image_print

వసంత కాలమ్-18 పోలిక

 పోలిక  -వసంతలక్ష్మి అయ్యగారి ఆరోగ్యమే మహాభాగ్యం,శరీరారోగ్యము, దేహదారుఢ్యమూ ఉంటేసరా? మందులతో నిలబెట్టుకునే ఆరోగ్యమైనా యీ రోజులకి ఓకే , కానీ మానసికారోగ్యమంటూ మరోటుందిగా ! మనసుఖాయిలా పడితే మందులూ వుండవంటారు.అసలు మనసుని యెందుకు కష్టపెట్టుకోవాలట?****బోలెడు మందులు మాకులతోపాటూ మరిన్ని టానిక్కులు పంపి పండంటి బిడ్డలను ఆరోగ్యమే ప్రధానమంటూ కంటారు తల్లులు. పుట్టినదిమొదలు పోలికలపర్వమే!ఫలానా పిల్లకి బిస్కెట్ అలర్జీట. వెంటనే తల్లిమనసు తనపిల్లఅలర్జీ లిస్టు తో పోల్చేసుకుని మనసుని కుదుపుకుంటుంది.ఓపిల్లకి పాలు పడవు… మరొకర్తికి పండుపడదు .ఇంకోర్తికి పప్పు […]

Continue Reading

వసంత కాలమ్-16 ట్రాష్ డయెట్!

ట్రాష్ డయెట్ ! -వసంతలక్ష్మి అయ్యగారి ఊ.. ఏమిటక్కా విశేషాలు ? ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ  కట్టేసినట్టుంటోంది నాకైతే. అయినా మీ గేటెడ్ కమ్యూనిటీ పని బాగుందిలేవే. ముక్కులకి రామ్ రాజ్ తొడుగులేసుకుని యే కామన్ అడ్డాకో పోయి హాయిగా రకరకాల గాసిప్పులు కానిచ్చివస్తారు.నేనూ వున్నాను .. అయితే నట్టిల్లు … లేకపోతే నెట్టిల్లు . కొత్త వంటకాలేం చూశావేంటి? చూడడానికేం … వందలే. చేయడమే మరీ దిగిపోయింది వంటపని. అదేమలాగ?  ఏంచెప్మంటావ్.. అప్పుడే నాలుగు నెలలుగా యీయనేదో కీటో డైటని మొదలెట్టారు . ఆయన […]

Continue Reading

వసంత కాలమ్-15 భాషాభాగోతం

భాషాభాగోతం -వసంతలక్ష్మి అయ్యగారి యిదెక్కడి గోలండీ బాబూ…తెలుగు జాతీయాలు యింత నవ్విస్తాయనినాకు యిప్పుడిప్పుడే తెలుస్తోంది… కొన్నాళ్ళక్రితం…ఒక తెలుగు నేస్తంతో…”నువ్వు బొబ్ట్టట్లు ఎడం చేత్తో చేసిపారేస్తావుట కదా…”అంటేనూ…‘‘.నో నో…నేనెప్పుడూ వంటలుఎడమచేత్తో చెయ్యను..”అని శలవిచ్చింది..యిలా అన్నానని ఆవిడ నాకులీవు గ్రాంటు దేనికి చేసిందీ….అని మీరు నన్ను గాని ప్రశ్నించరు కదా…??సరే సరే…..ఆ విడ ‘‘బొబ్బట్లు చేసి పారెయ్యడమేమిటీ…”అనలేదనిసంతోషించాను. ఇది తలచుకున్నప్పుడల్లా నాలో నేనే నవ్వుకుంటూఉండేదాన్ని.ఇపుడంటే మీరంతా ఉన్నారు ..పంచుకోడానికి.ఇంతలో ఇదేజాబితాలోకి మరోటొచ్చి చేరింది..! మరో మిత్రురాలితో ..నేను..‘నిన్న ఒక్కపూట వంటచేయకపోతే […]

Continue Reading

వసంత కాలమ్-14 నవ్వుల్ నవ్వుల్

నవ్వుల్ నవ్వుల్ -వసంతలక్ష్మి అయ్యగారి ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు.. జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. .  ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” అనమాట!!![దయచేసి జోకునుగ్రహించవలెనహో!]ప్రమోషను అంతవరకూ తీసుకోలేదు… ఆయనవద్ద నేను విని..మేధోమథనం  కావించుకున్న కొన్నిమధురాలనుమీతో పంచుకుంటాను..సరేనా!!okay…. నెలపొడుగునా  సిబ్బంది లీవులు పెడుతూనేఉంటారుకదా..మామూలే..అటెండెన్సు రిజిస్టరుచూసుకుంటూ..లీవులెటర్లుఇవ్వని వారందరినీ పేరుపేరునా కలిసిమర్యాదపూర్వకంగా అడిగి..ప్రింటెడు లెటరు మీద వారి పేరుతోపాటురాని తేదీలను రాసిచ్చిమరీ వారి సంతకాలడిగేవారు…పాపం ఈచాదస్తపు పెద్దమనిషి.ఈపని పూర్తయ్యాకా లీవు పుస్తకంలోకి ఎక్కించివారివారి ఖాతాలకు కొయ్యాలనమాట..చేసిన పనిని బాసుగారికిచెప్పేసుకుంటే ఓపనిఅయిపోయినట్టు. సదరు గుమాస్తా గారు బాసువద్దకు వెళ్ళి..“సార్..no pending papers with me ….all promotion eligible files putupped…… boss: what about leave record?have u updated it? గుమాస్తా: yes sir…i have entertained all d leave letters…by bringing personally also…. boss: ok ok….what about your  promotion eligibility ? I think u have reached maximum basic…n r […]

