image_print

నడక దారిలో(భాగం-30)

నడక దారిలో-30 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కుటుంబంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-45

మా కథ (దొమితిలా చుంగారా)- 45 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  హోటల్లో నాకో ఈక్వెడార్ స్త్రీతో దోస్తీ కలిసింది. మేమిద్దరమూ కలిసి సమావేశ స్థలానికి చేరాం. ఐతే చర్చలు శుక్రవారం ప్రారంభమైతే నేనక్కడికి సోమవారానికిచేరాను! మేం ఓ నాలుగైదు వందల మంది స్త్రీలు సమావేశమైన హాల్లోకి వెళ్ళాం. నాతో పాటు ఉన్న స్త్రీ “రా! స్త్రీలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల గురించి ఇక్కడ చర్చిస్తారు. మనం మన గొంతు వినిపించాల్సిందిక్కడే” అని […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-5

నా అంతరంగ తరంగాలు-5 -మన్నెం శారద అమ్మమ్మ ఊరు కాకినాడ గురించి చెప్పానుకదా… ఇప్పుడు నానమ్మ ఊరు ఒంగోలు గురించి చెప్పాలి. మా తాతగారు అమ్మ పెళ్ళికి ముందే చనిపోవడంతో మా పెదనాన్నగారే గుంటూరు లో పనిచేస్తూ ఈ సంబంధం చూశారని చెప్పాను కదా! నాన్నమ్మకు ఈ సంబంధం ఎంత మాత్రం ఇష్టం లేదట! “అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్ల మనతో ఎక్కడ కలుస్తుంది, వద్దు “అని చాలా గొడవ చేసిందట. అయితే నాన్న […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -5 (యదార్థ గాథ)

జీవితం అంచున -5 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Care for one… that’s love. Care for all… that’s nursing. కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది. మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను. ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా… నా కంటి […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 30

నా జీవన యానంలో- రెండవభాగం- 30 -కె.వరలక్ష్మి           మనుషుల రూపానికీ, నడవడికకీ సంబంధం ఉంటుంది అంటారు. అది నిజం కాదని కొన్నిసార్లు నిరూపితమౌతుంది. గొప్ప అందగాడైన షేర్ సింగ్ రాణా వాళ్ళ కుటుంబీకులెందర్నో చంపేసిందనే కోపంతో 2001 జూలై 25న పూలన్ దేవిని కాల్చి చంపేసాడు. గాయాల గురించి ఇసుకలోను, దయగురించి చలువరాతి పైన రాయాలన్నారు పెద్దలు.           బైటికెక్కడికీ వెళ్ళొద్దని ఎంత నిర్ణయించుకున్నా […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 8

యాదోంకి బారాత్-8 -వారాల ఆనంద్ కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం           వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావవంత మయినది. అనేక ఆటుపోట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 16

వ్యాధితో పోరాటం-16 –కనకదుర్గ రోజూ చైతన్య స్కూల్ కి, శ్రీని ఆఫీస్ కి వెళ్ళేలోగా అన్నీ పనులు చేసుకుని రిలాక్స్ అయ్యేదాన్ని. వాళ్ళు వెళ్ళేలోపే స్నానం చేసి, ఏదైనా తినేసి టీ.వి పెట్టుకుని కూర్చునే దాన్ని. మధ్యాహ్నం శ్రీని ఆఫీస్ నుండి లంచ్ టైమ్ లో వచ్చి తినడానికి చాలా హెల్తీ తిండి చేసి పెట్టేవాడు. తను కూడా లంచ్ చేసి వెళ్ళేవాడు. నాకు పనంతా శ్రీని పైనే పడినందుకు చాలా బాధగా వుండేది. కానీ డాక్టర్స్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-29)

నడక దారిలో-29 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-44

మా కథ (దొమితిలా చుంగారా)- 44 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అంతర్జాతీయ మహిళా సమావేశంలో 1974లో ఐక్యరాజ్యసమితి తరఫున ఒక బ్రెజిలియన్ సినిమా దర్శకురాలు బొలీవియాకు వచ్చింది. మహిళా ఉద్యమ నాయకులను కలుసుకొని, మహిళల స్థితి గతుల మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, స్త్రీల పరిస్థితిని మెరుగు పరచడంలో వాళ్ళు ఎంత వరకూ ఏ రకంగా సాయపడగలరో తెలుసుకోవడానికి ఆవిడ లాటిన్ అమెరికన్ దేశాలన్నీ తిరుగుతోంది. మా గృహిణుల సంఘం గురించి విదేశాలలో […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-4

నా అంతరంగ తరంగాలు-4 -మన్నెం శారద అమ్మమ్మ వూరికి  ప్రయాణం Co canada నా చిన్నతనంలో రెండు రైల్వేస్టేషన్లలో ఈ పేరే ఉండేది. cocanada.. town, cocanada.. Port అని. కెనడాలా ఉంటుందని బ్రిటిష్ వారు ఆఁ పేరు పెట్టారని  అంటుంటారు. కాకినాడ formed city అని కూడా అంటుంటారు. Rectangular road system, మెయిన్ రోడ్డుతో పాటూ అటూ ఇటూ ఫాలో అవుతుండే అరడజను రోడ్లు, సినిమా హాల్స్ అన్నీ ఒకే వీధిలో ఉండడం, కాకినాడ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -4 (యదార్థ గాథ)

జీవితం అంచున -4 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Every great dream begins with a dreamer.. ఎప్పుడో ఎక్కడో చదివిన కోట్. అవును. చిరకాల కల. నిశిరాతిరి నిద్దట్లో కల… వేకువజాము కల… పట్టపగటి కల… వేళ ఏదయినా కల ఒకటే. మనది కాని విదేశీయుల విశ్వవిద్యాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు మోపుతానా అని మనసు ఒకటే ఉవ్విళ్లూరుతోంది. నర్సింగ్ విద్యార్థి ఊహే నా వయసును అమాంతం రెండింతలు తగ్గించేసింది. మనలో […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 29

నా జీవన యానంలో- రెండవభాగం- 29 -కె.వరలక్ష్మి           మోహన్ హెడ్మాస్టరుగా పనిచేస్తున్న ఏలేశ్వరం స్కూల్ టీచర్ ఒకావిడ నాకు ఫోన్ చేసింది. “మాస్టారు GPF లోన్ 30వేలకి పెట్టేస్తున్నాడు. నా వైఫ్ ని అందరూ ఎన్నికల్లో నిలబెడతాం అంటున్నారు. ఎక్కడలేని డబ్బూ కావాలిప్పుడు. ఇలా నా డబ్బు నేను తీసేసుకుంటేనే గానీ నన్ను ఇరికించేస్తారు అంటున్నారు” అని. అదీ సంగతి. నా వెనుక దన్నుగా నిలబడాల్సిన నా భర్త గారి […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 7

యాదోంకి బారాత్-7 -వారాల ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.కాలేజ్ డిగ్రీ చదువులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు           1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటి నుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 15

వ్యాధితో పోరాటం-15 –కనకదుర్గ నిన్నటిలాగే ఇన్సూలిన్ ఇస్తున్నారు. మంటలెక్కువగా వుంటే చల్లటి టవల్స్ ఇచ్చారు. చైతు, శ్రీని తల పైన, కళ్ళపైన, చేతులు, కాళ్ళపైన వేస్తూ వున్నారు. థాంక్స్  గివింగ్ డిన్నర్ నాలుగు గంటలకు స్పెషల్ వుంటుందన్నారు. మధ్యాహ్నం కాఫెటేరియాకి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తినేసి వచ్చారు. ఫాల్ సీజన్ మొదలయ్యింది. ఈ సారి స్నో చాలా త్వరగా పడింది. ఇప్పుడు బయట ఆకులు రంగులు మారాయి ఇప్పుడు. మొత్తానికి ఈ ట్రీట్మెంట్ వల్ల నొప్పులు రావడం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-28)

నడక దారిలో-28 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీలో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-43

మా కథ (దొమితిలా చుంగారా)- 43 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  “దురదృష్టకరమైన ప్రమాదం” బొలీవియాలో యువకులందరూ పద్దెనిమిదేళ్ళకే సైన్యంలో చేరాల్సి ఉండింది. సైన్యంలో చేరిన పత్రాలు లేకపోతే బైట ఉద్యోగాలు దొరకక పదిహేడేళ్ళకే సైన్యంలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. సైన్యంలో చేరనంటే పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. నరకంలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చేది. కొడుకులు బారలకు వెళ్ళే పరిస్థితి వచ్చిన రోజు తల్లిదండ్రులు నోరువిప్పి మాట్లాడ గూడదు. ఇక సైన్యంలో చేరాక […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-3

