image_print

కథాకాహళి- విమల కథలు

కథాకాహళి- 1 7 సోషలిస్టు స్త్రీవాద కథావిస్త్రృతి విమల కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి విమల 1963లో జన్మించారు. హైదరాబాద్ లో పుట్టి, పెరిగిన విమల విద్యార్థి దశ నుండే ప్రజా ఉద్యమాల్లో రాజకీయ కార్యకర్తగా సుదీర్ఘకాలం పనిచేశారు. ప్రస్తుతం రెయిన్‌బో చిల్డ్రన్స్ హోమ్ కన్సల్టెంట్ గా ఉన్నారు. కవి, కథకురాలుగా  తెలుగు పాఠకులకి విమల సుపరిచితురాలు. ‘అడవి ఉప్పొంగిన రాత్రి’, ‘మృగన’ రెండు కవిత్వ సంకలనాలు, “కొన్ని నక్షత్రాలు కాసిన్ని కన్నీళ్ళు”  ఒక కథాసంకలనం, “నువ్వేం చేస్తావ్”, “అతడి […]

Continue Reading
Posted On :

ఆగిపోకు సాగిపో (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)

ఆగిపోకు సాగిపో మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన  ఉత్తమ కథ -పి.వి.శేషారత్నం ‘హరిణీ! నువ్వు వచ్చే లోగా అందమైన పొదరిల్లు రెడీ చేయాలని ఆఫీసుకు కాస్త దూరమైనా ఇదిగో వీళ్ళు తీసుకున్నాను బాగుందా ? ‘ భర్త  అర్జున్‌ మాటలు వింటూ గేటు లోకి అడుగు పెట్టి ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసింది హరిణి. ‘ఆ ఆ..మరదలు పిల్లా! నాకు ఆడపడుచు కట్నం చదివించుకుని కుడికాలు ముందు లోపల పెట్టు’ అకస్మాత్తుగా తలుపు […]

Continue Reading
Posted On :

కళ్ళల్లో ప్రాణాలు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ)

కళ్ళల్లో ప్రాణాలు (మహిత సాహితీ & నెచ్చెలి కథల పోటీ-2021లో ఎంపికైన ఉత్తమ కథ) -జి . ఎస్. లక్ష్మి  “కాట్” గట్టిగా వినిపించిన కేకకి ఎక్కడో దూరంగా కూర్చుని లెక్కలు చూసుకుంటున్న ఆ సినిమా నిర్మాత లోకనాథం ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు. గబుక్కున షూటింగ్ స్పాట్ వైపు చూసేడు. చిరాకు పడుతూ డైరెక్టరు శ్రీహర్ష ప్రొడక్షన్ మేనేజర్ శేషాద్రిని చూస్తూ గట్టిగా ఏదో అంటున్నట్టు కనిపించింది. జోరుగా జరుగుతున్న షూటింగ్ కి “కట్” చెప్పిన డైరెక్టరు, మేనేజర్ […]

Continue Reading
Posted On :

మంకుపట్టు (హాస్య కథ)

మంకుపట్టు -వసంతలక్ష్మి అయ్యగారి కాంతమ్మ వీర్రాజులకు యిద్దరమ్మాయిల తరువాత ఒకబ్బాయి. కాంతమ్మ గారిది కళైన ముఖం. వీర్రాజుగారు ఆజానుబాహువుడు.ఎగువమధ్యతరగతి కుటుంబం. పిల్లలంతా మంచి చదువులు చదివి ఉద్యోగాలు తెచ్చుకున్నారు.ఆడపిల్లలిద్దరి పెళ్లిళ్లూ  యీడురాగానే జరిపారు. అబ్బాయి పెళ్లికొచ్చాయి తిప్పలు. ఆరడుగుల అందగాడు. ఓమోస్తరు ఉద్యోగం. వీర్రాజు గారు తమవైపుబంధువులపెళ్లిళ్లెన్నో  మధ్యవర్తిత్వం జరిపి చేయించిన ఘనతకలిగినవారు.స్వంతానికి కొడుకుపెళ్లి విషయంలో బొత్తిగా  విఫలమవడం బంధుమిత్రులందరినీ ఆశ్చర్యంలో ముంచింది. కాంతమ్మగారిది ప్రతి విషయంలోనూ అవసరానికి మించి వంకలుపెట్టే గుణం. దొడ్డచేయి. పెట్టుపోతలు అన్నీ బ్రహ్మాండం. కూతుళ్ల పెళ్లిళ్ల […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా-19)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 ఐతే ఎక్కువమందికి పని ఇస్తున్నాకొద్దీ మొదట పని ఇచ్చిన వాళ్ళకి పని ఇస్తామన్నారు. ఖనిజంకంటే తక్కువ నాణ్యతగల రాళ్లన్నిటినీ గని లోంచి తీయగానే కుప్పగా పడేస్తే ఈ గుట్ట తయారయింది. గని పని మొదలయిన రోజుల్లో లోపలినుంచి వచ్చే రాళ్లు నల్లగా బొగ్గులాగ ఉండేవి. అది చాల నాణ్యమైన ఖనిజంగల రాయి అన్నమాట. దీంట్లోంచి ఖనిజాన్ని వేరుచేసి రాళ్ళను పారేస్తే […]

Continue Reading
Posted On :

రంగయ్య స్నేహం (‘తపన రచయితల గ్రూప్’ కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ)

రంగయ్య స్నేహం (‘తపన రచయితల గ్రూప్’ కథల పోటీలలో ప్రథమ బహుమతి పొందిన కథ) -వెంకట శివ కుమార్ కాకు నేల మీద పగుళ్లు వున్నాయి. నెత్తి మీద సూరీడు భగ్గున మండుతున్నాడు. ఆ నేలని హత్తుకొని పడుకున్నాడు రంగయ్య. రంగయ్య కన్నీటి తో దాహం తీర్చుకుంది ఆ నేల. అతని ఎండిన శరీరం ఎండిన నేల తో కబుర్లు చెప్తోంది. ఎందుకంటే వాళ్ళిద్దరూ చిరకాల మిత్రులు! రంగయ్య రైతు కుటుంబం లో పుట్టాడు. చిన్నప్పుడే తల్లి చని […]

