిలిపై జాబిలి వెన్నెల సంతకమద్దే వేళ కష్ట సుఖాల కలబోతలు శ్రమ జీవన సౌందర్యాన్ని చాటే జానపద జావళీలు […]

Continue Reading
Posted On :
subashini prathipati

నానీలు (కవిత)

నానీలు -సుభాషిణి ప్రత్తిపాటి గాయాలన్నీ…నెత్తురోడవు!!కొన్ని జీవితాలను.అశ్రువుల్లా..రాల్చేస్తాయి!కనులుంది..చూసేందుకే!తెరచిన ప్రతికన్నుమెలకువ కాదే!!కరుణ నిండినకళ్ళు కలువలు!వేదనా వేసటతీర్చేది వెన్నెలేగా!కనబడని క్రిమిస్వైర విహారం!మారువేషాన తిరిగేయమునిలా!!మల్లెఎప్పటికీ ఆదర్శమే!!మండుటెండలోనవ్వుపూలై పూస్తున్నందుకు!! **** ప్రత్తిపాటి సుభాషిణి -ప్రత్తిపాటి సుభాషిణి నివాసం బాపట్ల.  గత 20 సంవత్సరాల నుంచి తెలుగు ఉపాధ్యాయినిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నారు. కళాశాలనుంచి కవితలు వ్రాస్తున్నా, ఇటీవలనుంచే వివిధ పోటీలలో పాల్గొంటూ  కృష్ణ శాస్త్రి, సినారె, అద్దేపల్లి పురస్కారాలు, టీచర్స్ ఫెడరేషన్ వారి సావిత్రి బాయి పూలే అవార్డులు పొందారు. బడి పిల్లల కవితలు […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-8 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి యుద్ధమేఘం కింద అనాధ పసిబాలలు విచ్చుకోలేని గిడసబారిన మొగ్గలు! శాంతిపావురం కోసం ఆశగా వారు ఆకాశానికి అతికించిన చూపుల పూరేకులు అలసిపోయి నేలరాలిపోతున్నాయి ఆర్తనాదాల్ని కంఠంలోనే బంధించి డేగరెక్కలు విసురుతోన్న భయ వీచికల్ని కప్పుకొని కలుగుల్లో ఎలకలై బిక్కచచ్చిపోతూ పసితనపు ఆహ్లాదాన్ని యుద్ధంముళ్ళకంపపై ఆరేసుకొని చీలికలువాలికలు అయిపోతోన్న బాల్యాన్ని తన గర్భంలో దాచుకొనేందుకు యుద్ధభూమే మాతృమూర్తి అయిపోతుందేమో! అక్షరాలు దిద్దాల్సిన వయసులో అమ్ములపొది లౌతున్నారు […]

Continue Reading

అద్దానికి ఏమి తెలుసు? (కవిత)

అద్దానికి ఏమి తెలుసు? -చందలూరి నారాయణరావు నీవు అంటే ఏమిటో అద్దానికి ఏమి తెలుసు? దగ్గరగా ఉంటూ అందాన్ని మాత్రమే మాట్లాడుతుంది. నిన్ను దాచుకున్న మనసును అడిగి చూసేవా? ఎంత దూరంగా ఉన్నా ప్రేమే ఊపిరిగా జీవిస్తూనే ఉంటుంది. **** చందలూరి నారాయణరావుపుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం కాసేపు మాట్లాడుకుందాం(2018) కవితా సంపుటి  

Continue Reading

లోచన …!! (కవిత)

లోచన …!! -రామ్ పెరుమాండ్ల కాలం పరిచే దారుల్లో వేసిన అడుగుల జాడలు భాష్పిభవిస్తున్నాయి.ఎడారిలో విరిసిన వెన్నెలలుచీకట్లను పులుముకున్నాయి.ఉష్ణపు దాడుల్లో దహనమైనఆశల అడవులన్నీచిగురించే మేఘాల కోసం తపిస్తున్నాయి . ఎక్కడో ఓ ఖాళీకడుపు అర్థనాధం చేస్తుంటే చెవుల్లో మోగే సంగీతపు స్వరాలు నిన్నటి కన్నీటి గాయాలకు మరుపుమందు రాస్తున్నాయి. జీవితం కూడా కాలపు వల కింద దాచిన గింజలకు ఎపుడో దరఖాస్తు చేసుకుంటది.మరిప్పుడు మరణవార్తమరణమంత మాట కాదు. నీకు గుర్తుండదు భీకరవర్షంలో తడిసి వణికినకుక్కపిల్లను తరిమేశావో,నీ మనసు వెంటిలేటర్లో కట్టిన పిచ్చుక గూడును విసిరేశావో ,ఏ పసివాని చిరునవ్వును కర్కశంగా నిలిపివేశావో గానీ నేడు మరణవార్త బోసిపోయింది. ఏదో ఒక […]

