image_print

నూజిళ్ల గీతాలు-5 మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!

నూజిళ్ల గీతాలు-5(ఆడియో) మనసున్న తల్లి మా తూర్పు గోదావరి!  రచన &గానం:నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: మనసున్న తల్లి మా తూర్పు గోదావరి! మమతలను కురిపించు మా కల్పవల్లి! అణువణువు పులకించు అందాల లోగిలి! అనురాగమొలికించు ఆనంద రవళి! చరణం-1: వేదనాదము చేయు కోనసీమను చూడు..! వేల వనరులందించు.. మన్యసీమను చూడు..! ప్రగతిలో పయనించు…మెట్టసీమను చూడు..! మూడు సీమల కూడి, మురిపించు సీమ…! చరణం-2: విఘ్నేశ్వరుని కొలువు – ‘అయినవిల్లి’ని చూడు..! సత్యదేవుని నెలవు – ‘అన్నవరము’ను చూడు..! […]

Continue Reading

నూజిళ్ల గీతాలు-4 నెచ్చెలి (ప్రత్యేక గీతం)

నూజిళ్ల గీతాలు-4(ఆడియో) నెచ్చెలి (పాట) రచన: నూజిళ్ల శ్రీనివాస్ గానం: ఈశా వరకూరు ఎల్లరు మెచ్చే నెచ్చెలి ఏ ఎల్లలు లేని నెచ్చెలి తెలుగు వనితల సాహిత్యం వెలుగు చరితల ఔన్నత్యం లోకమంతటికి వెల్లడి చేసే ముచ్చటలాడే నెచ్చెలి స్త్రీ ప్రగతికి నిచ్చెన నెచ్చెలి! చరణం -1: ఏ రంగంలోనైనా స్త్రీ మూర్తుల కృషి ఘనమైనదని ఏ పనీ చేపడుతున్నా స్త్రీ విజయాలకు కొదవుండదని ఎరుక పరచు అంతర్జాతీయ వనితా మాస పత్రిక వెలుగులను పంచు అంతర్జాల […]

Continue Reading

నూజిళ్ల గీతాలు-3(ఆడియో) తెలియనే లేదు…

నూజిళ్ల గీతాలు-3(ఆడియో) తెలియనే లేదు… -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: తెలియనే లేదు… అసలు తెలియనే లేదు .. తెలియనే లేదు… నాకు తెలియనే లేదు .. ఎలా గడిచేనో కాలం తెలియనే లేదు… ఇలా ఎప్పుడేదిగానో తెలియనే లేదు… నిన్నదాక నే పొందిన అనుభవాలన్నీ జ్ఞాపకాలుగా మారుట తెలియనే లేదు..! చరణం-1: పల్లె లోన అమ్మ నాన్న తోన ఆట లాడుకున్న రోజు మరవనే లేదు ఇంతలోనే మనుమలొచ్చి నన్ను తాత అంటుంటే అర్థం కావటం లేదు […]

Continue Reading

నూజిళ్ల గీతాలు-2(ఆడియో) ఎందరో మహానుభావులు!

https://www.youtube.com/watch?v=ZgRxeREChak నూజిళ్ల గీతాలు-1(ఆడియో) ఎందరో మహానుభావులు -నూజిళ్ల శ్రీనివాస్ పల్లవి: ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు మహమ్మారి వైరసొచ్చిన వేళ, మనిషి పైనే దాడి చేసిన వేళ మానవత్వాన్ని మేలు కొల్పి ఈ లోకానికి మేలు చేసేటి వారు ఎందరో….! చరణం-1: రోగాలు మన దరి చేరకుండగా, ఇంటనే ఉంచి భద్రంగా చూస్తూ అయిన వాళ్లకు దూరంగా ఉన్నా అందరి క్షేమాన్ని కోరే పోలీసులు ఎందరో… ఎందరో మహానుభావులు – అందరికీ మా వందనాలు! […]

Continue Reading

నూజిళ్ల గీతాలు-1(ఆడియో) మా ఊరి మీదుగా నే సాగుతుంటే

నూజిళ్ల గీతాలు-1(ఆడియో) మా ఊరి మీదుగా నే సాగుతుంటే…. (జ్ఞాపకాల పాట) -నూజిళ్ల శ్రీనివాస్ *పల్లవి:* మా ఊరి మీదుగా నే సాగుతుంటే… గుండెలో ఏదొ కలవరమాయెగా..! మా అమ్మ నవ్వులే, మా నాన్న ఊసులే… గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా…. గురుతొచ్చి కనులు సంద్రమ్మాయెగా….! *అనుపల్లవి:* ఏడకెళ్ళిన గాని…ఏడున్న గానీ… నా ఊరు నను వీడిపోని అనుబంధం… నా బాల్యమే నన్ను విడని సుమగంధం…! *చరణం-1:* ఏ ఆవు చూసినా మా ఆవు గురుతులే… పచ్చిపాలను పితికి […]

Continue Reading