image_print

యాత్రాగీతం-34 (బహామాస్ – భాగం-5) మయామీ నగర సందర్శన- ఫ్రీడమ్ టవర్

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-5 మయామీ నగర సందర్శన – ఫ్రీడమ్ టవర్           విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్ సందర్శన పూర్తయ్యేసరికి భోజనసమయం దాటి పోసాగింది. అక్కణ్ణించి మధ్యాహ్న భోజననానికి డౌన్టౌన్ లో ఉన్న ఇండియన్ రెస్టారెంటు బొంబాయి దర్బారు (Bombay Darbar) కి వెళ్ళాం. తాలీ స్టైల్ నార్త్ ఇండియన్ భోజనం ఆదరాబాదరా, సుష్టుగా పూర్తిచేసి ఫ్రీడమ్ టవర్ (Freedom Tower) సందర్శనకు వెళ్లాం. 1925 లో నిర్మించబడిన […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- విలియమ్ కల్లెన్ బ్రాయంట్

క’వన’ కోకిలలు – 10 :  విలియమ్ కల్లెన్ బ్రాయంట్ (William Cullen Bryant) (November 3, 1794 – June 12, 1878)    – నాగరాజు రామస్వామి “చిట్టడవులు దేవుని తొలి ఆలయాలు. పుష్ప సారభాన్ని, నక్షత్ర వైభవాన్ని ప్రేమ నయనంతో గాని చూడలేము. ఆరుబయట తిరుగాడే లలిత పవనాలలో ఆనంద తరంగాలు అలలు పోతుంటవి” – విలియం బ్రాయంట్. విలియమ్ కల్లెన్ బ్రయాంట్ 19వ శతాబ్దపు కాల్పనికవాద అమెరికన్ కవి. పాత్రికేయుడు. అలనాటి ప్రసిద్ధ పత్రిక […]

Continue Reading
Kandepi Rani Prasad

చిన్నూ- బన్ను

చిన్నూ- బన్ను -కందేపి రాణి ప్రసాద్ ఎండలు భగ భగ మండుతున్నాయి. అడవిలో ఎటు చూసినా మొక్కలు తలలు వాల్చేసి ఉన్నాయి. వృక్షాలు కొన్ని చోట్ల రాలిన ఆకులు సూర్య కిరణాలు పడి వాటికవే కాలి పోతున్నాయి. వేసవి కాలంలో అడవి ఎండకు మాడి పోతున్నది. చిన్న చిన్న నీటి కుంటలు, దొరువులు ఎండిపోయాయి. నీళ్ళ కోసం చాల దూరం వెళ్ళ వలసి వస్తోంది చిన్న జంతువులు, పక్షులు దాహంతో గొంతెండి అల్లాడుతున్నాయి.        […]

Continue Reading

అనగనగా- చిలుకపలుకు

చిలుకపలుకు -ఆదూరి హైమావతి  అనగా అనగా అనకాపల్లి అనేగ్రామ సమీపాన ఉండే ఒక చిట్టడవిలో ఒక పెద్ద మఱ్ఱిచెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకుని నివసించేవి. ఆహారం కోసం వెళ్ళిన పక్షులు అన్నీ సూర్యాస్తమయానికంతా గూళ్ళు చేరుకుని, అంతా తాము చూసిన వింతల గురించీ కబుర్లు చెప్పుకునేవి. ఒకరోజున ఒక చిలుక తనగూట్లోంచీ మాట్లాడుతున్న మాటలు పక్షులన్నీ విని,”చిలకమ్మా! ఏం పాట పాడు తున్నావ్! కొత్త పాటలా ఉందే! చెప్పవా!” అని స్నేహ పూర్వకంగా అడిగాయి. […]

Continue Reading
Posted On :

మా శృంగేరి యాత్ర!-1

మా శృంగేరి యాత్ర!-1 -సుభాషిణి ప్రత్తిపాటి 2018 దసరా సెలవుల్లో కేవలం  మూడు రోజుల యాత్ర కు ప్రణాళిక వేసుకున్నాం. మేము అంటే మావారు, ఇద్దరు పిల్లలు, అలాగే బెంగుళూరులో ఉన్న మా మరిది, తోడికోడలు,ఇద్దరు పిల్లలు. బెంగళూరు నుంచి ఓ ట్రావెలర్ మాట్లాడుకున్నాం. సాయంత్రం 6 గంటలకు అంతా బయలుదేరాము. వెనుక సీట్లలో పిల్లలు, మధ్యన మేము ముందు మా మరిదిగారు మొత్తానికి సెటిల్ అయ్యాము. రాత్రి 9 దాటాక మధ్యలో ఆగి ఇంటి నుంచి […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -18

నా జీవన యానంలో- రెండవభాగం- 18 -కె.వరలక్ష్మి           అప్పటి వరకూ ఏదో పేదాపోలెం బతుకు బతుకుతున్న మేం ఇల్లు కట్టుకోవడం ఎందరికో  కంటి మెరమెర అయ్యింది. బైటి వాళ్ళు కొంతైనా వంకర నవ్వుల్తో సరిపుచ్చుకున్నారు. బంధువులు అసూయను ఆపుకోలేక ఏదో ఓ రూపంలో వెళ్లగక్కేవారు.  పల్లెల్లో అలాగే నడుస్తుంది మరి!           కొన్ని కుటుంబాల్లో ఆర్ధికంగా ఎదిగి, అనుకోనంత డబ్బునూ, ఆస్తుల్ని అందుకున్న వాళ్ళు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 4

వ్యాధితో పోరాటం-4 –కనకదుర్గ ఒక కొబ్బరి బొండాం తీసుకుని ఆటోలో వెళ్తుండగా కొద్ది కొద్దిగా సిప్ చేయసాగాను. చైతుని ఎపుడూ వదిలి పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు మేము, సినిమాలకి వెళ్ళడం మానేసాము వాడు పుట్టినప్పట్నుండి. వాడిని తీసుకుని పార్క్ లకు వెళ్ళడం, అత్తగారింటికి, అమ్మ వాళ్ళింటికి వెళ్ళినా, అక్క, అన్నయ్య వాళ్ళింటికి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కల్సి వెళ్ళడమే అలవాటు. చాలా మంది అనేవారు, ‘సినిమాలు మానేయడం ఎందుకు? వాడికి ఏ బొమ్మొ, లేకపోతే తినడానికి ఏ […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-17)

నడక దారిలో-17 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ : పదేళ్ళ వయస్సు లో తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. నా చదువు దెబ్బతిని అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్య పఠనంతోనూ, సంగీతం నేర్చుకోవటానికి, బాపూ బొమ్మలు చూసి వేయటం చేసాను.స్వాతిపత్రికలో మేనబావ శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా పేరు చూసి అభిమాని గా దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామా తో ఉత్తరాలు రాసేదాన్ని. నేనని […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా)-32

మా కథ రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అప్పుడు ఫ్లాష్ లైట్లు పట్టుకొని వచ్చిన ఓ నలుగురు నన్ను కొట్లోంచి బయటికి లాక్కుపోయారు. నా తోటి ఖైదీ నాకు ధైర్యం చెపుతూనే ఉన్నాడు. వాళ్ళు ఇదివరకు నేనుండిన కొట్లోకి లాక్కెళ్ళారు. అక్కడ ఒక అధికారి చాల కోపంతో, మండిపడుతూ కూచున్నాడు. వాడు మామూలు దుస్తుల్లోనే ఉన్నాడు. నన్ను గదిలో పడేయగానే వాడు నా వైపు అసహ్యంగా, కోపంగా ఓ చూపు విసరి “నా కొడుకును […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-2 యామిని

పేషంట్ చెప్పే కథలు – 2 యామిని -ఆలూరి విజయలక్ష్మి చల్లగాలి వెర్రెత్తినట్టు వీస్తూంది. “నమస్తే డాక్టర్!” చేతులు జోడిస్తూ లోపలికి వచ్చాడు మురళి. “హలో! రండి రండి, యామిని కూడా వచ్చిందా?” “వచ్చింది.” అతను చెప్పేంతలో యామిని కూడా లోపలికి వచ్చింది. “ఎమ్మా? ఎప్పుడొచ్చారు? పిల్లలు బావున్నారా?” చిరునవ్వుతో మౌనంగా తలూపింది యామిని. మాట్లాడని మల్లెమొగ్గ యామిని. వెన్నెల్లాంటి చిరునవ్వుతో పలకరిస్తుంది. కళలు కనే కళ్ళతో మాట్లాడుతుంది. అవి చూసి ముచ్చటపడే, పెద్దగా చదువు లేక […]

Continue Reading

యాత్రాగీతం-33 (బహామాస్ – భాగం-4) మయామీ నగర సందర్శన-2

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-4 మయామీ నగర సందర్శన- విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్           విన్ వుడ్ వాల్స్ సందర్శన కాగానే అక్కణ్ణించి సరాసరి విజ్కాయా మ్యూజియం & గార్డెన్స్  (Vizcaya Museum & Gardens) చూసేందుకు వెళ్లాం. ఒక్కొక్కళ్ళకి  $10 టిక్కెట్టు. అప్పటికే కాస్త మేఘావృతమై ఉంది ఆకాశం. మేం కారు పార్కు చేసి ఇలా నడవడం మొదలుపెట్టామో లేదో పెద్ద వాన మొదలయ్యింది. అదే కాలిఫోర్నియాలో అయితే […]

Continue Reading
Posted On :

కథామధురం-డా.లక్ష్మీ రాఘవ

కథా మధురం డా.లక్ష్మీ రాఘవ స్త్రీ శాంతమూర్తి మాత్రమే కాదు, ఉగ్రరూపిణి కూడా! అని నిరూపించిన కథ-     ‘ఆమె ఒక శక్తి !’  -ఆర్.దమయంతి ‘స్త్రీలకు కుటుంబపరంగా దక్కే న్యాయం ఎంత గొప్పదంటే.. ఏ చట్టాలూ, న్యాయ స్థానాలూ చేయలేని  మేలు కంటే కూడా మిన్నయినది.’ *** జీవితం లో ఆడది – మగాడి వల్లే మోసపోతుంది. అతని కారణంగానే  కష్ట పడుతుంది. అన్నివిధాలా నష్టపోతుంది. అయితే అతను భర్తే కానవసరం లేదు. అతను  అన్న […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా)-31

మా కథ రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  అప్పుడు వాళ్లో ఉత్తరం పట్టుకొచ్చారు. అది చాల కుదురుగా, అందంగా రాసి ఉంది. నార్ బెల్టి నాకు చాలమంచి స్నేహితురాలు గనుక ఆవిడ రాత నాకు బాగా తెలుసు. ఆ ఉత్తరంలో ఉన్నది మాత్రం కచ్చితంగా ఆవిడ రాతకాదు. ఆ ఉత్తరంలో నార్బెర్టా – ది ఆగిలార్ నైన తాను తన పిల్లల మీద ప్రభుత్వం తెచ్చిన ఒత్తిడి ఫలితంగా తనకు తెలిసిన విషయాలు ప్రకటిస్తున్నాననీ, […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-7 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 7 – గౌరీ కృపానందన్ రిసెప్షన్ కి పక్కనే ఉన్న గదిలోకి ఉమను తీసుకెళ్ళారు ఇన్స్పెక్టర్ మాధవరావు. గది గుమ్మం దగ్గర ఎవరెవరో కెమెరాలతో నిలబడి ఉన్నారు. “ఇప్పుడు ప్రెస్ కి న్యూస్ ఏమీ లేదు. ప్లీజ్.. దయచేసి విసిగించకండి.” “మీరు రండి మిసెస్ మూర్తి! కాస్త ఫాను ఆన్ చెయ్యవయ్యా.” కూర్చున్నదల్లా ఏడవసాగింది. మళ్ళీ మళ్ళీ ఉధృతంగా వచ్చేసింది ఏడుపు. “మిసెస్ మూర్తి! ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. ఈ సమయంలో మిమ్మల్ని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 3

