image_print

చాతకపక్షులు నవల-1

చాతకపక్షులు  (భాగం-1) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి తొలిపలుకు  గత మూడున్నర దశాబ్దాలలోనూ అమెరికాలో ఉంటున్న తెలుగువారి ఆచారవ్యవహారాల్లో, ప్రవర్తనలలో చాలా మార్పులు వచ్చేయి. డెబ్భైవ దశకంలో వచ్చినవారికి తగిలినంత కల్చర్ షాక్ ఇప్పటివారికి లేదనే నేను అనుకుంటున్నాను. ఇది కేవలం స్త్రీలకే పరిమితం కాదు. అమెరికాకి వచ్చిన మగవారు ఇక్కడి సంస్కృతిలో నిలదొక్కుకుని, అనేక వత్తుడులని తట్టుకుని తమ ధ్యేయాలని సాధించడానికి పడిన అవస్థలు సామాన్యమయినవి కావు. అదే […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-4

నిష్కల – 4 – శాంతి ప్రబోధ పుట్టింట్లో నలుగురు అన్నల ముద్దుల చెల్లెలు సుగుణమ్మ.  ఆమెను బాగా గారాభం చేసింది మాత్రం ఆమె తండ్రి, పెద్దన్న రాజారాం.  దీంతో రాను రాను సుగుణమ్మ చాలా అహంభావి గా మారిపోయింది.  సుగుణమ్మ ఇంట్లో సర్వాధికారం ఆమెదే.  భర్త సాధు స్వభావి.  పెళ్లయిన మొదట్లో అత్తమామల మధ్య ఉన్న సుగుణమ్మ లోని అహం అడకత్తెరలో  పోకచెక్కలా పెళ్ళైన మొదట్లో భర్త మెతకదనం కనిపెట్టిన ఆమె అతన్ని ఏనాడూ మాట్లాడ నిచ్చేది కాదు, ఏ విషయంలోనూ గెలవ నిచ్చేది కాదు.  .  భార్య మనస్తత్వం […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-4)

బతుకు చిత్రం-4 – రావుల కిరణ్మయి సెప్పు ..,ఈంది ఏ ఊరు?అయ్యవ్వలు ఏంజేత్తరు?ఫోన్ సుత లేకుండ ఈ మనిసిని ఈడెట్ల ఇడిసిపెట్టిండ్రు ?నీ కాడ వాళ్ళ నెంబరుంటది గదా!ఫోన్ జేసి పిలిపియ్యి అన్నడు వరయ్య. ఇగో అట్నే ఈ పొల్ల అయ్యను సుత పిల్సుకురాండ్రి.అన్నడు పోలయ్య వైపు చూస్తూ. పూజారి మునేశ్వరయ్య జాజులమ్మ వైపు చూపిస్తూ … వరయ్య గారూ !ఒక్కసారి ఆ పొళ్ళను సూడుండ్రి.పాపం …బేలగా భయంతోనూ,సిగ్గు తోనూ ఎలా వణికిపోతుందో..!ఇది పాడి గాదు.వీళ్ళ అయ్యవ్వను […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-9

రాగో భాగం-9 – సాధన  రోజులు గడుస్తున్నయి. చూస్తుండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు రాత్రి చిమ్మచీకటి. కళ్ళు పొడుచుకు చూస్తున్నా ముందు నడుస్తున్న మనిషి ఎంత దూరంలో ఉన్నాడో కూడ తెలవడం లేదు. ముందు నడిచేవారు ఆగితే వెనుకవారు మీద పడి గుద్దుకుంటున్నారు. ముందుండే పైలట్స్ అద్దానికి చేయి అడ్డం పెట్టి టార్చిలైటు వేస్తే చిమ్మచీకట్లో అకస్మాత్తుగా కనపడే వెలుతురుకు కళ్ళు చిట్లించుకుంటూ వెనుక వారంతా గాభరాగా ముందువారి అడుగులో అడుగు లేస్తూ దగ్గరగా […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-3