Continue Reading

వసంత కాలమ్-13 చుక్చుక్ రైలువచ్చింది

చుక్చుక్ రైలువచ్చింది -వసంతలక్ష్మి అయ్యగారి నిజమే ..సరదాగా గతాన్ని కథలుగా,కబుర్లుగాచెప్పుకోవడంలో ఆనందంలేకపోలేదు.అందుకే..కొత్తసమాచారానికై తహతహలాడేమిత్రులున్నారనితెలియగానే..నడుంబిగించాను. 1998 లో ననుకుంట..తొలిసారికంప్యూటరైజ్డ్..రైల్వే సమాచారం రికార్డుచేయడంజరిగింది..సోమాజీగూడాలోనిఓస్టూడియోలో.తరువాతిరోజుల్లో యీ IVR ప్రక్రియ ప్రతి సంస్థవారు అవలంబించారు. టెలిఫోనులోఅవతలివైపు ఓరిసెప్షనిస్టుచేసేపనిమాదిరిగావుంటుందనుకోండియివతల ఫోనుచేసి వినేవారికి.వారుచెప్పినట్టునంబర్లు నొక్కుతే..సరిపడే సమాధానాలు మనకివినిపిస్తాయనమాట..దీనినే యింటరాక్టీవ్వాయిస్ రెస్పాన్స్..పద్ధతి అంటారు.మరమనిషిమనతో మాట్లాడినట్టే.నిజానికి అవతలివైపుమనిషంటూ లేకుండా ..మనమీరోజు సెల్ఫోన్సర్వీసు ప్రొవైడర్లతో యిలాంటి రీతిలోనేమనబిల్లు,కంప్లైంటు,ప్లాను మార్పువగైరాలన్నీజరుపుకుంటున్నాం.అయితే యిదెలా? రైల్వే స్టేషనులో గతంలో కాంట్రాక్టుఉద్యోగులు,షిఫ్టులలో ఓచిన్ని గదిలోమైకుముందుకూర్చుని..బండిఆగమనిగమసందేశాలు,విలంబనసూచనలురాత్రా,పగలా అన్నతేడా లేకుండావారికున్నఆదేశాలమేరకు..చేతికిచ్చినసమాచారాన్ని ఓbang వేసి చదివేవారట. మరిIVR వచ్చాకా కంప్యూటరే..ముందుగారికార్డుచేసిన వేవ్ ఫైల్ నుఫీడూ,లోడూ చేసి  ప్లేచేస్తే..సమయానుకూలంగా సమాచారంమోగిస్తుంది స్పీకర్లలో ప్రయాణీకులకు. రికార్డింగులో నాకు ఓకట్ట పేపర్లిచ్చేవారు.మైకుపొజిషన్ సెట్ చేసుకున్నాకా..విషయం కాస్తవంటపట్టించుకుని..చదువుతూపోయేదాన్ని.తెలుగు,యింగ్లీషు కాకహిందీలోనూ చదివిన సందర్భాలనేకం.ముందుతెలుగు చేసేదాన్నిఅలసిసొలసేదాకా! మామూలు డాక్యుమెంటరీలలాగ కాకుండాముందు స్టాండర్డు ప్రకటనలుకొన్ని..ఆపైఒకటినుండి  యాభైతొమ్మిది నంబర్లు..విడిగా“ఒంటిగంట..వంద,నూరు,వెయ్యి…గంటలు,గంటల,నిముషములు,సెకెన్లు…కొద్దిసేపట్లో…పగలు,మధ్యాహ్నం,సాయంత్రం, రాత్రి..“లాంటి పదాలు.. అలాగే….“నుండి“,“వరకు“,“కొరకు“,“లో.“..“యందు..“లాంటి విభక్తిప్రత్యయాలు విడిగా టేక్చేసేదాన్ని.ప్రతిమాటకు వారు కట్ చేసుకునేవీలు కల్పిస్తూ pause యివ్వాలి..పరుగులుపనికిరావస్సలు! ఆపైన..దేశంలో సికింద్రాబాద్ ను టచ్అయ్యేఅన్ని రైళ్లపేర్లు…[జంక్షన్ కనుక] ఒకటొకటీవైనంగా చదవాలి.మరికొన్నిఅనువైన,అవసరమైన పదాలను నేను బాగాసూచించేదాన్ని….అన్నీ రికార్డుచేసేసేవారు. వీటి అతుకుల పని..సౌండ్యింజనీరు,ప్రొడ్యూసర్ కమ్ agent లదే..అది మనం నిష్క్రమించాకే జరిగేది. కొత్తరైళ్లచేరిక జరిగినా…మార్పులేవివచ్చినా…నాకుపిలుపూ వచ్చేది! సమయం చాలాపట్టేది..తొలిరోజులప్రయోగాలుకనుక.యిపుడుయీరంగంలోవచ్చిన స్పీడు ఎవ్వరూఊహించనిది..అందుకోలేనిది. రైలుస్టేషన్ లో వారుచేసే సాఫ్ట్ వేర్ యిన్స్టలేషన్గురించి నాకుతెలియదు. కానీ..updating dynamics అంటూ మనకి కేబుల్టీవీ లో అపుడపుడుమాటలు,వీడియో..ముక్కలుగాబ్రేక్అయినచందానుంటాయా ప్రకటనలు. ప్రకటన!(టింగ్టింగటిటింగ్..) సమయం…రాత్రి పదిగంటల….యిరవైనిముషాల….పదమూడు సెకెన్లు. హైదరాబాదు…నుండి…విజయవాడ…మీదుగా…విశాఖపట్టణం చేరుకోవలసిన ..విశాఖా …express…. నంబరు..అయిదు..సున్నా.. నాలుగు..తొమ్మిది..తొమ్మిదీ.. మరికొద్ది…నిముషాలలో   …ఫ్లాట్ఫా్మ్…నంబరు…మూడు…పై… విచ్చేయనుంది. (tingtintiting) ఇలా వినిపించగానే..ముందు విన్నవారు ఏవిటాతెలుగు..ఆభాషనిఖూనీచేస్తూ..ఆవిరుపులేంటీ..యింతకంటేబాగాచదివేవాళ్లేలేరా..చిచీ..అంటూ నాలాగేప్రవర చదువుతారేమో కదా! కానీ..యీప్రకటనలన్నీ అతుకులబొంతలనిగ్రహించాలి.నిజానికి నేను..విభక్తిప్రత్యయాలను..[అంటే..నుండి..గూర్చి,గురించి,కొరకు,కై..]సందర్భంతెలుసుకునిమరీ..వీలైనంతదగ్గరగా అతికేలా శృతిచేసుకునిచదివేదాన్ని.రెండేళ్లతరువాత కొత్తఅతుకులకుస్టూడియోకి వెళ్లినా..మేడమ్ మీశృతి ఏమాత్రంమారలేదండీ…కరెక్ట్ గా అందుకుంటారుఎన్నేళ్లతరువాతైనా…భలే!అనేవారు! ఇపుడు అసలు కథ…నేను ఊహ తెలిసిఊరుకదిలి రైలు ఎక్కినది గట్టిగాఅయిదారుసార్లు.మావారు తరచు వారిఆఫీసుపనులమీద సిబ్బందితోకలిసి రైళ్లలో తెగతిరిగేవారు.ఆయనకిఏనాడూ నాగురించి  ప్రత్యక్షంగాపొగడటంకాదుసరికదా…యిదివిన్ననానో..అదిచూశాననో..చెప్పేఅలవాటులేదు…అన్నీ పరోక్షంగానే. ఓసారి వారి బాస్ ఒకరు మాయింటికిభోజనానికొచ్చి..మాటలసందర్భంలో..“వసంతా..u r so lucky,..ur husband praises u a lot..about ur cooking…..infact …the other day he stopped all of us at  secbad […]

