image_print

యాదోంకి బారాత్- 22

యాదోంకి బారాత్-22 -వారాల ఆనంద్ బతుకంటేనే పరుగు. పరుగంటేనే డైనమిజం. అమ్మ వొడిలో కన్ను తెరిచింది మొదలు చివర కన్ను మూసేంతదాకా పరుగే పరుగు.‘పరుగు ఆపడం ఓ కళ’ అన్నారెవరో. నిజమే పరుగు ఒక నాన్-స్టాటిక్ డై మెన్షన్. ఆ స్థితిలో వున్నవాడు పరుగు ఆపడమంటే స్టాటిక్ డైమెన్షన్ లోకి రావడమన్నమాట. అట్లా రావడం అంత సులభం కాదు. స్వచ్ఛందంగా రావడం మరీ కష్టం. ఎందుకంటే పరుగులో ఒక మజా వుంది. ఒక వూపు వుంది. నిలువనీయనితనం […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 21

యాదోంకి బారాత్-21 -వారాల ఆనంద్ నాకూ మీకూ గాయాలకేం కొరత, కనిపించేవి మానిపోతాయి మనసు లోపలివి కొనసాగుతాయి తడి తడిగా గాయాల్ని గేయాలుగా గున్ గునాయిస్తూ తలెత్తుకు నడిస్తేనే బతుకు ఢంకా బజాయిస్తుంది ***           ఎనభయవ దశకం చివరి మూడు నాలుగేళ్ళూ నేను కాళ్ళకూ మనసుకూ చక్రాలేసుకు తిరిగాను. పెళ్ళి, అమ్మ అస్తమయం, ఇల్లు మారడం, మరో పక్క స్కూలు వీటి నడుమ పిల్లలకథలు రాయడం, మరో పక్క నా […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 20

యాదోంకి బారాత్-20 -వారాల ఆనంద్ ముగింపులేని ముసురుండదు-తెరిపి దొరకని కష్టముండదు “అలలు అలలుగా దశలు దశలుగా సాగుతున్న బతుకులో ఏ కాలపు సౌందర్యం ఆ కాలానిదే ఎప్పటి అవసరం అప్పటిదే..” అందుకే బతుకులో ఒక కాలం మంచిది మరొకటి చెడ్డది అంటూ వుండదు. కాలం ప్రవాహంలా సాగుతూనే వుంటుంది. మనమే ఓ క్షణం నిలబడతాం, మరో క్షణం పరుగెడుతాం.. ఇంకోసారి కూలబడతాం. తిరిగి లేస్తాం. జీవితమంటే ఇంతే మరి. ఆ దిశలో 1986 సంవత్సరం నాకు సంతోషాన్నీ […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 19

యాదోంకి బారాత్-19 -వారాల ఆనంద్ జీవగడ్డ – ఆత్మీయ సృజనాత్మక వేదిక- రెండవ భాగం ఎదో అనుకుంటాం కానీ ‘జీవితం’ పెద్ద పరుగు. ఊపిరాడనంత దరువు. పరుగంటే గుక్క పట్టుకుని ఓ వంద మీటర్లు పరుగెత్తి గెలుపో ఓటమో ఒక చోట నిలబడ్డం కాదు. జీవితం ఓ మారథాన్. సుదీర్ఘమయిన పరుగు. ఊపిరి రావడానికీ పోవడానికీ నడుమ నిరంతరం సాగే ఉరుకులాట. దాంట్లో ఎన్నో మెరుపులు మరకలు. మలుపులు. ఎత్తులు, పల్లాలు. పరుగు ఓ క్షణం ఆపి […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 18

