image_print

విజయవాటిక-13 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-13 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ కళింగరాజ్యము -రాచనగరి-           అవంతికాదేవి చూడ చక్కని యువతి. మల్లెల కన్న సుకుమారమైనది. ఆమె మేని చ్ఛాయను చూసి గులాబీలు సిగ్గుపడతాయి. పాల నురుగులో చందనం కలిపినట్లు ఉంటుంది మరి. ఆమె కన్నులు కలువరేకులు. ఆమెకు రాజీవనేత్రి అన్న పేరు తగినదని అందరూ అనుకుంటారు. మృదువైన హృదయం ఆమె సొంతం. ఉద్యాన వనంలో లేళ్ళను, కుందేళ్ళను పెంచుతుంది ఆమె. పువ్వులతో సంభాషిస్తుంది. చక్కటి […]

Continue Reading

విజయవాటిక-12 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-12 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ ఇంద్రపురి బౌద్ధ విహారము           ఆచార్య దశబలబలి మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖము పాలిపోయి ఉంది. ఆయనకు కొద్ది దూరములో మహానాగ, మహానంది తదితర మిగిలిన పెద్దలున్నారు. వారంతా ఎదో గంభీరమైన విషయం గురించే చర్చిస్తున్నట్లుగా ఉన్నదక్కడ. కొద్ది దూరంలో విహారంలోని భిక్షుకులందరూ కొందరు కూర్చొని, కొందరు నిలబడి ఉన్నారు. అందరి ముఖాలలో దుఃఖం కనపడుతోంది. మహాచార్యులు పూజించే ధర్మపాదుకలు రత్నాలు […]

Continue Reading

విజయవాటిక-11 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-11 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ మహాదేవవర్మ మందిరము           ఎత్తైన పది మెట్లు ఎక్కిన తరువాత దేవడిలోకి ప్రవేశిస్తాము. రెండు సింహపు శిల్పములు ఆ మెట్లపైన కూర్చొని రాజసంగా చూస్తున్నాయి. దేవడిలోకి ప్రవేశించగానే ఎతైన స్తంభాలతో, గోడలనలంకరించిన తైలవర్ణ చిత్రాలతో, రకరకాల గాజు బుడ్డీలలో పెట్టిన దీపాలతో మందిరము మహోత్సవంగా ఉంది. ఆ చిత్రాలు విష్ణుకుండిన పూర్వపు రాజులవి. వీరత్వంతో తొణికిసలాడుతున్నాయి. విశాలమైన ఆ దేవడిలో ఒక వైపు […]

Continue Reading

విజయవాటిక-10 (చారిత్రాత్మక నవల)

విజయవాటిక-10 చారిత్రాత్మక నవల – సంధ్య యల్లాప్రగడ అమరావతి రాజమందిరం           మహాదేవవర్మ తల్పం పైన పవళించి ఉన్నాడు. నిద్రపోవటం లేదు. ఎదో దీర్ఘమైన ఆలోచనలు అతనికి నిద్రపట్టనివ్వటం లేదు. నెమ్మదిగా లేచి ఆ మందిరానికి ఆనుకొని ఉన్న రాజ ప్రాసాదమిద్దె  మీదకొచ్చాడు. చల్లని గాలి శరీరానికి తాకింది. పై పంచ గాలికి వణికింది. కృష్ణానది మీదుగా వచ్చే ఆ చల్లని గాలి అతనిని ఉక్కిరిబిక్కిరి చేసింది. ఊహలలో ఆనాటి నర్తకి […]

Continue Reading