image_print

ఆరాధన-3 (ధారావాహిక నవల)

ఆరాధన-3 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి హూస్టన్ లో సాండల్-వుడ్స్ సిటీలోని మా స్టూడియోలో పన్నెండేళ్ళగా నిబద్దతతో శిక్షణ పొందుతున్న సౌమ్య, ప్రియాంక లు కూచిపూడి రంగప్రవేశం’ కార్యక్రమాలకి.. ఆరు నెల్లగా రేయింబవళ్ళు ప్రాక్టీస్ లు చేస్తున్నారు.  వారి కుటుంబాలు కూడా కళల పట్ల, నా పట్ల గౌరవంగా మసులుకుంటారు. ‘రంగప్రవేశ ప్రదర్శన’ విషయంగా కూడా అన్ని పద్దతులు పాటిస్తారు. రెండువారాల పాటు ఇండియా నుండి వచ్చిన వాద్య  బృందంతో రిహార్సల్స్ నిర్విఘ్నంగా జరిగాయి. నా నృత్య […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -3 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 3 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద పూర్ణ జలంధర్ దగ్గర రెండువేలు అప్పుతీసుకున్నాక, వడ్డీ ఎప్పటిలానే నెలకు పది శాతం, భగర్తికి వెయ్యిరూపాయలు కట్టేసాడు. జలంధర ప్రభుత్వ స్టాంప్ డ్యూటీకని వందరూపాయలు ఉంచేసుకున్నాడు. పూర్ణ వలస కూలీగా ఆంధ్రా వెళ్ళిపోడానికి పత్రం రాసిచ్చాడు. దారిఖర్చుల కింద జలంధర్ మరో రెండు వందలు ఉంచుకున్నాడు. తన ప్రయాణానికి బట్టలు, ఒక […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-2

సస్య-2 – రావుల కిరణ్మయి అపురూపం (పదివారాల  చిరు  నవల  రెండవ పదం) (ఉపాధ్యాయినిగా పనిచేస్తున్న సస్య ఆ రోజున తరగతిలో బోధన చేయలేక బాధతో కుంగిపోవడం చూసి వారి ప్రధానోపాధ్యాయులు అడగడంతో సస్య చెప్పడం మొదలు పెట్టింది.ఆ తరువాత) ***           అందువల్ల మీరందరూ మీ మీ తరగతుల విద్యార్థులను తీసుకొని గ్రంథాలయానికి వెళ్ళిరండి. అక్కడ మన విద్యార్థులకు అవసరమైనవి ,ఇంకా ఏవి కావలసి ఉన్నాయో చూసి మన పాఠశాల […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-7 హారతి పళ్ళెం

కాదేదీ కథకనర్హం-7 హారతి పళ్ళెం -డి.కామేశ్వరి  రెండు రోజుల ముసురు తరువాత ఊర్లో సూర్యడుదయించాడు. తెల్లారి సూర్యుడ్ని చూడగానే జనం సంతోషించారు. సంతోషించని దేవరన్నా వుంటే పూజారి మాధవయ్య ఒక్కడే. తెల్లారకుండా వుంటే ! సూర్యు డుదయించకుండా వుంటే! ఆ ముసురు ప్రళయంగా మారి యీ వూరు వాడ, యీ జగత్తుని ముంచేత్తేస్తే …..ఏ బాధ వుండదు. డబ్బు సంపాదించాలి – దినుసులు కొనాలి – వండాలి కడుపు నింపుకోవాలి , మానం కప్పుకోవాలి, పెళ్ళాడాలి, పిల్లల్ని […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-31 పొగచూరిన సంస్కృతి

పేషంట్ చెప్పే కథలు – 31 పొగచూరిన సంస్కృతి -ఆలూరి విజయలక్ష్మి నైటీ వేసుకుని సోఫాలో కూర్చుని రిమోట్ కంట్రోల్ మీటల్ని నొక్కుతూ కాసేపటి కోసారి టి.వి. ఛానెల్స్ ని మారుస్తూ దీక్షగా ప్రోగ్రామ్స్ ని చూస్తూంది స్నిగ్ధ. చివరకు జి.టి.వి. లో వస్తూన్న సినిమాను చూస్తూ అప్పటిదాకా అలంకార ప్రాయంగా చేతిలో వున్న పుస్తకాన్ని ప్రక్కన పడేసింది. వంట మనిషి టీపాయ్ మీద ఉంచిన గ్లాసులోని పాలు ఎప్పుడో చల్లారిపోయాయి. ఏ.సి. చల్లదనం శరీరాన్ని స్పర్శిస్తూంది. […]

Continue Reading

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి తల్లీకూతుళ్ళు మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చారు. ప్రయాణ బడలిక కారణమవ్వవచ్చు, మనేద కావచ్చు, ప్రఫుల్ల తల్లికి జ్వరం తగిలింది. ఏదన్నా ఎండిన రొట్టె ముక్క దొరికితే తింటున్నారు, లేకపోతే లేదు. కొన్ని రోజులకు తల్లికి జ్వరం ముదిరి విష జ్వరంగా మారి కాలాంతం చేసింది. ప్రఫుల్ల ఒంటరిదయ్యింది. ప్రఫుల్ల మీద లేనిపోని మాటలు చెప్పిన ఇరుగుపొరుగు వాళ్ళే దహన సంస్కారాలు చేసారు. […]

Continue Reading
Posted On :

అనుసృజన- వీరవనితా!

అనుసృజన వీరవనితా! హిందీ మూలం: ముక్త అనుసృజన: ఆర్ శాంతసుందరి స్త్రీ దేహం మీద నీలం గుర్తులు రక్తం గడ్డ కట్టిన వైనం అత్యాచారం జరిగిందని చెబుతోంది పాత కథల్లో ఎప్పుడూ బైటికి రాని కథ ఇది అత్యాచారానికి గురైన ప్రతి స్త్రీ శరీరం అందంగా ఉంటుంది ఆ కథల్లో అత్యాచారం చేసే వాడి దౌర్జన్యం ఉండదు అత్యాచారం చేసిన రాజుల గోళ్ళ గురించి గాని పళ్ళ గురించి గాని ఆ కథలు చెప్పవు ఆ కథల్లో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-21 శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-21  శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ  -డా. సిహెచ్. సుశీల “A phobia is an overwhelming and debilitating fear of an object, place, situation, feeling or animal ” ఫోబియా అనేది ఒక నిర్దిష్ట వస్తువు, పరిస్థితి లేదా కార్యాచరణ పై ‘నియంత్రించ లేని అహేతుకమైన’ భయం. నిజానికి కొందరికి ఈ భయం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క మూలాన్ని నివారించటం ఒకటే మార్గం. లేకుంటే ఒక్కొక్కసారి […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-21

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 21 – విజయ గొల్లపూడి జరిగినకథ:విశాల, విష్ణుసాయి కొత్తగా పెళ్లైన జంట. ఆస్ట్రేలియాలో పెర్మనెంట్ రెసిడెంట్స్ వీసాతో సిడ్నీ వచ్చారు. దేశం కాని దేశంలో బంధువులు ఎవరూ లేకపోయినా, క్రొత్త జీవన విధానానికి అలవాటు పడుతున్నారు. విష్ణు నూతన ఉద్యోగం నైట్ షిఫ్ట్ లో చేరాడు. విశాల నెల రోజులు వర్క్ ఎక్స్ పీరియన్స్ ప్రోగ్రాం టేఫ్ లో పూర్తి చేసింది. ***           కష్టాలు లేని […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 22

యాదోంకి బారాత్-22 -వారాల ఆనంద్ బతుకంటేనే పరుగు. పరుగంటేనే డైనమిజం. అమ్మ వొడిలో కన్ను తెరిచింది మొదలు చివర కన్ను మూసేంతదాకా పరుగే పరుగు.‘పరుగు ఆపడం ఓ కళ’ అన్నారెవరో. నిజమే పరుగు ఒక నాన్-స్టాటిక్ డై మెన్షన్. ఆ స్థితిలో వున్నవాడు పరుగు ఆపడమంటే స్టాటిక్ డైమెన్షన్ లోకి రావడమన్నమాట. అట్లా రావడం అంత సులభం కాదు. స్వచ్ఛందంగా రావడం మరీ కష్టం. ఎందుకంటే పరుగులో ఒక మజా వుంది. ఒక వూపు వుంది. నిలువనీయనితనం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 46

నా జీవన యానంలో- రెండవభాగం- 46 -కె.వరలక్ష్మి ‘‘పరిపూర్ణత సాధించిన మనసు అద్దంలా అన్నిటినీ స్వీకరిస్తుంది. కాని దేన్నీ తనతో ఉంచుకోదు’’ అంటారు స్వామి చిన్మయానంద. ‘‘జీవితాన్ని మరీ తీవ్రంగా తీసుకోవద్దు, ఎందుకంటే అది నిన్ను అనుక్షణం దహించివేస్తుంది’’ ఒక ఫ్రెంచి సూక్తి. ఇలాంటివన్నీ చదివేటప్పుడు ఆచరణ సాధ్యాలే అన్పిస్తాయి. కాని నిజజీవితంలోకి వచ్చేసరికి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’. 2009 జూన్ 26 న ప్రపంచ ప్రసిద్ధ పాప్ సింగర్ మైఖేల్ జాక్సన్ ఈ లోకాన్ని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 25

వ్యాధితో పోరాటం-25 –కనకదుర్గ మొత్తానికి మా ట్రిప్ ముగించుకుని వచ్చాము. వారం రోజులు వెళ్ళివచ్చే వరకు బాగా అలసిపోయాను. శ్రీనివాస్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. నేను పడుకుని నిద్రపోయాను. శ్రీనివాస్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను లేచి స్నానం చేసి రమ్మని నేను వచ్చేవరకు వేడి వేడి నూడుల్స్ చేసి పెట్టాడు. “నీకు అన్నం తినాలన్పించకపోతే కొద్ది కొద్దిగా ఇలాంటివి తింటూ వుండు, కొద్దిగానయినా శక్తి వుంటుంది.” అంటూ ఒక బౌల్ లో నూడుల్స్, స్పూన్ వేసి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-46)

