image_print

రాగో(నవల)-చివరి భాగం

రాగో భాగం-29 – సాధన  పోలీసులను చితకొట్టిన ఉత్సాహంతో గాలిలో తేలిపోతున్నట్లు హుషారుగా నడుస్తున్నాడు ఊళ్లే. భుజాన వేలాడుతున్న కొత్త 303ను పదే పదే చేతితో తడిమి చూసుకుంటున్నాడు. మిగతా ముగ్గురు కూడా అంతకు తక్కువేమి లేరు. – దార్లో ఇక ఆ ఊసులొద్దని ఎన్నోసార్లు హెచ్చరిస్తూ కూడ మళ్ళీ – మళ్ళీ గాండోయే నిన్నటి దాడి విషయం ఏదో ఒకటి మాట్లాడుతున్నాడు. క్లోమోర్ మైన్ పేలినపుడు చెవులు ఎలా చిల్లులు పడ్డాయో జైని యాక్షన్ తో […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-28

రాగో భాగం-28 – సాధన  ఇర్కు కస దగ్గరికి దళం చేరే సరికి ఉదయం తొమ్మిదైంది. దారిలో ఊర్లు తగలకుండా అడవిలో అడ్డంపడి నడుస్తూ వెంట తెచ్చుకున్న సద్ది ఆ రాత్రికి తిని పుంజులు కూసే వేళకు బయల్దేరి ఏకధాటిగా నడవడంతో దళం అక్కడికి చేరుకుంది. కిట్లు దించుకొని ముఖాలు కడుక్కొని దళం అలసట తీర్చుకునేసరికి కర, ఫకీరలు దాదలను, సామానులను వెంట పెట్టుకొని చేరుకున్నారు. వెంటనే పొయ్యి రాళ్ళు పెట్టి వంట ప్రయత్నాలు ప్రారంభమైనాయి. వంటయ్యేలోపు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-27

రాగో భాగం-27 – సాధన  ఊరివాళ్ళే పొల్లు పోకుండా కరువు దాడిని వర్ణిస్తూ పోటీపడుతూ దళంతో చెప్పు తున్నారు. ఆ ఊరి మహిళా సంఘం ముఖ్యులను ఏర్పాటు చేసుకోవలసిన అవసరం ఉందని గిరిజ ఆ విషయాన్ని ప్రస్తావించింది. అంతే! దల్సు – ఆ ఊరి శేడో (పెళ్ళి అయిన స్త్రీ)ల్లో నుండి తన మరదల్ని, సుశీల్ని, మరొకర్ని సూచించాడు. అక్కడ కూచున్న వారందరు సంతోషంగా ‘ఇంగో” అన్నారు. ఇది జరుగుతున్నంత సేపు ఇల్లంతా తల్లితో కలసి కలియ […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-26

రాగో భాగం-26 – సాధన  “అక్కా ఇందులో బూది తప్పేమీ లేదు. కాకపోతే తిట్టినా, కొట్టినా ధైర్యం చేసి లామడేకు ఉండననాల్సింది. కానీ ఆ దెబ్బలకు ఆగలేక ఒప్పుకోవచ్చు పాడై. బలవంతాన పెళ్ళి చేసినా ఆమె ఈయన దగ్గర ఉండదు. ఏనాడో టొక్కలేపుతుంది. అయినా మనసుకు నచ్చిన వాడితో కాపురం చేయాలని కోరుకోవడం సహజమే గదక్క” అంటూ చెప్పుతున్న జైనివంక బీరిపోయి చూస్తుంది గిరిజ. “ఇక లామడెకు వస్తే లామడే పద్దతే మంచిది గాదక్కా! పెళ్ళి చేసి […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-25

