image_print
Kandepi Rani Prasad

రాళ్ళల్లో, ఇసుకల్లో

రాళ్ళల్లో, ఇసుకల్లో -కందేపి రాణి ప్రసాద్ శని, ఆదివారాలు శెలవులు వచ్చాయని పోయిన వారం ఏదైనా టూరు వెళదామన్నారు పిల్లలు. ఎక్కువ రోజుల వ్యవధి లేదు కాబట్టి దగ్గరగా వెళదామనుకున్నాం. ఈ మధ్య మద్రాసు చూడక చాలా రోజులయ్యింది. అంటే అసలు చూడక అని కాదు. S R M C లో జరిగే కన్ప్హరెన్స్ లు అటెండ్ అవుతూనే ఉన్నాం. సైట్ సీయింగ్ ప్రదేశాలు చూడట్లేదన్నమాట. అలా గతవారం లో చెన్నై వెళ్ళాము. ఫ్లైట్ దిగగానే […]

Continue Reading

యాత్రాగీతం-30 (బహామాస్ – భాగం-1)

యాత్రాగీతం బహామాస్  -డా||కె.గీత భాగం-1 అమెరికా తూర్పు తీరానికి దగ్గర్లో ఉన్న బహామా దీవుల్ని చూడాలని ఎన్నాళ్ళుగానో అనుకుంటూ ఉన్నాం. బహామా దీవులు అమెరికా సంయుక్త రాష్ట్రాలలో భాగం కానప్పటికీ ఇక్కడి వర్క్  వీసాతో చూడగలిగిన ప్రదేశం.  మేమున్న కాలిఫోర్నియా నుంచి బహామా దీవుల్ని  సందర్శించాలంటే ఫ్లోరిడా రాష్ట్రం వరకు ఫ్లైట్ లో వెళ్లి అక్కణ్ణించి క్రూజ్ లో గానీ, ఫ్లైట్ లో గానీ వెళ్లొచ్చు. ముందు మేం పశ్చిమ తీరంలో ఒకట్రెండు సార్లు క్రూజ్ లకి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-29 (అలాస్కా-చివరి భాగం)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత చివరి భాగం కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ (Kenai Fjords National Park Cruise) ప్రయాణాన్ని ముగించుకుని,   ఎన్నో అందమైన ఆ దృశ్యాలు  మనస్సుల్లో దాచుకుని సాయంత్రం ఐదుగంటల ప్రాంతంలో తిరిగి సీవార్డ్ తీరానికి చేరుకున్నాం. క్రూజ్  దిగిన చోటి నుంచి మళ్ళీ మాకు నిర్దేశించిన షటిల్ లో పదినిమిషాల వ్యవధిలో రైలు స్టేషనుకి చేరుకున్నాం. అప్పటికే  గోల్డ్ స్టార్ డూమ్ రైలు మా కోసం […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-28 (అలాస్కా-16)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-16 కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్  సీవార్డ్ తీరంలో మాకోసమే నిలిచి ఉన్న కెనాయ్ ఫియోర్డ్స్ నేషనల్ పార్క్ క్రూజ్ (Kenai Fjords National Park Cruise) ని చివరి నిమిషంలో ఎక్కగలిగేం. నిజానికి అప్పటికే విట్టియార్ తీరం నుండి గ్లేసియర్లని ఒకసారి చూసేసినందువల్ల ఈ ట్రిప్పులో పెద్దగా చూసేవి ఏమీ ఉండవేమో అని భావించినా సీవార్డ్ తీరం ప్రధానంగా అలాస్కా తీర ప్రాంతపు పక్షుల అభయారణ్యం. […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-27 (అలాస్కా-15)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-15 సీవార్డ్  డౌన్ టౌన్ సీవార్డ్ డౌన్ టౌన్ సందర్శనం పూర్తి  చేసుకుని వెనక్కి రిసార్టుకి చేరుకుని, పిల్లల్ని  తీసుకుని రిసార్ట్ ఆఫీసు దగ్గర ఉన్న ఫైర్ ప్లేస్ దగ్గిర ఉన్న సిటింగ్ ఏరియాలో కూర్చుని ఉండగా అదే సమయానికి మాకు ఆ అలాస్కా  ప్రయాణంలో కనిపిస్తూ వచ్చిన మరో జంట కూడా