image_print

ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ)

ఇంద్రధనుస్సు రంగులు (తమిళ అనువాదకథ) తమిళం: లతా రఘునాధన్ అనువాదం: గౌరీ కృపానందన్ బాబిని మెల్లగా లేవనెత్తి వడిలో కూర్చో బెట్టుకున్నాడు. తన వెనక భాగాన్ని అటూ ఇటూ జరుపుతూ తనకు సౌకర్యంగా ఉండే ఒక భంగిమను బాబి కనుక్కోవడానికి కొంత సమయం వేచి ఉండాల్సి వచ్చింది. చేతిలో ఉన్న పుస్తకాన్ని తెరిచి పెట్టి, వెనక్కి తిరిగాడు బాబి. “ఇప్పుడు చెప్పు” అంటూ, తలను ఒక వైపుగా వంచి తండ్రి వైపు చూసాడు. ఏదో ఎదురు చూస్తున్నట్లు బాబి […]

Continue Reading
Posted On :

అనుసృజన-తిరుగుబాటు (మూలం: కేదార్ నాథ్ సింగ్, జ్ఞాన పీఠ్ అవార్డ్ గ్రహీత అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన-తిరుగుబాటు మూలం: కేదార్ నాథ్ సింగ్ అనువాదం: ఆర్. శాంతసుందరి ఇవాళ ఇంట్లోకి వెళ్ళగానేకనబడింది ఒక వింత దృశ్యంవినండి -నా పరుపు అంది :రాజీనామా చేస్తున్నా,మళ్ళీ నా దూదిలోకివెళ్ళిపోవాలనుకుంటున్నా!మరోవైపు కుర్చీ బల్లారెండూ కలిసి యుద్ధానికొచ్చాయి,కాళ్ళూ చేతులూ కొట్టుకుంటూ -ఇక చాలించండిఇన్నాళ్ళు భరించాం మిమ్మల్ని!తెగ గుర్తుకొస్తున్నాయి మాకుమా చెట్లుమీరు హత్య చేసినవాటిలోని ఆ జీవరసం!అటు అలమరలోనిపుస్తకాలు అరుస్తున్నాయివిడిచిపెట్టు మమ్మల్నిమా వెదురు గుబురుల్లోకివెళ్ళిపోవాలనుంది మాకుకొండెలతో కాట్లు వేసే తేళ్ళనీమమ్మల్ని ముద్దాడే పాములనీకలుసుకోవాలనుంది మళ్ళీ -అన్నిటికన్నాఎక్కువగా మండి పడిందిఆ శాలువకొన్నాళ్ళక్రితమే కులూ […]

Continue Reading
Posted On :

“ప్రైజు” (తమిళ అనువాదకథ)

 “ప్రైజు” (తమిళ అనువాదకథ) తమిళం: సుజాత  అనువాదం: గౌరీ కృపానందన్ ఆ సందులో ఒక్క కారు వెళ్ళడానికి మాత్రమే చోటు ఉంది. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు మురికి కాలువ పక్కగా నిలబడ్డారు. ఆ ఏరియాలో కారు ప్రవేశించడం పొంతన లేకుండా ఉంది. తెల్లని దుస్తులు, టోపీ ధరించిన డ్రైవర్. వెనక సీటులో ఉన్న యువకుడు టై కట్టుకుని ఉన్నాడు. నుదుటన పట్టిన చెమటను తుడుచుకుంటూ ఒక చోట ఆపమని చెప్పి అద్దాలను క్రిందికి దింపి , “36/48 […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల(చివరి భాగం)

అనుసృజన నిర్మల (భాగం-18) అనుసృజన: ఆర్.శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మరో నెలరోజులు గడిచాయి.సుధ మూడో రోజు మరిది వెంట వాళ్ళింటికి వెళ్ళిపోయింది.నిర్మల ఒంటరిదైపోయింది.ఇప్పుడు ఆమెకి ఏడుపొక్కటే మిగిలింది.ఆరోగ్యం రోజు రోజుకీ క్షీణించసాగింది.పాత ఇంటి అద్దె ఎక్కువని ఒక ఇరుకు సందులో చిన్న ఇల్లు అద్దెకి తీసుకుంది.ఒక గదీ, నడవా,అంతే.గాలీ, వెలుతురూ లేవు.ఎప్పుడూ ఇల్లు కంపుకొడుతూ ఉండేది.డబ్బున్నా భోంచెయ్యకుండా ఉపవాసాలుండేవాళ్ళు వదినా మరదలూ.సామాన్లు కొనేందుకు బజారుకెవరెళ్తారు అనేది సమస్య.ఇంట్లో మొగదిక్కు లేనప్పుడు రోజూ కష్టపడి వండటం […]

