చిత్రలిపి ప్రకృతి భక్షకుడు -మన్నెం శారద ఏ ఉదయమొ పచ్చగాలి పీల్చుకుందామని గంపెడాశతో ఇంటిముందు పంచసంపెంగ చెట్టు అరుగు మీద ఆశతో కూర్చుంటానా ….ఏవీ మునుపటి చల్లటి గాలులు !ఏవీ ఆ పూలతావులు !అటూఇటూ ఎడాపెడా ఆకాశంలోకి పెరిగిన కాంక్రీటు జైళ్ళమధ్య నా కొంప నేలకి అతుక్కుపోయి నిర్భాగ్యం గా చూస్తున్నది ప్రేమరంగరించి పెంచిన మొక్కలిప్పుడు పువ్వు లేక ,పిందెలేక చావలేక బ్రతకలేక ..ముడుచుకున్న బూడిదరంగు ఆకులతో దీనంగా నా వైపు నిస్తేజంగా చూస్తుంటాయి .తలదించుకుని ,తలవంచుకుని గుక్కెడు కాఫీ గటగటా మింగుతున్నవేళ … గుండెలమీద గునపం పోటులా టకాటకా శబ్దం !దేవుడా …అనుకుంటుండగానే తారురాసిన మొహానికి తగరపుబిళ్ళలు అతికించుకున్నట్లు కళ్ళని పళ్ళని మెరిపించుకుంటూ వాడు రానేవస్తాడు ! పెళ్ళాం మరీమరీ ఖర్చుపెట్టేహక్కులేదని గట్టివార్ణింగ్ ఇచ్చి న అయిదొందలనోటు గంజి పెట్టి ఇస్త్రీ చేసిన గ్లాస్కో జేబులో పెట్టుకుని “మీ కాఫీ వాసన అక్కడకొస్తుందనుకోమ్మా […]
Continue Reading