నడక దారిలో-46 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ […]

Continue Reading

జీవితం అంచున – 22 (యదార్థ గాథ)

జీవితం అంచున -22 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి పీక్స్ ఆఫ్ స్ట్రెస్ ఎలా వుంటుందో నాకు అనుభవంలోకి తెచ్చింది అమ్మ. అమ్మ ఆరోగ్య పరీక్షలు, స్పెషలిస్ట్ అప్పాయింట్మెంట్లు, స్కాన్లు, అమ్మ పాస్పోర్ట్ రెన్యువల్, ఆ పైన వీసాకి అప్లై చేయటం…అన్నీ ఒత్తిడితో కూడుకున్న వ్యవహారాలే. అమ్మ వీసా మెడికల్స్ గురించైతే చెప్పలేని ఆందోళన. ఏ మాత్రం తేడాగా వున్నా వీసా రిజెక్ట్ అవుతుంది. ఇవన్నీ ఒక ఎత్తయితే, అమ్మను కనిపెట్టుకుని వుండటం, […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-20

నా అంతరంగ తరంగాలు-20 -మన్నెం శారద అద్భుతమైన రంగస్థల , సినిమా నటి తెలంగాణ శకుంతల! హైదరాబాద్ వచ్చిన కొత్త రోజులు! సోమాజీ గూడాలో మేం అద్దెకున్న ఇంటి పక్కనే ఉండేవారు తెలంగాణా శకుంతల. ఆఁ ఇల్లు ఈ ఇంటి కాంపౌండ్ వాల్ ని ఆనుకుని వున్న చిన్న రేకు షెడ్. ఈ మాట చెబుతున్నది కేవలం ఆఁ నాడు ఆమె ఆర్ధిక పరిస్థితి వివరించడం కోసమే. చులకన చేయడం కోసం ఎంతమాత్రం కాదు. ఆమె మహారాష్ట్రకు […]

Continue Reading
Posted On :

అమృత్ సర్ స్వర్ణ దేవాలయం

 అమృత్ సర్ స్వర్ణ దేవాలయం -డా.కందేపి రాణి ప్రసాద్ సిక్కులు పరమ పవిత్రంగా భావించే నగరం, స్వర్ణ దేవాలయం ఉన్న నగరం, సీతమ్మను కాపాడిన వాల్మికి ఆశ్రమం ఉన్న నగరం, జనరల్ డయ్యర్ ఊచకోతకు బలై పోయిన జలియన్ వాలా బాగ్ ఉన్న ప్రాంతం, పాకిస్తాన్ తో కలసి ఉన్న నగరం, పంజాబ్ రాష్ట్ర ఆర్థిక నగరం అమృత్ సర్ ను చూసే ఆవకాశం లభిస్తే ఎవరైనా వదులుకుంటారా. దేశంలోని ఏకైక సిక్కుల పవిత్ర గురుద్వారా అమృత్ […]

Continue Reading

యాత్రాగీతం-60 హవాయి- మావీ ద్వీపం (భాగం-1)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-1)రోజు -1 -డా||కె.గీత ప్రయాణం:మొదటిసారి హవాయిలో బిగ్ ఐలాండ్ ని చూసొచ్చిన అయిదేళ్ళకి గానీ మళ్ళీ హవాయికి వెళ్ళడానికి కుదరలేదు మాకు. అందుకు మొదటి కారణం వెళ్ళిరావడానికి అయ్యే ఖర్చు కాగా, రెండోది అందరికీ కలిసొచ్చే సెలవులు లేకపోవడం. ఏదేమైనా ఇక్కడ జూలై నెలలో కాస్త ఖరీదెక్కువైనా వేసవిలో పిల్లలందరికీ సెలవులు కావడంతో ఈ సారి అందరినీ తీసుకుని వెళ్ళాం. ఎలాగైనా కుటుంబంతా కలిసి వెళ్తే ఉండే ఆనందమే […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

అన్యాయం చేస్తే చావు తప్పదు

అన్యాయం చేస్తే చావు తప్పదు -కందేపి రాణి ప్రసాద్ అనగనగా ఒక అడవి ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలున్నాయి.  ఆ చెట్లనిండా పక్షులు గూళ్ళు కట్టుకుని కాపురం చేస్తున్నాయి. పావురాయి, పిచ్చుకలు, కాకులు, రామచిలుకలు, గోరింకలు ఇలా రకరకాల పక్షులకు నెలవుగా ఉండేవి. చెట్ల మీద గూళ్ళు కట్టుకున్న పక్షు లన్నీ జాతి భేదం మరచి అన్యోన్యంగా ఉంటాయి. ఒకరినొకరు ఆనందంగా పలకరించు కుంటాయి.           పొద్దున్న లేవగానే ఎవరి పిల్లలకు వాళ్ళు […]

Continue Reading

పౌరాణిక గాథలు -22 – నమ్మకము – శబరి కథ

పౌరాణిక గాథలు -22 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి నమ్మకము – శబరి కథ ఆమె చాలా సామాన్యమైన స్త్రీ. కాని, ఆమె నమ్మకం చాలా గొప్పది. ఆ నమ్మకంతోనే ఆమె జీవితంలో అసాధ్యమైనదాన్ని సాధ్యామయినదాన్నిగా చేసుకోగలిగింది. ఆమె ఎవరో కాదు శబరి. ఆమె కథ భారతీయులందరికీ తెలుసు. శబరి అనగానే ఆశ్రమం తలుపు దగ్గర ఎవరి కోసమో ఆతృతతో ఎదురు చూస్తూ నిలబడిన ఒక వృద్ధురాలి చిత్రం మన మనస్సులో మెదులుతుంది. అప్పుడు శబరి చాలా చిన్నపిల్ల. […]

Continue Reading

ఆరాధన-2 (ధారావాహిక నవల)

ఆరాధన-2 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి           ‘బే-పోర్ట్ ఆసియన్ కమ్యూనిటీ’ వారి ప్రతిపాదనకి అంగీకారం తెలిపాను. మియా ఆనందానికి అంతు లేదనడానికి నిదర్శనంగా కమ్యూనిటి హాల్ ని డాన్స్ మరియు యోగా స్టూడియోగా మార్చి, అవసరమయిన హంగులన్నీ కూర్చి ఓ అధునాతన బ్యాలెట్ స్టూడియోలా తయారు చేయించారు అభినవ్, మియా దంపతులు. ‘అర్చనా ఫైన్-ఆర్ట్స్’ (బే-పోర్ట్ ఆర్ట్స్ స్టూడియో) అని నామకరణం చేసి ఫ్లైయర్స్ వేసి, సోషల్ మీడియా మాధ్యమాల్లో […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -2 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 2 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద ముందు చెప్పిన సంఘటన జరిగిన ఏడాదిలోగా మరో కుటుంబం గమడా రోడ్ కి వచ్చి చేరింది. అది జహంగీర్ కుటుంబం. రాయపూర్ రైల్వే స్టేషన్ లో, అక్కడి నుండి వెళ్ళే  పాసెంజర్, గూడ్స్ ట్రెయిన్లలలో జహంగీర్ చిన్న చిన్న దొంగతనాలు చేస్తాడు. రైల్ రోడ్ పాసెంజర్స్ వద్ద స్లిప్పర్లు, చెప్పులు, బాగ్ […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-1

సస్య-1 – రావుల కిరణ్మయి స్నేహం  (పదివారాల  చిరు  నవల  తొలి  పదం) *** కూరిమి గల దినములలో నేరము లెన్నడును గలుగ నేరవు, మఱి యా కూరిమి విరసంబైనను నేరములే  తోచుచుండు నిక్కము  సుమతీ!           ప్రాథమిక  పాఠశాలలో  5వ తరగతి తెలుగు వాచకంలోని  “సూక్తి సుధ”పాఠంలోని ఈ పద్యం ఆ రోజు తాను బోధించడానికని పుస్తకం తెరిచింది,కానీ భావోద్వేగంతో గొంతు పెగలడంలేదు సస్యకి. శతకకారుడు బద్దెన తను అనుభవించి […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-6 బల్ల చెక్క

కాదేదీ కథకనర్హం-6 బల్ల చెక్క -డి.కామేశ్వరి  కోటేశ్వరరావు కోటికి పడగలెత్తిన వాడు. ఆయనకి అందమైన భార్య వుంది. ఆరు ఫ్యాక్టరీలున్నాయి, ఆరు భవంతులున్నాయి . ఆరు కంపెనీలలో షేర్లున్నాయి. ఆరు బ్యాంకుల్లో ఎకౌంట్లున్నాయి, అరవై లక్షలున్నాయి, ఆరు కార్లు , అరవై మంది నౌకర్లు, ఆరువేల మంది పనివాళ్ళు అయన చేతి కింద వున్నారు. ఆయనింట్లో ఆరు ఎయిర్ కండిషన్లు బెడ్ రూములు , ఆరు రంగుల ఫోన్లు, ఆరు టెలివిజన్లు , ఆరు టేపు రికార్డులు….. […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-30 మెరుపు

పేషంట్ చెప్పే కథలు – 30 మెరుపు -ఆలూరి విజయలక్ష్మి మిట్టమధ్యాహ్నమయినా హేమంత శీతలచ్ఛాయా జగతిని ఆచ్చాదించేవుంది. “మేడం” శృతి చాంబర్ లోకి ఆదుర్దాగా ప్రవేసించాడో యువకుడు. అతని కళ్ళల్లో బెదురూ! ముఖం మీద చిరుచెమటలు! “యస్” అంటూ తలెత్తిన శృతి జీవన్ ని చూసి పలకరింపుగా చిరునవ్వు నవ్వింది. “మేడం! నేను ఆక్సిడెంట్ చేసాను. నా స్కూటర్ క్రింద ఒక కుర్రాడు పడ్డాడు.” ఏడుపు గొంతుకతో చెప్పాడు జీవన్. “ప్రమాదమైన దెబ్బలేం తగల్లేదు కదా!” అప్రయత్నంగా […]

