image_print

కథామధురం-ఆ‘పాత’కథామృతం-24 ప్రేమలీల. బి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-24  ప్రేమలీల. బి  -డా. సిహెచ్. సుశీల మధ్యతరగతి జీవితాలను గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా అర్ధం కానిది ఏదో ఉంది అనిపిస్తుంది. మనోవేదనలకి ఒక ఇంచ్ దగ్గరలో, మందహాసాలకి ఒక ఇంచ్ దూరంలో ఉంటాయి వారి జీవితాలు. కింది తరగతికి దిగజారలేక, పై తరగతికి ఎగరలేక, గొప్పవారి హంగూ ఆర్భాటాలు చూసి నిట్టూర్పులు విడుస్తూ లోలోపల ముడుచుకుపోతూ వుంటారు. ఉన్నదానితో తృప్తి పడలేరు, లేనిదాన్ని అందుకోలేరు. దాని వల్ల సతమతమై పోతూంటారు. […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి  -డా. సిహెచ్. సుశీల ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకునే సంప్రదాయం లేని రోజుల్లో, కనీసం అక్షర జ్ఞానం లేని రోజుల్లో కూడా వారు ఇంట్లో అమ్మమ్మలు నానమ్మల ద్వారా విని నేర్చుకున్న పాటల్ని పాడుకునే వారు. శ్రామిక స్త్రీలు కూడా పొలం పనుల్లో వరినాట్లు లోనో, కలుపు తీస్తూనో, శ్రమ తెలియకుండా, అలుపు రాకుండా పాటలు పాడుకునేవారు. దంపుళ్ళ పాటలు, తిరగలి పాటలు, కవ్వం పాటలు నుండి పెళ్ళిసంబరాలకి […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-22 కల్యాణి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-22 కల్యాణి  -డా. సిహెచ్. సుశీల ఇంటి నీడలో గురి చూసి పాడే పాట (1990), నీలిమేఘాలు (1993), ముద్ర (2001), అపరాజిత ( 2022) వంటి స్త్రీవాద కవితా సంకలనాల్లో స్త్రీల వైయక్తిక, సామాజిక అసమానతలను, కౌటుంబిక వేధింపులను కవయిత్రులు రాసిన కవితలు వచ్చాయి, సంచలనాలు సృష్టించాయి. ఇంకా ఎందరో కవయిత్రులు రాసిన కవితా సంకలనాలు వెలువడ్డాయి. రచయిత్రులు స్త్రీల ఆవేదనలను వ్యక్తీకరిస్తూ కథలు, నవలలు రాస్తున్నారు. ఆలోచింపజేస్తున్నారు. అనేక సమస్యల్లో […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-21 శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-21  శ్రీమతి అద్దంపూడి అన్నపూర్ణమ్మ  -డా. సిహెచ్. సుశీల “A phobia is an overwhelming and debilitating fear of an object, place, situation, feeling or animal ” ఫోబియా అనేది ఒక నిర్దిష్ట వస్తువు, పరిస్థితి లేదా కార్యాచరణ పై ‘నియంత్రించ లేని అహేతుకమైన’ భయం. నిజానికి కొందరికి ఈ భయం చాలా ఎక్కువగా ఉంటుంది. దాని యొక్క మూలాన్ని నివారించటం ఒకటే మార్గం. లేకుంటే ఒక్కొక్కసారి […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-20 శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-20 శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం  -డా. సిహెచ్. సుశీల ” అనుమానాస్పదమైన జీవితం ఎప్పుడూ సుఖవంతం కాదు నిష్కలంకమైన హృదయాలు కలవటానికి అవకాశం ఉంటుంది కానీ పవిత్రత ఏమాత్రం లోపించిన హృదయాలు విడిపోతాయి దాంపత్య జీవితం సందేహాస్పదమైన దృష్టిలతో అనుమానం తో కూడిన అడుగులతో నడవలేదు”           నిఖార్సైన ఒకలాంటి ‘స్టేట్ మెంట్’ తో ప్రారంభమైన “ఒడిదుడుకులు ” అనే ఈ కథ శ్రీమతి వాశిరెడ్డి కాశీరత్నం 1951, […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-19 శ్రీమతి పాకల చంద్రకాంతామణి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-19 శ్రీమతి పాకల చంద్రకాంతామణి  -డా. సిహెచ్. సుశీల ఆ నాటి రచయిత్రులు కాలక్షేపం కోసం కథలు రాయలేదని గతంలో చెప్పు కున్నాం. తన చుట్టూ ఉన్న సమాజంలోని స్త్రీలలో చైతన్యం కలిగించడం వారి ప్రధాన ధ్యేయం. పురుషుల మనస్తత్వం, ప్రవర్తనలో మార్పును కూడా వారు ఆశించారు. అయితే ఉపన్యాసం లాగానో, ఉపదేశం లాగానో, కేవలం పత్రికలో పేరు చూసుకోవడానికో, పేరు ప్రఖ్యాతులు పొందాలన్న తపనతోనో రాయలేదని సూక్ష్మంగా పరిశీలిస్తే తెలుస్తుంది. అలాయైతే […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-18 ఆచంట కొండమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-18 “శ్యామల” – ఆచంట కొండమ్మ  -డా. సిహెచ్. సుశీల 1935 గృహలక్ష్మి పత్రిక జూన్ నెలలో ప్రచురింపబడిన ఆచంట కొండమ్మ రచించిన ” శ్యామల” కథ ఒక ‘ట్రయాంగిల్ లవ్ స్టొరీ ‘. ఆ రోజుల్లో ట్రయాంగిల్ లవ్ స్టోరీ అంటే ఒక ఆశ్చర్యం. అదీ ఒక రచయిత్రి రాయడం అంటే సంచలనమే. ఆడపిల్లలు కాలేజీ చదువుల వరకు రావడం, పొరుగూరుకి వెళ్ళి చదవడం, అక్కడ ‘ప్రేమ’ చిగురించడం అనే కథాంశం […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-17 శ్రీమతి అలివేలు మంగతాయారు