Continue Reading
Posted On :

పద్ధతి (తమిళ అనువాదకథ)

పద్ధతి (తమిళ అనువాదకథ) తమిళం: మాలన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్ తాతయ్య ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ కూర్చుంది జనని. తాతయ్యను అడగడానికి ఆమె దగ్గర ఒక ప్రశ్న ఉంది. ముఖ్యమైన ప్రశ్న. అడిగి తీరాల్సిన ప్రశ్న. తను చేసిన లెక్క సరియైనదా? తప్పా? జనని మళ్ళీ ఒకసారి పరీక్ష పేపరును తీసి చూసింది. లెక్క మీద అడ్డంగా ఎరుపు రంగు పెన్సిల్‍తో గీత గీసి ఉంది. మార్జిన్‍లో పెద్దగా సున్నా వేసి ఉంది. […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-17

అనుసృజన నిర్మల (భాగం-17) అనుసృజన: ఆర్.శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ “నేనిక్కడ అసలు లేను.బైట ముందుగదిలో ఉన్నాను.కళ్ళజోడు కనబడక ఇక్కడ పెట్టానేమోనని వెతికేందుకు లోపలికి వచ్చాను.చూస్తే తనిక్కడ కనిపించింది.నేను బైటికెళ్లబోతూంటే తనే,ఏమైనా కావాలా అని అడిగింది.కళ్ళజోడు కూడా తనే వెతికి ఇచ్ఇంది తెలుసా?” “ఓహో, మీకు కళ్ళజోడిచ్చి, కోపంగా బైటికెళ్ళిపోయిందనా మీరంటున్నది?” “నేనెంతో చెప్పాను, తను వచ్చే వేళయింది , కూర్చోమని.వినకపోతే నేనేం చేస్తాను?” “నకేం అర్థమవటం లేదు.ఒకసారి నిర్మల దగ్గరకెళ్ళొస్తాను.” అంటూ కదిలింది సుధ. […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-16

అనుసృజన నిర్మల (భాగం-16) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ కాలం గడుస్తోంది.ఒక నెలరోజులు గడిచినా తోతారామ్ వెనక్కి రాలేదు.ఆయన రాకపోతే ఎలా అనే విచారం నిర్మలని ఇరవైనాలుగ్గంటలూ పట్టి పీడిస్తోంది.ఆయన ఎలా ఉన్నాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో,ఆరోగ్యం బాగుందో లేదో అన్న ఆలోచనే లేదామెకి.తన గురించీ,అంతకన్నా ఎక్కువ తన కూతురి గురించే ఆందోళన ఆమెకి.ఇల్లెలా గడుస్తుంది?జీవితం గట్టెక్కేదెలా? పిల్ల భవిష్యత్తు మాటేమిటి? పైసా పైసా జోడించి దాచిన కాస్తంత డబ్బూ కొద్ది కొద్దిగా కరిగిపోతోంది!ఒక్కొక్క రూపాయీ […]

Continue Reading
Posted On :

గూడు (తమిళ అనువాదకథ)

గూడు తమిళం: రిషబన్  -తెలుగు సేత: గౌరీ కృపానందన్ తలుపు తియ్యడానికి ఎందుకు ఇంత ఆలస్యం? కాలింగ్ బెల్లును మళ్ళీ నొక్కాను. బస్ స్టాండు నుంచి ఇంటికీ రావడానికి పావు గంట నడక. ఇంకా ఊపిరి అందకుండా ఉంది. ఇంట్లో కుక్కూ మంటూ కాలింగ్ బెల్ మోగుతున్న శబ్దం వినిపిస్తూనే ఉంది. కానీ అమ్మ ఇంకా వస్తున్నట్లు లేదు. ఏమై ఉంటుంది? నిద్ర పోతోందా? లేక… అమ్మయ్య! నా ఆందోళన ఎక్కువ కాక ముందే అమ్మ వచ్చేసింది. […]

