image_print
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -19 సంక్లిష్ట భావ పరిమళాలని వెదజల్లే రాగం జైజవంతి (ద్విజావంతి)

ఒక భార్గవి – కొన్ని రాగాలు -19 సంక్లిష్ట భావ పరిమళాలని వెదజల్లే రాగం జైజవంతి (ద్విజావంతి) -భార్గవి అసలు ఈ జైజవంతి అనే పేరు వింటేనే ఒక విచిత్రమైన ఫీలింగ్ ,ఒక్కసారిగా మదిలో చామంతులు విరిసినట్టూ,వేయి మతాబాలు వెలిగినట్టూ అనిపిస్తుంది మండు వేసవిలో మునిమాపు వేళ చల్లగా వీచే యేటి గాలిలా మనసును సేద తీర్చే రాగం జైజవంతి( ద్విజావంతి). ఇది మిశ్ర భావనలు ప్రతిఫలించే  రాగం అంటారు. ఒక సంతోషమూ ,ఒక విజయం సాధించిన […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -18 రాగాల సిగలోన సిరిమల్లి- శివరంజని

ఒక భార్గవి – కొన్ని రాగాలు -18 రాగాల సిగలోన సిరిమల్లి- శివరంజని -భార్గవి శివం అంటే శుభప్రదమైన ,పవిత్రమైన అని అర్థమట.శివ రంజని అంటే పవిత్రంగా శుభప్రదంగా రంజింపచేసేది అనుకుంటున్నా. శివరంజని రాగం వింటుంటే మనసంతా ఒకరకమైన వేదన,ఆర్తీ కమ్ముకుంటుంది.ఎక్కువగా విషాదాన్నీ,దుఃఖాన్నీ ,భక్తినీ ,కరుణ నీ చేరవేసే రాగం . ఒక మంచి సంగీత దర్శకుని బాణీలో ,చక్కటి గాయకుల నోట  ఈ రాగం వింటుంటే హృదయంలోని ఉదాసీనత వేళ్లతో సహా పెకలించుకుని దుఃఖపు కెరళ్లు […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -17 మనోహరమైన మాండ్ రాగం

ఒక భార్గవి – కొన్ని రాగాలు -17 మనోహరమైన మాండ్ రాగం -భార్గవి మదన మోహిని చూపులోన మాండు రాగమేలా? అని నాయకుడు నాయికని ప్రశ్నించగానే ,”అసలు మాండు రాగం యెలా వుంటుది?”అనే సందేహం తలెత్తడం ,పైగా అది చూపులో యెలా ప్రవహిస్తుంది అనిపించడం సహజం.సరే పదండీ ఆ రాగం గురించి తెలుసుకుందాం. మాండ్ రాగం ఉత్తర హిందూస్థానంలో బాగా ప్రాచుర్యంలో వున్న రాగం,ప్రణయానీ,ఉల్లాసాన్నీ,సూచించడానికి యెక్కువగా వాడినా యే అనుభూతినైనా అలవోకగా పలికించగలిగే రాగంగా భావిస్తారు. నిజానికి […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -16 నేనూ–భాగేశ్వరి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -16 నేనూ–భాగేశ్వరి -భార్గవి అప్పుడప్పుడే యుక్త వయస్సులోకి అడుగుపెడుతున్న రోజులు.పెద్దవాళ్లేం చెప్పినా రుచించని,ఎదురు సమాధానం చెప్పాలనిపిస్తూ వుండే కాలం.ఈ లోకం మన కోసమే సృష్టించబడిందనీ,దాన్ని మరామ్మత్తు చెయ్యగలమనీ,ఇంకా దాన్ని మనకిష్టం వచ్చినట్టుగా మలుచు కోగలమనీ,కొండలనయినా పిండి చెయ్యగలమనీ, ఆత్మవిశ్వాసంతో  అలరారే కాలం.(ఈ దశ ప్రతి ఒక్కరి జీవితంలోనూ  వుంటుందని నా నమ్మకం).అప్పుడే పెద్ద వాళ్ల అభిరుచులతో కూడా విభేదించి మన కంటూ సొంత అభిరుచులను వెతుక్కునే ఒక ఆరాటం కూడా […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -15 మధువులు చిలికించే రాగం – ధర్మవతి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -15 మధువులు చిలికించే రాగం —ధర్మవతి -భార్గవి “అందెల రవమిది పదములదా? ” అని ప్రశ్నిస్తే కాదు అంబరమంటిన హృదయముదే అని సమాధానం ఇవ్వాలనిపిస్తేనూ “హలో మై డియర్ రాంగ్ నంబర్ “అని పలుకుతుంటే —రాంగ్ నంబర్ రైటవ్వాలనిస్తేనూ “కొంటె గాణ్ణి కట్టుకో కొంగు కేసి చుట్టుకో ” అని కవ్విస్తుంటే మనసులో కొంటె ఊహలు చెలరేగిపోతేనూ “గోవిందా శ్రిత గోకుల బృందా పావన జయ జయ పరమానందా” అని  […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -14 హాయిగా మెత్తగా మత్తును గొలిపే రాగం – హమీర్ కల్యాణి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -14 హాయిగా మెత్తగా మత్తును గొలిపే రాగం – హమీర్ కల్యాణి -భార్గవి మండు వేసవి కాలం ,రాత్రి తొలిజాములో  ,వెలిగే నక్షత్రాల కింద   మేనువాల్చిన సమయంలో, హాయిగా తాకి సేదతీర్చే చల్లనిగాలిలా, పట్టుమెత్తని గులాబీ రేకులు తలపై నుండీ జలజలా రాలి తనువంతా సుగంధ భరితం చేసినట్లూ సుతిమెత్తని ముఖమల్ పరుపుపై ఒత్తిగిలినంత సుఖంగానూ అనిపించే రాగం హమీర్ కల్యాణి ఇది ఉత్తర భారతంలో పుట్టిన రాగం […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -13 రక్తి రాగం – ఖమాస్