వచ్చేరు. వాళ్లు తెలుగు వాళ్ళని తెలిసి సంతోషించడమే కాకుండా పరిచయాలు చేసుకుని చాలా సేపు […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-26 (అలాస్కా-14)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-14 సీవార్డ్  డౌన్ టౌన్ రిసార్టు ఎంట్రైన్సు దగ్గర నుంచి డౌన్ టౌన్ కి షటీల్ సర్వీసు ఉండడంతో అక్కడి వరకు నడిచి అక్కడి నుంచి డౌన్ టౌన్ కి పది పదిహేను నిమిషాల్లో చేరుకున్నాం. డౌన్ టౌన్ కి చేరుకున్న షటీల్ సర్వీసు సముద్రతీరంలో ఆగింది. అక్కణ్ణించి చూస్తే ఎత్తున కొండమీదికి అధిరోహిస్తున్నట్టు విశాలమైన రహదారి. ముందు చెప్పినట్టు సీవార్డ్ లోని ఈ డౌన్ టౌన్ మొత్తం […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-25 (అలాస్కా-13)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-13  సీవార్డ్  విశేషాలు చెప్పుకునే ముందు తల్కీట్నా నుంచి సీవార్డ్ వరకు ప్రయాణంలో మరిన్ని విశేషాలు చెప్పాల్సి ఉంది. తల్కీట్నా నుంచి సీవార్డ్ వెళ్లేదారి మొత్తం సముద్రపు పాయలు భూభాగంలోకి చొచ్చుకు వచ్చిన తీర ప్రాంతం నుంచి ప్రయాణం చేస్తాం. బస్సు ప్రయాణిస్తున్న రోడ్డుకి ఒక పక్కగా పట్టాలు, మరో పక్క నీళ్లు. ఏంకరేజ్ నుంచి మేం అలాస్కా టూరు లో మొదట చూసిన విట్టియర్ వైపుగానే కొంత  […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-24 (అలాస్కా-12)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-12 మర్నాడు బయటంతా చిన్న జల్లు పడుతూ ఉంది. ఉదయానే లేచి తయారయ్యి రిసార్ట్ ఆవరణలో ఉన్న చిన్న అందమైన గ్రీన్ హౌస్ ని చుట్టి వచ్చాము.  కాస్సేపట్లోనే సీవార్డ్ లోని మా రిసార్టు నుంచి వీడ్కోలు తీసుకుని బస్సులోకి ఎక్కి మాకు నిర్దేశించిన సీట్లలో ఉదయం 8 గం.ల కల్లా కూచున్నాం.  మేం మొదట బస చేసిన ఎంకరేజ్ మీదుగానే ప్రయాణం చేసి ఎంకరేజ్ కి దక్షిణంగా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-23 (అలాస్కా-11)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-11 తల్కిట్నా ఊరు హిమానీనదమ్మీద స్వయంగా అడుగుపెట్టిన విమాన ప్రయాణం పూర్తయ్యి బయటికి వచ్చేసరికి మమ్మల్ని తీసుకెళ్లేందుకు రిసార్టు వెహికిల్ సిద్ధంగా ఉంది.  పేకేజీ టూరు తీసుకోవడం వల్ల ఇదొక చక్కని ఏర్పాటు. ఎక్కడికి వెళ్లినా పికప్ , డ్రాప్ ఆఫ్ లకి తడుముకోనవసరం లేదు. ఇక వెనక్కి రిసార్టుకి చేరుకునేసరికి దాదాపు రెండున్నర కావస్తున్నా అదృష్టం కొద్దీ రిసార్టులోనే ఉన్న లంచ్ రెస్టారెంట్  తెరిచే ఉంది. మెక్సికన్ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-22 (అలాస్కా-10)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-10 మా అలాస్కా ప్రయాణంలో అతి ముఖ్యమైన ఘట్టం రానే వచ్చింది. భూమి మీద అత్యద్భుతాల్లో ఒకటైన  హిమానీ నదమ్మీద స్వయంగా అడుగుపెట్టే విమాన ప్రయాణం మొదలయ్యింది.  