Continue Reading

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి రాత్రి ఒకటవ ఝాముకి హరివల్లభ బాబు భోజనానికి వచ్చి కూర్చున్నాడు. ఇంటావిడ ప్రక్కనే కూర్చుని వడ్డిస్తున్నది. “ఆ కులత తిరిగి పోయిందా?” అడిగాడాయన. “రాత్రి పూట ఎలా వెళ్తుంది. ఈ రాత్రికి కోడలు అతిథి. ఇక్కడే వుంటుంది” అన్నది అత్తగారు. “అతిథి అయితే ఇంటికి బయట చావటి గదిలో ఉంచండి.” “చెప్పాను కదా ఈ రాత్రి వేళ ఎక్కడకీ పంపించనని. అంతగా పొమ్మనేటట్లయితే, […]

Continue Reading
Posted On :

అనుసృజన- ప్రవాహం

అనుసృజన ప్రవాహం హిందీ మూలం: రామ్ దరశ్ మిశ్ర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక పరిమళభరితమైన అల ఊపిరితో కలిసి అలా అలా వెళ్ళిపోతుంది ఒక కూనిరాగమేదో చెవులని అలవోకగా తాకుతూ ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. అదృశ్య రూపం ఒకటి స్వప్నంలా కళ్ళలో తేలి వెళ్ళిపోతుంది. ఒక వసంతం గుమ్మంలో నిలబడి నన్ను పిలిచి వెనుదిరుగుతుంది. నేను ఆలోచిస్తూ ఉండిపోతాను. అలని చుట్టెయ్యాలనీ స్వరాలని పోగుచేసుకోవాలనీ రూపాన్ని బంధించాలనీ వసంతంతో- ఒకటి రెండు నిమిషాలు నా గుమ్మంలో నిలబడరాదా […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-20 శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-20 శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం  -డా. సిహెచ్. సుశీల ” అనుమానాస్పదమైన జీవితం ఎప్పుడూ సుఖవంతం కాదు నిష్కలంకమైన హృదయాలు కలవటానికి అవకాశం ఉంటుంది కానీ పవిత్రత ఏమాత్రం లోపించిన హృదయాలు విడిపోతాయి దాంపత్య జీవితం సందేహాస్పదమైన దృష్టిలతో అనుమానం తో కూడిన అడుగులతో నడవలేదు”           నిఖార్సైన ఒకలాంటి ‘స్టేట్ మెంట్’ తో ప్రారంభమైన “ఒడిదుడుకులు ” అనే ఈ కథ శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం 1951, […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-20

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 20 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి నెల రోజులు కావస్తోంది. ఇద్దరూ క్రొత్త దేశంలో జీవన విధానానికి అలవాటు పడుతున్నారు. ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఆ నూతన జంట సమస్యలకు పరిష్కార మార్గాలను వెతుక్కుంటూ ముందుకు సాగుతు న్నారు. ***           మాతృదేశాన్ని, కన్నవారిని వదిలి, క్రొత్త దేశంలోకి అడుగిడినపుడు ఏ పని చేయాడానికైనా, కొంత తెగింపు, చొరవ కావాలి. తీసుకునే నిర్ణయం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 45

నా జీవన యానంలో- రెండవభాగం- 45 -కె.వరలక్ష్మి ఆ రోజు పూర్ణిమ. ఆకాశం మబ్బులు కమ్మి సన్నని జడివాన. పవర్ కట్. ఊరంతా నిశ్శబ్దం. అర్థరాత్రి – కిటికీ కవతల సన్నని పున్నమి వెలుగులో బండి, ఎడ్లు, నాలుగు టేక్సీకార్లు, ఆ వెనక టేకు చెట్లు, ఇంకా అవతల హైవే ఫ్లై ఓవర్ మీద వెళ్తున్న లారీల హారన్ల సన్నని మోత – ఒక చెయ్యి తిరిగిన చిత్రకారుడు గీసిన బ్లేక్ అండ్ వైట్ చిత్రంలా అద్భుతంగా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 24

వ్యాధితో పోరాటం-24 –కనకదుర్గ రాత్రి పడుకునేపుడు, నేనేం మాట్లాడకుండా ఏ గొడవ లేకుండా పడుకుందామను కున్నాను. “ఇంటికి ఎందుకు రాలేదు చెప్పు.” అని పదే పదే అడగసాగాడు. “ఊరికేనే, ఏం లేదు, చాలా రోజులయింది, అమ్మా, నాన్న దగ్గర ఉండి, వాళ్ళని మిస్ అవుతున్నాను. అందుకే…” ” అది కాదు, అసలు రీజన్ చెప్పు ఎందుకు రాలేదో.” ” ఏం కాలేదు, ఏం లేదు. ఒక్కరోజు మా ఇంట్లో ఉండాలనుకోవడం తప్పా?” ” అది కాదు, అసలు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-45)

నడక దారిలో-45 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నాచదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి […]

Continue Reading

జీవితం అంచున – 21 (యదార్థ గాథ)

జీవితం అంచున -20 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఎంతో ఉద్విగ్నంగా ఇల్లు చేరుకున్నాను. నా కలల్లో కనిపించే అమ్మకూ, నా కళ్ళ ముందున్న అమ్మకూ పోలికే లేదు. గంభీరమైన అమ్మ విగ్రహం శుష్కించి పోయి వుంది. ఈ రెండేళ్ళ కాలంలో ఆమెను వృద్దాప్యం, ఒంటరితనం కృంగతీసాయో లేక ఆమె మానసిక అస్వస్థత కారణంగా చిక్కి పోయిందో కాని చాలా బలహీనంగా వుంది. అమ్మ చిన్నబోయిన మొహంతో, చప్పిడి దవడలతో, ప్రాణం కళ్ళల్లో […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-19

నా అంతరంగ తరంగాలు-19 -మన్నెం శారద  నాకు  తెలిసిన వీరాజీ గారు! ఆయన వర్ధంతి సందర్బంగా… సినీనటుడు సుమన్ గారు జైలునుండి విడుదలయ్యాకా తనజీవితంలో జరిగిన వాస్తవాలు రాసేందుకు ఒక రచయిత కానీ రచయిత్రి కానీ కావాలని అడిగినప్పుడు ఎవరో నా పేరు సూచించారు. ఆయన నన్ను ఒకసారి తీసుకుని రమ్మని  ఆయనకీ చెప్పారు. నేను నిజానికి అలా వెళ్ళి రాయడానికి ఇష్టపడలేదు. నిజానికి నేను ఏ సినిమా నటుల్ని వెర్రిగా అభిమానించి వారి భజన చెయ్యను. […]

Continue Reading
Posted On :

దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర)

దారి పొడవునా సముద్రమే (శ్రీలంక యాత్ర) -డా.కందేపి రాణి ప్రసాద్ దేవశిల్పి, మహాద్భుత ప్రతిభాశాలి విశ్వకర్మ నిర్మించిన స్వర్ణలంకా నగరాన్నీ, భారత దేశ పటం కిందుగా చిన్న నీటి బిందువు ఆకారంలో ఉండే శ్రీలంక దేశాన్నీ, హిందూ మహా సముద్రంలో మణి మకుటంగా వెలిగిపోయే ద్వీపాన్ని చూడటానికి మేము ఈనెల 8వ తేదిన బయలు దేరాం. ఈ సంవత్సరం మాకు మంచి అవకాశం వచ్చింది. భారతదేశ పటం పైభాగాన ఉన్న కిరీట కాశ్మీరాన్ని, భారత దేశ పటం […]

Continue Reading

యాత్రాగీతం-59 అమెరికా నించి ఆస్ట్రేలియా (చివరి భాగం)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (చివరి భాగం) (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత మెల్ బోర్న్ – రోజు 3 (ట్రామ్ & సాహితీ మిత్రుల కలయిక) & రోజు- 4 (అమెరికా తిరుగుప్రయాణం)  మెల్ బోర్న్ లో మూడవ రోజున మధ్యాహ్నం వరకు యర్రా నది మీద బోట్ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

మాటలు – చేతలు

మాటలు – చేతలు -కందేపి రాణి ప్రసాద్ ఒక కుందేలు తన పిల్లలతో సహా బొరియలో నివసిస్తోంది. ఈ బొరియ చెట్టు కిందనే ఉన్నది. చెట్టు మీదుండే పక్షులన్నీ కుందేలుతో స్నేహంగానే ఉంటాయి. సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత పక్షులన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో కుందేలు కూడా వాళ్ళతో కబుర్లాడుతూ ఉంటుంది. ఇరుగు పొరుగు స్నేహాలు బాగుండా లని కుందేలు కోరుకుంటుంది.           కుందేలుకున్న నాలుగు పిల్లలు ఆటలు ఆడుతూ కొట్టుకుంటూ […]

Continue Reading

పౌరాణిక గాథలు -21 – దైవభక్తి – నందీశ్వరుడు కథ

పౌరాణిక గాథలు -21 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి దైవభక్తి – నందీశ్వరుడు కథ ద్వాపర యుగ౦లో శిలాదునుడనే పేరు గల శివ భక్తుడు ఉ౦డేవాడు. అతడికి స౦తాన౦ లేదు. శివుణ్ని గురి౦చి తప్పస్సు చేశాడు. అతడి తపస్సుకి మెచ్చి శివుడు ప్రత్యక్షమయ్యాడు. పరమేశ్వరుణ్ని చూసిన శిలాదుడు ఆన౦ద౦తో పరవశి౦చిపోయాడు. “పరమేశ్వరా! నాకు స౦తాన౦ లేదు… నిన్నే నమ్ముకున్నాను. నీ య౦దు భక్తి గలిగి గుణవ౦తుడైన కొడుకు ఒకడు౦టే చాలు, ప్రసాది౦చు స్వామీ!” అని ప్రార్ధి౦చాడు. “శిలాదా! నీ […]

Continue Reading

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -1 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 1 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద లేళ్ళు అడవుల్లో, వనాల్లో ఉంటాయి. అడవిలో గడ్డి మేసి, ప్రవాహాల నీళ్ళు తాగి బతుకుతాయి. అవి ఏ రకంగానూ మనిషికి బాకీపడి లేవు. అయినా మనుషులు వాటిని వేటాడుతారు. మనిషి దురాశకు అంతం ఉందా? ***           డిసెంబర్ 2000 రెండో తేదీన భువనేశ్వర్ నుండి […]