Continue Reading
Posted On :

అవనీమాతకు అక్షరమాల (కవిత)

అవనీమాతకు అక్షరమాల – ముప్పలనేని ఉదయలక్ష్మి కనుచూపు అందినంతమేర పచ్చని పైరునేల ఎదురుగాఉన్న నా  మనసులో భావపరంపర ఆనందించే అద్భుత ఆకాశంలా జీవితకాలం హత్తుకున్న నాన్నప్రేమలా ఆలంబనై నిలబెట్టిన వెన్నెముకలా అమ్మ మమకారానికి ప్రతిరూపం ఈభూమి ! కన్నపేగు దీవెనకు అస్థిత్వమయి ఆర్ధిక ఉన్నతికి సోపానమై ఈశ్వరుని దయకు ఇచ్ఛాస్వరూపిణివై ఊపిరికి ఎదురీదే ఏటికి తీరంచూపి ఓర్పు విలువకు ఉదాహరణను చేశావు ఓపలేని బరువును  మోస్తూ గమ్యంకేసి నడిపావు చల్లని మనసుతో   చలివేంద్రమయ్యావు -2- తల్లిలా […]

Continue Reading

జీవితం ఒక పుస్తకమైతే (కవిత)

 జీవితం ఒక పుస్తకమైతే – డా . సి. భవానీదేవి జీవితం ఒక పుస్తకమైతే జరగబోయేవి ఇప్పుడే చదివేసేదాన్ని ఏది నన్ను చేరుకుంటుందో మనసు దేనిని కోల్పోతుందో కొన్ని  స్వప్నాలనైనా  ఎప్పుడు నిజం చేసుకుంటానో గాయాల చెట్టునయి ఎప్పుడు కూలిపోతానో జీవితం ఒక పుస్తకమైతే ….. చదువుతుంటే తెలిసిపోయేది! ఏడిపించిన జ్ఞాపకాలను చింపేసేదాన్ని మురిపించిన అనుభవాలను దాచుకునేదాన్ని మధురమైన సందర్భాలకు మరిన్ని పేజీలను చేర్చుకునేదాన్ని చివరి పేజీ చదివేటప్పటికి గెలుపు ఓటముల లెక్క అర్ధమయ్యేది ముళ్ళకంపలమధ్య మల్లెపూల […]

Continue Reading
Posted On :

గోడంత అద్దంబు గుండెలకు వెలుగు (కొండేపూడి నిర్మల కవిత)

https://youtu.be/PcmdB2_3KBM “గోడంత అద్దంబు గుండెలకు వెలుగు”  -కొండేపూడి నిర్మల అబద్ధం ఆడనని చెప్పే వాళ్ళున్నారు కానీ అద్ద౦ చూడనని చెప్పిన వాళ్ళున్నారా? ఎంత వయసొచ్చినా వదలని చాపల్య౦ ఈ అద్ద౦ అదేపనిగానో , అప్పుడప్పుడో అందులోకి తోంగిచూసుకోని వాళ్ళుంటారా నావరకు నేను దాని లోతుల్లోకి దిగిన ప్రతిసారీ ఒక కొత్త రూపం తెచ్చుకోవాలనే అనుకుంటాను ఆమాత్రం ఏమార్చకపోతె అద్దం గొప్పదనం ఇంకేముంది అందాన్ని సానపెట్టడానికి తీసుకున్న ఒక్కొక్క సౌందర్య లేపనంతొ వంద మయసభలు కట్టుకోవచ్చు అద్దంతో నా […]

Continue Reading

గతి తప్పిన కాలం (కవిత)

గతి తప్పిన కాలం -కూకట్ల తిరుపతి ఇవ్వాల్టి మనిషంటే? అట్టి ముచ్చట గాదు అతన్ది అల్లాటప్పా పని అస్సలు లేదు బొడ్లె వరాలు మోరీలు ముల్లెకట్టుకొని రామసక్కని పుట్క పుట్టిండాయే సుద్దపూసల సుద్దులోడు గ్యారడీ విద్దెల గమ్మతోడు పాణసరంగ కొట్లాడి లొంగదీసుకొన్నడో మచ్చికతోటి మరిగించుకొన్నడో కానీ పసుపచ్చుల పంచెపాణాలను దొర్కవట్టుకొని మెస్లకుంట అదుపాగ్గెల వెట్టుకొన్నడు ఉత్తగ సూత్తిమనంగనే రెక్కలు కట్టుకొని విమానమైతడు బొత్తిగ మెరుపు తీగోలె రాకెట్టై రయ్యన దూసుకుపోతడు నింగి అంచున నివాసం కడలి కడుపున […]