Continue Reading
Posted On :

అభిమానధనం (తమిళ అనువాదకథ)

అభిమానధనం (తమిళ అనువాదకథ) తమిళంలో: ఎస్. రామకృష్ణన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్   1976లో వెలువడిన వాహిని సుబ్రమణ్యం గారి ఆంగ్ల కధా సంకలనం, “కాలం యొక్క స్వరం” లో మా అమ్మ వ్రాసిన ఉత్తరం ఒకటి ప్రచురించ బడి ఉంది అన్న వార్తను అమెరికా నుంచి వేణి వ్రాసింది. నాకు నమ్మ శక్యం కాలేదు. వేణి నా కూతురు. పెళ్లై అమెరికాలో ఉంటోంది. లైబ్రరీ నుంచి తీసుకు వచ్చిన పుస్తకంలో తను  ఆ ఉత్తరాన్ని […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-15

అనుసృజన నిర్మల (భాగం-15) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ తోతారామ్ కి మాత్రం నిద్ర పట్టలేదు.’ముగ్గురు కొడుకుల్లో ఒక్కడే మిగిలాడు.వాడు కూడా చెయ్యిదాటిపోతే ఇక జీవితంలో చీకటి తప్ప ఏముంటుంది?తన వంశం నిలబెట్టేవాడే ఉండడు.రత్నాల్లాంటి పిల్లల్ని అన్యాయంగా పోగొట్టుకున్నానూ!’ అని బాధపడుతూ ఆయన కన్నీళ్ళు పెట్టుకున్నాడు.ఈ పశ్చాత్తాపంలో, ఈ గాఢాంధకారంలో ఒకే ఒక కాంతి కిరణం , కొడుకు తిరిగివస్తాడన్న ఆశ,ఆయన్ని పూర్తిగా కుంగిపోకుండా కాపాడుతోంది. ఏడుస్తూనే మధ్యమధ్య ఆయన చిన్న కునుకు తీస్తున్నాడు.కానీ […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-14

అనుసృజన నిర్మల (భాగం-14) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ “ఇంతసేపయిందేం? ఎక్కడ ఆగిపోయావు?” అంది నిర్మల విసుగ్గా. “దారిలో ఒక చోట నిద్రొస్తే పడుకున్నాను,” అన్నాడు సియారామ్ పొగరుగా. “చాల్లే,టైమెంతయిందో తెలుసా? పదయింది.బజారు అంత దూరమేమీ కాదుగా?” “అవును, గుమ్మంలోనే ఉంది!” అన్నాడు సియారామ్ వ్యంగ్యంగా. ” మర్యాదగా జవాబు చెప్పలేవా? నా సొంత పనిమీదేమైనా పంపించానా నిన్ను?” “అయితే ఎందుకలా పిచ్చిగా వాగుతున్నారు? కొట్టతను అంత సులభంగా ఒప్పుకుంటాడా? ఎంతసేపు వాదించానో ఏమైనా […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-13

అనుసృజన నిర్మల (భాగం-13) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ ఈమధ్య రోజూ ఏదో ఒక విషయానికి నిర్మలా , రుక్మిణీ పోట్లాడుకుంటూనే ఉన్నారు.నగలు దొంగతనమైనప్పట్నుంచీ నిర్మల స్వభావంలో పూర్తిగా మార్పు వచ్చింది.ఒక్కొకా పైసా కూడబెడుతోంది.సియారామ్ మిఠాయి కావాలని ఎంత ఏడ్చి రాగాలు పెట్టినా కొనటం లేదు. వాడి కోరికలే కాదు ఆమె తన అవసరాలకి కూడా డబ్బు ఖర్చు పెట్టటం లేదు.చీర పూర్తిగా చిరుగులు పట్టేదాకా కొత్తది కొనదు.నెలల తరబడి తలనూనె తెప్పించదు.ఆమెకి తమలపాకులంటే […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-12