Continue Reading

వసంత కాలమ్-12 ఒబ్బిడి

ఒబ్బిడి -వసంతలక్ష్మి అయ్యగారి ఊ.. ఏమిటక్కా విశేషాలు ? ఏముంటాయే.. వెధవలాక్ డౌన్ కాదుగానీ కట్టేసినట్టుంటోంది నాకైతే. అయినా మీ గేటెడ్ కమ్యూనిటీ పని బాగుందిలేవే. ముక్కులకి రామ్ రాజ్తొడుగులేసుకుని యే కామన్ అడ్డాకో పోయి హాయిగా రకరకాలగాసిప్పులు కానిచ్చివస్తారు. నేనూ వున్నాను .. అయితే నట్టిల్లు … లేకపోతే నెట్టిల్లు . కొత్త వంటకాలేం చూశావేంటి? చూడడానికేం … వందలే. చేయడమే మరీ దిగిపోయింది వంటపని. అదేమలాగ? ఏంచెప్మంటావ్.. అప్పుడే నాలుగు నెలలుగా యీయనేదో కీటో […]

Continue Reading

వసంత కాలమ్-11 గోపికాబొమ్మలు

గోపికాబొమ్మలు -వసంతలక్ష్మి అయ్యగారి మొన్న సంక్రాంతికి ముందూ వెనుక …రెండుమూడు పేరంటాలకి వెళ్లివచ్చాను.మా కొత్త ఫ్లాటుకొచ్చాకా గేటుదాటి బయట యిరుగుపొరుగు నాకు బొత్తిగా ఎవ్వరూ తెలియదు.నలుగురి తో పరిచయాలిష్టపడతానుకనుక పిలిచినచోటకల్లా వెళ్లాను.కొత్త కనుక ”సునిశిత పరిశీలనకుపెద్దపీటవేసి కూర్చోబెట్టి …నోటికి చిన్నిషీల్  తాళంవేశాననొచ్చు.‘‘ నా మూలాలు తూగోజీ కోనసీమవే అయినా…ఊహ తెలిసినప్పటినుండీ హైదరాబాదీ నే!అంచేత భాష అర్థమవకపోవడం వంటి యిష్యూస్ అస్సలు లేవు.పైగా అన్నియాసలమాధుర్యాన్ని ఆస్వాదిస్తాను,ఆనందిస్తాను,తనివి తీరా!! ముక్కనుమ నాడు సాయంత్రం నేను వెళ్లిన వారిల్లు పేరంటాళ్లతో సందడిగా […]