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-17 ” పరివర్తనము” -శ్రీమతి అలివేలు మంగతాయారు  -డా. సిహెచ్. సుశీల సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యుల వారు పరదేవతను తన్మయత్వంతో కీర్తించారు. భక్తి తో అర్చించారు.  ఆ “సౌందర్యం” కేవలం శారీరక సౌందర్యం కాదు. మాతృమూర్తి అన్న భావం. జ్ఞానప్రదాయిని  అన్న భావం. ప్రబంధ కవులు కూడా ప్రబంధ నాయికను నఖశిఖ పర్యంతం వర్ణనలతో నింపివేశారు. ప్రబంధ లక్షణాల్లో ,’అష్టాదశ వర్ణనలు’ ఒకటి. ఇక్కడ ఈ వర్ణనలు కేవలం బాహ్య సౌందర్యమే. తర్వాతి కాలంలో […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-16 పులిపాక బాలాత్రిపురసుందరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-16 ” పిల్లికి చరలాటము – ఎలుకకు ప్రాణ సంకటము” -పులిపాక బాలాత్రిపురసుందరమ్మ  -డా. సిహెచ్. సుశీల           ad vertere అనే లాటిన్ పదం నుండి ఆంగ్లం లో advertisement అనే పదం వచ్చింది. “ఒక వైపుకి తిరగడం” అని తెలుగు లో అర్ధం. ప్రేక్షకులను తమ వైపుకి తిప్పుకోవడం “ప్రకటన” ప్రధాన లక్షణం, లక్ష్యం. ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు ఏదైనా సమాచారాన్ని వివిధ మాధ్యమాల ద్వారా […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-15 ఆచంట సత్యవతమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-15 “గ్రుడ్డిగా నడిస్తే గోతిలో పడడమే” — ఆచంట సత్యవతమ్మ  -డా. సిహెచ్. సుశీల ఆది శంకరాచార్యుల వారు యావద్భారత దేశం పర్యటించి హైందవం, సనాతన ధర్మం సంబంధిత గ్రంథాలను, భాష్యాలను, వ్యాఖ్యానాలు చేస్తూ అద్వైత సిద్ధాంతాన్ని బోధించారు. అనేకమంది శిష్యులు వారిననుసరించారు. శంకరాచార్య నాలుగు ప్రముఖ పీఠాలను ఏర్పాటు చేయడమే కాక సన్యాసుల కొరకు వివిధ ప్రాంతాలలో మఠాలను ఏర్పాటు చేసారు. శంకరుల వారి తదనంతరం వారి శిష్య ప్రశిష్య గణాలు […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-14 భాస్కరమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-14 ప్రభావతి – రచయిత్రి “భాస్కరమ్మ”  -డా. సిహెచ్. సుశీల ఆ. భాస్కరమ్మ రచించిన “ప్రభావతి” అనే కథ 1926 ఆగస్టు, భారతి పత్రికలో ప్రచురించబడింది.            కాకినాడ పట్టణంలో శాస్త్రవిజ్ఞానంలోను, సంప్రదాయ, సంపదలలోను, దాతృత్వం లోను యోగ్యుడైన ఒక నియోగ బ్రాహ్మణుడు పెమ్మరాజు గోపాల్రావుగారి సంతానములో మొదటి పుత్రిక లక్ష్మీదేవమ్మ. ఆమెకు పదునారవ ఏట ఒక కుమారుడు పుట్టిన ఆరు నెలలకే భర్త మరణించగా పిల్లవాడిని అల్లారుముద్దుగా […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-13 కొమ్మూరి పద్మావతీదేవి  -డా. సిహెచ్. సుశీల తెలుగు నాటకరంగంలో పూర్వం స్త్రీ పాత్రలను కూడా పురుషులే ధరించడానికి కారణం నాటకాల్లో నటించడం సంసారపక్షం స్త్రీలకు కూడదన్న బలమైన విశ్వాసం సమాజంలో ఉండడమే. ఈ నాటికీ నాటకాల్లో స్త్రీ పాత్రలు చాలా పరిమిత సంఖ్యలో ఉండడం గమనించవచ్చు. అలాంటి రోజుల్లో నాటక చరిత్రలో ప్రముఖుడు బళ్ళారి రాఘవ తను ప్రముఖ న్యాయవాది అయినా నాటకరంగం పట్ల ప్రత్యేకాభిమానంతో, నిజానికి అదే తన జీవిత […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-12 వేదుల మీనాక్షీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-12 వేదుల మీనాక్షీదేవి  -డా. సిహెచ్. సుశీల తెలుగులో తొలి కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన ‘దిద్దుబాటు’ అన్న ప్రచారం విస్తృతంగా ఉన్నా, స్త్రీవాదులు ప్రత్యేకంగా శ్రద్ధగా పట్టుదలగా చేసిన పరిశోధన వల్ల 1902లో భండారు అచ్చమాంబ గారి ” ధన త్రయోదశి” తొట్టతొలి కథ అని నిర్ధారణ అయింది. 1893 నుండే ఆమె చాలా కథలు రాసినట్టు తెలిసినా 10 మాత్రమే లభ్యమై నాయి. అలాగే అనేక కథలు, […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-11 ఆచంట శారదాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-11 ఆచంట శారదాదేవి  -డా. సిహెచ్. సుశీల స్త్రీలు కలం పట్టిన నాటి నుండి కూడా ‘ స్త్రీ పురుష సంబంధాలలోని అసమాన తలు’ గురించి అవగాహనతో రాసినట్టే స్పష్టమవుతోంది. భర్త ఎలాంటి వాడైనా అతన్ని భరించడం, పూజించడమే ‘సతీ ధర్మం’ వంటి కథలు కొన్ని వచ్చినా, ‘ స్త్రీ కి మెదడు ఉంటుంది, హృదయం ఉంటుంది, ఆలోచనలు అభిరుచులు ఉంటాయి’ అన్న స్పృహ తో రాసిన కథలే ఎక్కువ. భావుకత, ప్రకృతి […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-10 యల్లాప్రగడ సీతాకుమారి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-10 యల్లాప్రగడ సీతాకుమారి  -డా. సిహెచ్. సుశీల విద్యా, వైజ్ఞానిక రంగాలలో ఎంత అభివృద్ధి చెందుతున్నా, ప్రగతి శీల దృక్పథం, దేశభక్తి భావన, విశ్వమానవ సౌభ్రాతృత్వం వెల్లివిరుస్తోందని వేదికల మీదా, అక్షరాల్లోనూ మాత్రమే కనిపిస్తోందని చెప్పక తప్పదు. కులమూ, మతమూ, ప్రాంతమూ, భాషావైషమ్యా లతో మనుషులు ముక్కలు ముక్కలుగా విడదీయబడడం జరుగుతూనే ఉంది. ఇది అన్యాయమే కాక అనైతికం.            