Continue Reading
Posted On :

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు)

పెండ్లి చూపులు (‘పరివ్యాప్త’ కవితలు) -కర్ణ రాజేశ్వర రాజు రంభలా మేకప్ చేసి వదులుతారు నే రంభను కాను టీ కప్పు అందించమంటారు టీ బాయ్ ను కాను ముద్దుగుమ్మలా ఒదిగి ఒదిగి కూర్చోమంటారు  నే గంగిరెద్దును కాదు తల పైకెత్తి కనులతో కనులు కలిసి చూడమంటారు నే మెజీషియన్ను కాను అక్కరకు రాని లక్ష ప్రశ్నలు సందించుతారు కోర్టులోనే ముద్దాయిని కాను ఎందుకీ యుద్ధభూమిలో నిస్సహాయురాలైన నన్ను క్షతగాత్రిని చేస్తారు నాకూ మనసూ మానవత్వం ఉంది […]

Continue Reading
Posted On :

నా పల్లె లోకం లో … (కవిత)

నా పల్లె లోకం లో … – గవిడి శ్రీనివాస్ వేలాడే  ఇరుకు గదుల నుంచీరెపరెపలాడే  చల్లని గాలిలోకిఈ ప్రయాణం ఉరికింది .ఔరా |ఈ వేసవి తోటల చూపులుఊపిరి వాకిలిని శుభ్ర పరుస్తున్నాయి . కాలం రెప్పల కిలకిలల్లోఎంచక్కా  పల్లె మారింది. నిశ్శబ్ద మౌన ప్రపంచం లోరూపు రేఖలు కొత్త చిగురులు  తొడిగాయి . పండిన పంటలుదారెంట పలకరిస్తున్నాయి . జొన్న కంకులు ఎత్తుతూ కొందరుఆవులకు  గడ్డిపెడుతూ కొందరుమామిడి తోట కాస్తూ కొందరుఇక్కడ చిరు నవ్వుల తోటను చూసాను . […]

Continue Reading

“సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 “సందేహ జీవనం” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డా॥కొండపల్లి నీహారిణి కోసుకొస్తున్న చీకట్లు మోసుకొస్తున్న ఇక్కట్లు మెలికల నాలుకకు మొలకలు బుట్టిస్తూ అబద్ధాలే అల్లుకుపోతున్న నేలమీద కళ్ళూ, కాళ్ళూ ఆన్చిన బతుకయ్యి శిక్షాస్మృతి పుటలలో మనం అక్షరాలమైపోయినం. సమయనియమాలు లేని ప్రయాణాలను గమ్యం చేర్చే పనిలో కాలాన్ని అధీనం లోకి తెచ్చామనుకునే అపరాధులం. సత్యాసత్యాల జగత్తు కల్తీలో జీవితాల్ని బింబమానం చేస్తుంటే కారణాలను చూడక ప్రతిఫలనాలనే చూసే ఆక్రమిత జీవులం చల్లగాలికీ పిల్ల […]

Continue Reading

చిన్నిదీపం (‘పరివ్యాప్త’ కవితలు)

చిన్నిదీపం  (‘పరివ్యాప్త’ కవితలు) -డా. సి. భవానీదేవి మార్పు అనివార్యమైనా… ఇంత అసహజమైనదా ? మనకు ఇష్టం లేకుండా మనం ప్రేమించలేనిదా ? అయితే ఈ పొలాల మీద ఇంకా ఏ పక్షులు ఎగరలేవు ఏ పాములూ.. పచ్చని చెట్లూ.. ఇక్కడ కనిపించవు ఎటు చూసినా మనుషులే ! అమ్మకాలు, కొనుగోళ్ల మధ్య జరుగుతున్నది గ్రామాలక్లోనింగ్ ! ఒంటరి భూతం కోరలకి పట్టణాలే కాదు పల్లెలూ బలి ఇక్కడ తలుపుల్నీ టీవీ యాంటీనాలు మూసేసాయి మానవ సంబంధాలు […]

Continue Reading
Posted On :

చేతులు చాస్తేచాలు!