Continue Reading

అభిమానధనం (తమిళ అనువాదకథ)

అభిమానధనం (తమిళ అనువాదకథ) తమిళంలో: ఎస్. రామకృష్ణన్ తెలుగు అనువాదం: గౌరీ కృపానందన్   1976లో వెలువడిన వాహిని సుబ్రమణ్యం గారి ఆంగ్ల కధా సంకలనం, “కాలం యొక్క స్వరం” లో మా అమ్మ వ్రాసిన ఉత్తరం ఒకటి ప్రచురించ బడి ఉంది అన్న వార్తను అమెరికా నుంచి వేణి వ్రాసింది. నాకు నమ్మ శక్యం కాలేదు. వేణి నా కూతురు. పెళ్లై అమెరికాలో ఉంటోంది. లైబ్రరీ నుంచి తీసుకు వచ్చిన పుస్తకంలో తను  ఆ ఉత్తరాన్ని […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-7 “పురుడు(కథ)”

పురుడు -రమేశ్ కార్తీక్ నాయక్ పొద్దున్న ఎత్తాల్సిన పెండ కొట్టంలో అలాగే ఉండిపోయింది. నిద్రపోతున్న ఝమ్లికు ఇది గుర్తొచ్చి హాట్కు (సంతకు) పోయినోల్లు రాకముందుకే పెండనంత ఎత్తెద్దాం అనుకుంటు బర్రెల కొట్టం ముకాన మెల్లగా నడ్సింది.  కొట్టంలో నీళ్ళ  తొట్టికి పక్కనే కాసింత దూరంలో ఉన్న ఓ రాయిపై కూసొని పెండ కప్పను గమనిస్తాంది. పెండ ఆ పాటికే బయటి వైపు ఎండిపోయింది. నల్లని గీతలు పెండ కుప్ప చుట్టు, అక్కడక్కడ కోళ్ళు మెతుకుల కోసం గీరినట్లు […]

Continue Reading
P.Satyavathi

కథాకాహళి- పి.సత్యవతి కథలు

స్త్రీవాదంలోని  కలుపుకుపోయే తత్వం(ఇన్క్లూజివ్ పాలిటిక్స్) సత్యవతి కథాసూత్రం –15                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి పి.సత్యవతి, గుంటూరు జిల్లా తెనాలి మండలం కొలకలూరు గ్రామంలో 1940లో జన్మించారు. అదే గ్రామంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. బి. ఎ. చేసిన తర్వాత కొంతకాలం జర్నలిస్ట్ గా పని చేశారు. ఆంగ్లంలో ఎం.ఎ. చేసి, 1980 నుంచి 1996 వరకూ విజయవాడలోని సయ్యద్ అప్పలస్వామి డిగ్రీ కళాశాలలో ఆంగ్లోపన్యాకులుగా పనిచేశారు. రిటైర్మెంట్ తర్వాత విజయవాడలో స్థిరనివాసం ఏర్పరుచుకున్నారు. గోరా శాస్త్రి, పి. […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-6 “1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్”

1871 క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ -రమేశ్ కార్తీక్ నాయక్ అది 1871 వ సంవత్సరం భారతదేశమంతా బ్రిటిష్ పాలనలో ఉంది. ఎటూ చూసినా వారి వాహనాలు, జెండాలు కనిపించేవి. ఆ యేడు బ్రిటిషర్లు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ ని ప్రవేశపెట్టారు. మొదట అది ఉత్తర భారతదేశ భాగానికే పరిమితమైంది. తర్వాత బెంగాల్, మద్రాసు, 1911 వ సంవత్సరం చివరి దశలో భారతదేశంలో వివిధ రాష్ట్రాల దాకా ఆ యాక్ట్ ప్రభావం సాగింది. బ్రిటిషర్లు ఎక్కడికక్కడ తమ బలగాలను పంపించి […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా-18)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం మాకు ముగ్గురు మాంచేగోలతో మంచి దోస్తీ కలిసింది. వాళ్ళు వస్తూనే “మా కివాళ మీ ఇంట్లోనే భోజనం. మాకు ఇవాళ సెలవు. ఎక్కడికీ పోలేం” అనే వాళ్ళు. మేం బయటి పరిస్థితులను గురించి కూడా మాట్లాడుకునే వాళ్లం. మేం అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబాల్ని కూడా పిలిచేవాళ్ళం. మాంచెగోలకూ, రేంజర్లకూ ఉన్న తేడా ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ప్రతి […]

Continue Reading
Posted On :

ఆలాపన (కథ)

ఆలాపన        -గోటేటి లలితా శేఖర్ సంధ్య ముఖంలో  అందం, ఆనందం ఒకదానితో ఒకటి   పోటీపడుతున్నాయి . “ సూర్య మెసేజ్ పెట్టారా?……….నిజంగానేనా……?”   ఉద్వేగంగా అడిగాను. సంధ్య నవ్వుతూ   అవునన్నట్టు తలూపింది. “ జ్యోతీ …….” వీలుచూసుకుని వస్తావా? నిన్ను  చూడాలని ఉంది. “ అంటూ  సంధ్య పెట్టిన  మెసేజ్  చూసుకుని  రెండు రోజులు  ఆఫీసుకి లీవ్ పెట్టి   రాజుతో చెప్పి బయలుదేరాను..  హైదరాబాద్ నుంచి విజయవాడకు  ప్రయాణం చేసిన  సమయమంతా సంధ్య […]

Continue Reading

బామ్మ-సైన్ లాంగ్వేజ్ (కథ)