మతం కన్నా మానవత్వం మిన్న. నిజానికి మతం […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-9 భండారు అచ్చమాంబ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-9 భండారు అచ్చమాంబ  -డా. సిహెచ్. సుశీల “నేను పెండ్లాడిన భార్యను గాని దాసిని గాను. వివాహమాడుట వలనను భర్తకు దాసి నగుదునా యేమి ?” తెలుగు సాహిత్యంలో తొలి తెలుగు కథ 1910 లో గురజాడ అప్పారావు రాసిన “దిద్దుబాటు” (ఆంధ్ర భారతి పత్రికలో) అని అత్యధికులు భావించారు. చాలా ప్రక్రియ లకు కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు ప్రారంభకులు అని తీర్మానం చేయడం వల్లనో, మరే కారణం వల్లనో కానీ […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-8 స్థానాపతి రుక్మిణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-8  -డా. సిహెచ్. సుశీల తెలుగు కథానిక ఉద్భవించి దాదాపు నూట పాతికేళ్ళు అవుతున్న కాలంలో, ఏ ప్రక్రియలోనూ రానంత విస్తృతంగా, విస్తారంగా “కథ” తన ప్రత్యేకతను ప్రతిభను సంతరించుకుంది. ఎందరో కథకులు వివిధ ఇతివృత్తాలలో, సమాజపు పోకడలను, జీవితాలను, జీవన విధానాలను, సమస్యలను బలంగా చిత్రించారు.            కొన్ని వేల మంది కథకులు రకరకాల కథావస్తువులను స్వీకరించి వైవిధ్యభరితంగా చిత్రించారు. కానీ రచయిత్రుల సంఖ్య చాలా తక్కువ. […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-7 ఇల్లిందల సరస్వతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-7  -డా. సిహెచ్. సుశీల ఇల్లిందల సరస్వతీదేవి          15.8.1947 న భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న స్త్రీ పురుషుల త్యాగఫలంగా దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా సంతోషంతో అనేక కవితలు, కథలు వెల్లువలా పొంగులెత్తాయి.           స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశ సంరక్షణా, దాని కొరకు వచ్చిన సాహిత్యం గురించీ ముఖ్యంగా చెప్పుకోవాలి. స్త్రీల వ్యక్తి స్వాతంత్య్రం, స్త్రీల సాధికారతకై […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-6 సమయమంత్రి రాజ్యలక్ష్మి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-6  -డా. సిహెచ్. సుశీల సమయమంత్రి రాజ్యలక్ష్మి             భారతదేశ స్వాతంత్య్ర సాధనోద్యమంలో స్త్రీలు కూడా చైతన్యవంతంగా పాల్గొనా లని, రాచరికపు పరదాల కాలం తీరిపోయిందని, దేశ స్వాతంత్య్రంతో పాటు స్త్రీ ‘వ్యక్తి స్వాతంత్య్రం’ కూడా అత్యవసరమని గుర్తిస్తూ ఆనాడు విస్తృతంగా వ్యాసాలు, కవితలు, కథలు వచ్చాయి.           సామాజికంగా కౌటుంబికంగా తమకున్న సంకెళ్ళను తెంచుకోవడానికి స్త్రీలు ప్రయత్నించారు. అయితే ‘మితవాద’ ధోరణిలోనే […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-5 సి.హెచ్. వు. రమణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-5  -డా. సిహెచ్. సుశీల సి.హెచ్. వు. రమణమ్మ                    జాతీయోద్యమం, స్త్రీల హక్కులు, కులమత రహిత సమాజ నిర్మాణం వంటి విషయాల పట్ల అవగాహనతో, చైతన్యవంతమైన కథలు రచించిన నాటి రచయిత్రులు – ‘వర్గ పోరాటం ‘ శ్రమ జీవుల నుండి ధనిక వర్గం చేసే దోపిడీ వైపు కూడా దృష్టి సారించారు. ఎందరో కష్టజీవుల శ్రమను తమ బొక్కసంలో దాచుకొనే […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-4 పులవర్తి కమలావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-4  -డా. సిహెచ్. సుశీల   “ప్రథమ దళితోద్యమ కథా రచయిత్రి*”పులవర్తి కమలావతీదేవి                  1930 లలో స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పురుషులతో ధీటుగా పాల్గొని, జైలు కెళ్ళడం తో పాటు, రాజకీయ వ్యవహారాలలో తీర్మానాలు చేయడం ద్వారా తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకున్నారు. అఖిల భారత స్థాయిలో ఎన్నెన్నో మహిళా మహాసభలలో చురుగ్గా పాల్గొన్నారు.              స్త్రీలు చదువుకుంటే ఏ […]