వ్యాధితో పోరాటం-3 –కనకదుర్గ మోరా వెళ్ళిపోయాక నాకు ఇండియాలో నొప్పి ఎలా వచ్చింది, అక్కడ డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నీ గుర్తు రాసాగాయి. నొప్పి వచ్చిన రోజు శ్రీని ఇంటికి వచ్చాక జరిగిన సంగతి తెల్సుకుని, మన డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుందాము అని వెంటనే బయల్దేరారు. కైనెటిక్ హోండా స్కూటర్ పై వెళ్ళేపుడు పొద్దున వెళ్ళిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు కొంచెం బాగానే వుందని చెబితే టెస్ట్స్ చేయించుకుని రమ్మని చెప్పింది. అలాగే […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- విరోధాభాసల సనాతన గ్రీకు తాత్వికుడు హిరాక్లిటస్

క ‘వన’ కోకిలలు – 9 :  విరోధాభాసల సనాతన గ్రీకు తాత్వికుడు హిరాక్లిటస్    – నాగరాజు రామస్వామి (Heraclitus 535–475 BC) Thunderbolt steers all things. The fiery shaft of lightning is a symbol of the direction of the world – Heraclitus. హిరాక్లిటస్ క్రీ.పూ. 5వ శతాబ్దపు గ్రీకు తాత్వికుడు. సోక్రటీస్ కన్న పూర్వీకుడు. గ్రీకు సాంస్కృతిక సనాతనులైన ఐయోనియన్ల ( Ionian ) సంతతికి చెందిన వాడు. గ్రీకు సంపన్న కుటుంబంలో, నాటి పర్షా దేశానికి చెందిన ఎఫిసస్ పట్టణం (Ephesus)  (ప్రస్తుత టర్కీ) లో జన్మించాడు. ఐయోనియన్ […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -17

నా జీవన యానంలో- రెండవభాగం- 17 -కె.వరలక్ష్మి 1988 జనవరి 25 సోమవారం ఉదయం గౌతమీ దిగి మా పెద్ద తమ్ముడి ఇంటికి వెళ్లేం. పది దాటాక H.D.F.C హౌసింగ్ లోన్ సంస్థ ఆఫీస్ కి వెళ్లేం.  అక్కడా అదే ఎదురైంది. లోన్ మోహన్ కే ఇస్తామన్నారు.  ఇంతదూరం వచ్చాం కదా ఒప్పుకోమని మోహన్ ని చాలా బ్రతిమలాడేను.  తను ససేమిరా అనేసరికి చేసేది లేక తిరిగి వచ్చేసాం. మధ్యాహ్నం భోజనాల దగ్గర మా తమ్ముడికి విషయం […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-16)

బతుకు చిత్రం-16 – రావుల కిరణ్మయి కుమ్మరి మల్లన్న ఇంటి నుండి  కురాళ్ళు పట్టడం కోసం ఆడబిడ్డలకు చీరలు పెట్టింది. ముత్తయిదు వలను పిలుచుకు రావడానికి బయలుదేరతీసింది . పెద్దామె, నడిపామె మాత్రం సంతోషంగా పెట్టిన చీరలు కట్టుక తయారయిండ్రు గాని చిన్నామె మూతి ముడిసింది. ఉల్లి పొర చీరలు పెడుతేంది?పెట్టకున్టేంది ?ఇగ ఇవి కట్టుకొని ఇంక తగుదునమ్మాని పేరంటాండ్ల పిలవడానికి పోవాల్నా?చూసినోల్లు ఏమనుకుంటరు/ఇంత గతి లేకుంటున్నర?అని మా మొగోల్లను అనుకోరా?అని ఎల్లగక్కింది. పెద్దామె,కల్పించుకొని, ఏందే ?సెల్లె […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-16

నిష్కల – 16 – శాంతి ప్రబోధ కరిపై ఒకరు పెత్తనం లేని ప్రేమ సంబంధంగా తమ సంబంధం  మిగలాలని కోరుకున్న నిష్కల మనసులోకి అంకిత్ చేరి ఇబ్బంది పెడుతున్నాడు. ఆమె ఆలోచనలు వెనక్కి పరుగులు పెడుతున్నాయి. రంగనాయకమ్మ రాసిన జానకి విముక్తి నవలలోని శాంతా -సూర్యం లాగా పెళ్లి తంతు లేకుండా బతకాలని అనుకున్నది. శాంతా సూర్యంలనే స్ఫూర్తిగా తీసుకున్నది. వివాహ సంస్కృతిలో ప్రేమ కంటే శారీరక సుఖాలకే ప్రాధాన్యం ఉంటుంది కానీ సహజీవనంలో అలా ఉండదని […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిచ్చుక పిల్లల తప్పు

పిచ్చుక పిల్లల తప్పు -కందేపి రాణి ప్రసాద్ ఒక చెట్టు మీద పిచ్చుక తన పిల్లలతో భార్యతో జీవిస్తోంది. పిల్లలు ఇప్పుడిప్పుడే పెద్దవాల్లవుతున్నారు. ఎన్నో జాగ్రత్తలు  చెప్పి పిచ్చుకలు బయటకు వెలుతుంతుంటాయి. ఆనదంగా సంసారం సాగిస్తున్నాయి. పిచ్చుకలు జంట చీకటి పడగానే తినేసి నిద్రపోతుంటాయి. పిల్లలు మాత్రం చాలాసేపు మేలుకుంటున్నాయి. అప్పుడప్పుడు రాత్రిపూట మెలకువ వచ్చి చూసినప్పుడు పిల్లలు దగ్గర నుంచి వెలుగు కనిపిస్తోంది. నిద్ర మత్తులో ఏమి పట్టించుకోకుండా నిద్రపోతుంది తల్లి పిచ్చుక.ఒకరోజు తండ్రి పిచ్చుకకు […]

Continue Reading

నడక దారిలో(భాగం-16)

నడక దారిలో-16 -శీలా సుభద్రా దేవి ఇద్దరి మధ్యా లేఖలు పావురాలై ఎగరటం మొదలై ఆరునెలల పైనే అయ్యింది. కొత్త ఏడాది కొత్త ఊహలను ప్రోది చేసుకుంటూ అడుగు పెట్టింది. ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో ఎన్నెన్ని మార్పులనో తీసుకువచ్చేలానే అనిపించింది. ఎన్నెన్ని  కొత్త అనుభవాలనో తొలి అడుగులోనే రుచి చూపిస్తూ కొంగ్రొత్త మలుపులను తీసుకు వచ్చేలానే ఉంది. అవి నాకు శుభసంతోషాలనే ఇస్తుందో , కష్టాల కడగండ్లు పాదాల ముందు పరుస్తుందో. అన్నింటినీ ఎదుర్కోగలిగే […]

Continue Reading

అనుసృజన-కబీర్ దోహాలు కొన్ని-

అనుసృజన కబీర్ దోహాలు ఎన్నో ప్రసిద్ధి చెందాయి, వాటిలో కొన్ని… -ఆర్. శాంతసుందరి తులసీ జే కీరతి చహహి , పర్ కీ కీరతి ఖోయితినకే ముహ్ మసి లాగిహై , మిటిహి న మరిహై ధోయి          ఇంకొకరి పేరు చెడగొట్టి తాము పేరు సంపాదించుకోవాలనుకునే వాళ్ళుంటారు అటువంటి వాళ్ళ ముఖాలకి అంటుకునే మసి ఎంత కడిగినా, వాళ్ళు చనిపోయే వరకూ వదలదు. సూర్ సమర్ కరనీ కరహి , కహి న […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-7

మా అమ్మ విజేత-7 – దామరాజు నాగలక్ష్మి పెళ్ళి హడావుడి, పెళ్ళి ఏర్పాట్లతో అందరూ సందడి సందడిగా వున్నారు. పెళ్ళనేసరికి అమ్మాజీకి అంతా గాభరా గాభరాగా వుంది. ఆటలు ఆడుకుంటూ వుండే అమ్మాజీకి అంతా విచిత్రంగా వుంది. సరదాగా ఆడుకుంటూ పాడుకుంటూ వుండడం, ఎవరి పెళ్ళిళ్ళయినా అయితే సరదాగా తిరిగడం మాత్రమే తెలుసు,  రాత్రి 2.00 గంటల ముహూర్తం. ఇంకా పెళ్ళికి టైము వుండడంతో… అమ్మాజీ గాభరా చూసిన పెద్దమ్మ పిల్లలు “అమ్మాజీ! మనం మన ఇంట్లో […]

Continue Reading

ఏడు సామ్రాజ్యాల రాజధాని – ఢిల్లీ

ఏడు సామ్రాజ్యాల రాజధాని – ఢిల్లీ -కందేపి రాణి ప్రసాద్ భారతదేశ రాజధాని ఢిల్లీ గురించి కొన్ని విశేషాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ మధ్య కాలంలో ఢిల్లీ వెళితే పరీక్షలు రాయడం కోసమే తప్ప ప్రశాంతంగా చూసేందుకు వెళ్ళలేదు. కాబట్టి ఈసారి మరల  అన్నీ చుద్దామనుకున్నాం గానీ మొత్తం చూడటం కుదరలేదు. ఢిల్లీలో 59వ పిల్లల వైద్య నిపుణులు సమావేశం జరుగుతున్నది. ఇది జాతీయ సమావేశం కనుక అందరూ కుటుంబాలతో వస్తారు. కుటుంబాల కోసం చాలా సరదా […]

Continue Reading

అనగనగా- ఉచితం-అనుచితం

ఉచితం-అనుచితం -ఆదూరి హైమావతి  జ్యోతిష్మతి రాజ్యాన్నీ రజనీవర్మ అనే రాజు పాలించేవాడు.అతనికి కీర్తి కాంక్ష ఎక్కువ. ఎలాగైన తన తాతముత్తాతలను మరిపించేలా ప్రజలకు హితవు చేసి వారికంటే గొప్పపేరు తెచ్చుకోవాలనీ, తన తర్వాతి తరం వారంతా తన పేరే చెప్పుకోవాలనీ తెగ ఆశ పడుతూ ఏమి చేస్తే తన కోరిక తీరుతుందో అని రాత్రింబవళ్ళూ ఆలోచించేవాడు. అతనిరాజ్యం సుభిక్షంగా ఉండేది. పంటలు బాగా పండుతూ అంతా సుఖ సంతోషాలతో జీవించేవారు. కష్టపడి పనిచేసే తత్వం ప్రజలదంతా. ఎవ్వరూ  […]

Continue Reading
Posted On :