నా అంతరంగ తరంగాలు-3 -మన్నెం శారద ఒక ఆర్టిస్ట్ గా ఇది నా అక్కసో, బాధో అని మీరు అనుకోవచ్చు. మా చిన్నతనంలో బొమ్మలు వేయాలంటే మాకు వడ్డాది పాపయ్యగారో, లేదా బాపు గారి బొమ్మలో శరణ్యమయ్యేయి. లేదా ఇంట్లో గోడలకి వున్న రవివర్మ పటాలు దిక్కయ్యేయి. వాటిని చూసే ప్రాక్టీస్ చేసే వాళ్ళం. ఇప్పటిలా గూగుల్ లో వెదకి పట్టుకునే పరిస్థితి మాకు అప్పుడు లేదు. సినిమా తారల ఫోటోలు పత్రికల మీద అందుబాటులో వున్నా […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -3 (యదార్థ గాథ)

జీవితం అంచున -3 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Future is always a mystery… మనిషి టెక్నాలజీ పరంగా ఎంత పురోగతి సాధించినా రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోలేడు కదా. రాత్రి కమ్మిన దిగులు మేఘాలకు ఎప్పుడో అపరాత్రికి పడుకున్నానేమో చాలా ఆలస్యంగా లేచాను. ఆ రోజు శనివారం సెలవు కావటం వలన అందరూ ఇంట్లోనే వున్నారు. అల్లుడు స్టడీ రూములో కూర్చుని కంప్యూటర్ నుండి ఏవో ప్రింట్ ఔట్స్ తీస్తున్నాడు. […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 28

నా జీవన యానంలో- రెండవభాగం- 28 -కె.వరలక్ష్మి         మట్టి-బంగారం కథా విజయంతో కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టేను. మట్టి-బంగారం కథ నవంబర్ 30, 1999 న ఇంటర్నెట్ లోను,  నవంబర్-డిసెంబర్ 99 అమెరికా భారతి లోను, తెలుగు యూనివర్సిటీ తెలుగు కథ 99 లోను, కథా సాహితీ వారి కథ 99 లోను మాత్రమే కాకుండా తర్వాత ‘అరుణతార’ మొదలైన అభ్యుదయ పత్రికలలోనూ, సంకలనాలలోనూ కూడా ప్రచురింపబడింది.       […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-42

మా కథ (దొమితిలా చుంగారా)- 42 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ప్రభుత్వం టీవీలో మేం ఆందోళనకారులమనీ, సైగ్లో-20 ప్రజలు ఉగ్రవాదులనీ ప్రచారం చేస్తోంది. మమ్మల్ని అవమానిస్తున్నారు. ఈ దుష్ప్రచారానికి మేం టీవీలో జవాబివ్వలేం. రేడియో ద్వారా జవాబివ్వకుండా ఉండడానికి గాను సైన్యం 1975 జనవరిలో ఒక వేకువజామున మా ట్రాన్స్ మిటర్ల మీద దాడిచేసి నాశనం చేసింది. వాళ్ళ స్థలంలో ఒక్క మేకును గూడా సవ్యంగా ఉంచలేదు. వాళ్ళక్కడి నుంచి ప్రతిదీ ఎత్తుకుపోయారు. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 14

వ్యాధితో పోరాటం-14 –కనకదుర్గ పిల్లలకు ఎవ్వరికైనా జ్వరం వస్తే నాన్న ఒకోసారి సెలవు పెట్టి దగ్గరుండి చూసుకునేవారు. జ్వరం వల్ల నాలిక చేదుగా వుంటే డ్రై ప్లమ్స్ తెచ్చేవారు, అది నోట్లో పెట్టుకుంటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుండేది. జ్వరం వస్తే అన్నం తినకూడదని, బ్రెడ్, పాలల్లో వేసి తినిపించేవారు. నాన్న ఆఫీసుకెళ్తే అమ్మని మా దగ్గరే కూర్చోమని గోల చేసేవాళ్ళం. అమ్మ త్వరగా పని చేసుకుని వచ్చి మా దగ్గరే వుండేది. అమ్మ చేయి పట్టుకునే వుండేదాన్ని. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 6

యాదోంకి బారాత్-6 -వారాల ఆనంద్         నాటి నుంచి నేటి దాకా “జాతర” సామాన్యుని ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్ధిక వ్యక్తీకరణ వేదిక. ఇవ్వాల్టి సాంకేతికత, అభివృద్ది వెలుగు చూడని దశాబ్దాల క్రితం నుండి జాతర అనగానే సామాన్య ప్రజలు వందలు వేలుగా గుమిగూడేవారు. అదొక గొప్ప సామూహిక వ్యక్తీకరణ. తమ ఇష్ట  దైవాలకు మొక్కులు తీర్చుకునే సందర్భమది. తర్వాత అంతా సమిష్టిగా వినోదమూ, వ్యవహారమూ, వ్యాపారమూ నిర్వహించుకునే ఒక అద్భుత వేదిక జాతర. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-27)

నడక దారిలో-27 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతిపత్రిక లో  శీలా వీర్రాజుగారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభా వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, డిగ్రీ చదువు పూర్తిచేసుకుని […]

Continue Reading

జీవితం అంచున -2 (యదార్థ గాథ)

జీవితం అంచున -2 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి తరువాతి మూడు రోజులు మూడు యుగాల్లా గడిచాయి. ఒకటే రెస్ట్లెస్ నెస్… రెస్ట్లెస్ నెస్ అంటే ఏమిటంటారా… నాకు అప్పుడప్పుడూ కలిగే కుదురుంచని ఒక అస్థిమిత భావన. అది కలిగినప్పుడు విసుగ్గా వుంటుంది… ఏ పని పైనా ధ్యాస వుండదు. మాట్లాడుతున్నా ఆ మాటలు నావి కావు. టీవీలో సినిమా చూస్తున్నా నా కళ్ళు దానిని గ్రహించవు. చదువుతున్నా తలకెక్కదు. తింటున్నా నాలుకకు […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-2

నా అంతరంగ తరంగాలు-2 -మన్నెం శారద  “Painting is just another way of keeping a diary.”……….Pobolo Picasso***           ఇంట్లో నేను పని దొంగనని పేరుంది గానీ నేను చాలానే పని చేసేదాన్ని. వంటపని అంటే మాత్రం నాకు గిట్టేది కాదు. (తర్వాత అన్నీ నేర్చుకున్నాననుకోండి ). అలానే మిషన్ మీద బట్టలు కుట్టడం కూడా .           పాతసినిమాల్లో బీదవాళ్లంతా మిషన్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-26)

నడక దారిలో-26 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో  శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో కలంస్నేహం, తదనంతరం బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 27

నా జీవన యానంలో- రెండవభాగం- 27 -కె.వరలక్ష్మి           1999 కూడా అజో – విభో సభలతోనే ప్రారంభమైంది. నిర్వాహకులు శ్రీ అప్పా జోస్యుల సత్యనారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి పిలవడం వల్ల వెళ్లక తప్పలేదు. జనవరి 7 నుంచి 10 వ తేదీ వరకూ గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఆ కార్యక్రమాలకు సీనియర్స్ తో బాటు యువరచయితలు, కవులు, కళాకారులు చాలా మంది అటెండయ్యారు. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 5

యాదోంకి బారాత్-5 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ ఇల్లు- నా బాల్యం ఎ దౌలత్ భి లేలో ఎ షౌరత్ భి లేలో భలే చీన్ లో ముఝ్ సే మేరీ జవానీ మగర్ ముఝ్ కో లౌటాదే బచ్ పన్ కా సాయా ఓ కాగజ్ కి కష్తి ఓ బారిష్ కా పానీ ..( సుదర్షన్ ఫకీర్)           ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ స్వరంలో ఎన్నిసార్లు విన్నానో […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-41

మా కథ (దొమితిలా చుంగారా)- 41 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1974 నవంబర్ లోనే ప్రభుత్వం కొందరు వ్యక్తుల్ని “మౌలికస్థాయి సమన్వయ కర్తలు”గా నియమించింది. వీళ్ళు యజమానులకు, కార్మికులకు మధ్య వారధిలా పనిచేస్తారని వాళ్ళన్నారు. కాని కార్మికుల మీద నిఘావేయడమే వీళ్ళ పని. వాళ్ళు తమ పని మొదలు పెట్టగానే కార్మికులు సమన్వయకర్తల్ని నిరాకరించి, వాళ్ళ నిర్ణయాలను తాము ఒప్పుకోమని ప్రకటించారు. ప్రతి శ్రేణిలోనూ తామే ప్రతినిధులను ఎన్నుకోవడానికీ, వాళ్ళతో “మౌలికస్థాయి ప్రతినిధి […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 13

