image_print

పేషంట్ చెప్పే కథలు-14 రాజీ

పేషంట్ చెప్పే కథలు – 14 రాజీ -ఆలూరి విజయలక్ష్మి “ ఈ యిల్లంటే నాకు అసహ్యం. ఇందులో బతుకుతున్న మనుషులంటే నాకు పరమ రోత. ఈ యింటికి, ఈ మనుషులకు దూరంగా పారిపోతాను. నా కంఠంలో ఊపిరుండగా మళ్ళీ ఈ గడపతొక్కను” చేతిలో ఉన్న టిఫిన్ బాక్స్ ని టేబిల్ మీదకు విసిరేసి, కళ్ళు తుడుచుకుని, వానిటీ బాగ్ తీసుకుని విస విసా గుమ్మందాటింది సుచరిత. పైన సెగలు పొగలు కక్కుతున్న సూరీడు కంటే ఎక్కువగా […]

Continue Reading

విజయవాటిక-21 (చారిత్రాత్మక నవల) – చివరి భాగం

విజయవాటిక-21 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి ఆ ఉదయం మహాదేవవర్మను మెత్తని మేనాలో పడుకోబెట్టి, ఆ మేనా రథం మీదకు చేర్చి, ఇంద్రపురిలోని ఘటికాపురి వైపు సాగిపోయారు. శ్రీకరుడు వారి ముందున్నాడు. కొంత సైన్యం, మరో రథంలో గురుదేవులు వస్తున్నారు. వారు ఆ రోజు సాయంత్రానికి ఘటికాపురి చేరుకున్నారు. గురుదేవుల పర్ణశాల ప్రక్కనే మరొక పర్ణశాలలో మహాదేవుని తుంగచాప పై పటుకోబెట్టారు. గురుదేవులు ప్రయాణ బడలికను సైతం లెక్కచెయ్యక, వెంటనే పసరు తీయించి, మహాదేవుని […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-5 సి.హెచ్. వు. రమణమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-5  -డా. సిహెచ్. సుశీల సి.హెచ్. వు. రమణమ్మ                    జాతీయోద్యమం, స్త్రీల హక్కులు, కులమత రహిత సమాజ నిర్మాణం వంటి విషయాల పట్ల అవగాహనతో, చైతన్యవంతమైన కథలు రచించిన నాటి రచయిత్రులు – ‘వర్గ పోరాటం ‘ శ్రమ జీవుల నుండి ధనిక వర్గం చేసే దోపిడీ వైపు కూడా దృష్టి సారించారు. ఎందరో కష్టజీవుల శ్రమను తమ బొక్కసంలో దాచుకొనే […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-20 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 20 – గౌరీ కృపానందన్ ఉమ అతన్ని ఆశ్చర్యంగా చూసింది. అతను ఆమె జవాబు కోసం ఎదురు చూస్తున్న వాడిలా సూటిగా ఆమెనే చూస్తున్నాడు. అతనికి జవాబు చెప్పే బాధ్యత నుంచి తప్పించుకోవడానికి ఆనంద్ వెంటనే వస్తే బాగుండునని అనుకుంది ఉమ. “మీరు వెంటనే జవాబు ఇవ్వనక్కరలేదు. ఆలోచించి చెప్పండి. ఒక వారం, ఒక నెల…. ఒక్క సంవత్సరం అయినా నేను వెయిట్ చేస్తాను. మీరు వద్దు, ఇష్టం లేదు అన్నా కూడా […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-29)

బతుకు చిత్రం-29 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . *** సైదులు ఆలోచనలో పడ్డాడు . సరూప చెప్పేది నిజమేనా? అమ్మకు ఏ గాలో ధూళో తగిలి ఉంటుందా? లేక ఇంకె వరయినా కావాలనే చేశారా? అలాంటివే అయితే మందులతో నయంకావు. […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-4

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-4 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 21 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం) (చివరి భాగం)

కాళరాత్రి-21 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏప్రిల్‌ 10వ తేదీన ఇంకా క్యాంపులో 20వేల మంది ఖైదీలున్నారు. వారిలో పిల్లలు కొన్నివందల మంది సాయంత్రానికంతా అందరినీ ఒకేసారి తరలించాలని నిర్ణయించారు. తదుపరి క్యాంపు తగలబెడతారు. అందరినీ పెద్ద అపెల్‌ ఫ్లాట్‌లోకి తోలారు. గేటు తెరుచుకునేలోగా 5 మంది చొప్పున వరుసలు గట్టి ఎదురుచూడాలి. అకస్మాత్తుగా సైరన్లు మోగాయి. జాగరూకతగా. అందరం బ్లాక్స్‌ లోపలికెళ్ళాం. సాయంత్రం మమ్మల్ని తరలించడం సాధ్యం కాదు. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -5 (యదార్థ గాథ)

జీవితం అంచున -5 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Care for one… that’s love. Care for all… that’s nursing. కనీసం చిన్న పించ్ కూడా తెలియకుండా నర్సు “ఐ యాం సారీ డార్లింగ్” అంటూనే నా రక్త నాళంలో నుండి బోలెడు రక్తం తోడేసింది. మనం ఒకే ఫ్రెటర్నిటి అనుకుంటూ ఆవిడ వైపు ఆత్మీయంగా చూసాను. ఆలూ చూలూ లేకుండా బిడ్డ కోసం కలలని నవ్వుకుంటున్నారా… నా కంటి […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 30

నా జీవన యానంలో- రెండవభాగం- 30 -కె.వరలక్ష్మి           మనుషుల రూపానికీ, నడవడికకీ సంబంధం ఉంటుంది అంటారు. అది నిజం కాదని కొన్నిసార్లు నిరూపితమౌతుంది. గొప్ప అందగాడైన షేర్ సింగ్ రాణా వాళ్ళ కుటుంబీకులెందర్నో చంపేసిందనే కోపంతో 2001 జూలై 25న పూలన్ దేవిని కాల్చి చంపేసాడు. గాయాల గురించి ఇసుకలోను, దయగురించి చలువరాతి పైన రాయాలన్నారు పెద్దలు.           బైటికెక్కడికీ వెళ్ళొద్దని ఎంత నిర్ణయించుకున్నా […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 8

యాదోంకి బారాత్-8 -వారాల ఆనంద్ కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం           వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావవంత మయినది. అనేక ఆటుపోట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 16

వ్యాధితో పోరాటం-16 –కనకదుర్గ రోజూ చైతన్య స్కూల్ కి, శ్రీని ఆఫీస్ కి వెళ్ళేలోగా అన్నీ పనులు చేసుకుని రిలాక్స్ అయ్యేదాన్ని. వాళ్ళు వెళ్ళేలోపే స్నానం చేసి, ఏదైనా తినేసి టీ.వి పెట్టుకుని కూర్చునే దాన్ని. మధ్యాహ్నం శ్రీని ఆఫీస్ నుండి లంచ్ టైమ్ లో వచ్చి తినడానికి చాలా హెల్తీ తిండి చేసి పెట్టేవాడు. తను కూడా లంచ్ చేసి వెళ్ళేవాడు. నాకు పనంతా శ్రీని పైనే పడినందుకు చాలా బాధగా వుండేది. కానీ డాక్టర్స్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-29)

నడక దారిలో-29 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీతో బాటు సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. ఏడాది తిరగకుండానే మా […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-44

మా కథ (దొమితిలా చుంగారా)- 44 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అంతర్జాతీయ మహిళా సమావేశంలో 1974లో ఐక్యరాజ్యసమితి తరఫున ఒక బ్రెజిలియన్ సినిమా దర్శకురాలు బొలీవియాకు వచ్చింది. మహిళా ఉద్యమ నాయకులను కలుసుకొని, మహిళల స్థితి గతుల మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, స్త్రీల పరిస్థితిని మెరుగు పరచడంలో వాళ్ళు ఎంత వరకూ ఏ రకంగా సాయపడగలరో తెలుసుకోవడానికి ఆవిడ లాటిన్ అమెరికన్ దేశాలన్నీ తిరుగుతోంది. మా గృహిణుల సంఘం గురించి విదేశాలలో […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-4

నా అంతరంగ తరంగాలు-4 -మన్నెం శారద అమ్మమ్మ వూరికి  ప్రయాణం Co canada నా చిన్నతనంలో రెండు రైల్వేస్టేషన్లలో ఈ పేరే ఉండేది. cocanada.. town, cocanada.. Port అని. కెనడాలా ఉంటుందని బ్రిటిష్ వారు ఆఁ పేరు పెట్టారని  అంటుంటారు. కాకినాడ formed city అని కూడా అంటుంటారు. Rectangular road system, మెయిన్ రోడ్డుతో పాటూ అటూ ఇటూ ఫాలో అవుతుండే అరడజను రోడ్లు, సినిమా హాల్స్ అన్నీ ఒకే వీధిలో ఉండడం, కాకినాడ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-43 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-4)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-4 ప్రయాణం మా ఇంటి నుంచి శాన్ఫ్రాన్సిస్కో ఎయిర్పోర్టు ట్రాఫిక్ లేని వేళల్లో సరిగ్గా గంట వ్యవధిలో ఉంటుంది. ముందు చెప్పినట్టుగా మేం ముందుగా శాన్ఫ్రాన్సిస్కో నించి లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కణ్ణించి సిడ్నీ వెళ్లాలి. సాయంత్రం 5 […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -5 మహాభారతకథలు – పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ

పౌరాణిక గాథలు -5 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి పురాణపురుషుడు పరీక్షిత్తు మహారాజు కథ మహాభారతం మొత్తం వైశంపాయన మహర్షి జనమేజయుడికి చెప్పినట్లు ఉంటుంది కదా. జనమేజయుడు ఎవరూ అంటే పరీక్షిత్తుమహారాజు కొడుకు. పరీక్షిత్తు మహారాజు ఎవరూ అంటే అభిమన్యుడికి కొడుకు పాండవులకి మనుమడు. ఈ మహా భారతంలో పరీక్షిత్తు మహారాజు గురించిన కథ చదువుదాం. ఉదంకమహర్షి ఒకసారి జనమేజయ మహారాజుని కలిసి దానాలు, యజ్ఞాలు చేస్తూ, భరతవంశాన్ని వృద్ధిపరుస్తూ, ప్రజలందరికీ మేలు చేస్తూ అర్జునుడితో సమానమైన, ఇంద్రియ […]

Continue Reading
Kandepi Rani Prasad

స్వచ్ఛత పాటిద్దాం

స్వచ్ఛత పాటిద్దాం -కందేపి రాణి ప్రసాద్           ఒకరోజు ఉదయాన్నే గుహ వదిలి బయటకు వచ్చింది మృగరాజు అలా ఆడవంత ఒకసారి తిరిగి వద్దామనుకున్నది.           పక్షుల కుహు కుహులు చెవుల కింపుగా వినిపిస్తున్నాయి. చెట్లన్నీ తలలూపుతూ నాట్యం చేస్తున్నట్లుగా ఊగుతున్నాయి. సింహం సంతోషంగా ముందుకు అడుగులు వేసింది. దారిలో జంతువులన్నీ నమస్కారం పెడుతున్నాయి. వాటిని చిరునవ్వుతో స్వీకరిస్తూ ముందుకు వెళ్ళింది.           […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-3

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 3 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. జూనియర్స్ కు విశాల మంచి రోల్ మోడల్. పరీక్షలలో హాస్టల్ లో ఉండి చదువుకుంది. తన రూమ్మేట్ యమున బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేయలేదని డీలా పడితే, రేపు జరుగబోయే పరీక్ష మీద దృష్టి పెట్టమని హితబోధ చేసింది. విశాల హార్టికల్చర్ డిగ్రీ పట్టా తీసుకుని, తరువాత ఎమ్.బి.ఏ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్స్లో చేరింది. సీనియర్స్ నిర్వహించిన పోటీలలో, చదరంగంలో […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-28

నిష్కల – 28 – శాంతి ప్రబోధ జరిగిన కథ: నిష్కల, సారా ఒకే తండ్రి బిడ్డ లేనన్న ఎరుకలోకి వచ్చారు. కొన్నాళ్ల ఎడబాటు తరువాత నిష్కలను చేరిన అంకిత్. లోలోన అనేక అగాధాలు, సుడిగుండాలు చుట్టుముట్టిన జీవితాన్ని ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్న శోభకు కూతురిని జంటగా చూడాలని ఆశ. పెద్దకొడుకు జ్ఞాపకాల్లో అతని చూపుకోసం ఎదురుచూసే నిష్కల నానమ్మ సుగుణమ్మ ***           ఆ రోజు ఉదయం త్వర త్వరగా […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-13 పరుగు

పేషంట్ చెప్పే కథలు – 13 పరుగు -ఆలూరి విజయలక్ష్మి “గుడ్ మార్నింగ్ యంగ్ లేడీ!” “గుడ్ మార్నింగ్! నేనింకా యంగ్ లేడీలా కనిపిస్తున్నానా మీకు?” స్నిగ్ధంగా నవ్వింది డాక్టర్ శృతి. “మీరెంత పెద్ద వాళ్ళయినా నువ్వూ, హరితా నాకు చిన్నపిల్లలానే కనిపిస్తారమ్మా!” పండిపోయిన జుట్టు, అలిసిపోయిన కళ్ళు, ఆర్ద్రంగా వున్నా కంఠం… శ్రీపతిరావును చూస్తుంటే ఆయన రూపురేఖల్ని పుణికి పుచ్చుకున్న తన స్నేహితురాలు హరిత కళ్ళ ముందు నిలిచింది శృతికి. “హరిత ఫోన్ చేసింది. రిజర్వేషన్ […]

Continue Reading

విజయవాటిక-20 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-20 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మహాదేవవర్మ మందిరం- రాజ్యవైద్యుడు చెప్పిన ఆ మాటకు అక్కడ హఠాత్తుగా శ్మశాన నిశ్శబ్దం అలుము కుంది. శ్రీకరుడు నమ్మలేకపోయాడు… “ఏమిటి?” అంటూ ముందుకొచ్చాడు. అతని కళ్ళలో ఆశ్చర్యం… మహారాజు మాధవవర్మ మ్రాన్పడిపోయాడు. కొంత తడవకు తేరుకొని ఎఱ్ఱబడ్డ కళ్ళతో నిప్పులు కురుస్తూ… “కారా! ఏమిటిది? నీవు రాజపుత్రునికి బహిర్‌ప్రాణము. నీకు తెలియక, నిన్ను తప్పుకు ఈ విషప్రయోగమెట్లు సంభవము?” అన్నాడు. ఆయన కంఠం ఉరిమినట్లుగా ఉంది. శ్రీకరుడు ప్రపంచంలో అతి […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-4 పులవర్తి కమలావతీదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-4  -డా. సిహెచ్. సుశీల   “ప్రథమ దళితోద్యమ కథా రచయిత్రి*”పులవర్తి కమలావతీదేవి                  1930 లలో స్త్రీలు స్వాతంత్రోద్యమంలో పురుషులతో ధీటుగా పాల్గొని, జైలు కెళ్ళడం తో పాటు, రాజకీయ వ్యవహారాలలో తీర్మానాలు చేయడం ద్వారా తమ భాగస్వామ్యాన్ని నిరూపించుకున్నారు. అఖిల భారత స్థాయిలో ఎన్నెన్నో మహిళా మహాసభలలో చురుగ్గా పాల్గొన్నారు.              స్త్రీలు చదువుకుంటే ఏ […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-19 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 19 – గౌరీ కృపానందన్ వాకిట్లో రెండు కార్లు ఉన్నాయి. పైజామా ధరించిన యువకుడు మాధవరావుని విచిత్రంగా చూశాడు. డ్రైవర్ సిద్దంగా ఉన్నాడు కారు స్టార్ట్ చేయడానికి. వెనక సీట్లో ఇద్దరు స్త్రీలు బురఖాలో ఉన్నారు. ఇంకొక సీటు ఖాళీగా ఉంది. “కౌన్ చాహియే ఆప్ కో?” “మిస్టర్ ఇంతియాస్?” “ఇంతియాస్! కోయి పోలీస్ వాలే ఆయే హై.” ఇంతియాస్ కి పాతికేళ్ళు ఉంటాయి. తెల్లగా, దృడంగా ఉన్నాడు.వేళ్ళకి ఉంగరాలు. మణికట్టు దగ్గర […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-28)

బతుకు చిత్రం-28 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించుకుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***          దేనికి పైసలియ్యాలె? నీ ఓటుకు సుతం సర్కారు పైసలియ్యల్నా? ఓటేసే టందుకు ఇచ్చినట్టు పైసలియ్యాల్నా? ఇజ్జతు లేదా? అడిగేటందుకు? అని గయ్యిమన్నడు. నీ బాధ్యత […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-3

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-3 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 20 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-20 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల సైరన్లు మోగాయి. లైట్లు వెలిగాయి. అందరం లోనకు జొరబడ్డాం. వాకిలి దగ్గర సూపు బాండీలున్నా ఎవరికీ తినాలనిపించలేదు. మంచాల మీదకు చేరితే చాలనుకున్నాం. చాలా బంకులు ఖాళీగా ఉన్నాయి. ఉదయం మెలకువ వచ్చింది. నాకొక నాన్నున్నాడని జ్ఞప్తికి వచ్చింది. హడావిడిగా రాత్రి లోనకు జొరబడిపోయానేగాని నాన్నను పట్టించుకోలేదు. నాన్నకోసం చూడటానికి వెళ్ళాను. నా అంతరంగంలో ఆయన లేకపోతే నాకేమీ బాధ్యత ఉండదనే దుర్మార్గపు […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -4 (యదార్థ గాథ)

జీవితం అంచున -4 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Every great dream begins with a dreamer.. ఎప్పుడో ఎక్కడో చదివిన కోట్. అవును. చిరకాల కల. నిశిరాతిరి నిద్దట్లో కల… వేకువజాము కల… పట్టపగటి కల… వేళ ఏదయినా కల ఒకటే. మనది కాని విదేశీయుల విశ్వవిద్యాలయంలో ఎప్పుడెప్పుడు అడుగు మోపుతానా అని మనసు ఒకటే ఉవ్విళ్లూరుతోంది. నర్సింగ్ విద్యార్థి ఊహే నా వయసును అమాంతం రెండింతలు తగ్గించేసింది. మనలో […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 29

