image_print

సంపాదకీయం-జనవరి, 2025

“నెచ్చెలి”మాట  ధైర్యమే 2025! -డా|| కె.గీత  2025 నాటికి నోట్రదామస్ చెప్పినట్టో సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో పుకార్లలో వినీ కనీ ఏదో జరిగిపోతుందని లోకం అంతమైపోతుందని భయపడే సంవత్సరం వచ్చేసింది! అయినా ఆ.. ఏముందిలే 2020వ సంవత్సరపు కరోనాని ఊహించలేనివారు 2025ని చూసొచ్చారా? 2025 అంటే ఈ శతాబ్దపు సిల్వర్ జూబ్లీ కదూ! 19వ శతాబ్దిలో పుట్టిన అందరికీ 2025 ని చూడడమంటే గొప్ప అద్భుతమే కదూ! ఒహోయ్ వట్టి నూతన సంవత్సరం కాదండోయ్.. 2025లోకి వచ్చేసాం! […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-10- చిక్ లిట్ – కడలి

ఈ తరం నడక – 10 కడలి – “చిక్ లిట్” (నవల) -రూపరుక్మిణి              ఈ శీర్షిక మొదలుపెట్టి ఇప్పటికి పది నెలలు అయింది. ఒక్కొక్కటిగా చదువుతూ, కొత్తగా నిర్మించుకుంటున్న సాహిత్యదారులను వెతుకుతూ కొత్త సంవత్సరంలోకి అడుగేయడం మనసుకి భలే బాగుంది.           “ఎవరు డిఫరెంట్ గా రేపటి కంటెంట్ ని చూపించగలుగుతున్నారు?” అని వెతుకుతున్న నన్ను “చిక్ లిట్ ” ఆకర్షించింది. […]

Continue Reading
Posted On :

జన్యు బంధం (కథ)

జన్యు బంధం -కామరాజు సుభద్ర పాతరోడ్డైనా గట్టిగా ఉండడంతో పెద్దగా కుదుపులు లేకుండా సిటీవైపు వస్తోంది ట్యాక్సి. శారద వెనకసీట్లో వాలి కళ్లు మూసుకుని కూర్చుంది. పక్కనే ఉన్న కోడలు మృదుల కిటికీలోంచి బయటికి చూస్తోంది. ముందుసీట్లోవున్న కొడుకు ప్రవీణ్ రోడ్డుకేసి చూస్తున్నాడు. ప్రవీణ్ ఉద్యోగరీత్యా సిటీకి దూరంగా చిన్నటౌనులో ఉంటున్నారు వాళ్లు. శారదకు మూడునెలల నుంచి ఆరోగ్యం బాగలేదు. క్రితంనెలలో సిటీకి తీసుకొచ్చి ఆధునిక సౌకర్యా లున్న పెద్ద ఆసుపత్రిలో చూపిస్తే ఆపరేషన్ చేస్తే నయమైపోతుందని […]

Continue Reading
Posted On :
Vijaya Tadinada

నేను బాగానే ఉన్నాను (క‌థ‌)

నేను బాగానే ఉన్నాను -విజయ తాడినాడ  నా ప్రియమైన నీకు .. .. ‘ఎలా ఉన్నావు? బాగున్నావా?’ ఇదొక అర్థం లేని ప్రశ్న కదూ?           అసలు “బాగుండటం” అనే పదానికి అర్థం ఏంటో?’ అని చాలాసార్లు ఆలోచిస్తాను.. విఫలమవుతూనే ఉంటాను.           చిన్నతనంలో నేనే ఒక రాకుమారిని.. అమ్మ అనురాగం, నాన్న మమకారం .. అన్నల మాలిమి, అక్కల మక్కువ …. అన్నాలాటలు, తొక్కుడుబిళ్లలు, […]

Continue Reading
Posted On :

మాకు మీరూ మీకు మేమూ (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

మాకు మీరూ మీకు మేమూ (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -జి.యెస్.లక్ష్మి “ఇప్పుడెలాఉంది పిన్నిగారూ..” నెమ్మదిగా కళ్ళు విప్పిన అనసూయకి తన మీదకి వంగి ఆరాగా అడుగుతున్న ప్రసన్నని చూస్తే “అమ్మయ్యా..” అనిపించింది. పైకి లేవడానికి ప్రయత్నిస్తున్న ఆమెకి ఆసరా అందిస్తూ నెమ్మదిగా లేపి కూర్చోబెట్టింది ప్రసన్న.. “వేడిగా కాఫీ కలిపి తెమ్మంటారా..” అనడిగిన ప్రసన్నని వద్దని చేత్తో వారిస్తూ.. హాల్ వైపు చూసింది. ఆమె ప్రశ్న తెలిసినట్టు “బాబాయిగారూ… పిన్నిగారు లేచారు..” […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-49)

నడక దారిలో-49 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజుతో కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకీ, బాబు మూడున్నర ఏళ్ళకీ అనారోగ్యంతో చనిపోయారు. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, బియ్యీడీ పూర్తిచేసి, […]

Continue Reading

ఒక తల్లి ప్రతిస్పందన! (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఒక తల్లి ప్రతిస్పందన! (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -సూర్యనారాయణ గోపరాజు వర్ధనమ్మ గారు.. ధీర్ఘాలోచనలో పడింది! ఈ మధ్య ఆమె ఆలోచనలు.. ఎటూతేలక.. అంతు లేకుండా సాగుతున్నా యి. భర్తఆనందరావు పోయి.. తాను ఒంటరైనప్పటి నుంచి.. దిగులుతో ఇదేపరిస్థితి! భర్తఉండగా.. ఆయన నీడలో.. వంటిల్లు చక్కబెట్టు కుంటూ,.. ఆమెజీవితం.. ఎంతో ధీమాగా పశ్రాంతంగా సాగిపోయేది! వారి సరిగమల సంసార జీవితంలో.. భార్యా భర్తలిద్దరూ.. ఒక్కగానొక్క కొడుకు శ్రీనాధ్ ను.. అల్లారు ముద్దుగా […]

Continue Reading

నాతి చరామి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

నాతి చరామి (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -తెన్నేటి శ్యామకృష్ణ ఆరు గదుల పాతకాలపు డాబా ఇల్లది. మూడు మూడు గదుల వాటాలు  రెండు. ఒక పోర్షన్ లోని ముందు గదిలో శిరీషకు పెళ్లిచూపులు జరుగుతున్నాయి. స్కూల్ ఫైనల్ అయ్యాక,  ITI  లో చేరి ఎలక్ట్రిక్ వర్క్స్ మెయిన్ గా చేసాడు. తండ్రి అప్పుల ఊబిలో కూరుకుపోయేసరికి, తల్లి సాధింపులు,ఇంట్లో శాంతి లేకుండా పోయింది. సరదాగా నేర్చుకొన్న డ్రైవింగ్ జీవనోపాధిగా చేసుకొన్నాడు. అతనికి […]

Continue Reading

సమన్యాయం (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

సమన్యాయం (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -ఎ.శ్రీనివాసరావు (వినిశ్రీ) “నేను చెప్పిన విషయం ఆలోచించావా ఆకాష్, మనం ఏదో ఒక నిర్ణయం తొందరగా తీసుకోవాల్సిన సమయం దగ్గరకు వచ్చేసింది. నేను ఆఫీసు వాళ్ళకు ఏ నిర్ణయమైనా ముందుగానే చెప్పాలి.” ఆకాష్ మెదడులో సవాలక్ష సందేహాలు మొన్న మొన్నటి వరకు తిరిగాయి. ధరణి ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉండిపోయాడు. “సమాధానం లేకుండా అలా మౌనంగా ఉంటే ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఆకాష్. […]

Continue Reading

వాళ్ళు వచ్చేశారు (హిందీ: `“आखिर वे आ गए”’ డా. రమాకాంత శర్మ గారి కథ)

 వాళ్ళు వచ్చేశారు आखिर वे आ गए హిందీ మూలం – డా. రమాకాంత శర్మ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు అన్నయ్య ఉత్తరం చూసి నిజానికి నేను సంతోషించాలి. ఎందుకంటే ఈ చిన్న టౌన్ లో నేను ఉద్యోగంలో చేరిన తరువాత అన్నయ్య సకుటుంబంగా మొదటిసారి నా యింటికి వస్తున్నాడు. ఈవారంలో ఎప్పుడైనా ఇక్కడికి చేరుకుంటామని రాశాడు. అంటే దాని అర్థం వాళ్ళు ఇవాళ లేదా రేపటిలోపల ఇక్కడికి వస్తున్నారని. అన్నయ్య […]

Continue Reading

నిర్భయనై (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నిర్భయనై (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -ఎస్.కే.ఆముక్తమాల్యద స్వాప్నిక జగత్తులో విహరిస్తూన్న వేళ… ప్రకృతికి పరవశిస్తూ… కొండలు, లోయలు, వాగులు, వంకలు ఎన్నెన్నో దాటి కీకారణ్యంలోకి ప్రవేశించాను పులులు, సింహాలు, తోడేళ్లు, పాములు.. ఆప్యాయంగా..ఆర్ద్రంగా దయాపూరిత దృక్కులు ప్రసరిస్తూ. .. స్నేహ పరిమళాలు వెదజల్లుతూ.. వాటిని ఆఘ్రాణిస్తూ నేను.. కృూర మృగాల ప్రేమ జడిలో తడిసి ముద్దవుతూ నిర్భయనై హాయిగా సంచరించాను. సుషుప్తి నుంచి జాగృదావస్థలోకి రాక తప్పలేదు జనారణ్యంలోకి ప్రవేశింపకా తప్పలేదు. […]