వ్యాధితో పోరాటం-13 –కనకదుర్గ ట్రీట్మెంట్ ఎంత త్వరగా మొదలుపెడితే అంత త్వరగా నొప్పులని ఆపొచ్చు, లోపల పాపకి కూడా స్ట్రెస్స్ తగ్గుతుంది అన్నారు. పాపం శ్రీని ఆ రోజే కొత్త జాబ్ లో జాయిన్అవ్వాల్సింది. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితి చెబితే లాప్ టాప్ తో స్టార్ట్ చేయొచ్చు, నీకు టైం దొరికినపుడు కాసేపు వర్క్ చేయమన్నారు. చైతు స్కూల్ కి వెళ్ళాడు. అప్పటికి అందరూ ఇండియన్ కొలీగ్స్ కుటుంబాలతో వెళ్ళిపోయారు. సుజాత అనేఒక తమిళ […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-1

నా అంతరంగ తరంగాలు-1 -మన్నెం శారద The purpose of our life is to be happy… Dalailama***          అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సారాలు. చదువు కొనసాగుతోంది . ఆ రోజు రాత్రి నన్ను పురజనులు ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తూ ఘనంగా సన్మానిస్తున్నట్లుగా కలొచ్చింది . మెలఁకువరాగానే “ఇది కలా ?” అని కొంత నిరుత్సాహ పడినా ఆ దీపాలు, వింజామరలు, జనసందోహం …కళ్ళలో కనిపిస్తుంటే ….పొంగిపోతూ మొహం […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -1 (యదార్థ గాథ)

జీవితం అంచున -1 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి   PROLOGUE  Life is taking up challenges  Life is achieving goals Life is being inspiration to others And age should not be a barrier for anything….           అనగనగా అప్పట్లో పంథొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఓ అమ్మాయి తెల్లని కోటు, చల్లని నవ్వుతో రోగుల గాయాలు […]

Continue Reading

నడక దారిలో(భాగం-25)

నడక దారిలో-25 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామాతో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 26

నా జీవన యానంలో- రెండవభాగం- 26 -కె.వరలక్ష్మి           కొత్త ఇల్లు కట్టుకున్నాక  ‘కిలా కిలా నవ్వులా-కురిసేలే వెన్నెలా!’ అన్నట్టు కళకళ లాడిన మా ఇల్లు పిల్లల పెళ్లిళ్ళై ఎవరిళ్ళకి వాళ్లు వెళ్లేక చిన్నబోయింది. స్కూలు ఆపేసేక మరింత దిగులు తోడైంది. ఒకప్పుడు అందరికీ ధైర్యం చెప్పిన నేను ఏ చిన్న సమస్యనూ తట్టుకోలేనంత బలహీనమై పోయాను.           ఉత్తరం వైపు పెరట్లోను, ఇంటి చుట్టూ […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 4

యాదోంకి బారాత్-4 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ – ఓ చరిత్ర ఓ జ్ఞాపకం కరీంనగర్ నా నేస్తం, కరీంనగర్ నా ప్రేయసి, కరీంనగర్ నా జీవితం, కరీంనగర్ నా ఊపిరి. కరీంనగర్ పోత్తిల్లల్లో పెరిగాను, వీధుల్లో తిరిగాను, ఒకటి కాదు రెండు కాదు ఆరు దశాబ్దాలకు పైగా ఈ వూరును నేను పెనవేసుకున్నాను. ఈ వూరు నన్ను తన చేతుల్లో పెంచింది.           వ్యక్తిగతంగా, […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-40

మా కథ (దొమితిలా చుంగారా)- 40 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1973 నుంచి మా సంఘం స్త్రీలం రైతాంగ స్త్రీలతో మమేకం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాం. కాని మాకు అసలైన సమస్య ఇంకా దృఢమైన కార్మిక కర్షక మైత్రి ఏర్పడకపోవడంలో ఉన్నదని త్వరలోనే అర్థమైంది. ఒక విప్లవ శక్తిగా ఒకే వర్గంగా పనిచేసేటంత గాఢమైన మైత్రి వాళ్ళ మధ్య ఇంకా ఏర్పడలేదు. అంతేకాదు, కార్మిక-కర్షక ఒడంబడిక మీద పురుషులే సంతకాలు చేశారు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 12

వ్యాధితో పోరాటం-12 –కనకదుర్గ 8వ నెలలో మళ్ళీ ఒక అటాక్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళారు. నొప్పి ప్రాణం పోతుందేమో అన్నంతగా వచ్చింది. నేను అంబులెన్స్ కి కాల్ చేయమంటే ఎందుకు నేను తీసుకెళ్తాను అంటాడు శ్రీని. మనమే కార్ లో వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాలి, ట్రాఫిక్ ఎక్కువగా వుంటే ఆగిపోతాము, ఇక నొప్పితో ఏం జరిగినా ఏం చేయడానికి వుండదు. అదే అంబులెన్స్ అయితే వాళ్ళకి ట్రాఫిక్ లో క్లియరెన్స్ వుంటుంది. అదీ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 25

నా జీవన యానంలో- రెండవభాగం- 25 -కె.వరలక్ష్మి 1997 జనవరిలో తిరుపతిలో జరగబోయే అప్పాజోశ్యుల పెట్టిన విష్ణుభొట్ల వారి నాల్గవ వార్షిక సమావేశాల సందర్భంగా కథల పోటీలో నా ‘మధుర’ కథకు బహుమతి వచ్చిందని చెప్పేను కదా! ఆ సందర్భంగా ఐదు బహుమతి కథలను ‘అలరూపకథాప్రభ’ పేరుతో ఒక పుస్తకంగా తెచ్చే బాధ్యతను ప్రఖ్యాత సీనియర్ రచయిత భరాగో గారికి అప్పగించారట ఫౌండేషన్ వారు. ఆ పుస్తకం కోసం బహుమతి పొందిన కథా రచయితలు ఐదు గురినీ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-24)

నడక దారిలో-24 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామాతో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 11

వ్యాధితో పోరాటం-11 –కనకదుర్గ శ్రీని లోపల పని చేసుకుంటున్నాడు. వంట చేస్తున్నట్టున్నాడు. “నీకు ఇడ్లీ పెట్టనా ఈ రోజుకి?” అని అడిగాడు కిచెన్ నుండి. “సరే,”అన్నాను. పాపని చాలా మిస్ అయ్యాను. దాన్నే చూస్తూ కూర్చున్నాను. నా తల్లి ఎంత ముద్దుగా వుందో? ఎంత కావాలనుకుని కన్నాను కానీ అది కడుపులో వున్నపుడు చిన్ని ప్రాణాన్ని ఎంత బాధ పెడ్తున్నాను కదా, నా కిచ్చే మందులు దానికి వెళ్ళేవి, పాపం నార్మల్ గా, ఆరోగ్యంగా పెరగాల్సిన పిల్ల […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-39

మా కథ (దొమితిలా చుంగారా)- 39 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  కార్మిక శక్తి జనరల్ బన్ జెర్ ప్రజా సమ్మతితో అధికారంలోకి రాలేదు. మెషిన్ గన్లతో యూనివర్సిటీల్లో శ్మశాన ప్రశాంతి నెలకొల్పి, లెక్కలేనంత మందిని అరెస్టు చేసి బన్ జెర్ గద్దెనెక్కాడు. అధికారంలో స్థిరపడగానే ఆయన ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టాడు. మొదట డబ్బు విలువ తగ్గించాడు. తర్వాత ‘ఆర్థిక సంస్కరణలు’ తీసుకొచ్చాడు. తర్వాత కార్మికుల రేడియో స్టేషన్లను మూయించాడు. ……. అలా […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 3

యాదోంకి బారాత్-3 -వారాల ఆనంద్ వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపన- దృశ్య చైతన్యం           ఉత్తమ సినిమాల్ని ప్రజలకు చేరువ చేసే క్రమంలో నేను గత నాలుగు  దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో కృషి చేసాను. ఆ పని 23 ఆగస్ట్ 1981 రోజున ఆరంభమయింది. ఆ రోజు అప్పటికి మామూలు గ్రామమయిన వేములవాడలో ఫిలిం సొసైటీని ప్రారంభించాం. ఇక అప్పటి నుంచి అర్థవంతమయిన సినిమాల్ని చూడడం అధ్యయనం చేయడం, […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 24