నా జీవన యానంలో- రెండవభాగం- 29 -కె.వరలక్ష్మి           మోహన్ హెడ్మాస్టరుగా పనిచేస్తున్న ఏలేశ్వరం స్కూల్ టీచర్ ఒకావిడ నాకు ఫోన్ చేసింది. “మాస్టారు GPF లోన్ 30వేలకి పెట్టేస్తున్నాడు. నా వైఫ్ ని అందరూ ఎన్నికల్లో నిలబెడతాం అంటున్నారు. ఎక్కడలేని డబ్బూ కావాలిప్పుడు. ఇలా నా డబ్బు నేను తీసేసుకుంటేనే గానీ నన్ను ఇరికించేస్తారు అంటున్నారు” అని. అదీ సంగతి. నా వెనుక దన్నుగా నిలబడాల్సిన నా భర్త గారి […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 7

యాదోంకి బారాత్-7 -వారాల ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.కాలేజ్ డిగ్రీ చదువులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు           1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటి నుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 15

వ్యాధితో పోరాటం-15 –కనకదుర్గ నిన్నటిలాగే ఇన్సూలిన్ ఇస్తున్నారు. మంటలెక్కువగా వుంటే చల్లటి టవల్స్ ఇచ్చారు. చైతు, శ్రీని తల పైన, కళ్ళపైన, చేతులు, కాళ్ళపైన వేస్తూ వున్నారు. థాంక్స్  గివింగ్ డిన్నర్ నాలుగు గంటలకు స్పెషల్ వుంటుందన్నారు. మధ్యాహ్నం కాఫెటేరియాకి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తినేసి వచ్చారు. ఫాల్ సీజన్ మొదలయ్యింది. ఈ సారి స్నో చాలా త్వరగా పడింది. ఇప్పుడు బయట ఆకులు రంగులు మారాయి ఇప్పుడు. మొత్తానికి ఈ ట్రీట్మెంట్ వల్ల నొప్పులు రావడం […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-28)

నడక దారిలో-28 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీలో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం జరిగింది. డిగ్రీ చదువు పూర్తిచేసుకుని మేలో పరీక్షల తర్వాత హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-43

మా కథ (దొమితిలా చుంగారా)- 43 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  “దురదృష్టకరమైన ప్రమాదం” బొలీవియాలో యువకులందరూ పద్దెనిమిదేళ్ళకే సైన్యంలో చేరాల్సి ఉండింది. సైన్యంలో చేరిన పత్రాలు లేకపోతే బైట ఉద్యోగాలు దొరకక పదిహేడేళ్ళకే సైన్యంలో చేరిన వాళ్ళు కూడా ఉన్నారు. సైన్యంలో చేరనంటే పెద్ద మూల్యమే చెల్లించాల్సి వచ్చేది. నరకంలాంటి బాధలు అనుభవించాల్సి వచ్చేది. కొడుకులు బారలకు వెళ్ళే పరిస్థితి వచ్చిన రోజు తల్లిదండ్రులు నోరువిప్పి మాట్లాడ గూడదు. ఇక సైన్యంలో చేరాక […]

Continue Reading
Posted On :

నా అంతరంగ తరంగాలు-3

నా అంతరంగ తరంగాలు-3 -మన్నెం శారద ఒక ఆర్టిస్ట్ గా ఇది నా అక్కసో, బాధో అని మీరు అనుకోవచ్చు. మా చిన్నతనంలో బొమ్మలు వేయాలంటే మాకు వడ్డాది పాపయ్యగారో, లేదా బాపు గారి బొమ్మలో శరణ్యమయ్యేయి. లేదా ఇంట్లో గోడలకి వున్న రవివర్మ పటాలు దిక్కయ్యేయి. వాటిని చూసే ప్రాక్టీస్ చేసే వాళ్ళం. ఇప్పటిలా గూగుల్ లో వెదకి పట్టుకునే పరిస్థితి మాకు అప్పుడు లేదు. సినిమా తారల ఫోటోలు పత్రికల మీద అందుబాటులో వున్నా […]

Continue Reading
Posted On :

దుబాయ్ విశేషాలు-1

దుబాయ్ విశేషాలు-1 -చెంగల్వల కామేశ్వరి దుబాయ్ గురించి రాయాలంటే నాకు తెలిసినది సరిపోదు. అందుకే నాల్గయిదు సార్లు దుబాయ్ వెళ్లినపుడు నేను తెలుసుకొన్నవి, అక్కడ మా పిల్లలు చూపించిన కొన్ని విశేషాలు రోజువారీగా పంచుకుంటాను.          UAE అంటే యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ అబుదాబీ, రస్అల్ కైమా, దుబాయ్, అజ్మాన్, షార్జా, ఫ్యుజేరా, ఉమ్మ్ అల్ క్వయిన్, అన్న ఏడు అరబ్బు (చిన్న )దేశాల సమాహారం.          వీటిలో అబూ దాభి ఎమిరేట్ […]

Continue Reading

యాత్రాగీతం-42 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-3)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-3 లగేజీ ఏ టూరుకి వెళ్ళినా లగేజీ ఒక పెద్ద సమస్యే. ‘అసలు అక్కడి వాతావరణానికి ఏం బట్టలు వేసుకోవాలి? ఎన్ని జతలు పట్టుకెళ్ళాలి?’ లాంటి ప్రశ్నలతో మొదలయ్యి చివరికి ‘ఎన్ని కేజీలు పట్టుకెళ్ళనిస్తారు’ తో ముగుస్తుంది. నిజానికి […]

Continue Reading
Posted On :

ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు)

ఈజిప్టు పర్యటన – 4 (చివరి రోజు) -సుశీల నాగరాజ నైలు అందాలను, నది పొడవునా ఉన్న లెక్కపెట్టలేనన్ని ప్రాచీన దేవాలయాలను, శిధిలాలను చూసుకొంటూ ప్రయాణం ! అస్వాన్ నుంచి లుక్సర్ దాకా ఉన్న 90 కిలో మీటర్ల దూరం మోటారు బోటులో ప్రయాణం. అదే నైలు క్రూజ్ ! ఇది నాలుగు రోజులు (మూడు రాత్రులు) ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ముఖ్యమైనవి రకరకాలైన దేవతలు, వారికి కట్టిన దేవాలయాలు, వాటిని ప్రపంచంలో అతి ప్రాచీన భాషల్లో […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -4 మహాభారతకథలు – మాంధాతృడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి మాంధాతృడు కథ మన పురాణాల్లోను, ఇతిహాసాల్లోను గొప్ప కీర్తి పొందినవాళ్లు ఎంతో మంది ఉన్నారు. వాళ్లందరూ మనకి తెలియదు కదా! వాళ్లు ఏ కాలంలో జీవించినా ఆ కాలంలో వాళ్లే చాలా గొప్పవాళ్లు అనిపించు కున్నారు. అటువంటి వ్యక్తులు ఎంతోమంది ఈ భూమి మీద పుట్టి, వేల సంవత్సరాలు జీవించి, ఎన్నో మంచి పనులు చేసి యుగాలు గడుస్తున్నా ఇప్పటికీ కీర్తి కాయంతో జీవించి ఉన్నారు. వాళ్లు ఇప్పుడు […]

Continue Reading
Kandepi Rani Prasad

తప్పిన ప్రమాదం

తప్పిన ప్రమాదం -కందేపి రాణి ప్రసాద్ ఆ వీధిలో ఒక పాడుపడిన ఇల్లు ఉన్నది. సగం పడిపోయిన గోడలు, కూలిపోయిన కప్పుతో ఉన్నది. ఒక పిల్లి తన పిల్లల కోసం ఈ ఇంటిని ఎంచుకున్నది. ఆ పాడుపడిన ఇంటిలో పిల్లి నాలుగు పిల్లల్ని పెట్టింది. వాటిని జాగ్రత్తగా చూసుకుంటూ కాపలా కాస్తున్నది. పిల్లల శరీరాలను తల్లి నాకుతూ శుభ్రం చేస్తుంది.          తల్లి పిల్లి తన పిల్లలకు పాలిస్తూ ప్రేమగా తల నిమురుతోంది. ఆ […]

Continue Reading

అనగనగా-నిజాయితీ

నిజాయితీ -ఆదూరి హైమావతి  నడమానూరు అనే గ్రామంలో రాములయ్య, సీతమ్మ అనే రైతుకూలీ దంపతులకు సోము అనే కుమారుడు ఉండేవాడు. వాడు స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నా డు. గత ఏడాదీ పాఠశాల ఉపాధ్యా యులు ఐదోతరగతి పిల్లలను బస్ లో ఎక్కంచుకుని నగరంలోని జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్ళి అక్కడి జంతువులనంతా చూపుతూ వాటి అలవాట్లు, పద్దతులు ఇంకా వాటి గురంచిన అనేక విషయాలు చెప్పే వారు. ఆ ఏడాది నగరానికి వెళ్ళను యాభై రూపాయలు […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-12 కారుమేఘాలు