నిష్కల – 3 – శాంతి ప్రబోధ నలబై ఐదేళ్ల నడివయసు మహిళ , ఇద్దరు పిల్లలున్న మహిళ,  భర్తతో విడిపోయి ఒంటరిగా బతుకుతున్న మహిళకు ఆమె పిల్లలే పెళ్లి చేశారట . ఆ వార్త చూసినప్పుడు చీదరించుకుంది. ఈ వయసులో ఇదేం పోయేకాలం.. దీని మొహంమండ .  ఇంకా పదహారేళ్ళ పడుచుపిల్లననుకుంటుందా ..  దీనికిప్పుడు పెళ్లి కావాల్సి వచ్చిందా .. మొగుడు అవసరమయ్యాడా .. ఛి ఛీ .. సిగ్గులేకపోతే సరి .. ఆడాళ్ళు మరీ బరి తెగించి పోతున్నారని మనసులోనే […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-3)

బతుకు చిత్రం-3 – రావుల కిరణ్మయి తండ్లాటెందుకు?పొర్లాటెందుకు?నువ్వే అంటివి గదెనే !చెట్టంత కొడుకని.అందుకే నిమ్మళంగున్న.సంకల ఆడే శాంతి పోరడయితే నేను సుత నీ లెక్కల్నే సూత్తును కావచ్చు.అన్నాడు మంచం మీద జేరి ఆవలించుకున్టనే. గందుకే అంటాన,దున్నపోతు మీద వాన కురిసినట్టని…….అన్నది కోపంగానే. ఏందే?ఏమో…దున్నపోతంటానవ్?పెయ్యెట్లున్నదే? అన్నాడు. గీ బెదిరింపులకేం తక్కువ లేదు.”ఉన్న మాటంటే ఊర్లున్డనీయరన్నట్టు ..”దున్నపోతని ఉన్నమాటే  అన్న. నీ వల్లనే కదా!ఆ ఊర్ల ఇడిశి పెట్టి అచ్చిన.నీకేమన్న ఇజ్జతున్నదా?పొల్లను సూడ వోయిన ఊర్లనే పొలగాన్ని ఇడ్సిపెట్టి వత్తే […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-8

రాగో భాగం-8 – సాధన  “నీ పేరు ఏందక్కా?” అంటూ మరో ప్రశ్న వేసేసరికి రాగో తత్తర పడింది. వెనుకనున్న మిన్కో వెంటనే “జైని” అంటూ అందించింది. “ఆఁ! అచ్చం జువ్వి రాగో తీరుగుంటే అడిగినక్క కళ్ళల మసకలు. మనిషిని పోల్చలేము” అంటూ ముసలమ్మ కదిలింది. “అబ్బా! కొత్త పేరు పెట్టుకోవడమే మంచిదయింది” అనుకుంటూ రాగో ముందుకు సాగింది. చివరింటి ముందు దళం ఆగింది. కిట్లు దించారు. వాకిట్లో వాల్చిన మంచాలపై దళ సభ్యులు కూచున్నారు. కర్రె […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-7

రాగో భాగం-7 – సాధన  దళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటుపోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది. గిరిజ వెనకే రాగో నడుస్తుంది. అంత రాత్రి ఎంత దూరం నడుస్తారో, ఏ ఇంట్లో పడుకుంటారో ఏమీ తెలియదు. తన వద్ద చెద్దరు, దుప్పటి లేవు. కప్పుకోను చీర పేగు కూడ తెచ్చుకోలేదు అని బాధపడుతున్న రాగోకు ఎవరో ఏదో అనడం వినపడింది. కానీ ఏమన్నాడో అర్థం కాలేదు. దళం దారి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-2)

బతుకు చిత్రం-2 – రావుల కిరణ్మయి కంచే చేను మేసిన్దన్నట్టుగా కన్న తండ్రే కన్న కొడుకు కళ్ళ ముందే  జీవితాన్ని పాడు చేసుకుంటుంటే  చీమ కుట్టినట్టైనా లేకుండా ఆడు మగోడు వాడేమి  జేసినా చెల్లుతుందని మాట్లాడుతున్న భర్త రాజయ్యను ఓవైపు మందలిస్తూనే తల్లిగా ఒక దారికి తేవాలని పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఎంత మంది వచ్చి చూసినా ,అడిగేది ఆస్తి పాస్తులే మున్నాయి?పిలగాడు నెలకు ఏ మాత్రం సంపాదిస్తాండు?ఎంత పొడుపు చేస్తాండు?అనే. వీర్లచ్చిమికి ఈ ప్రశ్నలకు […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-2