బామ్మ-సైన్ లాంగ్వేజ్ -ఎం.బిందుమాధవి “సుజనా… పుణ్య క్షేత్రాల దర్శనానికి తమిళనాడు వెళుతున్నాం. అమ్మ ఎప్పటి నించో తంజావూరు, మధురై, కుంభకోణం తీసుకెళ్ళమంటున్నది. గురువారం బయలుదేరుతున్నాం. బట్టలు సర్దు. సుజిత్ కి ఎలాగూ సెలవులే. నువ్వు కూడా నాలుగు రోజులు సెలవు పెడితే శనాదివారాలకి అటు ఇటు కలిపి పది రోజులు కలిసివస్తుంది” అన్నాడు రఘు. స్కూల్ నించి రాగానే సుజిత్ కి ఈ కబురు చెప్పింది బామ్మ శకుంతల. వాడికి బామ్మతో ప్రయాణం అంటే మహా హుషారు. ఈ […]

Continue Reading
Posted On :

మరో గుండమ్మ కథ

        మరో గుండమ్మ కథ -అక్షర గుండమ్మగారంటే ఎవరో కాదండీ, మా అత్తగారికి అత్తగారైన ఆదిలక్ష్మి అమ్మగారే. వయస్సు ఎనభై ప్లస్సు. మొత్తం ఇంటికి బాసు. ఏమంటారా? ఆ పరమాత్మ ఆనతి లేనిదే ఆకైనా కదులుతుందేమోకానీ ఈ ఆదిలక్ష్మిగారి అనుమతి లేనిదే మా ఇంట్లో మంచినీళ్లయినా పుట్టవు. అదేమంటారా? అది ఆవిడ అదృష్టం. మన ప్రాప్తం. ఏదేమైనా ఆవిడకు ఆఇంట్లో ఉన్న పవర్ చూసి, ఆవిడ ఆకారానికి తగ్గట్టుగా గుండమ్మ అని, బిగ్ బాస్ అని పేర్లు పెట్టాము. […]

Continue Reading
Posted On :

కలలు అలలు (కథ)

కలలు అలలు -శాంతి ప్రబోధ పాపాయి షో గ్రౌండ్స్ కి బయలుదేరింది. ఆ గ్రౌండ్స్ లో పిల్లలకోసం మంచి పార్క్ , రకరకాల ఆట వస్తువులు ఉన్నాయి . బయట చల్లటి చలిగాలి వీస్తున్నది.  అందుకే వాళ్ళమ్మ పాపాయికి  చలికోటు , బూట్లు , సాక్స్ వేసింది. సాధారణంగా ప్రతి రోజూ  పాపాయి బయటికి వెళ్తుంది . అలా పార్కుకో, గ్రౌండ్స్ కో వెళ్లి అక్కడ కొంత సేపు గడపడం పాపాయికి చాలా ఇష్టం. ఆ పార్కుల్లో […]

Continue Reading
Posted On :

నిన్ను చూడకుంటే నాకు బెంగ (కథ)

నిన్ను చూడకుంటే నాకు బెంగ -జానకీ చామర్తి తలుపు తీయంగానే విసురుగా తాకిన హేమంతగాలికి కట్టుకున్న నూలు చీర ఆపలేక వణికింది విజయ. అమ్మ చీర , రాత్రి రాగానే పెట్లోంచి తీసి కట్టేసుకుంది .. చూసుకు నవ్వుకుంది, పెద్దవాళ్ళచీరలా ఉందని.నీళ్ళ పొయ్యి ముందుకు వచ్చి , మోకాళ్ళు మునగదీసుకు కూచుని , అరచేతులు చాపి మంట వేడికి వెచ్చపెట్టి చెంపలకు తాకించుకుంటోంది. నీళ్ళకాగులో నీళ్ళు కాగే కళపెళా చప్పుడు వింటూ కేకెట్టింది, “ నీళ్ళు కాగాయి, ఎవరు పోసుకుంటారు “ […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-5 “సంకల్పం”

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, […]

Continue Reading
Posted On :

ఖాళీ (కవిత)

    ఖాళీ -డా.సి.భవానీదేవి ఇప్పుడంతా ఖాళీయేఇల్లు..మనసు..కలల ఖజానా ఎన్నో దశాబ్దాలుగా సేకరించి పెట్టుకున్నఅక్షర హాలికుల సేద్య ఫలాలు…. స్వర శిఖర సంభావిత సంపూజ్యరాగమాంత్రికుల మధుర గళ మధురిమలు సాహితీ ప్రకాండుల సభా సందర్భాలనుమనోనేత్రంలో  చిర చిత్రణ చేసిన జ్ఞాపికలు బాల్యం తాగించిన అమ్మ నాన్నల అనంతామృత ధారల ప్రేమ ఉయ్యాలలు చదువు..సంస్కారం ప్రసరించినగురువుల ప్రశంసల ఆశీస్సులు బాల్యంలో హత్తుకున్న కలం ప్రకటించినఅనేకానేక రచనల సమాహారాలు చిన్నప్పటి నుండి నా ఆశల స్వప్నాల్నీనా కన్నీటి తడిని చదివిన వంటపాత్రలు దూరమయిన రక్తబంధాల ఆనవాళ్ళుదగ్గరయిన ఆత్మబంధువుల ఆప్యాయతలు జీవితంలో ప్రతి క్షణం ..వెలుగు నీడలుమనసుగదిలో […]

Continue Reading
Posted On :

ప్రేమ (కవిత)

  ప్రేమ -డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె ఏదైనా చేయగలగడమంటే కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో భార్యగా బాధ్యతగా బ్రతకడమే- బదులిచ్చాడతడు విరామమే మరిచి అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ సరస సల్లాపాల డోలలాడించగల మోహిని ముందు మోకరిల్లాడతడు ప్రేమంటే ఏమిటి? అడిగిందో తల్లిగా రక్త మాంసాలను ధారపోయడమే- బదులిచ్చాడతడు జీవితాన్నే ధారపోసిందామె రెక్కలొచ్చిన పక్షి తన గూటిని వెతుక్కుంది మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా? అడిగిందామె అది అన్ కండీషనల్ ప్రేమించడమే నీ వంతు సమాధానమిచ్చారు ముగ్గురూ! **** డా. నల్లపనేని విజయలక్ష్మి.డా. నల్లపనేని విజయలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీరి కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.