విజయవాటిక-8 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-8 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ  ఇంద్రపురి బౌద్ధారామం           ఇంద్రపురి విశాలమైన, ఎతైన భవనపు సముదాయాల నగరం. ఆ నగరానికి పశ్చిమాన బౌద్ధ విహారంలో ఆచార్య దశబలబలి నివాసం. ఇంద్రపురిలో ఒక బౌద్ధవిహారం కట్టించాలన్న సత్యసంకల్పంలో ఉన్నాడాయన. కొడిగట్టిబోతున్న ‘జ్యోతి’ బౌద్ధానికి తన చేతులను అడ్డం పెట్టిన మహానుభావుడాయన. బౌద్ధానికి పూర్వపు వైభవం తేవాలన్నది ఆయన ఆశయం. బౌద్ధ గ్రంధాలు కూలంకుశంగా చదివినవాడు, మహా పండితుడు, బౌద్ధ త్రిపీటికలు […]

Continue Reading

చాతకపక్షులు నవల- 13

చాతకపక్షులు  (భాగం-13) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి బతుకుజీవుడా అనుకుంటూ అతనివెంట లోపలికొచ్చింది గీత. లోపలికి రాగానే భయం పోయింది. కొంచెం నవ్వు కూడా వచ్చింది. తన సాహసకృత్యాలు హరికి చెప్పి, “మీ పేరు మాత్రం గొప్ప కథ. యఫ్.బి.ఐ. వాళ్లు కూడా పట్టుకోలేరన్నాడా పెద్దాయన,” అంది గలగల నవ్వుతూ. హరి కూడా నవ్వుతూ, “మా ఆఫీసులో నాపేరు ఎ టు జీ హారీ అంటార”ని చెప్పి, “తింటానికేమైనా వుందా?” […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 8 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-8 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల అది మే నెలలో చక్కటి రోజు. వసంతకాలపు గాలులు వీస్తున్నాయి. సూర్యాస్తమవబోతున్నది. కొన్ని అడుగులు ముందుకు వేసామో లేదో మరో క్యాంపు. మరో ముళ్ళకంచె ఇక్కడ ఒక ఇనుప గేటు ఉన్నది. దానిమీద ‘‘పని మీకు విశ్రాంతినిస్తుంది’’ ఆష్‌విట్స్‌ అని రాసి ఉన్నది. బెర్కెనా కంటే కొంచెం నయమనిపించింది. రెండతస్తుల సిమెంట్‌ కట్టడాలు. అక్కడక్కడ చిన్న తోటలున్నాయి. ఒక ద్వారం ముందు కూర్చున్నాం. […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-21

రాగో భాగం-21 – సాధన  దల్సు ఇంట్లో నిండు గ్రహణం పట్టినట్టుంది. బట్ట పొట్టకు కరువులేని ఇంట్లో బుక్కెడు అంబలికే పూట పూట గండమవుతూంది. నూకల జావ తప్ప మరొకటి ఎరగని దల్సు ఇంట్లో నూకల వూసే లేదు సరికదా జొన్న అంబలి, జొన్న గటుక పుట్టడమే గగనమవుతూంది. రాగో ఉంటే జొన్నగడ్డ కూలికి పోయి జొన్నలన్నా తెచ్చేదని, పొయ్యి దగ్గరికి పోయినప్పుడల్లా తల్లీ, కూచీ సణుగుతూనే ఉన్నారు. గిన్నె (పళ్ళెం) దగ్గర కూచున్న ప్రతిసారి తండ్రికీ, […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు-1 వీర నారి

పేషంట్ చెప్పే కథలు – 1 వీర నారి -ఆలూరి విజయలక్ష్మి “మా ఆవిడ కొట్టింది” సిగ్గు పడుతూ చెప్పాడు గోపాలం. ఎవరైనా భర్తతో తన్ను లు తిని వైద్యానికోస్తే వాళ్ళ దెబ్బలని చూసి కోపం వచ్చి “తిరగబడి మళ్లీ  తన్నలేవా అతన్ని”?అని ప్రశ్నిస్తుంది తను. “ఈ పవిత్ర భారత దేశం లో పుట్టిన ఆడదానికి అన్ని దమ్ములున్నాయా?” “ఎంత వెర్రి దానివి?”అని తనను పరిహసిస్తున్నట్లు కన్నీళ్లతో నవ్వేవారు కొందరు. చాలా ప్రమాదకరమైన వ్యక్తిని చూసినట్లు భయంగా […]

Continue Reading

కథామధురం-కిరణ్ విభావరి

కథా మధురం కిరణ్ విభావరి తాను వెలుగుతూ..వెలిగిస్తూ.. దీపం లా బ్రతకమంటున్నకిరణ్ విభావరి ‘తప్పంటారా ?’ కథ!  -ఆర్.దమయంతి ముందుకెళ్తున్న  ఈ సమాజం – ఎంత వెనకబడి ఆలోచిస్తోందంటే.. స్త్రీ వస్త్రధారణ లోని లోటుపాట్లను ఇంకా లెక్కించడం లోనే మునిగిపోయుంది. ‘ స్త్రీ ఒంటి నిండా వస్త్రాన్ని ధరించడం ‘ అంటే, అది తప్పనిసరిగా చీరే అయి వుండాలన్న అపోహ నించి మనమింకా ఒక్క ఇంచ్ అయినా కదల్లేదేమో అని అనిపిస్తుంది. పైగా ధరించిన దుస్తులను బట్టి […]

Continue Reading
Posted On :

పేషంట్ చెప్పే కథలు (మరోసారి ఎందుకు)

పేషంట్ చెప్పే కథలు మరోసారి ఎందుకు (రచయిత్రి ముందుమాట) -ఆలూరి విజయలక్ష్మి             సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం  “పేషెంట్ చెప్పే కథలు” ఆంధ్రజ్యోతి వార పత్రికలో వారం వారం ప్రచురింపబడ్డాయి.  ఆంధ్రజ్యోతి వార పత్రిక అప్పటి  సంపాదకులు శ్రీ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి ప్రోత్సాహంతో వాటిని రాశాను. ‘పేషెంట్ చెప్పే కథలు’ అనే శీర్షికను శ్రీశర్మగారే పెట్టారు.  అనేక రకాల శారీరక, మానసిక రుగ్మతలతో వచ్చే పేషెంట్స్  […]

Continue Reading

చాతకపక్షులు నవల- 12

చాతకపక్షులు  (భాగం-12) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి సోమవారం గుంటూరులో బస్సు దిగేవేళకి టైము దాటిపోయిందని కాలేజీకి వెళ్లలేదు. మర్నాడు ఆవరణలో అడుగెడుతూనే సత్యం ఎదురయింది. “నిన్న కాలేజీకి రాలేదేం?” “ఏం లేదు. వూరికే.” “ఒంట్లో బాగులేదా?” “అదేంలేదు. ఇంటికెళ్లేను.” “శనివారం వెళ్తే ఆదివారం వచ్చేయొచ్చు కదా.” “రాలేదు.” “పెళ్లిచూపులా?” గీత ఉలిక్కిపడింది. “ఎందుకలా అనుకున్నావూ?” “అంతకంటే నీకూ నాకూ ఏం వుంటాయిలే రాచకార్యాలు. నీ మొహం చూస్తే అనిపించింది. […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -16

నా జీవన యానంలో- రెండవభాగం- 16 -కె.వరలక్ష్మి రిక్షా కథ కన్నా ముందు 1984 లో జ్యోతి  మంత్లీ లో ఓ కవిత; 85 లో ‘పల్లకి’ వీక్లీ లో ‘రసధుని’ కవిత; ‘ఆంధ్రజ్యోతి’ లో ‘గీతం లో నిశ్శబ్దం’ కవిత; వనితాజ్యోతి లో ‘ప్రతిధ్వని’ కవిత ; 83 లో ఆంధ్రజ్యోతి వీక్లీ లో ‘యువకుల్లో ధీశక్తి‘ వ్యాసం; 85లో ఉగాది వ్యాసరచన పోటీ లో బహుమతి పొందిన వ్యాసం; 85జూన్ స్వాతి  మంత్లీ లో […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-15

నిష్కల – 15 – శాంతి ప్రబోధ నిన్నంతా ఎడతెరిపి లేని మంచువాన కురిసింది. ఇళ్లను, రోడ్లను పూర్తిగా మంచుతో కప్పేసింది.  ఎటు చూసినా శ్వేత వర్ణమే.              ఇంట్లోంచి  బయటికొచ్చిన పిల్లలు మంచు ముద్దలు  తీసుకొని బాల్స్ చేసి ఆడుకుంటున్నారు.             ఈ రోజు హిమపాతం లేదు.  వీకెండ్ కాబట్టి రోడ్లు ఖాళీగా ఉన్నాయి. చెట్ల కొమ్మలు తెల్లటి పూత పూసినట్లుగా కొత్త అందాలు ఒలకబోస్తుంటే… వాటిపై పడిన […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-32 (బహామాస్ – భాగం-3) మయామీ నగర సందర్శన-విన్ వుడ్ వాల్స్

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-3 మయామీ నగర సందర్శన – విన్ వుడ్ వాల్స్ మర్నాడు రోజంతా మయామీ నగర సందర్శన చేసాం. హోటలులోనే బ్రేక్ ఫాస్టు కానిచ్చి కాస్త స్థిమితంగా 11 గంటలకు బయలుదేరాం. మయామీ డే టూరులో ఏవేం ఉంటాయో అవన్నీ మేం సొంతంగా తిరుగుతూ చూద్దామని నిర్ణయించుకున్నాం. ముందుగా చూడవలసిన మొదటి ప్రదేశం అని ఉన్న ట్రినిటీ కేథెడ్రల్ చర్చికి వెళ్లాం. అయితే చర్చి మూసి ఉన్నందువల్ల బయట్నుంచే చూసి ఫోటోలు తీసుకుని […]

Continue Reading
Posted On :

అనగనగా- తెలివైన మంత్రి

తెలివైన మంత్రి -ఆదూరి హైమావతి              అనగా అనగా అమరపురి అనే రాజ్యాన్ని  అమరవర్మ అనే రాజు పాలించేవాడు. అతనికి తనరాజ్యాన్ని విస్తరించాలనే ఆశపుట్టింది. యుధ్ధంచేసి పక్క రాజ్యాలను కలుపుకుని తానే  మహారాజు కావాలనీ, చుట్టుపక్కల రాజులంతా తనకు సామంతులుగా ఉండాలనే విపరీతమైన  కోరికతో నిద్రకూడా సరిగా పట్టకుండాపోయింది. ఆశమానవుని సుఖంగా ఉండనివ్వదు .             ఒకరోజున మహామంత్రిని పిలిచి తనకోరిక వివరించి, […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-6

మా అమ్మ విజేత-6 – దామరాజు నాగలక్ష్మి “వీరలక్ష్మి గారూ ఇంట్లోనే ఉన్నారా? సుబ్బారావు బయటికి వెళ్ళాడా… అనుకోకుండా ఇటు వచ్చాను. నా కూతురు సరోజని చూసినట్టుంటుంది. మీ మనవరాలు అమ్మాజీని మా రాజుకి ఇచ్చి చేద్దామనుకున్నాం కదా.. పనిలో పని మంచి రోజు చూసుకుంటే పెళ్ళి పనులు మొదలు పెట్టుకుందాం… నేను ఇవాళ వచ్చినది మంచి రోజు కాదనుకోండి. నాకు అలాంటి నమ్మకాలు లేవు. ముందర పని అవడం కావాలి. సరే పెళ్ళికి అయితే మంచిరోజు […]

Continue Reading

నడక దారిలో(భాగం-15)