పేషంట్ చెప్పే కథలు – 12 కారుమేఘాలు -ఆలూరి విజయలక్ష్మి శ్రావణ మేఘాలు హడావిడిగా పేరంటానికి వెళ్తున్నాయి. క్రొత్త చీరలు, మోజేతికి తోరణాలు, పసుపు పూసిన పాదాలు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, చేతులలో పచ్చి శనగల పొట్లాలు, సన్నటి తుంపర చల్లగా స్పృశిస్తూంటే తనువులు పులకరించి హృదయాలను అనుభూతి అంచుల్ని తాకుతూండగా కబుర్ల మువ్వలు మ్రోగించు కొంటూ అడుగు ముందుకు కదుపుతున్నారు పేరంటాళ్ళు. వసుధ ఎలుగెత్తి ఏడుస్తున్న కొడుకుని సముదాయించడానికి నానా తంటాలు పడుతూంది. ప్రక్కవాటాలోని […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-2

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 2 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల హార్టీకల్చర్ కోర్స్ చదువుతోంది. కాలేజ్లో తన స్నేహితురాలు వసుంధర అక్కపెళ్ళిచేసుకుని ఆస్ట్రేలియా వెళ్లిన తరువాత,  అక్కడి ఫోటోలు చూపెట్టగానే, విశాల ఆస్ట్రేలియా చాలా బాగుందని ప్రశంసిస్తుంది.  విశాల మనస్సులో ఆస్ట్రేలియా సుందరమైన దేశం ఒక్కసారైనా వెళ్ళగలనా అనుకుంటుంది. తన తాతగారు ఇంటికి వచ్చి విశాలకు పెళ్ళి సంబంధం ప్రస్తావన తీసుకురాగానే, తండ్రి విశాలకు పెళ్ళి ప్రయత్నాలు మొదలెట్టబోతున్నట్లు మామగారితో చెబుతాడు. ***       […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-27

నిష్కల – 27 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా, నిష్కల ఒక తండ్రి బిడ్డలేనని తెలుసుకుంటారు. సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. కూతుర్ని జంటగా చూడాలని ఆరాటపడే శోభ. కొన్నాళ్ల ఎడబాటు తర్వాత సహజీవనంలో ఉన్న సహచరుడు అంకిత్ ఇంటికి రావడం నిష్కలను ఆశ్చర్య పరుస్తుంది ***          ఎంత దారుణం. ఎంత కడుపుకోత .. ఆ తల్లిదండ్రులకు. అసలు పిల్లలు ఎందు కంత నిర్దయగా ఉంటున్నారు. క్షణికావేశంతో తీసుకునే నిర్ణయాలు వారి […]

Continue Reading
Posted On :

ఓసారి ఆలోచిస్తే-6

ఓసారి ఆలోచిస్తే-6 పరిష్కారం -డి.వి.రమణి మొబైల్ మోగుతూ ఉంది కాసేపటి తర్వాత మళ్ళీ అలా తీసే వరకు, చేతిలో పని పక్కకి నెట్టి … “హలో  “ అన్నాను “…..”అటునించి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్టు ఉంది.. “ఎవరు” అన్నాను “నేనక్క హేమని” “ఏమైంది హేమా? ఇంటికి రా ముందు” గట్టిగా అన్నాను “అవటానికి ఏమి మిగల్లేదక్క నా తల రాత” వెక్కుతూ అంది “నువ్వు ఏమి కంగారు పడకు ముందు ఏడుపాపేయ్ …నువ్వు బయలుదేరు ఎలా ఉన్నదానివి […]

Continue Reading

విజయవాటిక-19 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-19 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఆశ్చర్యంగా వింటున్నాడు శ్రీకరుడు. అతనికి రాజమాత ధ్యాననిష్ఠ మీద గొప్ప నమ్మకం. ఆమె ధర్మ పరిపాలన మీదా అంతే నమ్మకం. ఆమె తన భర్త మహారాజు రెండవ మాధవవర్మకు మాట ఇచ్చింది. ఆ మాట కోసం నేటి మహారాజును రాజును చేసి తన పుత్రుని యువరాజుగానే ఉంచింది. ఆమె మరోలా చెయ్యగలిగినా, మాట తప్పలేదు. రాజులకు వైదికధర్మమే సరి అయినదన్న ఆమె నమ్మకం విష్ణుకుండినులను దక్షిణాపథమున గొప్ప రాజ్యంగా […]

Continue Reading

కథామధురం-ఆ’పాత’కథామృతం-3 దుర్గాబాయి దేశముఖ్

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-3  -డా. సిహెచ్. సుశీల   “ఆంధ్రా మదర్ థెరీసా”దుర్గాబాయమ్మ                  బహుముఖ ప్రజ్ఞాశాలి యైన ” మహిళా రత్నం”, మాతృదేశ విముక్తి ఉద్యమంలో బ్రిటిష్ వారిని ఎదిరించిన “వీర దుర్గ”, విద్యాధికురాలై, న్యాయవాద వృత్తిని స్వీకరించి, న్యాయం కోసం – ముఖ్యంగా మహిళల కోసం పోరాడిన “స్త్రీ మూర్తి”, నిరంతరం సామాజిక సేవా తత్పరురాలై మహిళాభ్యుదయం కొరకు “ఆంధ్ర మహిళా సభ” ను స్థాపించి, ఎందరో […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-18 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 18 – గౌరీ కృపానందన్ రాకేష్ క్రాఫ్ గాలికి ఎగురుతోంది. జీన్స్, లేత నీలం రంగు టీ షర్ట్ లో అతని ఛాయ మరింత మెరుగ్గా కనబడింది. అతని చేతి వేళ్ళు నాజూకుగా….. ‘“ఛీ ఛీ! అతని ముఖాన్ని తనెందుకు నిశితంగా చూడాలి?’ మనస్సు ఆమెని హెచ్చరించింది. “ఇలా ఇవ్వండి. నేను పట్టుకొస్తాను.” కూరగాయల సంచీని ఆమె చెయ్యి తగల కుండా అందుకున్నాడు. “ఏదో విషయం తెలిసిందన్నారు?” “మాయ అన్నది ఎవరో నాకు […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-27)

బతుకు చిత్రం-27 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***          ఇంతకు ముందయితే సరూపను సయిదులు కూడా ఆరాధనగా చూసేవాడు. దానికి కారణం తనకు ఎప్పుడు వచ్చిన ప్రత్యేకంగా వేడి వేడి గారెలు. మిర్చీలు […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-2

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-2 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 19 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-19 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల మాకు తిండిలేదు మంచు మా ఆహారం. పగళ్ళు, రాత్రిళ్ళు మాదిరిగా ఉన్నాయి. మధ్య మధ్య ఆగుతూ ట్రెయిన్‌ పోతూ ఉన్నది. మంచు కురుస్తూనే ఉన్నది. రాత్రిం బవళ్ళు అలా ఒకరి మీద ఒకరం వొరిగి గడిపాం. మాటా పలుకూ లేదు. గడ్డకట్టిన శరీరాల్లా ఉన్నాం. కళ్ళు మూసుకునే ఉన్నాం. రాబోయే స్టాప్‌లో శవాలను ఈడ్చివేస్తారని వేచి ఉన్నాం. జర్మన్‌ పట్టణాలగుండా గూడా ట్రెయిన్‌ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -3 (యదార్థ గాథ)

జీవితం అంచున -3 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి Future is always a mystery… మనిషి టెక్నాలజీ పరంగా ఎంత పురోగతి సాధించినా రేపు ఏమి జరుగుతుందో తెలుసుకోలేడు కదా. రాత్రి కమ్మిన దిగులు మేఘాలకు ఎప్పుడో అపరాత్రికి పడుకున్నానేమో చాలా ఆలస్యంగా లేచాను. ఆ రోజు శనివారం సెలవు కావటం వలన అందరూ ఇంట్లోనే వున్నారు. అల్లుడు స్టడీ రూములో కూర్చుని కంప్యూటర్ నుండి ఏవో ప్రింట్ ఔట్స్ తీస్తున్నాడు. […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 28

నా జీవన యానంలో- రెండవభాగం- 28 -కె.వరలక్ష్మి         మట్టి-బంగారం కథా విజయంతో కొత్త మిలీనియంలోకి అడుగు పెట్టేను. మట్టి-బంగారం కథ నవంబర్ 30, 1999 న ఇంటర్నెట్ లోను,  నవంబర్-డిసెంబర్ 99 అమెరికా భారతి లోను, తెలుగు యూనివర్సిటీ తెలుగు కథ 99 లోను, కథా సాహితీ వారి కథ 99 లోను మాత్రమే కాకుండా తర్వాత ‘అరుణతార’ మొదలైన అభ్యుదయ పత్రికలలోనూ, సంకలనాలలోనూ కూడా ప్రచురింపబడింది.       […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-42