Continue Reading

దినచర్య (కవిత)

దినచర్య -పద్మావతి రాంభక్త బహుశా మీరనుకుంటారేమో నా ఖాళీ సమయాలన్నీ అక్షరాలుగా తర్జుమా అవుతుంటాయని ఉదయం లేచీ లేవగానే నా మెదడు నిండా అంటుకున్న కలల శకలాలను దులిపి వాస్తవాన్ని కౌగిలించుకున్నప్పుడు నిన్నటి జ్ఞాపకమేదో నా మనసులోకి వద్దన్నా జొరబడి వంటింట్లోని  పోపుగింజలా అక్షరమై చిటపటలాడుతుంది లోపల వర్షం బయట వర్షంతో జతగూడినపుడు నేను తడిమేఘమై కురిసిపోతుంటాను కిటికీలోనుండి ప్రవేశిస్తున్న రవికిరణాలలోని వెచ్చదనాన్ని కట్టగట్టినపుడు ఒక నులివెచ్చని వాక్యమై వాలిపోతాను గడ్డకట్టిన కాలం కన్నీటి సంతకాలతో తుపానులతో […]

Continue Reading

స్వేచ్ఛ (కవిత)

స్వేచ్ఛ -పి.సుష్మ వాళ్లంతా భద్రత అనే బంగారు పంజరంలో బందీలు రెక్కల క్రింద స్వేచ్ఛను కట్టేసుకొని అప్పుడప్పుడు బయటికి వస్తూ ఉంటారు ఎగిరే కొద్దీ వెనక్కిలాగే వాళ్ళు కొందరు స్వేచ్ఛ ఇచ్చామని అంటూనే రెక్కలు విరిచేస్తూ ఉంటారు ఇంకొందరు విరిగిపోయిన రెక్కలు ఈకలై ఎగిరిపోవడం చూసే ఉంటావు అది ఎవరికీ భయపడని స్వేచ్ఛ ఈకలన్ని చదివే ఉంటాయి ఆకతాయి గాలి చేష్టలు అయ్యో అంటూ అక్కున చేర్చుకున్న బండరాయి సందులో కొన్ని ముళ్ళకంపలో కొన్ని ఇలా అక్కడక్కడా […]

Continue Reading
Posted On :
sailaja kalluri

మచ్చలు (కవిత)- డా.కాళ్ళకూరి శైలజ

మచ్చలు -డా.కాళ్ళకూరి శైలజ ఎండ సోకిన చోట నలుపు,బట్ట దాపున తెలుపు,  ఒంటి మీద కష్టసుఖాల జాడలుమచ్చలై ముచ్చట్లు చెపుతాయి. సొమ్ములు సాగి సాగి వేలాడే కండలౌతాయి .శతమానాల ముద్దర ఎద మీద ఒత్తుకుంటుంటే , నాలి తాడు ఆనవాలు మెడ చుట్టూ చేరి తాకట్టుకెళ్ళి తిరిగి రాని ఊసులు చెపుతుంది.పాలు చీకిన ముచ్చికలు,పసి అంగుడి కోసిన పగుళ్ళతోఉసూరు మంటాయి.      రోకళ్ళు,చీపుర్లు కదుము కట్టిన చేతులుఎగుడు దిగుడు గుట్టలు.గుండిగలు తోమి మకిలి ఇంకిన వేళ్ళు  పంట కొడవలి గంట్లకి రెల్లు గడ్డిలా […]

Continue Reading

నైజం (కవిత)

నైజం -గిరి ప్రసాద్ చెల మల్లు అమ్మున్నంత కాలం ఎగబడ్డాయి పక్షులు అమ్మ పోయింది పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి  అమ్మ వున్నప్పుడు ఎంగిలిచేతిని విదిలించని ఇళ్ళపై వాలుతున్న పక్షులు విదిలిస్తారని ఆశతో ఈసడించిన చేతులవైపు  అమ్మ పోపుగింజల్లో డబ్బు సైతంముక్కున కర్సుకుపోయిన  పక్షులు మరోవైపు  అమ్మ చేతి వంట తిన్న పక్షులు మర్చి మరబొమ్మల్లాతారాడుతున్నాయి  బెల్లమున్నప్పుడే ఈగలుఅమ్మ చెబుతుండేదెప్పుడూ కాని అమ్మే గుర్తెరగలేదనేది నేడు కన్పిస్తుంది కళ్ళముందు  గూటిపక్షులువలస పక్షులు అన్నీ అవే కోవలోఇసుమంతైనా తేడా లేదు సుమీ ! ముసిముసినవ్వుల వెనుక దాగిన మర్మం విషం గడపలో ఓ కుక్క విశ్వాసంగా అప్పుడూ ఇప్పుడూ **** గిరి ప్రసాద్ చెలమల్లుపుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి […]

Continue Reading

కథాకాహళి- ఎస్. జయ కథలు

జండర్ చైతన్య స్థాయిని పెంచే ఎస్. జయ కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి తెలుగు కథాసాహిత్యం వస్తుపరంగా ఎంతో వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కానీ రూప పరంగా అంత వైవిధ్యం కనిపించటం లేదు. అయితే కొంతమంది రచయితలు చాలా చేతనా పూరితంగా శిల్పపరమైన వైవిధ్యం కోసం తపించి రాశారు. అటువంటి వాళ్ళలో యస్. జయ కూడా ఒకరు. ఎస్. జయ ’రెక్కలున్నపిల్ల’, ’నిజం’ ’అన్వేషణ’, ’అమ్మ మనసు’ ’అమ్మా నాన్న నన్ను చంపేయండి’, ’ఇంకానా.. ఇకపై చెల్లదు’, ’కన్నీళ్లు’, […]