Continue Reading
Posted On :

ఆరాధన-1 (ధారావాహిక నవల)

ఆరాధన-1 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నా మాట కూచిపూడి నాట్యకారిణిగా, సినీ నటిగా, దేశవిదేశాలు పర్యటించిన సాంస్కృతిక రాయ బారిగా గుర్తింపు పొంది, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మాస్టర్స్ డిగ్రీ విధ్యార్ధినిగా.. జీవితం ఓ కలలా సాగుతున్న సమయంలో వివాహం చేసుకుని 1980 లో అమెరికాలో అడుగు పెట్టాను.            సరికొత్త జీవితం, సరికొత్త పరిసరాల నడుమ, భిన్న సంస్కృతుల సమాజంలో జీవనం సాగిస్తూ.. అమెరికా  దేశంలో ఓ గృహిణిగా, తల్లిగా, […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-5 అరటి తొక్క

కాదేదీ కథకనర్హం-5 అరటి తొక్క -డి.కామేశ్వరి  నాలుగురోడ్ల జంక్షన్ దగ్గిర — బిజీ బజారు సెంటర్లో కోటమ్మ కిళ్ళీ కొట్టు ముందు కోటమ్మ — వీర్రాజు ఘోరాతి ఘోరంగా బూతులు తిట్టుకుంటూ జుత్తులు పట్టుకుని కొట్టు కుంటున్నారు. చుట్టూ చేరిన జనం ఏ గారడీనో, సర్కసో చూస్తున్నంత కుతూహలంగా , ఆనందంగా తిలకిస్తున్నారు ఆ పోట్లాట — “దొంగసచ్చినోడా– ఆడకూతుర్ని , దిక్కుదివాలం లేనిదాన్ని కిళ్ళీ బడ్డీ ఎట్టుకుని నాలుగు రాళ్ళు తెచ్చుకు గంజినీళ్ళు తాగుతంటే కల్లల్లో […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-19 శ్రీమతి పాకల చంద్రకాంతామణి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-19 శ్రీమతి పాకల చంద్రకాంతామణి  -డా. సిహెచ్. సుశీల ఆ నాటి రచయిత్రులు కాలక్షేపం కోసం కథలు రాయలేదని గతంలో చెప్పు కున్నాం. తన చుట్టూ ఉన్న సమాజంలోని స్త్రీలలో చైతన్యం కలిగించడం వారి ప్రధాన ధ్యేయం. పురుషుల మనస్తత్వం, ప్రవర్తనలో మార్పును కూడా వారు ఆశించారు. అయితే ఉపన్యాసం లాగానో, ఉపదేశం లాగానో, కేవలం పత్రికలో పేరు చూసుకోవడానికో, పేరు ప్రఖ్యాతులు పొందాలన్న తపనతోనో రాయలేదని సూక్ష్మంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అలాయైతే […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-29 నేనెవర్ని?

పేషంట్ చెప్పే కథలు – 29 నేనెవర్ని? -ఆలూరి విజయలక్ష్మి “నేనెవర్ని?” … ఇది ఒక తత్వవేత్త ఆత్మ జిజ్ఞాసతో వేసుకుంటున్న ప్రశ్న కాదు. ఒక ఋషి సత్తముడు జీవాత్మ, పరమాత్మల అన్వేషణలో వేసుకుంటున్న ప్రశ్న కూడా కాదు. ఒక సామాన్య యువతి తన జీవితాన్ని తరచి చూసుకుంటూ అంతులేని విషాదంతో వేసుకుంటున్న ప్రశ్న. ఒక స్త్రీ సమాజంలో, కుటుంబంలో తన ప్రతిపత్తి ఏమిటి? అని తర్కించుకుంటూ వేసుకుంటున్న ప్రశ్న. శాంతి మనసులో ఎనిమిదేళ్ళుగా అనుక్షణం ఈ […]

Continue Reading

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి ఇంటావిడ హరివల్లభ బాబు గదిలోకి వెళ్ళింది. ఆయన అప్పుడే నిద్రలేచి తువ్వాలు మీద నీళ్ళు చిలకరించుకుని, ముఖం తుడుచుకుంటున్నాడు. ఆయనను ముందు కొంచెం మచ్చిక చేసుకోవటానికి, “అయ్యో మిమ్మల్ని ఎవరు నిద్ర లేపారు? నేనందరికీ చెప్పా, గోలచేసి మిమ్మల్ని నిద్ర లేపొద్దని. అయినా నా మాట ఎవరు వింటారు?” అన్నది. “నా నిద్ర చెడగొట్టేదే నువ్వు. లేకపొతే ఎవరు లేపుతారూ? ఏదో […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-19

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 19 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణుసాయి పెళ్ళి కాగానే, సిడ్నీ ఆస్ట్రేలియా స్థిర నివాసులుగా వచ్చిన జంట. విశాల వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం రావడంతో టేఫ్ కాలేజ్ లో చేరింది. విష్ణుసాయి పరిస్థితులకి తగినట్లుగా ఒదుగుతూ, నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ టెస్ట్ లో పాసై, లైసెన్స్  సంపాదిం చాడు. ఇపుడు కారు తీసుకోవాలి. జాబ్ కన్సల్టెంట్ విష్ణు అనుకున్న డ్రీమ్ జాబ్ ఆఫర్ చేసింది. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 21

యాదోంకి బారాత్-21 -వారాల ఆనంద్ నాకూ మీకూ గాయాలకేం కొరత, కనిపించేవి మానిపోతాయి మనసు లోపలివి కొనసాగుతాయి తడి తడిగా గాయాల్ని గేయాలుగా గున్ గునాయిస్తూ తలెత్తుకు నడిస్తేనే బతుకు ఢంకా బజాయిస్తుంది ***           ఎనభయవ దశకం చివరి మూడు నాలుగేళ్ళూ నేను కాళ్ళకూ మనసుకూ చక్రాలేసుకు తిరిగాను. పెళ్ళి, అమ్మ అస్తమయం, ఇల్లు మారడం, మరో పక్క స్కూలు వీటి నడుమ పిల్లలకథలు రాయడం, మరో పక్క నా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 44

నా జీవన యానంలో- రెండవభాగం- 44 -కె.వరలక్ష్మి కథ 2007 ఆవిష్కరణ ఆ సంవత్సరం నందలూరులో జరుపుతున్నామని ఆహ్వానం వచ్చింది. జూన్ 12 సాయంకాలం సామర్లకోట వెళ్ళి తిరుమల ఎక్సప్రెస్ ట్రెయిన్ ఎక్కేను. దాంట్లో వైజాగ్ లో ఎక్కిన మల్లీశ్వరి, వర్మ, వేణు, చలం, జాన్సన్ చోరగుడి ఉన్నారు, నా టిక్కెట్ కూడా వాళ్ళే రిజర్వేషన్ చేయించేరు. అప్పటికి మా ఇంట్లో అగర్వాల్ స్వీట్స్ వాళ్ళు అద్దెకుండడం వల్ల నేను రకరకాల స్వీట్స్, హాట్స్ పేక్ చేయించి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-44)

నడక దారిలో-44 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం  ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి […]

Continue Reading

జీవితం అంచున – 20 (యదార్థ గాథ)

జీవితం అంచున -20 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ అలిగింది. కరోనా సోకితే అల్లకల్లోలమెంతోగాని అమ్మ అలిగితే నా మనసంతా అతలాకుతలం అయిపోతోంది. అసలు నాకేమీ నచ్చటం లేదు. నా భావాన్ని మీకు చెప్పటానికి నా భాషాపటిమ చాలటం లేదు. ఎప్పుడూ శాశించే అమ్మ, నేను ప్రశ్నించానని అలిగింది. ఫోనులో ఎంత పిలిచినా పలకదు. ఒంటరిగా వుంటే మోగే ఫోను వంక అభావపు చూపు చూస్తుంది. పక్కన మరెవరయినా వుంటే వాళ్ళను […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-18

నా అంతరంగ తరంగాలు-18 -మన్నెం శారద గుర్తుకొస్తున్నాయి ……. ————————- (ఇదివరకు ఇది నేను చెప్పిందే. కానీ ఇప్పుడు నాకు చాలా మంది కొత్త స్నేహితులు వచ్చారు. అదిగాక నేను వీటిని పుస్తకరూపంగా తీసుకొస్తే అందులో ఉంటుంది కదా అని మళ్ళీ చెబుతున్నాను. రావి శాస్త్రి గారితో వున్న ఒకే ఒక జ్ఞాపకం ఇది!) ———————– 1994 లో నేను కొందరి ఫెమిలీ ఫ్రెండ్స్ తో కలిసి కేరళ టూర్ వెళ్ళాను . తిరిగి వచ్చేసరికి నా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-58 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-19)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-19 మెల్ బోర్న్ – రోజు 3 మెల్ బోర్న్ సిటీ హైలాండ్స్ బోట్ టూర్ మర్నాడు మా ప్యాకేజీ టూరులో మేం ఎంపిక చేసుకున్న ప్రైవేట్ మెల్ బోర్న్ సిటీ టూరు క్యాన్సిల్ అవడంతో రోజంతా ఖాళీ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

సింహం మనోగతం

సింహం మనోగతం -కందేపి రాణి ప్రసాద్ అదొక టైగర్ సఫారీ. పేరుకు టైగర్ సఫారీ అని పేరు కానీ అందులో సింహాలు, ఏనుగులు, ఖడ్గమృగాలు ఎలుగుబంట్లు వంటి పెద్ద జంతువులన్నీ ఉంటాయి. స్వేచ్చగా ప్రశాంత వాతావరణంలో జీవిస్తుంటాయి. అని మనుషులు చెప్తారు కానీ నమ్మకండి. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే నేనొక సింహాన్ని, నా కథ చెబుతా వినండి.           నేనొక సింహాన్ని. సింహమంటే ఎవరు? అడవికి రాజు కదా! అడవిలో రాజులా బతికేదాన్ని. నన్ను […]