Continue Reading

కథామధురం-ఆ’పాత’కథామృతం-3 దుర్గాబాయి దేశముఖ్

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-3  -డా. సిహెచ్. సుశీల   “ఆంధ్రా మదర్ థెరీసా”దుర్గాబాయమ్మ                  బహుముఖ ప్రజ్ఞాశాలి యైన ” మహిళా రత్నం”, మాతృదేశ విముక్తి ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన “వీర దుర్గ”, విద్యాధికురాలై, న్యాయవాద వృత్తిని స్వీకరించి, న్యాయం కోసం – ముఖ్యంగా మహిళల కోసం పోరాడిన “స్త్రీ మూర్తి”, నిరంతరం సామాజిక సేవా తత్పరురాలై మహిళాభ్యుదయం కొరకు “ఆంధ్ర మహిళా సభ” ను స్థాపించి, ఎందరో […]

Continue Reading

కథామధురం-ఆ’పాత’కథామృతం-2 పొణకా కనకమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-2  -డా. సిహెచ్. సుశీల పొణకా కనకమ్మ కథారచన         ఊయల లూగించే కోమల కరాలేరాజ్యాలు శాసిస్తవితూలిక పట్టే మృదు హస్తాలేశతఘ్నులు విదిలిస్తవిజోలలు బుచ్చే సుకుమారపుచేతులే జయభేరులు మోగిస్తవి              — పొణకా కనకమ్మ           నెచ్చెలి గీత గారి సూచన మేరకు 1950 కి పూర్వం రచయిత్రుల కథలను విశ్లేషించటం ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. ఆ […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-1 కనుపర్తి వరలక్ష్మమ్మ కథ “కుటీరలక్ష్మి”

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-1  -డా. సిహెచ్. సుశీల 20 వ శతాబ్దపు మొదటి దశకం లోనే తమ తోటి స్త్రీలను చైతన్య పరచడానికి కవయిత్రులు, రచయిత్రులు సాహిత్య సృజన చేసారు. ఐదారు తరగతుల వరకు చదివి, వివాహం చేసుకొని, కుటుంబ బాధ్యతలలో తలమునకలైన ఇల్లాళ్ళుకూడ కుటుంబంలో, సమాజంలో స్త్రీ పురుష వివక్షతను గుర్తించారు –  ఆలోచించారు – రచనలు చేసారు.               స్త్రీ విద్య ఆవశ్యకత, స్త్రీ స్వేచ్చా స్వాతంత్య్రం […]

Continue Reading

కథామధురం-కె.కె.భాగ్యశ్రీ

కథా మధురం  కె.కె.భాగ్యశ్రీ ‘ఇంటి అల్లుడికీ వుంటుంది – అత్త మామల బాధ్యత’ అని చెప్పిన కథ..అనుసరణీయం !  -ఆర్.దమయంతి ***           ‘వివాహానంతరం అమ్మాయికి అత్తమామల బాధ్యత వున్నట్టే అబ్బాయికి కూడా ఆ నైతిక బాధ్యత తప్పనిసరి, అని మరవకూడదు. ఇది చట్టంగా రూపు దిద్దుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది.’ ***           ఈ రోజుల్లో భార్య భర్తలిద్దరూ చదువుకుని, ఇద్దరూ సమానంగా సంపాదిస్తున్నవారే! […]

Continue Reading
Posted On :

కథామధురం-నందు కుషినేర్ల

కథా మధురం  నందు కుషినేర్ల ‘ఇది ఒక రచయిత్రి నిజ జీవిత కథాకావ్యం !’  -ఆర్.దమయంతి ***           ఇంటి స్త్రీ విలువ గానీ , ఆమెలో దాగిన కళా తపన కానీ, విద్వత్తు కానీ చాలా మంది మగవాళ్ళకు తెలీదు.  తెలిసినా గుర్తించరు. ఆమె – తల్లి కావొచ్చు. సోదరి కావొచ్చు. లేదా భార్య కావొచ్చు. వారిలో దాగిన కళని వెంటనే గుర్తించి, ప్రోత్స హించి , వెలుగులోకి తీసుకు […]

Continue Reading
Posted On :

కథామధురం-బుద్ధవరపు కామేశ్వరరావు

కథా మధురం  బుద్ధవరపు కామేశ్వరరావు ‘మానసిక ఒత్తిళ్ళకు మందు లేదు. కానీ ఒక విలువైన జపమాల వుంది..’ అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           ‘ఇవాళ నేను – అస్సలు పని ఒత్తిడికి గురి కాకూడదు.’ అని అనుకుంటూ నిద్ర లేవడం తోనే మొదలౌతుంది స్ట్రెస్..’ ఇది చదివితే నవ్వొస్తుంది కానీ, నిజమేమిటంటే – ఈ ఆధునిక యుగంలో ప్రతి మహిళా మానసిక ఒత్తిడికి గురికాక తప్పడంలేదనే చెప్పాలి. కారణం […]

Continue Reading
Posted On :

కథామధురం-శ్రీమతి డి.వి.రమణి

కథా మధురం  శ్రీమతి డి.వి.రమణి ‘జగమంతా దగా చేసినా, చిగురంత ఆశ చూసిన ఓ స్త్రీ కథ!’  -ఆర్.దమయంతి ***           కొంత మంది స్త్రీలు తమ ప్రమేయం లేకుండానే ఒంటరి అగాధపు లోయలోకి తోసేయబడతారు. కారణాలు అనేకం. ఎదిరించలేని పరిస్థితులు, చుట్టూ నెలకొన్న కుటుంబ వాతావరణం కావొచ్చు. ఆ పైన నిరాశ, నిస్పృహలకు లోను కావడం, పోరాడ లేక ఓటమిని అంగీకరిస్తూ విషాదంలో మిగిలి పోవడం జరుగుతూ వుంటుంది. తత్ఫలితంగా […]

Continue Reading
Posted On :

కథామధురం-సావిత్రి రమణారావు

కథా మధురం  సావిత్రి రమణారావు ‘భార్యని పురుగులా చూడటమూ హింసే! మానసిక హింసే..’ – అని చెప్పిన కథ!  -ఆర్.దమయంతి ***           వివాహిత స్త్రీలు నిరాశకి గురి అవడానికి గల ప్రధాన కారణాలలో ప్రధానమైనది  – కుటుంబంలో వారి ఉనికి కి విలువ లేకపోవడం. భర్త చులకన గా చూడటం,  హేళనతో గేలి చేయడం, పదిమందిలో పలచన చేసి మాటలతో అవమానించడం, మాటిమాటికి తూలనాడటం, హీనమైన తిట్లు తిట్టడం.. వంటి […]

Continue Reading
Posted On :

కథామధురం-ఎస్.శ్రీదేవి

కథా మధురం  ఎస్.శ్రీదేవి ‘ప్రేమ అనే పదానికి స్వచ్ఛమైన నిర్వచనంలా నిలిచిన ఓ స్త్రీ కథ’ – గుండెలోతు!  -ఆర్.దమయంతి ‘Goodness in words creates trust, goodness in thinking creates depth, goodness in giving creates love.’ -Laozi. ***           భార్య గత జీవితం లో ఒక ప్రేమ కథ వుందని, అందులో ఆమె పాత్ర ఏమీ లేదని తెలిసినా నమ్మలేని మగ బుద్ధి పోకడలు […]