Continue Reading

వసంత కాలమ్-10 నవ్వుల్ నవ్వుల్

నవ్వుల్ నవ్వుల్  -వసంతలక్ష్మి అయ్యగారి ఒకాఫీసు…పాతిక మందిదాకా సిబ్బంది వుంటారు.. జీతాలూ…లీవులూ ..లోనుసాంక్షనులు ..ట్రాన్స్ఫర్లు,ప్రమోషనుకుపుటప్లు…వగైరా లను చూసుకునే సెక్షను ఒకటుంటుంది.ఇంచుమించుHR అనుకోండీ..అందులో యాభైదాటిన గుమాస్తా తనదైన ఇంగ్లీషుతోఅదరగొట్టేస్తూ ఉండేవారు.. .  ఇంగ్లీషు దిగి మాతృభాషలో పలకరించడంకూడా నామోషీ ఆయనకి…ఐతేమాత్రం…అందరినీ కలుపుపోతూఉండేవారు…very “colloquial” అనమాట!!![దయచేసి జోకునుగ్రహించవలెనహో!]ప్రమోషను అంతవరకూ తీసుకోలేదు… ఆయనవద్ద నేను విని..మేధోమథనం  కావించుకున్న కొన్నిమధురాలనుమీతో పంచుకుంటాను..సరేనా!!okay…. నెలపొడుగునా  సిబ్బంది లీవులు పెడుతూనేఉంటారుకదా..మామూలే..అటెండెన్సు రిజిస్టరుచూసుకుంటూ..లీవులెటర్లుఇవ్వని వారందరినీ పేరుపేరునా కలిసిమర్యాదపూర్వకంగా అడిగి..ప్రింటెడు లెటరు మీద వారి పేరుతోపాటురాని తేదీలను రాసిచ్చిమరీ […]

Continue Reading

వసంత కాలమ్-9 చేబదుళ్ళు..

చేబదుళ్ళు.. -వసంతలక్ష్మి అయ్యగారి మీలోఎంతమందికి ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీరిచ్చిన ”చేబ దు ళ్ళ” సంగతులు గుర్తొస్తాయి..ఇచ్చికాల్చుకోని చేతులుండవనే నమ్మకం…!!అసలంటూ ..ఇచ్చేబుద్ధి,కాస్త ంత మొహమాటం మీకున్నాయో….మీరుఔటే..దొరికిపోయారే..పైగా వయసు ముదురుతుంటే..ఈ గుణం కూడాపరిఢవిల్లుతందే తప్ప తోకముడవదు..తగ్గిచావదూ..! అందరికొంపలలోనూ అనాదిగా అయ్యల అపాత్రదానాలూ…అమ్మలుఅశక్తితో అరచిఅలసిపోవడాలు..దీన్ని ఆసరాగా అలుసుగా చేసేసుకునిఆహా మేమే కదా పేద్దదానకర్ణులదాదీలమన్నట్టూ,బలిగారిబాబులమన్నట్టూ..మాచేతికికఎముకలేదనుకుంటూ.. ఫీలవడమేకాక ఎముకలేని నాలుకను తెగ ఆడిస్తూ..ఆడవారినిఅదేపనిగా   ఈసడిస్తూ..పీనాసి తనంతో పాటూ…మహానసశ్రీలని,మాయదారి గొణుగుడుబతుకులనీ దెప్పిపొడుస్తూ మగవారంతాఏకమైపోతారు..పనికిమాలిన సంతపనులు చేసేసి…మనపైచిందులుతొక్కి చెడుగుడాడేసుకోడం మనందరి ఇళ్ళల్లో ఆనవాయితీగామారింది.ఐతే..ఇదంతా ఓ […]

Continue Reading

వసంత కాలమ్-8 అతిసర్వత్ర వర్జయేత్

అతిసర్వత్ర వర్జయేత్ -వసంతలక్ష్మి అయ్యగారి అర్థంపర్థం లేకుండా,వేళాపాళా లేకుండా,వివక్ష,విచక్షణ లేకుండా,రుచీపచీ లేకపోయినా ,తోచినాతోచకకొట్టుకుంటున్నా యాంత్రికంగా చేతులు తినుబండారాల భండారాలవద్దకేగి…అందినంతదోచి నోటిగూట్లో పడేసి గిర్నీ ఆడించి మరపట్టడం  కచ్చితంగా యేదో మాయరోగమే.కాస్త తీక్షణంగా ఆలో చిస్తే బొత్తిగా మనకంటూ ఓ మంచి ఆరోగ్యకరమైన వ్యాపకం లేకపోవడం ఓ ముఖ్య కారణమైతే…మెదడు మరీ తీవ్రంగా ఫలానా నిర్ణయాత్మకవిషయమై చిక్కుకు పోయుండడం యింకో కారణమని తోస్తుంది. అంటే….కొంతమంది టెన్షన్ ఎక్కువగా ఉండి యీ రోగాన్ని ఆశ్రయిస్తే మరికొందరుబొత్తిగా తోచక దీని బారిన […]