నడక దారిలో-15 -శీలా సుభద్రా దేవి నా ఉత్తరం అందగానే ఆఘమేఘాల మీద ఆ వారాంతం వస్తున్నానని రాసారు.          అలాగే అప్పట్లో హైదరాబాద్ నుండి విజయనగరానికి  ఇరవైనాలుగు గంటల రైలుప్రయాణం . ముందురోజు సాయంత్రం రైలు ఎక్కితే మర్నాడు సాయంత్రం ఆరున్నరకి చేరారు.అన్నయ్య స్టేషనుకు వెళ్ళి తీసుకువచ్చాడు.          ఇంటికి వచ్చి స్నానపానాదులు,భోజనం అయ్యేసరికే రాత్రి పడుకునే సమయం అయ్యింది.            మర్నాడు టిఫిన్లు చేసి […]

Continue Reading

రాగో(నవల)-20

రాగో భాగం-20 – సాధన              సుదీర్ఘమైన ఆలోచనలలో కూరుకుపోయినట్టు ఫిలాసఫర్ ఫోజులోనున్న గిరిజ వాలకం చూసి అప్పుడే అక్కడికి చేరుకున్న రుషి ‘బాండేని డోంగలో దాటంగా జడుసుకోలేదు కదా’ అనుకుంటూ అనుమానంగా గిరిజను పలకరించాడు.             “ఏం గిరిజక్కా! డోంగలో ఇబ్బంది కాలేదు కదా! ఇక్కడ ఇంకా నయం. సరికెడ రేవులోనయితే కుండతోనే దాటాలి. అది మాకే భయమేస్తుంది.”     […]

Continue Reading
Posted On :

మళ్ళీ జైలుకు (దొమితిలా చుంగారా-30)

మళ్ళీ జైలుకు రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మేం ప్లాయా వెర్డె దగ్గరికి చేరేసరికి చాల రాత్రయింది. అక్కడే నన్ను అరెస్టు చేశారు. ఒక కెప్టెన్ నా దగ్గరికొచ్చి “చూడమ్మా నీతో నేను తగువుపడదలచుకోలేదు. దయచేసి నువ్విక్కడ దిగి వెనక్కి వెళ్ళిపో! నీకు నార్ బెర్టా డి ఆగిలార్ తెలుసుగదా. గెరిల్లాలతో సంబంధాలున్నాయని ఆమెను అరెస్టు చేశారు. ఆవిడ నీ పేరు చెప్పింది. వాళ్ళు నీ పేరుమీద వారెంట్ తీశారు. నువు కడుపుతో ఉన్నప్పుడు […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

పిల్ల చిలక అబద్ధం (బాలల కథ)

ఏనుగు నిర్ణయం -కందేపి రాణి ప్రసాద్ అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూర్చొని యాచిస్తుంటారు. అలాగే గుడి ముందు ఒక పక్కగా ఉన్న మంటపం దగ్గర ఒక ఏనుగు చిన్న గొలుసుతో కట్టి వేయబడి ఉంటుంది. దానికి పక్కగా ఒక […]

Continue Reading
komala

కాళరాత్రి- 7 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-7 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ప్రవేశ ద్వారం దగ్గర కంపు కొడుతున్న లిక్విడ్‌ బ్యారెల్‌ ఉన్నది. అందరం అందులో మునిగాం. తరువాత వేడినీళ్ళ స్నానం అన్నీ అర్జెంటే. తరువాత బయట ఇంకొంచెం పరుగెత్తించారు. అక్కడ ఇంకొక బ్యారెక్‌ అందులో పొడవాటి బల్లలమీద బట్టల గుట్టలు ఉన్నాయి. మా మీదకు ప్యాంట్లు, షర్టులూ, జాకెట్లు విసిరారు. పెద్దవాళ్ళకు చిన్నసైజు బట్టలు చిన్న వాళ్ళకు పెద్దసైజు బట్టలు దొరకటంతో అవి ధరించి […]

Continue Reading
Posted On :

మిట్టమధ్యాహ్నపు మరణం-6 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 6 – గౌరీ కృపానందన్ మొదట ఆ రక్తపు ధార ఏమిటో ఆమెకి అర్ధం కాలేదు. ఎటువంటి సంశయం లేకుండా తలుపు తట్టింది. లోపల గొళ్ళెం వేసి ఉంటుందని అనుకున్న ఆమెకు తలుపు మీద చెయ్యి పెట్టగానే తెరుచుకోవడంతో లోపలికి అడుగు పెట్టింది. మూర్తి మంచం మీద లేడు. “లేచేసారా బాబ్జీ?” ఇప్పుడు మూర్తి చెయ్యి మాత్రం మంచం పరుపు మీద కనబడింది. మరీ ఇంత కలత నిద్రా? క్రింద పడిపోయింది కూడా […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-15)

బతుకు చిత్రం-15 – రావుల కిరణ్మయి అవ్వా !ముందుగాల్నయితే పోల్లగాండ్లకు పిల్సి బువ్వ వెట్టు. అసలే బళ్ళు సుత లేక ఏడాడుతాన్డ్రో  ఏమో ! సరే..సరే..!నువ్వు కూకో.! నేను బొయి వాళ్ళను దేవులాడుకత్త. అని ముసలమ్మ బయిటికి పోయింది. ఆడీ…ఆడీ..దుమ్ము కొట్టుకుపోయిన మొహాలతో ఉన్న నలుగురు పిల్లలను తీసుకొని వచ్చింది. అవ్వ. వస్తూనే, చూసినావే ..జాజులు ..!వీళ్ళ వాలకం?బురదల బొర్లిన పసువులొతికే. చెడుగుల లెక్క ఏడ వడితె ఆడ ఎగురవట్టిరి. బళ్ళు తెర్సేదాంక పటేలు కాడికి పనికన్న […]

Continue Reading
Posted On :

అనుసృజన-కబీరుదాసు

అనుసృజన-కబీరుదాసు  అనువాదం: ఆర్. శాంతసుందరి ‘రామ్ చరిత్ మానస్ ‘ రాసిన తులసీదాస్ తో సమానమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రాచీన హిందీ కవి కబీర్. కబీరుదాసు అంటే గొప్ప జ్ఞాని అని అర్థం. భక్తి సామ్రాజ్యంలో ఆణిముత్యంలా వెలుగొందిన వారిలో అగ్రగణ్యుడు.ఆయన బెనారస్ లో పుట్టాడు. పుట్టిన తేదీ గురించి ఏకాభిప్రాయం లేదు- పధ్నాలుగో శతాబ్దమని కొందరూ( 1398-1448), పదిహేనో శతాబ్దమని కొందరూ(1440-1518) అంటారు. అలాగే ఆయన ఎప్పుడు చనిపోయాడనే విషయం గురించీ, వివాహం చేసుకున్నాడా లేదా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- జీవనయానం ! …..

చిత్రలిపి జీవనయానం ! -మన్నెం శారద పడుతూనేవున్నాను… అప్పడు నడక రాక..ఇప్పుడు నడవలేక! పడుతూనే వున్నాను … పసివయసులోఎంతదూరం వస్తాడో చందమామ నాతో అని ….పరుగులెత్తి పరుగులెత్తి …బారెడు తోకతోఆకాశమే హద్దుగా రంగులహంగుతోఆటలాడే గాలిపటం కోసం ఆకాశంకేసి చూస్తూ….పడుతూనేవున్నాను …పళ్ళు రాలగొట్టుకుంటూఏ చెట్టునో, పుట్టని ఢీ కొని ! పడుతూనేవున్నాను …నేటికీ నాటికిఅయినవారు గుచ్చిన కంటకాలను తొలగించుకుని కన్నీరు పెడుతూ .. కరడుగట్టిన కఠిన పాషాణ హృదయాల పాచి హృదయాలమీదుగాజారుతూ …పోరుతూ …. పడుతున్నాను పడుతున్నానుపడుతూనే వున్నానుఅయినా నడుస్తూనే వున్నాను ఆనాడు పెద్దల […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 2

వ్యాధితో పోరాటం-2 –కనకదుర్గ కడుపులో భయంకరంగా నొప్పి మళ్ళీ మొదలయ్యింది. గతంలోనుండి బయటపడి నర్స్ బటన్ నొక్కాను. సాయంత్రం 7 అవుతుంది. నర్సులు డ్యూటీలు మారుతున్నట్టున్నారు. కానీ నొప్పి భరించడం కష్టం అయిపోయింది. నర్స్ బటన్ నొక్కుతూనే వున్నాను. నర్స్ మోరా, ” ఐ యామ్ కమింగ్ డియర్, ఐ నో యు మస్ట్ బి ఇన్ పెయిన్,” అని ’డెమొరాల్,’ అనే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తో వచ్చి నడుం దగ్గర ఇచ్చి వెళ్ళింది.  మొదట్లో […]

Continue Reading
Posted On :

విజయవాటిక-7 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-7 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి బౌద్ధారామం. విశాలమైన ఆ ఆరామము పూర్ణ చంద్రుని ఆకారంలో ఉంది. మహాస్థూపము గుండ్రని పెద్ద డోలు ఆకారంలో ఉన్నది. దాని మీద బుద్ధుని పాద ముద్రలు ముద్రించబడి ఉన్నాయి. మరో ప్రక్క బోధిచెట్టు, ధర్మచక్రం ఉన్నాయి. చుట్టూ జాతక కథలు చెక్కబడి ఉన్నాయి. బుద్ధుని జీవిత విశేషాలు, మాయావతి స్వప్నం, తెల్ల ఏనుగు, పద్మము ఇత్యాదివి ఆకర్షణీయంగా రచించి ఉన్నాయి. ఒకప్రక్క బౌద్ధ భిక్షుల విశాంత్రి గుహలు […]

Continue Reading

వ్యాధితో పోరాటం-1

వ్యాధితో పోరాటం-1 –కనకదుర్గ వేపచెట్టు నీడ, గానుగ చెట్టు క్రింద చెక్క మంచం వేసుకుని నానమ్మ పడుకునేది. మేము అంటే, అమ్మలుఅక్క, చిట్టి, నేను, చింటూ తమ్ముడు, ఎదురింటి నేస్తాలు పద్మ, శ్రీను, అను, బుజ్జి అందరం కలిసి వేప కాయలు, వేప పండ్లు కోసుకుని, క్రింద పడినవి ఏరుకొని చిన్న చిన్న అట్ట డబ్బాలపైన పేర్చి కూరల కొట్టు, పళ్ళ కొట్టు పెట్టుకుని ఆడుకునేవారం. ఎంత సేపు ఆడుకున్నా అలసిపోయేవారం కాదు. ఒకోసారి కుర్చీలన్నీ వరసగా […]

Continue Reading
Posted On :

కథా మధురం- జింబో కథ “ఆమె కోరిక”

కథా మధురం   విడాకుల సమస్యకి కొత్త పరిష్కారం సూచించిన  ఓ స్త్రీ కథ  ‘జింబో’ (రాజేందర్) గారి ‘ఆమె కోరిక ‘ !  -ఆర్.దమయంతి ‘ If divorce is like death, then is not the perpetuation of divorce a kind of murder? ‘ ― Anthony Marais డైవోర్స్! వైవాహిక జీవితం లో   సామాన్య స్త్రీల నుంచి సెలెబ్రెటీ వుమెన్ వరకు ఎదుర్కొంటున్న  ప్రధానమైన సమస్యలలో ఇప్పుడు ‘విడాకులు..’  […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-31 (బహామాస్ – భాగం-2)