ఒక భార్గవి – కొన్ని రాగాలు -13 రక్తి రాగం – ఖమాస్ -భార్గవి శంకరాభరణం సినిమాలో లో శంకర శాస్త్రి చెప్పినట్లు “బ్రోచే వారెవరురా” అనే మైసూర్ వాసుదేవాచార్  కీర్తనలో ఆర్తీ ఆర్ద్రతా తొంగిచూడటానికీ,”డోలాయాంచల డోలాయ” అనే అన్నమయ్య పదంలో భక్తి భావం పొంగి పొర్లడానికీ “సీతాపతే నా మనసున” అనే త్యాగ రాజ కీర్తనలో వేడుకోలుకీ “అపదూరుకు లోనైతినే” అనే జావళీలో శృంగార రసం చిప్పిల్లడానికీ “ఎందుకే నీకింత తొందరా ఓ చిలుక నా చిలుక ఓ రామచిలుక” […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -12 హంసానంది-ఒక అనుభూతి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -12 హంసానంది-ఒక అనుభూతి -భార్గవి హంసానంది ఒక రాగం కాదు,ఒక అనుభూతి,ఒక వేదన, ఒక విన్నపం, ఒక వేడికోలు ,ఒక నిర్వచించలేని భాషకందని భావన చల్లని సాయం సమయంలో గాలిలో  తేలివచ్చే హంసానంది రాగాలాపన మనసుని వేరే లోకాలలోకి తీసుకువెళ్లి ఒక తియ్యని బాధకి గురి చేస్తుందనడంలో సందేహం లేదు .తీవ్రమైన ఉద్వేగాన్ని రేకెత్తించే రాగం. ఊరికే రాగం ఆలపిస్తే చాలు,ఈ రాగపు అలల కుచ్చిళ్ల పై సొక్కి సోలిపోతారెవరైనా. […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -11 కమ్మటి పరిమళాలు వెదజల్లే కాపీ రాగం

