image_print

వ్యాధితో పోరాటం- 19

వ్యాధితో పోరాటం-19 –కనకదుర్గ డాక్టర్ పెట్టిన చివాట్లతో నాకు బుద్దివచ్చి మళ్ళీ క్లీనింగ్ లు కానీ, వంటలు కానీ చేయలేదు కానీ చైతన్య స్కూల్ హోం వర్క్ నా దగ్గరే కూర్చుని చేసుకుంటుంటే చూసేదాన్ని, క్లాస్ ప్రాజెక్ట్స్ చేయడంలో కూర్చునే సాయం చేసేదాన్ని. ఇలా జాగ్రత్తగా నెల అయిపోయింది. చెకప్ కి వెళితే డాక్టర్ అన్నీ చెక్ చేసి బ్రెదిన్ పంప్ (Brethen pump) తీసేసారు. పాప ఆరోగ్యంగా ఉంది, నేను బాగానే ఉన్నాను. బెడ్ రెస్ట్ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 33

నా జీవన యానంలో- రెండవభాగం- 33 -కె.వరలక్ష్మి           మా ఊళ్ళో ఎరకలి ఎరకమ్మ అనే ఆవిడుండేది. మా అమ్మకి పురుళ్ళన్నీ ఆవిడే పోసిందట. ఆ వృత్తి ఆగిపోయినా పండగలకి పాత చీరలిచ్చీ, బియ్యం – పిండివంటలు పెట్టీ,  ఆమెని అందరూ మర్యాదగా చూసేవారు. మనిషి వంగిపోయే వరకూ చాలా కాలం బతికింది. పండగొస్తే నా దగ్గరికి కూడా వచ్చేది. వచ్చినప్పుడల్లా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఓ కథ చెప్పేది. ఎంత […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -8 (యదార్థ గాథ)

జీవితం అంచున -8 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి భయభక్తులతో బాల్యం, కఠిన నిబంధనల్లో కౌమార్యం, ప్రేమకు అర్ధం తెలియని అయోమయంలో యవ్వనం గడిచిపోయాయి. యవ్వనపు మావి చిగుర్లు చిగురించీ చిగురించకనే దాంపత్యంలో బంధింపబడ్డాను. ప్రేమ ఊసులు, ప్రియ సరాగాలు తెలియ కుండానే తల్లినై పోయాను. నవరసాల్లో జీవితంలో మానసికోల్లాసానికి ఎరువులైన రసాల కరువులోనే రెండొంతుల జీవితం గడిచిపోయింది. ఇప్పుడు అమ్మమ్మను కూడా అయ్యాక ఆరు పదుల నేను టేఫ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-7

నా అంతరంగ తరంగాలు-7 -మన్నెం శారద ఈ సారి నా జీవితాన్ని ఎంతగానో ప్రభావితం చేసిన మా పెదనాన్న గారి గురించి చెబుతాను. పెదనాన్న పేరు కొమ్మిరెడ్డి కేశవరావు. తెల్లగా, సన్నగా, నాజూకుగా వుండే ఈయన్ని పోలీస్ ఆఫీసర్ అంటే ఎవరూ నమ్మరు. ఇది వరకు కొన్ని ఎపిసోడ్స్ లో ఆయన గురించి ప్రస్తావించాను. పెదనాన్న పోలీస్ ఆఫీసర్ గా వున్నా ఆఁ కరకుదనం ఆయనలో ఎక్కడా కనిపించేది కాదు. పిల్లలలో పిల్లవాడిలా కలిసి ఆడి పాడేవారు. […]

Continue Reading
Posted On :

దక్షిణ దేశ యాత్ర (భాగం – 2)

దక్షిణ దేశ యాత్ర (భాగం – 2) (నవగ్రహ క్షేత్రాలు + పంచభూతలింగ క్షేత్రాలు + పంచ సుబ్రహ్మణ్య క్షేత్రాలు + రామేశ్వరము + కన్యాకుమారీ + మధుర మొదలగునవి) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము కన్యాకుమారి- ఇక్కడ చూడవలసినవి. ” సూర్యోదయ- సూర్యస్తమయ దృశ్యాలు, వివేకనంద రాక్‌ మెమోరియల్‌ ఫోర్ట్‌, కన్యాకుమారి అమ్మవారి దేవాలయం. కన్యాకుమారి సముద్రపు అందాలతో పర్యాటకులను కట్టి పడేస్తుంది. బంగాళా ఖాతం, అరేబియా సముద్రము, హిందూ మహాసముద్రము …ఈ మూడింటి సౌంద ర్యాలను ఒకే […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-47

మా కథ (దొమితిలా చుంగారా)- 47 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ప్రవాసంలో ఉన్నవాళ్ళ ఆదరణ నేను మెక్సికోలో ఉన్న రోజుల్లో అక్కడ ప్రవాసంలో ఉన్న ఎంతో మంది బొలీవియన్లను కలిసి, వారితో గడిపే వీలు కలిగింది. వాళ్ళలో కొందరు 1971లో ఇక్కడికి ప్రవాసానికొచ్చా రు. చాలా మంది బొలీవియాలో ఎంతో కాలం జైళ్ళలో ఉండి, దేశం నుంచి బహిష్కరించ బడి ఇక్కడికొచ్చారు. కొంత మంది పారిపోయి వచ్చారు. మరికొంత మంది దౌత్య కార్యాల […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-32)

నడక దారిలో-32 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాల తో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయిం […]

Continue Reading

యాదోంకి బారాత్- 10

యాదోంకి బారాత్-10 -వారాల ఆనంద్ ఖాళీ కాలాలు- భాష్యత్తు పునాదులు వైఫల్యం అనుకుంటాం కానీ విద్యార్థి కాలంలో ఫెయిల్ అయ్యో, పై చదువులకు సీటు దొరక్కో ఒకటో రెండో సంవత్సరాలు ఖాళీ దొరికితే…ఆ కాలం మామూలు యువకుల సంగతేమో కానీ సృజన రంగం పట్ల అసక్తి ఉత్సాహం వున్న వాళ్ళకు బంగారు కాలమే. ఆ కాలం ఎన్నో చదవడానికి ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తు రూపొందడంలో ఆ కాలం గట్టి పునాదులు వేస్తుంది. నా అనుభవంలో 1977-78 […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-46 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-7)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-7 సిడ్నీ (రోజు-2)సిటీ టూర్ తరువాయి భాగం మొత్తం సిడ్నీ సిటీ టూరులో ఒకట్రెండు చోట్ల మాత్రమే దిగి నడిచేది ఉంది. మొదట  ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి లని పక్కపక్కన ఆవలి తీరం నించి చూడగలిగే […]

Continue Reading
Posted On :

దుబాయ్ విశేషాలు-4

దుబాయ్ విశేషాలు-4 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ నగరంలో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా ఏవో ఒకటి నిర్మితమవు తోనే ఉంటాయి. 2017 లో నేను వచ్చినపుడు దుబాయ్ ఫ్రేమ్ నిర్మాణదశలో ఉంది. ఇప్పుడు అది పూర్తిగా నిర్మితమై దేశ విదేశీయులు దర్శించే సుందర కట్టడంగా పేరొందింది.           ఇప్పుడు డోనట్ ఆకారంలో ఒక పర్యాటక భవనం నిర్మితమవుతోంది. నేను మళ్ళీ వచ్చేసరికి డోనట్, తయారయిపోతుంది. అబుదాబికి దుబాయ్ కి నడుమ కడ్తున్న స్వామి నారాయణ్ […]

Continue Reading

పౌరాణిక గాథలు -8 – సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ

పౌరాణిక గాథలు -8 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి సత్యదీక్ష – హరిశ్చంద్రుడు కథ భూ లోకంలో నిజం చెప్పేవాళ్ళల్లో హరిశ్చంద్ర మహారాజుని మించినవాళ్ళు లేరు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకసారి స్వర్గంలో ఇంద్రుడు మహర్షులందరితో కలిసి సభ నిర్వహిస్తున్నాడు. మహర్షులందరూ ఇంద్రసభలో ఎవరి ఆసనాల మీద వాళ్ళు కూర్చున్నారు. సభ జరుగుతుండగా ఎప్పుడూ నిజాన్నే పలికేవాడు ఎవరున్నారు? అనే విషయం మీద చర్చ వచ్చింది. దానికి వసిష్ఠ మహర్షి ‘హరిశ్చంద్రుడు’ అని సమాధానం చెప్పాడు. వెంటనే […]