నిష్కల – 1  – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే  దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ మనిషికీ మధ్య మంచుపొరల్లా కమ్మేసిన అహంభావపు తెరలు,  ఆధిపత్యపు కోట్లాటలూ .. ఆంక్షల అడ్డుగోడలూ .. ఎన్ననీ.. ఒకటా రెండా .., దాటుకొచ్చినకొద్దీ, మేమున్నామంటూ కొత్తవి మొలుసుకుంటూ పోతుండడమేనా .. జీవితం? మరీ ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో క్షణక్షణం అనుక్షణం ఎదురయ్యే చింతనిప్పుల గుండాలు , కుప్పలు తెప్పలుగా తుమ్మముళ్ళూ ..బ్రహ్మ జెముళ్లూ .. […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-1

నిష్కల – 1  – శాంతి ప్రబోధ ‘మనకున్నది ఒకటే పుట్టుక . ఒక్కటే మరణం. ఈ మధ్య కాలమే కదమ్మా జీవితం . ఇంత చిన్న జీవితకాలంలో జలపాతాల్లా ఎగిసిపడే ఆనందాల కంటే, ఉప్పెనల్లా వురికొచ్చే  దుఃఖాలే ఎక్కువమో.. మనసును ఆహ్లాద పరిచే సంఘటనల కంటే హృదయాన్ని మెలిపెట్టి పిండేసే వ్యధలే ఎక్కువ కావచ్చు.. మనిషికీ మనిషికీ మధ్య మంచుపొరల్లా కమ్మేసిన అహంభావపు తెరలు,  ఆధిపత్యపు కోట్లాటలూ .. ఆంక్షల అడ్డుగోడలూ .. ఎన్ననీ.. ఒకటా రెండా .., దాటుకొచ్చినకొద్దీ, మేమున్నామంటూ కొత్తవి మొలుసుకుంటూ పోతుండడమేనా .. జీవితం? మరీ ముఖ్యంగా ఆడపిల్లల జీవితంలో క్షణక్షణం అనుక్షణం ఎదురయ్యే చింతనిప్పుల గుండాలు , కుప్పలు తెప్పలుగా తుమ్మముళ్ళూ ..బ్రహ్మ జెముళ్లూ .. […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-6

రాగో భాగం-6 – సాధన  మర్కనాలో ఫారెస్టువారి నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మె చేసి కూలిరేట్లు పెంచుకున్న కూపు కూలీలు ఆ రోజే పనుల్లోకి దిగారు. వీడింగ్ పని చకచకా సాగిపోతుంది. సాయంకాలం ఆరున్నర అవుతుంది. ఊరి బయటే తెలుగు ప్రాంతీయ వార్తలు విని దళం ఊళ్ళోకొచ్చింది. మసక మసకగా ఉన్న వెలుతురు కాస్తా మనుషుల్ని గుర్తు పట్టరాని చీకటిగా చిక్కపడింది. అడవిని అనుకొనే ఉన్న చివరి ఇంటి ముందు దళం ఆగింది. దళ కమాండర్ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-1)

బతుకు చిత్రం – రావుల కిరణ్మయి అదో పెద్ద అడవిలాగుంది.చుట్టూ ఎంత దూరం నడిచినా దట్టంగా అల్లుకున్న పెద్ద పెద్ద వృక్షాలు. తాను ఆ చెట్లు ఎక్కుతున్నది. బాగా విరగకాసిన పండ్ల తో చెట్లన్నీ గూని అవ్వ లా కనిపిస్తుంటే,ఎక్కిన చెట్లను దిగి ఆ చెట్ల వైపు పరుగు తీస్తున్నది. చిత్రం….అక్కడికి వెళ్లి వాటిని అందుకొని అవి ఏ పండ్లు?..అని పరికిస్తూ…..జామ ,మామిడి,సపోటా….అంటూ ఒక్కో చెట్టును గుర్తిస్తూ పోతూ ఉంటే ఆశ్చర్యంగా పూలతోట లోకి చేరుకుంది. పువ్వులు…..పిచ్చిపట్టినట్టుగా […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-5

రాగో భాగం-5 – సాధన  పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది. బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, హడావిడి అంతా దగ్గర్లోనే వినబడుతూంది. లేచింది లేచినట్లే మద్ది చెట్టును పొదువుకుంది రాగో. ఎవరై ఉంటారు? ఏమిటి అల్లరి? ఏం చేస్తున్నారు? తననే వేటాడుతున్నారా? తాను ఎక్కువ దూరం పరుగెత్తలేదా? దార్లోనే మొద్దు నిద్ర […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-4