Continue Reading

వసంత కాలమ్-7 సంఘర్షణ

సంఘర్షణ -వసంతలక్ష్మి అయ్యగారి తెల్లవారినదగ్గర్నుండీ ప్రతి క్షణం సంఘర్షణే…ఎవరితో తల్లీ అనుకుంటున్నారా.. నాతోనేనే..నాలోనేనే..!నలిగిపోవడమేననుకోండి. లేస్తూనే వార్మప్ కింద సెల్లు తెరచి కొంపలంటుకుపోయే అలర్టులేమైనా ఉన్నాయేమోననిప్రివ్యూలైనా చూడడమా,వాకింగా,యోగానా,లేక లక్షణంగా ఫిల్టర్కాఫీ తో రోజునారంభించి,పనులన్నీ అయ్యాక,తీరిగ్గా  అటుసెల్లులో వాట్సప్పూయిటు ఐపాడ్లో ఫేసుబుక్కూ,దగ్గర్లోనే లాండులైనూ ఏర్పాటు చేసుకుని ,లాపుటాపుకి కాస్త దగ్గరలో ఉంటే పిల్లలుస్కైపు లోకొచ్చినా మిస్సవకుండా ఉండొచ్చు..అన్న విషయంతో మొదలు యీ కాను ఫ్లి క్టూ!! కాఫీటీలు మానేసి పాలో..వుమెన్స్  హార్లిక్స్ తాగి బలం పెంచుకోవాలా?పెద్దలాచరించిన సంప్రదాయాన్ని కొనసాగించాలా? వంటపని […]

Continue Reading

వసంత కాలమ్ -6 పలుకేబంగారాలు

పలుకేబంగారాలు -వసంతలక్ష్మి అయ్యగారి అమ్మలదినం .. అయ్యలదినం తోబుట్టువుల దినం స్నేహదినం డాక్టర్లదినం , యాక్టర్లదినం యీ క్రమంలో నోటిదినం అంటూ యింకా పుట్టలేదుకదా! ఏమైనా ప్రస్తుత కాలంలో సర్వేంద్రియాణాం నోరే ప్రధానం!!పదునైనదానోరు. స్వతంత్ర ప్రతిపత్తి కల్గిన వాక్కు ను వెలువరించేదానోరే కదా! అవతలి మనిషిని ఆకట్టుకొనేదీ ఆ నోరే..అల్లంత ఆవలికి నెట్టేసేదీఆ నోరే! మన జీవితంలో ఎన్నిరకాలు తింటున్నామో..అన్ని రకాల నోటితీరులు ..మాటతీరులు చూస్తుంటాం. ముందుగా బాహ్యప్రపంచానికి చెందినవి. రాజకీయనాయకుల ఉపన్యాసాలు..హెచ్చు శృతి ..అధిక శ్రమ..వాళ్ళ […]