నా జీవన యానంలో- రెండవభాగం- 24 -కె.వరలక్ష్మి           అక్షరాలంటే ఆకుల్లాంటివి. అవి అలా భిన్నంగా ఎందుకున్నై ‘అని తెలుసు కోవాలంటే అసలు వృక్షం యొక్క అభివృద్ధి  క్రమాన్నే అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. అక్షరాలు తెల్సుకోవాలంటే పుస్తకాలు చదవాలి, మానవుడు ఆనందభరితమైన, ఉపయోగకరమైన మొక్కల్ని ఎన్నిట్నో నాటి వాటిని ఉద్యానవనంగా రూపొందించినట్టే రచయిత ఒక పుస్తకాన్ని రాస్తాడు “           “అపనిందలకి నువ్వెంత తక్కువ విలువనిస్తే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-23)

నడక దారిలో-23 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సులోనే తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా అంచెలంచెలుగా సాగిన డిగ్రీ చదువు. ఖాళీ సమయాలను సాహిత్యం , సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామాతో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 10

వ్యాధితో పోరాటం-10 –కనకదుర్గ నాకు ప్రెగ్నెంసీ అని తెలిసేటప్పటికి శ్రీని ఇండియన్ కొలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు. కొంత మంది ఇండియాకెళ్ళారు, కొంత మంది అమెరికాలోనే వుండాలని నిర్ణయించుకుని పర్మనెంట్ ఉద్యోగాలు చూసుకొని వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పోయారు. జోన్ అంటుండేది, “నీ డెలివరీ అయ్యాక మీకెప్పుడైనా అవసరమొస్తే అపుడు నేను బేబిసిట్ చేస్తాను.” అని. డా. రిచర్డ్ ఈ.ఆర్. సి.పి కి రమ్మంటే జోన్ ని టెస్ట్ అయ్యి వచ్చేదాక పాపని చూసుకుంటావా అని అడిగితే, […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-38

మా కథ (దొమితిలా చుంగారా)- 38 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ప్రజలు – సైన్యం 1970లో మరొక సైనిక తిరుగుబాటు జరిగింది. వైమానికదళం, నావికాదళం, సైన్యం కలిసి దేశాన్ని పాలించేందుకు ఒక ముగ్గురు సభ్యుల పాలనామండలిని ఏర్పరచాలని ప్రయత్నించాయి. జనం అందుకు ఒప్పుకోలేదు. జాతీయస్థాయిలో సమ్మెకు పిలుపిచ్చారు. సిఓబి ప్రతినిధులు వైమానికదళ కేంద్ర స్థావరం ఆలో-ది-లాపాజ్ కు వెళ్ళి జనరల్ తారెసన్ను అధికారం స్వీకరించమని కోరారు. ఆయన అందుకొప్పు కున్నాడు. ప్రజల కోసం […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 2

యాదోంకి బారాత్-2 -వారాల ఆనంద్ వేములవాడ-కొన్ని వెంటాడే దృశ్యాలు           అయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆటవిడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు ముందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మా వూరు కరీంనగర్. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్-1 (ఈ నెల నుండి ప్రారంభం)

యాదోంకి బారాత్-1 -వారాల ఆనంద్ కళానికేతన్= కవితా చిత్ర ప్రదర్శన            ఇటీవల మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఇవ్వాళ ఈ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటున్నాను. ***           మా వూరు కరీంనగర్ అయినా చిన్నప్పుడు బడికి సెలవులోస్తే అమ్మగారింటికి చెక్కేయడం, స్వేచ్చా గాలుల్ని […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 23

నా జీవన యానంలో- రెండవభాగం- 23 -కె.వరలక్ష్మి           తర్వాతి కాలంలో రాసిన కథల్లో ‘ప్రత్యామ్నాయం’ కథలో ఒరిస్సా లోని కేవ్స్ దగ్గర కోతుల గురించి ; బస్సెక్కేటప్పుడు ఆపేసేరని, ధర్నా చేసిన ఆమె గురించి ఇటీవల రాసిన ‘అపరాజిత ‘ కథలోను రాయడం జరిగింది.           మేం కొత్త ఇల్లు కట్టుకునే నాటికి జగ్గంపేట గ్రంథాలయం మా శ్రీరాంనగర్ కి బాగా దూరమైంది. అయినా, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-22)

నడక దారిలో-22 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లోనే తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం , సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజుపేరు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-37

మా కథ (దొమితిలా చుంగారా)- 37 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మళ్ళీ గనిలో ఒరురో వెళ్ళిన కొన్ని నెలలకే మేం మళ్ళీ సైగ్లో -20కి తిరిగి వెళ్లిపోగలిగాం. బారియెంటోస్ చనిపోయాక అప్పటికి ఉపాధ్యక్షుడుగా ఉన్న సైల్స్ సాలినాస్ గద్దె ‘నెక్కాడు. కాని ఆయన పాలన మూన్నాళ్ళ ముచ్చటే అయింది. అదే సంవత్సరం జరిగిన ఓ సైనిక తిరుగుబాటులో జనరల్ ఒవాండో, సాలినాస్ ను తన్ని తరిమేసి అధికారానికొచ్చాడు. అప్పుడు 1965లో బారియెంటోస్ ప్రభుత్వం […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 9

వ్యాధితో పోరాటం-9 –కనకదుర్గ సాయంత్రం పిల్లల్ని తీసుకుని శ్రీని వచ్చాడు. పాప ఆ రోజు సరిగ్గా పడుకోలేదు, అందుకే కొంచెం చికాగ్గా వుంది. ఏడుస్తుంది. అందరూ వూరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. “ఇది హాస్పిటలా, ఇల్లా? ఇక్కడ పేషంట్లకి రెస్ట్ అవసరం అని తెలీదా? ఇపుడే నిద్ర పట్టింది? ఇక్కడ సరిగ్గా పడుకోవడానికి కూడా లేదా?” అని గట్టిగా అరిచింది పక్క పేషంట్. నర్స్ బెల్ ఆగకుండా నొక్కుతూనే వుంది. జూన్ పరిగెత్తుకొచ్చింది. పాపని చూసి,” హాయ్ స్వీటీ! వాట్ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 22

నా జీవన యానంలో- రెండవభాగం- 22 -కె.వరలక్ష్మి 1994 ఆగష్టులో ఆరుద్ర సప్తతి ఉత్సవాలు జరిగాయి రాజమండ్రిలో. 29 వ తేదీ జరిగిన సభకు అటెండయ్యాను ఆనం కళాకేంద్రంలో.. అప్పటికి ఏడాదిగా వాడుతున్న TB మందుల పవర్ తట్టుకో లేకపోతున్నాను. ఎలాగూ రాజమండ్రి వెళ్లేనుకదా అని స్వతంత్ర హాస్పిటల్ కి వెళ్లేను. మళ్లీ టెస్టులన్నీ చేసి ఇక మందులు ఆపేయచ్చు అన్నారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాను. ఆ మందుల ప్రభావం వల్ల చాలాడిప్రెస్డ్ గా ఉండేది, […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-21)

నడక దారిలో-21 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-36

మా కథ (దొమితిలా చుంగారా)- 36 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  బడి ప్రారంభోత్సవంనాడు మంత్రులొచ్చారు.’ పత్రికలవాళ్ళోచ్చారు. ప్రారంభోత్సవం అప్పుడు. మహా ఆడంబరంగా జరిగింది. “ప్రభుత్వ నిర్మాణాల సంఖ్యకు మరొకటి జత కూడింది” అంటూ మంత్రులు గప్పాలు కొట్టుకున్నారు. “ప్రభుత్వం ప్రజల పట్ల తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తోంది. బారియెంటోస్ ప్రభుత్వం మొట్టమొదట రైతు గురించే ఆలోచిస్తుంది. బొలీవియన్ రైతు ఇంకెంత మాత్రమూ గత కాలపు అజ్ఞాని కాగూడదు! ఇదిగో అందుకు రుజువు చూడండి. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 8