 చేతులు చాస్తేచాలు!  – కందుకూరి శ్రీరాములు సూర్యుడు ఒక దినచర్య ఎంత ఓపిక ! ఎంతప్రేమ ! భూమిపాపాయిని ఆడించేందుకు లాలించేందుకు నవ్వులవెలుగులు నింపటానికి పొద్దున్నే బయల్దేరుతాడు భానుడు తల్లిలా – ఆత్మీయత ఒక వస్తువు కాదు ఒక పదార్థం అంతకంటే కాదు లోలోన రగిలే ధగధగ- వేల వేలకిరణాలతో నేలను  ఒళ్లోకి తీసుకొని నేలను ఆడించి పాడించి లాలించి బుజ్జగించి ముద్దాడి తినిపించి నిద్రపుచ్చి కూలికి వెళ్లిన తల్లిలా మళ్లీవస్తా అంటూ వెళ్లిపోతుంది పొద్దు! అరచేయి […]

Continue Reading
Posted On :

వెలుతురు పండుటాకు

వెలుతురు పండుటాకు  -నారాయణస్వామి వెంకటయోగి ఎక్కడినుండో, ఎడతెరపిలేకుండా దుఃఖధారలు కురుస్తున్నాయి కాలమెన్నడూ  మాన్పలేని   గాయాలపై   శతాబ్దాల తర్వాత  సుడిగాలుల్లా వీస్తున్న పలకరింపుల్లో దుమ్ము కొట్టుకుపోతోంది మసకబారిన జ్ఞాపకాల మీదినుంచి  గతంపొరల్లో దాగిన శిలాజాల కన్నీటి చారికలనీ , గాజుపెంకుల నెత్తుటి మరకలనీతడుముకోవాలి,  అరచేతులతో మునివేళ్లతో గీరుకుపోయేదాకా, కొత్త గాయాలై మళ్ళీ మళ్ళీ  గుచ్చుకుపోయేదాకా  ఎవరికి  ఏమి తెలుసని    మళ్ళీ మళ్ళీ చెప్పుకోవడం ఎవరు వింటారనీ  ఎవరికేమి కొత్తగా  అర్థమవుతుందనీ  రాళ్లకు మళ్ళీ మళ్ళీ తలలు మోదు కోవడం  ఎవరిని అడగొచ్చిప్పుడు ఏది ఎందుకు జరగలేదో ఎవరికి వివరించగలమిప్పుడు ఏది ఎందుకు ఎన్నటికీ అర్థం కాదో    మౌనహననాలైన జ్ఞాపకాలు ఇప్పుడు కొత్తగా […]

Continue Reading
k.rupa

“మరోజన్మ” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 “మరోజన్మ” (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – రూపరుక్మిణి.కె వొళ్ళంతా బాలింత వాసనలు మాసిన జుట్టు,  ముతక బట్ట అర అరగా ఆరబోసిన ఆడతనం తానమాడి పచ్చి పుండుని ఆరబెట్టుకునే అమ్మని చూసి ముక్కుపుటలిరుస్తూ.. నొసటితో వెక్కిరిస్తూ.. పుట్టిన బిడ్డకి బారసాల చేస్తున్నం కదా!! రక్తాన్ని అమృతంగా పంచేటి పాలిండ్ల బరువుల సలపరింతలనెరుగుదువా..!! పసిబిడ్డ నోట కరిచిన చనుమొనలకు నలుగురి చూపు తగిలిందంటే ఎట్లా!! బొడ్డు తాడు తెంపుకున్న పేగు సాగివేళ్ళాడే పొట్టకు నడికట్టు […]

Continue Reading
Posted On :

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -డి. నాగజ్యోతిశేఖర్ నిద్ర కూడా ఓ కలే నాకు…. ఒక్కసారైనా….. పనిసూరీడు చొరబడని విశ్రాంతిచీకటిని కనుపాపల్లో నింపుకోవాలి! తుషార బిందు పరిశ్వంగానికి  మైమరచి వాలే తృణపుష్పంలా నిద్దుర స్పర్శ కనురెప్పలపై భారంగా ఒరగాలి! ఎగిరిపోతున్న సాయంత్రం పిట్టల్ని కాఫీ కప్పులోకి ఆహ్వానించి వెలుగు కబుర్లు చెప్పాలి! రాత్రి చెట్టుపై నక్షత్రమై వాలి ఇష్టమైన అక్షరాలను కౌగలించుకోవాలి! పారేసుకున్న కలలనెమలీకల్ని రెక్కలుగా చేసుకొని ఏకాంతంలోకి ఎగిరెళ్ళాలి! […]