Continue Reading

వసంత కాలమ్ -5 అతిథి వచ్చి ఆకలంటే

అతిథి వచ్చి ఆకలంటే -వసంతలక్ష్మి అయ్యగారి మాపక్కగుమ్మమే  ఓ పేరున్న డయాగ్నోస్టిక్ సెంటరు..నూతనంగా వెలసిన వైద్యపరీక్షాలయం…మనకి గుడి తోసమానం.. గుడ్డిలో మెల్లన్నట్టు …అదో ఆనందం…ముఖ్యంగా తెల్లారుతూనే పరకడుపున చేయించుకోవలసినరక్తపరీక్షలువంటివాటికి   చెప్పలేనిదాహాయి! రక్తహీనత,ఎముకసాంద్రత,సంపూర్ణ రుధిర చిత్రం..ఇలా ఓనాలుగు పరీక్షలకి, నాలుగువేలు వారికిచ్చి…స్కూల్ లో లాగా  క్యూ క్రమశిక్షణ పాటించి రక్తనమూనా స్వీకర్త వద్దకూర్చుని వారడిగిన హస్తాన్ని వారికే చాచి ఇవ్వడం..పిడికిలిబిగించి,కనులు గట్టిగా మూసుకొని బలిసిన చేయిలో నరందొరకక ఆవిడ నొక్కులకు,సన్నాయినొక్కులకు అసహనంఅసంపూర్ణంగా వ్యక్త పరచడం..పరిపాటి.ఇన్ని పరీక్షలుకనుక  హోల్సేల్ గా కాస్త యెక్కువగానే గుంజివుంటారునారక్తం..పైకంలాగే.. ఏం శిక్షణ తీసుకుంటారోగానీ..రక్త సేకరణ ఘడియల్లో మనలను ఏమార్చడం కోసం..ఒక్కొక్కరిదీ  ఒక్కోవైనం. నాకు దొరికిన మహిళామణి, ముసుగులో మునిగి పోయి నేత్రద్వయాన్ని మాత్రం   ప్రదర్శించుకుంటున్నముసలమానుభామ! ఈ ఘట్టం నాకు త్రైమాసిక  పండగే ! నాక్రితం విజిట్ లో కూడా ఆవిడే లాగినట్టు గుర్తు.అందుకనేమో  నన్ను హలో..కైసేహై? అని పలకరించింది.నేనూ ఆబీబీ కినా సలాము చెప్పాను. చెయ్యి..ఇయ్యి…మడుచు..ముడుచు..మామూలే..సిరంజి గుచ్చుతూ…మాటల్లో పెట్టింది,అదీ మామూలే.. “జరా వెయిట్ జ్యాదా పుటాన్ కియే క్యా…? అంది. “ హాఁ..బిల్కుల్ .. థేరాయిడ్ ఠీక్ నహీ హై షాయద్”అనేశా. ఇంతలో ఈ నారీ మణి నాడీని నరాలను వెతికి పట్టింది.ఇంకేముంది…మాటలు పెంచి..లోతుగా దించుటే..దృష్టిమరలుస్తూ ఆవిడన్నమాటలు ఉభయతారకంగా తెలుగులోరాస్తానేం..జరిగినది ఉర్దూలోనైనా. నేను మిమ్మల్ని రోజూ మీ బాల్కనీలో వాకింగ్ చేసే టపుడు చూస్తుంటా. చానా సార్లు చెయ్యిఊపి హాయ్ చెప్పినా. మీరు భీనవ్వినార్ . కానీ నేను మీకు తెల్వ కుండచ్చు..బుర్ఖా ఉందికదా. మీ ఇంటి ముంగల రోజూ మామిడి పళ్ళ బండిఉంటదికదా. అక్కడ కొన్కోని మీదగ్రా వచ్చీ తిందామనుకున్నా. అంటూ తలతోక లేకుండా  అర్థంపర్థం కాకుండాపరభాషలో పలుకుతూ పోయింది. నాకు సగంఎక్కలేదు..ఒక పక్క పీకేస్తున్నందుకేమో తెలియదు. అయినా నా సహజ శైలిలో  పక్కనే కదా,ఎటువంటిఅవసరముదన్నా రండి మాయింటికి. లంచ్కి కూడారావచ్చునన్నానను కుంట..రెండోసారి చూపులు కలసినందుకే. అదీకేవలం చూపులేఅని చెప్పాగా ! బురఖా బీబీ కనక  రూపురేఖలు  రూల్డౌట్!వెనక బోలెడుమంది క్యూలో వెయిటింగూ. ఐనా యీవిడ ఓచక్కని scribble pad తీసుకుని  friends are always better than relatives అనే అర్థమొచ్చేలా ఏదోగొణుగుతూ నా సెల్ నంబర్ తీసుకుంది. నిరభ్యంతరంగా యిచ్చా! రాత్రి తొమ్మిదికి మావారే వెళ్ళి తెచ్చిన రిపోర్టులను ఎంసెట్ రిజల్ట్ లెవెల్లో కిందాపైనా చూసేశాం. సరిగ్గా నోరుతిరగని పేరుగల ఆ బీబీగారు, ఒకేఒక్క రోజు gap లోపదకొండింటివేళ నాకు ఫోను. “నాకు మీ దీ ఫేవర్ కావాలి,మీయింటికి లంచ్కీ వస్తాన్, ఒకటిగంట కొట్టినంకా. నాకు డబల్ డ్యూటీ పడిందిజీ, నాకోసం యిస్పేషల్ యేదీ భీ వండొద్దు, మీరు చేసినదేది ఉంటే అదేసాల్…ఐదు మినట్కూడా కూసోనూ” అన్నది. దానిదేముందీ  నావంట పదింటికే పూర్తవుతుంది కనక ఫ్రెష్ గా కాస్త అన్నం వండి పిలవచ్చులే అనుకుంటూనేఉన్నా..మనసు దానిపని అది చేస్తూ పోతోంది. కాస్త అజీబ్ గా,వింతగా,కొద్దిగా భయంగా…పిసరంత ఫన్నీగా ఎవరబ్బా ఈ అజ్నబీ అంటూ ఏంటేంటో మిశ్రమభయాలు,భావాలమధ్య అన్నం వండడమేకాక అలంకరణలుకూడా ఆరంభించా. ఇంతలో వచ్చేసా  మీ గేటులోకంటూ కాల్ రానే వచ్చింది. తలుపు తెరచి మెట్లెక్క మని చెప్పి లోపలికొచ్చా. అమ్మగారువేంచేశారు.”ఆయియేఆయియే..” అంటూ సాదరంగా నేను ఆహ్వానించాను. “ముందు నీ పేరు స్పెల్లింగుతో పాటూ చెప్పుమహాతల్లీ”అన్నాను.అమ్తుల్ హజీజ్ అన్నట్టనిపించింది.  వస్తూనే  “సారీ!  నేన్ లోపల్ రాను. నాకు ఈ డబ్బాలో ఏమేస్తావో వేసెయ్,టైమ్లేదు,పేషంట్ వెయిటింగ్,యేమనుకోవద్దూ ….ప్లీజ్అంటుంటే, వడ్డనకు సిద్ధంచేస్తూ నేను పడిన శ్రమకి  నాకు  చిరాకు కలిగింది. అయ్యో ..అదేమిటీ,,తినడానికికూడా తీరిక లేదా   అదెక్కడి ఆఫీసూ?  లోపలికైతే రాతల్లీ అన్నాను. చాలాసంకోచిస్తూ  డైనింగ్టేబుల్ దగ్గరకొచ్చింది.  కంచంలో కప్పులవారీగా అమర్చడమూ చూసింది. వసంతాజీ,  మీతో చాలాచాలా చెప్పుకోవాలీ.కానీ యిపుడుకాదూ అని రక్షించింది.  ఒక మాదిరి పెద్దసైజు ప్లాస్టిక్ డబ్బాతెరిచి కలగూరగంపలా అన్నీ  యిందులోపడేయండి అంటే నేను ఆపనే చేశాను. అన్నమూ,దానిమీదమామిడికాయపప్పు,వంకాయకారంపెట్టినకూర,టమాటా పచ్చడి…వేసి, వేడిచేసిరెడీగా పెట్టిన రసంమాటేమిటీ    పాపం వాళ్ళు రసంఅనబడే ఈ చారు చేసుకుంటారో లేదోకదా  అని గాబరా పడుతూ కాలూచేయీఆడనంత కంగారుపెట్టేస్తుండడంతో   నాకు ఏమీ తోచని పరిస్థితి! ఇంకా కొత్తావకాయబద్ద వెయ్యాలని ఆరాటం. కుచ్ డిస్పోసబుల్ హైతో ఉస్మే దాల్దో మేడమ్.  (నేనలాగే నీళ్ళసీసాలో పోసిచ్చాను రసం). ఫిర్భీ మీరు అన్ని రకాలు ఇస్తున్నారుమేడమ్..అంత వద్దు,ఇంటి తిండి తిని పదిదినాలైంది  అంటూ..దుఃఖాన్నిదిగమింగుతూ   బురఖా ముసుగు పైకెత్తి కన్నీరు తుడుచుకున్న పుణ్యఘడియల్లో వారిముఖారవిందం నామదిలో ముద్రించేసుకున్నాను..అంతకుమించి..పెద్దగా పర్సనాలిటీ…[మిడిలేజ్అనితప్ప] మరేమీతెలియలేదు. అదేమిటీజీ   లంచ్ అవర్ కూడా యివ్వరా  మీ దగ్గరా..యెంతిస్తారసలుజీతం..ఇస్తారా అదీ ఎగవేతేనా..అయినాసెక్యూరిటీకి చెప్పి హోటల్నుండీ తెప్పించుకుంటే..తప్పా…టూమచ్..అంటూ చిటపటలాడాను. “ఏంచెప్పమంటారు  మేడమ్, మీతో బహుత్కుచ్బోల్నాహై” అంది అమ్మో..గుండెగుటుక్కుమందినాకు..ఉన్నకతలకే తలలో చోటుసరిపోవడంలేదని సిగ్నల్స్ వస్తుంటే  ఇదేంగోల..వద్దుతల్లీ..అని అచ్చతెలుగులోకచ్చితంగా నాతోనేననుకున్నాను. “ఎనిమిదివేలిస్తారు..నాకు ఇద్దరుపిల్లలు.మా సిస్టర్కిచ్చేసినా.  నాది  పూరా  పైసల్వారికొరకే. సబ్కుచ్ యిచ్చేస్తాన్, నేను ఫారిన్ రిటన్వుందీ”అంది. “మరింకేం..మీఆయనెక్కడా..?” ఆమెదుఃఖం ద్విగుణీకృతమైంది.  కన్నీరు కాల్వలుకట్టకుండా తమాయించుకుంది. యింతలో నేను నా ఉర్దూ హిందీమిశ్రమ్ భాషా ప్రావీణ్యం ప్రదర్శిస్తూ. “క్యా ఆప్కే పతీజీ గుజర్గయే..? “అని నోరు జారేశా..ఏడుపుచూసనుకుంట.. “నైనై,  కళ్ళు తుడుచుకుంటూ..హైహైఉనోహై,  లేకిన్,  క్యా బతావూఁ..చాలా చెప్పేదివుందీజీ..”అంది.. చాలా వద్దులేతల్లీ..అని స్వగతంలోనేనుమళ్ళీ.. మీరు టీవీలలో చూసేదీ చాలా తక్వ వుందీ.  నాదీ కష్టాల్ ఎవర్కీ భీ వద్దు అంది. ఓ.అలాంటివా…అనుకుంటూతలూపాను, […]