యాదోంకి బారాత్-18 -వారాల ఆనంద్ కరీంనగర్ ఫిలిం సొసైటీ లో చేరిక-ప్రస్తానం కలల లోకంలోంచి వాస్తవ ద్వారం గుండా విశ్వంలోకి చేసే ప్రయాణమే ‘కళ’ ***           అలాంటి ప్రయాణమే నాకు ఆలంబన అయింది. చదువు ముగించి చిన్నదో పెద్దదో జూనియర్ కాలేజీలో లైబ్రెరియన్ గా చేరాక అటు ఉద్యోగంతో పాటు ఇటు సాహిత్యం మరో పక్క సినిమాలూ నన్ను ఆవరించాయి అనేకంటే కమ్ముకున్నాయి అంటే సబబేమో. వేములవాడ ఫిలిం సొసైటీ […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 17

యాదోంకి బారాత్-17 -వారాల ఆనంద్ గోదావరిఖని ఒక మజిలీ మనిషి నిరంతర అవిశ్రాంత ప్రయాణికుడు లోనికీ బయటకూ.. అంతేకాదు బతుకు బాటలో కొంత సవ్యమూ మరికొంత అపసవ్యమూ రెంటినీ సమన్వయము చేయడమే విజ్ఞత.. ***           అలాంటి చిన్న విజ్ఞత ఎదో మేల్కొని నేను బదిలీని అంగీకరించి గోదావరిఖని బయలుదేరాను. మనకు కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే ఇష్టం కలుగుతుంది.. అట్లే అయిష్టం కూడా. గోదావరిఖని విషయంలో అదే జరిగింది. ఎవరమయినా […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 16

యాదోంకి బారాత్-16 -వారాల ఆనంద్ కొన్నిసార్లు వంచన గెలుస్తుంది అవమానం కోరడాలా తగుల్తుంది కానీ “కాలం” డస్టర్ లా వాటిని తుడిచేసి ముందుకు సాగుతుంది. జ్ఞాపకాల వెల్లువలో ఎన్నో ఎన్నెన్నో… నడిచి వచ్చిన దారి.. గడిపి వచ్చిన కాలం.. వుండి వచ్చిన వూరూ ఎన్నో సంఘటనలనీ సందర్భాలనీ వాటిని మించి ఎందరొ మనుషుల్నీ గుర్తు చేస్తుంది. మరెందరినో చిత్రంగా మరుగున పడేస్తుంది. కవులూ, రచయితలూ, కళాకారులూ, ప్రముఖులూ ఎందరో గుర్తొస్తారు. వాళ్ళని మరీ మరీ గుర్తుచేసుకుంటాం మంచిదే […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 15

యాదోంకి బారాత్-15 -వారాల ఆనంద్ నా జీవితంలో 80 వ దశకంలోని మొదటి సంవత్సరాలు అంత్యంత ముఖ్యమయి నవి. వ్యక్తిగత జీవితంలోనూ సృజనాత్మక జీవితంలో కూడా. సాహిత్యమూ, ఉద్యమాలూ, అర్థవంతమయిన సినిమాలూ ఇట్లా అనేకమయిన విషయాలు నా జీవితంలోకి అప్పుడే వచ్చాయి. ముఖ్యంగా కళాత్మక సినిమాల గురించి నాకున్న “చిటికెడంత అవగాహన పిడికెడంత” కావడమూ అప్పుడే జరిగింది. కరీంనగర్ ఫిలిం సొసైటీ కార్యక్రమాలూ, వేములవాడలో ఫిలిం సొసైటీ స్థాపన, తర్వాత క్రమంగా సిరిసిల్లా, జగిత్యాల, హుజురాబాద్ లలో […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 14