Continue Reading

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-7 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి అల్లకల్లోలమౌతున్న సాగరాల్లో మానవ వినాశనానికి జరిగే ప్రయత్నాలూ వెన్న చిలికినట్లు నీటిబిందువుల్ని పగలగొట్టే ప్రయత్నాలూ ఆవిష్కరణలు జరిగేది మొట్టమొదట ప్రశాంత సముద్రగర్భంలోనే! జలచర జీవనాన్ని విధ్వంసం చేస్తూ నీటి అడుగున విచ్చుకుంటున్న బడబానలం ఎక్కడ మొదలైందో తెలుసుకోలేక తనని తానే చుట్టుకొంటున్న సుడిగుండాల్ని నియంత్రించుకోలేని సంచలన సందర్భాల్ని సముద్రగర్భ ఆయుధ ప్రయోగాల్ని ఉధృతమౌతున్న ప్రకంపనాల్ని ఎగసిపడుతూ అశాంతి ప్రతిబింబిస్తున్న తరంగాల్ని జలాంతర్భాగాన జీవరాసుల్ని అతలాకుతలం […]

Continue Reading

ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

 ఆ దారి సరిచేసుకుంటూ (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – చెళ్ళపిళ్ళ శ్యామల మబ్బు చాటు నుంచే సూరీడు రాత్రి జరిగిన ఘటనను పరిశీలిస్తున్నాడు అవును! నిన్న రాత్రి మళ్ళీ యిక్కడో  ” కాకరాపల్లి” కనిపించింది ! ఉదయాన్నే పోలీసుల బూట్ల  చప్పుడుతో ఊరు నిద్ర లేచింది! బాధితులకండగా ఊరూరా…… ర్యాలీలు,….. సమావేశాలు కవుల కలాలు కత్తులు దూసాయి నేను మాత్రం అక్కడి నుంచీ  కదిలాను ! జాబిలి జోల పాడుతున్న  వేళ ఊరంతా […]

Continue Reading

మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

మా యింటి ఎనగర్ర (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -కూకట్ల తిరుపతి ఇప్పటికీ… ఊర్లల్లా! మంచికీ చెడ్డకూ దొడ్లెకు గొడ్డచ్చిన యాళ్ల ఇంట్ల కొత్త కోడలడుగు వెట్టిన యాళ్లంటరు ఓ అంకవ్వా! నువ్వయితే… మా నాయన కనకయ్య యేలు వట్టుకొని అమృత ఘడియల్లనే ఇంట అడుగువెట్టుంటవు గందుకేనేమో! మా లేకిడి అయ్యకు ఇగ ముట్టిందల్లా ముచ్చమయ్యింది పట్టిందల్లా పగుడమయ్యింది తొక్కుడు బండంత నీ ఓపికకు మొక్కాలె పందికొక్కుల్లాంటి పెత్తందార్ల పంటికింద రాయిలా ఊళ్లె అన్నాలాలకు అడ్డువడుకుంట ఉగ్గుర నరసిమ్ముడయిన […]

Continue Reading
Posted On :
rama rathnamala

పల్లె ముఖచిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

పల్లె ముఖ చిత్రం (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – రామా రత్నమాల నీరవ నిశీధి వేళ జలతారు చంద్రిక వెలుగులో మెరుస్తూ హేమంత హిమ సుమజల్లులో తడిసే  అందచందాలు సప్తవర్ణ శోభిత హరివిల్లు హొయలన్నీ భువికేగి రంగవల్లులై విరిసిన ముంగిళ్ళు పాలికాపు పొలికేకతో పొలాల వైపు పయనించే పద సవ్వడులు రజని చెక్కిలిపై జాబిలి వెన్నెల సంతకమద్దే వేళ కష్ట సుఖాల కలబోతలు శ్రమ జీవన సౌందర్యాన్ని చాటే జానపద జావళీలు మదిని […]

Continue Reading
Posted On :
sailaja kalluri

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)