Continue Reading

వసంత కాలమ్ -4 పామరపాండిత్యం

పామరపాండిత్యం -వసంతలక్ష్మి అయ్యగారి పదిరోజులుగా లోసుగరనీ,హైసాల్టనీ..డాక్టర్ వద్దకి చక్కర్లుకొట్టానే తప్ప,యింటిగడపేకాదు..పక్కదిగి ఐపాడూ పట్టుకోలేదు.కాలుకదపనిదే కబుర్లెలా వస్తాయిచెప్పండి..పదిరోజులుగా పనమ్మాయే నాలోకం! నెల్లాళ్లుగా దానిది ఒకటే గోడు..యిల్లుఖాళీచేయాలనీ..మరోయిల్లు వెతుక్కోవాలనీ!నెలలో మూడుసార్లుశలవు చీటీ యివ్వడమూ..చివరినిముషంలోతేడాలొచ్చి డ్యూటీ కి వచ్చేయడం జరిగింది…నాకు pleasant surprise లనమాట! ఓరోజు మాయిల్లూడుస్తూ…అమ్మా..మంచిరోజెప్పుడోచెప్పరా…అంది!ఎందుకనంటే…యిల్లు యెదుకుడు మొదలుపెట్టనికీ..అంది. ఇల్లుమారేరోజు కి…పాలుపొంగించుకోవడానికి మంచిరోజుచూడాలితప్పితే…వెతుక్కోడానికి కాదుపద్మా..అని చెప్పాను. చివరాఖరుకి ..ఓగది..వంటిల్లు,బాత్రూమ్ఉన్నబుజ్జిపోర్షన్, బేచిలర్స్ ఖాళీ చేయగా అయిదువేలకి తీసుకుని ముహూర్తం పెట్టించుకుందినాతో!రెండురోజులశలవడిగి..వాళ్లపాపను పంపినన్ను తప్పక తనకొత్తింటికి తోలుకరమ్మంటాననిపదేపదే చెప్పింది.అలాగేవస్తాలేఅన్నాను. పద్మమంచి ప్లానర్..చాలా క్రమశిక్షణ […]