Continue Reading

స్వీయ నిర్వచనం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 స్వీయ నిర్వచనం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -టి. రాజగోపాల్ గాయపరచి వికలం చేసిందెవరో జ్ఞాపకాల్లోంచి చెరిపేశాను చెయ్యందించి వదనాన చిరునవ్వులు మళ్ళీ పూయించిందెవరో స్మృతిలో పదిలం చేసుకున్నాను ప్రేమ , అనురక్తి , మాయనే మాయని స్ఫూర్తి , దూర దృష్టి , విసుగెరుగని పరిశ్రమలతో నెయ్యం వియ్యం కలుపుకుని అడుగులేస్తాను పరిపూర్ణంగా మనోనేత్ర దర్పణంలో నన్ను నేను దర్శించుకుంటాను బహిరంతర ఆహార్యాలు సరిదిద్దుకుంటాను నేనెవరో నాకు సందిగ్ధాలూ సంతాపాలూ లేకుండా […]

Continue Reading
Posted On :

ఆమెను పట్టించుకుందాం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఆమెను పట్టించుకుందాం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -వెంకు సనాతని పొద్దుపొడవక మునుపే బడలికను విదిలించి నడక మొదలుపెడుతుంది పొద్దుపోయాక ఎప్పుడో ఆమె పరుగుకు విరామం దొరుకుతుంది టైము టంగుమనక ముందే టంచనుగా పనులన్నీ చక్కబెట్టడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య ఇంటి పనంతా ఆమెదే, బయట పనికి కుదిరినా కూడా… సూర్య చంద్రులకైనా అలుపుంటుంది కానీ, అవనికి అలంకారమైన ఆమెకు దైనందిత జీవన గమనంలో ఏ మలుపులోనూ అలుపుండదు ఇష్టాయిష్టాల్ని ఎరిగి […]

Continue Reading
Posted On :

ఒక ముద్దు -కైఫి ఆజ్మీ (తెలుగు సేత: వారాల ఆనంద్ )

 ఒక ముద్దు -కైఫి ఆజ్మీ తెలుగు సేత: వారాల ఆనంద్ ఈ అందమయిన కళ్ళను ముద్దు పెట్టుకున్నప్పుడల్లా చీకట్లో వంద కొవ్వొత్తులు వెలుగుతాయి పువ్వులూ మొగ్గలూ చంద్రుడూ తారలే కాదు వ్యతిరేకులూ ఆమె ముందు మోకరిల్లుతారు అజంతా చిత్రాలు నృత్యం చేయడం ఆరంభిస్తాయి సుదీర్ఘ నిశ్హబ్దంలో వున్న గుహలు పాటందుకుంటాయి దాహార్తి అయిన భూమ్మీద వర్షపు మబ్బులు గుమిగూడతాయి ఈ ప్రపంచం క్షణకాలం నేరాల్ని త్యజిస్తుంది క్షణకాలం రాళ్లూ చిరునవ్వు నవ్వడం మొదలుపెడతాయి ***** వారాల ఆనంద్వారాల […]

Continue Reading
Posted On :

అలవాటే ఆమె కది (కవిత)

అలవాటే ఆమె కది – ప్రసాదరావు రామాయణం అలవాటే ఆమేకది.. విషాదాన్ని మ్రింగి అలవోకగా చిరునవ్వు విసరడం! గరాళాన్ని త్రావి గొంతులో దాచుకోవడం!! అలవాటే ఆమేకది విరిసీ విరియగానే సావాసగాళ్లను దూరంపెట్టి ఊరించడం,ఉడికించడం ! అలవాటే ఆమేకది.. పుట్టినింటి ఆత్మీయ అయస్కాంత వలయాన్ని ఛేదించుకుని మెట్టినింటిలో క్రొత్త అనుభూతులు వెతుకుకోవడం ! అలవాటే ఆమేకది అత్తగారి ఎత్తిపొడుపులను అతి సాధారణంగా అనుభవించడం ! అలవాటే ఆమేకది…. పురిటి నొప్పులలో మరుసటి సౌఖ్యాన్ని అనుభూతించడం పాపను చూచినంతనే స్తన్యం […]

Continue Reading

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -6 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 6 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద డిసెంబర్ 1998-జనవరి 1999 మధ్యలో నేనక్కడ టూర్ లో ఉన్నప్పుడు చూసిన వాటి గురించి ముందే చెప్పాను. గమడా రోడ్ లో ఖరారు చేసుకున్న వలస కూలీల రవాణా గురించి నేను గమనించినది ఇక్కడ ప్రస్తావించదగినదే. ఆ రాత్రి నేను కుర్తా పైజమా వేసుకుని శాలువా కప్పుకుని టౌన్ వీధుల్లో నడుస్తు […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-5

సస్య-5 – రావుల కిరణ్మయి మలుపు (సస్య విదుషి మాట మీద శ్రావణ్ ఇంటికి వంట చేయడానికి ఒప్పుకుంది. ఆ తరువాత …) ***           ఉదయం నాలుగు గంటలకే నిద్ర లేచింది. కాసేపు మంచంలో కూర్చుండి తరువాత ఒక గంటలో ఇంటి పనులు స్నానం పూజ ముగించుకుంది. చెల్లెను, తమ్ముడిని చదువుకోవడానికని నిద్ర లేపింది. అమ్మను లేపాలనుకోలేదు. నిద్రలో ఆమె కలలు అవి ఎప్పటికీ ఆమెకు కలలే. కానీ అమ్మ […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-10 అమ్మాయిలూ తొందరపడకండి !

కాదేదీ కథకనర్హం-10 అమ్మాయిలూ తొందరపడకండి ! -డి.కామేశ్వరి  ఓ చేతిలో ఏణార్ధం పాప, రెండో చేత్తో బరువయిన ప్లాస్టిక్ బ్యాగు, భుజానికి నిండుగా వున్నా హ్యాండు బ్యాగుతో బస్సు కోసం ఎదురు చూస్తూ అసహనంగా నిల్చుంది భారతి. ఎండాకాలం ఏమో ఉదయం ఎనిమిదన్నరకే ఎండ చుర్రుమంటోంది. ఉక్క చెమట, చీదరతో చేతిలో పాప చిరాగ్గా ఏడుస్తోంది. చేతిలో బరువు, దానికి తోడు పాప ఏడుపు . రాని బస్సు కోసం ఎదురు చూపుతో నీరసం వస్తోంది భారతికి. […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-24 ప్రేమలీల. బి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-24  ప్రేమలీల. బి  -డా. సిహెచ్. సుశీల మధ్యతరగతి జీవితాలను గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా అర్ధం కానిది ఏదో ఉంది అనిపిస్తుంది. మనోవేదనలకి ఒక ఇంచ్ దగ్గరలో, మందహాసాలకి ఒక ఇంచ్ దూరంలో ఉంటాయి వారి జీవితాలు. కింది తరగతికి దిగజారలేక, పై తరగతికి ఎగరలేక, గొప్పవారి హంగూ ఆర్భాటాలు చూసి నిట్టూర్పులు విడుస్తూ లోలోపల ముడుచుకుపోతూ వుంటారు. ఉన్నదానితో తృప్తి పడలేరు, లేనిదాన్ని అందుకోలేరు. దాని వల్ల సతమతమై పోతూంటారు. […]

Continue Reading

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి భవానీ ఠాకూర్ తను ఇచ్చిన మాట ప్రకారం ప్రఫుల్లకు తోడుగా ఇద్దరు స్త్రీలను పంపించాడు. ఒకరు ఏ పని మీదైనా బయటకి వెళ్లిరావటానికి. ఈవిడ మధ్య వయస్కు రాలు, శ్యామ ఛాయ. రెండవ స్త్రీ వయసు ఇరవై వుంటుందేమో, తెల్లగా వుంది. ప్రఫుల్లకు ఎప్పుడూ ఇంటి దగ్గర తోడు వుండటానికి. ఇద్దరూ ప్రఫుల్లకు ప్రణామం చేశారు. మీ పేర్లేమిటని […]

Continue Reading
Posted On :

అనుసృజన- సాహిర్

అనుసృజన సాహిర్ హిందీ మూలం: సాహిర్ లుధియానవి అనుసృజన: ఆర్ శాంతసుందరి ‘లోగ్ ఔరత్ కో ఫకత్ జిస్మ్ సమఝ్ లేతే హైరూహ్ భీ హోతీ హై ఇస్ మే యె కహా( సోచతె హై’ అందరూ స్త్రీ అంటే శరీరమనే అనుకుంటారుఆమెలో ఆత్మ కూడా ఉంటుందని ఆలోచించరు.           ఇది రాసింది సాహిర్ లుధియానవి. హిందీ సినిమా పాటలు ఇష్టపడే వాళ్ళకి సాహిర్ పేరు సుపరిచితమే. కానీ ఆ పాటలలో స్త్రీవాదాన్ని వినిపించిన […]

Continue Reading
Posted On :

అల్లంత దూరాన ఆస్ట్రేలియాలో-22

అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 22 – విజయ గొల్లపూడి జరిగినకథ: విశాల, విష్ణు కొత్తగా పెళ్ళి చేసుకుని, ఆస్ట్రేలియాలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న జంట. విష్ణు ఉద్యోగం వెతుక్కుని, ఆర్థికంగా ఇపుడిపుడే నిలదొక్కు కుంటున్నాడు. విశాల వైవాహిక జీవితంలో అడుగిడి, మరోప్రక్క కెరీర్ పై దృష్టి సారిస్తోంది. ఇద్దరూ నాలుగు రోజులు కాఫ్స్ హార్బర్ విహార యాత్రకి వెళ్ళారు. ***           భూమిపై మనిషి ప్రవేశం ఒంటరిగానే, అలాగే నిష్క్రమణ కూడా […]

Continue Reading
Posted On :

ఆరాధన-6 (ధారావాహిక నవల)