ఖాళీలు పూరించాలి (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) – డాక్టర్. కాళ్ళకూరి శైలజ ఉపగ్రహం కన్నుకు దొరకని ఉపద్రవం మాటు వేసింది. ఊపిరాడనీయని మృత్యువు వింత వాహనం ఎక్కి విహార యాత్రకు వచ్చింది. బ్రతుకు మీద ఆశ నాలుగ్గోడల మధ్య బందీ అయింది.  ప్రియమైన వారి శ్వాస ఆడేందుకు పరుగులు తీసి  అలిసిన గుండెలు, కూర్చున్న చోటే కలత నిద్దర్లోకి జారి మందుల పేర్లు పలవరిస్తూ ఉలిక్కిపడి లేస్తున్నాయి.  ప్రాణం కోసం ఇంటి పునాదులుకుదువ పెట్టినప్పుడు, కళ్ళలో దైన్యం కరెన్సీ నోట్లను   తడిపేస్తుందిమరణం నల్లని […]

Continue Reading

“కేశోపనిషత్ “

 “కేశోపనిషత్ “ – మందరపు హైమవతి పచ్చకాగితాల కట్ట చూచినా పసిడి కణికలు కంటబడినా చలించదు నా హృదయం అరచేతి వెడల్పున్న పొడుగు జడల అమ్మాయిల్ని చూస్తే చాలు మనసులో ఈతముల్లు గుచ్చుకొన్న నరకయాతన దువ్వెన పెట్టినా పెట్టకున్నా ప్రతిరోజూ నేల రాలుతున్న కేశరాజాలను చూసి దిగులు మేఘాలు కమ్మిన కన్నీటి ఆకాశం నా మానసం ఏదైనా జబ్బు చేస్తే శిరోజపతనం సహజం ఏజబ్బు లేకున్నాతల దువ్వుకొన్నప్పుడల్లా ఊడిపోతున్నకురులన్నీ కూడబలుక్కుని జీవితం క్షణభంగురమన్నపాఠాన్ని చెంప మీద చెళ్ళున […]

Continue Reading
Posted On :

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు)

మార్కెట్ (‘పరివ్యాప్త’ కవితలు) -ఓల్గా మార్కెట్ ఓ సమ్మోహనాస్త్రం తళుకు బెళుకు వస్తువుల భీభత్స సౌందర్యపు కౌగిళ్ళ బిగింపుల గిలిగింతల పులకింతలతో మనల్ని ఊపిరి తీసుకోనివ్వదు ఒక్కసారి అటు అడుగు వేశామా మార్కెట్ మార్ఫియా ఇంట్రావీనస్ లో ఎక్కుతుంది కొను కొను ఇంకా కొను ఇంకా ఇంకా ఇంకా కొను సరుకులు బరువైన కొద్దీ మనసు తేలికవుతుంది ఇప్పుడు మనం మార్కెట్ లేకపోతే మనుషులం కాదు కొనుగోలు శక్తి ముందు ఏ బలమైనా బలాదూరవుతుంది **** ఇప్పుడు […]

Continue Reading
Posted On :

ముందస్తు భయం( కవిత)

ముందస్తు భయం( కవిత) -సాహితి ప్రపంచానికి జ్వరమొచ్చింది. ఏ ముందుకు చావని వింత లక్షణం వణికిస్తోంది. హద్దులు లేకుండా స్వచ్ఛగా పరిసారాన్ని సోకి ప్రాణం తీసే ఓ వైరసు కు భయపడ్డ మానవాళికి చావు భయంపట్టుకుంది. జీవితంలో తొలిసారిగా బతుకు భయాన్ని తెలియచేస్తూ వీధులు తలుపులు మూసి మూతికి చిక్కాన్ని తొడుక్కుమని జీవితాలకి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తుంటే ఇళ్లు సంకెళ్లుగా మారి బంధాలన్ని ఏకాంత ద్వీపాలుగా మార్చి భద్రత బోధిస్తున్నాయి. ఏ వైపు నుంచి గాలి […]

Continue Reading
Posted On :

నిర్గమించిన కలలు (కవిత)

నిర్గమించిన కలలు (కవిత) -సుజాత.పి.వి.ఎల్ నిరీక్షణలో నిర్గమించి..కలలు మరచికలత నిదురలోకలవరపడుతున్న కనులు బలవంతంగా రెప్పలు వాల్చుతున్నాయి..ముళ్ళతో ముడిపడిన నా జీవితం..ఖరీదైన కలలు కనే సాహసం చేయగలదా!?సంతోషాలన్నీనీతో పాటే రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే..పెదవులపై చిరుదరహాస దివిటీని వెలిగిచడం ఎలా!?నా కళ్ళలో కన్నీటి చారికలు కనిపించకూడదన్నావు..నువ్వే కనిపించనంత దూరాన దాగున్నావు..నీవు లేని భూతలంనాకు శూన్యాకాశమని మరిచావు..అందుకే..నిన్ను చేరలేని దూరాన్ని తుడిచేస్తూకళ్ళమాటు దాగిన జ్ఞాపకాల ఆణిముత్యాల తలపులనుఆఖరిసారిగా తిరగేస్తున్నాయి అరమోడ్పు కనులు..! ***** సుజాత.పి.వి.ఎల్పేరు సుజాత.పి.వి.ఎల్. వృత్తి హిందీ టీచర్. సికిందరాబాద్ లో నివాసం. కవితలు, […]