మా కథ (దొమితిలా చుంగారా)- 42 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  ప్రభుత్వం టీవీలో మేం ఆందోళనకారులమనీ, సైగ్లో-20 ప్రజలు ఉగ్రవాదులనీ ప్రచారం చేస్తోంది. మమ్మల్ని అవమానిస్తున్నారు. ఈ దుష్ప్రచారానికి మేం టీవీలో జవాబివ్వలేం. రేడియో ద్వారా జవాబివ్వకుండా ఉండడానికి గాను సైన్యం 1975 జనవరిలో ఒక వేకువజామున మా ట్రాన్స్ మిటర్ల మీద దాడిచేసి నాశనం చేసింది. వాళ్ళ స్థలంలో ఒక్క మేకును గూడా సవ్యంగా ఉంచలేదు. వాళ్ళక్కడి నుంచి ప్రతిదీ ఎత్తుకుపోయారు. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 14

వ్యాధితో పోరాటం-14 –కనకదుర్గ పిల్లలకు ఎవ్వరికైనా జ్వరం వస్తే నాన్న ఒకోసారి సెలవు పెట్టి దగ్గరుండి చూసుకునేవారు. జ్వరం వల్ల నాలిక చేదుగా వుంటే డ్రై ప్లమ్స్ తెచ్చేవారు, అది నోట్లో పెట్టుకుంటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుండేది. జ్వరం వస్తే అన్నం తినకూడదని, బ్రెడ్, పాలల్లో వేసి తినిపించేవారు. నాన్న ఆఫీసుకెళ్తే అమ్మని మా దగ్గరే కూర్చోమని గోల చేసేవాళ్ళం. అమ్మ త్వరగా పని చేసుకుని వచ్చి మా దగ్గరే వుండేది. అమ్మ చేయి పట్టుకునే వుండేదాన్ని. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 6

యాదోంకి బారాత్-6 -వారాల ఆనంద్         నాటి నుంచి నేటి దాకా “జాతర” సామాన్యుని ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్ధిక వ్యక్తీకరణ వేదిక. ఇవ్వాల్టి సాంకేతికత, అభివృద్ది వెలుగు చూడని దశాబ్దాల క్రితం నుండి జాతర అనగానే సామాన్య ప్రజలు వందలు వేలుగా గుమిగూడేవారు. అదొక గొప్ప సామూహిక వ్యక్తీకరణ. తమ ఇష్ట  దైవాలకు మొక్కులు తీర్చుకునే సందర్భమది. తర్వాత అంతా సమిష్టిగా వినోదమూ, వ్యవహారమూ, వ్యాపారమూ నిర్వహించుకునే ఒక అద్భుత వేదిక జాతర. […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-27)

నడక దారిలో-27 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతిపత్రిక లో  శీలా వీర్రాజుగారికి దేవి పేరుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభా వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, డిగ్రీ చదువు పూర్తిచేసుకుని […]

Continue Reading

యాత్రాగీతం-41 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-2)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-2 వీసా ప్యాకేజీ టూరుకి డబ్బులు కట్టిన తరువాత వీసా రాకపోతే, లేదా సరైన సమయానికి రాకపోతే కలిగే నష్టం కంటే వీసా వచ్చిన తరువాత ప్యాకేజీ టిక్కెట్లు కొనుక్కుంటే వచ్చే నష్టమే తక్కువ. కాబట్టి మేం వీసా […]

Continue Reading
Posted On :

ఈజిప్టు పర్యటన – 3

ఈజిప్టు పర్యటన – 3 -సుశీల నాగరాజ మూడవరోజు బస్సులో 225 కిలో మీటర్ల దూరంలో ఉన్న అలెగ్సాండ్రియాకు  బయలుదేరాము. అలెక్సాండర్ , ది గ్రేట్ 331 BC లో స్థాపించిన నగరం! ఈజిప్టులో అలెక్సాండ్రియాను ‘మెడిటరేనియన్ ముత్యం’ అనికూడా అంటారు. చారిత్రకంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశం! ! ఇక్కడ మెడిటరేనియన్ సముద్రం చూడగానే మనసు పొంగిపోతుంది. ఎంత చరిత్ర! ప్రాచీనకాలంలో చరిత్ర ఎక్కువగా ఈ సముద్రం చుట్టూ తిరుగుతుంది. అట్లాంటిక్ సాగరంతో జిబ్రాల్టరు జల సంధి […]

Continue Reading
Posted On :

అతిరాపల్లి జలపాతాలు

అతిరాపల్లి జలపాతాలు -డా.కందేపి రాణి ప్రసాద్ కేరళ అంటే కొండలు కోనలు, నదులు, జలపాతాలు, పచ్చని చెట్లు, పడవల పోటీలు, లోయలు ఎన్నో అందమైన వనరులతో అలరారుతూ ఉంటుంది. కొబ్బరి చెట్లు అడుగడునా మంచి నీళ్ళ ఆతిధ్యం ఇస్తూ ఎదురు పడుతుంటాయి. కేర అంటే కొబ్బరి అని అర్ధం అళ అంటే భూమి కాబట్టి కొబ్బరి చెట్లకు నిలడైన భూమి కాబట్టి దీనికి కేరళ అనే పేరు వచ్చింది. వంద శాతం అక్ష్యరాస్యత సాధించిన రాష్ట్రంగా ఎంతో […]

Continue Reading

పౌరాణిక గాథలు -3 మహాభారతకథలు – అష్టావక్రుడు కథ

పౌరాణిక గాథలు -3 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అష్టావక్రుడు కథ ఈ కథ కూడా పాండవులకి రోమశ మహర్షి చెప్పిన కథే! ధర్మరాజు కౌరవులతో జూదమాడి ఓడిపోయాడు. తరువాత వాళ్ళు అనుకున్న ప్రకారం పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేశారు. ఆ కాలంలో ఎవరూ అన్నమాట తప్పేవాళ్లు కాదు. ఒక మాట అన్నారు అంటే దాన్ని తప్పకుండా పాటించేవాళ్లు. అందుకే మాట అనే ముందు బాగా ఆలోచించి అనేవాళ్లు. ధర్మరాజు జూదం ఆడడానికి […]

Continue Reading

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-1

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-1 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :

ఓసారి ఆలోచిస్తే-5

ఓసారి ఆలోచిస్తే-5 ధ్యేయం -డి.వి.రమణి “ఎం బిడ్డ ఇస్కూల్ నుండి లేట్ వచ్చినవ్ ?’ ప్రేమగా అడిగాడు వీర్రాజు “మాథ్స్ టీచర్ ఎక్స్ట్రా క్లాస్ తీసుకున్నారు …” కాళ్ళు కడుక్కుంటూ జవాబిచ్చింది సత్యవతి. “ఇదిగో …అమ్మయొచ్చింది … చూడు ఏమి కావాలో ..” చుట్ట ఒకసారి పీల్చి అన్నాడు. “అదే మరి నాకు పని , మహారాణిగారొచ్చారు ఇంకా సేవలు మొదలు , ఇంట్లో పని అంటుకోదు … కూలికెళ్ళొచ్చి నేనే చెయ్యాలా ? ఆ అక్క […]

Continue Reading

విజయవాటిక-18 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-18 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి యువరాజు మందిరము           ఎత్తైన ఆ యువరాజ మందిరములో స్తంభాల పైన చెక్కిన సింహముఖాలలో రాజసం ఉట్టిపడుతోంది. విష్ణుకుండిన రాజుల రాజముద్రిక సింహముఖము. వీరత్వానికి, ధైర్యానికి గుర్తు. పంజా ఎత్తి దెబ్బకొట్టటానికి సిద్ధంగా ఉన్న ఆ ముద్రను మొదటి గోవింద వర్మ కాలంలో స్వీకరించారు. తమ వీరత్వానికి గుర్తుగా వారు ఆ ముద్రను రాజముద్రికను చేసి వీలైనంత వరకూ వారి భవనాలలో, […]

Continue Reading

నిష్కల (నవల) భాగం-26

నిష్కల – 26 – శాంతి ప్రబోధ జరిగిన కథ: నిష్కల తన అక్క అని, సారాకి తెలుస్తుంది.  సుగుణమ్మకు పెద్ద కొడుకు మీద బెంగ. అతని తలపుల్లోనే గడుపుతూ ఉంటుంది. శోభకి నిష్కల జీవితం పై లోలోపల తెలియని బెంగ. సహజీవనంలో ఉన్న నిష్కల జీవితం ఎటునుండి ఎటు పోతుందోనన్న భయం ఆ తల్లిని వెంటాడుతూ ఉంటుంది. కూతుర్ని జంటగా చూడాలని తపన పడుతూ ఉంటుంది ***           నిన్నంతా […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-17 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 17 – గౌరీ కృపానందన్ అతని చేతిలో పెద్ద సైజు పుస్తకం ఉంది. “మయాస్ నాగరికత గురించిన పుస్తకం ఇది. చాల ప్రాచీనమైన నాగరికత ఇది. వాళ్ళు సూర్యుడిని ఆరాధించే వాళ్ళు. ఇంకా…” ఉమ అతను చెప్పే విషయాలను గమనించని దానిలా, “మీరు మొదట ఏమని అన్నారు. నా కేసు కోసం చూస్తున్నాను అని అన్నారు కదా?” అది. “అవును” అన్నాడు. తలను ఒక పక్కగా వంచి హుందాగా చూశాడు. “నా కేసు […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-26)