రాగో భాగం-25 – సాధన  “లామడే! హల్లో! గాటోల్ విచార్ కీమ్ డా” (అన్నం సంగతి చూడు) అంటూ పటేల్ పని పురమాయించాడు. ఎదురు చెప్పడం ఏనాడో లామ్ (ఇల్లరికం) కుదిరిన్నాడే మరిచి పోయిన లామడే “ఇంగో” అంటూనే గుండెలు కోస్తున్న బాధతో వెళ్ళిపోయాడు. ఛాయ్ తాగి మళ్ళీ ఉపన్యాసంలోనికి పోబోతున్న జైనికి బూది అడ్డు తగిలింది. “అక్కా. ఒంది పొల్లు” (ఒక్కమాట) “వెహ (చెప్పు) – బాయి” అంది జైని. ఊరి జనాలు గుడ్లప్పగించి నిల్చున్న […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-24

రాగో భాగం-24 – సాధన  “ప్రాజెక్టుకు సంబంధించిన బోర్డు, పునాది రాళ్ళు అవి. ఇంద్రావతి మీద పెద్ద డాం కట్టి భూపాలపట్నం వరకు నీటి సౌలత్ కి, బిజిలి (కరెంటు) తీయడానికి కోట్ల రూపాయల ఖర్చుతో సర్కార్ ప్లాన్ చేసింది. ఆ డాం పూర్తయితే 150 ఊర్లతో పాటు ఈ అడివంతా నీటిలో మునిగిపోతుందట. ఇవి దాని బోర్డులు” అంటూ గిరిజ వివరించింది. “అబ్బో. ఇంత అడవి, ఇన్ని ఊర్లు పోతే ఎట్లక్కా? మన అందరం ఏం […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-23

రాగో భాగం-23 – సాధన  ఆకాశంలో చుక్కలు వెలిగాయి. మబ్బులు తేలిపోయి గాలి కూడా పొడిగా వస్తుంది. ఇక వర్షం తేలిపోయినట్టే. నక్షత్రాల మసక వెలుతురు చెట్ల ఆకులను దాటి కిందికి దిగడం లేదు. అలవాటయిన వారికి తప్ప అడవిలో ఆ చీకట్లో దారి కనిపించడమే కష్టం. మిణుగురు పురుగుల మెరుపులు ఉండి ఉండి జిగేలుమని కళ్ళు చెదరగొడుతున్నాయి. ఆ చీకటికి జీమ్, జీమ్ అని నిశ్శబ్దానికి భయాన్ని జోడిస్తున్నట్లు చిమ్మెట్లు రొద చేస్తున్నాయ్. సగం కాలిన […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-22

రాగో భాగం-22 – సాధన  అనుకున్న ప్రకారం అందరూ తోలుబొక్క దగ్గర జమ అవుతున్నారు. ఆడ, మగ పిల్లలు కూడా ఉన్నారు. ఎక్కడికి పోవాలో, ఏం చేయాలో ఎవరికీ అంతు చిక్కడం లేదు. పాండు వస్తే గానీ సంగతి తేలదు అనుకుంటున్నారు ఆయా ఊర్ల సంఘాలవాళ్ళు. ‘అన్నలొస్తారేమో’ అన్నట్టు మెట్టదిక్కు, వాగు దిక్కు చూస్తున్నారు. చూస్తూ చూస్తూ ఉండగానే జనం పెరిగారు. దూరం నుండి వచ్చినవారు కొందరు చెట్ల కింద నడుం వాల్చారు. పిల్లలకు తల్లులు పాలు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-21

రాగో భాగం-21 – సాధన  దల్సు ఇంట్లో నిండు గ్రహణం పట్టినట్టుంది. బట్ట పొట్టకు కరువులేని ఇంట్లో బుక్కెడు అంబలికే పూట పూట గండమవుతూంది. నూకల జావ తప్ప మరొకటి ఎరగని దల్సు ఇంట్లో నూకల వూసే లేదు సరికదా జొన్న అంబలి, జొన్న గటుక పుట్టడమే గగనమవుతూంది. రాగో ఉంటే జొన్నగడ్డ కూలికి పోయి జొన్నలన్నా తెచ్చేదని, పొయ్యి దగ్గరికి పోయినప్పుడల్లా తల్లీ, కూచీ సణుగుతూనే ఉన్నారు. గిన్నె (పళ్ళెం) దగ్గర కూచున్న ప్రతిసారి తండ్రికీ, […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-20

