image_print

వ్యాధితో పోరాటం- 28

వ్యాధితో పోరాటం-28 –కనకదుర్గ నా డాక్టర్ వచ్చి రిపోర్ట్స్ చూసి ఇంకొన్ని టెస్ట్స్ చేసి చూసాక ఏం చేయాలో ఆలోచిద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు. ప్రక్కన పేషంట్ని చూడడానికి చాలామంది మెడికల్, హాస్పిటల్ కౌన్సిలర్ వచ్చారు. ఒక కర్టన్ తప్ప ఏ అడ్డం లేదు పక్క పేషంట్ కి నాకు మధ్యన. మాటలన్నీ క్లియర్ గా వినిపిస్తాయి. “మీ పిల్లలకు ఇన్ ఫార్మ్ చేసారా?” “లేదు. మీరేం చెబ్తారో చూసి చెప్పాలనుకున్నాం.” “సర్జరీ తప్పకుండా చేయాలి. ఆ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 27

వ్యాధితో పోరాటం-27 –కనకదుర్గ సాయంత్రం శ్రీని క్యాథి ఇంటికే డైరెక్ట్ గా వచ్చి సూసన్ ని కల్సి, కాసేపుండి మమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళాడు. క్యాథి భర్త గ్యారికి పెన్సల్వేనియాలో ఉండడం ఎక్కువగ నచ్చలేదు. ఆయనకి కొండలెక్కడం, బైకింగ్, హైకింగ్, వీటన్నిటితో పాటు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. ఆయనకు ఎక్కువగా మనుషులతో గడపడమంటే అంత ఇష్టపడేవాడు కాదు. క్యాథి అందరిలో వుండాలని కోరుకునే మనిషి. ఆమె అనుకున్నట్టు భర్తకు నచ్చితే పిల్లలతో ఇక్కడే ఉండాలనుకుంది తన కుటుంబానికి […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 26

వ్యాధితో పోరాటం-26 –కనకదుర్గ పాప పుట్టక ముందు ఆఖరిసారి చెకప్ కి వెళ్ళినపుడు, ఇండ్యూస్ చేయాల్సి వస్తుం దేమో అంటే నాకు భయమేసింది. అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చాయి. చైతన్య పుట్టిన దాదాపు 10 ఏళ్ళ తర్వాత ఈ కాన్పు ఇపుడు. మెడిసెన్ బాగా డెవలప్ అయ్యింది, నొప్పులకు ఎపిడ్యూరల్ అనే మందు కూడా తీసుకోవచ్చని చెప్పారు. అయినా సరే నాకు అపుడయిన అనుభవం ఒక చేదు తీపి అనుభవంలా అయ్యింది. చెకప్ నుండి ఇంట్లో […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 25

వ్యాధితో పోరాటం-25 –కనకదుర్గ మొత్తానికి మా ట్రిప్ ముగించుకుని వచ్చాము. వారం రోజులు వెళ్ళివచ్చే వరకు బాగా అలసిపోయాను. శ్రీనివాస్ ఆఫీస్ కి వెళ్ళిపోయాడు. నేను పడుకుని నిద్రపోయాను. శ్రీనివాస్ మధ్యాహ్నం ఇంటికి వచ్చి నన్ను లేచి స్నానం చేసి రమ్మని నేను వచ్చేవరకు వేడి వేడి నూడుల్స్ చేసి పెట్టాడు. “నీకు అన్నం తినాలన్పించకపోతే కొద్ది కొద్దిగా ఇలాంటివి తింటూ వుండు, కొద్దిగానయినా శక్తి వుంటుంది.” అంటూ ఒక బౌల్ లో నూడుల్స్, స్పూన్ వేసి […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 24

వ్యాధితో పోరాటం-24 –కనకదుర్గ రాత్రి పడుకునేపుడు, నేనేం మాట్లాడకుండా ఏ గొడవ లేకుండా పడుకుందామను కున్నాను. “ఇంటికి ఎందుకు రాలేదు చెప్పు.” అని పదే పదే అడగసాగాడు. “ఊరికేనే, ఏం లేదు, చాలా రోజులయింది, అమ్మా, నాన్న దగ్గర ఉండి, వాళ్ళని మిస్ అవుతున్నాను. అందుకే…” ” అది కాదు, అసలు రీజన్ చెప్పు ఎందుకు రాలేదో.” ” ఏం కాలేదు, ఏం లేదు. ఒక్కరోజు మా ఇంట్లో ఉండాలనుకోవడం తప్పా?” ” అది కాదు, అసలు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం (నోట్ టు రీడర్స్)