బతుకు చిత్రం-26 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***           దేవతతో పాటు పట్నంలో తనకు తెలిసిన పెద్ద డాక్టర్ ను కలిసిన తరువాత జాజులమ్మకు పెద్ద పెద్ద పరిచయాలు కాసాగాయి. ఏ […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 18 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-18 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చీకటి పడింది. ఎస్‌.ఎస్‌.లు మమ్మల్ని వరుసలు కట్టమని ఆర్డరు యిస్తున్నారు. మరల మా కవాతు మొదలయింది ` చనిపోయినవారు మంచు కిందపడి ఉన్నారు. వాళ్ళకోసం కడిష్‌ ఎవరూ పఠించలేదు. చనిపోయిన తండ్రులను కొడుకులు అలానే వదిలివేశారు. వారికోసం ఒక చిన్న కన్నీటిబొట్టు కూడా రాల్చలేదు. మంచు కురుస్తూనే ఉన్నది. మేము నెమ్మదిగా మార్చింగ్‌ చేస్తున్నాము. గార్డులు కూడా అలసినట్లున్నారు. పాదం గడ్డ గట్టిపోయేటట్లున్నది. […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -2 (యదార్థ గాథ)

జీవితం అంచున -2 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి తరువాతి మూడు రోజులు మూడు యుగాల్లా గడిచాయి. ఒకటే రెస్ట్లెస్ నెస్… రెస్ట్లెస్ నెస్ అంటే ఏమిటంటారా… నాకు అప్పుడప్పుడూ కలిగే కుదురుంచని ఒక అస్థిమిత భావన. అది కలిగినప్పుడు విసుగ్గా వుంటుంది… ఏ పని పైనా ధ్యాస వుండదు. మాట్లాడుతున్నా ఆ మాటలు నావి కావు. టీవీలో సినిమా చూస్తున్నా నా కళ్ళు దానిని గ్రహించవు. చదువుతున్నా తలకెక్కదు. తింటున్నా నాలుకకు […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-2

నా అంతరంగ తరంగాలు-2 -మన్నెం శారద  “Painting is just another way of keeping a diary.”……….Pobolo Picasso***           ఇంట్లో నేను పని దొంగనని పేరుంది గానీ నేను చాలానే పని చేసేదాన్ని. వంటపని అంటే మాత్రం నాకు గిట్టేది కాదు. (తర్వాత అన్నీ నేర్చుకున్నాననుకోండి ). అలానే మిషన్ మీద బట్టలు కుట్టడం కూడా .           పాతసినిమాల్లో బీదవాళ్లంతా మిషన్ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-26)

నడక దారిలో-26 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతం తోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో  శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో కలంస్నేహం, తదనంతరం బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. పరీక్షలుకాగానే హైదరాబాద్ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 27

నా జీవన యానంలో- రెండవభాగం- 27 -కె.వరలక్ష్మి           1999 కూడా అజో – విభో సభలతోనే ప్రారంభమైంది. నిర్వాహకులు శ్రీ అప్పా జోస్యుల సత్యనారాయణ గారు స్వయంగా ఫోన్ చేసి పిలవడం వల్ల వెళ్లక తప్పలేదు. జనవరి 7 నుంచి 10 వ తేదీ వరకూ గుంటూరు శ్రీ వేంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన ఆ కార్యక్రమాలకు సీనియర్స్ తో బాటు యువరచయితలు, కవులు, కళాకారులు చాలా మంది అటెండయ్యారు. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 5

యాదోంకి బారాత్-5 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ ఇల్లు- నా బాల్యం ఎ దౌలత్ భి లేలో ఎ షౌరత్ భి లేలో భలే చీన్ లో ముఝ్ సే మేరీ జవానీ మగర్ ముఝ్ కో లౌటాదే బచ్ పన్ కా సాయా ఓ కాగజ్ కి కష్తి ఓ బారిష్ కా పానీ ..( సుదర్షన్ ఫకీర్)           ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ స్వరంలో ఎన్నిసార్లు విన్నానో […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-41

మా కథ (దొమితిలా చుంగారా)- 41 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1974 నవంబర్ లోనే ప్రభుత్వం కొందరు వ్యక్తుల్ని “మౌలికస్థాయి సమన్వయ కర్తలు”గా నియమించింది. వీళ్ళు యజమానులకు, కార్మికులకు మధ్య వారధిలా పనిచేస్తారని వాళ్ళన్నారు. కాని కార్మికుల మీద నిఘావేయడమే వీళ్ళ పని. వాళ్ళు తమ పని మొదలు పెట్టగానే కార్మికులు సమన్వయకర్తల్ని నిరాకరించి, వాళ్ళ నిర్ణయాలను తాము ఒప్పుకోమని ప్రకటించారు. ప్రతి శ్రేణిలోనూ తామే ప్రతినిధులను ఎన్నుకోవడానికీ, వాళ్ళతో “మౌలికస్థాయి ప్రతినిధి […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 13

వ్యాధితో పోరాటం-13 –కనకదుర్గ ట్రీట్మెంట్ ఎంత త్వరగా మొదలుపెడితే అంత త్వరగా నొప్పులని ఆపొచ్చు, లోపల పాపకి కూడా స్ట్రెస్స్ తగ్గుతుంది అన్నారు. పాపం శ్రీని ఆ రోజే కొత్త జాబ్ లో జాయిన్అవ్వాల్సింది. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితి చెబితే లాప్ టాప్ తో స్టార్ట్ చేయొచ్చు, నీకు టైం దొరికినపుడు కాసేపు వర్క్ చేయమన్నారు. చైతు స్కూల్ కి వెళ్ళాడు. అప్పటికి అందరూ ఇండియన్ కొలీగ్స్ కుటుంబాలతో వెళ్ళిపోయారు. సుజాత అనేఒక తమిళ […]

Continue Reading
Posted On :

ఈజిప్టు పర్యటన – 2

ఈజిప్టు పర్యటన – 2 -సుశీల నాగరాజ “మనిషి కాలానికి లోబడి ఉంటే, కాలం పిరమిడ్స్‌కి లోబడి ఉంది” – అరబ్ నానుడి. “మానవ నాగరికతకు సాంకేతిక చిహ్నమైన చక్రం (wheel) ని కనుక్కోక ముందే ఇంత అద్భుతమైన కట్టడాలను ఎలా సాధించారు?!!” ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ నాటికీ లేవు. శరీరంలోకి వారి ఆత్మలు ప్రవేశిస్తాయని పూర్వుల నమ్మకం! మరణించిన తరువాత జీవితం ఉందని విశ్వాసం !. అందుకు వీలుగా శరీరం కృశించకుండా మమ్మిఫికేషన్ వల్ల […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-40 అమెరికా నించి ఆస్ట్రేలియా (భాగం-1)

యాత్రాగీతం అమెరికా నించి ఆస్ట్రేలియా (ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.) -డా||కె.గీత భాగం-1           కాలిఫోర్నియాలో గత పదిహేనేళ్లుగా నివాసం ఉంటున్న మాకు ప్రపంచయాత్రలు చెయ్యాలనే కోరిక ఇన్నాళ్ళకి నెరవేరే అవకాశం వచ్చింది. ఇలా ఇతర దేశాలకు వెళ్లాలంటే మాకున్న సమస్యలు ఇప్పటి వరకు రెండు. […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -2 మహాభారతకథలు – మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ

పౌరాణిక గాథలు -2 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి ధర్మోరక్షతి రక్షితః మహాభారతకథలు మహాభారత కృతి కర్త వ్యాసమహర్షి కథ మన దేశం భారతదేశం. ధర్మాధర్మాల్ని బోధించిన గ్రంథం.. వ్యాసమహర్షి చెప్పగా విఘ్నేశ్వరుడు రాసిన గ్రంథం మహాభారతం. సంస్కృతంలో రచించిన ఈ గ్రంథాన్ని నన్నయ తెలుగులో అనువదించడానికి ఉపక్రమించి వెయ్యిసంవత్సరాలు పూర్తయింది. ఇప్పటికీ అదే ప్రమాణాలతో.. అదే పవిత్రతతో.. అదే గౌరవంతో నిలిచి ఉన్నశ్రీమదాంధ్ర మహాభారతంలో మనం తెలుసుకోవలసిన ఎంతో మంది మహర్షులు,గురువులు,రాజులు, ధర్మాత్ములు, దానపరులు వీరులు, ధీరులు […]

Continue Reading
Kandepi Rani Prasad

ఏనుగు సలహా

ఏనుగు సలహా -కందేపి రాణి ప్రసాద్ నల్లమల అడవికి రాజుగా కేసరి అనే సింహం ఉన్నది చాలా తెలివి కలది. తోటి జంతువులపట్ల దయా స్వభావం కలది. అడవిలోని జంతువులను సమానంగా చూస్తుంది. చేస్తే మంచి సహాయం చేస్తుంది తప్ప ఎవరిని చెడగొట్టాలని మోసం చేయాలని ఆలోచించదు. ఇన్ని మంచి లక్షణాలున్న కేసరికి ఒక్క బలహీనత ఉన్నది. తన మంత్రు లతో ఎవరు ఏమీ చెప్పినా నమ్మేస్తుంది ఏనుగు, ఎలుగుబంటి, నక్కలు మృగరాజు దగ్గర మంత్రులుగా పని […]