అనుసృజన నిర్మల (భాగం-12) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మూడు గంటలకి జియారామ్ స్కూలునుంచి వచ్చాడు.వాడు వచ్చాడని తెలిసి నిర్మల లేచి వాడి గదివైపు పిచ్చిదానిఆ పరిగెత్తింది.”బాబూ, తమాషాకి నా నగలు తీస్తే ఇచ్చెయ్యవా? నన్నేడిపిస్తే నీకేం లాభం చెప్పు?” అంది. ఒక్క క్షణం వాడు గతుక్కుమన్నాడు.దొంగతనం చెయ్యటం వాడికిది మొదటిసారి.ఇంకొకరిని హింసించి ఆనందం పొందేంత కరకుదనం ఇంకా వాడిలో చోటు చేసుకోలేదు.వాడి దగ్గర ఆ నగల పెట్టే ఉంటే, దాన్ని ఎవరూ చూడకుండా […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-11

అనుసృజన నిర్మల (భాగం-11) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [పెళ్ళి ఇంక రెండు రోజులుందనగా తోతారామ్ వచ్చాడు.వరుడి అన్న డాక్టర్ సిన్హా ,వదిన సుధ మగపెళ్ళివారితో వచ్చారు.డాక్టర్ తనకి తప్పిపోయిన వరుడని తెలిసినప్పట్నించీ నిర్మల అతని ఎదుటికి వెళ్ళేందుకు బిడియపడసాగింది. సుధ ఒంటరిగా దొరికినప్పుడు మాటల్లో కృష్ణకి తన మరిది సంబంధం కుదిర్చింది సుధేనని నిర్మలకి తెలుస్తుంది.కట్నం తీసుకోకూడదని మామగారిని ఒప్పించింది కూడా తనేనని తెలిసి నిర్మల ,”ఎంత టక్కరి దానివి? నాకు తెలీకుండా […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-10

అనుసృజన నిర్మల (భాగం-10) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ చెల్లెలు కృష్ణ పెళ్ళికి ఇంకా ఒక నెలరోజులుందనగా ఇంట్లో ఎన్ని బాధ్యతలున్నా నిర్మల ఆగలేకపోయింది.పుట్టింటికి ప్రయాణమైంది.తోతారామ్ వెంట వస్తానన్నాడు కానీ అల్లుడు అత్తారింట్లో అన్నాళ్ళు ఉండిపోవటం మర్యాద కాదనీ, పెళ్ళికి రెండ్రోజులు ముందు రమ్మనీ నిర్మల ఆయన్ని వారించింది. నిర్మలతో సంబంధం అక్కర్లేదని అన్న అదే కుటుంబంలో రెండో కొడుకుతో కృష్ణ పెళ్ళి నిశ్చయమవటం అన్నిటికన్నా ఆశ్చర్యం.అప్పటికన్నా ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఇంకా అధ్వాన్నాంగా […]

Continue Reading
Posted On :

కేశాభరణం (కథ)

తెనిగీయం-4  కేశాభరణం ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి  నల్లకోటు కింద ముతక స్కర్టు, బూడిద రంగు తొడుక్కున్నాను. పైన బ్రౌన్ స్వెటరు వేసుకున్నాను. దానిపై కాస్త జాగ్రత్తగా చూస్తె గాని కనిపించని కంత. నీ సిగరెట్లు వల్లే ఆ కంత పడింది. అందుకే నాకు చాలా విలువైన స్వెట్టరు. లోపల ఒక పొడవైన బనీను…ఆ లోపల ఒక చిన్న బ్రా… చిన్న చిన్న పూలు డిజైను ప్యాంటీ వేసుకున్నా. చాలా చవగ్గా ఫుట్ పాత్ […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-9

అనుసృజన నిర్మల (భాగం-9) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ [మన్సారామ్ కి వైద్యం చేసిన డాక్టర్ కుటుంబంతో తోతారామ్ కీ నిర్మలకీ మంచి స్నేహం ఏర్పడింది. ఇళ్ళకి రాకపోకలూ, తరచ్ కలవటం జరుగుతూ ఉండేది. నిర్మల డాక్టర్ భార్య సుధతో  తను కడుపుతో ఉన్నానని చెప్పింది.ఆ విషయం తనకి ఏమాత్రం సంతోషాన్నివ్వటం లేదని కూడా అంది.తన తండ్రి హఠాత్తుగా హత్యకు గురికావటం వల్ల తనకి వచ్చిన ఒక మంచి సంబంధం ఎలా తప్పిపోయిందో, డబ్బులేని […]

Continue Reading
Posted On :