Continue Reading
Posted On :

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు)

అమ్మ తత్వం (‘పరివ్యాప్త’ కవితలు) -అమ్మంగి కృష్ణారావు ఇది ఒక జీవన రంగస్థలి పక్షులు గూళ్ళు చేరుకుంటున్నాయి అచ్చం అమ్మ ఒడిలోకి చేరుకున్నట్లు కోడి పిల్లలను డేగ కన్ను నుండి కాపాడుకుంటుంది ఎగిరెగిరి ఎదిరించి పోరాడే పటిమతో గంతులేస్తున్న లేగదూడకు తల్లిఆవుపొదుగు పాలిస్తుంది లాలించి తాగించి నట్టుగా పుడమి తల్లిలా నేలంతా పచ్చదనాన్ని పులుముకుంటుంది జగమంతా తనదే అన్నట్లుగా అంతా అమ్మ తత్వమే అమ్మా భూమ్మీద పడగానే ఎంత ఆనందించావో నాకు ఊహ తెలియకముందే వెళ్ళిపోయావు కదమ్మా […]

Continue Reading

మా కథ (దొమితిలా చుంగారా-17)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం మాకు ముగ్గురు మాంచేగోలతో మంచి దోస్తీ కలిసింది. వాళ్ళు వస్తూనే “మా కివాళ మీ ఇంట్లోనే భోజనం. మాకు ఇవాళ సెలవు. ఎక్కడికీ పోలేం” అనే వాళ్ళు. మేం బయటి పరిస్థితులను గురించి కూడా మాట్లాడుకునే వాళ్లం. మేం అప్పుడప్పుడు వాళ్ళ కుటుంబాల్ని కూడా పిలిచేవాళ్ళం. మాంచెగోలకూ, రేంజర్లకూ ఉన్న తేడా ప్రతి ఒక్కరికీ తెలిసిపోయింది. ప్రతి […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-4 బుజ్జీ ..!

బుజ్జీ ..!  -కృష్ణ గుగులోత్ అప్పడే పర్సుకుంటున్న లేల్యాత ఎండలో ఆత్రంగా తుమ్మకాయల్ని ఏరుకుంటున్నడు లక్పతి.కొద్దిసేపయ్యాక తలకు సుట్టుకున్న తువ్వాలిప్పి ఏరిన తుమ్మకాయల్ని మూటగట్టుకొని సెల్కల్లో ఉన్న తమ గొర్ల- మేకలమందవైపుసాగిండు. మందతానికొచ్చాక “బుజ్జీ.!”అని తనగారాల మేకపోతుకు కేకేసిండు,గంతే ఒక్కపాలి దిగ్గునలేచి లక్పతి ముందు వాలిపోయింది ‘బుజ్జి’, తొందరగా తువ్వాలిప్పమన్నట్టుగా నానా హడావిడి సేస్తున్న బుజ్జితో.,”ఏహే ! థమ్ర, తార్వాసుతో కాఁయ్ లాయొజకోన్ ! ఇదె ఖో “!  (“ఏహే ! ఆగరా..! నీకోసమే కదా దీస్కొచ్చింది, […]

Continue Reading
Posted On :

కొడుకు-కూతురు (కథ)

కొడుకు-కూతురు -జి.అనంతలక్ష్మి ఆడపిల్ల పుట్టింది అనగానే ఆడ  పిల్ల అంటారు. ఏందుకు? పెళ్ళి అయి అత్తవారింటికి వెళి పోతుంది అని. ఈనాడే కాదు ఆనాడు మగపిల్లాడు పుట్టి ఏమి వుద్దరించాడు? ఆ మాటంటే ఇంట్లో అందరు యుద్ధానికి వచ్చేస్తారు.  మగపిల్లాడు నెత్తిన పెట్టే రాయి ఏమిటి? ఆడపిల్ల నిజంగా రాయి పెట్టకపోవచ్చు. తల్లిదండ్రుల కష్టాలలోను చివరి పరిస్థితుల్లోను వెన్నంటి కాపాడేది ఆడపిల్లే. కాని చివరకి ఆ తల్లిదండ్రులకు కూడ ఆడపిల్ల పనికిరానిదవుథోందా! ఏందుకు?  ఇలా ఆలోచిస్తూ తల్లి […]

Continue Reading
Posted On :

సన్న జాజులోయ్ (కథ)

సన్న జాజులోయ్ -ఎన్నెల పెళ్ళప్పుడు మా అమ్మ నన్ను అప్పగిస్తూ మా వారితో…’ అమ్మాయి సెవెన్ జాస్మిన్ హయిటు నాయనా, జాగర్త గా చూసుకో ‘ అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ చెప్పింది. మా వాళ్ళందరూ అయోమయం గా మొహం పెట్టి,” పాపం బాధలో ఏదో మాట్లాడుతోందిలే పిచ్చి తల్లి” అని సర్దుకున్నా, తర్వాత చుట్టూ చేరి, ” మీ అమ్మ గారు ఏమన్నారు ఇందాకా అప్పగింతలప్పుడూ” అని నన్నడిగారు.”అదా….సెవెన్ జాస్మిన్స్ హయిటు అనగా ‘ఏడు మల్లెల […]

Continue Reading
Posted On :
P.Satyavathi

ఇట్లు మీ స్వర్ణ (కథ)

ఇట్లు మీ స్వర్ణ -పి సత్యవతి పొద్దున్న లేచి, పాలు తెచ్చి, టీ కాచి మంచినీళ్ళు పట్టి తెచ్చి, ఇల్లూడ్చి  వంటింటి పనులు  అందుకుని తమ్ముడుకి తనకీ  బాక్సులు కట్టి షాపుకి తయారైంది స్వర్ణ. , ఎర్ర చుడీ, దానిమీదకి రంరంగుల పువ్వుల కుర్తీ ,పలచని ఎర్ర చున్నీ, వేసుకుంటే జడ లేకపోతె ‘పోనీ’ కట్టుకోవాలి  కానీ జుట్టు వదిలెయ్య కూడదు ‘పోనీ’ కోసం కాస్త జుట్టు కత్తిరించుకుంటానంటే అమ్మ చంపేస్తుంది.చచ్చి నట్టు చిక్కులు తీసుకుని జడ […]