రాగో భాగం-20 – సాధన              సుదీర్ఘమైన ఆలోచనలలో కూరుకుపోయినట్టు ఫిలాసఫర్ ఫోజులోనున్న గిరిజ వాలకం చూసి అప్పుడే అక్కడికి చేరుకున్న రుషి ‘బాండేని డోంగలో దాటంగా జడుసుకోలేదు కదా’ అనుకుంటూ అనుమానంగా గిరిజను పలకరించాడు.             “ఏం గిరిజక్కా! డోంగలో ఇబ్బంది కాలేదు కదా! ఇక్కడ ఇంకా నయం. సరికెడ రేవులోనయితే కుండతోనే దాటాలి. అది మాకే భయమేస్తుంది.”     […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-19

రాగో భాగం-19 – సాధన  గాండో ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక ఫకీర అతని వెనుక గిరిజ, కర్పలు నడుస్తున్నారు. ధీకొండ నుండి మడికొండ చాల దగ్గర, నడుమ బాండే నదే అడ్డం. ఆ ఒడ్డుకు మడికొండ. ఈ ఒడ్డుకు ధీకొండ. కాస్తా పైకి పోతే మధ్యప్రదేశ్ – మహారాష్ట్రల సరిహద్దుగా వస్తుంది బాండే. ఆపై నుండి తిరిగి మళ్ళీ మహారాష్ట్రలోనే పారుతుంది. పాము మెలికలు తిరిగే బాండే యం.పి.లో పుట్టి యం.పి. – మహారాష్ట్ర సరిహద్దులో […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-18

రాగో భాగం-18 – సాధన  ఊళ్ళో సైతం జంగ్లాత్ వారికి అడిగింది సమర్పించుకొని కాళ్ళు, కడుపులు పట్టుకొని వారి దయా దాక్షిణ్యాలపైన బతికేవారు. దొడ్డికెళ్ళి ఆకు తెంపుకున్నా జంగలోడు (గార్డు) చూస్తే ఎంత గుర్రు గుర్రంటడోనన్న భయంతోనే వెన్నులో జ్వరం పుట్టేది. కూలి నాలి ఇచ్చినంతే తీసుకోవాలి. చెప్పినంత చేయాలి. ఊళ్ళో ఉద్యోగస్తులకు, పై నుండి వచ్చే అధికారులకు నచ్చేవన్నీ ఊరివాళ్ళంతా ఇచ్చుకోవలసిందే – కల్లు దించినా భయమే. ఇప్పపూలు ఇంట్లో ఉన్నా ఇబ్బందే. పట్టాలేని తుపాకులు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-17

రాగో భాగం-17 – సాధన  ప్రభుత్వం లొంగివచ్చి ప్రజల డిమాండ్ మేరకు షేకడా ఇరవై రూపాయలు ఇవ్వడంతో ఊర్లో అందరూ తునికి ఆకులు కోశారంటూ, ఊరూరికి కళ్ళం కావాలని రెండేళ్ళుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తున్నందుకు బుద్ది చెప్పడంలో భాగంగా ఫారెస్టు వారి కలప, కళ్ళాలు ధ్వంసం చేసిన వరకు డోలు ఉత్సాహంగా చెప్పాడు. పోలీసులతో దాగుడుమూతల వ్యవహారంగా సాగిన కళ్ళాల కాల్చివేత చెబుతుంటే, అందరి ముఖాల్లో తామెంతో గొప్ప పని చేశామన్న ఫీలింగ్ […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-16