Continue Reading
Kandepi Rani Prasad

ఒక సహాయం రెండు ఆనందాలు

ఒక సహాయం రెండు ఆనందాలు -కందేపి రాణి ప్రసాద్ ఒక దట్టమైన అడవిలో పెద్ద చెరువు ఉన్నది. చెరువు గట్టున పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లన్నీ చెరువు వైపుకు వంగి చెరువుతో ముచ్చట్లు పెడుతుండేవి. చెట్ల నిండా రకరకాల పక్షులు గూళ్ళు కట్టుకుని నివసిస్తూ ఉండేవి. చెరువు లోపల మొసళ్ళు, చేపలు, కొంగలు, తాబేళ్ళు, కప్పలు నివసించేవి. అన్నీ కలసిమెలసి జీవించేవి.                   కలువలు, తామరలు […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-7 ఇల్లిందల సరస్వతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-7  -డా. సిహెచ్. సుశీల ఇల్లిందల సరస్వతీదేవి          15.8.1947 న భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించుకుంది. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న స్త్రీ పురుషుల త్యాగఫలంగా దేశానికి స్వాతంత్య్రం లభించిన సందర్భంగా సంతోషంతో అనేక కవితలు, కథలు వెల్లువలా పొంగులెత్తాయి.           స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత దేశ సంరక్షణా, దాని కొరకు వచ్చిన సాహిత్యం గురించీ ముఖ్యంగా చెప్పుకోవాలి. స్త్రీల వ్యక్తి స్వాతంత్య్రం, స్త్రీల సాధికారతకై […]

Continue Reading

పాటతో ప్రయాణం-2

  పాటతో ప్రయాణం-2 – రేణుక అయోల   ఈ రోజు “Baat niklegi to phir door talak జాయేగి ” గజల్తోప్రయాణిద్దాం…. ఇది జగ్గ్ జీత్ సింగ్ గజల్ నాకు చాలా ఇష్టమైన గజల్స్ లో ఇది ఒకటి… మాట తూలితే దాని ప్రయాణాన్ని ఆపడం చాలా కష్టం మన ఆవేశమో, మన ఉక్రోషమో, దుఃఖమో మాటల్లో దొర్లిపోతాయి దాని నడక మారిపోతుంది అది ఎవరి ఎవరి పెదాల మీదో నర్తిస్తుంది మాట ఉద్దేశ్యం మారిపోతుంది ఇంకెవరో […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-31

నిష్కల – 31 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్దకొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ.  అత్తను కన్న తల్లిలా ఆదరించే శోభ. అకస్మాత్తుగా తన ముందు నిలిచిన సారా తల్లిని చూసి ఆశ్చర్యపోతుంది నిష్కల. ఇక నుంచి నాకు ఇద్దరు కూతుళ్లు అన్న ఆమె నిష్కల్మషమైన స్వభావం నిష్కలను ఆకర్షించింది. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆమె వెళ్తూ నిష్కల, అంకిత్ లను భోజనానికి ఆహ్వానిస్తుంది. *** నిజమా.. ?ఈ రోజు సుదినం. లేచిన దినం మంచిదయింది. లేకుంటే.. తలుచుకుంటే గుండె […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-16 నీళ్ళు

పేషంట్ చెప్పే కథలు – 16 నీళ్ళు -ఆలూరి విజయలక్ష్మి నీళ్ళు! నీళ్ళు! నీళ్ళ కోసం పేట పేటంతా గగ్గోలెత్తిపోతుంది. అప్పుడే రెండు రోజులుగా మంచినీళ్ళ ట్యాంకర్ కోసం చూసిచూసి ప్రాణం కడగట్టిపోతూంది. ఏ హార్న్ వినిపించినా టాంకర్ వస్తూందని ఆశగా చూసి, కాదని నిర్ధారణ కాగానే నిరాశతో తమ దురదృష్టాన్ని తిట్టుకుంటున్నారు. గౌరీ మాటిమాటికి నాలుకతో పేదాన్ని తడుపుకుంటుంది. ఎండి పగిలిన పెదాలు తడి తగలగానే మండుతున్నాయి. రెండు రోజులుగా స్నానం లేక ఒళ్ళంతా చీదరగా […]

Continue Reading

అనుసృజన-సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్):

అనుసృజన సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్): అనువాదం: ఆర్.శాంతసుందరి ప్రతి ఒక్క వాక్యం ఎంతో అర్ధవంతం. వేదాంత భరితం. సూఫీల నిరంతర అన్వేషణ సంఘర్షణానంతరం వారి మనసులో నిలిచిన భావ సంపద. ఇది మతాతీత మైన అనుభవసారం. 1. నాకు కావాలనుకున్న దాని వెంట నేను పరిగెత్తేటప్పుడు రోజులు ఒత్తిడితో, ఆత్రుత పడుతూ గడిచినట్టనిపిస్తుంది. కానీ నేను సహనం వహించి కదలకుండా కూర్చుంటే, నాకు కావాల్సింది ఏ బాధా లేకుండా నా దగ్గరకు ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని నుంచి నేను అర్థం […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-22 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 22 – గౌరీ కృపానందన్ “హలో ఈస్ ఇట్ ఆదర్శ మెషిన్ టూల్స్ ?” “రాంగ్ నంబర్.” అవతలి వైపు నిద్ర మత్తులో వినబడింది. మాధవరావు ఫోన్ పెట్టేశారు. కాసేపు ఆలోచించాడు. డి.ఎస్.పి. కి ఫోన్ చేసి తాను ఇంత వరకు కనుగొన్న వివరాలను చెప్పాలా వద్దా? తొందరపడుతున్నామేమో? ఒక సంతకం, ఒక ఉత్తరం పచ్చ రంగు సిరాలో ఉన్నంత మాత్రాన సందేహించ గలమా? డి.సి.పి. ఖచ్చితంగా చాలదు అంటారు. ఫోటో ఎన్లార్జ్ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-31)

బతుకు చిత్రం-31 – రావుల కిరణ్మయి జరిగిన కథ: తల్లి ఆరోగ్యం బాగు చేయించడం కోసం సయిదులు ఆరాట పడుతుం టాడు .అందుకోసం మందులతో కాక తక్కువ ఖర్చులో మంత్రాలు తంత్రాలతో నయం చేయవచ్చని సరూప ఆశపెడుతుంది. అందుకోసం ఏం చెయ్యాలో చెప్తుంది. దాని కోసం సయిదులు  ప్రయత్నిస్తుంటాడు. ఆ తరువాత ***           ఊరంతా వసంతను గురించిన ముచ్చటనే మాట్లాడుకుంటాడ్రు. వసంతను ఈడికే తెస్తారని. గలుమట్ల ఏసి పంచాయిది వెట్టి […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-6

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 6 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ డిగ్రీ పూర్తి చేసి, ఎం.బి.ఏ లో చేరింది. అనుకోకుండా మొదటి వివాహ సంబంధం రాగానే పెళ్ళి కుదిరింది. తన స్నేహితులని పెళ్ళికి రమ్మని ఆహ్వానించింది. విశాల, విష్ణుసాయి వివాహం వైభవంగా జరిగింది. పెళ్ళవగానే ఇద్దరు రిజిష్టర్ ఆఫీసులో మేరేజ్ సర్టిఫికెట్ తీసుకున్నారు. అనుకున్నవిధంగా విష్ణుసాయి, విశాలకు కూడా ఆస్ట్రేలియా వెళ్ళడానికి పాస్ పోర్ట్ అప్లై చేసాడు… ***         […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- చైనా దేశ సనాతన మరో మహాకవి లీ పో ( 701 – 762 )

క ‘వన’ కోకిలలు – 16 :  చైనా దేశ సనాతన మరో మహాకవి లీ పో ( 701 – 762 )    – నాగరాజు రామస్వామి సాహిత్య స్వర్ణ యుగంగా ఖ్యాతికెక్కిన తాంగ్ రాజుల కవిత్రయం (వాంగ్ వీ, లీ పో, తు ఫు) లో రెండవ వాడు లీ పో. చైనా సంప్రదాయ సాహిత్యాన్ని కొత్త ఎత్తులకు కొని పోయిన మహాకవి. అతని కవిత్వం కాల్పనిక ప్రభ (Romantic brilliance). అతని వచన రచన నెమిలి నడకల నయగారం ( peacock poetry). ఆనాటి “మూడు అద్భుతాలు” […]

Continue Reading

జీవితం అంచున -7 (యదార్థ గాథ)

జీవితం అంచున -7 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి మనిషికి ఆనందంలో కలిగే ఉత్సాహానికి, దిగులు వలన కలిగే నిస్సత్తువకి ఎంత వ్యత్యాసం..? ఒక్కసారిగా అన్నింటి పైన ఆసక్తి తగ్గి నన్ను నైరాశ్యం ఆవహించేసింది. అర్ధ శతాధిక వసంతాల జీవితచక్రం కళ్ళ ముందు గిర్రున తిరిగింది. రక్తపాశాలు, పేగు బంధాలు, స్నేహ సాంగత్యాలు, అనేకానేక పరిచయాలు, కీర్తి శేషమైన ప్రియ బంధాలు… ఒక్కొక్కటిగా రీలు మారుతూ కనుమరుగవుతున్నాయి. జీవితం ఇంతేనా అనే వైరాగ్య […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 32

నా జీవన యానంలో- రెండవభాగం- 32 -కె.వరలక్ష్మి           2003లో హైదరాబాదులో ఉన్నప్పుడు రంగనాయకమ్మ గార్ని కలవడానికి వెళ్ళడంఒక మరిచిపోలేని జ్ఞాపకం. నా బాల్యం నుంచీ నేను ఆవిడ రచనలకు అభిమానిని, వారి ఎడ్రస్ కి ఎలా వెళ్ళాలో తెలీక జగదీశ్వర్రెడ్డిని అడిగితే తను తీసుకెళ్ళేడు. మాతో అతని భార్య రోజా కూడా వచ్చింది. అప్పటికి వారి ఇంట్లో రంగనాయకమ్మ గారి చెల్లెళ్ళు కమల నాయకమ్మ, అమల నాయకమ్మ కూడా ఉన్నారు. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 9