Continue Reading
Posted On :

కథాకాహళి-పి.శ్రీదేవి కథలు

స్త్రీల లైంగిక సంఘర్షణలను చిత్రించిన పి.శ్రీదేవి కథలు                                                                 – ప్రొ|| కె.శ్రీదేవి యాభై దశాబ్దం నాటికి కథాసాహిత్యానికి చక్కటి పునాది, భద్రతా పేర్పడ్డాయి. దీనికి తోడు మెదటి తరం రచయిత్రులు ఇచ్చిన ప్రేరణతో, చదువుకున్న స్త్రీలు కలం పట్టారు. ఈదశాబ్ది మధ్యలోనే కాలంలో రంగనాయకమ్మ, వాసిరెడ్డి సీతాదేవి, మాలతీచందూర్, కె. రామలక్ష్మి, పి. శ్రీదేవి లాంటి రచయిత్రుల స్వతంత్ర భావజాలం ఆతర్వాతి దశాబ్దాన్ని రచయిత్రుల దశాబ్దంగా నిలిపింది. తెలుగు కాల్పనిక సాహిత్యంలో లైంగికతను చర్చనీయాంశం చేసే క్రమంలో […]

Continue Reading
Posted On :

మా కథ (దొమితిలా చుంగారా-16)

మా కథ  రచన: దొమితిలా చుంగారా  అనువాదం: ఎన్. వేణుగోపాల్  దొమితిలా జీవితం- సైగ్లో – 20 గృహిణుల సంఘం జరగబోయే సంఘటనలపట్ల కొందరు వ్యాకులపడ్డారు. ఏం జరగబోతోందో తెలియని అమోయమంలో ఎన్నెన్ని ఘోరాలు జరిగాయని! కటావి సంఘటన వింటే గుండె చెరువవుతుంది. సెలవులు గనుక భర్త ఎటో ప్రయాణమయి వెళ్ళిపోయాడు. కాల్పులూ, ఘర్షణలూ – ఈ గందరగోళమంతా చూసి భార్య తన పిల్లల్ని మంచంకింద దాచింది. మా దగ్గర ఇది ఒక అలవాటు. కాల్పులు జరిగేటప్పుడు పిల్లల్ని […]

Continue Reading
Posted On :

కెథారసిస్ (కథ)

కెథారసిస్ –సునీత పొత్తూరి చటుక్కున కళ్లు విప్పి చూసింది సునంద. ఏదో కల. అది కలా అనే స్పృహ కలిగినా, కల మిగిల్చిన చిన్న అసౌకర్యం మస్తిష్కాన్ని అంటిపెట్టుకునే వుంది. సునంద వచ్చిన కల ఓ క్రమంలో గుర్తు తెచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేస్తోంది.    పైగా కల కూడా అస్పష్టంగా, తెగిన సాలిగూడు లా.. అన్నీ   పొంతన లేని దృశ్యాలు! ఎవరో గొంతు నులిమేస్తున్నట్టు.. అరుద్దామంటే తన నోరు పెగలడం లేదు. అరుపూ బయటకు రావడం లేదు.  అదీ […]

Continue Reading
Posted On :

కథాకాహళి- ఆచంట శారదాదేవి కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

లైఫ్ టర్నింగ్ టైం (కథ)

లైఫ్ టర్నింగ్ టైం -కె.రూపరుక్మిణి అదో అందాల ప్రపంచం అందు తానో వెన్నెల దీపం ఆ తండ్రి కాపాడుకునే కంటిపాప ….తన కూతురి కోసం తన ఛాతిని పట్టుపరుపుగా మార్చుకునే అంత ప్రేమ తన పట్టుకొమ్మ కోరింది నెరవేర్చాలని ఆశ…. ఓ మధ్యతరగతి తండ్రిగా ఏ ఆవేదన తన కూతురిని అంటకుండా పెంచుకునే ఓ తండ్రి కి కూతురిగా గారాలపట్టి గా ఆఇంటి మహాలక్ష్మి గా పిలిచే వల్లి పేరుకు తగ్గట్టు గానే చక్కని రూపం చదువుల్లో […]

Continue Reading
Posted On :

చదువువిలువ (కథ)

చదువువిలువ -రమాదేవి బాలబోయిన రోజూ ఐదింటికే లేచి ఇల్లు వాకిలి ఊకి సానుపు జల్లి ముగ్గులేసే కోడలు ఇయ్యాల సూరీడు తూరుపు కొండ మీద నిలుచున్నా లేత్తలేదు…ఎందుకో…అని మనుసుల్నే అనుకుంటా కొడుకు పడకగదిలోకి తొంగిచూసింది నర్సమ్మ కొడుకు లేచి పళ్ళల్ల పలుగర్రేసినట్లున్నడు…బయట సప్పుడు ఇనాత్తాంది గనీ…కోడలీ ఉలుకూలేదు పలుకూ లేదు నిన్న రాత్రి ఏందో గడబిడైతే ఇనబడ్డది వాళ్ళరూముల…కాని…ఏమైందో ఏమోనని…నర్సమ్మ పాణం కల్లెపెల్లళ్ళాడుతాంది “శీనయ్యా…ఓ శీనయ్యా….ఏం జేత్తానవ్ బిడ్డా..” అని కొడుకును పిలిచుకుంట…బయట కొడుకున్న కాడికి నిమ్మళంగ […]

Continue Reading
Padmaja Kundurti

విముక్త (కథ)