వ్యాధితో పోరాటం-8 –కనకదుర్గ బాగా అలసటగా వుంది. పొద్దున్నుండి నొప్పికి ఇంజెక్షన్ తీసుకోలేదు. టీలో కొన్ని సాల్టీన్ బిస్కెట్లు (ఉప్పుగా, నూనె లేకుండా డ్రైగా వుంటాయి) నంచుకుని తిన్నాను. టీ చల్లారి పోతే నర్స్ బటన్ నొక్కితే టెక్ వచ్చి టీ తీసుకెళ్ళి వేడి చేసి తీసు కొచ్చింది. వేడి టీ త్రాగాను మెల్లిగా. ప్రక్క పేషంట్ ని చూడడానికి డాక్టర్లు వచ్చి వెళ్ళారు. ఫోన్ లో ఇంట్లో వాళ్ళకి ఏమేం తీసుకురావాలో గట్టిగా చెబుతుంది. “నా […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 21

నా జీవన యానంలో- రెండవభాగం- 21 -కె.వరలక్ష్మి 1991 లో నేను రాసి ఆంధ్రజ్యోతికి పంపిన ‘అడవి పిలిచింది’ నవల అందినట్టు ఉత్తరం వచ్చింది. కాని, ఎడిటర్ మారడంతో ఆ నవలను ప్రచురించనూ లేదు. తిప్పిపంపనూ లేదు. దాని రఫ్ కాపీ కూడా నా దగ్గర లేకపోవడంతో ఆ నవల కోసం వెచ్చించిన ఎంతో టైమ్ వేస్ట్ అయిపోయినట్లైంది.. 1993 మార్చి 8న హైదరాబాద్ నుంచి చిలకలూరి పేట వస్తున్న బస్సుని 24మంది జనంతో బాటు పెట్రోలు […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-20)

నడక దారిలో-20 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-35

మా కథ (దొమితిలా చుంగారా)- 35 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ఆరు నెలల తర్వాత నన్ను చూడడానికి నాన్న వచ్చాడు. నేను ఆరోగ్యంగా ఉన్నందుకు, పని కూడా చేయగలుగుతున్నందుకు, అక్కడ స్నేహాలు కలుపు కుంటున్నందుకు నాన్న చాల సంతోషించాడు. లాస్ యుంగాస్ జనం నాతో చాల మంచిగా ఉండే వారు. నేను వాళ్ళతో సాటిగా పొలాల్లో పని చేయడం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయే వారు. మా ప్రాంతం వాళ్ళు తమలాగ పొలం పని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 7

వ్యాధితో పోరాటం-7 –కనకదుర్గ మోరా ఇంజెక్షన్ తీసుకొచ్చింది.  “హే స్వీటీ, వాట్ హ్యాపెన్డ్? కమాన్, ఇట్స్ ఓకే డియర్!” ఇంజెక్షన్ పక్కన పెట్టి నా తల నిమురుతూ వుండిపోయింది. “మోరా కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యాంటి యాంగ్జయిటీ మెడిసన్ ప్లీజ్! ఈ రోజు తీసుకోలేదు ఒక్కసారి కూడా.” “ఓకే హనీ నో ప్రాబ్లెం. ఫస్ట్ టేక్ యువర్ పెయిన్ ఇంజెక్షన్. దెన్ ఐ విల్ గెట్ యువర్ అదర్ మెడిసన్.” అని ఇంజెక్షన్ ఇచ్చి. […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-34

మా కథ (దొమితిలా చుంగారా)- 34 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  లాస్ యుంగాస్ ఒక ఉష్ణ ప్రాంతం. అక్కడ కాఫీ గింజలు, నారింజ, అరటి మొదలైన అన్ని రకాల పళ్ళు పండిస్తారు. అది మా పర్వత ప్రాంతానికి చాల దూరం. ఆ తర్వాత డిఐసి వాళ్ళు ఆస్పత్రికి వచ్చి నన్ను బెదిరించారు. నేను బైటికి వెళ్ళాక జైల్లో ఏం జరిగిందో ప్రచారం చేస్తే, నన్నిప్పుడు విడిపిస్తున్న కల్నల్ తన రివాల్వర్ తో మూడే […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 20

నా జీవన యానంలో- రెండవభాగం- 20 -కె.వరలక్ష్మి అక్టోబర్ 20 ఆదివారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని గద్వాల్ మొదలుకుని జమ్మూ కాశ్మీర్,హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, చండీఘర్, హర్యానా, ఢిల్లీ, నేపాల్, టిబెట్ మొదలైన ప్రాంతమంతా తీవ్రమైన భూకంపం సంభవించింది. ఒక్క ఉత్తర్ ప్రదేశ్ లోనే 500 మంది మరణించారు. సరిగ్గా నెల తర్వాత నవంబర్ 20న ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ జిల్లాల్లో గొప్ప తుఫాన్ సంభవించి పంటలూ, ప్రాణాలూ నష్టమయ్యాయి. తుఫాన్ కి ఓషన్ స్కై షిప్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-19)

నడక దారిలో-19 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 6

వ్యాధితో పోరాటం-6 –కనకదుర్గ “హాయ్ డియర్! ఐ హావ్ టు టేక్ వైటల్ సైన్స్,” అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. కొత్త టెక్నిషియన్ వచ్చింది. రాత్రి పదకొండు దాటుతుంది. మళ్ళీ నర్సులు, టెక్స్ మార్తారు. కానీ మోరా 7 గంటల నుండి పొద్దున 7 వరకు రెండు షిఫ్ట్స్ కలిపి చేస్తున్నానని చెప్పింది. బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, పల్స్, అన్నీ చెక్ చేసి నోట్ చేసుకుని వెళ్ళిపోయింది టెక్. ఇంటి నుండి ఫోన్ వచ్చింది. […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-33

మా కథ (దొమితిలా చుంగారా)- 33 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  “నువు కొద్ది సేపు మాట్లాడకుండా ఉండు. ఇన్నాళ్ళూ దేవుణ్ని మరిచిపోయావు గదూ – కనీసం ఇప్పుడు ప్రార్థన చేసుకో….” అని ఆయన వెళ్ళిపోయాడు. నేను కొట్లో మళ్ళీ ఒంటరినైపోయాను. బైటి నుంచి సైనికుల బూట్లు చేస్తున్న టకటక శబ్దం సంగీతంలాగా, జోల పాటలాగా నన్ను నిద్రపుచ్చింది. నిద్రలో, కలలో నాకొక ఎత్తయిన పర్వత శిఖరం కనిపించింది. నేనా శిఖరం పైనుంచి, ఓ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -19

నా జీవన యానంలో- రెండవభాగం- 19 -కె.వరలక్ష్మి           1991లో పెద్ద కొడుకింట్లో జరిగిన అవమానం తట్టుకోలేక మా అమ్మ బట్టలన్నీ సర్దుకుని జనవరిలో హైదరాబాద్ నుంచి జగ్గంపేట వచ్చేసింది.స్కూల్ నడుస్తున్న తన ఇంట్లోనే ఉంటానంది. నేను మా కొత్త ఇంటికి తీసుకు వెళ్లాలని చాలా ప్రయత్నించాను. ఎంత చెప్పినా వినలేదు. అల్లుడు (మోహన్) చేసే గందరగోళాలు అంటే భయం. నాతో పాటు రిక్షాలో తీసుకువెళ్తే పొద్దుపోయేవేళకు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయేది. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-18)

నడక దారిలో-18 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను. స్వాతి పత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు […]

Continue Reading

వ్యాధితో పోరాటం- 5

వ్యాధితో పోరాటం-5 –కనకదుర్గ ఆయన ఈ రాత్రికి అమెరికా వెళ్తున్నందుకేమో పేషంట్స్ ఎవ్వరూ లేరు. కొన్ని చేయాల్సిన పనులు చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. “అయిపోయాడు ఈ రోజు ఆ పిఏ. పాపం అతని పేరు చెప్పకుండా వుండాల్సింది.” అన్నాను. అయిదు నిమిషాల్లో వచ్చారు డాక్టర్ గారు. వచ్చి తన సీట్లో కూర్చున్నారు. “బ్లడ్ వర్క్ లో పాన్ క్రియాటైటిస్ అని వచ్చింది. డా. రమేష్, నేను నిన్న అదే అనుకున్నాము.” “అంటే సీరియస్ ప్రాబ్లమా? ఇపుడు ఏం చేయాలి?” […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -18

నా జీవన యానంలో- రెండవభాగం- 18 -కె.వరలక్ష్మి           అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో  కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. బంధువులు అసూయను ఆపుకోలేక ఏదో ఓ రూపంలో వెళ్లగక్కేవారు.  పల్లెల్లో అలాగే నడుస్తుంది మరి!           కొన్ని కుటుంబాల్లో ఆర్ధికంగా ఎదిగి, అనుకోనంత డబ్బునూ, ఆస్తుల్ని అందుకున్న వాళ్ళు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 4