Continue Reading

వసంత కాలమ్ -3 ప్రశాంత జీవనం!

ప్రశాంత జీవనం! -వసంతలక్ష్మి అయ్యగారి సృష్టిలో మనుషులు,మనస్తత్వాలు ఎన్ని రకాలో మరణాలుఅన్ని రకాలు.ఆపై ఓ మరణవార్తకి మనుషుల స్పందనలోనూఅంతే వైవిధ్యం.జననమరణాలు దైవాధీనాలే అయినా పూర్ణాయువుకలిగి పైకెళ్లడంఓటైపైతే,అకాలమరణం,అర్థాయుష్షూ మళ్ళీ వేరు.అక్కడితో అయిందా?సునాయాస,అనాయాస,ఆయాస,ఆపసోప,ఆసుపత్రి[ప్రభుత్వ,కార్పోరేటు]..హబ్బో..యీ వర్గీకరణ కి తెగూతెంపూ లేనట్టుందే! ఇదిలా ఉంటే,పుట్టిన ప్రతిజీవి  తన తల్లిదండ్రులు గతించడాన్ని ఒకలాగ, అత్తమామల కన్నుమూతని మరోలాగ, సహచరులు, ఏకోదరులైతే యింకోలాగ, దగ్గరిబంధువులైతే  ఓలాగ, దూరపువారి దుర్వార్త మరోలాగ, వృద్ధులనిర్యాణమైతే కాస్త గంభీరంగా….యిలా రకరకాలుగా స్వీకరించి స్పందిస్తాడు కదా! కొన్నింటికి షాకుకు గురై మరీ […]

Continue Reading

వసంత కాలమ్ -2 కాలం మారిపోయింది బాబోయ్

కాలం మారిపోయింది బాబోయ్! -వసంతలక్ష్మి అయ్యగారి ఈమధ్య సహోద్యోగులూ,స్నేహితులపిల్లల పెళ్లిసంబంధాలు,తత్సంబంధితమైన సమాచారం, మాటైము తో పొంతన లేని వింతపోకడలు గమనిస్తుంటే  గమ్మత్తనిపించినా విస్తుపోకతప్పడంలేదు. మగపిల్లల తల్లిదండ్రులు మరీ అవస్థపడుతున్నారనిపిస్తోంది! ఒకమాటైతే నిజం. పిల్లలెవరైనా,25-28సం.ల వయసులో ప్రేమించి పెళ్లిళ్లు సాఫీగా జరిగిపోయి సంసారసాగరపుయీతలో పడిపోతే గొడవేలేదు తల్లిదండ్రులకు! ఇపుడన్నీచిన్న సైజుకుటుంబాలే…పైపెచ్చు పెళ్లౌతూనే వేరు కాపురాలేకనుక ..సమస్యలతీరు మారుండచ్చు..కానీ తీవ్రత తగ్గినట్టేననిపిస్తోంది! ఈకాలపు పెళ్లిసంబంధాలూ, arranged marriages చిట్టా తీస్తే మాత్రం, కుర్రకారు ఎదుర్కొంటున్న పరిస్థితి దుర్భరంగా ఉంటోందనిపిస్తోంది.మాట్రిమొనీ,వెబ్ రెజిస్ట్రేషనుకాకుండా […]

Continue Reading

వసంత కాలమ్ -1 ఛత్తీస్కోసత్తాయీస్

ఛత్తీస్కోసత్తాయీస్ -వసంతలక్ష్మి అయ్యగారి   రాజభాషలో టైటిలోటా..అనుకుంటున్నారా…! ముప్ఫైఆరుకి యిరవైఏడు…అన్నమాట. ఇవేం పరీక్షా ఫలితాలబ్బా…అన్నది మీ తరువాతి సందేహం..అవునా? కట్చేసి కథలో కెళ్తే…. *** మా పనమ్మాయి సంగీ మరాఠీది. బ్రహ్మాండంగా తెలుగుని తనభాషలోకి మలచుకునిమేనేజ్చేస్తుంటుంది. ఆ మలచడంలోంచే నాకు జోకులూ, కతలూ పుట్టుకొచ్చేది.మామూలుగా వీథి తలుపు తెరచుకుని వస్తూ నే చెవిలో సెల్లు అతికించుకునే వుంటూ కూడా ఊరంతా వినిపించేలా తనవారితో ఏదో ముచ్చటిస్తూనే తలుపు కొడుతుంది. మంచీచెడూ నాతో చెప్పుకుంటుంది. ఆవిడ గోడంతా ఎక్కువగా […]

Continue Reading