రాగో భాగం-16 – సాధన  రుషి టైం చూసుకున్నాడు. అప్పుడే రెండు దాటింది. ఇంకా డోలు, డోబి, లెబుడుతో మాట్లాడాల్సి ఉంది. ఉదయం నుండి ఇక్కడే ఉండి మీటింగ్ సైతం జరిగి, జనాలు పోయాక అదే జాగలో ఉండడం సరియైంది గాదు. స్థలం మార్చాలి. పక్కూరుకు పోతే ఇక్కడ మాట, ముచ్చట పూర్తి గాకుండా పోతుంది. బాగా పొద్దుపోయి చేరితే ఆ ఊళ్ళో దళానికి రాత్రి భోజనం కూడ ఇబ్బంది కావచ్చు. ముందుగా కొందర్ని పంపడమే మంచిదనే […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-15

రాగో భాగం-15 – సాధన  “ఏయ్, జైని హుడా” (చూడు) అంటూ చెప్పితే బాగుండదన్నట్టు బుంగమూతి పెట్టింది ఇర్పి. నువ్వే చెప్పు మరి” అంటూ గిరిజ ఇర్పినే ప్రోత్సహించింది. “సిగ్గక్కా సిగ్గు. అది ఊల్లెకు వల వేస్తుంది. ఆ విషయం అదే ఎట్ల చెప్పుతుంది?” అంటూ జైని చెప్పేసింది. “పచ్చబొట్లకు – మన ఊల్లెకు పోత్తేమిటి? అతనికి కూడ నుదుట ఉంది కదా! ఈవిడకుంటే వద్దంటాడా ఏంటి? ఎలాగు మనవాడికి ఈవిడగారు పుటులే కదా. అయినా ఉల్లెమీద […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-14

రాగో భాగం-14 – సాధన  మహిళా సంఘం పనిని అక్కలకు అప్పచెప్పిన కమాండర్ పటేల్ వైపు దృష్టి మళ్ళించిండు. “ఆఁ! పటేల్ దాదా! అయితే ఇవాళ పోల్వ చేస్తున్నట్టా! వాయిదా వేస్తున్నట్టా” అంటూ ఇక మన పనిలోకి దిగుదామా అన్నట్టు ప్రారంభించాడు. “ఔ దాదా! ఈ రోజుకు ఆపుకుందామనే అనుకున్నాం. ముసుర్లు ఉండంగానే మడికట్టు పూర్తి చేయాలనుకున్నం. రైతులు తొందరపడుతున్నారు. కానీ, పనులు కూడ సరిగా నడుస్తలేవు. మీరు రానేవస్తిరి. తెగాల్సిన పంచాయితీలు కూడ ఉండె. అందుకని […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-13

రాగో భాగం-13 – సాధన  12 November 2020 దళం వచ్చిందన్న కబురు విన్న గ్రామస్తులంతా సంగంలో తెగని పంచాయితీలు అన్నల ముందు తెంపుకోవచ్చని సంతోషించారు. ఊరి సంగంతోనే అన్ని పంచాయితీలు చేసుకోవాలనీ, పంచాయితీలు దళం చేయదనీ ప్రతిసారి ఎంతగా నచ్చ చెప్పినా మామూలుగా సంఘంలో తెగని పంచాయితీలు అన్నలే చేయక తప్పదని ఊరందరితో పాటు సంఘనాయకులక్కూడా ఉంటుంది. అలా ఒకటో, రెండో తప్పనిసరిగా మీదపడక తప్పదని దళానిక్కూడ తెలుసు. అలా అప్పుడే రెండు పంచాయితీలు తయారగున్నయి. […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-12