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-2 అనుకున్నట్టు గానే కనెక్టింగ్ ఫ్లైట్ మిస్సయ్యి పోయింది. అయితే అదృష్టం కొద్దీ మరో రెండు గంటల్లో ఇంకో ఫ్లైట్ ఉండడంతో దానికి టిక్కెట్లు ఇచ్చేరు. అలా ఫ్లైట్ తప్పిపోవడం నిజానికి బానే కలిసొచ్చింది. అట్లాంటా ఎయిర్ పోర్టులో  రాత్రి భోజనం కానిచ్చి కాస్సేపు విశ్రాంతి తీసుకున్నాం. అయితే అక్కణ్ణించి మయామీ  చేరేసరికి అర్థరాత్రి అయిపోయింది. ఎయిర్ పోర్టు నించి కారు రెంట్ కి తీసుకుని హోటల్ లో చెకిన్ అయ్యేసరికి తెల్లారగట్ల […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-19

రాగో భాగం-19 – సాధన  గాండో ముందు నడుస్తున్నాడు. ఆ వెనుక ఫకీర అతని వెనుక గిరిజ, కర్పలు నడుస్తున్నారు. ధీకొండ నుండి మడికొండ చాల దగ్గర, నడుమ బాండే నదే అడ్డం. ఆ ఒడ్డుకు మడికొండ. ఈ ఒడ్డుకు ధీకొండ. కాస్తా పైకి పోతే మధ్యప్రదేశ్ – మహారాష్ట్రల సరిహద్దుగా వస్తుంది బాండే. ఆపై నుండి తిరిగి మళ్ళీ మహారాష్ట్రలోనే పారుతుంది. పాము మెలికలు తిరిగే బాండే యం.పి.లో పుట్టి యం.పి. – మహారాష్ట్ర సరిహద్దులో […]

Continue Reading
Posted On :

అనుసృజన- ధ్రువస్వామిని- 4 (హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన ధ్రువస్వామిని- 4 హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి (శకదుర్గం లోపల ఒక పెద్ద గది.అక్కడ మూడు ఆసనాలు ఉన్నాయి.ఒకదాని మీద ధ్రువస్వామిని కూర్చుంది.ఎడమ కాలు మీద కుడి కాలు వేసుకుని పెదవులమీద వేలు ఉంచుకుని ఏదో విచారంలో మునిగినట్టు కనబడుతోంది.మిగిలిన రెండు ఆసనాలు ఖాళీగా ఉన్నాయి.ఇంతలో బయట కోలాహలం వినిపిస్తుంది) సైనికుడు ః ( ప్రవేశించి ) మహారాణి వారికి జయము !ధ్రువస్వామిని ః ( ఉలిక్కిపడి) ఆఁ?సైనికుడు ః విజయం […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-5

మా అమ్మ విజేత-5 – దామరాజు నాగలక్ష్మి ఇంటికి వచ్చిన సుబ్బారావు “అమ్మా… ఏంచేస్తున్నావు… నీతో కొంచెం మాట్లాడాలి” అన్నాడు. ఒక్కడే వచ్చిన సుబ్బారావుని చూసి “సుబ్బారావ్ అమ్మాజీ ఏది? నాతో ఏం మాట్లాడతావు చెప్పు. ఏమైందసలు” అంటూ గాభరాగా వచ్చి సుబ్బారావు పక్కన మంచమ్మీద కూర్చుంది. “అమ్మా… నువ్వేమీ కంగారు పడకు. ఏమీ జరగలేదు. అమ్మాజీ వాళ్ళ పెద్దమ్మా వాళ్ళింట్లో ఉండి బాగానే ఆడుకుంటోంది. అక్కడే అన్నం తిని వస్తానంది. నేనూ సరే అని వచ్చేశాను.” […]

Continue Reading

పేషంట్ చెప్పే కథలు (అభినందన & ముందుమాట)

కథా మధురం   విడాకుల సమస్యకి కొత్త పరిష్కారం సూచించిన  ఓ స్త్రీ కథ  ‘జింబో’ (రాజేందర్) గారి ‘ఆమె కోరిక ‘ !  -ఆర్.దమయంతి ‘ If divorce is like death, then is not the perpetuation of divorce a kind of murder? ‘ ― Anthony Marais డైవోర్స్! వైవాహిక జీవితం లో   సామాన్య స్త్రీల నుంచి సెలెబ్రెటీ వుమెన్ వరకు ఎదుర్కొంటున్న  ప్రధానమైన సమస్యలలో ఇప్పుడు ‘విడాకులు..’  […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-5 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 5 – గౌరీ కృపానందన్ క్షణం… కాదు కాదు క్షణంలో సగానికి తక్కువ అని కూడా చెప్పవచ్చు. ఆ దృశ్యం ఉమ కళ్ళ ముందు కదలాడింది. ఆ రైలు వేరు. ప్రయాణికులు వేరు. భర్త పక్కన లేడు. ఉమ పుట్టెడు శోకంలో మునిగి పోయి ఉంది. కన్నీరు మున్నీరు గా విలపిస్తోంది. ఛీ.. ఎంత విచిత్రమైన పగటి కల! పగటి కల కాదు. ముందు ముందు జరగబోయే దానికి సూచన! కాదు కాదు […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- ఒక ఉషస్సు కోసం …..

చిత్రలిపి ఒక ఉషస్సు కోసం….. -మన్నెం శారద నిద్రపట్టని ప్రతీ జామూ నేను నీకైపదే పదే నింగి వైపు చూపులు నిగిడిస్తూనే వుంటానుచీకటి ఎంత కఠినమైనది …..!కరుగక దట్టమై పరిహసిస్తుందిఎదురు చూసినంత మాత్రాన ఎలావస్తావు ….భూమికి ఆవల నీపనిలో నీవున్నావో ….లేక దట్టమైన మబ్బుల దుప్పటిలోదాగి కలలే కంటున్నావో ….ఎదురుచూపు లో క్షణాలు సాగి సాగికలవరపెట్టి కనులు మూతపడుతున్నసమయంలో నాకిటికీ పై పడివక్రీభవిస్తున్న ఓ వెలుగు రేఖ !పరవశించి పరుగెత్తుతానా …కొన్నే కొన్ని క్షణాలు మురిపించి దిక్కుమార్చుకుంటావుమరో […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-14

నిష్కల – 14 – శాంతి ప్రబోధ అమ్మా .. షాకింగ్ గా ఉందా .. నాకు తెలుసు.  నువ్వు ఈ ఫోటో చూడగానే విస్తుపోతావని. నేను ఈ రాత్రికి నీ దగ్గరికి వస్తున్నా.  వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం.  అది సారా నుంచి వచ్చిన మెసేజ్ సారాంశం  అసలు చైయో  ఏం చెప్పాలని యోచిస్తున్నది ?  ఏ ఉద్దేశ్యంతో  ఈ ఫోటో నాకు పంపి ఉంటుంది? చిన్నప్పటి  నుండి  చాలా పద్దతిగా పెంచాను.  కుటుంబ విలువలకు ప్రాముఖ్యం ఇస్తూనే పెంచాను. కాకపోతే  కళ్ళముందు లేని తండ్రి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-14)

బతుకు చిత్రం-14 – రావుల కిరణ్మయి నా పదమూడేళ్ళ వయసులోనే నన్ను పొరుగూరి కామందు,ఇంకొంతమంది పెద్దమనుషులు అందరూ కలిసి నన్నుదేవుడికి ఇచ్చి పెళ్ళి చేసి  దేవాలయ ప్రాంగణం లో శుభ్రం చేస్తుండే జోగిని గా మార్చి నా బతుకును బుగ్గిపాలు చేయాలని అనుకన్నప్పుడు అన్నలు వద్దనక పోగా అప్పుడు కూడా వారు ఇవ్వ జూపిన ఇళ్ళ స్థలం,పొలం పుట్ర కోసం ఆశపడి నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు.అప్పుడు కూడా కట్నకానుకలు తప్పుతాయని అందరి జీవితాలు బాగుంటాయని ఆ రోజు […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

ఏనుగు నిర్ణయం (బాలల కథ)

ఏనుగు నిర్ణయం -కందేపి రాణి ప్రసాద్ అదొక దేవాలయం ఆ దేవాలయం ఎప్పుడూ భక్తుల రాకపోకలతో కిటకిటలాడు తూ ఉంటుంది. ఆలయం ముందు పూలు, పళ్ళు, కొబ్బరి కాయలు అమ్మే వాళ్ళు తమ బండ్లను పెట్టుకొని వ్యాపారం చేస్తుంటారు. అడుక్కునే బిచ్చగాల్లంత ఆలయ ప్రధాన ద్వారానికి రెండు వైపులా కూర్చొని యాచిస్తుంటారు. అలాగే గుడి ముందు ఒక పక్కగా ఉన్న మంటపం దగ్గర ఒక ఏనుగు చిన్న గొలుసుతో కట్టి వేయబడి ఉంటుంది. దానికి పక్కగా ఒక […]

Continue Reading

విజయవాటిక-6 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-6 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపాల నగరం. విశాలమైన రాజప్రసాదంలో దివ్యమైన మందిరం. అది రాజమాత వాకాటక మహాదేవి పూజా మందిరం. ఎనుబది రెండు సంవత్సరాల రాజమాత ప్రతిదినం దీర్ఘకాలం ఈశ్వర ధ్యానంలో ఉంటుంది. అందమైన శిల్పాలతో, ఈశ్వరుని దివ్య లీలలను చూపుతూ అలంకరించిన పూజాగృహమది. బంగారు దీపపు కాంతులలో మహాదేవుడు లింగాకారంగా ప్రతిష్ఠించబడి ఉన్నాడు. మరో ప్రక్కన శ్రీచక్ర సహిత రాజరాజేశ్వరి కొలువై ఉన్నది. దేవదేవుని ముందర, అమ్మవారి ముందర నేతి దీపాలు […]

Continue Reading

అనగనగా-దానం

 దానం -ఆదూరి హైమావతి  అనగా అనగా ముంగమూరులోని ప్రభుత్వపాఠశాలలో ఏడోతరగతి చదువు తున్నది ఊర్మిళ. ఊర్మిళ తండ్రికి ఆఊర్లో చాలా మామిడి ఇతర పండ్ల తోటలూ ఉన్నాయి. వాళ్ళ సైన్స్ పంతులుగారు పిల్లలను వృక్షా ల గురించిన పాఠం బోధిం చే ప్పుడు తోటల్లోకీ ,పంటపొలా ల్లోకీ తీసుకెళ్ళి చూపిస్తూ వివరంగా బోధించేవారు.   ఆరోజున మామిడి చెట్టు, పండులోని విటమిన్లూ, వ్యాపార పంటగా ఎలా మామిడి పెంచుకుంటారో వివరంగా  చెప్పాలని   ఊర్మిళ తండ్రి గారి అనుమతితో […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 11

చాతకపక్షులు  (భాగం-11) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి కాలేజీలో ఎలక్షన్ల జ్వరం మొదలయింది. కాలేజీ ఆవరణ దాటి ఇంటింటికీ పాకిపోయింది. గీతకి శ్యాం ఇచ్చిన ఉపన్యాసాలతోపాటు, తోటి విద్యార్థులమూలంగా కూడా చాలా సంగతులు తెలుస్తున్నాయి. కమ్మవారమ్మాయి రెడ్డివారి చిన్నదానితో పోటీ చేస్తే కమ్మవారంతా ఓపార్టీ. నాయుళ్లు రెడ్లతో కలుస్తారు. బ్రాహ్మలు నాయుళ్లతో కలుస్తారు కానీ కమ్మవారికి మద్దతు ఇవ్వరు. ఎంచేత అని గీత అడిగతే మరేదో కారణం చెప్పేరు. కలవారి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-14)