ఆరాధన-6 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నేను హైదరాబాద్ చేరిన రెండో రోజునే ఎల్.వి.ఆర్ ఫౌండేషన్ వారి అవార్డు ఈవెంట్ కి తోబుట్టువులతో సహా చెన్నైకి బయలుదేరాను. ఫ్లయిట్ దిగుతూనే మమ్మల్ని ఎల్.వి. రామయ్యగారి మనుషులు నేరుగా వారి గృహానికి తీసుకుని వెళ్లారు. ఆయన సతీమణి మమ్మల్ని ఆప్యాయంగా ఆహ్వానించారు. దగ్గరుండి స్వయంగా వడ్డన చేయగా మేము ఆరగించిన షడ్రుచుల విందు ఎన్నటికీ మరువలేము. విందు తరువాత రామయ్యగారు మరునాటి ఈవెంట్ గురించి చెప్పారు. వారి సంస్థ […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 25

యాదోంకి బారాత్-25 -వారాల ఆనంద్ ఒక్కోసారి నిలిచిపోవడం/ కాల్రెక్కలు కుదేసినట్టు కూలబడిపోవడం/ మంచిదేనేమో….. మనిషిదేముంది ఆకులు రాలిన చెట్టులాంటివాడు ఎండిన మోట బావిలాంటి వాడు మళ్ళీ చిగురిస్తాడు ఊటలోంచి ఎగిసిపడ్డ తేటనీరులా ఉప్పెన అవుతాడు ఒక్కోసారి నిలిచిపోవడంలోంచే ఉవ్వెత్తున ఎగిసిపడటానికి సత్తువ వొస్తుంది తలెత్తుక తిరగడానికి ప్రాణమొస్తుంది ***           బతుకు పరుగులో స్పీడ్ బ్రేకర్ అనుకున్నదాన్ని దాటేశాను. నిజానికి అది దాటగానే రహదారిలో ఓ మలుపు ఎదురయింది. మూల తిరిగి […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 49

నా జీవన యానంలో- రెండవభాగం- 49 -కె.వరలక్ష్మి           మెలకువ వచ్చేసరికి విండోలోంచి అద్భుతమైన దృశ్యం. మేఘాలకి పైన, 38 వేల అడుగుల ఎత్తులో ఉంది ఫ్లైట్. నీలిరంగు మీద దూది పింజలు పేర్చినట్టు, మంచుతో ఆకాశంలో పర్వతాల్ని భవనాల్ని తీర్చి దిద్దినట్టు ఉంది దృశ్యం. మొదటి సూర్యకిరణం వెనకనుంచి విమానం ఎడమ రెక్కమీద ఒక అంగుళం మేర మెరిసి క్రమక్రమంగా పెరిగింది. ‘‘మేఘాలను దాటి ఇంతపైకి వచ్చిన ఈ అనుభూతిని […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 28

వ్యాధితో పోరాటం-28 –కనకదుర్గ నా డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూసి ఇంకొన్ని టెస్ట్స్ చేసి చూసాక ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రక్కన పేషంట్ని చూడడానికి చాలామంది మెడికల్, హాస్పిటల్ కౌన్సిలర్ వచ్చారు. ఒక కర్టన్ తప్ప ఏ అడ్డం లేదు పక్క పేషంట్ కి నాకు మధ్యన. మాటలన్నీ క్లియర్ గా వినిపిస్తాయి. “మీ పిల్లలకు ఇన్ ఫార్మ్ చేసారా?” “లేదు. మీరేం చెబ్తారో చూసి చెప్పాలనుకున్నాం.” “సర్జరీ తప్పకుండా చేయాలి. ఆ […]

Continue Reading
Posted On :

జీవితం అంచున – 25 (యదార్థ గాథ)

జీవితం అంచున -25 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి ఇల్లంతా బంధుమిత్రులతో క్రిక్కిరిసి వుందేగాని వాతావరణం ఆనందానికి బదులు ఉద్వేగంగా వుంది. ఎవరికి వారే వారి వారి పద్దతిలో అమ్మను బయిల్దేరటానికి ప్రేరేపిస్తు న్నారు. రాత్రి పన్నెండు గంటలకు ఫ్లైట్ డిపార్చర్.. కోవిడ్ పరీక్షల నిర్ధారణ, ఇతర సంబంధిత డాక్యుమెంట్స్ చెకింగ్ కారణంగా నాలుగు గంటలు ముందుగా రిపోర్ట్ చేయవలసి వుంది. ఇంటి నుండి ఏడు గంటలకు బయిల్దేరాలి. వచ్చిన బంధుమిత్రులంతా భోజనం […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-23

నా అంతరంగ తరంగాలు-23 -మన్నెం శారద నాకు తెలిసిన రమాప్రభ  శరత్ బాబు గారు చనిపోయినప్పుడు నేను ప్రత్యేకమైన పోస్ట్ పెట్టలేదు. శరత్ బాబు గారితో వున్న కొద్దిపాటి పరిచయం, రమా ప్రభ గారితో వున్న మరి కాస్త ఎక్కువ పరిచయం జ్ఞప్తికి వచ్చిమాత్రం బాధ పడ్డాను. శరత్ బాబు గారి నటన గురించో, అందం గురించో నేనిక్కడ ప్రస్తావించ దలచుకో లేదు. ఆయనకు లభించిన పాత్రలవరకూ ఆయన పాడు చేయకుండా న్యాయమే చేశారు. తెలుగులో కన్నా […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-43 – నా నువ్వు- నీ నేను – లత కందికొండ గారి కథ

వినిపించేకథలు-43 నా నువ్వు- నీ నేను రచన : లత కందికొండ గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned […]

Continue Reading

కథావాహిని-19 జి. ఆర్. మహర్షి గారి “పురాగానం” కథ

కథావాహిని-19 పురాగానం రచన : జి. ఆర్. మహర్షి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-66)

వెనుతిరగని వెన్నెల(భాగం-66) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/dyf-0PbDeJQ?si=GxJj26_VC7yxJJlO వెనుతిరగని వెన్నెల(భాగం-66) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-41 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-41 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-41) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) మే 21, 2022 టాక్ షో-41 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-41 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-50 “విరాట్ ” పార్ట్-3, అనువాద రచయిత: పొనుగోటి కృష్ణారెడ్డి )

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

యాత్రాగీతం-63 హవాయి- మావీ ద్వీపం (భాగం-4)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-4) రోజు -4 రోడ్ టు హానా -డా||కె.గీత మర్నాడు మావీలో తప్పనిసరిగా చూడవలసిన “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యడానికి నిశ్చయించుకున్నాం.  ఉదయం ఎనిమిది గంటల కల్లా తయారయ్యి కారులో కూర్చున్నాం. అసలు మావీ ద్వీప సందర్శనకు వచ్చే వారెవరైనా తప్పనిసరిగా ఈ  “రోడ్ టు హానా” సీనిక్ డ్రైవ్ చెయ్యకుండా వెళ్లరట. అయితే అంత ప్రసిద్ధి గాంచిన దైనా, చిన్న రోడ్ల వెంట, పర్వతాల అంచుల […]

Continue Reading
Posted On :

పౌరాణిక గాథలు -25 – వజ్రాయుధాలు – దధీచి మహర్షి కథ

పౌరాణిక గాథలు -25 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి వజ్రాయుధాలు – దధీచి మహర్షి కథ దధీచి మహర్షి గొప్ప తపశ్శాలి. ఆయన భార్య లోపాముద్ర మహా పతివ్రత. ఆ రోజుల్లో వృత్రాసురుడనే రాక్షసుడు దేవతల్ని బాధి౦చడమే కాకు౦డా వాళ్ల అస్త్రాల్ని తీసుకెళ్లిపోయి యుద్ధానికి అ౦దుబాటులో లేకు౦డా చేస్తు౦డేవాడు. దేవతలకి భయ౦ వేసి దధీచి మహర్షిని కలిసారు. “మహర్షీ! మా అస్త్రాల్ని రాక్షసులు ఎత్తుకుపోకు౦డా మీ దగ్గర దాచి పెట్ట౦డి!” అన్నారు. ఆయన అ౦దుకు అ౦గీకరి౦చాడు. చాలా కాల౦ […]

Continue Reading

రాగసౌరభాలు- 11 (కేదారగౌళ)

రాగసౌరభాలు-11 (కేదారగౌళ) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ నేస్తాలు అందరికీ నూతన వత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అందరికీ శుభాలను అందించాలని కోరుకుంటున్నాను. ఈ మాసం మనం కేదారగౌళ రాగ విశేషా లను ముచ్చటించుకుందాము. ముందుగా ఈ రాగ నామ విశేషాలు గమనిద్దాము. కొందరు శాస్త్రకారుల ప్రకారము కేదార అంటే పొలము, గౌళ/గౌడ అంటే గౌడ దేశము. గౌడ దేశములోని పొలము పాటలలో ఈ రాగ స్వరూపము లభించి ఉండవచ్చని అభిప్రాయము. అనేక రాగాలు జానపదాల నుంచి […]

Continue Reading

కనక నారాయణీయం-64

కనక నారాయణీయం -64 –పుట్టపర్తి నాగపద్మిని ఇటీవల  ఆళ్ళగడ్డ రాజశేఖరా బుక్ డిపో ప్రింటర్ పరిచయమైనాడు. ఇంటికొచ్చి మరీ అడిగినాడు, ‘మీకు విజయనగర చరిత్రతో మంచి అనుబంధం ఉంది కదా! దాన్ని గురించి చారిత్రక నవల వ్రాయండి స్వామీ! మీరు బాగా పరిశోధన చేసినారు కదా!  తాతాచార్యుల వంశస్తులు కూడా! మీరు వ్రాస్తే, ప్రింటు చేసేందుకు నేను రెడీ!’ అన్నాడు. తనకూ ఆ ప్రతిపాదన నచ్చింది. సరేనన్న తరువాత విచికిత్స. విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఎన్నెన్నో ఉత్కంఠభరితమైన […]

Continue Reading

బొమ్మల్కతలు-27

బొమ్మల్కతలు-27 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటి లో సైతం కనిపించే నల్లదనం…ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయ మే. బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు […]