విముక్త -పద్మజ కుందుర్తి ఆఫీసులో పని ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది అనుపమకు ఈరోజు. అసలే కొత్తరాష్ట్రం కొత్త గవర్నమెంటూ కూడా కావటం తో రక రకాల పథకాలూ, లబ్ధిదారుల ఎంపికా, ఆతాలుకు ఫైళ్ళన్నీ ఒక్కరోజు నిర్లక్ష్యం చేసినా పేరుకుపోతున్నాయి. అసలే తరలివచ్చిన ఆఫీసు, హైదరాబాదు నించి వచ్చాక ఒక్కతే ఉంటుంది కనుక వీలైన, అన్నివసతులూఉన్న అపార్ట్మెంటు వెతుక్కోవడమే పెద్ద తలనెప్పిగా తయారైంది. మరీ దూరంగా పట్నంలో మంచి గేటెడ్ కమ్యూనిటీ ఉన్న అపార్ట్మెంట్లు దొరుకుతున్నా, కాస్త […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం

గోర్ బంజారా కథలు-3 ఆదివాసి గిరిజన దినోత్సవం -రమేశ్ కార్తీక్ నాయక్ 1. యూనివర్సిటీ ప్రాంగణ మైదానమంత పూల చెట్లతో నిండుగా ఉంది. మైదానానికి చుట్టూ అర్థ చంద్రాకారంలో చెట్లు ఉన్నాయి. కానీ ఆ చెట్లు ఏవికుడా ఎక్కువగా అడవుల్లో ఉండవు.రెండు రెండు చెట్లకు మద్య వేరే చెట్లు ఉన్నాయి.కొన్ని పూలతో, కొన్ని కాయలతో కొన్ని వివిధ రంగుల జెండాలు, బానార్లతో నిండి ఉన్నాయి. దాదాపుగా అక్కడ ఉన్న చెట్ల పై మొలలు కొట్టి ఉన్నాయి.కొన్ని మొలలు […]

Continue Reading

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ)

గోర్ బంజారా కథలు-2 పాడ్గి (పెయ్య దూడ) -రమేశ్ కార్తీక్ నాయక్ ( 1 )                            ఇంటి నుండి బైటికొచ్చి దారి పొడ్గున సూసింది సేవు.  తండా కోసన సూర్యుడు ఎన్కాల ఉన్న అడ్వి కొండల్లోకి ఎల్తురు తగ్గిస్తూ జారిపోతున్నడు. అడ్వి నుండి సాయంత్రం ఇంటికి బఱ్ఱె ఇంకా ఇంటిదారి పట్టినట్టు లేదు. సేవుకు రంధి మొదలైంది. ‘బఱ్ఱె ముందే సూడిది, […]

Continue Reading
Sasikala

కథాకాహళి- శశికళ కథలు

రాయలసీమ కరువు ప్రతిఫలనాల ప్రతిరూపం శశికళ కథలు                                                                 – కె.శ్రీదేవి ఆధునిక తెలుగుకథ వయసు ఒకటిన్నర శతాబ్దం పైనే అనుకుంటే, అందులో రాయలసీమ కథాచరిత్ర “ఋతుచర్య” ద్వారా మొదలైంది ఒక  శతాబ్దం క్రితం మాత్రమే. అదీగాక గత ఆరు దశాబ్దాలలో రాయలసీమ కథ వస్తు, రూప పరంగా మిగిలిన ప్రాంతీయ కథలకు ధీటుగా వెలువడుతూ వచ్చింది. 19౨0ల నుంచి ఇప్పటిదాకా రాయలసీమలో అనేక ప్రాంతాలలో విస్తరించివున్న రచయితలు ప్రథమంగా రాయలసీమ సాహిత్యాన్ని తద్వారా మొత్తం తెలుగు సాహిత్యాన్ని […]

Continue Reading
Posted On :

ముందడుగు (కథ)

ముందడుగు -రోహిణి వంజారి పిల్లలిద్దరూ రంగు పెన్సిళ్ళతో కాగితాలమీద బొమ్మలేవో వేసుకుంటున్నారు.  సోఫాలో కూర్చుని కూర్చుని నడుం నొప్పి పుడుతోంది.  ఐదు నిముషాలు టీవీ లో వార్త చానెల్స్, మరో ఐదు నిముషాలు సెల్ ఫోన్లో  ఫేస్బుక్, వాట్సాప్ లు  మార్చి మార్చి గంట  నుంచి చూస్తున్నాను.  అన్ని చోట్లా ఇపుడు ఒకటే వార్తలు.  కరోనా వ్యాధి గురించి. కరోనా ఏ దేశంలో ఎంత శాతం ప్రజలకు  అంటుకుంది. కరోనా రాకుండా నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు, ఇదే […]

Continue Reading
Posted On :

మిణుగురులు (కథ)

మిణుగురులు -శ్రీసుధ మోదుగు సాయంత్రం బుగ్గ వాగు  దగ్గరికి నడుస్తున్నారు ఇద్దరూ, దూరంగా చిన్న కొండలు వర్షాకాలంలో ఆకుపచ్చగా, ఎండాకాలంలో పసుపచ్చగా మారిపోతాయి. ఎలా చూసినా అందంగానే ఉంటాయి. “బుగ్గ వాగులో నీళ్లు లోతు లేనట్లు కనిపిస్తాయ్, కానీ లోతెక్కువ. ఎప్పుడూ వాగులో దిగకు. శివా! వింటున్నావా?” “ఆ … కాక.”   “శివ! మీ అమ్మ వచ్చి పిలిస్తే వెళ్ళిపోతావా?”  “కాక! అమ్మ మంచిది కాదా?”  “మంచిది శివ.”  “పున్నమ్మ చెప్పింది అమ్మ మంచిది కాదు, వచ్చి […]

Continue Reading
Posted On :

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం)