ఒక భార్గవి – కొన్ని రాగాలు -11 కమ్మటి పరిమళాలు వెదజల్లే కాపీ రాగం -భార్గవి మన దక్షిణాది రాష్ట్రాల వారికి పొద్దున్నే కళ్లు తెరవంగానే కమ్మటి కాఫీ చుక్క గొంతులో పడితే గానీ కాలకృత్యాలు మొదలవ్వవు అసలు కాఫీ రుచంతా అది వెదజల్లే పరిమళంలోనే దాగి వుందంటారు కాఫీ శాస్తృజ్ఞులు. అలాగే ఒక పాట కు కూడా రంగూ,రుచీ,వాసనా కలగజేసేది, ఆ పాటకు ఆధారమైన రాగమే.మన జీవితాలలో కాఫీ కొక ప్రత్యేక స్థానమున్నట్టే, కర్ణాటక సంగీతంలో కాపీ రాగానికి కూడా ఒక ప్రత్యేక స్థానముంది.ఒక ఆర్తినీ,ప్రణయాన్నీ ,విరహాన్నీ , వేడికోలునీ,భక్తినీ […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -10 హాయిని గొలిపే హిందోళం

ఒక భార్గవి – కొన్ని రాగాలు -10 హాయిని గొలిపే హిందోళం -భార్గవి చక్కగా శ్రుతి శుభగంగా ఆలపించే హిందోళ రాగం వినంగానే , ఆత్మ ఆనందపుటలలలో తేలియాడి,దివ్య లోకాలలో విహరిస్తుందంటారు. అసలు హిందోళ అనే పదానికి అర్థం ఒక రకమైన ఊపు,తూగు,లయ అని చదివాను.ఇంకా ఉద్వేగాలని ఉపశమింప జేసి మనసుకు ఓదార్పుని ఇస్తుందనీ,అందువలన రక్తపోటుని నియంత్రించడానికీ,ఆందోళన తగ్గించడానికీ “మ్యూజిక్ థెరపీ” లో ఈ రాగాన్ని వినియోగిస్తారని విన్నాను. ఇది మంచి రక్తి రాగమని గాత్ర కచేరీలలోనూ,నాదస్వర […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం- కానడ

ఒక భార్గవి – కొన్ని రాగాలు -9 మనసుని ఉప్పొంగించే రాగం—కానడ -భార్గవి మనసొక మహా సముద్రం అనుకుంటే ,అందులో ఉప్పొంగే భావాలే అలలు.అలా భావాలని ఉప్పొంగించే రాగం కానడ మునిమాపు వేళ సన్నగా వీచేగాలికి ఆలయ ధ్వజస్తంభానికున్న చిరుగంటలు మోగినట్టూ- కార్తీకమాసంలో ఓ రాత్రివేళ చిరుచలిలో తులసికోటలో నిశ్చలంగా వెలిగే నూనెదీపం లాగానూ మరిగిన పాల మీద కట్టిన చిక్కటి మీగడని చిలకితే వచ్చిన వెన్న నోట్లో కరిగిపోయినట్టూ అనిపిస్తుంది ఈ రాగం ఆలపించినప్పుడు వింటే […]

Continue Reading
Posted On :
Bhargavi

ఒక భార్గవి – కొన్ని రాగాలు -8 ఆనంద భైరవి

ఒక భార్గవి – కొన్ని రాగాలు -8 ఆనంద భైరవి -భార్గవి ప్రాంతాలు వేరైనా ,భాషలు ఒకటి కాకపోయినా  కులాలూ,మతాలూ జాతుల ప్రమేయం లేకుండా సమస్త మానవాళికి సాంత్వన నిస్తూ ఆనందాన్ని కలగజేసేది సంగీతం. అందుకే సంగీతాన్ని దైవభాష అంటారు. దేశాన్ని బట్టీ,ప్రాంతాన్ని బట్టీ,కాలాన్ని బట్టీ —దేశీ సంగీతమనీ ,విదేశీ సంగీతమనీ,కర్ణాటకమనీ,హిందుస్థానీ అనీ,జానపదమనీ,సంప్రదాయమనీ వివిధ రకాలుగా వర్గీకరించినప్పటికీ, ప్రాథమికంగా సంగీతం ప్రయోజనం ,వినే జనులకు ఉల్లాసాన్నీ ఉత్సాహాన్నీ కలిగించడం,ఉద్వేగాలని ఉపశమింప జేయడం అలా మనసును శాంత పరచి,ఆనందాన్ని కలగ జేసే […]

Continue Reading
Posted On :