నడక దారిలో-14 -శీలా సుభద్రా దేవి  జూన్ నెల 1970 లో ఒకరోజు మాచిన్నన్నయ్య కొత్తగా విడుదల అయిన స్వాతి మాసపత్రిక ప్రారంభ సంచిక తీసుకు వచ్చాడు.అంతకు ముందు జ్యోతి,యువ మాసపత్రిక  మాదిరిగా అదే సైజు లో అందమైన బాపు ముఖచిత్రంతో ఆకర్షణీయంగా ఉంది. తర్వాత ఆ చిత్రాన్నే స్వాతి లోగో లా వాడుతున్నారు.అందులో అప్పట్లోని సాహితీ ప్రముఖులరచనలతో సాహిత్యం పట్ల ఇష్టం ఉన్న వారికి ఆనందం కలిగించి హృదయానికి హత్తుకోవాలనిపించే రచనలు ఉన్నాయి.      కుమారీ వాళ్ళఅన్నయ్య  […]

Continue Reading

నా జీవన యానంలో (రెండవ భాగం) -15

నా జీవన యానంలో- రెండవభాగం- 15 -కె.వరలక్ష్మి     ఆ అద్భుత మేమిటంటే నేను పంపిన మొదటి కథ ‘రిక్షా’  జ్యోతి  మంత్లీ లో 1985 జూన్ సంచిక లో వచ్చింది. అంతకు ముందంతా ఏవో చిన్న వ్యాసాలూ, కవితలూ, జోక్స్ లాంటివి వస్తూ ఉన్నా, చిన్నప్పటి స్కూల్ డేస్ తర్వాత వచ్చిన కథ. ఈ కథ నాకొక ధైర్యాన్ని ఇచ్చి రాసేందుకు ప్రోత్సహించింది. ఆ ఉత్సాహంతో రాసిన ‘ప్రశాంతి’ కలువబాల పత్రిక నవలికల పోటీ […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-29)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  బడిలో చదువుతుండిన నా రెండవ కూతురు ఫాబియెలా , సైగ్లో -20 లోనే ఉండి పోయింది. తల్లిదండ్రులు “రాక్షసులైనా” సరే, పిల్లలకు చదువు నిరాకరించొద్దని ఒక ఉపాధ్యాయురాలు అంది. తాను ఏ వివక్షత చూపకుండా పిల్లలకు చదువు చెప్తానని ప్రతిజ్ఞ తీసుకున్నానని, అందువల్లనే యాజమాన్యపు ఉత్తర్వును పాటించనని ఆవిడంది. “నీ పాప నొదిలేసి వెళ్ళడానికి మీ వాళ్లెవరూ లేకపోతే, నా దగ్గర వదిలేసి వెళ్ళు. నా […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 6 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-6 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల అయితే మేము మంటల్లోకి పోతున్నామన్నమాట. కొద్ది ఎడంగా పెద్దవాళ్ళను కాల్చే గుంట ` అందులో మంటలు. నాకు అనుమానం వచ్చింది. నేనింకా బ్రతికే ఉన్నానా? అని. పెద్ద, చిన్న, ఆడ, మగ అందర్నీ అలా కాల్చి చంపుతుంటే ప్రపంచం నిశ్శబ్దంగా ఎలా ఉండగలుగుతున్నది? ఇది నిజం కాదేమొ!  పీడకల అయి ఉండాలి నాది. ఒక్క ఉదుటున మేల్కొంటాను భయంతో చెమటలు కక్కుతున్నాను. తీరా […]

Continue Reading
Posted On :

విజయవాటిక-5 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-5 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మరుసటి రోజు రాజప్రసాదంలోని మరొక అత్యంత కీలకమైన సమావేశంలో పాల్గొన్నారు మహాదేవవర్మ, శ్రీకరులు. మంత్రులకు ఈ రాచకార్యం గురించి ఆలోచించి, తగు విధంగా కళింగులతో కార్యము నడపని మహారాజు ఆజ్ఞాపించాడు. “కారా! నీవు మరింత జాగ్రత్త వహించు. రాజధాని విజయవాటికలోనైనా, అమరావతిలోనైనా  మనకు తెలియనిదే గాలి కూడా చొరకూడదు…” అన్నారు మహారాజు. “తమ ఆజ్ఞ మహారాజా!!” చెప్పాడు శ్రీకరుడు. తదనంతరం మహాదేవుడు పరివారంతో అమరావతి వచ్చేశాడు. శ్రీకరుడు మాత్రం […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా-28)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  మర్నాటి ఉదయానికల్లా నా ఇంటి తలుపు మీద ఒక నోటీస్ ఉంది. ‘ఇరవై నాలుగు గంటల లోపల నేను ఆ జిల్లా వదిలేసి వెళ్లిపోవాలి’. అదే చివరి హెచ్చరిక అని కూడ దాంట్లో రాసి ఉంది. దాని మీద కంపెనీ మేనేజరూ, ఇద్దరు మిలిటరీ అధికారులూ సంతకాలు చేశారు. భర్తలు జైల్లో ఉన్న స్త్రీలందరికీ ఇలాంటి నోటీసులొచ్చాయి. అంతేగాక బడికి కూడ కం పెనీ ఒక […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-18

రాగో భాగం-18 – సాధన  ఊళ్ళో సైతం జంగ్లాత్ వారికి అడిగింది సమర్పించుకొని కాళ్ళు, కడుపులు పట్టుకొని వారి దయా దాక్షిణ్యాలపైన బతికేవారు. దొడ్డికెళ్ళి ఆకు తెంపుకున్నా జంగలోడు (గార్డు) చూస్తే ఎంత గుర్రు గుర్రంటడోనన్న భయంతోనే వెన్నులో జ్వరం పుట్టేది. కూలి నాలి ఇచ్చినంతే తీసుకోవాలి. చెప్పినంత చేయాలి. ఊళ్ళో ఉద్యోగస్తులకు, పై నుండి వచ్చే అధికారులకు నచ్చేవన్నీ ఊరివాళ్ళంతా ఇచ్చుకోవలసిందే – కల్లు దించినా భయమే. ఇప్పపూలు ఇంట్లో ఉన్నా ఇబ్బందే. పట్టాలేని తుపాకులు […]

Continue Reading
Posted On :

కథా మధురం- సయ్యద్ సలీం

కథా మధురం   సయ్యద్ సలీం ‘ యంత్రం లాంటి ఓ ఇల్లాలి గుండె చప్పుడు వినిపించిన కథ.. ‘ -ఆర్.దమయంతి సూర్యుడు లేకపోయినా పగలు గడుస్తుంది కానీ, ఇల్లాలు పడుకుంటే ఒక్క క్షణం కూడా ఇల్లు నడవదు. ఇది జగమెరిగిన సత్యం. ప్రతి స్త్రీ అనుభవించి మరీ తెలుసుకునే జీవన సత్యం.  వివాహమైన క్షణం నించి..చివరి శ్వాస దాక ఎడతెరిపిలేని కుటుంబ బరువు బాధ్యతల ను మోసేది ఇల్లలే.   చాలా మంది మగాళ్ళు అంటుంటే వింటాను. ‘ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

రాళ్ళల్లో, ఇసుకల్లో

రాళ్ళల్లో, ఇసుకల్లో -కందేపి రాణి ప్రసాద్ శని, ఆదివారాలు శెలవులు వచ్చాయని పోయిన వారం ఏదైనా టూరు వెళదామన్నారు పిల్లలు. ఎక్కువ రోజుల వ్యవధి లేదు కాబట్టి దగ్గరగా వెళదామనుకున్నాం. ఈ మధ్య మద్రాసు చూడక చాలా రోజులయ్యింది. అంటే అసలు చూడక అని కాదు. S R M C లో జరిగే కన్ప్హరెన్స్ లు అటెండ్ అవుతూనే ఉన్నాం. సైట్ సీయింగ్ ప్రదేశాలు చూడట్లేదన్నమాట. అలా గతవారం లో చెన్నై వెళ్ళాము. ఫ్లైట్ దిగగానే […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-4 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 4 – గౌరీ కృపానందన్ అమ్మ, నాన్న, మణి మామయ్య, పక్కింటి రామ్ అంకుల్ అందరూ వీళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు. “ఊరికి వెళ్ళే వాళ్ళ కన్నా వీడ్కోలు చెప్పడానికి మేము ముందుగా వచ్చేసినట్లున్నాం.” మణి చేతిలో సూట్ కేస్ కనబడింది. అమ్మ ప్రయాణంలో తినడానికి చక్కిలాలు, చేగోడీలు అన్నీ పాక్ చేసి తీసుకుని వచ్చింది. “పెళ్లి హడావిడిలో నీ భర్తను నాకు సరిగ్గా పరచయం చెయ్యనే లేదు ఉమా” అన్నాడు […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -14

నా జీవన యానంలో- రెండవభాగం- 14 -కె.వరలక్ష్మి 16-12-84 న సామర్లకోటలో మెయిల్ ఎక్కాను. విజయవాడ లో అందరితో బాటు రిజర్వేషన్ కంపార్ట్ మెంట్ లోకి మారాను. మోహన్ విజయవాడ వరకు  వచ్చి నన్ను వారికి అప్పగించి వెళ్ళాడు.  ఉదయం పది గంటలకు మద్రాసు లో దిగాం. మేం ఎక్కాల్సిన ట్రైన్ రాత్రి 7.20 కి.  స్టేషన్ దగ్గర్లో చిన్న లాడ్జి లో రూమ్స్ తీసుకున్నారు.  మా ముగ్గురికి ఒకటి, వాళ్ళ అందరికీ ఒకటి.  ఫ్రెష్ అయి […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 10

చాతకపక్షులు  (భాగం-10) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి పరమేశంగారు శివరావుని పక్కకి పిలిచి, “నీ ఋణం ఈజన్మలో తీర్చుకోలేనురా” అన్నారు పైపంచెతో కళ్లు ఒత్తుకుంటూ. “ఛా, అవేం మాటలు పరం, గీత నీకొకటీ నాకొకటీనా?” అన్నారు శివం అప్యాయంగా పరమేశంగారి భుజంమీద చెయ్యేసి. పరమేశంగారు గీతదగ్గరకి వచ్చి బుద్ధిగా చదువుకోమనీ, ఏం కావాలిసినా శివం మామయ్యనో, కనకమ్మత్తయ్యనో అడగమనీ, మొహమాట పడవద్దనీ పదే పదే చెప్పేరు. శివరావు తండ్రిలాటివాడనీ, కనకమ్మ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-30 (బహామాస్ – భాగం-1)

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-1 అమెరికా తూర్పు తీరానికి దగ్గర్లో ఉన్న బహామా దీవుల్ని చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ ఉన్నాం. బహామా దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భాగం కానప్పటికీ ఇక్కడి వర్క్  వీసాతో చూడగలిగిన ప్రదేశం.  మేమున్న కాలిఫోర్నియా నుంచి బహామా దీవుల్ని  సందర్శించాలంటే ఫ్లోరిడా రాష్ట్రం వరకు ఫ్లైట్ లో వెళ్లి అక్కణ్ణించి క్రూజ్ లో గానీ, ఫ్లైట్ లో గానీ వెళ్లొచ్చు. ముందు మేం పశ్చిమ తీరంలో ఒకట్రెండు సార్లు క్రూజ్ లకి […]

