image_print

కొత్తేమీ కాదు (కవిత)

కొత్తేమీ కాదు –కె.మునిశేఖర్ త్వరలో యాభైవేల ఉద్యోగాలుభర్తీ అనంగనే సచ్చినపాణం  లేసొచ్చినట్లయిఆగబేగ పట్నం పైనమైనం ఇదిగో నోటిఫికేషన్, అదిగో నోటిఫికేషన్ అనంగనేకన్నవారిని కళ్ళల్లో  పెట్టుకునేరోజులొచ్చెనని తెగసంబురపడ్డాం ఖాళీల లెక్క తేల్చండనిఅధికారులకు ఆదేశాలొస్తే..తప్పిన మా జీవితపు లెక్కనుసరిచేసుకోవచ్చనుకున్నం కాలంపెట్టే పరీక్షల్లో తప్పిపోవడం,ఎన్నికలప్పుడే కురిసే ఉత్తుత్తి వరాలజల్లుకు తడిసిపోవడం మాకుకొత్తేమీ కాదు గాలి వాగ్దానాలకు ఉబ్బిపోయీ‌..కొన్నాళ్ళకు నిరాశ చెందిన గాలొదిలినబెలూన్ అవ్వడం మాకు అలవాటేకానీ…చిన్నఆశ మా ఆశలు, ఆశయాలు సర్కారుపక్షపాతపు కొక్కానికి వేలాడుతుంటే చూసి..కనబడనికన్నీళ్ళ మూట‌లు మోస్తున్నబతుకులు మావి పోయినంత దూరం తలూపడానికిమీ పెరట్లో పాలేరులం కాదు.!రేపటి మీ ఉనికిని ప్రశ్నించేపట‌్ట‌భద్రులం ***** కె.మునిశేఖర్కె.ముని శేఖర్ కవి, […]

Continue Reading
Posted On :

అమ్మను పోల్చకు (కవిత)

అమ్మను పోల్చకు – భమిడిపాటి స్వరాజ్య నాగరాజా రావు అమ్మను పోల్చకు అమ్మను ప్రకృతితో పోల్చకు. ప్రకృతికి కోపంవస్తే కన్నెర్ర చేసి ప్రళయాన్ని పంపిస్తుంది. కానీ,అమ్మకు కోపం వస్తే తన కనులను మాత్రమే జలమయం చేసుకుంటుంది. ఓర్చుకునేదీ తానే,ఓదార్చుకునేదీ తనకు తానే, ప్రకృతికి ఇవి రెండూ తెలియవు. అమ్మని దైవంతో పోల్చకు. దైవం పాలలో వెన్నలాంటిది, కఠినమైన ప్రయత్నంతో తప్ప కరుణించదు. అమ్మ వెన్నలో నెయ్యి వంటిది, ఒక్క పిలుపుకే కరిగి కల్పవృక్షమౌతుంది. దైవం తామరాకుమీద నీటి […]

Continue Reading

చెరగని చిరునవ్వులు (కవిత)

చెరగని చిరునవ్వులు -డా. కె. దివాకరా చారి సృష్టిలో వెలకట్టలేని కొనలేని అరుదైనది ఏమిటో తెలుసా? ప్రేమతో పలకరిస్తేనే చాలు ప్రతిగా దొరికే అపురూపమైన మురిపాల ముద్దులొలికే మన చిట్టి పసిడి కూనల అలౌకిక చిరునవ్వులే కదా ? జీవిత అనుభవాలను పండించుకుని తిరిగి పసితనాన్ని వెలిగించే పండు ముసలి బోసి నోటి ఆనందాల ముసి ముసి నవ్వులని చూసి మురిసిపోలేదా? మౌనంగా రేఖల్ని విప్పుకుంటూ మొగ్గలన్నీ విచ్చుకుంటూ సుగంధాలు పరిమళిస్తూ పువ్వులుగా నవ్వటం కనలేదా ? మట్టిని తొలుచుకుని […]

Continue Reading

అన్నిటా సగం (కవిత)

 అన్నిటా సగం -చెరువు శివరామకృష్ణ శాస్త్రి నీవో సగం, నేనో సగం ఆకాశంలో, అవనిలో అన్నిటా మనం చెరి సగమంటూ తాయిలాల మాటలతో అనాదిగా మీరంటున్న సగానికే కాదు అసలు మా అస్తిత్వానికే సవాలుగా మిగిలిపోయాము అబలలమై! నిన్ను అన్నగా, నాన్నగా, తాతగా, మామయ్యగా, బావగా తలచి చెల్లినై, కూతురినై, మనుమరాలిగా, కోడలిగా, ముద్దుల మరదలిగా బహురూపాలుగా విస్తరించి ప్రేమను, కరుణను పంచగల మహోత్తుంగ జలపాతాన్ని నేను! సంపాదనలో నీ కన్నా మెరుగ్గా ఆర్జిస్తూ నీతో బాటు […]

Continue Reading