యాదోంకి బారాత్-9 -వారాల ఆనంద్ నటరాజ కళానికేతన్- సభలు సమావేశాలూ 1975-76 ప్రాంతం. డిగ్రీ చదువుతున్న రోజులు. అప్పుడప్పుడే టీనేజీ దాటుతున్న కాలం. ఒక వైపు అకాడెమిక్ చదువులు వాటి వొత్తిడి. మరోవైపు సాహిత్యం పత్రికలు సభలు సమావేశాలూ జీవితాన్ని కమ్ముకుంటున్న సమయం. ఇటు కరీంనగర్ లోనూ అటు వేములవాడలోనూ సాహిత్య నాటక సభలు నా ఒక్కడి కాలాన్నే కాదు నా సహచరుల అందరి జీవితాల్నీ బాగా ప్రభావితం చేసాయి. మరో వైపు సిరిసిల్లా జగిత్యాల పోరాటాల […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 18

వ్యాధితో పోరాటం-18 –కనకదుర్గ “ఇపుడు ఇన్ని సమస్యలు, ఇన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి. మా సమయంలో అయితే కాన్పు కాగానే పిల్లగానీ, పిల్లవాడ్ని గానీ ఇంట్లో వున్న పెద్ద వారికి అంటే అత్తగారికి అప్ప చెప్పి పొలంకి వెళ్ళి పని చేసే వాళ్ళం తెలుసా?” అంది. నేను ఇలాంటి కథలు వినే వున్నాను.  చైతన్య కడుపులో వున్నపుడు అత్తగారింట్లోనే వుండేవారం. శ్రీనివాస్ అమ్మమ్మ వుండేవారు. ఆమె చాలా జాగ్రత్తగా మా మామగారు, శ్రీనివాస్ ఆఫీస్ లకు వెళ్ళిపోయాక నన్ను […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-31)

నడక దారిలో-31 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. స్వాతిపత్రికలో శీలా వీర్రాజు గారికి కలంస్నేహం ,రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. మరుదుల వివాహాలతో కుటుంబం పెద్దదైంది. నాకు రెండో పాప […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-46

మా కథ (దొమితిలా చుంగారా)- 46 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉపన్యాసాలున్న రోజున నేను కూడా మాట్లాడాను. మేం ఎంతగా విదేశాల మీద ఆధారపడి బతకవల్సి వస్తున్నదో, వాళ్ళు ఆర్థికంగానే కాక, సాంస్కృతికంగా కూడ మా మీద తమ ఇష్టం వచ్చినవి ఎలా రుద్దుతున్నారో నేను వివరించాను. ఆ సమావేశంలో నేను చాలా నేర్చుకున్నాను కూడా. మొట్టమొదట అక్కడ నా ప్రజల జ్ఞానపు విలువ గురించి మరింత ఎక్కువగా నేను […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-6

నా అంతరంగ తరంగాలు-6 -మన్నెం శారద మాచర్ల…! దాని అసలు పేరు మహాదేవచర్ల అని నాకు చిన్నప్పుడు ట్యూషన్ చెప్పిన చక్రపాణి మాస్టర్ గారు చెప్పారు. నాకప్పుడు ఆరేళ్లయిన మాస్టారి మొహం స్పష్టంగా గుర్తుంది. మాచర్లని ఎవరన్నా హేళనగా మాట్లాడితే మాస్టర్ గారు భాస్వరంలా మండిపడేవారు. అందుకే శ్రీనాథుడంటే ఆయనకు వళ్ళు మంట! ఆయన పల్నాడు మీద రాసిన చాటువులు కొన్ని చెప్పి మండిపడి “అందుకే అలాంటి శిక్ష అనుభవించాడు అనేవారు. వాటిలో ఒకటి రెండు గుర్తున్నాయి. […]

Continue Reading
Posted On :

పరిశుభ్రతకు పచ్చదనానికి మారుపేరు – సింగపూరు

పరిశుభ్రతకు పచ్చదనానికి మారుపేరు – సింగపూరు -డా.కందేపి రాణి ప్రసాద్ ఏప్రిల్ 28వ తేది రాత్రి 11.20 ని లకు సింగపూర్ ఎయిర్ లైన్స్ వారి విమానంలో సింగపూర్ బయల్దేరాం. ఇమ్మిగ్రేషన్, సెక్యూరిటీ తనిఖీపూర్తయి విమానంలో ఎక్కాం. ఇది సింగపూర్ ఎయిర్ లైన్స్ వారి విమానం కాబట్టి ఎయిర్ హోస్టెస్ ల దుస్తులు భిన్నంగా ఉన్నాయి. ఇందులో 540 మంది ప్రయాణికులు పడతారట. చాలా పెద్దదిగా ఉంది. ఒక్కో వరసకు మూడు సీట్ల చొప్పున మూడు వరుసలు […]

Continue Reading

దుబాయ్ విశేషాలు-3

దుబాయ్ విశేషాలు-3 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ లో ఉన్న అందమయిన పార్క్ లలో “మిరకిల్ గార్డెన్, “బర్డ్ పార్క్” బటర్ ఫ్లై పార్క్, లు చూసి తీరాలి. పేరు తెలియని ఆకుపచ్చని తీవెలు, మొక్కలు వివిధ రంగుల్లో విరబూసిన పూల పొదలు గ్రీన్ లాన్ తో రకరకాలుగా తీర్చిదిద్దిన ఈ పార్కులో రంగురంగు అంబరిల్లాలతో ఏర్పర్చిన పెద్ద ఆర్చీలు. వీక్షకులు రిలాక్స్ కావడానికి టేబుల్స్ కుర్చీలు వేసిన విశాల ప్రాంగణాలు చెక్కతో తయారు చేసిన స్టాండ్ ఊయలలు […]

Continue Reading

యాత్రాగీతం-45 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-6)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-6 సిడ్నీ (రోజు-2) సిటీ టూర్ మేం సిడ్నీ చేరుకున్న రెండో రోజు ప్యాకేజీ టూరులో భాగమైన “సిడ్నీ లగ్జరీ సిటీ టూర్”  చేసేం. అప్పటికే సిడ్నీలో మేం చూసేసిన సర్క్యులర్ కే ప్రాంతంలోని ఓపెరా హౌస్ , […]

Continue Reading
Posted On :

పారిస్ వీథుల్లో… – 1

పారిస్ వీథుల్లో… – 1 -ఎన్. వేణుగోపాల్ ఒక అద్భుతమైన పుస్తకాల దుకాణం గురించి….  రెండు సంవత్సరాల కింద ఇదే మే 9న, చుట్టూరా ఆవరించుకుని ఉన్న అద్భుత దృశ్యాల ఫ్రెంచి ఆల్ప్స్ హిమ పర్వత శ్రేణి మధ్య వలూయిజ అనే చిన్న పల్లెటూళ్ళో, ఇంకా కొద్ది గంటల్లో పారిస్ వెళ్లడానికి సిద్ధపడుతూ, ఫేస్ బుక్ మీద ఇది రాశాను: “ఎన్నాళ్ళ కల పారిస్….!! నా పదకొండో ఏట మా సృజన ముఖచిత్రంగా పారిస్ నగర వీథుల్లో నిషేధిత మావోయిస్టు పత్రిక అమ్ముతున్న […]

Continue Reading
Posted On :

దక్షిణ దేశ యాత్ర (భాగం – 1)

దక్షిణ దేశ యాత్ర (భాగం – 1) (నవగ్రహ క్షేత్రాలు + పంచభూతలింగ క్షేత్రాలు + పంచ సుబ్రహ్మణ్య క్షేత్రాలు + రామేశ్వరము + కన్యాకుమారీ + మధుర మొదలగునవి) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము సాయికృష్ణా  ట్రావెల్స్‌ ద్వారా జూలై తొమ్మిది బయలు దేరి పదినాడు ఉదయము 6.45Am కు ఎగ్‌మోర్‌ కు చేరుకున్నాము. అక్కడ కాలకృత్యములు మరియు ఉపాహార ములు సేవించి మరల తొమ్మిది గంటలకు తిరుచ్చి పయనమైతిమి. తిరుచ్చిచేరుకునే సరికి దాదాపు ఒంటిగంట అయినది. అచట […]

Continue Reading

పౌరాణిక గాథలు -7 మహాభారతకథలు – ధైర్యము – సావిత్రి కథ

పౌరాణిక గాథలు -7 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధైర్యము – సావిత్రి కథ ఆమెకి తెలుసు ఆమె భర్త ఒక సంవత్సరంలో చచ్చిపోతాడని. ఎలాగయినా సరే తన భర్తని బ్రతికించుకోవాలని ఆమె పట్టుదల. ఆమె అనుకున్నట్టే పట్టుదలతో భర్తని బ్రతికించుకుంది కూడా. ఇదే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న సావిత్రి కథ. సావిత్రి ఒక రాజకుమార్తె. ఆమె తల్లితండ్రులు చాలా కాలం సూర్యభగవానుణ్ని ఉపాసించడం వల్ల ఆమె జన్మించింది. ఆమె గొప్ప గుణవంతురాలు. యుక్త వయస్సు వచ్చాక తనకు […]