వ్యాధితో పోరాటం-4 –కనకదుర్గ ఒక కొబ్బరి బొండాం తీసుకుని ఆటోలో వెళ్తుండగా కొద్ది కొద్దిగా సిప్ చేయసాగాను. చైతుని ఎపుడూ వదిలి పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు మేము, సినిమాలకి వెళ్ళడం మానేసాము వాడు పుట్టినప్పట్నుండి. వాడిని తీసుకుని పార్క్ లకు వెళ్ళడం, అత్తగారింటికి, అమ్మ వాళ్ళింటికి వెళ్ళినా, అక్క, అన్నయ్య వాళ్ళింటికి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కల్సి వెళ్ళడమే అలవాటు. చాలా మంది అనేవారు, ‘సినిమాలు మానేయడం ఎందుకు? వాడికి ఏ బొమ్మొ, లేకపోతే తినడానికి ఏ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-17)

నడక దారిలో-17 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను.స్వాతిపత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. నేనని […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-32

మా కథ రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అప్పుడు ఫ్లాష్ లైట్లు పట్టుకొని వచ్చిన ఓ నలుగురు నన్ను కొట్లోంచి బయటికి లాక్కుపోయారు. నా తోటి ఖైదీ నాకు ధైర్యం చెపుతూనే ఉన్నాడు. వాళ్ళు ఇదివరకు నేనుండిన కొట్లోకి లాక్కెళ్ళారు. అక్కడ ఒక అధికారి చాల కోపంతో, మండిపడుతూ కూచున్నాడు. వాడు మామూలు దుస్తుల్లోనే ఉన్నాడు. నన్ను గదిలో పడేయగానే వాడు నా వైపు అసహ్యంగా, కోపంగా ఓ చూపు విసరి “నా కొడుకును […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-31

మా కథ రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అప్పుడు వాళ్లో ఉత్తరం పట్టుకొచ్చారు. అది చాల కుదురుగా, అందంగా రాసి ఉంది. నార్ బెల్టి నాకు చాలమంచి స్నేహితురాలు గనుక ఆవిడ రాత నాకు బాగా తెలుసు. ఆ ఉత్తరంలో ఉన్నది మాత్రం కచ్చితంగా ఆవిడ రాతకాదు. ఆ ఉత్తరంలో నార్బెర్టా – ది ఆగిలార్ నైన తాను తన పిల్లల మీద ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి ఫలితంగా తనకు తెలిసిన విషయాలు ప్రకటిస్తున్నాననీ, […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 3

వ్యాధితో పోరాటం-3 –కనకదుర్గ మోరా వెళ్ళిపోయాక నాకు ఇండియాలో నొప్పి ఎలా వచ్చింది, అక్కడ డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నీ గుర్తు రాసాగాయి. నొప్పి వచ్చిన రోజు శ్రీని ఇంటికి వచ్చాక జరిగిన సంగతి తెల్సుకుని, మన డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుందాము అని వెంటనే బయల్దేరారు. కైనెటిక్ హోండా స్కూటర్ పై వెళ్ళేపుడు పొద్దున వెళ్ళిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు కొంచెం బాగానే వుందని చెబితే టెస్ట్స్ చేయించుకుని రమ్మని చెప్పింది. అలాగే […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -17

నా జీవన యానంలో- రెండవభాగం- 17 -కె.వరలక్ష్మి 1988 జనవరి 25 సోమవారం ఉదయం గౌతమీ దిగి మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్లేం. పది దాటాక H.D.F.C హౌసింగ్ లోన్ సంస్థ ఆఫీస్ కి వెళ్లేం.  అక్కడా అదే ఎదురైంది. లోన్ మోహన్ కే ఇస్తామన్నారు.  ఇంతదూరం వచ్చాం కదా ఒప్పుకోమని మోహన్ ని చాలా బ్రతిమలాడేను.  తను ససేమిరా అనేసరికి చేసేది లేక తిరిగి వచ్చేసాం. మధ్యాహ్నం భోజనాల దగ్గర మా తమ్ముడికి విషయం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-16)

నడక దారిలో-16 -శీలా సుభద్రా దేవి ఇద్దరి మధ్యా లేఖలు పావురాలై ఎగరటం మొదలై ఆరునెలల పైనే అయ్యింది. కొత్త ఏడాది కొత్త ఊహలను ప్రోది చేసుకుంటూ అడుగు పెట్టింది. ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో ఎన్నెన్ని మార్పులనో తీసుకువచ్చేలానే అనిపించింది. ఎన్నెన్ని  కొత్త అనుభవాలనో తొలి అడుగులోనే రుచి చూపిస్తూ కొంగ్రొత్త మలుపులను తీసుకు వచ్చేలానే ఉంది. అవి నాకు శుభసంతోషాలనే ఇస్తుందో , కష్టాల కడగండ్లు పాదాల ముందు పరుస్తుందో. అన్నింటినీ ఎదుర్కోగలిగే […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -16

నా జీవన యానంలో- రెండవభాగం- 16 -కె.వరలక్ష్మి రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి  మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; వనితాజ్యోతి లో ‘ప్రతిధ్వని’ కవిత ; 83 లో ఆంధ్రజ్యోతి వీక్లీ లో ‘యువకుల్లో ధీశక్తి‘ వ్యాసం; 85లో ఉగాది వ్యాసరచన పోటీ లో బహుమతి పొందిన వ్యాసం; 85జూన్ స్వాతి  మంత్లీ లో […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-15)

నడక దారిలో-15 -శీలా సుభద్రా దేవి నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.          అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు.          ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది.            మర్నాడు టిఫిన్లు చేసి […]

Continue Reading

మళ్ళీ జైలుకు (దొమితిలా చుంగారా-30)

మళ్ళీ జైలుకు రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మేం ప్లాయా వెర్డె దగ్గరికి చేరేసరికి చాల రాత్రయింది. అక్కడే నన్ను అరెస్టు చేశారు. ఒక కెప్టెన్ నా దగ్గరికొచ్చి “చూడమ్మా నీతో నేను తగువుపడదలచుకోలేదు. దయచేసి నువ్విక్కడ దిగి వెనక్కి వెళ్ళిపో! నీకు నార్ బెర్టా డి ఆగిలార్ తెలుసుగదా. గెరిల్లాలతో సంబంధాలున్నాయని ఆమెను అరెస్టు చేశారు. ఆవిడ నీ పేరు చెప్పింది. వాళ్ళు నీ పేరుమీద వారెంట్ తీశారు. నువు కడుపుతో ఉన్నప్పుడు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 2

వ్యాధితో పోరాటం-2 –కనకదుర్గ కడుపులో భయంకరంగా నొప్పి మళ్ళీ మొదలయ్యింది. గతంలోనుండి బయటపడి నర్స్ బటన్ నొక్కాను. సాయంత్రం 7 అవుతుంది. నర్సులు డ్యూటీలు మారుతున్నట్టున్నారు. కానీ నొప్పి భరించడం కష్టం అయిపోయింది. నర్స్ బటన్ నొక్కుతూనే వున్నాను. నర్స్ మోరా, ” ఐ యామ్ కమింగ్ డియర్, ఐ నో యు మస్ట్ బి ఇన్ పెయిన్,” అని ’డెమొరాల్,’ అనే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తో వచ్చి నడుం దగ్గర ఇచ్చి వెళ్ళింది.  మొదట్లో […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం-1

వ్యాధితో పోరాటం-1 –కనకదుర్గ వేపచెట్టు నీడ, గానుగ చెట్టు క్రింద చెక్క మంచం వేసుకుని నానమ్మ పడుకునేది. మేము అంటే, అమ్మలుఅక్క, చిట్టి, నేను, చింటూ తమ్ముడు, ఎదురింటి నేస్తాలు పద్మ, శ్రీను, అను, బుజ్జి అందరం కలిసి వేప కాయలు, వేప పండ్లు కోసుకుని, క్రింద పడినవి ఏరుకొని చిన్న చిన్న అట్ట డబ్బాలపైన పేర్చి కూరల కొట్టు, పళ్ళ కొట్టు పెట్టుకుని ఆడుకునేవారం. ఎంత సేపు ఆడుకున్నా అలసిపోయేవారం కాదు. ఒకోసారి కుర్చీలన్నీ వరసగా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-14)