Continue Reading
Posted On :

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత)

యుద్ధం ఒక గుండె కోత-6 (దీర్ఘ కవిత) -శీలా సుభద్రా దేవి దేశాలన్నిటినీ పెంపుడు జంతువుల్ని చేసి యింటిచుట్టూ కాపలాగా పెట్టుకొని తిరుగులేని నియంతృత్వ భావనతో ఆదమరచి నిశ్చింతగా పెంపుడు జంతువులకు గారడీ ఆటలు నేర్పి కాలాన్ని కొనగోట నిలిపి దానిమీద భూగోళాన్ని బొంగరంగా తిప్పాలని అహంకిరీటం ధరించి రింగుమాష్టరువి కావటమే కాక జగన్నాటక సూత్రధారుడివి అనుకున్నావు నియంతవి కావటానికై క్షుద్రబుద్ధితో నువ్వు నేర్పిన విద్య లక్ష్యం తప్పి నీ పైనే ప్రయోగింపబడేసరికి మకుటం జారేసరికి తల్లడిల్లి […]

Continue Reading

షార్ట్ ఫిలిం (కవిత)

షార్ట్ ఫిలిం ( కవిత) -సాహితి భూమిప్పుడు చావు వాసననుకమ్మగా పీల్చుకుంటుంది. ఆకాశం, శవాల మౌన రోదననుఆశ్వాదిస్తుంది. గాలి,మనిషిని వెక్కిరిస్తూ..చోద్యం చూస్తుంది. నిప్పు,నవ్వుతూ దేహాల్నిఆవాహనం చేసుకుంటుంది. నీరు, నదుల్లో హాయిగా శవాలకుచివరి స్నానం చేయిస్తుంది. శిశిరం,శ్మశానాల్లో బతుకు ఆశల్నినిర్దాక్షిణ్యంగా రాలుస్తుంది. దినమిప్పుడు ఆర్తనాదం తో మొదలై మృత్యుఘోషతో ముగుస్తుంది. ఎవరెప్పుడు చావుగీతం రాసుకుంటారో తెలియనికాలమిది. బిడ్డా.! జీవితం సీరియల్ కాదురా..!ఇప్పుడో షార్ట్ ఫిలిం. ***** కె.మునిశేఖర్కె.ముని శేఖర్ కవి, రచయిత. నివాసం గద్వాల్ జిల్లా నారాయణపురం.

Continue Reading
Posted On :
sudhamurali

కుమ్మరి పురుగు (కవిత)

కుమ్మరి పురుగు -సుధామురళి పరపరాగ సంపర్కం’నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. గడ్డ కట్టించే చలుల వలయాలు లేవువేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్పఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవుమారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్పఅవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదునిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు తప్ప ఏ అచేతనత్వపు నీడలూ కానరావునిశిని ఎరుగని చీకటి వెలుగులు తప్పఏ ఏ మౌనభాష్యాల వెక్కిరింతలూ పలకరించవునివురుగప్పిన నిశ్శబ్దపు స్పర్శ తప్పఏ ఏ ఏ కార్యాకారణ సచేతన ఫలితాలూ ప్రకటించబడవుధైర్యపు దూరత్వ భారత్వం తప్ప అందుకే….పరపరాగ సంపర్కంనాలోనుంచినా……లోలోనికి….. […]

Continue Reading
Posted On :

నివారణే ముద్దు ( కవిత)

నివారణే ముద్దు( కవిత) -జినుకల వెంకటేష్ కాంతిని కమ్మినకరిమబ్బు లాగకరోనా క్రిమిదేహాల్లో దాగివున్నది క్షణ క్షణంకరోనా కలవరంతొడిమతో సహా తుంచేస్తుందిమనోధైర్య కుసుమాన్ని పిరికితనంతోవాడిపోవడమెందుకు రాలిపోవడమెందుకుటీకా వసంతమై వచ్చిందిగాచిగురించాలి మెండుగాపుష్పించాలి నిండుగానివాళుల దాకా వద్దునివారణే ముద్దు ***** జినుకల వెంకటేష్జినుకల వెంకటేష్ కవి, రచయిత. నివాసం కరీంనగర్.