యాదోంకి బారాత్-14 -వారాల ఆనంద్   సిరిసిల్ల-వేములవాడ-సంస్థలూ అనుబంధాలూ  కొందరు ఉద్యోగ బాధ్యతల్ని తీసుసుకున్న తర్వాత అందులో పూర్తిగా అంకితమయినట్టు నటిస్తారు. ఎంత కష్ట మొచ్చిందిరా దేవుడా అని అంటూ వుంటారు. అక్కడికి తానొక్కడే ఉద్యోగం చేస్తున్నట్టు తాను మాత్రమే కష్టపడుతున్నట్టు.. అదీ ఉచితంగానూ ఏదో మేహర్బానీకి చేస్తున్నట్టు. అలాంటి వాళ్ళను చూస్తే నాకయితే కోపం రాదు కానీ, వాళ్ళ అమాయకత్వానికి జాలి కలుగుతుంది. “తవ్వెడు ఇచ్చిన కాడ తంగెళ్ళు పీకాలి” అని సామెత. మరెందుకట్లా ఫీలవుతారో […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 13

యాదోంకి బారాత్-13 -వారాల ఆనంద్           ఒకసారి ఉద్యోగంలో చేరింతర్వాత మన జీవిత చక్రం మారిపోతుంది. అప్పటి దాకా వున్న అలవాట్లు టైంటేబుల్ వున్నది వున్నట్టు వుండదు. ఉద్యోగకాలానికి అనుకూలంగా మారిపోతుంది. మార్చుకోవాలి. తప్పదు. అందులోనూ పని చేసే ఊర్లోనే వుంటే పరిస్థితి ఒకరకంగా వుంటుంది.  వేరే వూర్లో వుండి రొజు షటిల్ కొట్టాలంటే మరొక రకం. నాది షటిల్ సర్విస్. వేములవాడ-సిరిసిల్లా-వేములవాడ. అదట్లా వుంటే నేను ఉద్యోగంలో చేరిన 80 […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 12

యాదోంకి బారాత్-12 -వారాల ఆనంద్ ఉద్యోగ పర్వం – మంథని జీవితంలో అనేకసార్లు ఊహించని విధంగా మలుపులు ఎదురవుతాయి. వాటిల్లో మన ప్రమేయం అసలే ఉండక పోవచ్చు. కానీ ఎం చేస్తాం మలుపు తిరిగి ప్రయాణం కొనసాగిం చడమే. సరిగ్గా నాకు అట్లే జరిగింది. హాయిగా యునివర్సిటీలో చదువుతూ హాస్టల్ లో ప్రతి గురువారం సాయంత్రం హాఫ్ చికెన్, ప్రతి ఆదివారం ఫుల్ చికెన్ తింటూ ఏవో పోటీ పరీక్ష లకు తయారవుదామను కుంటున్న వేళ ఓ […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 11

యాదోంకి బారాత్-11 -వారాల ఆనంద్ సామాజిక పోరాటాలూ- ఉన్నత చదువులు- యునివర్సిటీలో చేరిక  నాకు తెలిసి నేను మధ్య తరగతి జీవిని. పట్టణ వాసన వున్న వాణ్ని. చాలా వాటిని ప్రేమించాను, అభిమానించాను, ఆరాధించాను, ప్రేరణ పొందాను. కానీ, అందులోకి దిగలేదు కాళ్ళకు మట్టి అంటలేదు, ఒంటికి సురుకూ అంటలేదు. కానీ నేను నా విశ్వాసాల్ని, ప్రేమల్ని అభిమానాన్ని అట్లే ఉంచుకున్నాను. మారలేదు. నమ్మిన దానికి ఎప్పుడూ వ్యతిరేకమయితే కాలేదు. శత్రువుగానయితే మారలేదు. బహుశా నేను నమ్మింది […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 10

యాదోంకి బారాత్-10 -వారాల ఆనంద్ ఖాళీ కాలాలు- భాష్యత్తు పునాదులు వైఫల్యం అనుకుంటాం కానీ విద్యార్థి కాలంలో ఫెయిల్ అయ్యో, పై చదువులకు సీటు దొరక్కో ఒకటో రెండో సంవత్సరాలు ఖాళీ దొరికితే…ఆ కాలం మామూలు యువకుల సంగతేమో కానీ సృజన రంగం పట్ల అసక్తి ఉత్సాహం వున్న వాళ్ళకు బంగారు కాలమే. ఆ కాలం ఎన్నో చదవడానికి ఎంతో నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తు రూపొందడంలో ఆ కాలం గట్టి పునాదులు వేస్తుంది. నా అనుభవంలో 1977-78 […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 9