Continue Reading
Kandepi Rani Prasad

మూగజీవుల సాయం

మూగజీవుల సాయం -కందేపి రాణి ప్రసాద్ అదొక పర్వత ప్రాంతం అంతేకాదు పర్యాటకప్రాంతం కూడా! చుట్టూ మంచు కొండలు ఆవరించి ఉంటాయి. మధ్యలో చిన్న గ్రామం. మంచు కొండల పైన హిమానీ నదాలు అంటే గ్లేసియర్స్ ఉంటాయి. వాటిని చూడటానికి మనుష్యులు వస్తుంటారు కొండల మీద పేరుకున్న మంచులో ఆటలు కూడా ఆడుతుంటారు. పర్వతాల పై బాగానికి చేరి లోయల అందచందాల్ని చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రకృతి అందాల్ని తిలకించేందుకే చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-5

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 5 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల ఎం.బి.ఎ మొదటి సంవత్సరం చదువుతుండగా, విష్ణుసాయితో నిశ్చితార్థమవుతుంది. విష్ణుసాయి తను ఆస్ట్రేలియా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నా నని చెబుతాడు. విశాల, మెడ్విన్ హాస్పిటల్ లో ప్రోజెక్ట్ వర్క్ కోసం వెడుతుంది. ***           విశాల, యమున, వసుంధర, మరో ఇద్దరు స్నేహితులు రాజేంద్రనగర్ కాలేజీ ఆవరణలో కలుసుకున్నారు. విశాల చేతిలో శుభలేఖలు ఉన్నాయి. స్నేహితులకి, ఇంకా ప్రొఫెసర్లని పెళ్ళికి […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-30

నిష్కల – 30 – శాంతి ప్రబోధ జరిగిన కథ: పెద్దకొడుకు కోసం దిగులుపడే తల్లి సుగుణమ్మ.  అత్తను కన్న తల్లిలా ఆదరించే శోభ. అకస్మాత్తుగా తన ముందు నిలిచిన సారా తల్లిని చూసి ఆశ్చర్యపోతుంది నిష్కల. ఇక నుంచి నాకు ఇద్దరు కూతుళ్లు అన్న ఆమె నిష్కల్మషమైన స్వభావం నిష్కలను ఆకర్షించింది. ఇద్దరు చాలా కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆమె వెళ్తూ నిష్కల, అంకిత్ లను భోజనానికి ఆహ్వానిస్తుంది. ***           ప్రకృతి ఎంత […]

Continue Reading
Posted On :

పాటతో ప్రయాణం-1 (ఈ నెల నుండి ప్రారంభం)

  పాటతో ప్రయాణం-1 – రేణుక అయోల   ఈ రోజు నేను  ”  పంకజ్ ఉదాస్ ” గజల్ A life story vol 1 లో  deewaron se milkara rona  ని నాభావాలతో పరిచయం చేస్తున్నాను …. కొన్ని సార్లు ఒంటరిగా  వుండాలని బలంగా అనిపిస్తుంది ఈ, సమాజం నుంచి పారిపోవాలనిపిస్తుంది ఒంటరితనంలో మన కోసం మనం బతకాలి అనిపిస్తుంది. కాని ఒంటరితనం మనల్ని మరింత జ్జాపకాల సమూహంలొకి తీసుకు వెళ్లి అంతు చిక్కని లోయలోకి […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-15 తపన

పేషంట్ చెప్పే కథలు – 15 తపన -ఆలూరి విజయలక్ష్మి “చిన్నపిల్లవి. నీకు గుండె నొప్పేమిటమ్మా?! ఫిగర్ కాపాడుకోడానికని మరీ నాజూగ్గా తినక శుభ్రంగా తిను” మందులచీటీ యిస్తూ రాగిణితో చెప్పింది డాక్టర్ శృతి. “మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మేడం. మీ పనయ్యేదాకా కూర్చుంటాను” దిగాలుపడిన ముఖంతో శృతి పనయ్యేదాకా కాచుకూర్చుంది రాగిణి. “మీరు మా వారితో ఒక విషయం చెప్పి ఒప్పించాలి మేడం!” రాగిణి మాటలు విని గలగలా నవ్వింది శృతి. “లవ్ […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-6 సమయమంత్రి రాజ్యలక్ష్మి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-6  -డా. సిహెచ్. సుశీల సమయమంత్రి రాజ్యలక్ష్మి             భారతదేశ స్వాతంత్య్ర సాధనోద్యమంలో స్త్రీలు కూడా చైతన్యవంతంగా పాల్గొనా లని, రాచరికపు పరదాల కాలం తీరిపోయిందని, దేశ స్వాతంత్య్రంతో పాటు స్త్రీ ‘వ్యక్తి స్వాతంత్య్రం’ కూడా అత్యవసరమని గుర్తిస్తూ ఆనాడు విస్తృతంగా వ్యాసాలు, కవితలు, కథలు వచ్చాయి.           సామాజికంగా కౌటుంబికంగా తమకున్న సంకెళ్ళను తెంచుకోవడానికి స్త్రీలు ప్రయత్నించారు. అయితే ‘మితవాద’ ధోరణిలోనే […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-21 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 21 – గౌరీ కృపానందన్ “రాకేష్! ఆ పేరుగలవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరండి.” “ఈ అడ్రస్సే ఇచ్చారు మల్లీశ్వరం యూత్ అసోసియేషన్ క్లబ్బులో.” మాధవరావు అన్నాడు. “ఈ ఇంట్లో నాలుగు ఫ్లాట్లు ఉన్నాయి. నాలుగు ప్లాట్లలోనూ బాచిలర్స్ ఉన్నారు. ఎవరి పేరూ రాకేష్ మాత్రం కాదు.” “పోయిన సంవత్సరం ఆ పేరుగల ఎవరైనా అద్దెకు ఉన్నరా?” “సార్! నేను ఇక్కడ మేనేజర్ని. అద్దె వసూలు చేసుకోవడానికి మాత్రం వస్తాను. అప్పుడప్పుడూ వాళ్ళ వాళ్ళ […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-30)

బతుకు చిత్రం-30 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***           జాజులమ్మ పనులన్నీ త్వరత్వరగా ముగించుకొని కూలి పనులకు బయలుదే రింది. పిల్లలలను అత్తకు అప్పగించి కమలను సమయానికి అన్నం తిని హాయిగా రెస్ట్ […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-5

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-5 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)

క ‘వన’ కోకిలలు – 15 :  చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)    – నాగరాజు రామస్వామి మానవ మస్తిష్కాన్ని నిదుర లేపేది కవనం, మనిషిని పరిపూర్ణున్నీ చేసేది సంగీతం. – కన్ఫూస్యస్. చైనా సాహిత్య సంప్రదాయం 3000 సంవత్సరాల సనాతనం. 4 వ శతాబ్దానికి చెందిన చైనాదేశ సాహిత్య జాతిపిత (Father of Chines poetry) క్యూయాన్ (Qu Yuan), 15 వ శతాబ్దపు తాత్విక కవి కన్ఫూస్యస్ (Confucius) ప్రసిద్ధలేకాని, సనాతన చైనా మహా కవులుగా గణన పొందిన వారిలో అగ్రగణ్యులు 8వ శతాబ్దికి చెందిన కవులు వాంగ్-వీ (Wang Wei), లీ-పో (Li […]

Continue Reading

జీవితం అంచున -6 (యదార్థ గాథ)

జీవితం అంచున -6 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి అనారోగ్యంలో మనిషిని వైరాగ్య భావన అమాంతం ఆవహించేస్తుంది. అప్పటి వరకూ వున్న ఉత్సాహాన్ని చప్పగా చల్లార్చేస్తుంది. మనిషిలో అనారోగ్యం కన్నా అనారోగ్యంగా వున్నామన్న ఆలోచన పెనుభూతంలా కబళించేసి మానసికంగా కృంగదీసేస్తుంది. క్వాన్టిఫెరాన్ TB పరీక్ష ఫలితాలు కాళ్ళ కింద భూమిని కదిలించేసాయి. లో లెవెల్ పాజిటివ్. ఎమర్జెన్సీ అటెన్షన్ అంటూ GP నుండి పిలుపు వచ్చింది. ఒక్కసారిగా నా గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 31

నా జీవన యానంలో- రెండవభాగం- 31 -కె.వరలక్ష్మి           తన చిన్నప్పుడంతా నాకు స్కూల్లోనూ ఇంట్లోనూ సాయం చేస్తూ ఉండిన దుర్గ అనే అమ్మాయి నేను రాసుకుంటూంటే దీక్షగా చూస్తూ ఉండేది. తనకి చదువు నేర్పాలనే నా ప్రయత్నం ఫలించలేదు. ఎక్కువ జీతం వస్తుందని వాళ్ళమ్మ తనని కాకినాడలో రొయ్యల ఫేక్టరీలో చేర్పించింది. ఎప్పుడైనా వాళ్ళూరికి వెళ్తున్నప్పుడో, వచ్చేటప్పుడో జగ్గంపేటలో దిగి నా దగ్గరకి వచ్చేది.          […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 17