Continue Reading
Posted On :

కాసింత ఉపశమనం (కవిత)

కాసింత ఉపశమనం (కవిత) -గవిడి శ్రీనివాస్ అలసిన దేహంతో మేలుకుని ఉన్న రాత్రి తెల్లారే  రెప్పలు  వాల్చి నవ్వులు  పూసిన  తోటలో ఉపశమనం పొందుతుంది . మబ్బులు ఊగుతూ చెట్లు వేలాడుతూ పూవులు ముద్దాడుతుంటాయి . కొన్ని క్షణాలు ప్రాణాలు అలా లేచి పరిమళం లోకి  జారుకుంటాయి . గాలి రువ్విన బతుకుల్లో చీకటి దీపాలు వొణుకుతుంటాయి . ఏదీ అర్ధం కాదు బతుకు రెక్కల మీద భ్రమణాలు జరుగుతుంటాయి . నేటి దృశ్యం రేపటి ఓ […]

Continue Reading

నానీలు (‘తపన రచయితల గ్రూప్’ నానీల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

నానీలు (‘తపన రచయితల గ్రూప్’ నానీల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -షేక్ మహమ్మద్ షఫీ కష్టపడేతత్వంకనుమరుగు !ఉచితాల కోసంజనం పరుగు!! ***** షేక్ మహమ్మద్ షఫీనా పేరు షేక్ మహమ్మద్ షఫీ. నేను ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో Health educator(ఆరోగ్యబోధకుడు) గా పనిచేస్తున్నాను. మాది అనంతపురం. కవితలు రాయడం నా హాబీ.  నా కవితలు కొన్ని వివిధ ఫేస్బుక్ గ్రూపులలో విజేతలుగా నిలిచాయి.

Continue Reading

నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత)

నిప్పు కణికలై (‘తపన రచయితల గ్రూప్’ కవితల పోటీలో ‘ప్రథమ బహుమతి’ పొందిన కవిత) -వాడపర్తి వెంకటరమణ న్యాయానికి నిలువెల్లా సంకెళ్ళు వేసి అన్యాయం తురగమెక్కి వికటాట్టహాసంతో విచ్చలవిడిగా స్వైరవిహారం చేస్తున్నప్పుడు ధర్మాన్ని ధైర్యంగా గోతిలో పూడ్చేసి అధర్మం అవినీతి చెంతన ధ్వజస్తంభమై దర్జాగా నిలుచున్నప్పుడు మంచితనాన్ని అథఃపాతాళానికి తొక్కేసి చెడుగాలి జడలువిప్పి రివ్వుమంటూ ఉన్మాదంతో విరుచుకుపడుతున్నప్పుడు నువ్వు ఎక్కుపెట్టి వదిలిన ప్రశ్నల శరాలు అన్యాయ అధర్మ చెడుగాలుల గుండెల్లోకి జ్వలించే నిప్పు కణికలై దూసుకుపోవాలి! ***** […]

Continue Reading

కవిత్వం ఎలా ఉండాలి? (కవిత)

కవిత్వం ఎలా ఉండాలి? -చెళ్లపిళ్ల శ్యామల కవిత్వానికి చేతులు ఉండాలిపక పక నవ్వే పాల బుగ్గలనిఎంగిలి చేసిన  కందిరీగలనితరిమి కొట్టే చేతులుండాలి కిలకిల నవ్వుల పువ్వులనికాలరాసే కాల నాగులనిఎదురించే చేతులుండాలి తలరాతని  తల్లకిందులు  చేసేతోడేళ్లని  మట్టుబెట్టే చేతులుండాలి ఆపదలో  అండగా నిలిచిఅన్యాయాన్ని   ధైర్యంగా ఎదురించేచేవగల చేతులు ఉండాలి కవిత్వానికి  కాళ్ళు ఉండాలికన్నీటి కథలని  కనుక్కుంటూమట్టి బతుకులని తెలుసుకుంటూగూడేల  వెతలని  వెతుక్కుంటూ… కాళ్ళుమైదానం నుంచి మట్టిలోకిమట్టి  లోంచి అరణ్యంలోకినడుచుకు పోవాలి కవిత్వానికి చూపు ఉండాలివాస్తవాలను వెతికి పట్టుకో గలనేర్పు […]

Continue Reading