అలవాటే ఆమె కది (కవిత)
అలవాటే ఆమె కది – ప్రసాదరావు రామాయణం అలవాటే ఆమేకది.. విషాదాన్ని మ్రింగి అలవోకగా చిరునవ్వు విసరడం! గరాళాన్ని త్రావి గొంతులో దాచుకోవడం!! అలవాటే ఆమేకది విరిసీ విరియగానే సావాసగాళ్లను దూరంపెట్టి ఊరించడం,ఉడికించడం ! అలవాటే ఆమేకది.. పుట్టినింటి ఆత్మీయ అయస్కాంత వలయాన్ని ఛేదించుకుని మెట్టినింటిలో క్రొత్త అనుభూతులు వెతుకుకోవడం ! అలవాటే ఆమేకది అత్తగారి ఎత్తిపొడుపులను అతి సాధారణంగా అనుభవించడం ! అలవాటే ఆమేకది…. పురిటి నొప్పులలో మరుసటి సౌఖ్యాన్ని అనుభూతించడం పాపను చూచినంతనే స్తన్యం […]
Continue Reading