టేకాఫ్ సాఫీగానే జరిగినా ఊహించుకున్న దానికంటే భయంకరంగా శబ్దం చేస్తూ ఆరుగురు మాత్రమే పట్టే ఆ చిన్న ఫ్లైట్ గాల్లోకి లేచింది. అతి చిన్న విమానమేమో గాలికి సముద్రంలో పడవలా ఊగసాగింది. దాదాపు అయిదు నిమిషాల పాటు గొప్ప భయం […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-21 (అలాస్కా-9)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-9 ఆ మర్నాడు  మేం తిరిగి వెనక్కి వెళ్లే ప్రయాణంలో భాగంగా తల్కిట్నా (Talkeetna) అనే ఊర్లో బస చేసి హెలికాఫ్టర్ ద్వారా గ్లేసియర్ల మీద దిగే అడ్వెంచర్ టూరు చెయ్యబోతున్నాం.  ఉదయం ఏడు గంటల ప్రాంతంలో దెనాలీ నేషనల్ పార్కు నుంచి సెలవు తీసుకుని రిసార్ట్ గుమ్మం దగ్గిరే తల్కిట్నా బస్సు ఎక్కేం. ఈ బస్సు నేషనల్ పార్కులోపల తిరిగే ఎర్రబస్సు కాకుండా మంచి డీలక్స్ బస్సు […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-20 (అలాస్కా-8)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-8 మధ్యాహ్నం లంచ్ అంటూ ఏవీ తినలేదేమో సాయంత్రానికే అందరికీ కరకరా ఆకలి వెయ్యసాగింది. కొండ పైనున్న మా బసకి మా బస్సు మలుపు తిరిగే రోడ్డు దగ్గిర ఏవో రకరకాల హోటళ్లు ఉండడం చూసేం. మరో అరగంటలో పిల్లల్ని హోటల్లో దించేసి కాస్త మొహాలు కడుక్కుని కొండ దిగువకి వెళ్తున్న బస్సు పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చాము.    ప్రధాన రోడ్డు పక్కన ఉన్న సర్వీసు రోడ్డుని మీద […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-19 (అలాస్కా-7)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-7 దెనాలి నేషనల్ పార్కు  సందర్శనకు ఉదయానే రెడీ అయ్యి మా రిసార్టు బయటికి వచ్చేం. అనుకున్న సమయానికి బస్సు వచ్చింది. కానీ ముందురోజు లాంటి ఎర్రబస్సే ఇది కూడా. అనుకున్న సమయానికి బస్సు వచ్చింది. కానీ ముందురోజు లాంటి ఎర్రబస్సే ఇది కూడా. అన్ని రిసార్టుల నించి ఎక్కించుకున్నా సగం బస్సు కూడా నిండలేదు. కొండ తరవాత కొండ ఎక్కి దిగుతూనే ఉన్నాం. అక్కడక్కడా ఆగుతూ అక్కడక్కడా […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-18 (అలాస్కా-6)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-6 ఏంకరేజ్ నుండి ఆ ఉదయం బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో అత్యంత హాయిగా ప్రయాణించి దెనాలి నేషనల్ పార్కు స్టేషనుకి మధ్యాహ్నం 3 గం.ల ప్రాంతంలో చేరుకున్నాం. దెనాలి నేషనల్ పార్కు చూడకుండా అలాస్కాని చూసినట్టే కాదని ఎన్నో చోట్ల చదివేను. మొత్తానికి ఈ రోజు ఆ పార్కులో బస చెయ్యబోతున్నామన్న విషయం భలే ఆనందాన్నిచ్చింది. పట్టాల్ని అనుకుని ఉన్న పార్కింగు లాటులో మా విడిదికి మమ్మల్ని […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-17 (అలాస్కా-5)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-5 మా పేకేజ్  టూర్ లో భాగంగా  మర్నాడు  మేం ఎంకరేజ్ నుండి బయలుదేరి దెనాలి నేషనల్ పార్కుకి బయలుదేరేం.  