Continue Reading

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-1

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 1 – విజయ గొల్లపూడి విశాల పేరుకు తగ్గట్టే మనసు కూడా ఎంతో విశాలం. ఆమె మాట మృదు మధురం. కాలేజీ లో డిగ్రీ చదువుతూ మిత్రులతో ఆనందంగా గడచిపోతున్న రోజులు అవి. అగ్రికల్చర్ యూనివర్సిటిలో హార్టీ కల్చర్ కోర్స్ చదువుతోంది. చాలావరకు రోజంతా కాలేజీలోనే గడచిపోతుంది. రికార్డ్ వర్క్, లేబ్ వర్క్, ఎగ్జామ్స్ ఇలా క్షణం తీరిక ఉండదు ఆమెకు. ఐనా ఆమెకు ఎక్కడా విసుగు అనేదే రాదు. ఏ పని […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ’పాత’కథామృతం-2 పొణకా కనకమ్మ

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-2  -డా. సిహెచ్. సుశీల పొణకా కనకమ్మ కథారచన         ఊయల లూగించే కోమల కరాలేరాజ్యాలు శాసిస్తవితూలిక పట్టే మృదు హస్తాలేశతఘ్నులు విదిలిస్తవిజోలలు బుచ్చే సుకుమారపుచేతులే జయభేరులు మోగిస్తవి              — పొణకా కనకమ్మ           నెచ్చెలి గీత గారి సూచన మేరకు 1950 కి పూర్వం రచయిత్రుల కథలను విశ్లేషించటం ఈ వ్యాసాల ప్రధాన ఉద్దేశ్యం. ఆ […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-11 ప్రతిఫలం

పేషంట్ చెప్పే కథలు – 11 ప్రతిఫలం -ఆలూరి విజయలక్ష్మి సంధ్య అధరాలపై విరిసిన పూవులు నక్షత్రాలై ఆకాశం మీద పరుచు కుంటున్నాయి. తుంపర మెల్ల అల్లనల్లన జారుతున్న సన్నసన్నటి తుంపర మేల్ల మెల్లగా వీస్తున్న గాలితో కలిసి కదం కదుపుతూ సర్వజగత్తునూ పులకరింపజేస్తోంది. శ్రద్ధగా శబ్ధాన్నాలకించిన అశ్విని ఒక్క పరుగుతో వాకిట్లోకి వచ్చింది. “ఇంత ఆలస్యంగానా ఇంటికి రావడం?!” అశ్విని కంఠం మెత్తగా, మధురంగా ఉంది. స్కూటర్ ని ఆపిన రఘువీర్ ఆమెను గమనించనట్లు  నటించాడు. […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-1

నా అంతరంగ తరంగాలు-1 -మన్నెం శారద The purpose of our life is to be happy… Dalailama***          అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సారాలు. చదువు కొనసాగుతోంది . ఆ రోజు రాత్రి నన్ను పురజనులు ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తూ ఘనంగా సన్మానిస్తున్నట్లుగా కలొచ్చింది . మెలఁకువరాగానే “ఇది కలా ?” అని కొంత నిరుత్సాహ పడినా ఆ దీపాలు, వింజామరలు, జనసందోహం …కళ్ళలో కనిపిస్తుంటే ….పొంగిపోతూ మొహం […]

Continue Reading
Posted On :

జీవితం అంచున -1 (యదార్థ గాథ)

జీవితం అంచున -1 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి   PROLOGUE  Life is taking up challenges  Life is achieving goals Life is being inspiration to others And age should not be a barrier for anything….           అనగనగా అప్పట్లో పంథొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో ఓ అమ్మాయి తెల్లని కోటు, చల్లని నవ్వుతో రోగుల గాయాలు […]

Continue Reading

ఓసారి ఆలోచిస్తే-4

ఓసారి ఆలోచిస్తే-4 వివేకం -డి.వి.రమణి “నిజమేనా నువ్వు చెప్తున్నది? అలా అమ్మ చెప్పారా??? నేను నమ్మలేక పోతున్నా ” ఆశ్చర్యం నించి తేరుకుని అడిగింది సుధ… అంతకన్నా అమ్మ గురించి చెప్పలేకపోయాను … అంత మంది పిల్లలు పుట్టి చనిపోతే, నన్నెంత గారంగా పెంచిందో నాకు తెలుసు! అందరిలో తప్పు చేసింది అనేలా… చెప్పటం కూడా ఇష్టం లేదు. అమ్మకి, దూరపు బంధువు, ఏ మాత్రం ఇష్టం లేకుండా దూరపు బంధువుకి వయసులో 12 ఏళ్ళు పెద్ద, […]

Continue Reading

కథామధురం-ఆ‘పాత’కథామృతం-1 కనుపర్తి వరలక్ష్మమ్మ కథ “కుటీరలక్ష్మి”

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-1  -డా. సిహెచ్. సుశీల 20 వ శతాబ్దపు మొదటి దశకం లోనే తమ తోటి స్త్రీలను చైతన్య పరచడానికి కవయిత్రులు, రచయిత్రులు సాహిత్య సృజన చేసారు. ఐదారు తరగతుల వరకు చదివి, వివాహం చేసుకొని, కుటుంబ బాధ్యతలలో తలమునకలైన ఇల్లాళ్ళుకూడ కుటుంబంలో, సమాజంలో స్త్రీ పురుష వివక్షతను గుర్తించారు –  ఆలోచించారు – రచనలు చేసారు.               స్త్రీ విద్య ఆవశ్యకత, స్త్రీ స్వేచ్చా స్వాతంత్య్రం […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు-10 చిరుదీపం

పేషంట్ చెప్పే కథలు – 10 చిరుదీపం -ఆలూరి విజయలక్ష్మి వర్షపుధారల్లో చీకటి, కాటుకలా కరుగుతూంది. మేఘగర్జనలకు ప్రకృతి ఉలికులికి పడుతూంది. అప్పుడప్పుడు విద్యుల్లతలు తళుక్కుమంటున్నాయి. గదిలోని నిశ్శబ్దాన్ని చీలుస్తూ బజర్ మోగింది. ఫోన్ తీసి నర్స్ చెప్పింది విని గబగబ కిందకి దిగింది శృతి. రిక్షాలోంచి ఒకామెని చేతులమీద మోసుకొస్తున్నారు. ఆమెతోపాటు వెల్లుల్లి, పసుపు కలగలిసిన వాసన గుప్పున వచ్చింది. దూరం నుంచి చూస్తే అసలు ప్రాణముందా అని అనుమానమొచ్చేలా వేలాడిపోతోంది. అరికాళ్ళు, చేతులనిండా పసుపు. […]

Continue Reading

అనుసృజన-‘నీరజ్’ హిందీ కవిత

అనుసృజన ‘నీరజ్’ హిందీ కవిత అనువాదం: ఆర్.శాంతసుందరి స్వప్న్ ఝరే ఫూల్ సే మీత్ చుభే శూల్ సేలుట్ గయే సింగార్ సభీ బాగ్ కే బబూల్ సేఔర్ తుమ్ ఖడే ఖడే బహార్ దేఖతే రహేకారవాన్ గుజర్ గయా గుబార్ దేఖతే రహే (పువ్వుల్లా రాలిపోయాయి కలలు/ ముళ్ళల్లా పొడిచారు మిత్రులు/తోట అందాన్ని దోచుకున్నాయి ముళ్ళపొదలు/నువ్వేమో అలా వసంతాన్నే చూస్తూ నిలబడిపోయావు/బిడారు వెళ్ళిపోయినా అది రేపిన ధూళినే చూస్తూ ఉండిపోయావు) నీంద్ భీ ఖులీ న థీ కి […]

Continue Reading
Posted On :

విజయవాటిక-17 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-17 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి – రాజమాత మందిరం           ఇరువురూ ముందుగా రాజమందిరంలోని రాజమాతను దర్శించి ఆమె ఆశీస్సులు గ్రహించటానికి వెళ్ళారు. రాజమాత వారిని చూసి ఆశ్చర్యపోయింది. “ఇంత హడావిడిగా వివాహమేమిటి కారా?”  అడిగిందామె. “మల్లిక తొందర పడింది మాతా! అందుకే” అన్నాడు శ్రీకరుడు నవ్వుతూ. మహాదేవుడు కూడా నవ్వుతూ “మన కారుడు అదృష్టవంతుడు మాతా!” అన్నాడు. “బలే వారిరువురూ! సరే కానిమ్ము…” అంటూ, ఆమె […]