Continue Reading

పౌరాణిక గాథలు -20 – త్రిశ౦కు స్వర్గము – సత్యవ్రతుడు కథ

పౌరాణిక గాథలు -20 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి  త్రిశ౦కు స్వర్గము – సత్యవ్రతుడు కథ ‘త్రిశ౦కు స్వర్గ౦’ అనే పేరు విన్నా౦ కదూ…ఆ స్వర్గాన్ని ఎవరు ఎవరికోస౦ నిర్మి౦చారు… ఎ౦దుకు నిర్మి౦చారు… విషయ౦ ఇప్పుడు తెలుసుకు౦దా౦. పూర్వ౦ సూర్యవ౦శ౦లో ‘త్రిబ౦ధనుడు’ అనే పేరుగల రాజు ఉ౦డేవాడు. అతడి కొడుకు పేరు సత్యవ్రతుడు. సత్యవ్రతుడు త౦డ్రిలా గుణవ౦తుడు కాదు. అందర్నీ బాధలు పెడుతూ ఉండే వాడు. త౦డ్రి ఎన్ని విధాలుగా చెప్పినా అతడి తలకెక్కేది కాదు. ఒకరోజు ఒక […]

Continue Reading

కాదేదీ కథకనర్హం-4 రొట్టె ముక్క

కాదేదీ కథకనర్హం-4 రొట్టె ముక్క -డి.కామేశ్వరి  రైలు కీచుమంటూ ప్లాట్ ఫారం మీద ఆగింది. అంతవరకు నిద్ర పోతున్నట్టున్న ప్లాట్ ఫారం ఒక్కసారిగా మేల్కొంది. రైలు ఆగడం చూసి అంతవరకు చింతచెట్టు కింద గోటేబిళ్ళ ఆడుతున్న పెంటిగాడు, సిన్నిగాడు ఒక్క పరుగున వచ్చి గద్దల్లా వ్రాలారు రైలు దగ్గిర. అక్కడనించి వాళ్ళ ఆకలి పాట మొదలు “అమ్మా ఒక ముద్దపడేయి తల్లీ — బాబూ నిన్నకాడ నించి గంజి నీళ్ళు లేవు ఒక పైసయియ్యి బాబూ, సిన్న […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-28 దాహం

పేషంట్ చెప్పే కథలు – 28 దాహం -ఆలూరి విజయలక్ష్మి దాహం! వెఱ్ఱి దాహం! నోరు పిడచగట్టు పోతూంది. కళ్ళూ, కాళ్ళూ తేలిపోతున్నాయి. పళ్ళు బిగబట్టి, కళ్ళను బలవంతాన విప్పుతూ రిక్షా తొక్కుతున్నాడు వెంకటరమణ. వీధి కుళాయి కనపడగానే ప్రాణం లేచొచ్చింది. రిక్షా ఆపి కుళాయి తిప్పాడు. ఒక్క బొట్టు కూడా పడలేదు. ఉసూరుమంటూ దగ్గరకొచ్చాడు. “వెంకటరమణా!” అల్లంత దూరం నుంచి బిగ్గరగా పిలుస్తున్నారెవరో. కళ్ళనొకసారి తుడుచుకుని పరకాయించి చూసేలోగా ఆ మనిషి దగ్గరకొచ్చి సైకిలాపాడు. “ఒరేయ్! […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-18 ఆచంట కొండమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-18 “శ్యామల” – ఆచంట కొండమ్మ  -డా. సిహెచ్. సుశీల 1935 గృహలక్ష్మి పత్రిక జూన్ నెలలో ప్రచురింపబడిన ఆచంట కొండమ్మ రచించిన ” శ్యామల” కథ ఒక ‘ట్రయాంగిల్ లవ్ స్టొరీ ‘. ఆ రోజుల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఒక ఆశ్చర్యం. అదీ ఒక రచయిత్రి రాయడం అంటే సంచలనమే. ఆడపిల్లలు కాలేజీ చదువుల వరకు రావడం, పొరుగూరుకి వెళ్ళి చదవడం, అక్కడ ‘ప్రేమ’ చిగురించడం అనే కథాంశం […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-18

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 18 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియా లో పెర్మనెంట్ రెసిడెంట్స్ గా సిడ్నీలో అడుగు పెడతారు. క్రొత్త ప్రదేశంలో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ జీవితం సాగిస్తున్నారు. విశాలకి మొదటిసారిగా వర్క్ ఎక్స్పీరియన్స్ ద్వారా మొదటి జీతం డాలర్లలో సంపాదిస్తుంది. విష్ణు డ్రైవింగ్ లెసెన్స్ నేర్చుకుంటూ టెస్ట్ కి సిద్ధం అవుతున్నాడు. ***           మనస్సు స్థిమితంగా ఉన్నపుడే ఆలోచనలు, ఊహలు విహంగంలా […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి మొదటి భాగం           “ఫీ ఫీ…., ప్రఫుల్లా, ఓయ్ ప్రఫుల్లా” “వస్తున్నానమ్మా. ఇదిగో వస్తున్నా” “ఏమీటో చెప్పమ్మా” కూతురు దగ్గరకు వచ్చి అడిగింది. “ఘోస్ ఇంటికి వెళ్ళి ఒక వంకాయ తీసుకుని రా.” “నేను వెళ్ళనమ్మా. అడుక్కుని రావటం నాకు చేతకాదు.” “అయితే ఏం తింటావ్? ఇంట్లో ఏమీ లేదు.” “అడుక్కుని ఎందుకు తినాలి? వట్టి […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఇదిగో చూడండి!

అనుసృజన ఇదిగో చూడండి! హిందీ మూలం: నీలమ్‌ కులశ్రేష్ఠ అనుసృజన: ఆర్ శాంతసుందరి మట్టిరంగు సహ్యాద్రి కొండల మీద క్యాబ్‌ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం. సాపూతారా కొండలు మూడువేల అడుగులే అని అమ్మ ఎంత నవ్విందో, ”ఆహా! గుజరాత్‌ హిల్‌ స్టేషన్‌ ఎంత బావుంది. ఒక మట్టి దిబ్బని ‘హిల్స్‌’ అంటున్నారు” అంది వ్యంగ్యంగా. అమ్మ మాటలకి నాకు కోపం వచ్చింది. ‘ఏమైంది […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 20

యాదోంకి బారాత్-20 -వారాల ఆనంద్ ముగింపులేని ముసురుండదు-తెరిపి దొరకని కష్టముండదు “అలలు అలలుగా దశలు దశలుగా సాగుతున్న బతుకులో ఏ కాలపు సౌందర్యం ఆ కాలానిదే ఎప్పటి అవసరం అప్పటిదే..” అందుకే బతుకులో ఒక కాలం మంచిది మరొకటి చెడ్డది అంటూ వుండదు. కాలం ప్రవాహంలా సాగుతూనే వుంటుంది. మనమే ఓ క్షణం నిలబడతాం, మరో క్షణం పరుగెడుతాం.. ఇంకోసారి కూలబడతాం. తిరిగి లేస్తాం. జీవితమంటే ఇంతే మరి. ఆ దిశలో 1986 సంవత్సరం నాకు సంతోషాన్నీ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 43

నా జీవన యానంలో- రెండవభాగం- 43 -కె.వరలక్ష్మి 2008 జనవరి 18 నుంచి 24 వరకూ నంది నాటకోత్సవాలు రాజమండ్రి ఆనెం కళాకేంద్రంలో జరిగాయి. ఇన్విటేషన్ వచ్చింది. నేను రాజమండ్రిలో ఉన్న మా చిన్న చెల్లెలు సూర్యకుమారి ఇంటికెళ్ళి అక్కడ నుంచి రోజూ ఇద్దరం కలిసి నాటకాలు చూడడానికి వెళ్ళేవాళ్ళం. చాలా మంది నటులు, రచయితలు తెలిసినవాళ్ళు కావడం వలన పలకరించేవాళ్ళు. లీజర్ టైంలో కలిసి టీ తాగేవాళ్ళం. ముఖ్యంగా జవ్వాది రామారావుగారి సోదరప్రేమ మరచిపోలేనిది. అనుకోకుండా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం (నోట్ టు రీడర్స్)

వ్యాధితో పోరాటం (నోట్ టు రీడర్స్) –కనకదుర్గ ప్రియమైన పాఠకుల్లారా, ఈ ఏడాది జనవరి 8న నా జీవిత సహచరుడు శ్రీనివాస్ ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ జబ్బుతో బాధ పడుతున్న నన్ను, నేను నెలలు నెలలు ఆసుపత్రులల్లో వుంటే చంటిపాపను స్ఫూర్తిని, పదేళ్ళ చైతన్యను కంటికి రెప్పలా కాపాడుకున్న నా భర్త, నేనే పని చేస్తానన్నా తనకి వీలైనంత సాయం సంతోషంగా చేసే వాడు. నేను ఆసుపత్రిలో వుంటే పిల్లల్ని రోజూ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-43)

నడక దారిలో-43 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నాచదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం.స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది.మరుదులవివాహాలతో కుటుంబం పెద్దదైంది.నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది.ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. వీర్రాజు గారు […]

Continue Reading

జీవితం అంచున -19 (యదార్థ గాథ)

జీవితం అంచున -19 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ పాలవాడు పాలు వేయటం మానేయటానికి కారణాలు ఆలోచిస్తోంది. ఇప్పుడు అమ్మ దృష్టిలో నాతో సహా అందరూ అనుమానాస్పదులే…అందరూ శతృవులే. అమ్మకు చురకత్తుల్లాంటి కెమెరాల నిఘాలో తను శత్రు కూటమిలో చిక్కుకు పోయిన భావన. పాలవాడు రాకపోవటానికి కారణం ఇంట్లో పెట్టిన కెమెరాలని అమ్మకి అనుమానం రాజుకుంది. పాలవాడు రావటం మానేసాడని పాలు కాశి తెస్తున్నాడని నాకు ఫిర్యాదు చేసింది. “పాలవాడికి కరోనా […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-17