వ్యాధితో పోరాటం (నోట్ టు రీడర్స్) –కనకదుర్గ ప్రియమైన పాఠకుల్లారా, ఈ ఏడాది జనవరి 8న నా జీవిత సహచరుడు శ్రీనివాస్ ఈ లోకం వదిలి వెళ్ళిపోయాడు. క్రానిక్ పాన్ క్రియాటైటిస్ జబ్బుతో బాధ పడుతున్న నన్ను, నేను నెలలు నెలలు ఆసుపత్రులల్లో వుంటే చంటిపాపను స్ఫూర్తిని, పదేళ్ళ చైతన్యను కంటికి రెప్పలా కాపాడుకున్న నా భర్త, నేనే పని చేస్తానన్నా తనకి వీలైనంత సాయం సంతోషంగా చేసే వాడు. నేను ఆసుపత్రిలో వుంటే పిల్లల్ని రోజూ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 23

వ్యాధితో పోరాటం-23 –కనకదుర్గ నాకేమనిపించిందంటే శైలు చేసిన గొడవ మా ఇంట్లో అందరికీ చెప్పేసి నేను ఏడుస్తూ ఉన్నానేమో అనుకుంటూ వచ్చి ఉంటాడేమో! మర్నాడు నేను లేచి కాల కృత్యాలు తీర్చుకుంటుంటే అమ్మ కాఫీ చేసి, ఉప్మా టిఫిన్ కూడా చేసి పెట్టింది అల్లుడికి. నేను వచ్చి శ్రీనిని స్నానం చేస్తావా అని అడిగాను. శనివారం ఆఫీస్ ఉండదు, స్నానం చేసి, బోంచేసి సాయంత్రం ఇంటికి వెళ్దామంటాడనుకున్నాను. “లేదు, నేను ఇంటికి వెళ్ళి చేస్తాను,” అన్నాడు. ” […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 22

వ్యాధితో పోరాటం-22 –కనకదుర్గ అమ్మ ఫోన్ చేసి శ్రావణ శుక్రవారం పూజ చేస్తున్నాను వచ్చి పొమ్మన్నది. పూజ కోసం కాకపోయినా ఇలాగైనా అమ్మని, నాన్నని చూసి రావొచ్చని, వెళ్దామనుకున్నాను. ఇంతలో పక్కింటి వాళ్ళు వచ్చి మా అత్తగారిని తాంబూలం తీసుకొని వెళ్ళమని పిలిచారు. అలాగే మరో ఇద్దరు, ముగ్గురు రమ్మన్నారు. నేను రెడీ అయ్యాను కానీ ఆమె తాంబూలం తీసుకుని వచ్చేదాక నేను వెళ్ళలేను, ఎందుకంటే శైలుని చూసుకోవాలి. శైలు లోపల కూర్చొని ఉన్నపుడు మా అత్తగారు […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 21

వ్యాధితో పోరాటం-21 –కనకదుర్గ ఫైనల్ ఇయర్ ఫేయిలవుతానేమో అని భయమేసేది కానీ చదువు మీద దృష్టి పెట్టలేకపోయాను. అమ్మ వాళ్ళ పెద్దన్నయ్య, దాశరధి , ప్రముఖ కవి, ప్రజాకవి, సినీ కవి, కొన్నాళ్ళు ఆస్థాన కవిగా ఉన్నారు…. అంతకంటే ముఖ్యమైంది ఆయన నిజాం రాజుకి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం కలిగించి, ఎన్నోసార్లు జైలు కెళ్ళి జైలు గోడల పైన “నిజాము రాజు తరతరాల బూజు,” “రైతుదే తెలంగాణము రైతుదే. ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అని గర్జించాడు”. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 20