నడక దారిలో-14 -శీలా సుభద్రా దేవి  జూన్ నెల 1970 లో ఒకరోజు మాచిన్నన్నయ్య కొత్తగా విడుదల అయిన స్వాతి మాసపత్రిక ప్రారంభ సంచిక తీసుకు వచ్చాడు.అంతకు ముందు జ్యోతి,యువ మాసపత్రిక  మాదిరిగా అదే సైజు లో అందమైన బాపు ముఖచిత్రంతో ఆకర్షణీయంగా ఉంది. తర్వాత ఆ చిత్రాన్నే స్వాతి లోగో లా వాడుతున్నారు.అందులో అప్పట్లోని సాహితీ ప్రముఖులరచనలతో సాహిత్యం పట్ల ఇష్టం ఉన్న వారికి ఆనందం కలిగించి హృదయానికి హత్తుకోవాలనిపించే రచనలు ఉన్నాయి.      కుమారీ వాళ్ళఅన్నయ్య  […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -15

నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి     ఆ అద్భుత మేమిటంటే నేను పంపిన మొదటి కథ ‘రిక్షా’  జ్యోతి  మంత్లీ లో 1985 జూన్ సంచిక లో వచ్చింది. అంతకు ముందంతా ఏవో చిన్న వ్యాసాలూ, కవితలూ, జోక్స్ లాంటివి వస్తూ ఉన్నా, చిన్నప్పటి స్కూల్ డేస్ తర్వాత వచ్చిన కథ. ఈ కథ నాకొక ధైర్యాన్ని ఇచ్చి రాసేందుకు ప్రోత్సహించింది. ఆ ఉత్సాహంతో రాసిన ‘ప్రశాంతి’ కలువబాల పత్రిక నవలికల పోటీ […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-29)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  బడిలో చదువుతుండిన నా రెండవ కూతురు ఫాబియెలా , సైగ్లో -20 లోనే ఉండి పోయింది. తల్లిదండ్రులు “రాక్షసులైనా” సరే, పిల్లలకు చదువు నిరాకరించొద్దని ఒక ఉపాధ్యాయురాలు అంది. తాను ఏ వివక్షత చూపకుండా పిల్లలకు చదువు చెప్తానని ప్రతిజ్ఞ తీసుకున్నానని, అందువల్లనే యాజమాన్యపు ఉత్తర్వును పాటించనని ఆవిడంది. “నీ పాప నొదిలేసి వెళ్ళడానికి మీ వాళ్లెవరూ లేకపోతే, నా దగ్గర వదిలేసి వెళ్ళు. నా […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-28)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మర్నాటి ఉదయానికల్లా నా ఇంటి తలుపు మీద ఒక నోటీస్ ఉంది. ‘ఇరవై నాలుగు గంటల లోపల నేను ఆ జిల్లా వదిలేసి వెళ్లిపోవాలి’. అదే చివరి హెచ్చరిక అని కూడ దాంట్లో రాసి ఉంది. దాని మీద కంపెనీ మేనేజరూ, ఇద్దరు మిలిటరీ అధికారులూ సంతకాలు చేశారు. భర్తలు జైల్లో ఉన్న స్త్రీలందరికీ ఇలాంటి నోటీసులొచ్చాయి. అంతేగాక బడికి కూడ కం పెనీ ఒక […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -14

నా జీవన యానంలో- రెండవభాగం- 14 -కె.వరలక్ష్మి 16-12-84 న సామర్లకోటలో మెయిల్ ఎక్కాను. విజయవాడ లో అందరితో బాటు రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లోకి మారాను. మోహన్ విజయవాడ వరకు  వచ్చి నన్ను వారికి అప్పగించి వెళ్ళాడు.  ఉదయం పది గంటలకు మద్రాసు లో దిగాం. మేం ఎక్కాల్సిన ట్రైన్ రాత్రి 7.20 కి.  స్టేషన్ దగ్గర్లో చిన్న లాడ్జి లో రూమ్స్ తీసుకున్నారు.  మా ముగ్గురికి ఒకటి, వాళ్ళ అందరికీ ఒకటి.  ఫ్రెష్ అయి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-13)

నడక దారిలో-12 -శీలా సుభద్రా దేవి నేను పీయూసి చదువుతున్న రోజుల్లోనే ఒక రోజు అకస్మాత్తుగా  మా చిన్నక్కని హాస్పిటల్ లో చేర్పించినట్లు కబురు వచ్చి అమ్మ కంగారుపడి హడావుడి గా వెళ్ళింది.అందరం  ఏమైందో నని గాభరా పడ్డాం.తీరా అమ్మ బొజ్జలో హాయిగా బజ్జోకుండా తొందరపడి రెండునెలలు ముందుగానే ప్రపంచాన్ని చూసేయాలని బుజ్జిబాబు బయటకు వచ్చేసాడని తెలిసింది.ఐతే మరికొంత కాలం డాక్టర్లు పర్యవేక్షణలోనే ఉంచి డిశ్చార్జి చేసాక కోరుకొండ సైనిక స్కూల్ లోని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోయారు.అమ్మ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -13

నా జీవన యానంలో- రెండవభాగం- 13 -కె.వరలక్ష్మి 1982 ఫిబ్రవరిలో అంజయ్యగారు ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడి భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిగా నియామకం జరిగింది. ఇందిరాగాంధీని విపరీతంగా అభిమానించే దాన్ని. ఒక స్త్రీగా ఆమె కార్యదక్షత నాకు ఆశ్చర్యం కలిగించేది. కాని, ఇలా ముఖ్యమంత్రుల్ని దించెయ్యడం వల్ల ఆంధ్రాలో ఆమె ప్రభుత్వానికి ఏమైనా అవుతుందేమో అని భయంవేసేది. 1982 లోనే అని గుర్తు. రష్యన్ భాష నుంచి తెలుగులోకి అనువదించిన ఓల్గా కథ మూడు తరాలు ఆంధ్రజ్యోతి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-12)

నడక దారిలో-12 -శీలా సుభద్రా దేవి నేను పీయూసి చదువుతున్న రోజుల్లోనే ఒక రోజు అకస్మాత్తుగా  మా చిన్నక్కని హాస్పిటల్ లో చేర్పించినట్లు కబురు వచ్చి అమ్మ కంగారుపడి హడావుడి గా వెళ్ళింది.అందరం  ఏమైందో నని గాభరా పడ్డాం.తీరా అమ్మ బొజ్జలో హాయిగా బజ్జోకుండా తొందరపడి రెండునెలలు ముందుగానే ప్రపంచాన్ని చూసేయాలని బుజ్జిబాబు బయటకు వచ్చేసాడని తెలిసింది.ఐతే మరికొంత కాలం డాక్టర్లు పర్యవేక్షణలోనే ఉంచి డిశ్చార్జి చేసాక కోరుకొండ సైనిక స్కూల్ లోని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోయారు.అమ్మ […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా-27)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  నేను ఒరురో నుంచి చాల . ఆందోళనతో భయసందేహాలతోనే బయల్దేరాను. వాళ్ళ మాటలమీద కొంచెం అనుమానం వేసిందిగాని లాలాగువా – సైగ్లో-20 వైపు అడుగులు పడుతోంటే మాత్రం గుండె పీచుపీచుమనడం మొదలైంది. నేనక్కడికి సాయంత్రం ఏడింటికి చేరాను. అప్పుడు సన్నగా మంచు కురుస్తోంది. బితుకుబితుకు మంటూనే బస్ దిగాను. కొన్ని అడుగులు వేసి ఊరిని తేరిపార జూశాను. ఊరు ప్రశాంతంగా కనిపించింది. జనం మామూలుగానే మాట్లాడుకుంటున్నారు. […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -12

నా జీవన యానంలో- రెండవభాగం- 12   -కె.వరలక్ష్మి 1978వ సంవత్సరంలో హైదరాబాద్ లో దూరదర్శన్ టి.వి. ప్రసారాలు ప్రారంభమయ్యాయి. చుట్టుపక్కల 80 కిలోమీటర్ల పరిధిలో మాత్రమే టెలికాస్ట్ అయ్యేవట. 1981 నుంచీ రాష్ట్రం మొత్తం రావడం ప్రారంభమైంది. మొదట్లో ధనవంతులు కొద్ది మంది మాత్రమే టీ.వీ. కొనుక్కోగలిగేవాళ్లు. బ్లేక్ అండ్ వైట్ లోనే ప్రసారాలు వచ్చేవి. పల్లెల్లో జనానికి మొదట రేడియోనే వింత. ఎక్కడో కూర్చుని మాట్లాడుతూంటే ఇక్కడికి విన్పిస్తున్నాయి మాటలు అని కథలు కథలుగా […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-10)