వ్యాధితో పోరాటం-17 –కనకదుర్గ ఫోన్ తీసుకొని, “బూస్టర్ షాట్ తీసుకున్నాను డాక్టర్,” అని చెప్పాను. ఏం జరుగు తుందోనని నాకు భయం పట్టుకుంది. “ఓ.కే, నౌ డోంట్ మూవ్, జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ ప్లీజ్ రెస్ట్. నువ్వు ఇపుడు ఒకసారి చెకప్ కి రావాలి, రాగలవా?” ” డాక్టర్ ఈజ్ ఎనీధింగ్ రాంగ్? నాకు భయం వేస్తుంది….” నాకు ఏడుపొస్తుంది. చైతు వచ్చి నా చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. ” ఒకసారి చెక్ చేస్తే […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-30)

నడక దారిలో-30 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న కుటుంబంలో నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం , రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-45

మా కథ (దొమితిలా చుంగారా)- 45 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  హోటల్లో నాకో ఈక్వెడార్ స్త్రీతో దోస్తీ కలిసింది. మేమిద్దరమూ కలిసి సమావేశ స్థలానికి చేరాం. ఐతే చర్చలు శుక్రవారం ప్రారంభమైతే నేనక్కడికి సోమవారానికిచేరాను! మేం ఓ నాలుగైదు వందల మంది స్త్రీలు సమావేశమైన హాల్లోకి వెళ్ళాం. నాతో పాటు ఉన్న స్త్రీ “రా! స్త్రీలు ఎదుర్కొనే అతి ముఖ్యమైన సమస్యల గురించి ఇక్కడ చర్చిస్తారు. మనం మన గొంతు వినిపించాల్సిందిక్కడే” అని […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-5

నా అంతరంగ తరంగాలు-5 -మన్నెం శారద అమ్మమ్మ ఊరు కాకినాడ గురించి చెప్పానుకదా… ఇప్పుడు నానమ్మ ఊరు ఒంగోలు గురించి చెప్పాలి. మా తాతగారు అమ్మ పెళ్ళికి ముందే చనిపోవడంతో మా పెదనాన్నగారే గుంటూరు లో పనిచేస్తూ ఈ సంబంధం చూశారని చెప్పాను కదా! నాన్నమ్మకు ఈ సంబంధం ఎంత మాత్రం ఇష్టం లేదట! “అంత పెద్ద కుటుంబం నుండి వచ్చిన పిల్ల మనతో ఎక్కడ కలుస్తుంది, వద్దు “అని చాలా గొడవ చేసిందట. అయితే నాన్న […]

Continue Reading
Posted On :

దుబాయ్ విశేషాలు-2

దుబాయ్ విశేషాలు-2 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ మ్యూజియమ్ అసలు ఈ ఎడారిలో సముద్రంలో చేపలు పట్టుకుంటూ జీవనం సాగించే నావికులు ఏ రకంగా ఈ ఏడు దేశాలకు అధిపతులుగా ఎలా ప్రగతి సాధించారో ,ఆర్ధికంగా అంచెలంచె లుగా ఎంత బలపడ్డారో తెలుసుకోవాలంటే దుబాయ్ లో ఉన్న దుబాయ్ మ్యూజియమ్ తప్పనిసరిగా చూడాలి. దుబాయ్ ఎమిరేట్‌లో సాంప్రదాయ జీవన విధానాన్ని ప్రదర్శించే లక్ష్యంతో ఈ మ్యూజియాన్ని 1971 లో దుబాయ్ పాలకుడు ప్రారంభించారు. వారు నిర్మించిన  ఈ అల్ […]

Continue Reading

యాత్రాగీతం-44 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-5)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-5 సిడ్నీ (రోజు-1 తరువాయి భాగం) ఓపెరాహౌస్ సమక్షంలో పుట్టినరోజు ప్రారంభం కావడం భలే ఆనందంగా అనిపించింది. ఆ ఏరియాని సర్క్యులర్ కే (Circular Quay) అంటారు. అంటే సముద్రం లోపలికి అర్థ వృత్తాకారంలోకి చొచ్చుకుని వచ్చిన ప్రాంతమన్నమాట. […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -6 మహాభారతకథలు – ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ

పౌరాణిక గాథలు -6 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ఆత్మజ్ఞానము – నచికేతుడు కథ           నచికేతుడి తండ్రి గొప్ప మహర్షి. ఆయన నచికేతుణ్ని యముడి దగ్గరికి పంపించా డు. అయినా కూడా అతడు చిరంజీవిగా తిరిగి వచ్చేశాడు.           అసలు మహర్షి తన కొడుకు నచికేతుణ్నిఎందుకలా చేశాడు? నచికేతుడు తన తండ్రిని కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవి అడగదగ్గవే! అయినా పిల్లలు ప్రశ్నిస్తే పెద్దవాళ్ళ కి […]

Continue Reading
Kandepi Rani Prasad

ఎవర్నీ నమ్మలేం

ఎవర్నీ నమ్మలేం -కందేపి రాణి ప్రసాద్ సోనీ, రాకీ స్కూలుకు తయారవుతున్నారు. సోనీ మూడవ తరగతి చదువుతున్నది. రాకీ ఒకటో తరగతి చదువుతున్నాడు. రోజూ స్కూలు బస్సు వచ్చి తీసుకెళ్తుంది. ఆ సందు చివర వరకు స్కూల్ బస్సు వస్తుంది. సందు చివర దాకా అమ్మ నళిని వెళ్ళి ఎక్కించి వస్తుంది.           నళిని రోజూ ఉదయమే పేపర్ చదువుతుంది. అందులో విషయాలు చదివి భయ పడుతుంది. అందులోను పిల్లల కిడ్నాపుల గురించి […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-4

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 4 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ డిగ్రీ పూర్తిచేసి, ఎమ్.బి.ఏ కోర్స్ లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో ట్రోఫీ పొందింది. తండ్రి తీసుకువచ్చిన పెళ్ళి సంబంధం, మొదటిసారి పెళ్ళిచూపులలోనే అబ్బాయి విష్ణుసాయికి నచ్చిందని , నిశ్చితార్థానికి, పెళ్ళికి ముహుర్తం పెట్టించమని పెళ్ళికొడుకు తండ్రి విశ్వనాథ్ గారు ఫోన్ చేసి చెపుతారు. *** అది 1999 వ సంవత్సరం. తూరుపు తెలతెలవారుతోంది. సూర్యుని లేలేత కిరణాలు కిటికీఊచల సందుల్లోంచి చీల్చుకుని, […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-29

నిష్కల – 29 – శాంతి ప్రబోధ జరిగిన కథ: కొంత కాలం ఎడబాటు తర్వాత నిష్కల దగ్గరకు వస్తాడు సహజీవనంలో ఉన్న అంకిత్. పెద్ద కొడుకు మీద బెంగతో ఉన్న సుగుణమ్మ బతికుండగా చూస్తానో లేదోనని దిగులు పడుతుంది. అత్తగారి దిగులు పోగొట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేయాలని శోభ అనుకుంటుంది..  అంకిత్ తల్లి ఫోన్ అందుకుని ఆశ్చర్యపోతుంది నిష్కల ***           తన గుమ్మం ముందు నిలిచిన ఆవిడని ఆశ్చర్యంగా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-14 రాజీ

పేషంట్ చెప్పే కథలు – 14 రాజీ -ఆలూరి విజయలక్ష్మి “ ఈ యిల్లంటే నాకు అసహ్యం. ఇందులో బతుకుతున్న మనుషులంటే నాకు పరమ రోత. ఈ యింటికి, ఈ మనుషులకు దూరంగా పారిపోతాను. నా కంఠంలో ఊపిరుండగా మళ్ళీ ఈ గడపతొక్కను” చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ ని టేబిల్ మీదకు విసిరేసి, కళ్ళు తుడుచుకుని, వానిటీ బాగ్ తీసుకుని విస విసా గుమ్మందాటింది సుచరిత. పైన సెగలు పొగలు కక్కుతున్న సూరీడు కంటే ఎక్కువగా […]