Continue Reading

చిత్రం-60

చిత్రం-60 -గణేశ్వరరావు  టోనీ ప్రో, కాలిఫోర్నియాకు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, పెయింటింగ్ లో శిక్షణ పొందారు.           అతనివి కాల్పనిక చిత్రాలు కావు. ఊహాజనితం కావు. వాస్తవికత నిండినవి. అతను ఎప్పుడూ తన నిజ జీవితంలోని వ్యక్తులను చిత్రించాలని అనుకుంటాడు : తన అందమైన భార్య, పిల్లాడు, తన మిత్రులు, క్లబ్ […]

Continue Reading
Posted On :

“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల

“ప్రశ్న” ఒడుపు తెలిసి విసిరిన ఒడిశాల (బంగారు ఆచార్యులు గారి “ప్రశ్న” కవితా ఖండికపై పరామర్శ) -వి.విజయకుమార్ ఒక కవితా ఖండికకు వినూత్నంగా “ప్రశ్న” అనే శీర్షిక  కావడమే ఒక చైతన్యం. ప్రశ్నించడం అంటేనే చైతన్యం. బంగారు ఆచార్యులు గారు వామపక్షవాది. వామ పక్షీయుల దృక్కోణం ఎప్పుడూ సమాజ హితాన్ని కోరుతుంది. ఉద్యమ నేపథ్యంతో, ప్రజా సంబంధాలతో, క్షేత్రస్థాయిలో అనేక పోరాటాల్లో స్వయంగా పాల్గొని సోషలిస్టు మార్గంలో సమాజం నడవాలని ఆకాంక్షిస్తూ, నడుస్తున్న చరిత్రలోని అమానవీయ, అన్యాయపు […]

Continue Reading
Posted On :

యలవర్తి నాయుడమ్మ

ఆదర్శ శాస్త్రవేత్త పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ(1922-1985) -పి. యస్. ప్రకాశరావు పుట్టుకతో రైతుబిడ్డని.వృత్తిరీత్యా అంటరానివాణ్ణి అని గర్వంగా పరిచయం చేసుకున్న ఆదర్శ శాస్త్రవేత్త పద్మశ్రీ యలవర్తి నాయుడమ్మ 1922 సెప్టెంబర్ 10 న గుంటూరు జిల్లా యలవర్రులో ఒక వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. చర్మకారులను అంటరానివాళ్లుగా చూసే రోజుల్లో అంటే సుమారు 8 దశాబ్దాల తోళ్ల పరిశ్రమ పట్ల చిన్నచూపు ఉండటం సహజమే. శాస్త్రవేత్తలయితే తోళ్ళపరిశ్రమకు సైన్స్ అనవసరం అనేవారు. తోళ్ళని చదును చేసే ప్రక్రియ అన్నా, […]

Continue Reading

మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025

మక్కెన సుబ్బరామయ్య ఫౌండేషన్ సాహితీ పురస్కారాలు 2025 -ఎడిటర్‌ ఈ క్రింద పేర్కొన్న సాహిత్య పురస్కారాల (11వ) కోసం రాష్ట్రేతర / ఉభయ తెలుగు రాష్ట్రాల రచయితల నుండి 2024 సం॥లో (జనవరి నుండి డిసెంబర్‌ వరకు) ప్రచురించిన పుస్తకాలను ఆహ్వానిస్తున్నాము. 1) శ్రీ మక్కెన రామ సుబ్బయ్య కధా పురస్కారం 2) ఆచార్య నెల్లుట్ల కవితా పురస్కారం 3) డా॥ కె వి రావు కవితా ప్రక్రియ పురస్కారం (మినీ కవితలు, గజల్స్‌, నానీలు, హైకూలు, దీర్ఘకవితలు […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-44

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure.  Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-32 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 32 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

America Through My Eyes – THE HONOLULU – OAHU ISLAND PART -2

America Through My Eyes THE HONOLULU – OAHU ISLAND PART -2 Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar Diamond Head Monument: After returning from a morning snorkeling tour in Honolulu and feeling tired, there were two places on our list of must-sees during our two days in Honolulu that day. The first one […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-డిసెంబర్, 2024

“నెచ్చెలి”మాట  ఒరులేయవి యొనరించిన -డా|| కె.గీత  ఒరులేయవి యొనరించిన యప్రియము తన మనంబున కగు తానొరులకు నవి సేయకునికి …… అంటే దెబ్బకు దెబ్బ చెల్లుకు చెల్లు టిట్ ఫర్ టాట్ అన్నీ గంగలో కలిపి ఎవరేం చేసినా తిరిగి ఏమీ చెయ్యకూడదన్నమాట! అంటే గాంధీ గారిలా ఓ చెంప మీద ఎవరైనా కొడితే మరో చెంప కూడా వాయగొట్టమని చూపించడమన్నమాట! సరే- చెప్పడానికి నీతులు బానే ఉన్నాయండీ- కానీ మళ్ళీ మళ్ళీ లోకువకట్టే వాళ్ళనీ మళ్ళీ […]

Continue Reading
Posted On :

The tune of life (Telugu:Jeevaragam By K. Varalakshmi)

The tune of life (జీవరాగం) (Telugu Story) Telugu Original : Smt. K. Varalakshmi Garu English Translation : Dr. K. V. Narasimha Rao It was not known why the train had stopped for such a long time. I kept the novel that I was reading, aside with annoyance and looked out of the window. The view […]

Continue Reading

జాహ్నవి (హిందీ: `जाह्नवी’ – లతా అగర్వాల్ గారి కథ)

జాహ్నవి जाह्नवी హిందీ మూలం – లతా అగర్వాల్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు “దయచేసి వినండి. భోపాల్ జంక్షన్ నుంచి వారణాసికి వెళ్ళవలసిన బండి కొద్దిసేపట్లోనే ప్లాట్ ఫారం నెం. ఒకటి మీదికి వస్తోంది.” రైలు నిర్వాహకుల ద్వారా ప్రకటన చేయబడింది. ప్రయాణీకుల్లో ఆత్రుత మొదలయింది. అందరూ డిస్ప్లే బోర్డు మీద తమ-తమ బోగీ నెంబరు వెతుక్కుంటూ ముందుకీ వెనక్కీ వెడుతున్నారు. అయిదు నిమిషాల్లోనే ధడధడమని ధ్వనిచేసుకుంటూ ట్రైన్ తన వేగంతో […]

Continue Reading

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

అసలు అర్థం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -సింగరాజు రమాదేవి విషాదమేమీ ఉదాత్తమైన భావన కాదు! దాన్ని అర్ధం చేసుకుని అధిగమించేందుకు చేసే ప్రయాసలోనే ఉంది ఉదాత్తత! పిరికితనం నేరమేమీ కాదు! భయపడుతూ అయినా చేసే తిరుగుబాటు ప్రయత్నంలోనే దాగి ఉంది ధీరత్వం! నిరంతరం ఒకరి నీడలో, బేలగా పరాధీనగా బ్రతికితే అంతా ప్రశాంతమే! జీవితపు ఉపరితలం పై అలవోకగా ఆనీ ఆనకుండా అడుగులేస్తుంటే అంతా నునుపే! గుండెలనిండా ఊపిరిపీల్చుకుని బలంగా కాలు […]

Continue Reading

ఈ తరం నడక-9- అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి

ఈ తరం నడక – 9 అన్ బ్యాలెన్స్డ్ ఎమోషనల్స్ – పూర్ణిమ తమ్మిరెడ్డి -రూపరుక్మిణి. కె             మనిషై పుట్టాక ఏదో ఒక ఎమోషన్ క్యారీ చేయక తప్పనిసరి. పసితనంలో మొదలైన ఆలోచనలలో ఎవరి ఆలోచన ఎక్కడ ఆగిపోతుందో..? ఎవరి ఆలోచన ఎక్కడ మొదలవుతుందో మనకి తెలియదు.           ఇలా కొన్ని కథలు చదువుతుంటే ఇన్ని ఎమోషన్స్ ఎలా క్యారీ చేస్తున్నారు ఈ […]

Continue Reading
Posted On :

కథామధురం-ఆ‘పాత’కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి

కథా మధురం  ఆ‘పాత’ కథామృతం-23 నందగిరి ఇందిరాదేవి  -డా. సిహెచ్. సుశీల ఆడపిల్లలు బడికి వెళ్ళి చదువుకునే సంప్రదాయం లేని రోజుల్లో, కనీసం అక్షర జ్ఞానం లేని రోజుల్లో కూడా వారు ఇంట్లో అమ్మమ్మలు నానమ్మల ద్వారా విని నేర్చుకున్న పాటల్ని పాడుకునే వారు. శ్రామిక స్త్రీలు కూడా పొలం పనుల్లో వరినాట్లు లోనో, కలుపు తీస్తూనో, శ్రమ తెలియకుండా, అలుపు రాకుండా పాటలు పాడుకునేవారు. దంపుళ్ళ పాటలు, తిరగలి పాటలు, కవ్వం పాటలు నుండి పెళ్ళిసంబరాలకి […]

Continue Reading

కలల కరపత్రం (కవిత)

కలల కరపత్రం -డా||కె.గీత అమ్మా! ఎందుకేడుస్తున్నావు? అప్పటిదాకా గాలిపటం ఎగరేస్తున్న బిడ్డడేడనా? ప్రపంచపటమ్మీద సరిహద్దుల కోసమో ఆధిపత్యం కోసమో కలల్ని కూలదోసేచోట గాలిపటాలకు తావుందా? రోజూ బాంబు దాడుల మధ్య తిండీ, నిద్రా లేని పసికందుల భవిష్యత్తునీ నేల రాస్తున్న చోట ఒక్కటే మళ్ళీ మళ్ళీ మొలుస్తున్నది యుద్ధ కుతంత్రం- అయినా ఎగరేయాలి- స్వేచ్ఛగా వీధుల్లో బంతాటాడుకునే బాల్యాలు మళ్ళీ మొలకెత్తేవరకు ఎగరేయాలి- నీ బిడ్డడు కూలిన భవంతుల కింద దారపు ఉండ చుట్టుకున్న చెయ్యిగానో తెగిన […]