శిథిలం కాని వ్యర్థాలు (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం-3  శిధిలం కాని వ్యర్ధాలు ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి  వెయిట్రస్ అమ్మాయిలను చూస్తె ఎండకు ఒడ్డుకువచ్చి సేదతీరుతున్న సీల్స్ లా కనిపిస్తున్నారు. నూనె పట్టించిన వారి గులాబి శరీరాలు మెరుస్తున్నాయి. అది సాంయంకాల సమయం. ఆందరూ బాతింగ్ సూట్స్లో వున్నారు. డాని కళ్ళార్పకుండా వారినే చూస్తున్నారు. బైనార్కులర్స్ మాంటి దగ్గర అద్దెకు తీసుకున్నాడు. డాని చాలాసేపటి నుంచి చూడవలసిన దృశ్యాలన్ని చూసేశాడు. అయినా ఇచ్చిన డబ్బులు పూర్తిగా రాబట్టుకోవాలి కాబట్టి ఇంకా ఇంకా […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-8

అనుసృజన నిర్మల (భాగం-8) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మూడు రోజులు గడిచినా తోతారామ్ ఇంటికి రాలేదు.రుక్మిణి రెండు పూటలా ఆస్పత్రికి వెళ్ళి మన్సారామ్ ని చూసి వస్తోంది.పిల్లలిద్దరూ అప్పుడప్పుడూ వెళ్తున్నారు,కానీ నిర్మల ముందరి కాళ్ళకి కనిపించని బంధం! ఆడబడుచుని అడిగితే ఎత్తిపొడుస్తూ ఏదో ఒకటి అంటుంది.పిల్లలు సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ఒకరోజు జియారామ్ రాగానే అతన్ని మన్సారామ్ పరిస్థితి ఎలా ఉందని అడిగింది.మొహం వేలాడేసుకుని,” ఇద్దరు ముగ్గురు డాక్టర్లు వచ్చారు.ఏం చెయ్యాలని సంప్రదింపులు జరిగాయి.ఒక […]

Continue Reading
Posted On :

వెంట్రుకల బంతి (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం-2 వెంట్రుకల బంతి (కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి   కేట్ ఆపరేషన్ కోసం ఆసుపత్రికి వచ్చింది. ఆమె గ్భాశయంపై ఒక కంతి పెరింగింది. కాస్త పెద్దదే. చాలా మంది ఆడవాళ్ళకు ఇలా అవుతుందని డాక్టరు చెప్పారు. అయితే ప్రమాదకరమైన కేన్సర్ కంతి అవునో కాదో ఇప్పుడే చెప్పలేమన్నారు. ఆ కంతిని తాను చూస్తానని కేట్ చెప్పింది. ఆపరేషన్ జరిగింది…ఆ కంతి కేన్సర్ కాదు. కాస్త పెద్ద కంతి డాక్టర్ ఆపరేషన్ చేసి […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-7

అనుసృజన నిర్మల (భాగం-7) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ మన్సారామ్ మంచం మీద పడుకుని దుప్పటి కప్పుకున్నాడు.అయినా చలికి గుండెల్లోంచి వణుకు పుడుతోంది.జ్వర తీవ్రత వల్ల స్పృహ కోల్పోయినట్టు గాఢ నిద్రలోకి జారుకున్నాడు.ఆ నిద్రలో అతనికి రకరకాల కలలు రాసాగాయి.మధ్య మధ్యలో ఉలిక్కిపడి లేచి కళ్ళు తెరవటం, మళ్ళీ మూర్ఛ లాంటి నిద్రలో కూరుకుపోవటం. అలాటి మగతలో అతనికి తండ్రి గొంతు వినిపించి పూర్తి మెలకువ వచ్చేసింది. తడబడే కాళ్ళతో లేచి నిలబడ్డాడు.దుప్పటి జారిపోయింది.అప్పటికప్పుడు […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-6