ఎంకరేజ్ నుండి దెనాలి నేషనల్ పార్కుకి ఒక పూట ప్రయాణం. ఆ రోజు, మర్నాడు రెండు రాత్రుల పాటు దెనాలి నేషనల్ పార్కులోనే మా బస ఏర్పాటుచెయ్యబడింది. ఉదయం ఎంకరేజ్ లోని హోటల్లో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసుకుని హోటలు నించి రైలు స్టేషనుకి ఉన్న  ఫ్రీ […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-16 (అలాస్కా-4)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-4 ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరి గ్లాస్ డూమ్ ట్రైనులో  అనుకున్నట్టే విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరాం. దారిపొడవునా గడ్డి భూములు, ఎత్తైన పర్వతాలు, సరస్సులు, మంచుకొండలు గ్లాస్ డూమ్ ట్రైనులో నుంచి చూసి ఆస్వాదిస్తూ ఉంటే సమయమే తెలియలేదు. రైలు పెట్టెలోనుంచి ఒడ్డునున్న పెద్ద క్రూయిజ్ షిప్పు చూసి సంబరపడిపోయారు పిల్లలు. తీరా చూస్తే ఇంతకీ మేం ఎక్కాల్సింది దాని కొక […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-15 (అలాస్కా-3)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-3 మర్నాడు ముందే బుక్ చేసుకున్న టూరు ప్రకారం మేం ఏంకరేజ్ నుండి ఉదయం 9.45కు బయలుదేరే గ్లాస్ డూమ్ ట్రైనులో  విట్టియార్ అనే ప్రదేశానికి మధ్యాహ్నం 12.45 కు చేరుతాం. అక్కణ్ణించి వెంటనే బయలుదేరే షిప్పులో గ్లేసియర్ టూరుకి వెళ్లి సాయంత్రం 6 గం. కు విట్టియార్ తిరిగొచ్చి మళ్లీ ఏంకరేజ్ కు రాత్రి 9 గం. కు గ్లాస్ డూమ్ ట్రైనులో తిరిగొస్తాం.  మొత్తం టూరులో […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-14 (అలాస్కా-2)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-2 అర్థరాత్రి సూర్యోదయం మా ప్రయాణం మొదలయ్యే రోజు వారం రోజుల్లోకి రానే వచ్చింది. మిగతా అన్ని విషయాలూ ఆన్ లైనులో, అక్కడా ఇక్కడా తెలిసినా మేం వెళ్లిన జూలై చివరి వారంలో వాతావరణం ఎలా ఉంటుందనేది సరిగా అంచనా వెయ్యడం కష్టమైంది. అందుకు కారణం మేమున్న కాలిఫోర్నియా బే ఏరియాలో వేసవిలోనూ గట్టిగా ఎండ కాసే రోజులు అతితక్కువగా ఉంటాయి. ఒక రోజున్నట్టు మరొక రోజుండదు. ఒకోసారి […]

Continue Reading
Posted On :

యాత్రాగీతం-13 (అలాస్కా)

యాత్రాగీతం నా కళ్లతో అమెరికా అలాస్కా -డా||కె.గీత భాగం-1 అమెరికాలో “అలాస్కా” చూసి రావడం అనేది ప్రతీ ఒక్కరికీ “బక్కెట్ లిస్టు” లో భాగం. అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు తీరాలనుకున్న కోరికల పద్దులో ముఖ్యమైనదన్నమాట. ఇక మేం ఎన్నాళ్లుగానో చూడాలనుకున్న ముఖ్య ప్రదేశాల్లో ఇదీ ఒకటి. కానీ ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తూంది. ఇందుకు ఒక ప్రధాన కారణం ఏవిటంటే అలాస్కా అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒకటైనప్పటికీ భౌగోళికంగా ఇది ప్రత్యేకంగా కెనడా దేశాన్ని […]

Continue Reading
Posted On :