Continue Reading
Posted On :

పనిచేస్తేనే పరమానందం! (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

పనిచేస్తేనే పరమానందం! (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -మారోజు సూర్యప్రసాదరావు ఒక బహుళ అంతస్థుల అపార్ట్‌మెంట్‌లో ఐదవ అంతస్థులో వున్న డా॥నీరజ అనే నేమ్‌ప్లేటున్న రెండు బెడ్‌రూమ్‌ల ఫ్లాట్‌ ముందు నిలబడి కాలింగ్‌బెల్‌ నొక్కాను. సరిగ్గా సమయం నాలుగు గంటలౌతోంది! ప్రధాన ముఖద్వారం తలుపు తీసుకుని ఓ మధ్యవయస్కురాలు వచ్చింది. ‘‘గుడ్‌ ఈవినింగ్‌ డాక్టర్‌ నీరజా!’’ ఆహ్లాదకర లేతరంగు చీరలో ప్రశాంతమైన వర్చస్సుతో అక్కడక్కడా నెరసిన జుట్టుతో కనిపించిన ఆమెను అప్రయత్నంగా విష్‌చేయకుండా […]

Continue Reading

వేతన వెతలు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

వేతన వెతలు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -కె.విజయ ప్రసాద్ వసంతకు కొంత అలసటగా ఉంది. నడుం వాలుద్దామనుకుంది. కానీ సునందకు తనిచ్చిన వాగ్దానం గుర్తుకొచ్చింది. వాళ్ళబ్బాయి రమేష్‌ పుట్టినరోజు పండుగకు తప్ప కుండా వస్తానని వాగ్దానం చేసింది. వసంత, సునందల స్నేహం ఈనాటిది కాదు. రెండు దశాబ్దాల నుంచి ఫ్రండ్సు. భర్త మనోజు యింకా రాలేదు. అతను నలభై కిలోమీటర్ల దూరంలోని ఒక పల్లెటూరులో టీచరుగా అఘోరిస్తున్నాడు. అతనితో పోలిస్తే తన […]

Continue Reading
Posted On :

కలంతో ఆమె నేను (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కలంతో ఆమె నేను (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -చిత్రాడ కిషోర్ కుమార్ ఆమె… నేను… ఎలా ఉంటామో మాకే తెలియదు కానీ ఆమె నన్ను చూస్తుంది నేను కూడా ఆమెను చూస్తూనే ఉంటాను చెట్లు చిగురిస్తున్నట్లు మాస్నేహమూ కొత్త చిగురు తొడుగుతూనే ఉంది కాలంతో మేమూ పరిగెడుతూనే ఉన్నాం ఒకానొక కాలంలో ఉత్తరాలలో కలుసుకునే వాళ్ళం కబుర్లు కలబోసుకునే వాళ్ళం బాధలు, బాధ్యతలు, వేడుకలూ అన్నిమాటలూ మారాతల్లోనే…. అయినా ఎన్నో తీపి […]

Continue Reading

ఆమె (కవిత)

ఆమె -గిరి ప్రసాద్ చెలమల్లు ఆమెకి ఓ సాంత్వన నివ్వు చేతనైతే ఆమె మౌనంలో ఎన్ని ఘోషలు దాగివున్నాయో వెతికే ప్రయత్నం చేసావా?! ఆమె గుండె దిటవు కావటం వెనుక ఎన్ని అగ్ని పర్వతాలు బద్దలయ్యాయో ఏనాడైనా గాంచావా! ఆమె చేయని నేరానికి ఆమెను పొడుచుకు తింటానికి కథంతా కాకపోయినా కాస్తంతైనా తెలియకుండానే ఒంటికాలిపై ఎగిరే ఎందరో తామేంటో తెలుసుకునే ప్రయత్నం చేసారా! ప్రేమ అనే రెండక్షరాల పదం పుట్టుక మర్మం ఎరుగక ముందు ఆమె మోములో […]

Continue Reading

ఏమి జంతువది (అస్సామీ మూలం & ఆంగ్లానువాదం – నీలిమ్ కుమార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

ఏమి జంతువది అస్సామీ మూలం & ఆంగ్లానువాదం: నీలిమ్ కుమార్ తెలుగు సేత: వారాల ఆనంద్ ఏమి జంతువది దాని ఆకలి ఎంతకూ తీరదు అసలే తృప్తి చెందదు దాని పొట్ట పరిమాణాన్ని అదే కొలవలేకున్నది ఎంత ఆహారం కావాల్నో దానికే తెలవదు ఆ సర్వభక్షకుడి పేరేమిటి భూమి ఇండ్లు వంతెనలు చెరువులు కుంటలు చెట్లు నదుల రెండు తీరాలు అది వేటినీ వదల్లేదు ఎంతకూ తృప్తి చెందని ఆకలితో వున్న ఆ జంతువేమీటది ఎల్లవేళలా ఆకలితోనే […]

Continue Reading
Posted On :

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ -5 (ఒరియా నవలిక ) మూలం- హృసికేశ్ పాండా తెలుగు సేత- స్వాతీ శ్రీపాద

ఆకలి చావుల కమీషన్ రిపోర్ట్ – 5 (ఒరియా నవలిక ) మూలం – హృసికేశ్ పాండా తెనుగు సేత – స్వాతీ శ్రీపాద 1999 లో ఆకలి చావుల కమీషనర్ గా నేను ఆ ప్రాంతం లో తిరిగాను. ఆ సమయానికి గ్రామ జనాభాలో పెద్ద సంఖ్యలో జనం అప్పుల వలలో ఇరుక్కుపోయారు. అంతకు మునుపు దాదాపు పదిహేను సంవత్సరాల క్రితం, ఆ ప్రాంతంలో ఒక ఏడాది పాటు పనిచేసాను. ఆ సమయంలో ఆ ఆర్ధిక […]

Continue Reading
Posted On :
ravula kiranmaye

సస్య-4

సస్య-4 – రావుల కిరణ్మయి అన్వేషణ (సస్య కిటికీలో నుండి బయటి పరిసరాలను గమనిస్తుండగా శరీరానికి చల్లగా తగిలి కెవ్వున అరిచింది.ఆ తర్వాత…) ***           ఒక్కక్షణం గుండె ఆగి కొట్టుకున్నంత అనుభూతి కలిగింది. చప్పున  ఆమెకు ఇందాక  గండు తుమ్మెదను గాలి సాయంతో దూరంగా నెట్టిన సెంటుమల్లె పూల చెండు సాహసం గుర్తుకు రాగా, వెనక్కి తిరుగుతూనే ఎటువంటి ఆలోచనా చేయకుండానే విసురుగా దేనినో తోసివేస్తున్నట్టుగా చేతితో తోసివేసింది. ఊహించని […]

Continue Reading
Posted On :

కాదేదీ కథకనర్హం-9 గుర్రపు కళ్ళెం

కాదేదీ కథకనర్హం-9 గుర్రపు కళ్ళెం -డి.కామేశ్వరి  రాజాధిరాజ……రాజమార్తాండతేజ…..వంది మాగధులు స్తోత్రం చేసే రాజాధిరాజు కాకపోయినా రంగాపురం జమిందారు రాజా రావుబహుద్దూర్ రంగరాజు గారి దివాణం …… రాణివాసంతో, దాసదాసీ జనంతో , విందులు, విలాసాలు , నాట్యాలు, అతిధి అభ్యాగతులతో కళకళలాడేది — ఆయనగారి ముఖ్య హాబీ గుర్రపు స్వారీ. ఎంత ఖర్చయినా సరే మంచి గుర్రం కనిపిస్తే కొనకుండా వదిలే వారుకారు. అరడజనుకి తక్కువ కాకుండా నల్లగా, ఎత్తుగా, బలంగా నిగ నిగలాడే గుర్రాలు సాలలో […]

Continue Reading
Posted On :

దేవి చౌధురాణి (నవల) – మొదటి భాగం – మూలం-బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ, తెనుగు సేత-విద్యార్థి

దేవి చౌధురాణి (మొదటి భాగం) మూలం – బంకిమ చంద్ర ఛటోపాధ్యాయ తెనుగు సేత – విద్యార్థి           “ఈ పాడుబడిన ఇంటిలోనేనా నీకు మొహిరీలు దొరికింది?” అని అడిగాడు భవానీ పాఠక్.           “అవును”           “ఎంత బంగారం దొరికింది?”           “చాలా”           “అది కాదు, […]

Continue Reading
Posted On :

అనుసృజన- వేప మొక్క

అనుసృజన వేప మొక్క హిందీ మూలం: గీత్ చతుర్వేదీ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఇది ఒక వేప మొక్క దాన్ని వంగి ఇంక కొంచెం కిందికి వంగి చూస్తే కనిపిస్తుంది వేపచెట్టులా మరింత వంగితే మట్టిదేహమైపోతావు అప్పుడు దీని నీడని కూడా అనుభవించగలుగుతావు ఈ చిన్న పాప నీళ్ళుపోసి పెంచింది దీన్ని దీని పచ్చని ఆకుల్లోని చేదు నాలుకకి తెలియజేస్తుంది తీయదనం అంటే ఏమిటో ఎత్తైన వాటిని చూసి భయపడేవారు ఇక్కడికి రండి ఈ చిన్ని మొక్కనుంచి […]

Continue Reading
Posted On :

ఆరాధన-5 (ధారావాహిక నవల)

ఆరాధన-5 (ధారావాహిక నవల) -కోసూరి ఉమాభారతి నేను టూర్ నుండి వచ్చేంత వరకు రెండు స్టూడియోలలోనూ శిక్షణ యధావిధిగా సాగింది. నాలుగు వారాల తరువాత బే-పోర్ట్ లోని ‘హెరిటేజ్ క్లాస్’ మొదలవగానే.. పన్నెండేళ్ళ స్టూడెంట్ తేజ వాళ్ళ అమ్మగారు లలిత ఓ ప్రతిపాదన చేసింది. “మేడమ్, ఈ క్లాసుల్లో మీ గురించి, మీరు ఇలా నృత్యంలో కొనసాగడం గురించి చెప్పగలిగితే బాగుంటుంది. పిల్లలకి స్పూర్తిదాయకంగా, మాకు ఆసక్తికరంగా ఉండగలదని అనుకుంటున్నాము.” అన్నది. ఓ నిముషం ఆలోచించాను.  “అలాగే.. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 24