వ్యాధితో పోరాటం-20 –కనకదుర్గ నేను కాపురానికి వచ్చినపుడు శ్రీని, నేను రెండేళ్ళ వరకు పిల్లలు వద్దని అనుకు న్నాము. నేను జర్నలిజం చేసి జాబ్ చేయాలని నా కోరిక. కానీ నేను వచ్చిన నెల తర్వాత నుండే నేను నెల తప్పానా లేదా అని ఆరాలు మొదలయ్యాయి ఇంట్లో. నెల నెల బయట కూర్చుంటానని అనుకున్నారు. మా అత్తగారు శైలజతో కష్టం అవుతుందని బయట కూర్చోవడం మానేసారని, శైలజ కూడా కూర్చోదు కాబట్టి నేను ఆ ఆచారం […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 19

వ్యాధితో పోరాటం-19 –కనకదుర్గ డాక్టర్ పెట్టిన చివాట్లతో నాకు బుద్దివచ్చి మళ్ళీ క్లీనింగ్ లు కానీ, వంటలు కానీ చేయలేదు కానీ చైతన్య స్కూల్ హోం వర్క్ నా దగ్గరే కూర్చుని చేసుకుంటుంటే చూసేదాన్ని, క్లాస్ ప్రాజెక్ట్స్ చేయడంలో కూర్చునే సాయం చేసేదాన్ని. ఇలా జాగ్రత్తగా నెల అయిపోయింది. చెకప్ కి వెళితే డాక్టర్ అన్నీ చెక్ చేసి బ్రెదిన్ పంప్ (Brethen pump) తీసేసారు. పాప ఆరోగ్యంగా ఉంది, నేను బాగానే ఉన్నాను. బెడ్ రెస్ట్ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 18

వ్యాధితో పోరాటం-18 –కనకదుర్గ “ఇపుడు ఇన్ని సమస్యలు, ఇన్ని ట్రీట్మెంట్లు వచ్చాయి. మా సమయంలో అయితే కాన్పు కాగానే పిల్లగానీ, పిల్లవాడ్ని గానీ ఇంట్లో వున్న పెద్ద వారికి అంటే అత్తగారికి అప్ప చెప్పి పొలంకి వెళ్ళి పని చేసే వాళ్ళం తెలుసా?” అంది. నేను ఇలాంటి కథలు వినే వున్నాను.  చైతన్య కడుపులో వున్నపుడు అత్తగారింట్లోనే వుండేవారం. శ్రీనివాస్ అమ్మమ్మ వుండేవారు. ఆమె చాలా జాగ్రత్తగా మా మామగారు, శ్రీనివాస్ ఆఫీస్ లకు వెళ్ళిపోయాక నన్ను […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 17

వ్యాధితో పోరాటం-17 –కనకదుర్గ ఫోన్ తీసుకొని, “బూస్టర్ షాట్ తీసుకున్నాను డాక్టర్,” అని చెప్పాను. ఏం జరుగు తుందోనని నాకు భయం పట్టుకుంది. “ఓ.కే, నౌ డోంట్ మూవ్, జస్ట్ టేక్ ఇట్ ఈజీ అండ్ ప్లీజ్ రెస్ట్. నువ్వు ఇపుడు ఒకసారి చెకప్ కి రావాలి, రాగలవా?” ” డాక్టర్ ఈజ్ ఎనీధింగ్ రాంగ్? నాకు భయం వేస్తుంది….” నాకు ఏడుపొస్తుంది. చైతు వచ్చి నా చెయ్యి పట్టుకుని కూర్చున్నాడు. ” ఒకసారి చెక్ చేస్తే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 16

వ్యాధితో పోరాటం-16 –కనకదుర్గ రోజూ చైతన్య స్కూల్ కి, శ్రీని ఆఫీస్ కి వెళ్ళేలోగా అన్నీ పనులు చేసుకుని రిలాక్స్ అయ్యేదాన్ని. వాళ్ళు వెళ్ళేలోపే స్నానం చేసి, ఏదైనా తినేసి టీ.వి పెట్టుకుని కూర్చునే దాన్ని. మధ్యాహ్నం శ్రీని ఆఫీస్ నుండి లంచ్ టైమ్ లో వచ్చి తినడానికి చాలా హెల్తీ తిండి చేసి పెట్టేవాడు. తను కూడా లంచ్ చేసి వెళ్ళేవాడు. నాకు పనంతా శ్రీని పైనే పడినందుకు చాలా బాధగా వుండేది. కానీ డాక్టర్స్ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 15