గోర్ బంజారా కథలు-1 ఢావ్లో(విషాద గీతం) -రమేశ్ కార్తీక్ నాయక్ తండా మధ్యల నుండి ఎటు సుసిన అడ్వి కనబడతది.కొండలు కనబడతయి.కొండల మీద నిలబడే నక్కలు, నెమళ్ళు, ఉడ్ములు కనబడతయి, వాటన్నింటినీ లెక్కలు ఏసుకునుడే పిల్లల రోజు పని. తాండా నుండి అడ్వి దాకా వాట్ (దారి) కనిపిస్తది, ఆ పై ఏమి కనబడది. అయినా అడ్వికి పోయేటోల్లు రోజుకో కొత్త దారి ఏసుకుంటరు. తాండా సుట్టు నల్లని కొండలు, ఆ కొండల మీద,దాని ఎనక పచ్చని […]

Continue Reading

మాటవిన్న మనసు (కథ)

మాటవిన్న మనసు -విజయ దుర్గ తాడినాడ ‘ఎందుకిలా జరిగింది?’  ఈ మాట ఇప్పటికి ఎన్నిసార్లు అనుకున్నానో నాకే తెలియదు. ఇలా నా ఫ్రెండ్స్ ఎవరైనా ఒకే మాట పదే పదే అంటూ ఉంటే లెక్కపెట్టి ఏడిపిస్తూ ఉండేదాన్ని. ఇలా నేను కూడా అనుకోవాల్సిన రోజు ఒకటి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. అసలు ఎందుకిలా జరిగింది? నాకే ఎందుకిలా జరిగింది?  ఈ ప్రశ్న కేవలం ఆరు నెలల నుండి నా మనసుని తొలిచేస్తోంది. జరగాల్సినదంతా జరిగిపోయింది. ఊహించనిది జరిగిపోయింది.  […]

Continue Reading
Posted On :

కథాకాహళి- రాజీవ కథలు

డెబ్భైదశకంలో స్త్రీల దృక్పథంలో వ్యక్తమైన కొత్త ప్రశ్నలు రాజీవ కథలు                                                                 – కె.శ్రీదేవి లక్ష్మివాసన్ తన కూతురు రాజీవ పేరుతో కథలు రాశారు.  ఈమె ఖమ్మం జిల్లా అశ్వారావు పేటలో జన్మించారు. కామారెడ్డిలో కలం పట్టారు. “కొత్తనిజం”, “మనసుమాట”, రెండు కథా సంపుటాలు వచ్చాయి. “నడుస్తున్న కథ”, “రాబోవుతరం స్త్రీ”  అనే నవలలు “లవ్ ఇన్ ఒన్” , “కొత్తచిగుళ్ళు”, “రాబందులు”, అనే కవితా సంపుటాలు ప్రచురించారు.  సావనీర్లకు కూడా పని చేశారు. 2010 సంవత్సరంలో వచ్చిన […]

Continue Reading
Posted On :

అతడు (కథ)

అతడు –పద్మావతి రాంభక్త కొందరంతే అందమైన అట్టున్న పుస్తకాలను కొత్తమోజుతో కాలక్షేపానికి కాసేపు తిరగేసి బోరు కొట్టగానే అవతల విసివేస్తారు.ఇతడూ అంతే.అయినా నేను అతడిలా ఎందుకు ఉండలేక పోతున్నాను.అతడు నా పక్కన ఉంటే చాలనిపిస్తుంటుంది.అతడి సమక్షంలో ఉంటే చాలు, నా మనసంతా వెన్నెల కురుస్తుంది.ఒక సుతిమెత్తని పరిమళమేదో చుట్టుముడుతుంది.ఆలోచనలలో పడి సమయమే  తెలియట్లేదు.బండి చప్పుడైంది. గడియారం వైపు చూస్తే అర్ధరాత్రి పన్నెండు కొడుతోంది. ఊగుతూ తూగుతూ అతడు ఇంట్లోకి వచ్చాడు.ఇప్పుడిక ఇదివరలోలా గోల చెయ్యడం మానేసాను. నెమ్మదిగా […]

Continue Reading

ముసురు (కథ)

ముసురు –మణి వడ్లమాని వాన  జల్లు  పడుతూనే ఉంది. ఒక్కసారి  పెద్దగా, ఒక్కోసారి చిన్నగా  జల్లులు  పడుతూనే ఉన్నాయి. ఎక్కడ చూసినా జనం,సందడిగ  కోలాహలంగ ఉంది , కుర్చీలలో  కూర్చొని   కునికి పాట్లు పడేవారు కొందరు. పుస్తకాలు  తెచ్చుకొని  చదువుకునే  వారు మరి కొందరు.  చెవులకి  హియర్  ఫోన్స్  పెట్టుకుని  మ్యూజిక్  ని వింటూ ఉండేవాళ్లు ఇంకొంతమంది. మొత్తానికి   ఎవరి కి వాళ్ళు  యేదో రకంగా  బిజీ గా ఉన్నారు. “బయట వాతావరణం బాగా […]

Continue Reading
Posted On :

కథాకాహళి- జి. నిర్మలారాణి కథలు

కథా కాహళి (స్త్రీ కంఠస్వరం)                                                                 –  ప్రొ|| కె. శ్రీదేవి జి. నిర్మలారాణి కథలు జి. నిర్మలా రాణి అనంతపురం లోని ఫుట్టపర్తి సాయిబాబా జూనియర్ కాలేజిలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేసి, పదవీవిరమణ చేశారు. “గాజుకళ్ళు” పేరుతో  2003 సంవత్సరంలో కథా సంకలనాన్ని ప్రచురించారు. పదిహేనేళ్ళనుండి కథలు రాస్తున్నారు. జన్మస్థలం కోస్తాంధ్ర ప్రాంతమైనా రాయలసీమ  ప్రాంతీయ జీవితానికి ప్రాతినిధ్యం వహించే “గాజుకళ్ళు” లాంటి కథలు కూడా రాశారు. అనంతపురం నుండి కథలు రాస్తున్న సీనియర్ రచయితగా ఈమెను చెప్పవచ్చు. […]

Continue Reading
Posted On :