Continue Reading
Posted On :

కథామధురం – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ

కథా మధురం దర్భా లక్ష్మీ అన్నపూ ర్ణ ‘ప్రతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం నేర్వాలి..’ అని చెప్పిన రచయిత్రి – దర్భా లక్ష్మీ అన్నపూర్ణ గారి కథ – ‘మనోరథం ‘ !  -ఆర్.దమయంతి స్త్రీ తనని తాను గౌరవించుకోవడం అంటే తన విలువని వ్యక్తపరచుకోవడం!  కానీ, కొంతమంది మగాళ్ళు  అర్ధం చేసుకోరు.  అర్ధమయ్యాక -మరి కొంతమంది సహించుకోలేరు. ‘ఆఫ్ట్రాల్..నువ్వేమిటీ, నీకు గౌరవమేమిటి? దాన్ని నేను లెక్క చేయడమేమిటీ? అని తేలిక చూపు చూస్తారు. అలా […]

Continue Reading
Posted On :

కథామధురం-డా.లక్ష్మీ రాఘవ

కథా మధురం డా.లక్ష్మీ రాఘవ స్త్రీ శాంతమూర్తి మాత్రమే కాదు, ఉగ్రరూపిణి కూడా! అని నిరూపించిన కథ-     ‘ఆమె ఒక శక్తి !’  -ఆర్.దమయంతి ‘స్త్రీలకు కుటుంబపరంగా దక్కే న్యాయం ఎంత గొప్పదంటే.. ఏ చట్టాలూ, న్యాయ స్థానాలూ చేయలేని  మేలు కంటే కూడా మిన్నయినది.’ *** జీవితం లో ఆడది – మగాడి వల్లే మోసపోతుంది. అతని కారణంగానే  కష్ట పడుతుంది. అన్నివిధాలా నష్టపోతుంది. అయితే అతను భర్తే కానవసరం లేదు. అతను  అన్న […]

Continue Reading
Posted On :

కథామధురం-కిరణ్ విభావరి

కథా మధురం కిరణ్ విభావరి తాను వెలుగుతూ..వెలిగిస్తూ.. దీపం లా బ్రతకమంటున్నకిరణ్ విభావరి ‘తప్పంటారా ?’ కథ!  -ఆర్.దమయంతి ముందుకెళ్తున్న  ఈ సమాజం – ఎంత వెనకబడి ఆలోచిస్తోందంటే.. స్త్రీ వస్త్రధారణ లోని లోటుపాట్లను ఇంకా లెక్కించడం లోనే మునిగిపోయుంది. ‘ స్త్రీ ఒంటి నిండా వస్త్రాన్ని ధరించడం ‘ అంటే, అది తప్పనిసరిగా చీరే అయి వుండాలన్న అపోహ నించి మనమింకా ఒక్క ఇంచ్ అయినా కదల్లేదేమో అని అనిపిస్తుంది. పైగా ధరించిన దుస్తులను బట్టి […]

Continue Reading
Posted On :

కథా మధురం- జింబో కథ “ఆమె కోరిక”

కథా మధురం   విడాకుల సమస్యకి కొత్త పరిష్కారం సూచించిన  ఓ స్త్రీ కథ  ‘జింబో’ (రాజేందర్) గారి ‘ఆమె కోరిక ‘ !  -ఆర్.దమయంతి ‘ If divorce is like death, then is not the perpetuation of divorce a kind of murder? ‘ ― Anthony Marais డైవోర్స్! వైవాహిక జీవితం లో   సామాన్య స్త్రీల నుంచి సెలెబ్రెటీ వుమెన్ వరకు ఎదుర్కొంటున్న  ప్రధానమైన సమస్యలలో ఇప్పుడు ‘విడాకులు..’  […]

Continue Reading
Posted On :

కథా మధురం- సయ్యద్ సలీం

కథా మధురం   సయ్యద్ సలీం ‘ యంత్రం లాంటి ఓ ఇల్లాలి గుండె చప్పుడు వినిపించిన కథ.. ‘ -ఆర్.దమయంతి సూర్యుడు లేకపోయినా పగలు గడుస్తుంది కానీ, ఇల్లాలు పడుకుంటే ఒక్క క్షణం కూడా ఇల్లు నడవదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రతి స్త్రీ అనుభవించి మరీ తెలుసుకునే జీవన సత్యం.  వివాహమైన క్షణం నించి..చివరి శ్వాస దాక ఎడతెరిపిలేని కుటుంబ బరువు బాధ్యతల ను మోసేది ఇల్లలే.   చాలా మంది మగాళ్ళు అంటుంటే వింటాను. ‘ […]

Continue Reading
Posted On :

కథా మధురం- జొన్నలగడ్డ రామలక్ష్మి

కథా మధురం   జొన్నలగడ్డ రామలక్ష్మి ‘ మహిళకి తన చదువే తనకు రక్ష …’ అని చాటి చెప్పిన కథ –  ‘నారీసంధానం! ‘ -ఆర్.దమయంతి ఆడపిల్లకి చదువు చెప్పించడం కంటెనూ, పెళ్ళి చేసి పంపేయడమే అన్ని విధాలా శ్రేయస్కరమని భావించే తల్లు లు  ఆ కాలం లోనే కాదు, ఈ కాలం లోనూ వున్నారు.  గ్రామాలలో అయితే ఇలా తలబోసే వారి సంఖ్య అధిక శాతంలో వుంటుందని చెప్పాలి. అయిన సంబంధం సిద్ధం గా వుంటే […]

Continue Reading
Posted On :