వ్యాధితో పోరాటం-15 –కనకదుర్గ నిన్నటిలాగే ఇన్సూలిన్ ఇస్తున్నారు. మంటలెక్కువగా వుంటే చల్లటి టవల్స్ ఇచ్చారు. చైతు, శ్రీని తల పైన, కళ్ళపైన, చేతులు, కాళ్ళపైన వేస్తూ వున్నారు. థాంక్స్  గివింగ్ డిన్నర్ నాలుగు గంటలకు స్పెషల్ వుంటుందన్నారు. మధ్యాహ్నం కాఫెటేరియాకి వెళ్ళి వాళ్ళకి నచ్చినవి తినేసి వచ్చారు. ఫాల్ సీజన్ మొదలయ్యింది. ఈ సారి స్నో చాలా త్వరగా పడింది. ఇప్పుడు బయట ఆకులు రంగులు మారాయి ఇప్పుడు. మొత్తానికి ఈ ట్రీట్మెంట్ వల్ల నొప్పులు రావడం […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 14

వ్యాధితో పోరాటం-14 –కనకదుర్గ పిల్లలకు ఎవ్వరికైనా జ్వరం వస్తే నాన్న ఒకోసారి సెలవు పెట్టి దగ్గరుండి చూసుకునేవారు. జ్వరం వల్ల నాలిక చేదుగా వుంటే డ్రై ప్లమ్స్ తెచ్చేవారు, అది నోట్లో పెట్టుకుంటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా వుండేది. జ్వరం వస్తే అన్నం తినకూడదని, బ్రెడ్, పాలల్లో వేసి తినిపించేవారు. నాన్న ఆఫీసుకెళ్తే అమ్మని మా దగ్గరే కూర్చోమని గోల చేసేవాళ్ళం. అమ్మ త్వరగా పని చేసుకుని వచ్చి మా దగ్గరే వుండేది. అమ్మ చేయి పట్టుకునే వుండేదాన్ని. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 13

వ్యాధితో పోరాటం-13 –కనకదుర్గ ట్రీట్మెంట్ ఎంత త్వరగా మొదలుపెడితే అంత త్వరగా నొప్పులని ఆపొచ్చు, లోపల పాపకి కూడా స్ట్రెస్స్ తగ్గుతుంది అన్నారు. పాపం శ్రీని ఆ రోజే కొత్త జాబ్ లో జాయిన్అవ్వాల్సింది. ఆఫీస్ వాళ్ళకి ఫోన్ చేసి పరిస్థితి చెబితే లాప్ టాప్ తో స్టార్ట్ చేయొచ్చు, నీకు టైం దొరికినపుడు కాసేపు వర్క్ చేయమన్నారు. చైతు స్కూల్ కి వెళ్ళాడు. అప్పటికి అందరూ ఇండియన్ కొలీగ్స్ కుటుంబాలతో వెళ్ళిపోయారు. సుజాత అనేఒక తమిళ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 12

వ్యాధితో పోరాటం-12 –కనకదుర్గ 8వ నెలలో మళ్ళీ ఒక అటాక్ వచ్చింది. అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళారు. నొప్పి ప్రాణం పోతుందేమో అన్నంతగా వచ్చింది. నేను అంబులెన్స్ కి కాల్ చేయమంటే ఎందుకు నేను తీసుకెళ్తాను అంటాడు శ్రీని. మనమే కార్ లో వెళ్తే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగాలి, ట్రాఫిక్ ఎక్కువగా వుంటే ఆగిపోతాము, ఇక నొప్పితో ఏం జరిగినా ఏం చేయడానికి వుండదు. అదే అంబులెన్స్ అయితే వాళ్ళకి ట్రాఫిక్ లో క్లియరెన్స్ వుంటుంది. అదీ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 11

వ్యాధితో పోరాటం-11 –కనకదుర్గ శ్రీని లోపల పని చేసుకుంటున్నాడు. వంట చేస్తున్నట్టున్నాడు. “నీకు ఇడ్లీ పెట్టనా ఈ రోజుకి?” అని అడిగాడు కిచెన్ నుండి. “సరే,”అన్నాను. పాపని చాలా మిస్ అయ్యాను. దాన్నే చూస్తూ కూర్చున్నాను. నా తల్లి ఎంత ముద్దుగా వుందో? ఎంత కావాలనుకుని కన్నాను కానీ అది కడుపులో వున్నపుడు చిన్ని ప్రాణాన్ని ఎంత బాధ పెడ్తున్నాను కదా, నా కిచ్చే మందులు దానికి వెళ్ళేవి, పాపం నార్మల్ గా, ఆరోగ్యంగా పెరగాల్సిన పిల్ల […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 10