నా అంతరంగ తరంగాలు-17 -మన్నెం శారద విశిష్టమైన ఈ గురుపూర్ణిమ రోజు కాకతాళీయమైనప్పటికి ఈ  ఇద్దరి అద్భుతమైన వ్యక్తుల పుట్టినరోజులు కూడా  కలిసి రావడం  నిజంగా ముదావహం అనే చెప్పాలి. అప్పట్లో గుంటూరులో వున్నాం మేము. ఇంకా చదువులు  కొనసాగుతున్నాయ్. ఒకరోజు మా కుటుంబ స్నేహితులు వాసుదేవరావు గారు హడావుడిగా వచ్చి  “అమ్మాయ్, శారదా , తయారవ్వు, నిన్నో చోటకి తీసుకెళ్ళాలి “అన్నారు. మా అమ్మ ఆయనకేసి సీరియస్ గా చూసి  “ఈ టైమప్పుడు ఎక్కడకి.. అప్పుడే […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-57 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-18)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-18 మెల్ బోర్న్ – రోజు 2- క్వీన్ విక్టోరియా మార్కెట్- ఫిలిప్ ఐలాండ్ – పెంగ్విన్ పెరేడ్ టూరు తరువాయి భాగం  బ్రైటన్ నించి మరోగంట పాటు ప్రయాణించి మధ్యాహ్నం ఒకటిన్నర ప్రాంతానికి మూన్లిట్ జంతు సంరక్షణాలయానికి […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల దోమలు

పిల్ల దోమలు -కందేపి రాణి ప్రసాద్ అక్కడొక పెద్ద మురుగు నీటి గుంట ఉన్నది. దాంట్లో పెద్ద దోమల కుటుంబం ఉంటోంది. తాతలు, తండ్రులు, అత్తలు, మామలు అందరూ కలిసి ఉండే పెద్ద ఉమ్మడి కుటుంబం. ఈ గుంట పక్కనే పెద్ద నేషనల్ హైవే. ఆ హైవేలో ఒక డాబా హెూటల్ ఉన్నది. ఆ హైవేలో ప్రయాణించే వాళ్ళందరూ దాదాపుగా ఆ హెూటల్ దగ్గర ఆగి తింటుంటారు. అలా కార్లు ఆగినప్పుడు ఈ దోమల కాలనీలోని పిల్లలు […]

Continue Reading

పౌరాణిక గాథలు -19 – జీర్ణ౦ జీర్ణ౦ వాతాపి జీర్ణ౦ – ఇల్వలుడు కథ.

పౌరాణిక గాథలు -19 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి జీర్ణ౦ జీర్ణ౦ వాతాపి జీర్ణ౦ – ఇల్వలుడు కథ పూర్వ౦ ఒక ఊళ్ళో వాతాపి, ఇల్వలుడు అనే అన్నదమ్ములు౦డేవారు. ఇల్వలుడు ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి “ నేను అనుకున్న పనులు నిర్విఘ్న౦గా జరిగిపోయేలా ఒక మ౦త్రాన్ని ఉపదేశి౦చ౦డి స్వామీ!” అని అడిగాడు. “నాయనా! నువ్వు రాక్షసుడివి. రాక్షసులు మ౦త్రోపదేశానికి అర్హులు కాదు. నీకు ఏ మ౦త్రాన్నీ ఉపదేశి౦చలేను! అన్నాడు. ఇల్వలుడు ఊరుకోలేదు. కష్టపడకు౦డానే అన్ని పనులు జరిగిపోవాలన్నది […]

Continue Reading

దేవి చౌధురాణి (నవల) మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి కథా రంగం ఈ కథ జరిగిన ప్రాంతము భౌగోళికముగా ఉత్తర బెంగాలు. ఇది బ్రహ్మపుత్ర, గంగా నదుల సంగమ ప్రాంతము. ఈ పెద్ద నదులే కాకుండా హిమాలయాల నుండి ప్రవిహించే తీస్తా, కర్ల, మహానంద, కరటొయ, నగర, తంగన్, జలధార, కల్యాణి వంటి ఉప నదులు, ఱుతుపవనాలతో ఉప్పొంగే ఇతర నదులతో కూడి దట్టమైన అడవులతో నిండి వుండేది. నేటి పశ్చిమ […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-3 సబ్బుబిళ్ళ

కాదేదీ కథకనర్హం-3 సబ్బుబిళ్ళ -డి.కామేశ్వరి  పెద్దోళ్ళ ఆశలు, కోరికలు ఆకాశాన్నంటే వయినా ఇట్టే తీరుతాయి – తీర్చుకుంటారు! చిన్నోళ్ళవి చిరు కోరికలయినా – వాటిని పరిస్థితులు తారుమారు చేస్తాయి – దేవుడూ గారడీ చేసేస్తాడు! ఇదే సబ్బుబిళ్ళ గారడీ కధ! సబ్బుబిళ్ళ! ఘుమఘుమలాడ్తూ కోవాబిళ్ళ రంగులో , కోడిగుడ్డు ఆకారంలో వుండే సబ్బుబిళ్ళ అంటే పదమూడేళ్ళ రత్తికి ఎంతో ఇష్టం! అమ్మగారు స్నానం చేసి వచ్చాక, బట్టలు తీసుకొచ్చేనెపంతో వెంటనే బాత్ రూంలో దూరి ఆ వాసన […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-27 తెల్లారింది

పేషంట్ చెప్పే కథలు – 27 తెల్లారింది -ఆలూరి విజయలక్ష్మి ఆకాశం కదిలి కదిలి రోదిస్తూంది. వరాలు గుండెలో దుఃఖ సముద్రం ఎగసి ఎగసి పడుతూంది. వరాలు కూతురు జానకి ఫిట్స్ తో ఎగిరెగిరి పడుతూంది ఫిట్ వచ్చినప్పు డల్లా జానకి ముఖం వికృతంగా మారుతూంది. భయంతో బిగుసుకుపోతున్న వరాలు తన అశ్రద్ధను, అజ్ఞానాన్ని, అసహాయతను తలచుకుని తననుతాను వెయ్యి శాపనార్థాలు పెట్టుకుంటూంది. పిల్ల ఒళ్ళు నిగారింపుగా ఉంటే కడుపుతో వున్నప్పుడలాగే ఉంటుందనుకుంది. తలనొప్పి, వాంతులంటే తిన్నది […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-17 శ్రీమతి అలివేలు మంగతాయారు

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-17 ” పరివర్తనము” -శ్రీమతి అలివేలు మంగతాయారు  -డా. సిహెచ్. సుశీల సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు పరదేవతను తన్మయత్వంతో కీర్తించారు. భక్తి తో అర్చించారు.  ఆ “సౌందర్యం” కేవలం శారీరక సౌందర్యం కాదు. మాతృమూర్తి అన్న భావం. జ్ఞానప్రదాయిని  అన్న భావం. ప్రబంధ కవులు కూడా ప్రబంధ నాయికను నఖశిఖ పర్యంతం వర్ణనలతో నింపివేశారు. ప్రబంధ లక్షణాల్లో ,’అష్టాదశ వర్ణనలు’ ఒకటి. ఇక్కడ ఈ వర్ణనలు కేవలం బాహ్య సౌందర్యమే. తర్వాతి కాలంలో […]

Continue Reading

బతుకు చిత్రం నవల (భాగం-40) – ఆఖరి భాగం

బతుకు చిత్రం-40 (ఆఖరి భాగం) – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           జాజులమ్మ, అమ్మ లేకుంటే అసలు ఈ ఇల్లు నిలబడేదా? నా భార్య ఏనాడయినా […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-17

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 17 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు పెళ్ళికాగానే, పెర్మనెంట్రెసిడెంట్స్గాఆస్ట్రేలియా వెడతారు. గోపీ ఇంట్లోప్రస్తుతం పేయింగ్గెస్ట్గాఉంటున్నారు. గోపీ ఇండియా నుంచి తిరిగివస్తాడు. విశాల, విష్ణు ఇద్దరూ జాబ్ మొదలు పెట్టారు. ఇల్లు చూసుకుని సామాన్తో అద్దెఇంట్లోకి మారదామని నిర్ణయించుకున్నారు. ***           జీవితంలో ముందుకు సాగాలంటే నిన్ను నువ్వే సంస్కరించుకోవాలి. ఎవరోవచ్చి, ఏదో చేస్తారు అనే భ్రమలో బ్రతికే కన్నా, నువ్వున్న పరిధిలో నీకు నువ్వు […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 19

యాదోంకి బారాత్-19 -వారాల ఆనంద్ జీవగడ్డ – ఆత్మీయ సృజనాత్మక వేదిక- రెండవ భాగం ఎదో అనుకుంటాం కానీ ‘జీవితం’ పెద్ద పరుగు. ఊపిరాడనంత దరువు. పరుగంటే గుక్క పట్టుకుని ఓ వంద మీటర్లు పరుగెత్తి గెలుపో ఓటమో ఒక చోట నిలబడ్డం కాదు. జీవితం ఓ మారథాన్. సుదీర్ఘమయిన పరుగు. ఊపిరి రావడానికీ పోవడానికీ నడుమ నిరంతరం సాగే ఉరుకులాట. దాంట్లో ఎన్నో మెరుపులు మరకలు. మలుపులు. ఎత్తులు, పల్లాలు. పరుగు ఓ క్షణం ఆపి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-42)

నడక దారిలో-42 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       ( తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నాచదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ తో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం.స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది.మరుదులవివాహాలతో కుటుంబం పెద్దదైంది.నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది.ఉమ్మడి కుటుంబం విడిపోవటం అయ్యాయి. వీర్రాజు గారు […]

Continue Reading

జీవితం అంచున -18 (యదార్థ గాథ)