జ్ఞాపకాల ఊయలలో-10 -చాగంటి కృష్ణకుమారి పఠాభి మాష్టారు గారు పాలికాపునిచ్చి  నన్ను లచ్చమ్మపేటకి  పంపారు కదా ! ఇంట్లోకి అడుగుపెట్టానో లేదో స్కూలు నుండి  తిన్నగా ఇంటికి రాక  పార్వతి ఇంటికెల్లావుట! మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ మొదలెట్టారు. అన్నదమ్ముల కుటుంబాలుంటున్న ఏక పెనక తాటాకు ఇళ్ల లో ఒక ఇల్లు మాది కదా. ఇంటికీ ఇంటికీ మధ్యనున్న పెరళ్లన్నీ  కలిసే వుండేవి.  మధ్యన గోడలు లేవు. మాఇంటినీ  ప్రక్క ఇంటినీ విడదీసి చూపడానికి […]

Continue Reading

నడక దారిలో(భాగం-11)

నడక దారిలో-11 -శీలా సుభద్రా దేవి ఒక్కసారిగా మళ్ళా నా చదువుకు విరామం వచ్చింది.సెప్టెంబర్ లో గానీ తిరిగి సప్లిమెంటరీ పరీక్ష ఉండదు.ఒకవేళ చదివిస్తే మే-జూన్ లో గానీ కాలేజీ ఉండదు. నా అభిరుచులను సానపెట్టటానికి మళ్ళీ పూనుకున్నాను.లేకపోతే మానసికంగా కుంగిపోతానుకదా! ఆ అవకాశాన్ని నా మనసుకీ,నా మెదడుకీ ఎప్పుడూ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకూ , నిరక్షరాస్యులు, విద్యావంతులు కూడా అనేకమంది అతి చిన్న విషయాలకు కూడా […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా-26)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  బయటి నుంచి ఏజెంట్లు “అంత క్రూరంగా ప్రవర్తించకమ్మా! కనీసం పాపకైనా తినడానికేమైనా పెట్టు. పాపను ఏడవనివ్వకు” అని బతిమిలాడుతుండే వాళ్ళు. “ఏమీ పెట్టను. మీరు నా మిగతా పిల్లల మీద జాలి చూపించారా? అలాగే నేనూ దీనిమీద జాలితలవను. అంటే నేను మీరు చేయదలచుకున్న పని చేస్తున్నానన్నమాట. మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాలి” అని నేను అంటుండే దాన్ని. అలా వాళ్ళు మాటి మాటికీ వచ్చి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-10)

నడక దారిలో-10 -శీలా సుభద్రా దేవి మహారాజా మహిళా కళాశాల మెట్లు ఎక్కిన రోజు ఎవరెస్ట్ ఎక్కినంత ఉద్వేగం పొందాను.అందులో ఒక్కదాన్నే కాలేజీ కి వెళ్ళటం.పెద్దగా వెడల్పాటి కారిడార్.సింహాచలం లోని కప్పస్తంభాల్లాంటి స్తంభాలు.పూసపాటి రాజుల రాజభవనం కావటాన ఎత్తైన సీలింగు.భవనానికి నాలుగు వైపులా మెట్లుఉండేవి.రెండు మూలల్లోని మెట్లు బయటకు పోయేందుకు.రెండు మూలల్లోని మెట్లు బిల్డింగ్ వెనుక ఉన్న హాస్టల్ రూమ్ లకూ,గార్డెన్ లోకీ వెళ్ళేందుకు ఉంటాయి. వెళ్ళగానే ఏ రూం లోకి వెళ్ళాలో తెలియలేదు.దారిలో కనిపించిన అమ్మాయిని […]

Continue Reading

మా కథ(దొమితిలా చుంగారా)- 25

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  “ఓ… నేననలేదా? చెప్పలేదా? ఈ నాస్తికులింతే! ఈ కమ్యూనిస్టులింతే…” అని వాళ్ళలో వాళ్ళే ఆశ్చర్య పోయారు. నాతో “చూడు…. జంతువులు, చివరికి సింహాల లాంటి క్రూర మృగాలు సైతం తమ ప్రాణాల్నయినా పణంగా పెట్టి పిల్లల్ని కాపాడుకుంటాయి. నువు ఆ క్రూర జంతువులకన్నా కఠినాత్మురాలివి. హృదయం లేని దానివి” అని తిట్టి, కొట్టారు. అటూ ఇటూ తోశారు, గిల్లారు. “పిల్లల్ని కాపాడుకోని తల్లివి – నువ్వేం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-17 ‘అశాంతికి ఆహ్వానం’ కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 28 ‘అశాంతికి ఆహ్వానం ‘ – కథానేపధ్యం -కె.వరలక్ష్మి 1981లో ఒకరోజు పేపరు చూస్తూంటే ఇల్లు కట్టుకోవడానికి అప్పు ఇస్తారనే ప్రకటన ఒకటి కనపడింది. అప్పటికే నా స్నేహితుల్లో, బంధువర్గంలో అందరికీ పెద్దలు ఇచ్చిందో, సొంతంగా కట్టుకున్నదో ఇళ్ళున్నాయి. నాకూ ఒక ఇల్లుంటే బావుండునని అనిపించింది. అప్పటికి ఏడేళ్ళ క్రితం ఐదువేలతో శ్రీరామ్ నగర్ లో కొన్న స్థలం అప్పు తీరలేదు. ఊళ్ళో ఉన్న రెండు బేంకులూ నెలనెలా కొంత చొప్పున […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాల ఊయలలో (భాగం-9)

జ్ఞాపకాల ఊయలలో-9 -చాగంటి కృష్ణకుమారి కల్లేపల్లి  హైస్కూల్  నేను అక్కడ చదువుకొన్న రోజులలో ఒక తాటాకు పాక.  కొంత మధ్య నున్న   భాగం పైన బంగాళా పెంకులుండేవి ఆభాగానికే గోడలూ గుమ్మం . అది హెడ్ మాస్ఠారుగారి గది, ఆఫీసు కలసి వున్న భాగం .  దానికిరువైపుల భాగాలూ తాటాకులతో నేసిన ఒక షేడ్ అన్నమాట .తరగతి గదులమధ్యన గోడలుండేవి కానీ వాటి చుట్టూతా సగం గోడ ఆపైన వెదురుతో  తయారైన కటకటాలు.గుమ్మాలు లేవు. హెడ్మాస్టారు […]

Continue Reading

నడక దారిలో(భాగం-9)

నడక దారిలో-9 -శీలా సుభద్రా దేవి నా స్కూల్ ఫైనల్ చదువు పూర్తిఅయ్యేలోపున మా అన్నయ్య ఎమ్మే ఎమ్ ఫిల్ పూర్తి చేసి మహారాజా కాలేజీ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా ఉద్యోగం లో చేరాడు.మా స్కూల్ లోనే పనిచేసే మా అన్నయ్య సహోద్యోగి ఉపాధ్యాయుల అప్పల నరసింహమూర్తి గారు కూడా పై చదువు పూర్తి చేసుకుని కాలేజీలో తెలుగు లెక్చరర్ గా చేరారు.మా చిన్నన్నయ్య కూడా బీయిడీ పూర్తిచేసుకుని హైస్కూల్ లోనికి ప్రమోట్ అయ్యాడు. ఇంత […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -కథానేపథ్యాలు-16 సంధ్యా సమస్యలు కథానేపథ్యం

నా జీవన యానంలో- రెండవభాగం- 27 ‘సంధ్యా సమస్యలు ‘  కథానేపధ్యం -కె.వరలక్ష్మి నా ఫ్రెండ్స్ ఇద్దరిళ్ళలో విడివిడిగా జరిగిన సంఘటనలివి. 1992లో ‘రచన’ కోసం కథ రాయాల్సివచ్చినప్పుడు ఈ రెండు డిఫరెంట్ సంఘటనల్నీ ఒకే చోట కూర్చి రాస్తే ఎలా ఉంటుంది అనిపించి రాసిన చిన్న కథానిక ఇది. అప్పటికి మా పిల్లలింక హైస్కూల్లో చదువుకుంటున్నారు. కాని, నాకు ఇద్దరు ఆడపిల్లలు కావడంతో ఈ కథ చదివిన చాలామంది ఇది మా ఇంట్లో జరిగిన కథ […]

Continue Reading
Posted On :