వ్యాధితో పోరాటం-10 –కనకదుర్గ నాకు ప్రెగ్నెంసీ అని తెలిసేటప్పటికి శ్రీని ఇండియన్ కొలీగ్స్ అందరూ వెళ్ళిపోయారు. కొంత మంది ఇండియాకెళ్ళారు, కొంత మంది అమెరికాలోనే వుండాలని నిర్ణయించుకుని పర్మనెంట్ ఉద్యోగాలు చూసుకొని వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళి పోయారు. జోన్ అంటుండేది, “నీ డెలివరీ అయ్యాక మీకెప్పుడైనా అవసరమొస్తే అపుడు నేను బేబిసిట్ చేస్తాను.” అని. డా. రిచర్డ్ ఈ.ఆర్. సి.పి కి రమ్మంటే జోన్ ని టెస్ట్ అయ్యి వచ్చేదాక పాపని చూసుకుంటావా అని అడిగితే, […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 9

వ్యాధితో పోరాటం-9 –కనకదుర్గ సాయంత్రం పిల్లల్ని తీసుకుని శ్రీని వచ్చాడు. పాప ఆ రోజు సరిగ్గా పడుకోలేదు, అందుకే కొంచెం చికాగ్గా వుంది. ఏడుస్తుంది. అందరూ వూరుకోబెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. “ఇది హాస్పిటలా, ఇల్లా? ఇక్కడ పేషంట్లకి రెస్ట్ అవసరం అని తెలీదా? ఇపుడే నిద్ర పట్టింది? ఇక్కడ సరిగ్గా పడుకోవడానికి కూడా లేదా?” అని గట్టిగా అరిచింది పక్క పేషంట్. నర్స్ బెల్ ఆగకుండా నొక్కుతూనే వుంది. జూన్ పరిగెత్తుకొచ్చింది. పాపని చూసి,” హాయ్ స్వీటీ! వాట్ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 8

వ్యాధితో పోరాటం-8 –కనకదుర్గ బాగా అలసటగా వుంది. పొద్దున్నుండి నొప్పికి ఇంజెక్షన్ తీసుకోలేదు. టీలో కొన్ని సాల్టీన్ బిస్కెట్లు (ఉప్పుగా, నూనె లేకుండా డ్రైగా వుంటాయి) నంచుకుని తిన్నాను. టీ చల్లారి పోతే నర్స్ బటన్ నొక్కితే టెక్ వచ్చి టీ తీసుకెళ్ళి వేడి చేసి తీసు కొచ్చింది. వేడి టీ త్రాగాను మెల్లిగా. ప్రక్క పేషంట్ ని చూడడానికి డాక్టర్లు వచ్చి వెళ్ళారు. ఫోన్ లో ఇంట్లో వాళ్ళకి ఏమేం తీసుకురావాలో గట్టిగా చెబుతుంది. “నా […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 7

వ్యాధితో పోరాటం-7 –కనకదుర్గ మోరా ఇంజెక్షన్ తీసుకొచ్చింది.  “హే స్వీటీ, వాట్ హ్యాపెన్డ్? కమాన్, ఇట్స్ ఓకే డియర్!” ఇంజెక్షన్ పక్కన పెట్టి నా తల నిమురుతూ వుండిపోయింది. “మోరా కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యాంటి యాంగ్జయిటీ మెడిసన్ ప్లీజ్! ఈ రోజు తీసుకోలేదు ఒక్కసారి కూడా.” “ఓకే హనీ నో ప్రాబ్లెం. ఫస్ట్ టేక్ యువర్ పెయిన్ ఇంజెక్షన్. దెన్ ఐ విల్ గెట్ యువర్ అదర్ మెడిసన్.” అని ఇంజెక్షన్ ఇచ్చి. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 6