కథా మధురం- రాధ మండువ

కథా మధురం   రాధ మండువ   ‘ప్రేమించడం స్త్రీ బలహీనత కాదు..’అని చాటి చెప్పిన కథ ‘అంతర్మధనం’ -ఆర్.దమయంతి స్త్రీ – మగాణ్ని  ఎందుకు ప్రేమిస్తుంది? అనే ప్రశ్నకు జవాబు దొరకొచ్చేమో!  కానీ,  ప్రేమించి ఎందుకు మోసపోతుంది? అనే ప్రశ్నకు మాత్రం..ఊహు. జవాబు వుండదు.  జీవితం లో తిరిగి కోలుకోలేని ఆ  అగాథ వ్యధ  ఏమిటో ఆమెకి మాత్రమే తెలుస్తుంది. ప్రేమ లో మోసపోవడం అనేది  అన్నిరకాల బాధల్లాంటి బాధ కాదు. సన్నిహితుల  ఓదార్పుతో ఊరడిల్లే నష్టం కాదిది. […]

Continue Reading
Posted On :

కథా మధురం- అల్లూరి గౌరీ లక్ష్మి

కథా మధురం   అల్లూరి గౌరీ లక్ష్మి మూడు తరాల స్త్రీల మనోభావాల ముప్పేట కలనేత ఈ కత! -ఆర్.దమయంతి వొంట్లో నలతగా వున్నా, మనసు లో కలతగా వున్నా, కాపురంలో కుదురు లేకున్నా..విషయాన్ని ముందుగా అమ్మకి చెబుతాం.  అమ్మ అయితే అన్నీ అర్ధం చేసుకుంటుంది. ‘అయ్యో  తల్లీ ‘  అని జాలి పడుతుంది. ఓదారుస్తుంది. వెంటనే రెక్కలు కట్టుకుని వాలుతుంది. ‘ఇక నీకేం భయం లేదు. నిశ్చింతగా వుండు.’ అంటూ కొండంత అండగా నిలుస్తుంది. కష్ట సమయం […]

Continue Reading
Posted On :

కథా మధురం- బులుసు సరోజినీ దేవి

కథా మధురం   బులుసు సరోజినీ దేవి  పరకాంతలని వేటాడే  మగాళ్ళ దుష్ట కన్నుకు సర్జరీ చేసిన కథ – కన్ను! -ఆర్.దమయంతి ఆరంభం : ఆమె భర్త –  సంసార నావ నడుపుతున్నాడు. ఎలాటి ఒడిదుడుకులు లేకుండా,  ప్రయాణం – ఎంతో సాఫీగా,  హాపీ గా  సాగిపోతోంది.  ఆ సంతోషం లో ఆమె  అలా ఆదమరచి ఓ కునుకు తీసిందో  లేదో, పీడ కలకి మెలకువ వచ్చింది. కళ్ళ ముందు బీభత్సం..తుఫాను కి నావ కంపించిపోతోంది.  ‘ఏమండీ’ […]

Continue Reading
Posted On :

కథా మధురం- సయ్యద్ నజ్మా షమ్మీ

కథా మధురం   సయ్యద్ నజ్మా షమ్మీ  అమ్మతనానికి అసలైన అర్ధం చెప్పిన కథ  – ఆపా! -ఆర్.దమయంతి  Being a mother is an attitude, not a biological relation – Robert A. heinlein దేవుని దృష్టిలో ఆడదెప్పుడూ గొప్పదే. ఆయన స్త్రీ మూర్తి కి ఇచ్చిన స్థానం  ఎంత గొప్పదీ అంటే, తన పేరుకి ముందు భార్య పేరు పెట్టుకుని మరీ గౌరవించాడు ఆ తండ్రి. అందుకే, అమ్మ మనకు ప్రధమ పూజ్యురాలైంది. […]

Continue Reading
Posted On :

కథా మధురం- చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి

కథా మధురం   చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి చెదిరే ముగ్గు (కథ)    -ఆర్.దమయంతి కథా మధుర పరిచయం : ‘ఆకాశమంత ప్రేమకి నిర్వచనం అమ్మ ఒక్కటే!’ అని చెప్పిన కథ  – డా!! చెళ్లపిళ్ల సూర్య లక్ష్మి గారు రాసిన చెదిరే ముగ్గు కథ! ******** మహిళలు  స్త్రీ పక్షపాతులు కానే కారు. వారికి మగ వారంటేనే గొప్ప నమ్మకం. విశ్వాసం.   వారి  మోసాలు తెలీక ప్రేమించడం , తెలిసాక –  కడ వరకు వగచి […]

Continue Reading
Posted On :

కథా మధురం- పావనీ సుధాకర్

కథా మధురం   పావనీ సుధాకర్ ‘పుస్తకాల్లో దాచుకున్న నెమలి పింఛంలా జ్ఞాపకమైన ఓ ‘ప్రయాణం! ‘ కథ!   -ఆర్.దమయంతి కథా మధుర పరిచయం : ఆమె మనసులో   అతనికొక ప్రత్యేక స్థానం వుంది.   అంత మాత్రానికే అతను ప్రేమికుడు కావాలా ? అతని జ్ఞాపకం, ఆమె మనసు గదిలో గుప్పుమనే మొగలి పువ్వు  పరిమళం వంటిది.  అయితే ఇంకేం? – ఆ ఇద్దరి మధ్య ఏదో ఎందుకూ ఆ సంభమే అయివుంటుంది. అంతెందుకు […]

Continue Reading
Posted On :

కథా మధురం- శశికళ ఓలేటి

కథా మధురం      ‘దగాపడిన స్త్రీలకి ధైర్యాన్ని నూరిపోసిన కథ! –  ‘కనకాంబరం!’ -ఆర్.దమయంతి ‘ నేటి కథా సాహిత్యం లో – శ్రీమతి శశికళ ఓలేటి గారి  కథలకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు వుంది. విలువైన గౌరవం వుంది. కథా సంస్కారాన్ని ఎరిగిన ‘సంస్కార రచయిత్రి ‘ గా పేరు తెచుకున్న అతి కొద్ది మంది రచయిత్రులలో శశికళ ఓలేటి గారి పేరు వినిపించడం ఎంతైనా అభినందనీయం. వీరి రచనలలో  స్త్రీ పాత్రల చిత్రీకరణ ఎంతో హుందాగా వుంటుంది. ఇటు […]

Continue Reading
Posted On :