యాదోంకి బారాత్-9 -వారాల ఆనంద్ నటరాజ కళానికేతన్- సభలు సమావేశాలూ 1975-76 ప్రాంతం. డిగ్రీ చదువుతున్న రోజులు. అప్పుడప్పుడే టీనేజీ దాటుతున్న కాలం. ఒక వైపు అకాడెమిక్ చదువులు వాటి వొత్తిడి. మరోవైపు సాహిత్యం పత్రికలు సభలు సమావేశాలూ జీవితాన్ని కమ్ముకుంటున్న సమయం. ఇటు కరీంనగర్ లోనూ అటు వేములవాడలోనూ సాహిత్య నాటక సభలు నా ఒక్కడి కాలాన్నే కాదు నా సహచరుల అందరి జీవితాల్నీ బాగా ప్రభావితం చేసాయి. మరో వైపు సిరిసిల్లా జగిత్యాల పోరాటాల […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 8

యాదోంకి బారాత్-8 -వారాల ఆనంద్ కరీంనగర్ – కాలేజీ చదువుల దశాబ్దం           వ్యక్తుల పైనా శక్తులపైనా వ్యవస్తలపైనా కాలం తనదయిన భాషలో తనదైన రీతిలో ప్రభావం చూపుతూనే తుడిచి వేయలేని చరిత్రని లిఖించి వెళ్తూనే వుంటుంది. భారత స్వాతంత్రానంతర కాలంలో 70 వ దశకం అతి ముఖ్యమయినది. అత్యంత ప్రభావవంత మయినది. అనేక ఆటుపోట్లకు గురయిన కాలమది. మంచినీ చెడునీ ఒకే గవాక్షం గుండా చూసి సరి చేసుకుని ముందుకు […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 7

యాదోంకి బారాత్-7 -వారాల ఆనంద్ ఎస్.ఆర్.ఆర్.కాలేజ్ డిగ్రీ చదువులు, సాహితీ సాంస్కృతిక కార్యక్రమాలు           1974-77 ఎస్.ఆర్.ఆర్.కాలేజీలో బి.ఎస్సీ. డిగ్రీ చదువు ఆడుతూ పాడుతూ సాగిన కాలం. కాలేజీకి వెళ్ళామా వచ్చామా అంతే. అట్లని విచ్చలవిడితనం అన్నదీ లేదు. మంకమ్మతోట ఇంటి నుంచి రాజేందర్ జింబో, నేను సైకిళ్ళ మీద వెళ్ళే వాళ్ళం. ఇప్పుడు భాగ్యనగర్ వున్న చోట పెద్ద కుంట వుండేది. తర్వాత వరి మడులు. కేవలం St. John’s […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 6

యాదోంకి బారాత్-6 -వారాల ఆనంద్         నాటి నుంచి నేటి దాకా “జాతర” సామాన్యుని ఆధ్యాత్మిక, సామాజిక, ఆర్ధిక వ్యక్తీకరణ వేదిక. ఇవ్వాల్టి సాంకేతికత, అభివృద్ది వెలుగు చూడని దశాబ్దాల క్రితం నుండి జాతర అనగానే సామాన్య ప్రజలు వందలు వేలుగా గుమిగూడేవారు. అదొక గొప్ప సామూహిక వ్యక్తీకరణ. తమ ఇష్ట  దైవాలకు మొక్కులు తీర్చుకునే సందర్భమది. తర్వాత అంతా సమిష్టిగా వినోదమూ, వ్యవహారమూ, వ్యాపారమూ నిర్వహించుకునే ఒక అద్భుత వేదిక జాతర. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 5