Continue Reading

విజయవాటిక-21 (చారిత్రాత్మక నవల) – చివరి భాగం

విజయవాటిక-21 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి ఆ ఉదయం మహాదేవవర్మను మెత్తని మేనాలో పడుకోబెట్టి, ఆ మేనా రథం మీదకు చేర్చి, ఇంద్రపురిలోని ఘటికాపురి వైపు సాగిపోయారు. శ్రీకరుడు వారి ముందున్నాడు. కొంత సైన్యం, మరో రథంలో గురుదేవులు వస్తున్నారు. వారు ఆ రోజు సాయంత్రానికి ఘటికాపురి చేరుకున్నారు. గురుదేవుల పర్ణశాల ప్రక్కనే మరొక పర్ణశాలలో మహాదేవుని తుంగచాప పై పటుకోబెట్టారు. గురుదేవులు ప్రయాణ బడలికను సైతం లెక్కచెయ్యక, వెంటనే పసరు తీయించి, మహాదేవుని […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-5 సి.హెచ్. వు. రమణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-5  -డా. సిహెచ్. సుశీల సి.హెచ్. వు. రమణమ్మ                    జాతీయోద్యమం, స్త్రీల హక్కులు, కులమత రహిత సమాజ నిర్మాణం వంటి విషయాల పట్ల అవగాహనతో, చైతన్యవంతమైన కథలు రచించిన నాటి రచయిత్రులు – ‘వర్గ పోరాటం ‘ శ్రమ జీవుల నుండి ధనిక వర్గం చేసే దోపిడీ వైపు కూడా దృష్టి సారించారు. ఎందరో కష్టజీవుల శ్రమను తమ బొక్కసంలో దాచుకొనే […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-20 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 20 – గౌరీ కృపానందన్ ఉమ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. అతను ఆమె జవాబు కోసం ఎదురు చూస్తున్న వాడిలా సూటిగా ఆమెనే చూస్తున్నాడు. అతనికి జవాబు చెప్పే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆనంద్ వెంటనే వస్తే బాగుండునని అనుకుంది ఉమ. “మీరు వెంటనే జవాబు ఇవ్వనక్కరలేదు. ఆలోచించి చెప్పండి. ఒక వారం, ఒక నెల…. ఒక్క సంవత్సరం అయినా నేను వెయిట్ చేస్తాను. మీరు వద్దు, ఇష్టం లేదు అన్నా కూడా […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-29)

బతుకు చిత్రం-29 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . *** సైదులు ఆలోచనలో పడ్డాడు . సరూప చెప్పేది నిజమేనా? అమ్మకు ఏ గాలో ధూళో తగిలి ఉంటుందా? లేక ఇంకె వరయినా కావాలనే చేశారా? అలాంటివే అయితే మందులతో నయంకావు. […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-4

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-4 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 21 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం) (చివరి భాగం)

కాళరాత్రి-21 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏప్రిల్‌ 10వ తేదీన ఇంకా క్యాంపులో 20వేల మంది ఖైదీలున్నారు. వారిలో పిల్లలు కొన్నివందల మంది సాయంత్రానికంతా అందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించారు. తదుపరి క్యాంపు తగలబెడతారు. అందరినీ పెద్ద అపెల్‌ ఫ్లాట్‌లోకి తోలారు. గేటు తెరుచుకునేలోగా 5 మంది చొప్పున వరుసలు గట్టి ఎదురుచూడాలి. అకస్మాత్తుగా సైరన్లు మోగాయి. జాగరూకతగా. అందరం బ్లాక్స్‌ లోపలికెళ్ళాం. సాయంత్రం మమ్మల్ని తరలించడం సాధ్యం కాదు. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -5 (యదార్థ గాథ)

జీవితం అంచున -5 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Care for one… that’s love. Care for all… that’s nursing. కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది. మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను. ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా… నా కంటి […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 30

నా జీవన యానంలో- రెండవభాగం- 30 -కె.వరలక్ష్మి           మనుషుల రూపానికీ, నడవడికకీ సంబంధం ఉంటుంది అంటారు. అది నిజం కాదని కొన్నిసార్లు నిరూపితమౌతుంది. గొప్ప అందగాడైన షేర్ సింగ్ రాణా వాళ్ళ కుటుంబీకులెందర్నో చంపేసిందనే కోపంతో 2001 జూలై 25న పూలన్ దేవిని కాల్చి చంపేసాడు. గాయాల గురించి ఇసుకలోను, దయగురించి చలువరాతి పైన రాయాలన్నారు పెద్దలు.           బైటికెక్కడికీ వెళ్ళొద్దని ఎంత నిర్ణయించుకున్నా […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 8

యాదోంకి బారాత్-8 -వారాల ఆనంద్ కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం           వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావవంత మయినది. అనేక ఆటుపోట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 16

వ్యాధితో పోరాటం-16 –కనకదుర్గ రోజూ చైతన్య స్కూల్ కి, శ్రీని ఆఫీస్ కి వెళ్ళేలోగా అన్నీ పనులు చేసుకుని రిలాక్స్ అయ్యేదాన్ని. వాళ్ళు వెళ్ళేలోపే స్నానం చేసి, ఏదైనా తినేసి టీ.వి పెట్టుకుని కూర్చునే దాన్ని. మధ్యాహ్నం శ్రీని ఆఫీస్ నుండి లంచ్ టైమ్ లో వచ్చి తినడానికి చాలా హెల్తీ తిండి చేసి పెట్టేవాడు. తను కూడా లంచ్ చేసి వెళ్ళేవాడు. నాకు పనంతా శ్రీని పైనే పడినందుకు చాలా బాధగా వుండేది. కానీ డాక్టర్స్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-29)

నడక దారిలో-29 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-44

మా కథ (దొమితిలా చుంగారా)- 44 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అంతర్జాతీయ మహిళా సమావేశంలో 1974లో ఐక్యరాజ్యసమితి తరఫున ఒక బ్రెజిలియన్ సినిమా దర్శకురాలు బొలీవియాకు వచ్చింది. మహిళా ఉద్యమ నాయకులను కలుసుకొని, మహిళల స్థితి గతుల మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, స్త్రీల పరిస్థితిని మెరుగు పరచడంలో వాళ్ళు ఎంత వరకూ ఏ రకంగా సాయపడగలరో తెలుసుకోవడానికి ఆవిడ లాటిన్ అమెరికన్ దేశాలన్నీ తిరుగుతోంది. మా గృహిణుల సంఘం గురించి విదేశాలలో […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-4

నా అంతరంగ తరంగాలు-4 -మన్నెం శారద అమ్మమ్మ వూరికి  ప్రయాణం Co canada నా చిన్నతనంలో రెండు రైల్వేస్టేషన్లలో ఈ పేరే ఉండేది. cocanada.. town, cocanada.. Port అని. కెనడాలా ఉంటుందని బ్రిటిష్ వారు ఆఁ పేరు పెట్టారని  అంటుంటారు. కాకినాడ formed city అని కూడా అంటుంటారు. Rectangular road system, మెయిన్ రోడ్డుతో పాటూ అటూ ఇటూ ఫాలో అవుతుండే అరడజను రోడ్లు, సినిమా హాల్స్ అన్నీ ఒకే వీధిలో ఉండడం, కాకినాడ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-43 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-4)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-4 ప్రయాణం మా ఇంటి నుంచి శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టు ట్రాఫిక్ లేని వేళల్లో సరిగ్గా గంట వ్యవధిలో ఉంటుంది. ముందు చెప్పినట్టుగా మేం ముందుగా శాన్ఫ్రాన్సిస్కో నించి లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కణ్ణించి సిడ్నీ వెళ్లాలి. సాయంత్రం 5 […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -5 మహాభారతకథలు – పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ

పౌరాణిక గాథలు -5 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ మహాభారతం మొత్తం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినట్లు ఉంటుంది కదా. జనమేజయుడు ఎవరూ అంటే పరీక్షిత్తుమహారాజు కొడుకు. పరీక్షిత్తు మహారాజు ఎవరూ అంటే అభిమన్యుడికి కొడుకు పాండవులకి మనుమడు. ఈ మహా భారతంలో పరీక్షిత్తు మహారాజు గురించిన కథ చదువుదాం. ఉదంకమహర్షి ఒకసారి జనమేజయ మహారాజుని కలిసి దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరతవంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ […]

Continue Reading
Kandepi Rani Prasad

స్వచ్ఛత పాటిద్దాం

స్వచ్ఛత పాటిద్దాం -కందేపి రాణి ప్రసాద్           ఒకరోజు ఉదయాన్నే గుహ వదిలి బయటకు వచ్చింది మృగరాజు అలా ఆడవంత ఒకసారి తిరిగి వద్దామనుకున్నది.           పక్షుల కుహు కుహులు చెవుల కింపుగా వినిపిస్తున్నాయి. చెట్లన్నీ తలలూపుతూ నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతున్నాయి. సింహం సంతోషంగా ముందుకు అడుగులు వేసింది. దారిలో జంతువులన్నీ నమస్కారం పెడుతున్నాయి. వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళింది.           […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-3

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 3 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. జూనియర్స్ కు విశాల మంచి రోల్ మోడల్. పరీక్షలలో హాస్టల్ లో ఉండి చదువుకుంది. తన రూమ్మేట్ యమున బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయలేదని డీలా పడితే, రేపు జరుగబోయే పరీక్ష మీద దృష్టి పెట్టమని హితబోధ చేసింది. విశాల హార్టికల్చర్ డిగ్రీ పట్టా తీసుకుని, తరువాత ఎమ్.బి.ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో, చదరంగంలో […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-28