యాదోంకి బారాత్-24 -వారాల ఆనంద్ ఎందుకయినా మంచిది/ కనురెప్పలు తెరిచే వుంచాలి/ ప్రకృతి ఏ అందమయిన దృశ్యాన్నో నీ కంటిలో వేసి పోవచ్చు/పోతూ పోతూ ఓ తుంటరి మబ్బు తునక/ఇంధ్రధనుస్సుని సాక్షాత్కరింప చేయొచ్చు ఎందుకయినా మంచిది/ పిడికిలి తెరిచే వుంచాలి/ఎవరయినా చేతిలో చెయ్యేసి/ స్నేహ హస్తం కలిపేసి పోవచ్చు/ నడుస్తూ నడుస్తూ మనిషనేవాడు/ఓ ఆలింగనం ఇచ్చి పోవచ్చు ఎందుకయినా మంచిది/ హృదయం తెరిచే వుంచాలి/ మనసుగల ఏ మనిషో/ తలుపు తట్టకుండానే పలకరిచి పోవచ్చు/ కదుల్తూ కదుల్తూ […]

Continue Reading
Posted On :

నా జీవన యానంలో (రెండవ భాగం) – 48

నా జీవన యానంలో- రెండవభాగం- 48 -కె.వరలక్ష్మి 2010 జనవరిలో కేరళటూర్ కి పిలుపు వచ్చింది. ఆ మధ్య నెల్లూరు రచయితల సమావేశానికి వచ్చిన కొందరు రచయితలు ఈ టూర్ ప్లాన్ చేసారట. ఎవరి ఖర్చులు వాళ్లేపెట్టుకోవాలి. వివరాలన్నీ ఫోన్ కి మెసేజ్ పెట్టేరు. వెళ్లాలని అన్పించింది. ఒకసారి మా ఆడపడుచు వాళ్లతోనూ, మరోసారి మా గీత తీసుకెళ్తేనూ రెండుసార్లు కేరళ వెళ్లేను. అప్పుడు చూసిన ప్రదేశాలు వేరు. సరే, వస్తానని వాళ్లకి తెలియజేసేను. జనవరి 11 […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 27

వ్యాధితో పోరాటం-27 –కనకదుర్గ సాయంత్రం శ్రీని క్యాథి ఇంటికే డైరెక్ట్ గా వచ్చి సూసన్ ని కల్సి, కాసేపుండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాడు. క్యాథి భర్త గ్యారికి పెన్సల్వేనియాలో ఉండడం ఎక్కువగ నచ్చలేదు. ఆయనకి కొండలెక్కడం, బైకింగ్, హైకింగ్, వీటన్నిటితో పాటు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎక్కువగా మనుషులతో గడపడమంటే అంత ఇష్టపడేవాడు కాదు. క్యాథి అందరిలో వుండాలని కోరుకునే మనిషి. ఆమె అనుకున్నట్టు భర్తకు నచ్చితే పిల్లలతో ఇక్కడే ఉండాలనుకుంది తన కుటుంబానికి […]

Continue Reading
Posted On :

నడక దారిలో(భాగం-48)

నడక దారిలో-48 -శీలా సుభద్రా దేవి జరిగిన కథ:-       (తండ్రి మరణానంతరం ఆర్థిక సంక్షోభంలోనే డిగ్రీ చదువుతో బాటు సాహిత్యం , సంగీతం బాపూ బొమ్మలు చూసి వేయటం. శీలా వీర్రాజు గారికి కలంస్నేహం, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో సభావివాహం. మా జీవన గీతానికి పల్లవి చేరింది. నాకు రెండో పాప రెండు నెలలకే అనారోగ్యంతో చనిపోయింది. వీర్రాజు గారు స్నేహితునితో కలిసి అడ్వర్టైజ్ ఏజెన్సీ పెట్టటం, మా బాబు అనారోగ్యంతో చనిపోయాడు. […]

Continue Reading

జీవితం అంచున – 24 (యదార్థ గాథ)

జీవితం అంచున -24 (యదార్థ గాథ) (…Secondinnings never started) -ఝాన్సీ కొప్పిశెట్టి టూరిస్ట్లకు అనుమతి లేదని కేవలం ఆస్ట్రేలియా పౌరుల కోసమే రిపాట్రియేషన్ ఫ్లైట్స్… అమ్మకు వీసా వచ్చిన నాటి వార్త. ఆస్ట్రేలియా పౌరుల వెంట తల్లి, తండ్రి, స్పౌస్ రావచ్చని మూడు రోజుల్లో మార్పు చెందిన వార్త. ప్రయాణీకులు రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ తీసుకుని వుండాలన్న నిబంధన. వెంటనే అమ్మకు రెండో డోసు ఇప్పించేసాను. అయితే రిపాట్రియేషన్ ఫ్లైట్స్ లో మాదాకా అవకాశం […]

Continue Reading

నా అంతరంగ తరంగాలు-22

నా అంతరంగ తరంగాలు-22 -మన్నెం శారద 1986 లో అనుకుంటాను… నేను మయూరి వారపత్రిక తరపున కొంతమంది  రచయితల్ని ఇంటర్వ్యూ చేసాను. సహజంగా చాలామంది తాము ఇంటర్యూ చేయడం తక్కువగా భావించి ఒప్పుకోరు. నిజానికి ఇంటర్వ్యూ చేసేవారు ఇంటర్వ్యూ చేయబడుతున్న వ్యక్తులు గురించి సమగ్రంగా తెలిసిన వారయి ఉండాలి. లేకుంటే మన టీవీ ఏంకర్స్ లా జుట్టు సవరించుకుంటూ, కళ్ళు మెరపించు కుంటూ దిక్కులు చూడాలి. మొత్తానికి పత్రిక యాజమాన్యం ఎవరెవర్నో సంప్రదించి వారు కాదనడంతో నా […]

Continue Reading
Posted On :

వినిపించేకథలు-42 – ఇదే పండగ – శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథ

వినిపించేకథలు-42 ఇదే పండగ రచన : శ్రీమతి పెబ్బిలి హైమవతి గారి కథ గళం : వెంపటి కామేశ్వర రావు  ***** వెంపటి కామేశ్వర రావువెంపటి కామేశ్వర రావు తమ వినిపించేకథలు యు ట్యూబ్ చానల్ ద్వారా సుప్రసిద్ధ రచయితల/రచయిత్రుల కథలు వినిపిస్తూ శ్రోతల మన్ననలు పొందుతున్నారు. ప్రయివేట్ సెక్టార్ లో పర్సనల్ మేనేజర్ గా సుదీర్ఘకాలం సేవలందించిన వీరు తమ విశ్రాంత జీవితం లో తమకిష్టమైన అభిరుచులకు మెరుగులు దిద్దుకుంటున్నారు.ఆకాశవాణి లో casual news reader,auditioned drama […]

Continue Reading

కథావాహిని-18 జాస్తి రమాదేవి గారి “ఒరులేయవి యెనరించిన” కథ

కథావాహిని-18 ఒరులేయవి యెనరించిన రచన : జాస్తి రమాదేవి గళం :కొప్పర్తి రాంబాబు ***** రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ […]

Continue Reading

వెనుతిరగని వెన్నెల (భాగం-65)

వెనుతిరగని వెన్నెల(భాగం-65) -డా|| కె.గీత  (ఆడియో ఇక్కడ వినండి) https://youtu.be/BjqTo7S-k84?si=oR_xre3bSw1Nsl42 వెనుతిరగని వెన్నెల(భాగం-65) –డా||కె.గీత (*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)  *** జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, […]

Continue Reading
Posted On :
K.Geeta

గీతామాధవీయం-40 (డా||కె.గీత టాక్ షో)

గీతామాధవీయం-40 (డా||కె.గీత టాక్ షో) -డా||కె.గీత “గీతామాధవీయం” టోరీ టాక్ షో (Geetamadhaveeyam Tori Talk Show- Week-40) అసమాన సాహిత్యం! ఆపాతమధురసంగీతం!! ప్రతి ఆదివారం- మధ్యాహ్నం 2 గం.- 3గం. PST (USA) మే 14, 2022 టాక్ షో-40 లో *సాహిత్యం: వెనుతిరగని వెన్నెల భాగం-40 (కథ) Listen Live @ http://onlineradios.in/embed/teluguone/ Calling Numbers during the show: USA: 703-659-2199 UK: 020-3287-8674 Australia: 02-8006-8674 India: 9666-77-8674 *** డా||కె.గీతడా|| […]

Continue Reading
Posted On :

నవలాస్రవంతి-49 “విరాట్ ” పార్ట్-2, అనువాద రచయిత: పొనుగోటి కృష్ణారెడ్డి )

రాంబాబు కొప్పర్తికొప్పర్తి రాంబాబు  1959 ఆగస్ట్ 8వతేదీన కళా వాచస్పతి జగ్గయ్య గారి ఊరు కాంటినెంటల్ కాఫీ పరిమళాల దుగ్గిరాలలో జన్మించారు. అమ్మ లలితమ్మ, నాన్న సుబ్బారావు గారు. పెరిగింది, చదువుకున్నది సాహితీ కేంద్రమైన తెనాలిలో. 1980 లో ఇండియన్ బ్యాంక్ లో చేరి ముంబై , చెన్నై నగరాల్లో ఎక్కువ కాలం పనిచేసి 2019 లో విశాఖపట్నం డిప్యూటీ జోనల్ మేనేజర్ గా రిటైర్ అయ్యారు. వీరు ప్రముఖ కథా రచయిత “మిథునం ” శ్రీరమణ […]