యాదోంకి బారాత్-5 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ ఇల్లు- నా బాల్యం ఎ దౌలత్ భి లేలో ఎ షౌరత్ భి లేలో భలే చీన్ లో ముఝ్ సే మేరీ జవానీ మగర్ ముఝ్ కో లౌటాదే బచ్ పన్ కా సాయా ఓ కాగజ్ కి కష్తి ఓ బారిష్ కా పానీ ..( సుదర్షన్ ఫకీర్)           ఈ గజల్ ని జగ్జీత్ సింగ్ స్వరంలో ఎన్నిసార్లు విన్నానో […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 4

యాదోంకి బారాత్-4 -వారాల ఆనంద్ కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ – ఓ చరిత్ర ఓ జ్ఞాపకం కరీంనగర్ నా నేస్తం, కరీంనగర్ నా ప్రేయసి, కరీంనగర్ నా జీవితం, కరీంనగర్ నా ఊపిరి. కరీంనగర్ పోత్తిల్లల్లో పెరిగాను, వీధుల్లో తిరిగాను, ఒకటి కాదు రెండు కాదు ఆరు దశాబ్దాలకు పైగా ఈ వూరును నేను పెనవేసుకున్నాను. ఈ వూరు నన్ను తన చేతుల్లో పెంచింది.           వ్యక్తిగతంగా, […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 3

యాదోంకి బారాత్-3 -వారాల ఆనంద్ వేములవాడ ఫిలిం సొసైటీ స్థాపన- దృశ్య చైతన్యం           ఉత్తమ సినిమాల్ని ప్రజలకు చేరువ చేసే క్రమంలో నేను గత నాలుగు  దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో కృషి చేసాను. ఆ పని 23 ఆగస్ట్ 1981 రోజున ఆరంభమయింది. ఆ రోజు అప్పటికి మామూలు గ్రామమయిన వేములవాడలో ఫిలిం సొసైటీని ప్రారంభించాం. ఇక అప్పటి నుంచి అర్థవంతమయిన సినిమాల్ని చూడడం అధ్యయనం చేయడం, […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్- 2

యాదోంకి బారాత్-2 -వారాల ఆనంద్ వేములవాడ-కొన్ని వెంటాడే దృశ్యాలు           అయిదారు దశాబ్దాల క్రితం సామాజికంగా ఇంత చలనం, సాంకేతిక అభివృద్ధి లేని కాలం లో పిల్లలకు బడులకు ఇచ్చే సెలవులు గొప్ప ఆటవిడుపు. ఆ ఆటవిడుపులో అమ్మగారింటికి వెళ్ళడంలో వున్న మజాయే వేరు. అదీ ఆత్మీయంగా చూసే తాతయ్య అమ్మమ్మలు వున్నప్పుడు ఆనందం ఎన్నో రెట్లు పెరిగేది. ఇంతకు ముందే చెప్పినట్టు మా అమ్మగారిల్లు వేములవాడ. మా వూరు కరీంనగర్. […]

Continue Reading
Posted On :

యాదోంకి బారాత్-1 (ఈ నెల నుండి ప్రారంభం)

యాదోంకి బారాత్-1 -వారాల ఆనంద్ కళానికేతన్= కవితా చిత్ర ప్రదర్శన            ఇటీవల మా కరీంనగర్ ఇంట్లో నేను జరిపిన తవ్వకాల్లో బయట పడ్డ ఒక చిన్న ఫోటో ఇవ్వాళ ఈ నాలుగు వాక్యాలు రాసేందుకు కారణమయింది. చారిత్రకంగా రికార్డ్ చేయాల్సిన విషయమనిపించి ఈ జ్ఞాపకాల్ని పంచుకుంటున్నాను. ***           మా వూరు కరీంనగర్ అయినా చిన్నప్పుడు బడికి సెలవులోస్తే అమ్మగారింటికి చెక్కేయడం, స్వేచ్చా గాలుల్ని […]

Continue Reading
Posted On :