రాగో భాగం-12 – సాధన  భళ్ళున తెల్లారింది. తూరుపు పొద్దు కరకర పొడుస్తుంది. తొలిపొద్దుకి ఆహ్వానం పలుకుతున్నట్లు ఆకులు ఆనంద బాష్పాలు రాలుస్తున్నాయి. నాలుగు రోజులుగా ముసురులో తడిసిన చెట్లు తలారబెట్టుకుంటున్నట్లు పిల్ల గాలులకు సుతారంగా తల లాడిస్తున్నాయ్. పొద్దు వెచ్చవెచ్చగా పెరుగుతూంటే ఆ పొడి పొడి వాతావరణంతో ఒళ్ళు పులకరించినట్టుగానే ఉంది. అడవిలోని పిట్టలు కిచకిచమంటున్నాయి. ధీకొండలోని పోలీస్ పటేల్ పుస్లె పావురాలు గూడు నుండి బయటకు ఎగిరి సోలార్ లైటు స్తంభం మీద, బ్యాటరీ […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-11

రాగో భాగం-11 – సాధన  పడుకున్న వారి కిందినుండి వరదలు మొదలైనయి. అయినా ఎవరూ కదలడం లేదు. నాలుగు పొరకలు వేసుకున్న గాండో ఏ పేచీ లేకుండా మెదలకుండా గుర్రు పెడుతున్నాడు. రుషి పడకమాత్రం ఆ వరదలకు ఎపుడో తడిసి ముద్దయింది. అయినా చలనం లేదు. వర్షాల్లో ఇంతే అన్నట్టున్నవి వారి వాలకాలు. వీరిని తలచుకుంటే మూరనిలో తన మొదటి అనుభవం మెదలింది. తనకు కేటాయించిన పార్టీన్ కవరు కట్టుకోకుండా అలానే బాగుంటుందనీ, వర్షం రాగానే అందులో […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-10

రాగో భాగం-10 – సాధన  ఇలాటి మూర దళంలోకి వచ్చాడు. ఇంటివద్ద అతడి పోషణ కాక ‘గిన్సు’ చేసేవాడు. జ్ఞానం తెల్సిన ఆదివాసీ పిల్లల్ని పెంచటానికి పెద్దలు పడాల్సిన శ్రమ ఏముండదు. పిల్లలు సైతం ఏదో పనిచేస్తూనే ఉంటారు. అడవిలో చదువు సంధ్యల ప్రసక్తి లేనేలేదు. ఎవరైనాసరే, పసులు కాయడానికో, కూలి పనులకో, ఎవరి దగ్గరో జీతానికో, అడవిలో ఉసిరికాయలో, కరక్కాయలో, ఇప్పపూలో ఏరుకొచ్చి షావుకారికి కొలవడానికో నిత్యం అడవిపట్టుక తిరగాల్సిందే. ఏదీ దొరక్కపోతే చేపలకో, కొక్కులకో, […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-9

రాగో భాగం-9 – సాధన  రోజులు గడుస్తున్నయి. చూస్తుండగానే వర్షాకాలం రానే వచ్చింది. ఓ రోజు రాత్రి చిమ్మచీకటి. కళ్ళు పొడుచుకు చూస్తున్నా ముందు నడుస్తున్న మనిషి ఎంత దూరంలో ఉన్నాడో కూడ తెలవడం లేదు. ముందు నడిచేవారు ఆగితే వెనుకవారు మీద పడి గుద్దుకుంటున్నారు. ముందుండే పైలట్స్ అద్దానికి చేయి అడ్డం పెట్టి టార్చిలైటు వేస్తే చిమ్మచీకట్లో అకస్మాత్తుగా కనపడే వెలుతురుకు కళ్ళు చిట్లించుకుంటూ వెనుక వారంతా గాభరాగా ముందువారి అడుగులో అడుగు లేస్తూ దగ్గరగా […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-8

రాగో భాగం-8 – సాధన  “నీ పేరు ఏందక్కా?” అంటూ మరో ప్రశ్న వేసేసరికి రాగో తత్తర పడింది. వెనుకనున్న మిన్కో వెంటనే “జైని” అంటూ అందించింది. “ఆఁ! అచ్చం జువ్వి రాగో తీరుగుంటే అడిగినక్క కళ్ళల మసకలు. మనిషిని పోల్చలేము” అంటూ ముసలమ్మ కదిలింది. “అబ్బా! కొత్త పేరు పెట్టుకోవడమే మంచిదయింది” అనుకుంటూ రాగో ముందుకు సాగింది. చివరింటి ముందు దళం ఆగింది. కిట్లు దించారు. వాకిట్లో వాల్చిన మంచాలపై దళ సభ్యులు కూచున్నారు. కర్రె […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-7

