కళ్ళలో ఒక నది (కవిత)
కళ్ళలో ఒక నది -గవిడి శ్రీనివాస్ కళ్ళలో ఒక నది ఒక చెట్టు ప్రవహించే కాలం ముడిపడుతుంటాయి . లోపలి మనిషి ఒక్క సారీ బహిర్గత మౌతుంటాడు. అంతర్ధానమౌతున్న విలువల ముందు జీవితాలు అనేక రూపాల్లో రాలుతున్నా కడగబడుతున్న క్షణాల్లో ఇంకో పార్శ్వముగా దివ్య రేఖలు అద్దుతుంటాయి . చెదిరిపోని ఊహలు గూళ్ళను నిర్మిస్తాయి . అల్లుకున్న తపనలు చిగురులు తొడుక్కుంటాయి . ఒక దాహం నది తీర్చినట్లు ఒక ఎండని చెట్టు ఆపినట్లు కాలం దొంతరల్లో ఒక ప్రయత్నం ఎన్నో కాంతుల్ని విసురుతుంది . శ్రమ ఉదయించడం లో విజయాలు తడుతుంటాయి. […]
Continue Reading