Continue Reading

యాత్రాగీతం-62 హవాయి- మావీ ద్వీపం (భాగం-3)

యాత్రాగీతం హవాయి దీవులు – మావీ ద్వీపం (భాగం-3) రోజు -3 -డా||కె.గీత మూడవ రోజు మావీలో ప్రసిద్ధి గాంచిన చారిత్రాత్మక  ప్రదేశమైన “లహైనా” లో రకరకాల యాక్టివిటీస్ కోసం ఉదయానే బయలుదేరాం. ఉదయం అల్పాహారం కోసం కూడా లహైనాకే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. 9గం.ల ప్రాంతంలో డ్రాగన్ ఫ్రూట్ ఫామ్ సందర్శన, జిప్ లైన్, ఆక్వా బాల్ వంటి సాహసాలు బుక్ చేసుకున్నందున 8 గం.లకే  రిసార్టులో బయలుదేరాం. అయితే ఆ రోజు అనుకోకుండా జరిగిన ఓ […]

Continue Reading
Posted On :
Kandepi Rani Prasad

ఎలుక పిల్ల పెళ్ళి

ఎలుక పిల్ల పెళ్ళి -కందేపి రాణి ప్రసాద్ ఒక ఎలుక తన కూతురికి పెళ్ళిచేయాలి అనుకున్నది. అనుకున్నదే తడవుగా తన మిత్రులందరికీ చెప్పింది. మా పిల్లకు మంచి సంబంధాలు చూడమని అందరినీ కోరింది. అందరూ మంచి సంబంధాలు చూస్తామని మాట ఇచ్చాయి . ఎలుక తన కూతురికి బాగా అందగాడైన భర్తను తీసుకురావాలని అనుకున్నది. ఒక రోజు నెమలి మంచి కబురు తీసుకు వచ్చింది . ” మీ పిల్లకు చాలా అందంగా ఉన్న వరుడిని చూశాను […]

Continue Reading

పౌరాణిక గాథలు -24 – అల్పత్వము – నహుషుడు కథ

పౌరాణిక గాథలు -24 -భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి అల్పత్వము – నహుషుడు కథ నహుషుడు ఒక మహారాజు. అతడి తల్లి ‘స్వర్భానవి’, తండ్రి ‘ఆయువు’, భార్య ‘ప్రియంవద’. ఎన్నో క్రతువులు చేసి దైవత్వాన్ని పొంది ఇంద్రపదవిని కూడా పొందాడు. నహుషుడు ఇంద్రపదవిని ఎలా పొందాడో తెలుసుకుందాం. త్వష్టప్రజాపతికి విశ్వరూపుడు అనే పేరు గల కొడుకు ఉండేవాడు. ఇంద్రుడి మీద కోపంతో త్వష్టప్రజాపతి మూడు శిరస్సులు గల విశ్వరూపుణ్ని సృష్టించుకుని అతణ్ని ఎలాగయినా సరే ఇంద్రుణ్ని చెయ్యాలని నంకల్పించుకున్నాడు. […]

Continue Reading

రాగసౌరభాలు- 10 (షణ్ముఖ ప్రియ)

రాగసౌరభాలు-10 (షణ్ముఖ ప్రియ) -వాణి నల్లాన్ చక్రవర్తి ప్రియ మిత్రులందరికీ వందనం, అభివందనం. శివ పార్వతుల తనయుడు కుమార స్వామి. తలితండ్రుల రూపాలను పుణికి పుచ్చుకొని అత్యంత సుందరాకారునిగా పేరు పొందాడు. అతనికి 6 ముఖములు ఉన్న కారణంగా షణ్ముఖడు, ఆర్ముగం అని కూడా పిలుస్తారు. ఆ షణ్ముఖ సుబ్రమణ్య స్వామికి ప్రీతి పాత్రంగా పేర్కొనే షణ్ముఖ ప్రియ రాగ విశేషాలు ఈ నెల తెలుసుకుందాము. ముందుగా రాగ లక్షణాలు తెలుసుకుందామా? కటపయాది సూత్రాన్ని అనుసరించి ఈ […]

Continue Reading

కనక నారాయణీయం-63

కనక నారాయణీయం -63 –పుట్టపర్తి నాగపద్మిని ‘ఇంతకూ ఎందుకప్పా ఇట్లా వచ్చినావు?’ అయ్యగారు కాఫీ స్టీల్ కప్పు తీసుకోగానే తానూ కప్పు చేతిలోకి తీసుకుని కింద పెట్టి గురువుగారికి సాష్టాంగ ప్రణామం చేశాడా శిష్య పరమాణువు. ‘అదే స్వామీ! మా స్కూల్ లో లైబ్రరీకి తీసుకోవాలసిన పుస్తకాలు, విద్యార్థులకు ఉపకరించేవి మీకు ఆ లిస్ట్ చూపించి వెంకట్రామా అండ్ కోలో కొందామని వచ్చినాను.’ ‘బాగుందిరా! ప్రతిసారీ యీ విధంగా నా సలహా కావాలంటే కష్టం. నేను ఊరిలో […]

Continue Reading

స్వరాలాపన-42 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-42 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

విజయ కథ రంగనాయకమ్మ గారి పుస్తకం పై సమీక్ష

‘విజయ’ కథ! (ఒక నవలికా, ఒక పెద్ద వ్యాసమూ, 9 చిన్న వ్యాసాలూ, కలిపిన సంపుటం) -వి.విజయకుమార్ విజయ కథ పేరుతో ఇటీవల రంగనాయకమ్మ గారు ఒక పుస్తకాన్ని వెలువరించారు. విజయకధ 22 ఏళ్ళ వయసులో రాసిన కథ అయినప్పటికీ, అప్పటికి మార్క్సిజం గురించి విని ఉండనప్పటికీ, పెళ్లి చూపుల తంతును తిరస్కరిస్తూ, – పరస్పరం కలిసి మాట్లాడుకో వడం ద్వారా, – అభిప్రాయాలు పంచుకోవడం ద్వారా – ‘పెళ్లి’ అనే కాంటాక్ట్ లోకి రావలసిన అవసరాన్ని […]

Continue Reading
Posted On :

మద్దుకూరి చంద్రశేఖరం

చిత్రహింసలకు గురిచేసినా గుట్టు బయటపెట్టని కామ్రేడ్ మద్దు కూరి చంద్ర శేఖరం -పి. యస్. ప్రకాశరావు పోలీసులు రక్తం చిందేలా హింసించినా రక్తంలో ఇంకిపోయిన భావజాలాన్ని వదులుకోలేదు.  1948 జూన్ 1 న బుద్ధవరంలో ఆయన్నిఎస్.పి.థామస్ అరెస్ట్ చేసి, రహస్య సమాచారం చెప్పించడానికి స్పెషల్ ఆర్మ్ డ్ పోలీస్ చేత చిత్ర హింసలు పెట్టిస్తే ” నువ్వు నాకు శత్రువు. నీకు చెప్పేదేంటి ? ” అంటూ స్పృహ కోల్పోయారు. అంతకు పూర్వం కూడా  (1932 ఏప్రిల్ […]

Continue Reading

మలిదశ తెలంగాణ ఉద్యమ కథలకు ఆహ్వానం

మలిదశ తెలంగాణ ఉద్యమ కథలకు ఆహ్వానం -ఎడిటర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి నాటి కాలంలోని సాహితీకారులు వివిధ ప్రక్రియల ద్వారా తెలంగాణ అవసరతను, ఆవశ్యకతను వ్యక్తపరిచారు. ఆ క్రమంలో కథలూ వచ్చినవి. తెలంగాణ ఏర్పాటై పది సంవత్సరాలు నిండిన సందర్భాన మలిదశ ఉద్యమంలో పెల్లుబికిన సృజనను ఈ తరం యువరచయితలకు, కవులకు అందుబాటు లోకి తేవాలన్నది ‘తెలంగాణ తెలుగు పరిశోధక మండలి’ భావన. ఈ ఉద్దేశ్యంతోనే మలిదశ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో (1989- నుండి 2014 […]

Continue Reading
Posted On :

Cineflections:57 – Ohāyō – (Good Morning) – 1959, Japanese

Cineflections-57 Ohāyō – (Good Morning) – 1959, Japanese -Manjula Jonnalagadda “You have to say the meaningless things in order to create the effective and intentional grounds on which the important things can be said”. – Ozu Ohāyō AKA Good Morning is a film made by Yasujiro Ozu. The film is written by Kogo Noda and […]

Continue Reading
Posted On :

Carnatic Compositions – The Essence and Embodiment-43

Carnatic Compositions – The Essence and Embodiment – Aparna Munukutla Gunupudi  Our intent for this essay is to highlight the great features of the language, emotion and melody (rAgam) of a krithi (song/composition) and also to provide the song for your listening pleasure. Most of you may know these krithis, but when you discover the […]

Continue Reading
Posted On :

Need of the hour -53 Writing Skills

Need of the hour -53 Writing Skills -J.P.Bharathi Writing is an artistic skill that we use to communicate effectively through the written word. Though these may vary depending on what we are writing, there are several that transcend categories. Knowing when and how to use less-common punctuation, like colons, semicolons, and em-dashes, can unlock new […]

Continue Reading
Posted On :

The Invincible Moonsheen – Part-31 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta)

The Invincible Moonsheen Part – 31 (Telugu Original “Venutiragani Vennela” by Dr K.Geeta) English Translation: V.Vijaya Kumar (The previous story briefed) Sameera comes to meet her mother’s friend, Udayini, who runs a women’s aid organization “Sahaya” in America. Sameera gets a good impression of Udayini. Four months pregnant, Sameera tells her that she wants to […]

Continue Reading
Posted On :