నిష్కల – 28 – శాంతి ప్రబోధ జరిగిన కథ: నిష్కల, సారా ఒకే తండ్రి బిడ్డ లేనన్న ఎరుకలోకి వచ్చారు. కొన్నాళ్ల ఎడబాటు తరువాత నిష్కలను చేరిన అంకిత్. లోలోన అనేక అగాధాలు, సుడిగుండాలు చుట్టుముట్టిన జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శోభకు కూతురిని జంటగా చూడాలని ఆశ. పెద్దకొడుకు జ్ఞాపకాల్లో అతని చూపుకోసం ఎదురుచూసే నిష్కల నానమ్మ సుగుణమ్మ ***           ఆ రోజు ఉదయం త్వర త్వరగా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-13 పరుగు

పేషంట్ చెప్పే కథలు – 13 పరుగు -ఆలూరి విజయలక్ష్మి “గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ!” “గుడ్ మార్నింగ్! నేనింకా యంగ్ లేడీలా కనిపిస్తున్నానా మీకు?” స్నిగ్ధంగా నవ్వింది డాక్టర్ శృతి. “మీరెంత పెద్ద వాళ్ళయినా నువ్వూ, హరితా నాకు చిన్నపిల్లలానే కనిపిస్తారమ్మా!” పండిపోయిన జుట్టు, అలిసిపోయిన కళ్ళు, ఆర్ద్రంగా వున్నా కంఠం… శ్రీపతిరావును చూస్తుంటే ఆయన రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న తన స్నేహితురాలు హరిత కళ్ళ ముందు నిలిచింది శృతికి. “హరిత ఫోన్ చేసింది. రిజర్వేషన్ […]

Continue Reading

విజయవాటిక-20 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-20 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మహాదేవవర్మ మందిరం- రాజ్యవైద్యుడు చెప్పిన ఆ మాటకు అక్కడ హఠాత్తుగా శ్మశాన నిశ్శబ్దం అలుము కుంది. శ్రీకరుడు నమ్మలేకపోయాడు… “ఏమిటి?” అంటూ ముందుకొచ్చాడు. అతని కళ్ళలో ఆశ్చర్యం… మహారాజు మాధవవర్మ మ్రాన్పడిపోయాడు. కొంత తడవకు తేరుకొని ఎఱ్ఱబడ్డ కళ్ళతో నిప్పులు కురుస్తూ… “కారా! ఏమిటిది? నీవు రాజపుత్రునికి బహిర్‌ప్రాణము. నీకు తెలియక, నిన్ను తప్పుకు ఈ విషప్రయోగమెట్లు సంభవము?” అన్నాడు. ఆయన కంఠం ఉరిమినట్లుగా ఉంది. శ్రీకరుడు ప్రపంచంలో అతి […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-4 పులవర్తి కమలావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-4  -డా. సిహెచ్. సుశీల   “ప్రథమ దళితోద్యమ కథా రచయిత్రి*”పులవర్తి కమలావతీదేవి                  1930 లలో స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పురుషులతో ధీటుగా పాల్గొని, జైలు కెళ్ళడం తో పాటు, రాజకీయ వ్యవహారాలలో తీర్మానాలు చేయడం ద్వారా తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకున్నారు. అఖిల భారత స్థాయిలో ఎన్నెన్నో మహిళా మహాసభలలో చురుగ్గా పాల్గొన్నారు.              స్త్రీలు చదువుకుంటే ఏ […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-19 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 19 – గౌరీ కృపానందన్ వాకిట్లో రెండు కార్లు ఉన్నాయి. పైజామా ధరించిన యువకుడు మాధవరావుని విచిత్రంగా చూశాడు. డ్రైవర్ సిద్దంగా ఉన్నాడు కారు స్టార్ట్ చేయడానికి. వెనక సీట్లో ఇద్దరు స్త్రీలు బురఖాలో ఉన్నారు. ఇంకొక సీటు ఖాళీగా ఉంది. “కౌన్ చాహియే ఆప్ కో?” “మిస్టర్ ఇంతియాస్?” “ఇంతియాస్! కోయి పోలీస్ వాలే ఆయే హై.” ఇంతియాస్ కి పాతికేళ్ళు ఉంటాయి. తెల్లగా, దృడంగా ఉన్నాడు.వేళ్ళకి ఉంగరాలు. మణికట్టు దగ్గర […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-28)

బతుకు చిత్రం-28 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***          దేనికి పైసలియ్యాలె? నీ ఓటుకు సుతం సర్కారు పైసలియ్యల్నా? ఓటేసే టందుకు ఇచ్చినట్టు పైసలియ్యాల్నా? ఇజ్జతు లేదా? అడిగేటందుకు? అని గయ్యిమన్నడు. నీ బాధ్యత […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-3

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-3 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 20 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-20 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల సైరన్లు మోగాయి. లైట్లు వెలిగాయి. అందరం లోనకు జొరబడ్డాం. వాకిలి దగ్గర సూపు బాండీలున్నా ఎవరికీ తినాలనిపించలేదు. మంచాల మీదకు చేరితే చాలనుకున్నాం. చాలా బంకులు ఖాళీగా ఉన్నాయి. ఉదయం మెలకువ వచ్చింది. నాకొక నాన్నున్నాడని జ్ఞప్తికి వచ్చింది. హడావిడిగా రాత్రి లోనకు జొరబడిపోయానేగాని నాన్నను పట్టించుకోలేదు. నాన్నకోసం చూడటానికి వెళ్ళాను. నా అంతరంగంలో ఆయన లేకపోతే నాకేమీ బాధ్యత ఉండదనే దుర్మార్గపు […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -4 (యదార్థ గాథ)

జీవితం అంచున -4 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Every great dream begins with a dreamer.. ఎప్పుడో ఎక్కడో చదివిన కోట్. అవును. చిరకాల కల. నిశిరాతిరి నిద్దట్లో కల… వేకువజాము కల… పట్టపగటి కల… వేళ ఏదయినా కల ఒకటే. మనది కాని విదేశీయుల విశ్వవిద్యాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు మోపుతానా అని మనసు ఒకటే ఉవ్విళ్లూరుతోంది. నర్సింగ్ విద్యార్థి ఊహే నా వయసును అమాంతం రెండింతలు తగ్గించేసింది. మనలో […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 29

నా జీవన యానంలో- రెండవభాగం- 29 -కె.వరలక్ష్మి           మోహన్ హెడ్మాస్టరుగా పనిచేస్తున్న ఏలేశ్వరం స్కూల్ టీచర్ ఒకావిడ నాకు ఫోన్ చేసింది. “మాస్టారు GPF లోన్ 30వేలకి పెట్టేస్తున్నాడు. నా వైఫ్ ని అందరూ ఎన్నికల్లో నిలబెడతాం అంటున్నారు. ఎక్కడలేని డబ్బూ కావాలిప్పుడు. ఇలా నా డబ్బు నేను తీసేసుకుంటేనే గానీ నన్ను ఇరికించేస్తారు అంటున్నారు” అని. అదీ సంగతి. నా వెనుక దన్నుగా నిలబడాల్సిన నా భర్త గారి […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 7

యాదోంకి బారాత్-7 -వారాల ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.కాలేజ్ డిగ్రీ చదువులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు           1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటి నుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 15

వ్యాధితో పోరాటం-15 –కనకదుర్గ నిన్నటిలాగే ఇన్సూలిన్ ఇస్తున్నారు. మంటలెక్కువగా వుంటే చల్లటి టవల్స్ ఇచ్చారు. చైతు, శ్రీని తల పైన, కళ్ళపైన, చేతులు, కాళ్ళపైన వేస్తూ వున్నారు. థాంక్స్  గివింగ్ డిన్నర్ నాలుగు గంటలకు స్పెషల్ వుంటుందన్నారు. మధ్యాహ్నం కాఫెటేరియాకి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తినేసి వచ్చారు. ఫాల్ సీజన్ మొదలయ్యింది. ఈ సారి స్నో చాలా త్వరగా పడింది. ఇప్పుడు బయట ఆకులు రంగులు మారాయి ఇప్పుడు. మొత్తానికి ఈ ట్రీట్మెంట్ వల్ల నొప్పులు రావడం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-28)

నడక దారిలో-28 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీలో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-43

మా కథ (దొమితిలా చుంగారా)- 43 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  “దురదృష్టకరమైన ప్రమాదం” బొలీవియాలో యువకులందరూ పద్దెనిమిదేళ్ళకే సైన్యంలో చేరాల్సి ఉండింది. సైన్యంలో చేరిన పత్రాలు లేకపోతే బైట ఉద్యోగాలు దొరకక పదిహేడేళ్ళకే సైన్యంలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. సైన్యంలో చేరనంటే పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. నరకంలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చేది. కొడుకులు బారలకు వెళ్ళే పరిస్థితి వచ్చిన రోజు తల్లిదండ్రులు నోరువిప్పి మాట్లాడ గూడదు. ఇక సైన్యంలో చేరాక […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-3