అనుసృజన నిర్మల (భాగం-6) అనుసృజన:ఆర్. శాంతసుందరి  హిందీ మూలం: ప్రేమ్ చంద్ ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయిన మన్సారామ్ మర్నాడే వెనక్కి వచ్చాడు.అతనికి హాస్టల్ లో గది దొరకలేదు. తోతారామ్ చాలామందిని అడిగి చూశాడు.బైటి ఊళ్ళనుంచి వచ్చే పిల్లలకోసం గదులు ఖాళీగా ఉంచామనీ,ఊళ్ళోనే ఉన్న పిల్లలకి ఇవ్వలేమనీ స్కూలు యాజమాన్యం జవాబు చెప్పేసరికి తోతారామ్ ఏమీ చెయ్యలేకపోయాడు.రెండు వారాలు కాళ్లరిగేలా ఊళ్ళోని స్కూళ్ళన్నిట్కీ తిరిగినా లాభం లేకపోయింది. ఆరోజునుంచీ మన్సారామ్ ఇంట్లోంచి బైటికెళ్ళటం ఆయన చూడలేదు.చివరికి ఆడుకునేందుకు […]

Continue Reading
Posted On :

రాతిపరుపు (మార్గరెట్ ఎట్ వుడ్ కథ)

తెనిగీయం  రాతిపరుపు(కథ) ఆంగ్ల మూలం: మార్గరెట్ ఎట్ వుడ్ స్వేచ్ఛానువాదం: అరుణజ్యోతి   వెర్నా ఎవరినీ చంపాలనుకోలేదు మొదట. ఆమె ధ్యాసంతా కేవలం విహారయాత్రను ఎలా ఆస్వాదిద్దామన్నదానిపైనే. ఆర్కిటిక్ వాతావరణం కూడా ఆమెను ఉత్సాహపరుస్తోంది. తనతో పాటు విహారానికి వచ్చిన వారిని… ప్రత్యేకించి మగాళ్లను ఒక్కసారి పరికించింది. ఇన్నేళ్ల జీవితంలో తనతో పరిచయానికి తహతహలాడిన వారు చాలామందే వున్నారు. పాత అలవాట్లు అంత త్వరగా వదలవు మరి. అందుకే ఆ షిప్ డెక్ పై చేరిన వారిని ఆసక్తిగా […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-5

అనుసృజన నిర్మల (భాగం-5) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) ఆనాటినుంచీ నిర్మల ప్రవర్తనలో మార్పు వచ్చింది.తన కర్తవ్యం ఏమిటో అర్థమైనదానిలా నైరాశ్యంలో కూరుకుపోకుండా అన్ని పనులూ చురుగ్గా చేసుకోసాగింది. ఇంతకుముందు మనసులో ఉన్న కోపమూ, చిరాకూ, దుఃఖమూ ఆమెని జడురాలిగా చేసేశాయి.కానీ ఇప్పుడు, ‘నా ఖర్మ ఇంతే, […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-4

అనుసృజన నిర్మల (భాగం-4) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) నిర్మలకి లాయర్ తోతేరామ్ తో పెళ్ళయిపోయి ఆమె అత్తారింటికి వచ్చింది.తోతేరామ్ నల్లగా ,లావుగా దిట్టంగా ఉంటాడు.ఇంకా నలభై యేళ్ళు రాకపోయినా అతను చేస్తున్న ఉద్యోగం చాలా కష్టమైంది కాబట్టి జుట్టు నెరిసిపోయింది.వ్యాయామం చేసే తీరిక ఉండదు.చివరికి వాహ్యాళికి […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-3

అనుసృజన నిర్మల (భాగం-3) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) కల్యాణికి ఇప్పుడొక పెద్ద సమస్య వచ్చిపడింది.భర్త పోయాక ఆమె ఒంటరిగా  ఆ సమస్యని ఎలా ఎదుర్కోవాలో తెలీక సతమతమయింది.కొడుకులు చెప్పుల్లేకుండా స్కూలుకెళ్ళినా, ఇంట్లో అంట్లు తోముకుని,ఇల్లు ఊడ్చి తుడుచుకోవలసి వచ్చినా, ఒక పూటే తిని అర్ధాకలితో పడుకోవలసి […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-2

అనుసృజన నిర్మల (భాగం-2) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) పెళ్ళింట్లో శోకాలూ, ఏడుపులూ గురించి వివరంగా చెప్పి చదివేవాళ్ళ మనసులని బాధపెట్టటం నాకిష్టం లేదు.మనసులు గాయపడ్డవాళ్ళు ఏడుస్తారు,విలపిస్తారు,గుండెలు బాదుకుంటూ మూర్ఛ పోతారు.ఇది కొత్త విషయమేమీ కాదు.కల్యాణి మానసిక స్థితి ఎంత ఘోరంగా ఉండి ఉంటుందో మీరే ఊహించుకోగలరు.ప్రాణంతో […]