Continue Reading
Posted On :

నిష్కల (నవల) భాగం-13

నిష్కల – 13 – శాంతి ప్రబోధ తల్లి అడుగుల సవ్వడి గుర్తించిందేమో బిడ్డ ఏడుపు అంతకంతకు పెరిగిపోతున్నది.  గుక్కపెట్టిన బిడ్డను చేతుల్లోకి తీసుకొని గుండెకు అదుముకున్నది కావేరి. అప్పుడు  చూసిందామె.  బిడ్డ చెవి దగ్గర వెచ్చగా తగలడంతో కంగారుగా చూసింది. బిడ్డ చెవి పక్క నుంచి ఎర్రటి చుక్కలు  మొదట అదేంటో అర్ధం కాలేదు కావేరికి . ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది.  కాళ్ళు చేతులు ఆడడం లేదు.  గొంతు పెగలడం లేదు.  ఒళ్ళంతా చెమటలు […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

చిన్నూ – ఉడుత (బాలల కథ)

చిన్నూ – ఉడుత -కందేపి రాణి ప్రసాద్ అదొక మూడంతస్తుల మేడ. మూడో అంతస్తు వేరే గానీ అక్కడొక రేకుల షెడ్డు మాత్రమే ఉంటుంది. అందులో వాళ్ళ పాత సామాన్లు పెట్టుకునేవారు. ఈ మధ్యనే వాచ్ మెన్ కుటుంబానికి ఇచ్చారు. వాచ్ మెన్ కు ఇద్దరు పిల్లలున్నారు చిన్నవాళ్ళు. ఏడేళ్ళ కొడుకు నేలుగేళ్ళ కూతురు ఉన్నారు.ఆ చిన్న రేకుల షెడ్డు తప్పించి మిగతా అంతా ఖాళీనే. పిల్లలిద్దరూ ఆ ఖాళి ప్రదేశమంతా చక్కగా ఆడుకుంటున్నారు. కింద నుంచీ […]

Continue Reading

బతుకు చిత్రం నవల (భాగం-13)

బతుకు చిత్రం-13 – రావుల కిరణ్మయి చాట్లో బియ్యం పోసుకొని చెరుగుతున్న జాజులమ్మ దగ్గరికి ముత్యం భార్య వచ్చి .. నువ్వుండు ,నేను చెరిగి వంట పని కానిస్తగని , నాయన ఏమన్న ఎంగిలిపడి పోయిండా?లేకుంటే ఖాళీ కడుపుతోని పోయిండా ?అసలే పెద్దవయసాయే గాబరా గాబరా గాదు …!అని ఎంతో ప్రేమ ,గౌరవం ఉన్నట్టు ప్రేమ కురిపించుకుంట అడిగింది. జాజులమ్మ కు ఒకింత ఆశ్చర్యం కలుగుతుండగా , లే …ఒదినే ..!అట్టి కడుపుతోని నేనెట్ల కాలు బయట […]

Continue Reading
Posted On :

అనుసృజన- ధ్రువస్వామిని- 3 (హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన ధ్రువస్వామిని- 3 హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి (ఒక దుర్గం లోపల బంగారపు నగిషీలు చెక్కిన స్తంభాలతో ఒక లోగిలి.  మధ్యలో చిన్న చిన్న మెట్లు. దాని కెదురుగా కశ్మీరీ పద్ధతిలో చెక్కిన అందమైన చెక్క సింహాసనం. మధ్యనున్న రెండు స్తంభాలూ పైదాకా లేవు.వాటికి రెండువైపులా పెద్ద పెద్ద చిత్రాలున్నాయి.టిబెట్ కి చెందిన పట్టు తెరలు వేలాడుతున్నాయి.ఎదురుగా చిన్న ఆవరణ ఉంది. దానికి రెండువైపులా నాలుగైదు మొక్కల పాదులు , […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి- 5 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-5 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల చెకోస్లోవేకియా భూభాగం వద్ద కస్‌చా అనే ఊరిలో బండి ఆగింది. అప్పటికి గానీ మాకు హంగరీలో ఉండబోవటం లేదనేది తెలిసి వచ్చింది. ఒక జర్మన్‌ ఆఫీసరు ఒక హంగరీ ఆఫీసర్ని వెంటబెట్టుకుని తలుపు తెరచి లోనికి వచ్చాడు. హంగరీ ఆఫీసరు అతను చెప్పేది అనువదించి మాకు చెపుతున్నాడు. ఈ క్షణం నుండి మీరు జర్మన్‌ ఆర్మీ ఆధీనంలో ఉంటారు. మీ దగ్గర బంగారం, […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- గుండెనీరయిన కథ !

చిత్రలిపి గుండెనీరయిన కథ ! -మన్నెం శారద అప్పుడసలు గుండె ఒకటుంటుంది తెలియనే తెలియదు బోసినవ్వుల అమాయకత్వం నుండి ఆటపాటల అల్లరిదాకా ‘చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తిండి గోలేతప్ప  గుండె గో;ల  తెలియదు గాక  తెలియదు  దశలుమారి ,దిశలు తిరిగి వయసు భుజాలపై  రంగు రంగు  రెక్కలు మొలిచి లోకమొక నందనవనంగా కనులకు భ్రాంతి గొలిపి ……..పిదప గుండెజాడ తెలిపింది  ఎర్రని వర్ణపు మధువులు ఒడలంతా వంకరలు పోతూ గిరగిరా తిరిగి  హృదయాన్ని మోహపరచి  మైమరపిస్తున్న వేళ ఒక ధ్యేయం లేక  పువ్వు పువ్వు చుట్టూ తిరుగుతూ  జుంటితేనెలు గ్రోలి మత్తుగా గమ్మత్తుగా గాలిలో పల్టీలు కొడుతున్న  నా రంగుల  రెక్కల్ని ఎక్కడివో మాయదారి ముళ్ళు అతి రక్కసము గా చీల్చి నా రక్తాన్ని […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-13)

నడక దారిలో-12 -శీలా సుభద్రా దేవి నేను పీయూసి చదువుతున్న రోజుల్లోనే ఒక రోజు అకస్మాత్తుగా  మా చిన్నక్కని హాస్పిటల్ లో చేర్పించినట్లు కబురు వచ్చి అమ్మ కంగారుపడి హడావుడి గా వెళ్ళింది.అందరం  ఏమైందో నని గాభరా పడ్డాం.తీరా అమ్మ బొజ్జలో హాయిగా బజ్జోకుండా తొందరపడి రెండునెలలు ముందుగానే ప్రపంచాన్ని చూసేయాలని బుజ్జిబాబు బయటకు వచ్చేసాడని తెలిసింది.ఐతే మరికొంత కాలం డాక్టర్లు పర్యవేక్షణలోనే ఉంచి డిశ్చార్జి చేసాక కోరుకొండ సైనిక స్కూల్ లోని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోయారు.అమ్మ […]

Continue Reading

యాత్రాగీతం-29 (అలాస్కా-చివరి భాగం)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత చివరి భాగం కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ (Kenai Fjords National Park Cruise) ప్రయాణాన్ని ముగించుకుని,   ఎన్నో అందమైన ఆ దృశ్యాలు  మనస్సుల్లో దాచుకుని సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో తిరిగి సీవార్డ్ తీరానికి చేరుకున్నాం. క్రూజ్  దిగిన చోటి నుంచి మళ్ళీ మాకు నిర్దేశించిన షటిల్ లో పదినిమిషాల వ్యవధిలో రైలు స్టేషనుకి చేరుకున్నాం. అప్పటికే  గోల్డ్ స్టార్ డూమ్ రైలు మా కోసం […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) -13

నా జీవన యానంలో- రెండవభాగం- 13 -కె.వరలక్ష్మి 1982 ఫిబ్రవరిలో అంజయ్యగారు ముఖ్యమంత్రి పదవి నుండి తొలగించబడి భవనం వెంకట్రామిరెడ్డి ముఖ్యమంత్రిగా నియామకం జరిగింది. ఇందిరాగాంధీని విపరీతంగా అభిమానించే దాన్ని. ఒక స్త్రీగా ఆమె కార్యదక్షత నాకు ఆశ్చర్యం కలిగించేది. కాని, ఇలా ముఖ్యమంత్రుల్ని దించెయ్యడం వల్ల ఆంధ్రాలో ఆమె ప్రభుత్వానికి ఏమైనా అవుతుందేమో అని భయంవేసేది. 1982 లోనే అని గుర్తు. రష్యన్ భాష నుంచి తెలుగులోకి అనువదించిన ఓల్గా కథ మూడు తరాలు ఆంధ్రజ్యోతి […]

Continue Reading
Posted On :

బతుకు చిత్రం నవల (భాగం-12)

బతుకు చిత్రం-12 – రావుల కిరణ్మయి పైసలు మనమిత్తే ఈయనా మీ వదినే ఇద్దరు పోయి చూసేటోళ్ళకు అబ్బా ..!ఎంత బాధ్యతెమ్బడి వచ్చిండు చెల్లెపెల్లిచెయ్యాల్నని ,అని ఊరంత అనుకొని నిన్ను మీ తమ్మున్ని ఆడివోసుకోను ఉపాయం జేత్తాండు.అని అంటుండగా , ఎహే ..!ఆపు నీ సోది ..!మా అన్న గంత యావ గల్లోడైతే, రమ్మని మమ్ములనెందుకు పిలుత్తడు.డైరెక్టుగ చార్జీలియ్యుండ్రి.అనేటోడు గదా!పచ్చకామెర్లోనికి లోకమంతా పచ్చగనే కనవడ్డట్టు ఆళ్ళను గురించి నువ్వు ఎట్లనుకుంటే అట్నే కనవడుతది.ఆయన కాదా పైసలు లేకనే […]

Continue Reading
Posted On :

రాగో(నవల)-17

రాగో భాగం-17 – సాధన  ప్రభుత్వం లొంగివచ్చి ప్రజల డిమాండ్ మేరకు షేకడా ఇరవై రూపాయలు ఇవ్వడంతో ఊర్లో అందరూ తునికి ఆకులు కోశారంటూ, ఊరూరికి కళ్ళం కావాలని రెండేళ్ళుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నా, ప్రభుత్వం మొండిగా నిరాకరిస్తున్నందుకు బుద్ది చెప్పడంలో భాగంగా ఫారెస్టు వారి కలప, కళ్ళాలు ధ్వంసం చేసిన వరకు డోలు ఉత్సాహంగా చెప్పాడు. పోలీసులతో దాగుడుమూతల వ్యవహారంగా సాగిన కళ్ళాల కాల్చివేత చెబుతుంటే, అందరి ముఖాల్లో తామెంతో గొప్ప పని చేశామన్న ఫీలింగ్ […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- “ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని !

చిత్రలిపి ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని ! -మన్నెం శారద ఒకానొక  కాఠిన్యపు  కిరణస్పర్శకు తాళలేక  తల్లడిల్లి ..కరిగి నీరయి న మంచు శిఖరం  ఒకటి ఏరయి సెలయేరయి వాగయి ,వంకయి శాపవిమోచనమొందిన  గౌతమిలా తన ప్రియ సాగర సమాగం కోసం   మహానదిగా మారి  దక్షిణ దిశకు  పరుగులు తీసింది ! పట్టలేని  పరవశం అది ! ఎన్నో ఏళ్ల కల సఫలం  కాబోతున్న సంతోషం అది !  ఆపుకోలేని  ఆనందం తో   గిరులని తరులని ఒరుసుకుంటూ వురుకుతున్న  నదిని  చూసి ఆ చెట్టు అడిగింది ‘ఎక్కడకి  మిత్రమా …అంత వేగం ?దేనికోసం ఆ దుందుడుకు ?”అని పరిహాసంగా . నది ఒకింత […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

బద్ధకం (బాలల కథ)

బద్ధకం -కందేపి రాణి ప్రసాద్ ఓ మర్రిచెట్టు మీద కాకి జంట గూడు కట్టుకున్నది.అందులో పిల్లల్ని పెట్టుకొని కాపురం ఉంటున్నది.రోజు ఎక్కడెక్కడికో వెళ్లి ఆహారం సంపాదించుకొని వచ్చేది.తల్లి వచ్చేదాకా పిల్లలు నోరు తెరుచుకొని చూస్తూ ఉండేవి. ఎప్పుడెప్పుడు తల్లి ఆహారం తెస్తుందా! తిందాం అని ఎదురుచుస్తూండేవి.కాకి తన పిల్లల కోసం ఎంత దూరమైనా ఎగురుకుంటూ వెళ్ళేది. రెక్కలు నొప్పి వచ్చిన పిల్లల కోసం భరించేది.పిల్లలంటే ఎంతో ప్రేమ దానికి చాలా గరభంగా చూసుకునేది.ఎండు పుల్లలతో గూడు కట్టినా […]

Continue Reading

అనగనగా- చిన్న-పెద్ద (బాలల కథ)

చిన్న- పెద్ద -ఆదూరి హైమావతి  అనగనగా ఒక అడవిలో చీమనుండి ఏనుగు వరకూ, దోమ నుండీ డేగవరకూ అన్నీ కలసి మెలసి జీవిస్తూ ఉండేవి. ఎవరూ ఎవ్వరికీ కష్టంకానీ, అపకారం కానీ తలపెట్టేవి కావు. చేతనైతే సాయం చేసేవి. ఒకరోజున ఆ అడవికి ఏనుడు గజన్న స్నేహితుడుదంతన్న,చెలికాడిని చూడాలని వచ్చాడు . గజన్న మిత్రునికి మంచి విందుచేశాడు.  ఇద్దరూ ఒక మఱ్ఱి చెట్టు క్రింద విశ్రాంతిగా కూర్చుని చిన్న నాటి కబుర్లు చెప్పుకుంటున్నారు. మఱ్ఱి చెట్టు మానువద్ద  […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-12)

నడక దారిలో-12 -శీలా సుభద్రా దేవి నేను పీయూసి చదువుతున్న రోజుల్లోనే ఒక రోజు అకస్మాత్తుగా  మా చిన్నక్కని హాస్పిటల్ లో చేర్పించినట్లు కబురు వచ్చి అమ్మ కంగారుపడి హడావుడి గా వెళ్ళింది.అందరం  ఏమైందో నని గాభరా పడ్డాం.తీరా అమ్మ బొజ్జలో హాయిగా బజ్జోకుండా తొందరపడి రెండునెలలు ముందుగానే ప్రపంచాన్ని చూసేయాలని బుజ్జిబాబు బయటకు వచ్చేసాడని తెలిసింది.ఐతే మరికొంత కాలం డాక్టర్లు పర్యవేక్షణలోనే ఉంచి డిశ్చార్జి చేసాక కోరుకొండ సైనిక స్కూల్ లోని వాళ్ళింటికి తీసుకు వెళ్ళిపోయారు.అమ్మ […]

Continue Reading

నిష్కల (నవల) భాగం-12

నిష్కల – 12 – శాంతి ప్రబోధ ఆశ్చర్యంతో పెద్దవైన కళ్ళు ,  ముడుచుకున్న కనుబొమ్మలు అచ్చం నాన్నమ్మ లాగే .. ఒక వేళ .. ఆమె .. ఏదో సందేహం మొదలై తొలచి వేస్తున్నది నిష్కల ను. ఆ సందేహాన్ని బయటికి తోసివేయలేక పోతున్నది. సారా కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూస్తూ ” అవును, నేను చెబుతున్నది నిజమే సారా జి.సి.జలాల . నా పేరు నిష్కల జె . జె ఫర్ జలాల ”  […]

Continue Reading
Posted On :

విజయవాటిక-4 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-4 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ దేవాలయంలో పూజాదులు పూర్తి చేసుకొని అర్చకస్వామి ఇచ్చిన తీర్థప్రసాదాలు స్వీకరించి దేవాలయం బయటకు వచ్చాడు శ్రీకరుడు. అతని మనసులో మల్లిక తలపులు చుట్టుముడుతుండగా, ఆమెను నదీ తీరంలో కలవాలని చాలా తొందరగా ఉంది. దేవాలయ ప్రాంగణంలో అతని కోసము ఒక వార్తాహరుడు ఎదురుచూస్తున్నాడు. దేవాలయ మండపం బయటకు వచ్చిన శ్రీకరుని ముందుకు వచ్చి వినయంగా నమస్కరించాడతను. “ప్రభూ! మహాదేవవర్మ ప్రభువులు తమను తక్షణము, ఉన్నపళంగా రమ్మనమని సెలవిచ్చారు!” అన్నాడతను. […]

Continue Reading

మిట్టమధ్యాహ్నపు మరణం-3 (సీరియల్) (సుజాత (రంగరాజన్) తమిళ నవలకు తెలుగు సేత)

మిట్ట మధ్యాహ్నపు మరణం- 3 – గౌరీ కృపానందన్ “త్వరగా ఓ మనవడిని కని ఇవ్వు. అడ్డ దిడ్డమైన మాత్రలు మందులు మింగకు. అచ్చు మహాలక్ష్మి లాగా ఉన్నావు. చూడు మీనాక్షీ! నీ కోడలు మన మాలతిలాగానే ఉంది. త్వరలోనే ఇంటివాళ్ళతో కలిసి మెలిసి పోతుంది. చూస్తూనే ఉండు.” “అంతా ఆ ఏడుకొండల వాడి దయ. నువ్వు కాఫీ తీసుకో ఉమా! మూర్తిని లేపి కాఫీ కలిపి ఇవ్వు. రైలుకు బయలుదేరి వెళ్ళాలి మరి.” “ఆయన రోజూ […]

Continue Reading
Posted On :

అనుసృజన- ధ్రువస్వామిని- 2 (హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన ధ్రువస్వామిని- 2 హిందీ మూలం: జయశంకర్ ప్రసాద్ అనువాదం: ఆర్. శాంత సుందరి కాపలా స్త్రీ ః జయము జయము మహారాజా ! ఒక ఆందోళనకరమైన వార్త  తమకు అందించమని అమాత్యులు నన్ను పంపించారు. రామగుప్త్ ః (విసుగ్గా) ఇలా  ఆందోళనతోనే  నేను చనిపోవాల్సి  వస్తుందేమో !   ఉండు..( ఖడ్గధారిణి తో) ఆఁ, నువ్వు నీ పని చక్కగా చేశావు,కానీ ఆమె ఇంకా చంద్రగుప్తుణ్ణి ప్రేమిస్తోందో లేదో నాకు తెలియనే లేదు. (ఖడ్గధారిణి కాపలా […]

Continue Reading
Posted On :

మా అమ్మ విజేత-4

మా అమ్మ విజేత-4 – దామరాజు నాగలక్ష్మి అమ్మాజీకి తన పెద్దమ్మ పిల్లలతో ఆడుకోవాలని వుండేది. స్కూలుకి వెళ్ళి చదువుకోవాలని వుండేది.  వర్ధని, ఇందిర చెల్లెళ్ళు ఇద్దరూ స్కూలుకి పుస్తపట్టుకుని వెడుతూ… తమవంక అలాగే చూస్తున్న అమ్మాజీతో కాసేపు మాట్లాడి వెళ్ళిపోయేవారు. దిగాలుగా కూచున్న అమ్మాజీని సరోజ వచ్చి “పెద్దదానివవుతున్నావు రోడ్డు మీద ఏంచేస్తున్నావు? సరోజ ఏడుస్తోంది వచ్చి ఆడించు” అని లోపలికి లాక్కుని వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళి చూసేసరికి సుశీల బట్టలన్నీ తడుపుకుని పాడుచేసుకుంది.  అస్సలు […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా-27)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  నేను ఒరురో నుంచి చాల . ఆందోళనతో భయసందేహాలతోనే బయల్దేరాను. వాళ్ళ మాటలమీద కొంచెం అనుమానం వేసిందిగాని లాలాగువా – సైగ్లో-20 వైపు అడుగులు పడుతోంటే మాత్రం గుండె పీచుపీచుమనడం మొదలైంది. నేనక్కడికి సాయంత్రం ఏడింటికి చేరాను. అప్పుడు సన్నగా మంచు కురుస్తోంది. బితుకుబితుకు మంటూనే బస్ దిగాను. కొన్ని అడుగులు వేసి ఊరిని తేరిపార జూశాను. ఊరు ప్రశాంతంగా కనిపించింది. జనం మామూలుగానే మాట్లాడుకుంటున్నారు. […]

Continue Reading
Posted On :
komala

కాళరాత్రి-4 (ఎలీ వీజల్‌ -“నైట్‌” కు అనువాదం)

కాళరాత్రి-4 ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌” అనువాదం : వెనిగళ్ళ కోమల ఇంతలో యూదు పోలీసులు వచ్చి ‘‘టైమయింది. మీరంతా అన్నీ వదిలిపోవాలి’’ అని జీరబోయిన స్వరాలతో చెప్పారు. హంగరీ పోలీసులు ఆడ, మగ, పిల్లలు, వృద్ధులను కర్రలతో కొట్టనారంభించారు. అందరూ గెటోలు వదిలి తమ సంచులతో రోడ్డు మీదికి వచ్చారు. పోలీసులు పేర్లు పిలిచి అందరూ ఉన్నారో లేదో అని పదిసార్లు లెక్కించారు. ఎండ తీవ్రత బాధించింది. పిల్లలు మంచినీళ్ళు కావాలని గోలపెడుతున్నారు. ఇళ్ళల్లో […]

Continue Reading
Posted On :

చాతకపక్షులు నవల- 9

చాతకపక్షులు  (భాగం-9) (తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల) – నిడదవోలు మాలతి ఆ రెండుభావాలూ శివరావూ, పరమేశం దృష్టి దాటిపోలేదు. ఆవిడ మనసులో మాట ఇద్దరికీ అర్థం అయింది. అదే వరసలో ఒకరికి సంతృప్తీ, రెండోవారికి అసంతృప్తీ కలిగేయి. అదే కారణంగా మొదటివారు ఆ సంభాషణ పొడిగించడానికీ, రెండోవారు తుంచేయడానికీ తలపడ్డారు. “నామాట విను, పరమేశం. ఆడపిల్లకి చదువు అవసరమా కాదా అన్నమాట అటుంచి. ఈరోజుల్లో అబ్బాయిలు కూడా చదువుకున్న అమ్మాయిలనే ఇష్టపడుతున్నారన్న సంగతి […]

Continue Reading
Posted On :