నా అంతరంగ తరంగాలు-3 -మన్నెం శారద ఒక ఆర్టిస్ట్ గా ఇది నా అక్కసో, బాధో అని మీరు అనుకోవచ్చు. మా చిన్నతనంలో బొమ్మలు వేయాలంటే మాకు వడ్డాది పాపయ్యగారో, లేదా బాపు గారి బొమ్మలో శరణ్యమయ్యేయి. లేదా ఇంట్లో గోడలకి వున్న రవివర్మ పటాలు దిక్కయ్యేయి. వాటిని చూసే ప్రాక్టీస్ చేసే వాళ్ళం. ఇప్పటిలా గూగుల్ లో వెదకి పట్టుకునే పరిస్థితి మాకు అప్పుడు లేదు. సినిమా తారల ఫోటోలు పత్రికల మీద అందుబాటులో వున్నా […]

Continue Reading
Posted On :

దుబాయ్ విశేషాలు-1

దుబాయ్ విశేషాలు-1 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ గురించి రాయాలంటే నాకు తెలిసినది సరిపోదు. అందుకే నాల్గయిదు సార్లు దుబాయ్ వెళ్లినపుడు నేను తెలుసుకొన్నవి, అక్కడ మా పిల్లలు చూపించిన కొన్ని విశేషాలు రోజువారీగా పంచుకుంటాను.          UAE అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అబుదాబీ, రస్అల్ కైమా, దుబాయ్, అజ్మాన్, షార్జా, ఫ్యుజేరా, ఉమ్మ్ అల్ క్వయిన్, అన్న ఏడు అరబ్బు (చిన్న )దేశాల సమాహారం.          వీటిలో అబూ దాభి ఎమిరేట్ […]

Continue Reading

యాత్రాగీతం-42 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-3)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-3 లగేజీ ఏ టూరుకి వెళ్ళినా లగేజీ ఒక పెద్ద సమస్యే. ‘అసలు అక్కడి వాతావరణానికి ఏం బట్టలు వేసుకోవాలి? ఎన్ని జతలు పట్టుకెళ్ళాలి?’ లాంటి ప్రశ్నలతో మొదలయ్యి చివరికి ‘ఎన్ని కేజీలు పట్టుకెళ్ళనిస్తారు’ తో ముగుస్తుంది. నిజానికి […]

Continue Reading
Posted On :

ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు)

ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు) -సుశీల నాగరాజ నైలు అందాలను, నది పొడవునా ఉన్న లెక్కపెట్టలేనన్ని ప్రాచీన దేవాలయాలను, శిధిలాలను చూసుకొంటూ ప్రయాణం ! అస్వాన్ నుంచి లుక్సర్ దాకా ఉన్న 90 కిలో మీటర్ల దూరం మోటారు బోటులో ప్రయాణం. అదే నైలు క్రూజ్ ! ఇది నాలుగు రోజులు (మూడు రాత్రులు) ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ముఖ్యమైనవి రకరకాలైన దేవతలు, వారికి కట్టిన దేవాలయాలు, వాటిని ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -4 మహాభారతకథలు – మాంధాతృడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి మాంధాతృడు కథ మన పురాణాల్లోను, ఇతిహాసాల్లోను గొప్ప కీర్తి పొందినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరూ మనకి తెలియదు కదా! వాళ్లు ఏ కాలంలో జీవించినా ఆ కాలంలో వాళ్లే చాలా గొప్పవాళ్లు అనిపించు కున్నారు. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి, వేల సంవత్సరాలు జీవించి, ఎన్నో మంచి పనులు చేసి యుగాలు గడుస్తున్నా ఇప్పటికీ కీర్తి కాయంతో జీవించి ఉన్నారు. వాళ్లు ఇప్పుడు […]

Continue Reading
Kandepi Rani Prasad

తప్పిన ప్రమాదం

తప్పిన ప్రమాదం -కందేపి రాణి ప్రసాద్ ఆ వీధిలో ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. సగం పడిపోయిన గోడలు, కూలిపోయిన కప్పుతో ఉన్నది. ఒక పిల్లి తన పిల్లల కోసం ఈ ఇంటిని ఎంచుకున్నది. ఆ పాడుపడిన ఇంటిలో పిల్లి నాలుగు పిల్లల్ని పెట్టింది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా కాస్తున్నది. పిల్లల శరీరాలను తల్లి నాకుతూ శుభ్రం చేస్తుంది.          తల్లి పిల్లి తన పిల్లలకు పాలిస్తూ ప్రేమగా తల నిమురుతోంది. ఆ […]

Continue Reading

అనగనగా-నిజాయితీ

నిజాయితీ -ఆదూరి హైమావతి  నడమానూరు అనే గ్రామంలో రాములయ్య, సీతమ్మ అనే రైతుకూలీ దంపతులకు సోము అనే కుమారుడు ఉండేవాడు. వాడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నా డు. గత ఏడాదీ పాఠశాల ఉపాధ్యా యులు ఐదోతరగతి పిల్లలను బస్ లో ఎక్కంచుకుని నగరంలోని జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్ళి అక్కడి జంతువులనంతా చూపుతూ వాటి అలవాట్లు, పద్దతులు ఇంకా వాటి గురంచిన అనేక విషయాలు చెప్పే వారు. ఆ ఏడాది నగరానికి వెళ్ళను యాభై రూపాయలు […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-12 కారుమేఘాలు

పేషంట్ చెప్పే కథలు – 12 కారుమేఘాలు -ఆలూరి విజయలక్ష్మి శ్రావణ మేఘాలు హడావిడిగా పేరంటానికి వెళ్తున్నాయి. క్రొత్త చీరలు, మోజేతికి తోరణాలు, పసుపు పూసిన పాదాలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, చేతులలో పచ్చి శనగల పొట్లాలు, సన్నటి తుంపర చల్లగా స్పృశిస్తూంటే తనువులు పులకరించి హృదయాలను అనుభూతి అంచుల్ని తాకుతూండగా కబుర్ల మువ్వలు మ్రోగించు కొంటూ అడుగు ముందుకు కదుపుతున్నారు పేరంటాళ్ళు. వసుధ ఎలుగెత్తి ఏడుస్తున్న కొడుకుని సముదాయించడానికి నానా తంటాలు పడుతూంది. ప్రక్కవాటాలోని […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-2

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 2 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. కాలేజ్లో తన స్నేహితురాలు వసుంధర అక్కపెళ్ళిచేసుకుని ఆస్ట్రేలియా వెళ్లిన తరువాత,  అక్కడి ఫోటోలు చూపెట్టగానే, విశాల ఆస్ట్రేలియా చాలా బాగుందని ప్రశంసిస్తుంది.  విశాల మనస్సులో ఆస్ట్రేలియా సుందరమైన దేశం ఒక్కసారైనా వెళ్ళగలనా అనుకుంటుంది. తన తాతగారు ఇంటికి వచ్చి విశాలకు పెళ్ళి సంబంధం ప్రస్తావన తీసుకురాగానే, తండ్రి విశాలకు పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టబోతున్నట్లు మామగారితో చెబుతాడు. ***       […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-27

నిష్కల – 27 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా, నిష్కల ఒక తండ్రి బిడ్డలేనని తెలుసుకుంటారు. సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. కూతుర్ని జంటగా చూడాలని ఆరాటపడే శోభ. కొన్నాళ్ల ఎడబాటు తర్వాత సహజీవనంలో ఉన్న సహచరుడు అంకిత్ ఇంటికి రావడం నిష్కలను ఆశ్చర్య పరుస్తుంది ***          ఎంత దారుణం. ఎంత కడుపుకోత .. ఆ తల్లిదండ్రులకు. అసలు పిల్లలు ఎందు కంత నిర్దయగా ఉంటున్నారు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు వారి […]

Continue Reading
Posted On :

ఓసారి ఆలోచిస్తే-6

ఓసారి ఆలోచిస్తే-6 పరిష్కారం -డి.వి.రమణి మొబైల్ మోగుతూ ఉంది కాసేపటి తర్వాత మళ్ళీ అలా తీసే వరకు, చేతిలో పని పక్కకి నెట్టి … “హలో  “ అన్నాను “…..”అటునించి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్టు ఉంది.. “ఎవరు” అన్నాను “నేనక్క హేమని” “ఏమైంది హేమా? ఇంటికి రా ముందు” గట్టిగా అన్నాను “అవటానికి ఏమి మిగల్లేదక్క నా తల రాత” వెక్కుతూ అంది “నువ్వు ఏమి కంగారు పడకు ముందు ఏడుపాపేయ్ …నువ్వు బయలుదేరు ఎలా ఉన్నదానివి […]

Continue Reading

విజయవాటిక-19 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-19 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఆశ్చర్యంగా వింటున్నాడు శ్రీకరుడు. అతనికి రాజమాత ధ్యాననిష్ఠ మీద గొప్ప నమ్మకం. ఆమె ధర్మ పరిపాలన మీదా అంతే నమ్మకం. ఆమె తన భర్త మహారాజు రెండవ మాధవవర్మకు మాట ఇచ్చింది. ఆ మాట కోసం నేటి మహారాజును రాజును చేసి తన పుత్రుని యువరాజుగానే ఉంచింది. ఆమె మరోలా చెయ్యగలిగినా, మాట తప్పలేదు. రాజులకు వైదికధర్మమే సరి అయినదన్న ఆమె నమ్మకం విష్ణుకుండినులను దక్షిణాపథమున గొప్ప రాజ్యంగా […]

Continue Reading