Continue Reading
Posted On :

అనుసృజన-నిర్మల-1

అనుసృజన నిర్మల (భాగం-1) –ఆర్. శాంతసుందరి  (హిందీ లో దాదాపు మొట్టమొదటి స్త్రీవాద నవల ప్రేమ్ చంద్ రాసిన “నిర్మల”. ఈ నవలకు ఆర్. శాంతసుందరి గారు అందజేస్తున్న సంక్షిప్త అనుసృజన నెచ్చెలి పాఠకుల కోసం నెలనెలా -) వకీలు ఉదయభాను లాల్ కి ఇద్దరు కూతుళ్ళు .పెద్దమాయి నిర్మల రెండోది కృష్ణ. నిర్మలకి పదిహేనో ఏడు కృష్ణకి పది నిండాయి. నిన్న మొన్నటి వరకూ ఇద్దరూ బొమ్మలతో ఆడుకునేవాళ్ళు. ఇద్దరిదీ ఒకే రకమైన స్వభావం.వయసు తేడా […]

Continue Reading
Posted On :

అనుసృజన-ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా

ఏడుగురు అన్నదమ్ముల మధ్య చంపా హిందీ మూలం – కాత్యాయని అనుసృజన – ఆర్ . శాంత సుందరి ఏడుగురు అన్నదమ్ముల మధ్య  పెరిగి పెద్దదయింది చంపా వెదురు కొమ్మలా నాజూగ్గా తండ్రి గుండెలమీద కుంపటిలా కలల్లో కదులుతూన్న నల్లటి నీడలా రోట్లో ధాన్యంతోపాటు రోకటి పోటులని భరించి పొట్టుతోపాటు చెత్తకుప్పలో పారేస్తే అక్కడ పూలతీవై మొలిచింది. అడవి రేగుపళ్ళ ముళ్ళపొదల్లో మాధవీలతలా పెరిగిన చంపా ఇంట్లో ప్రత్యక్షమైంది మళ్ళీ. ఏడుగురు అన్నదమ్ములతో కలిసి పుట్టిన చంపా […]

Continue Reading
Posted On :

అనుసృజన-ఆడదానికే ఎందుకు?

ఆడదానికే ఎందుకు?   హిందీ మూలం – అంజనా వర్మ                                                           అనుసృజన – ఆర్.శాంతసుందరి  ఆ వీధులే కదా ఇవి ఇంతకు ముందే కొందరు మగపిల్లలు నడిచివెళ్ళిన వీధులు? గోల గోలగా అల్లరి చేస్తూ తుళ్ళుతూ తూలుతూ కబుర్లు చెప్పుకుంటూ? ఆ వీధుల్లోనే ఆడపిల్లలూ వెళ్తున్నారు అసలు మాటా మంతీ లేకుండా ఎవరి కళ్ళైనా తమ మీద పడేలోపున అక్కణ్ణించి చల్లగా జారుకోవాలని. ఈ ఇళ్ళు కూడా అవే కదా ఒకప్పుడు చిన్నారి ఆడపిల్లలు ఉన్న ఇళ్ళు? శిల్ప,గుంజన్,మీతా […]

Continue Reading
Posted On :

అనుసృజన-తెగితే అతకదు ఈ బంధం

తెగితే అతకదు ఈ బంధం   హిందీ మూలం – జ్యోతి జైన్ అనుసృజన – ఆర్.శాంతసుందరి అనుభ,  కవిత చదవటం పూర్తిచేయగానే ఆ చిన్న హాలు చప్పట్లతో మారుమోగింది.  ఆమె కొద్దిగా వంగి, అందరికీ నమస్కరించి వెళ్లి తన కుర్చీలో కూర్చుంది.
” అనుభ గారూ ఎంత బావుందండీ కవిత ! కవితలోని మీ భావం కూడా అద్భుతం ! కంగ్రాచులేషన్స్ ,”అంటూ జుబేర్ తన చేతిని అనుభవైపు చాపాడు . 
”థ్యాంక్స్, ” అంటూ అనుభ అతనికి కరచాలనం చేసి, […]

Continue Reading
Posted On :