జీవితం అంచున -18 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఇప్పుడు మహా శూన్యానికి మారు రూపంలా వుంది అమ్మ. అప్పటికి మూడు రోజులయ్యింది పాలవాడు కనిపించక. ఉదయాన్నే పొగమంచులో దిగంతాల పరిమళాన్ని ఆస్వాదిస్తూ వెన్నెల గానాన్ని ఆలాపిస్తూ అతని స్మరణలో బాల్కనీలో కూర్చునే అమ్మ అస్తమించే శశిని, ఉదయించే రవిని ఒకేసారి చూడటం జరుగుతోంది. కాని నులి వెచ్చని ఊహలతో తన మనసులో వెన్నెల కురిపించే వాడి జాడే లేదు. అయినా ప్రేమ […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-16

నా అంతరంగ తరంగాలు-16 -మన్నెం శారద తనివితీరలేదే …నా మనసునిండలేదే …. (మరోమంచి.. మంచి గంధం  లాంటి  జ్ఞాపకం ) ***            సినీనటి,  సీరియల్స్ నిర్మాత  రాధిక గారి నుండి ఒక కథ కోసం నాకు  పిలుపు వచ్చింది . అదివరకయితే అక్కయ్య , బావగారు ఉండేవారు ,సెలవులకి చెన్నై చెక్కేస్తుండే వాళ్ళం. కానీ బంగారం లాంటి మా అక్కయ్య మణిమాల, మా పెదనాన్నకు అత్యంత  ప్రియమైన కూతురుహార్ట్ ప్రాబ్లెమ్ […]

Continue Reading
Posted On :

అద్భుత సౌందర్య రాశి ‘కాశ్మీరం’

అద్భుత సౌందర్య రాశి ‘కాశ్మీరం’ -డా.కందేపి రాణి ప్రసాద్ హిమాలయ పర్వత సానువుల్లో కనులకింపైన పర్వతశ్రేణులతోనూ, చలికాలంలో గడ్డకట్టే దాల్, అంచర్ సరస్సులతోనూ ఆకాశాన్ని తాకేలా పైకి పెరిగిన చినార్, దేవదార్, పైన్ వంటి చెట్లతోనూ, మిలమిల మెరిసే ఆకుపచ్చని రంగు పులుపుకున్న పచ్చిక బయళ్ళతోనూ, రంగురంగుల్లో తమ సోయగాలంతా చూపించే పూల బాలలతోనూ, కొండల మధ్య భాగాల్లో నుంచి పాల వంటి నీళ్ళు ధారలుగా ప్రవహించే నీటి జలపాతాల తోనూ భూలోక స్వర్గంగా పేరు పొందిన […]

Continue Reading

పాండిచ్చేరి ప్రస్థానము

పాండిచ్చేరి ప్రస్థానము -శాంతిశ్రీ బెనర్జీ జవహర్‌లాల్‌ నెహ్రు యూనివర్సిటీ, ఢిల్లీలో నాతోపాటు చదువుకుని, తర్వాత అదే యూనివర్సిటీలో ప్రాచీన భారత చరిత్ర బోధించే ప్రొఫెసర్‌గా పనిచేసి, పదవీ విరమణ చేసింది నా బెంగాలీ స్నేహితురాలు కుమ్‌ కుమ్‌ రాయ్‌. ఆమె తన తల్లితోపాటు తరచుగా శ్రీ అరవిందుడి ఆశ్రమాన్ని దర్శించడానికి పాండిచ్చేరి వెడుతూ ఉండేది. అందువలన ఆమెకి ఆ పట్టణంతో అవినాభావ సంబంధం ఏర్పడిరది. తల్లి మరణం తర్వాత పాండిచ్చేరి ఎక్కువగా వెళ్ళలేక పోయినా, తన రిటైర్మెంట్‌ […]

Continue Reading

యాత్రాగీతం-56 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-17)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-17 మెల్ బోర్న్ – రోజు 2 – క్వీన్ విక్టోరియా మార్కెట్- ఫిలిప్ ఐలాండ్ – పెంగ్విన్ పెరేడ్ టూరు మెల్ బోర్న్ లో రెండో రోజు మేం ప్యాకేజీటూరులో భాగంగా మొదటి టూరైన ఫిలిప్ ఐలాండ్ […]

Continue Reading
Posted On :

దుబాయ్ విశేషాలు-13 (ఆఖరిభాగం)

దుబాయ్ విశేషాలు-13 (ఆఖరిభాగం) -చెంగల్వల కామేశ్వరి షార్జా, దుబాయ్, అబుదాబీలలో ఉన్నన్ని టూరిస్ట్ ప్లేసెస్ మిగతా నాలుగు దేశాల లో తక్కువనే చెప్పొచ్చు. “సూక్ అల్ జూబేయిల్”  షార్జాలో ఉన్న ఒక  మాల్!  ఇందులో, దేశీ స్వదేశీ కూరగాయలు, పళ్ళు, తేనె, సీఫుడ్, నాన్ వెజ్ వంటి ఎన్నో ఉత్పత్తులు నిర్దిష్టమయిన ధరలకు లభ్యమవుతాయి. మన రైతు బజార్ కి మల్లే, కానీ చాలా అధునాతనంగా అన్ని సదుపాయాలతో శుచి శుభ్రతలతో ఉంటుంది. ఇటువంటిదే దుబాయిలో కూడా […]

Continue Reading

పౌరాణిక గాథలు -18 – సజ్జనసాంగత్యము – చంద్రహాసుడు కథ.

పౌరాణిక గాథలు -18 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి సజ్జనసాంగత్యము – చంద్రహాసుడు కథ కుంతలదేశపు మహారాజుకి మగపిల్లలు లేరు. ఒక కూతురు మాత్రం ఉంది. ఆమె పేరు చంపకమాలిని. తన రాజ్యానికి వారసులు లేరని బాధపడుతూ ఉండేవాడు. అతడి మంత్రి పేరు దుష్టబుద్ధి. పేరుకు తగ్గట్టే ఉండేవాడు. అతడి కొడుకు పేరు మదనుడు. కుమార్తె పేరు విషయ. తన కొడుకు మదనుడికి రాజు కూతురు చంపకమాలినిని ఇచ్చి పెళ్ళిచేస్తే రాజ్యం తనదవుతుందని దుష్టబుద్ధి దుష్ట ఆలోచన చేస్తుండేవాడు. […]

Continue Reading

దేవి చౌధురాణి (నవల) మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి కథా కాలం చరిత్రకారులకు ఏ యుద్ధంలో ఏ రాజు గెలిచాడో ముఖ్యం. ప్రబంధకారులకు, కవులకు ఏ రాజు ఎంతటి గొప్ప పరాక్రమవంతుడో, అనగా ఎంతటి పర ఆక్రమణదారుడో ఘణంగా వర్ణించటం ముఖ్యం. అయితే ఈ యుద్ధాలలో నలిగేది మాత్రం సామాన్య ప్రజలే. వారి కథలు, జీవన పోరాటాలు, తిరుగుబాటులు, పోరాటాలు జానపద కథలగానూ, జానపద గీతాలు గానూ జీవిస్తాయి. వీటికి విద్యాధికుల […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-26 బలి

పేషంట్ చెప్పే కథలు – 26 బలి -ఆలూరి విజయలక్ష్మి పాలరాతి శిల్పంలా నిశ్చలంగా కూర్చుంది శచి. సూన్య నయనాలతో ఎదురుగా వున్నా గోడవంక చూస్తూందామె. “ఏమ్మా! ఒంట్లో ఎలా వుంది?” ఆమె భుజం మీద చెయ్యేసి ఆప్యాయంగా అడిగింది శృతి. “ఏం బావుండడం, ఎత్తుబారం బావుండడం..” శచితల్లి వైదేహి పెద్దకంఠంతో అందుకుంది. “ఒక్క నిమిషం, మీరిలా రండి” వైదేహి చెయ్యి పుచ్చుకుని ప్రక్క రూమ్ లోకి తీసుకు వెళ్ళింది శృతి. “ఆ అమ్మాయి జడుసుకునేలా మీరంత […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-16 పులిపాక బాలాత్రిపురసుందరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-16 ” పిల్లికి చరలాటము – ఎలుకకు ప్రాణ సంకటము” -పులిపాక బాలాత్రిపురసుందరమ్మ  -డా. సిహెచ్. సుశీల           ad vertere అనే లాటిన్ పదం నుండి ఆంగ్లం లో advertisement అనే పదం వచ్చింది. “ఒక వైపుకి తిరగడం” అని తెలుగు లో అర్ధం. ప్రేక్షకులను తమ వైపుకి తిప్పుకోవడం “ప్రకటన” ప్రధాన లక్షణం, లక్ష్యం. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ఏదైనా సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా […]

Continue Reading

బతుకు చిత్రం నవల (భాగం-39)

బతుకు చిత్రం-39 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           కాలం ఆగకుండా నడుస్తనే ఉన్నది. కమల మరణం కూడా పాత వడ్డది. జాజుల మ్మకు ఈర్లచ్చిమి […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-16

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 16 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు ఆస్ట్రేలియా వచ్చి స్థిరపడే ప్రయత్నం చేస్తున్నారు. గోపీ ఇంటిలో పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నారు. గోపీ డైవోర్సీ అని తెలుసుకుని విశాల త్వరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి అని విష్ణుతో చెపుతుంది. విశాలకి టేఫ్ కాలేజీలో వర్క్ ఎక్స్ పీరియన్స్ అవకాశం వచ్చింది. విష్ణుకి ఉద్యోగ అవకాశం వచ్చినా, ఇంటికి దూరం, కారు కంపల్సరీ అని కన్సల్టెంట్ చెప్పడంతో నిరాశ చెందుతాడు. ఆస్టేలియా […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఇక అప్పుడు భూమి కంపిస్తుంది

అనుసృజన ఇక అప్పుడు భూమి కంపిస్తుంది మూలం: రిషబ్ దేవ్ శర్మ అనుసృజన: ఆర్ శాంతసుందరి చిన్నప్పుడు విన్న మాట భూమి గోమాత కొమ్ము మీద ఆని ఉందనీ బరువు వల్ల ఒక కొమ్ము అలసిపోతే గోమాత రెండో కొమ్ముకి మార్చుకుంటుందనీ అప్పుడు భూమి కంపిస్తుందనీ . ఒకసారి ఎక్కడో చదివాను బ్రహ్మాండమైన తాబేలు మూపు మీద భూమి ఆని ఉంటుందనీ వీపు దురద పెట్టినప్పుడు ఎప్పుడైనా ఆ తాబేలు కదిలితే భూమి కంపిస్తుందనీ. తరవాతెప్పుడో ఒక పౌరాణిక నాటకంలో […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 18