Continue Reading

నిష్కల (నవల) భాగం-25

నిష్కల – 25 – శాంతి ప్రబోధ జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న మొదటి భార్య ఎక్కడుంది ? అని సారాని ప్రశ్నిస్తుంది. మాటల్లో తన తల్లి గురించి చెబుతుంది నిష్కల. ***           సుగుణమ్మకు నిద్ర పట్టడం లేదు. పెద్ద కొడుకు కళ్ళ […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-16 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 16 – గౌరీ కృపానందన్ దివ్య మాధవరావు వైపు చూస్తూ అన్నది. “చెప్పినట్లే వచ్చేసాను చూశారా?” డి.ఎస్.పి. దివ్యతో వచ్చిన రామకృష్ణను పరిశీలనగా చూశారు. మాధవరావు అన్నారు. “సార్! ఇతను మిస్టర్ రామకృష్ణ. దివ్య యొక్క… ఏంటమ్మా? కజిన్ బ్రదరా? బాయ్ ఫ్రెండా? ఎలా పరిచయం చెయ్యాలి ఇతన్ని?” “ఫ్రెండ్ సార్.” భయంగా చూస్తూ నవ్వింది. “సార్! నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగాలి” అన్నాడు రామకృష్ణ. “ప్రశ్న అడిగే ముందు  […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-25)

బతుకు చిత్రం-25 – రావుల కిరణ్మయి జరిగిన కథ: దేవత చెప్పిన సలహాలతో జాజులమ్మ తన సంసారాన్ని బాగు చేసుకొని గడిచిన కాలం లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చి జీవితాన్ని పండించు కుంది. ఆ తరువాత ఆమె తీసుకున్న నిర్ణయం ఈర్లచ్చిమిని ఆశ్చర్యానికి గురిచేసింది . ***           నామయ్య తో తన సమస్యను చెప్పుకొని పరిష్కారం పొందాలనుకొని చెప్పడం మొదలు పెట్టింది. బాపూ ! నీ కోక కథ చెప్తా. […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 17 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-17 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఏదో పాడుబడిన పల్లెకు చేరాం. జీవమున్న ఏ ప్రాణి అక్కడ కనిపించలేదు. కుక్కల అరుపులు గూడా వినరాలేదు. కొందరు పాడుబడిన యిళ్ళలో దాక్కోవచ్చని వరుసలు వీడారు. మరో గంట ప్రయాణం తరువాత ఆగమన్నారు. మంచులో అలాగే పడిపోయాము. ‘‘ఇక్కడ వద్దులే, కొంచెం ముందుకెళితే, షెడ్డులాంటిది కనిపిస్తున్నది, అక్కడికి పోదాంలే’’ అంటూ నాన్న నన్ను లేపాడు. నాకు లేవాలనే కోరికగానీ, శక్తిగానీ లేవు. అయినా […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-25)

నడక దారిలో-25 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామాతో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) – 26

నా జీవన యానంలో- రెండవభాగం- 26 -కె.వరలక్ష్మి           కొత్త ఇల్లు కట్టుకున్నాక  ‘కిలా కిలా నవ్వులా-కురిసేలే వెన్నెలా!’ అన్నట్టు కళకళ లాడిన మా ఇల్లు పిల్లల పెళ్లిళ్ళై ఎవరిళ్ళకి వాళ్లు వెళ్లేక చిన్నబోయింది. స్కూలు ఆపేసేక మరింత దిగులు తోడైంది. ఒకప్పుడు అందరికీ ధైర్యం చెప్పిన నేను ఏ చిన్న సమస్యనూ తట్టుకోలేనంత బలహీనమై పోయాను.           ఉత్తరం వైపు పెరట్లోను, ఇంటి చుట్టూ […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 4

యాదోంకి బారాత్-4 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ – ఓ చరిత్ర ఓ జ్ఞాపకం కరీంనగర్ నా నేస్తం, కరీంనగర్ నా ప్రేయసి, కరీంనగర్ నా జీవితం, కరీంనగర్ నా ఊపిరి. కరీంనగర్ పోత్తిల్లల్లో పెరిగాను, వీధుల్లో తిరిగాను, ఒకటి కాదు రెండు కాదు ఆరు దశాబ్దాలకు పైగా ఈ వూరును నేను పెనవేసుకున్నాను. ఈ వూరు నన్ను తన చేతుల్లో పెంచింది.           వ్యక్తిగతంగా, […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-40

మా కథ (దొమితిలా చుంగారా)- 40 రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  1973 నుంచి మా సంఘం స్త్రీలం రైతాంగ స్త్రీలతో మమేకం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాం. కాని మాకు అసలైన సమస్య ఇంకా దృఢమైన కార్మిక కర్షక మైత్రి ఏర్పడకపోవడంలో ఉన్నదని త్వరలోనే అర్థమైంది. ఒక విప్లవ శక్తిగా ఒకే వర్గంగా పనిచేసేటంత గాఢమైన మైత్రి వాళ్ళ మధ్య ఇంకా ఏర్పడలేదు. అంతేకాదు, కార్మిక-కర్షక ఒడంబడిక మీద పురుషులే సంతకాలు చేశారు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 12

వ్యాధితో పోరాటం-12 –కనకదుర్గ 8వ నెలలో మళ్ళీ ఒక అటాక్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళారు. నొప్పి ప్రాణం పోతుందేమో అన్నంతగా వచ్చింది. నేను అంబులెన్స్ కి కాల్ చేయమంటే ఎందుకు నేను తీసుకెళ్తాను అంటాడు శ్రీని. మనమే కార్ లో వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాలి, ట్రాఫిక్ ఎక్కువగా వుంటే ఆగిపోతాము, ఇక నొప్పితో ఏం జరిగినా ఏం చేయడానికి వుండదు. అదే అంబులెన్స్ అయితే వాళ్ళకి ట్రాఫిక్ లో క్లియరెన్స్ వుంటుంది. అదీ […]

Continue Reading
Posted On :

ఈజిప్టు పర్యటన – 1

ఈజిప్టు పర్యటన – 1 -సుశీల నాగరాజ నాకు ఇష్టమైన  విషయాలలో ఒకటి ప్రదేశాలు చూడటం. ఎన్నో రోజుల్నించి  ఈజిప్టు చూడాలన్న కోరిక మార్చినెలలో సాకారమైంది. నేటి యువతరం ఆన్ లైన్లో  అన్నీ చూసుకొని, రిజర్వేషన్లు చేసుకొని, వాళ్ళకు నచ్చిన స్థలాలను ఎంచుకొని ఇష్టమైనన్ని రోజులు హాయిగా తిరిగి వస్తారు. మేము ఎప్పుడూ ట్రావెల్స్ ద్వారానే వెళ్తుంటాము. ఇందులో అనుకూలాలూ అనానుకూలాలూ రెండూ ఉన్నాయి. అన్నీ వాళ్ళే చూసుకొంటారు. ముఖ్యంగా  భోజనాలకు వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. కానీ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-39 (బహామాస్ – భాగం-10) బహామాస్ క్రూజ్ రోజు -4 చివరిభాగం

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-10 బహామాస్ క్రూజ్ (రోజు -4, చివరిభాగం)           నాసో నగర సందర్శన పూర్తయిన రోజు క్రూయిజ్ లో రాత్రి భోజనం ప్రత్యేకమైనది. ఫార్మల్ దుస్తులు వేసుకుని రెస్టారెంటులో సీటు రిజర్వ్ చేసుకుని చేసే భోజనం అన్నమాట. మగవారు సూటు, బూటు లేదా కనీసం ఫుల్ హాండ్ షర్టు ఇన్ షర్టు చేసుకుని, బూట్లు వేసుకుని, ఆడవారు చక్కని గౌన్లు వేసుకుని చక్కగా తయారయ్యి మరీ భోజనానికి […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -1 మహాభారతకథలు

పౌరాణిక గాథలు -1 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి రచయిత్రి పరిచయ వాక్యాలు           శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపురసుందరిగారు బాలసాహితీవేత్తగా విశేష రచనలు చేశారు. బాలల గేయకావ్యం తెలుగుభాషోద్యమ కోణంలోంచి చేసిన ప్రసిద్ధ రచన ‘ముంగిటిముత్యాలు’ పురస్కారాన్ని అందుకుంది. వీరి పరిశోధనాత్మక రచనలు మన ప్రాచీన సంస్కృతికి సంబంధించిన అనేక విశేషాలను వెలుగులోకి తెచ్చాయి. ఇప్పటి వరకూ 20కి పైగా పుస్తకాలు వెలువడ్డాయి. చిన్న పిల్లలు తమంత తాముగా చదివి అర్థం చేసుకో […]

Continue Reading
Kandepi Rani Prasad

ఆకతాయి కుక్కపిల్లలు

ఆకతాయి కుక్కపిల్లలు -కందేపి రాణి ప్రసాద్ హైవేకు పక్కగా ఒక కుక్క కుటుంబం నివసిస్తున్నది. ఒక కుక్క తన భార్య నలుగురు పిల్లలతో కాపురముంటున్నది. రోడ్డుకు పక్కనే అయినప్పటికీ అక్కడ పెద్ద చెత్త కుప్ప అడ్డుగా ఉన్నది. అంతేకాకుండా పక్క పొలాలకు అవసరమయ్యే గడ్డివాము ఉన్నది. పిల్లల్ని మరుగున దాచటానికీ, మెత్తగా గడ్డి పరుపు పరచటానికీ ఈ స్థలం అనువుగా ఉందని తల్లికుక్క భావించింది. పిల్లల్ని కనక ముందే మంచి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటునపుడు […]

Continue Reading