కథా మధురం-వనజ తాతినేని

కథా మధురం   బిహైండ్ హెర్ స్మైల్ – వనజ తాతినేని -ఆర్.దమయంతి ‘ వెన్నెల్లాంటి ఆమె నవ్వు వెనక దాగిన ఓ నీలినీడ కథ..’- బిహైండ్ హర్ స్మైల్..!  స్త్రీ ని ఒక వినోద కరమైన పరికరం గా  వినియోగించబడుతున్న రంగం – సినీ రంగం. ఎవరూ భుజాలు తడుముకోనవసరం లేకుండానే, కృష్ణ వంశీ కళ్ళకి కట్టినట్టు తన సినిమాలో  నే –  తారల తళుకు జీవితం వెనక చీకటిని ఎంత దయనీయం గా వుంటుందో గుండెకి […]

Continue Reading
Posted On :

కథా మధురం-మన్నెం శారద

కథా మధురం   “తాత గారి ఫోటో” -మన్నెం శారద -ఆర్.దమయంతి   ‘పురుష అహంకారానికి నిలువెత్తు అద్దం – ‘తాత గారి ఫోటో!’ పంజరం లో బంధించిన పక్షి  ఎందుకు పాడుతుందో .. తెలుసుకున్నంత సులభం గా.. సంసారం లో –   భర్త చేత వంచింపబడిన స్త్రీ  చస్తూ కూడా ఎందుకు బ్రతుకుతుందో – తెలుసుకోవడం చాలా కష్టం. ప్రతి ఆడదాని జీవితం లో ఒక శత్రువుంటాడు. వాడు మొగుడే అయినప్పుడు ఆమె జీవితం క్షణం […]

Continue Reading
Posted On :

కథా మధురం-జి.యస్.లక్ష్మి

కథా మధురం   “ఇప్పుడైనా చెప్పనీయమ్మా” -జి.యస్.లక్ష్మి -ఆర్.దమయంతి ‘అమ్మ ఔన్నత్యానికి ఆకాశమంత ఆలయం కట్టిన కథ!’ – శ్రీమతి జి.ఎస్ లక్ష్మి గారు రాసిన – ‘ఇప్పుడైనా చెప్పనీయమ్మా..’ ముందుగా ఒక మాట: ‘తన సృష్టి లో నే ఇంత అందమైన సృష్టి వుందని తెలీని  బ్రహ్మ సయితం  అమ్మ ని చూసి అబ్బురపడిపోతాడట!’ – బహుశా, ఇంతకు మించిన అద్భుతమైన  వాక్యం మరొకటి వుండదేమో, – అమ్మ ని అభివర్ణించేందుకు, అమ్మ పేమానురాగాలకి హృదయాంజలి ఘటించేందుకు! […]

Continue Reading
Posted On :

కథామధురం-మంథా భానుమతి

కథామధురం మంథా భానుమతి -ఆర్.దమయంతి ‘ ప్రతి స్త్రీ విషాదం వెనక ఒక మగాడు వుంటాడు ‘ అని నిర్ధారించే కథ… – శ్రీమతి మంథా భానుమతి ‘స్వార్ధం’ కథ. ***** ‘స్త్రీ అమూల్యమైనదే. కాకపోతే చాలా  అమూల్యమైన పరికరం.’ అందుకే, మగాడు తన  తెలివితోనో, మోసం తోనో..ఆమెని వినియోగించుకుని లబ్ది పొందాలని తహతహలాడతాడు. ఆ  ప్రయత్నం లో, ఆ ఆరాటంలో..చివరికి నైతికం గా ఎంతగా దిగజారుతాడూ అంటే – ఎంత ద్రోహం తలబెట్టడానికైనా వెనకాడడు.  అతనెవరో […]

Continue Reading
Posted On :

కథా మధురం-స్వాతీ శ్రీపాద

కథా మధురం   స్వాతి శ్రీపాద -ఆర్.దమయంతి  రచయిత్రి గురించి : స్వాతి శ్రీపాదగారు  40 యేళ్ళు గా ఇటు కథా సాహిత్యం లో, అటు నవలా సాహిత్యం లో ఎనలేని కృషి సలుపుతూ, ఎప్పటికప్పుడు నూతన ఒరవడిని సృష్టిస్తూ సాహితీ పథం లో ముందుకు సాగుతున్నారు. తెలుగు సాహిత్య ప్రపంచం లో పేరెన్నిక గల రచయిత్రులలో స్వాతి శ్రీపాద  గారి పేరు స్ఫుటం గా వినిపిస్తుంది. కథల పోటీలలో అనేక ప్రతిష్టాత్మకమైన బహుమతులను గెలుచుకున్నారు.  అవార్డ్స్ ని […]

Continue Reading
Posted On :

‘శక్తివంతమైన ఆలోచనా తరంగం..’ S/O. అమ్మ’ కథాంతరంగం!

కథా మధురం   ‘శక్తివంతమైన ఆలోచనా తరంగం..’ S/O. అమ్మ’   కథాంతరంగం! -ఆర్.దమయంతి అమ్మ అంటే దైవమని, ప్రేమకి ప్రతిరూపమనీ, త్యాగమయి, రాగమయి అనీ అదనీ ఇదనీ అమ్మని ఇంతగా ప్రగల్భాల అభివర్ణనలు సాగినా,  ఈ బిడ్డ ఫలానా అని అధికారికంగా ధృవీకరించాల్సి వచ్చినప్పుడు మాత్రం తండ్రి పేరుని మాత్రమే సూచించాల్సివస్తోంది. అదంతే. అదే రూల్. మార్చడానికి వీలు లేదు. అతిక్రమించాలని  ప్రయత్నించడానికి సైతం వీలు లేని ఆదేశం. రాజ్యాంగబధ్ధమైన ఈ నియమాన్ని, తాను అంగీకరించలేక, అయిష్టంగా […]

Continue Reading
Posted On :

జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’