యాదోంకి బారాత్-18 -వారాల ఆనంద్ కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరిక-ప్రస్తానం కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా విశ్వంలోకి చేసే ప్రయాణమే ‘కళ’ ***           అలాంటి ప్రయాణమే నాకు ఆలంబన అయింది. చదువు ముగించి చిన్నదో పెద్దదో జూనియర్ కాలేజీలో లైబ్రెరియన్ గా చేరాక అటు ఉద్యోగంతో పాటు ఇటు సాహిత్యం మరో పక్క సినిమాలూ నన్ను ఆవరించాయి అనేకంటే కమ్ముకున్నాయి అంటే సబబేమో. వేములవాడ ఫిలిం సొసైటీ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 42

నా జీవన యానంలో- రెండవభాగం- 42 -కె.వరలక్ష్మి ‘‘లబ్దప్రతిష్ఠులు తమని తామే అనుకరించుకోవడమూ, యువతరం రచయితలు తమ రచననీ, చదువునీ చూసుకొని సంతృప్తి పడడమూ మానుకోవడం అవసరం. రచయిత నిత్య విద్యార్థిగా ఉండకపోతే అతనిలో ఎదుగుదల ఆగిపోతుంది. అతడు (ఆమె) ఊబిలాంటి ఆత్మసంతృప్తిలో కూరుకుపోతాడు’’ అంటారు ‘కథాశిల్పం’ లో వల్లంపాటి. ఒక కుక్క తనను ఎందుకు కరిచిందని ఆలోచించాలి అంతేగాని తనలో ఏదో లోపం ఉండడం వల్లే అది కరిచిందని అనుకోకూడదు. మన మీద క్రూరత్వాన్ని ప్రదర్శించిన […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-41)

నడక దారిలో-41 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. ఉమ్మడి కుటుంబం విడిపోవటం […]

Continue Reading

జీవితం అంచున -17 (యదార్థ గాథ)

జీవితం అంచున -17 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అమ్మ పడక్కుర్చీలో కూర్చుని ఏదో పలవరిస్తోంది. అంతలోనే అమ్మ బోసినోటితో బుంగ మూతి పెట్టింది. కెమెరాలలో చూడగలనే కాని వినలేని నేను జూమ్ చేసి శ్రద్దగా చూడనారంభిం చాను. ఎందుకో అమ్మ పరవశంగా చేతులు ముందుకు చాచింది. జగన్మోహన ఆనందం కెంపులై ఆమె చప్పిడి బుగ్గల్లో ఎర్ర మందారమై తణుకులీను తోంది. అమ్మ ఏదో రహస్యం చెబుతున్నట్టుగా ముందుకు వంగి గుసగుసగా కలవరించింది. […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-15

నా అంతరంగ తరంగాలు-15 -మన్నెం శారద ఆర్ట్ మీద ఇంటరెస్ట్ కొద్దీ కొన్ని రోజులు నా చదువుకి సంబంధించని ఆర్టిస్ట్ జాబ్ ఒక ఫ్యామిలీ ప్లానింగ్ ట్రైనింగ్ సెంటర్ లో చేశానని మీకు అదివరలో చెప్పాను కదా! అందులో చేయడం కోసం డ్రాయింగ్ హయ్యర్ కూడా పాసయితే బాగుంటుందని , లోయర్ పాస్ కాకుండా డైరెక్ట్ గా హయ్యర్ ఎగ్జామ్ మద్రాస్ లో రాయవచ్చని తెలిసి   గుంటూరులో ఒక మాస్టర్ గారి దగ్గర జాయిన్ అయ్యాను. ఆఫీస్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-55 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-16)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-16 మెల్ బోర్న్ – రోజు 1 మెల్ బోర్న్ లో వాతావరణం సిడ్నీ కంటే చల్లగా ఉంది. చల్లదనంలో  ఇంచుమించుగా మా శాన్ ఫ్రాన్ సిస్కోతో సమానంగా అనిపించింది. కెయిర్న్స్ లోని వేడిమి, ఉక్కపోతల నించి రెండు […]

Continue Reading
Posted On :

దుబాయ్ విశేషాలు-12

దుబాయ్ విశేషాలు-12 -చెంగల్వల కామేశ్వరి షార్జా విశేషాలు… షార్జా చాలా పెద్ద నగరం ఇది ప్రధాన పరిపాలనా మరియు వాణిజ్య కేంద్రాలను కలిపి సాంస్కృతిక మరియు సాంప్రదాయ ప్రాజెక్టులను కలిగి ఉంది, వీటిలో పురావస్తు శాస్త్రం, సహజ చరిత్ర, సైన్స్, కళలు, వారసత్వం, ఇస్లామిక్ కళ మరియు సంస్కృతికిసంబంధిత మ్యూజియంలు ఉన్నాయి. ప్రత్యేకమయిన ఇస్లామిక్ డిజైన్‌లతో రెండు ప్రధాన సూక్‌లు  ఎన్నో టూరిస్ట్ ప్లేస్ లు అందమయిన మసీదులకు ప్రసిద్ది చెందింది. షార్జా అక్వేరియమ్ విశేషాలు… అల్ […]

Continue Reading
Kandepi Rani Prasad

పిల్లలు కాని కాకి గుడ్లు

పిల్లలు కాని కాకి గుడ్లు -కందేపి రాణి ప్రసాద్ ఒక పెద్ద మర్రి చెట్టు మీద కాకులు గూళ్ళు కట్టుకుని నివసిస్తున్నాయి. కొమ్మ కొమ్మకో గూడు కట్టుకున్నాయి. ఎవరి గూట్లో వారు గుట్టుగా కాపురం చేస్తున్నాయి. భార్యా పిల్లలతో కలసిమెలసి ఉంటున్నాయి. ఒకరి కొకరు అండగా ఉంటాయి. ఏదైనా ఆపద వచ్చినపుడు పెద్దల మాట వింటాము. ఆ చెట్టు మీద ముసలి కాకులు నాలుగున్నాయి.  అనుభవంలో బాగా తల పండినాయి. అన్ని కలసి ఒకే నిర్ణయం తీసుకుంటాయి. […]

Continue Reading

పౌరాణిక గాథలు -17 – ఏకాగ్రత – గురుశిష్యులు కథ

పౌరాణిక గాథలు -17 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఏకాగ్రత – గురుశిష్యులు కథ అనగా అనగా ఒక ఊళ్ళో ఒక గురువుగారు ఉ౦డేవారు. ఆయన దగ్గర చాలా మ౦ది శిష్యులు చదువుకు౦టూ ఉ౦డేవాళ్ళు. ఉదయాన్నే గురువుగారి క౦టే ము౦దే లేచి ఆయన పుస్తకాలు సర్దడ౦, హోమానికి సమిథలు తీసుకు రావడ౦, పూజకి పువ్వులు కోయడ౦ వ౦టి పనులన్నీ చేసేవాళ్ళు. తరువాత గురువుగారు వచ్చి పాఠాలు చెప్పేవారు. శిష్యుల౦దరు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉ౦డేవాళ్ళు. ఒకరోజు గురువుగారికి పొరుగూర్లో […]

Continue Reading

కాదేదీ కథకనర్హం-2 అగ్గిపుల్ల

కాదేదీ కథకనర్హం-2 అగ్గిపుల్ల -డి.కామేశ్వరి  ‘అప్పా , అగ్గి రాజెట్టి నావా – కాస్త అగ్గెట్టు ” పిడక పట్టుకుని గుడిసెలోకి వచ్చింది రత్తాలు. అప్పాలేదు, అగ్గీ లేదు – కాని అగ్గిలాంటి సింహాద్రి – ఫాక్టరీ నుంచి వస్తూ సుక్కేసుకు వచ్చి సగం మత్తులో నులక మంచానికి అడ్డం పడి వున్నాడు. సింహాద్రిని చూస్తే నిప్పని చూసినట్టే రత్తాలుకి భయం – ఆడి సూపుసోకితే కాలి భస్మం అవుతుందని భయం – దగ్గిరకెడితే కాలుతుందని భయం […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-25 పెళ్ళికూతురు

పేషంట్ చెప్పే కథలు – 25 పెళ్ళికూతురు -ఆలూరి విజయలక్ష్మి           మంగళవాయిద్యాలు పడుచుగుండెల్లో మరుమల్లెల జల్లుల్ని కురిపిస్తున్నాయి. పెళ్ళికూతురు వరలక్ష్మి ముస్తాబవుతూంది. కొంచెం దూరంలో కూర్చుని వరలక్ష్మిని చూస్తున్న శృతికి ఆమెతో తన మొదటి పరిచయం గుర్తుకొచ్చింది.            “గుడ్ మార్నింగ్ డాక్టర్!” నవ్వే సెలయేరులా, తృళ్ళిపడే జలపాతంలా వున్నా ఆ అమ్మాయి వంక ఒక్క క్షణం ఆసక్తిగా చూస్తూ ఉండిపోయింది శృతి.    […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-15 ఆచంట సత్యవతమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-15 “గ్రుడ్డిగా నడిస్తే గోతిలో పడడమే” — ఆచంట సత్యవతమ్మ  -డా. సిహెచ్. సుశీల ఆది శంకరాచార్యుల వారు యావద్భారత దేశం పర్యటించి హైందవం, సనాతన ధర్మం సంబంధిత గ్రంథాలను, భాష్యాలను, వ్యాఖ్యానాలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అనేకమంది శిష్యులు వారిననుసరించారు. శంకరాచార్య నాలుగు ప్రముఖ పీఠాలను ఏర్పాటు చేయడమే కాక సన్యాసుల కొరకు వివిధ ప్రాంతాలలో మఠాలను ఏర్పాటు చేసారు. శంకరుల వారి తదనంతరం వారి శిష్య ప్రశిష్య గణాలు […]

Continue Reading