రాగో భాగం-4 – సాధన  రోజులు గడుస్తున్నాయి. రాగో మనసు ఓ పట్టాన నిలవడం లేదు. రకరకాల ఆలోచనలతో పొద్దస్తమానం ఎటూ పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎక్కడికి పోయినా, ఏ పరిచయస్తుల వద్దనైనా, చిన్ననాటి స్నేహితుల వద్దనైనా తలదాచుకోవడానికి పూట, అరపూట ఉండాల్సి వచ్చేసరికి అక్కడి వారంతా ‘కేర్లే (భర్తను వదలి మరో సంబంధం వెతుక్కునే ఆడది) అంటూ అదో రకంగా చూస్తుంటే దిన దిన గండంగా సాగుతుంది. ఏ కాలం నాడు ఏ పెద్దలు నామకరణం […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-3

రాగో భాగం-3 – సాధన  ఊళ్ళో గోటుల్ ముందు జీపు ఆగి ఉంది. నల్లటి జీపుకు ముందరి భాగంపై “మహారాష్ట్ర శాసన్” అనే అక్షరాలు తెల్లటి రంగుతో ఉండ్రాళ్ళలా చోటు చేసుకున్నాయి. నంబరు ప్లేటుపై హిందీ లిపిలో నంబరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. బాబులు అందరూ గోటుల్ ముందు మంచాల్లో కూచున్నారు. వాళ్ళకెదురుగా గ్రామస్తులు కూచున్నారు. పిల్లలందరూ దాదాపు బరిబాతలనే డ్రైవర్ కసరుకోవడం లెక్క చేయకుండానే ఉరుకులు పరుగులు చేస్తూ దాన్నొక వింత జంతువులా చూస్తున్నారు. ఎవరింటి ముందు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-2

రాగో భాగం-2 – సాధన  గోటుల్ ముందు కూచున్న వాళ్ళల్లో కూడ రకరకాల ఆలోచనలున్నయి. లచ్చుకు ఎటూ తేలకుండా ఉంది. నాన్సుకు మొదటి పెళ్ళి పెళ్ళాముంది. పెళ్ళయి మూడేళ్ళైనా కోడలు కడుపు పండకపోవడంతో నాన్సుకి మరోపిల్లను తెస్తే బాగుండుననే ఆలోచన లచ్చుకు లేకపోలేదు. అందుకే వరసైన రాగో వస్తానంటుందంటే నాన్సును తాను వారించలేదు. రాగోకైనా సంతానమైతే తన ఇల్లు నిలబడుతుందనేది లచ్చు ఆపతి. అయితే రాగో తండ్రి దల్సు మొండిగా వ్యవహరించి పిల్లను ససేమిరా ఇయ్యనని మేనవారికి […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-1

రాగో – సాధన  1 రాగో దిగాలుగా కూచొని ఉంది. మనసంతా కకావికలమై ఉంది. కొలిక్కి రాని ఆలోచనలు. ఊరి బయటి గొడ్ల సదర్లలా చెల్లాచెదురుగా ఉన్నాయి తన ఆలోచనలు. ఎంత కూడదనుకున్నా గతమంతా దేవర జాతర్లా బుర్రలో అదే పనిగా తిరుగుతోంది. తోవ తప్పినోళ్ళు ఆగమాగమై అడవిలో తిరుగుతున్నట్లుంది రాగో జీవితం. తారీఖులు, పంచాంగాలు లెక్కలు తెలియకపోయినా, ఊరోళ్ళందరూ ‘పడుచుపోరి’ అని వెక్కిరిచ్చినప్పుడల్లా తనకూ వయసొస్తుందని అర్థమయేది. ఊళ్లో చలికాలం రాత్రుళ్ళు డోళ్ళు, డప్పులతో నెగళ్ళ […]

Continue Reading
Posted On :

రాగో(నవల)

రాగో (నవల)  – సాధన సృజన ప్రచురణలు, మలుపు బుక్స్ సౌజన్యంతో “నెచ్చెలి” పాఠకుల కోసం ప్రత్యేకంగా “రాగో” నవలను ఈ నెల నుండి ధారావాహికగా అందిస్తున్నాం.  అడగగానే “రాగో” నవలను ప్రచురించడానికి సమ్మతించిన శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీ బాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. *** “రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు. అర్థం లేని కట్టుబాట్లను మనస్సు లేని మనువును ఎదిరించి, అడవిలోకి, అక్కడి నుంచి ఆశయంలోకి పయనించిన వీరవనిత. […]

Continue Reading
Posted On :