కథా మధురం జీవన వాస్తవాలకి సజీవ రూపకల్పన – ‘ కలలోని నిజం’  -ఆర్.దమయంతి ఇది కథే అయినా, కథ లా వుండదు. నిజం  లా వుంటుంది. ఇంకా చెప్పాలీ అంటే, మనల్ని మనం అద్దంలో చూసుకున్నట్టుంటుంది.   కథలో పాత్రలు మనకు బాగా తెలిసినవారే కావడం ఈ కథలోని ప్రత్యేకం.    ఇంతకీ కథేమిటంటే : ఒక తండ్రి కి ఇద్దరు పిల్లలు. ఒక కొడుకు. ఒక కూతురు. ఇద్దరూ జీవితం లో స్థిరపడతారు. అయితే, అల్లుడి కి […]

Continue Reading
Posted On :

కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ – తోడబుట్టువు

  కమ్మని కన్నీరిచ్చిపోయిన కథ –  తోడబుట్టువు  -ఆర్.దమయంతి జీవితం లో ఎవరిని పోగొట్టుకున్నా,  ఆ స్థానాన్ని భర్తీ చేసుకునే అవకాశం వుంటుంది. కానీ, అమ్మ లేని శూన్యం మాత్రం – ఎప్పటికీ ఖాళీ గానే వుండిపోతుంది. కారణం? – అమ్మనీ, అమ్మ లేని లోటుని తీర్చగల ప్రత్యామ్నాయ శక్తి   మరొకటి ఈ సృష్టిలోనే లేదు. అమ్మ అమ్మే. అమ్మ ప్రేమ అమృతభాండమే.  ఆడపిల్లలకి అమ్మతో గల ప్రేమానుబంధాలు ప్రత్యేకం గా వుంటాయి. అమ్మ చేతుల్లోంచి ప్రవహించే […]

Continue Reading
Posted On :

కథా మధురం-కల

కథా మధురం  ఒక వాస్తవానికి మెలకువ గా నిలిచిన కథ – ‘కల’  (రచయిత: విద్యార్థి) -ఆర్.దమయంతి  ఈ ప్రపంచంలో అత్యంత కటిక బీదవాడు ఎవరూ అంటే, అందరూ వుండీ ఎవరూ లేని వాడు. తన ఒంటరితనమే తనకు తోడు గా  చేసుకుని బ్రతికే వాడు.    మనిషి సంపాదనలో పడ్డాక ఎన్నో ఆస్తులను  కూడపెట్టుకుంటాడు. కానీ, ముసలి వయసులో ఆసరా గా నిలిచే   అసలైన సంపదను మాత్రం పొందలేకపోతున్నాడు. ఏమిటా సంపదా, ఐశ్వర్యం అంటే – […]

Continue Reading
Posted On :

కథా మధురం-దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి)

కథా మధురం   కథా సాహిత్యం లో  – నే చదివిన స్త్రీలు దూరపు కొండలు (ఉమ అద్దేపల్లి కథ)  -ఆర్.దమయంతి శీర్షిక గురించి నాలుగు మాటలు : కథా సాహిత్యం లో  నే చదివిన స్త్రీలు ఎందుకు రాయాలనిపించిందంటే .. ఏ కథ చదివినా, ఎవరి కథ విన్నా అందులో స్త్రీ  పాత్ర ఏమిటా అని శ్రధ్ధ గా ఆలకిస్తూ, ఆ కారెక్టరైజేషన్ ని పరిశీలిస్తుంటాను.  ఈ గమనిక వల్ల, స్టడీ వల్ల, నాకు తెలీని ఎందరో […]

Continue Reading
Posted On :

కథా మధురం-3(స్వేచ్ఛ నుంచి పంజరం లోకి)

కథా మధురం-3 కె. రామలక్ష్మి గారి కథ : స్వేచ్ఛ నుంచి పంజరం లోకి -జగద్ధాత్రి  తెలుగు పాఠకులకి చిరపరిచితమైన పేరు కె. రామలక్ష్మి గారు. అయితే ఇప్పుడు కొత్త తరం కి కాస్త తెలపాలన్న ఆలోచనతో చిన్ని పరిచయం. కె. రామలక్ష్మి , రామలక్ష్మి ఆరుద్ర అనే పేరులతో 1951 నుండి రచనలు చేస్తున్న ప్రసిద్ధ రచయిత్రి. డిసెంబర్ 31 , 1930 న కోటనందూరు లో జన్మించారు. మద్రాసు విశ్వవిద్యాలయం నుండి బి. ఏ. […]

Continue Reading
Posted On :

కథా మధురం-2 (యాష్ ట్రే- చాగంటి తులసి)

కథా మధురం 2  చాగంటి తులసి గారి కథ “యాష్ ట్రే”  –జగద్ధాత్రి  డాక్టర్ చాగంటి తులసి గారు తెలుగు పాఠకులకి పరిచయం చెయ్యవసరం లేని పేరు. చాసో కుమార్తె గానే కాక రచయిత్రి గా, అనువాదకురాలిగా, సాహిత్య కార్యకర్తగా ఆమె ప్రఖ్యాతిని పొందిన విశిష్టమైన , తెలుగు సాహిత్యం గర్వించదగ్గ సాహితీ మూర్తి. హిందీ, ఒడియా , తెలుగు నడుమ భాషా వారధి గా ఆమె ఎన్నో అనువాదాలు చేశారు. రాహుల్ సాంకృత్యాన్ ‘ఓల్గా నుండి […]

Continue Reading
Posted On :

కథామధురం (ఉడ్ రోజ్ – అబ్బూరి ఛాయాదేవి)

కథామధురం  -జగద్ధాత్రి ఆధునిక తెలుగు సాహిత్యం లో రచయిత్రులు ఇరవైయవ  శతాబ్దం లో అందించిన రచనలెన్నో ఉన్నాయి. అందులో రచయిత్రులు రాసిన కథలు, అలాగే స్త్రీల ను గురించిన కథలు ఈ శీర్షిక లో మనం చదువుకోబోతున్నాం. ఇక్కడ ఈ శీర్షికలో మహిళల గురించిన రచనలను అవి మహిళ చేసినా లేక రచయితలు రాసినవి అయినా ఆ కథను ఇక్కడ అందించ దలిచాము. తెలుగు సాహిత్యం లో చాలా మంచి కథలు వచ్చాయి వస్తున్నాయి. అయితే మిగిలిన […]

Continue Reading
Posted On :