రాగో భాగం-7 – సాధన  దళం గూర్చి ఏమీ తెలియని రాగో దళం వెంట నడుస్తుంది. దళం ఎటుపోతుందో తెలియని రాగో దళంతో నడుస్తుంది. గిరిజ వెనకే రాగో నడుస్తుంది. అంత రాత్రి ఎంత దూరం నడుస్తారో, ఏ ఇంట్లో పడుకుంటారో ఏమీ తెలియదు. తన వద్ద చెద్దరు, దుప్పటి లేవు. కప్పుకోను చీర పేగు కూడ తెచ్చుకోలేదు అని బాధపడుతున్న రాగోకు ఎవరో ఏదో అనడం వినపడింది. కానీ ఏమన్నాడో అర్థం కాలేదు. దళం దారి […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-6

రాగో భాగం-6 – సాధన  మర్కనాలో ఫారెస్టువారి నర్సరీ పనులు జోరుగా సాగుతున్నాయి. సమ్మె చేసి కూలిరేట్లు పెంచుకున్న కూపు కూలీలు ఆ రోజే పనుల్లోకి దిగారు. వీడింగ్ పని చకచకా సాగిపోతుంది. సాయంకాలం ఆరున్నర అవుతుంది. ఊరి బయటే తెలుగు ప్రాంతీయ వార్తలు విని దళం ఊళ్ళోకొచ్చింది. మసక మసకగా ఉన్న వెలుతురు కాస్తా మనుషుల్ని గుర్తు పట్టరాని చీకటిగా చిక్కపడింది. అడవిని అనుకొనే ఉన్న చివరి ఇంటి ముందు దళం ఆగింది. దళ కమాండర్ […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-5

రాగో భాగం-5 – సాధన  పెద్ద బండను మీదికి దొబ్బినట్టె రాగోకు దిగ్గున తెలివైంది. బండలు దొర్లిస్తున్నారు. గడ్డపారలతో బలంగా తవ్వుతున్నారు. గొడ్డళ్ళతో నరుకుతున్నారు. ఒకరూ, ఇద్దరూ కాదు. ఊరికి ఊరే మీద పడ్డట్టుంది. లోగొంతులో గుసగుసలుగా మాట్లాడుతున్నారు. ఆ అల్లరీ, హడావిడి అంతా దగ్గర్లోనే వినబడుతూంది. లేచింది లేచినట్లే మద్ది చెట్టును పొదువుకుంది రాగో. ఎవరై ఉంటారు? ఏమిటి అల్లరి? ఏం చేస్తున్నారు? తననే వేటాడుతున్నారా? తాను ఎక్కువ దూరం పరుగెత్తలేదా? దార్లోనే మొద్దు నిద్ర […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-4

రాగో భాగం-4 – సాధన  రోజులు గడుస్తున్నాయి. రాగో మనసు ఓ పట్టాన నిలవడం లేదు. రకరకాల ఆలోచనలతో పొద్దస్తమానం ఎటూ పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటుంది. ఎక్కడికి పోయినా, ఏ పరిచయస్తుల వద్దనైనా, చిన్ననాటి స్నేహితుల వద్దనైనా తలదాచుకోవడానికి పూట, అరపూట ఉండాల్సి వచ్చేసరికి అక్కడి వారంతా ‘కేర్లే (భర్తను వదలి మరో సంబంధం వెతుక్కునే ఆడది) అంటూ అదో రకంగా చూస్తుంటే దిన దిన గండంగా సాగుతుంది. ఏ కాలం నాడు ఏ పెద్దలు నామకరణం […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-3