అనుసృజన-అస్తిత్వపోరాటానికి చిరునామా: అమృతా ప్రీతమ్

అస్తిత్వపోరాటానికి చిరునామా :అమృతా ప్రీతమ్ – ఆర్.శాంతసుందరి ఒక స్త్రీ అందంగా ఉంటే,ఆపై ప్రతిభ గలదైతే,తన అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు అడుగడుగునా ఎదురయ్యే ఆటంకాలని అధిగమించేందుకు ఈ ప్రపంచంతో హోరాహోరీ పోరాడుతూ పేరు తెచ్చుకోడం ప్రారంభిస్తే ఆమెకి ఎన్ని రకాల సమస్యలు ఎదురౌతాయో తెలుసుకోవాలనుకుంటే అమృతా ప్రీతమ్ జీవితమే దానికి మంచి ఉదాహరణ. అమృతా ప్రీతమ్ కూడా ప్రేమ్ చంద్ , శరత్ చంద్ర లాగ తెలుగు సాహితీ ప్రేమికులకి సుపరిచితమే. ౧౦౧౯,౨౧ ఆగస్ట్ లో పుట్టిన అమృత […]

Continue Reading
Posted On :

అనుసృజన- లీవ్ మి అలోన్(కవిత)

అనుసృజన- లీవ్ మి అలోన్       హిందీ మూలం  -సుధా అరోరా                                            అనువాదం : ఆర్.శాంతసుందరి  నాకప్పుడు పద్ధెనిమిదేళ్ళు కలల రెక్కల మీద తేలిపోతూ ఎప్పుడూ గాలిలో ఎగురుతూ ఉండేదాన్ని సీతాకోక చిలుకలుండే లోకంలో  రంగు రంగుల పూల తోటల్లో  అగరొత్తుల మెత్తటి సువాసన చిన్నగా వెలిగే దీపజ్వాల హఠాత్తుగా అమ్మ వచ్చి నిలబడుతుంది నా వెనకాల నేను విసుగ్గా అంటాను అబ్బ ,అమ్మా లీవ్ మి అలోన్ నా స్పేస్ నాకిస్తుంది అమ్మ నా మీద పూర్తి నిఘా […]

Continue Reading
Posted On :

అనుసృజన-వెస్టరన్ కల్చర్ మై డియర్ !

      వెస్టర్న్ కల్చర్ మై డియర్ ! హిందీ మూలం: స్వాతి తివారీ అనుసృజన : ఆర్. శాంతసుందరి ఎవరో తలుపు నెమ్మదిగా తట్టారు. తలుపు గడియపెట్టి పడుకున్న నాకు లేవబుద్ధి కాలేదు. ఎవరితోనూ మాట్లాడాలనీ లేదు.కానీ లేచి తలుపు తెరవక తప్పదు. ప్రణవ్ ఏదైనా మర్చిపోయి వెనక్కి వచ్చాడేమో.కానీ తాళం చెవులూ, రుమాలూ, ఫైళ్ళూ అన్నీ ఇచ్చి పంపించింది ప్రతిమ.అతను వెళ్ళగానే తలుపు గడియ పెట్టేసింది.అదే పనిగా బైటినుంచి తలుపు తడుతూ ఉండేసరికి […]

Continue Reading
Posted On :

అనుసృజన-నేను ఓడిపోలేదు

నేను ఓడిపోలేదు   హిందీ మూలం : ఊర్మిలా శిరీష్    అనుసృజన : ఆర్.శాంతసుందరి ఆ అమ్మాయి స్పృహలోకి వచ్చిన్నప్పుడు అక్కడ ఎవరూ లేరు. నల్లటి నిశ్శబ్దం మాత్రం అలుముకుంది.దోమల రొద, తేమ వాసన గదినిండా పరుచుకునుంది.బైట వర్షం ఆగిపోయింది,కానీ నీళ్ళు పారుతున్న చప్పడూ, చినుకుల చిటపటలూ ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి.రోడ్డుమీద మనుషుల సందడి వినిపిస్తోంది.ఆమె తన కళ్ళని చేత్తో తడిమింది…నిద్రపోతున్నానా, మేలుకునే ఉన్నానా… ఒక్క క్షణం పాటు అయోమయంగా అనిపించింది.ఇంకేదో రహస్యలోకం తన చుట్టూ […]

Continue Reading
Posted On :