America Through My Eyes – THE HONOLULU – OAHU ISLAND PART -1

America Through My Eyes THE HONOLULU – OAHU ISLAND PART -1 Telugu Original : Dr K.Geeta  English Translation: V.Vijaya Kumar In the evening, we said goodbye to the Big Island and took an hour’s flight to Honolulu, the capital city of Oahu Island. When it was getting dark, two or three more islands also appeared […]

Continue Reading
Posted On :

సంపాదకీయం-నవంబర్, 2024

“నెచ్చెలి”మాట  ఫలితాలు -డా|| కె.గీత  కొన్ని ఫలితాలు చేసిన పనుల మీద ఆధారపడి ఉంటాయి అసలు కీడెంచి మేలెంచాలని ముందుకే వెళ్ళం ఏం? అయినా అంతా మంచే జరుగుతుందని ఆశించొచ్చుగా – కొన్ని ఫలితాలు ఏం చేసినా మారవు సాకుకోసం ఎదురుచూస్తున్నట్టు తప్పించుకుంటాం ఏం? అయినా చెయ్యాల్సింది తప్పదని చేసుకుపోవచ్చుగా- కొన్ని ఫలితాలు ముందే తెలిసి పోతాయి అయినా ఆకాశమే విరిగిపడినట్టు బెంబేలెత్తిపోతాం ఏం? కాస్తో కూస్తో ఆశతో ధైర్యంగా ఉండొచ్చుగా- అయినా ఏ ఫలితాల గురించి […]

Continue Reading
Posted On :

ఈ తరం నడక-8- లిప్తకాలపు స్వప్నం- స్వర్ణ కిలారి

ఈ తరం నడక – 8 లిప్తకాలపు స్వప్నం – స్వర్ణ కిలారి -రూపరుక్మిణి. కె           ప్రవహించే నది పాయలు పాయలుగా చీలినా., తనలో ఉధృతి ఎంత మాత్రమూ తగ్గదన్నట్లు , జీవితంలోని ఆటుపోట్లతో మనిషి అంతరంగం అల్లకల్లోలమైపోవడం చూస్తూనే ఉంటాం. అందరం ఏదో ఒక సందర్భంలో ఈ ఆటుపోట్లని ఎదుర్కోవాల్సిందే.           అమ్మ మనసుకి ఎన్ని గాయాలైనా… తన బంగారు పిల్లలు లేడీ […]

Continue Reading
Posted On :

ముందడుగు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ముందడుగు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -చిలుకూరి ఉషారాణి ఉదయాన్నే మందుల షాపులో, శైలు, మీకే ఫోన్ అని షాపు యజమాని పిలవగానే, నాకా… అన్నది అనుమానంగా, ఇక్కడ మీరొక్కరే కదా ఉన్నారు. అంటే మీరేగా శైలు. అన్నాడు షాపతను. అవును నేనే, అని చెప్పి ఆ ఫోన్ ను అందుకుంది. బుజ్జి పాపాయికి పద్ధెనిమిదో పుట్టిన రోజు శుభాకాంక్షలు అని అట్నుంచి వినపడగానే, ఆనందంతో వెల్లి విరిసిన  మోముతో, హేయ్ తేజ్, […]

Continue Reading

అడవి పువ్వు (అమృతాప్రీతమ్ కథ “వైల్డ్ ఫ్లవర్” కి అనువాదం)

అడవి పువ్వు (అమృతాప్రీతమ్ కథ “వైల్డ్ ఫ్లవర్” కి అనువాదం) -కాత్యాయని మా పొరుగింటి వాళ్ళ ముసలి నౌకరు పర్బతీ. అతని పడుచుపెళ్ళాం అంగూరీ ఇటీవలే కాపురానికొచ్చింది. అతనికిది రెండోపెళ్ళి. మొదటిభార్య ఐదేళ్ళ కిందట చచ్చిపోయింది. ఆమె కర్మకాండలు చెయ్యటానికి గ్రామానికి వెళ్ళినప్పుడే అంగూరీ తండ్రి పరిచయమై తన కూతురినిచ్చి పెళ్ళి చేశాడు. పెళ్ళి నాటికి అంగూరీ చాలా చిన్నపిల్ల కావటంవల్లా, కీళ్ళవాతంతో మంచానపడిన తల్లిని చూసుకోటానికి ఇంకెవరూ లేనందువల్లా వెంటనే కాపురానికి పంపలేదు. ఇటీవలే పర్బతీ […]

Continue Reading
Posted On :

బతుకమ్మ పద్యాలు

బతుకమ్మ పద్యాలు -సముద్రాల శ్రీదేవి సృష్టిలోన పూలు స్త్రీ జాతిరూపము ప్రకృతి మాతగాను బ్రతుకునిచ్చు తల్లిగ బ్రతుకమ్మ తా తెలంగాణలో దివ్యమైన బాట దేవిమాట తీరుతీరు పూలు గౌరమ్మగను నవ రాత్రులందు మారి చిత్రముగను నీకు సాటిలేరు నేడు మా బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట సంబురాలు జేస్తునంబరమ్ముగ మార్చి నారిగణము నాడు దీరులైరి న్యాయస్థాపనంబు నవ్విడె బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట ఊరువాడయాటలుయ్యాల పాటలు నూరెగుబ్రతుకమ్మలుత్సవముగ వనములోన మనము జనజాతర గణము దివ్యమైన బాట దేవిమాట […]

Continue Reading

వస్తున్నా (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

వస్తున్నా (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – నీరజ వింజామరం అనంత చైతన్య తరంగాన్ని నేను శ్రమించకుండా విశ్రమించానేం ? ఎన్నటికీ వాడని నిత్య వసంతాన్ని నేను నవ్వుల పువ్వులు పూయకుండా వాడిపోయానేం? అంతులేని ఆశల కిరణాన్ని నేను నిరాశను చీల్చకుండా నిల్చుండి పోయానేం? లోతు కొలవరాని అనురాగ సంద్రాన్ని నేను కెరటంలా ఎగిసి పడక అలనై ఆగి పోయానేం? ఎందరి మనసుల్లోనో వెలిగిన నమ్మకాన్ని నేను వెలుగులు విరజిమ్మకుండా ఆరిపోయానేం ? […]

Continue Reading
Posted On :

“ది మెమరీ పోలీస్”- జపాను రచయిత్రి “యోకో ఒగావా” నవలపై సమీక్ష

“ది మెమరీ పోలీస్”- జపాను రచయిత్రి “యోకో ఒగావా” నవలపై సమీక్ష -సునీత పొత్తూరి జపాన్, దక్షిణ కొరియా వంటి తూర్పు ఆసియా దేశాల సాహిత్యం పట్ల ఈ మధ్య ఎక్కువగా యూత్ ప్రభావితం అవుతున్నారని తోస్తోంది. జపనీస్, కొరియన్ భాషలు నేర్చుకోవడం, ఇంక అక్కడి సంగీతం అయితే మరీను – యూత్ అంతా అమితంగా ఇష్ట పడుతున్నారు. ఈ పుస్తకం నాకు చదవమని ఇచ్చినది అండర్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న నా మేనకోడలు. తను జపనీస్ […]

Continue Reading
Posted On :

ఇగో(అహం అడ్డు) (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

 ఇగో—( అహం అడ్డు) (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము రాత్రి జరిగింది మరిచిపోతే బెటర్‌……ఇదిగో కాఫీ; ఆలస్యంగా లేచారు కాబట్టి తొందరగా రెడీ అవ్వండి.’ అంటూనే న్యూస్యపేపర్‌లో దూరిపోయింది శారద. తను అప్పటికే రెడీ అయి వుందన్న విషయం అర్థమయ్యేసరికి నేనెప్పుడు లేచానో తెలిసింది నాకు. తను కూల్‌గా వుండడంతో నాకు గిల్టీగా అనిపించింది.అనవసరమైన రాద్దాంతం కదూ; మనసులో అనుకుంటూనే అద్దంలో నా మఖాన్ని నేను చూసుకున్నాను. కళ్ళు ఎరుపెక్కాయి. […]

Continue Reading

ఆమె ఎవరు (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

ఆమె ఎవరు? (నెచ్చెలి-2024 కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ) -తాటిపాముల మృత్యుంజయుడు ‘హలో సార్, ‘ఆకాశం ఎర్రబడింది, భూదేవి సిగ్గుపడింది’లాంటి అతిశయోక్తులు ఎప్పుడైనా విన్నారా?’ ‘ఏమో నాకు అవన్నీ తెల్వద్, అయినా ఇప్పుడు అదెందుకడుగుతున్నవ్?’ ‘ఓహో మీరు ప్రశ్నకు ప్రశ్న వేస్తున్నారా, వజ్రాన్ని వజ్రంతో కోయాలన్న సామెత మీకు బాగా వంటబట్టినట్టుంది. ఎందుకు అడుగుతున్నానో ఓ రెండు నిమిషాల్లో చెబుతాను, పక్కకు నిలబడండి, ఎక్కడకి వెళ్ళకండి, ప్లీజ్… హలో, అలా వెళ్ళే ఇంకో సార్, […]

Continue Reading

పరామర్శ (హిందీ: “मातमपुर्सी” – సూరజ్ ప్రకాష్ గారి కథ)

పరామర్శ मातमपुर्सी హిందీ మూలం – – సూరజ్ ప్రకాష్ తెలుగు అనువాదం – డా. కూచి వెంకట నరసింహారావు ఈసారి కూడా ఇంటికి చేరుకునేందుకు ముందే నాన్నగారు నా కోసం నేను కలుసుకోవలసిన వాళ్ళ పెద్ద లిస్టు తయారుచేసి ఉంచారు. ఈ లిస్టులో కొన్ని పేర్లకి ఎదురుగా ఆయన ప్రత్యేకంగా గుర్తు పెట్టివుంచారు. దాని అర్థం వాళ్ళని తప్పకుండా కలుసుకోవాలని. ఈ వూరిని శాశ్వతంగా విడిచిపెట్టిన తరువాత ఇప్పుడు ఇక్కడితో నా సంబంధం కేవలం సంవత్సరానికో, […]

Continue Reading