రాగో భాగం-3 – సాధన  ఊళ్ళో గోటుల్ ముందు జీపు ఆగి ఉంది. నల్లటి జీపుకు ముందరి భాగంపై “మహారాష్ట్ర శాసన్” అనే అక్షరాలు తెల్లటి రంగుతో ఉండ్రాళ్ళలా చోటు చేసుకున్నాయి. నంబరు ప్లేటుపై హిందీ లిపిలో నంబరు కొట్టొచ్చినట్లు కనపడుతుంది. బాబులు అందరూ గోటుల్ ముందు మంచాల్లో కూచున్నారు. వాళ్ళకెదురుగా గ్రామస్తులు కూచున్నారు. పిల్లలందరూ దాదాపు బరిబాతలనే డ్రైవర్ కసరుకోవడం లెక్క చేయకుండానే ఉరుకులు పరుగులు చేస్తూ దాన్నొక వింత జంతువులా చూస్తున్నారు. ఎవరింటి ముందు […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-2

రాగో భాగం-2 – సాధన  గోటుల్ ముందు కూచున్న వాళ్ళల్లో కూడ రకరకాల ఆలోచనలున్నయి. లచ్చుకు ఎటూ తేలకుండా ఉంది. నాన్సుకు మొదటి పెళ్ళి పెళ్ళాముంది. పెళ్ళయి మూడేళ్ళైనా కోడలు కడుపు పండకపోవడంతో నాన్సుకి మరోపిల్లను తెస్తే బాగుండుననే ఆలోచన లచ్చుకు లేకపోలేదు. అందుకే వరసైన రాగో వస్తానంటుందంటే నాన్సును తాను వారించలేదు. రాగోకైనా సంతానమైతే తన ఇల్లు నిలబడుతుందనేది లచ్చు ఆపతి. అయితే రాగో తండ్రి దల్సు మొండిగా వ్యవహరించి పిల్లను ససేమిరా ఇయ్యనని మేనవారికి […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-1

రాగో – సాధన  1 రాగో దిగాలుగా కూచొని ఉంది. మనసంతా కకావికలమై ఉంది. కొలిక్కి రాని ఆలోచనలు. ఊరి బయటి గొడ్ల సదర్లలా చెల్లాచెదురుగా ఉన్నాయి తన ఆలోచనలు. ఎంత కూడదనుకున్నా గతమంతా దేవర జాతర్లా బుర్రలో అదే పనిగా తిరుగుతోంది. తోవ తప్పినోళ్ళు ఆగమాగమై అడవిలో తిరుగుతున్నట్లుంది రాగో జీవితం. తారీఖులు, పంచాంగాలు లెక్కలు తెలియకపోయినా, ఊరోళ్ళందరూ ‘పడుచుపోరి’ అని వెక్కిరిచ్చినప్పుడల్లా తనకూ వయసొస్తుందని అర్థమయేది. ఊళ్లో చలికాలం రాత్రుళ్ళు డోళ్ళు, డప్పులతో నెగళ్ళ […]

Continue Reading
Posted On :

రాగో(నవల)

రాగో (నవల)  – సాధన సృజన ప్రచురణలు, మలుపు బుక్స్ సౌజన్యంతో “నెచ్చెలి” పాఠకుల కోసం ప్రత్యేకంగా “రాగో” నవలను ఈ నెల నుండి ధారావాహికగా అందిస్తున్నాం.  అడగగానే “రాగో” నవలను ప్రచురించడానికి సమ్మతించిన శ్రీ ఎన్. వేణుగోపాల్ గారికి, శ్రీ బాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. *** “రాగో అంటే రామచిలుకే గాని పంజరంలో చిలుక కాదు. అర్థం లేని కట్టుబాట్లను మనస్సు లేని మనువును ఎదిరించి, అడవిలోకి, అక్కడి నుంచి ఆశయంలోకి పయనించిన వీరవనిత. […]

Continue Reading
Posted On :