వ్యాధితో పోరాటం-6 –కనకదుర్గ “హాయ్ డియర్! ఐ హావ్ టు టేక్ వైటల్ సైన్స్,” అనే పిలుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. కొత్త టెక్నిషియన్ వచ్చింది. రాత్రి పదకొండు దాటుతుంది. మళ్ళీ నర్సులు, టెక్స్ మార్తారు. కానీ మోరా 7 గంటల నుండి పొద్దున 7 వరకు రెండు షిఫ్ట్స్ కలిపి చేస్తున్నానని చెప్పింది. బ్లడ్ ప్రెషర్, టెంపరేచర్, పల్స్, అన్నీ చెక్ చేసి నోట్ చేసుకుని వెళ్ళిపోయింది టెక్. ఇంటి నుండి ఫోన్ వచ్చింది. […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 5

వ్యాధితో పోరాటం-5 –కనకదుర్గ ఆయన ఈ రాత్రికి అమెరికా వెళ్తున్నందుకేమో పేషంట్స్ ఎవ్వరూ లేరు. కొన్ని చేయాల్సిన పనులు చేసుకోవడానికి వచ్చినట్టున్నారు. “అయిపోయాడు ఈ రోజు ఆ పిఏ. పాపం అతని పేరు చెప్పకుండా వుండాల్సింది.” అన్నాను. అయిదు నిమిషాల్లో వచ్చారు డాక్టర్ గారు. వచ్చి తన సీట్లో కూర్చున్నారు. “బ్లడ్ వర్క్ లో పాన్ క్రియాటైటిస్ అని వచ్చింది. డా. రమేష్, నేను నిన్న అదే అనుకున్నాము.” “అంటే సీరియస్ ప్రాబ్లమా? ఇపుడు ఏం చేయాలి?” […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 4

వ్యాధితో పోరాటం-4 –కనకదుర్గ ఒక కొబ్బరి బొండాం తీసుకుని ఆటోలో వెళ్తుండగా కొద్ది కొద్దిగా సిప్ చేయసాగాను. చైతుని ఎపుడూ వదిలి పెట్టి ఎక్కడికి వెళ్ళలేదు మేము, సినిమాలకి వెళ్ళడం మానేసాము వాడు పుట్టినప్పట్నుండి. వాడిని తీసుకుని పార్క్ లకు వెళ్ళడం, అత్తగారింటికి, అమ్మ వాళ్ళింటికి వెళ్ళినా, అక్క, అన్నయ్య వాళ్ళింటికి ఎక్కడికి వెళ్ళినా ముగ్గురం కల్సి వెళ్ళడమే అలవాటు. చాలా మంది అనేవారు, ‘సినిమాలు మానేయడం ఎందుకు? వాడికి ఏ బొమ్మొ, లేకపోతే తినడానికి ఏ […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 3

వ్యాధితో పోరాటం-3 –కనకదుర్గ మోరా వెళ్ళిపోయాక నాకు ఇండియాలో నొప్పి ఎలా వచ్చింది, అక్కడ డాక్టర్లు ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నీ గుర్తు రాసాగాయి. నొప్పి వచ్చిన రోజు శ్రీని ఇంటికి వచ్చాక జరిగిన సంగతి తెల్సుకుని, మన డాక్టర్ దగ్గరకు వెళ్ళి చూపించుకుందాము అని వెంటనే బయల్దేరారు. కైనెటిక్ హోండా స్కూటర్ పై వెళ్ళేపుడు పొద్దున వెళ్ళిన డాక్టర్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు కొంచెం బాగానే వుందని చెబితే టెస్ట్స్ చేయించుకుని రమ్మని చెప్పింది. అలాగే […]

Continue Reading
Posted On :

వ్యాధితో పోరాటం- 2

వ్యాధితో పోరాటం-2 –కనకదుర్గ కడుపులో భయంకరంగా నొప్పి మళ్ళీ మొదలయ్యింది. గతంలోనుండి బయటపడి నర్స్ బటన్ నొక్కాను. సాయంత్రం 7 అవుతుంది. నర్సులు డ్యూటీలు మారుతున్నట్టున్నారు. కానీ నొప్పి భరించడం కష్టం అయిపోయింది. నర్స్ బటన్ నొక్కుతూనే వున్నాను. నర్స్ మోరా, ” ఐ యామ్ కమింగ్ డియర్, ఐ నో యు మస్ట్ బి ఇన్ పెయిన్,” అని ’డెమొరాల్,’ అనే పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ తో వచ్చి నడుం దగ్గర ఇచ్చి వెళ్ళింది.  మొదట్లో […]

Continue Reading
Posted On :