image_print

బతుకమ్మ పద్యాలు

బతుకమ్మ పద్యాలు -సముద్రాల శ్రీదేవి సృష్టిలోన పూలు స్త్రీ జాతిరూపము ప్రకృతి మాతగాను బ్రతుకునిచ్చు తల్లిగ బ్రతుకమ్మ తా తెలంగాణలో దివ్యమైన బాట దేవిమాట తీరుతీరు పూలు గౌరమ్మగను నవ రాత్రులందు మారి చిత్రముగను నీకు సాటిలేరు నేడు మా బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట సంబురాలు జేస్తునంబరమ్ముగ మార్చి నారిగణము నాడు దీరులైరి న్యాయస్థాపనంబు నవ్విడె బ్రతుకమ్మ దివ్యమైన బాట దేవిమాట ఊరువాడయాటలుయ్యాల పాటలు నూరెగుబ్రతుకమ్మలుత్సవముగ వనములోన మనము జనజాతర గణము దివ్యమైన బాట దేవిమాట […]

Continue Reading

వస్తున్నా (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

వస్తున్నా (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – నీరజ వింజామరం అనంత చైతన్య తరంగాన్ని నేను శ్రమించకుండా విశ్రమించానేం ? ఎన్నటికీ వాడని నిత్య వసంతాన్ని నేను నవ్వుల పువ్వులు పూయకుండా వాడిపోయానేం? అంతులేని ఆశల కిరణాన్ని నేను నిరాశను చీల్చకుండా నిల్చుండి పోయానేం? లోతు కొలవరాని అనురాగ సంద్రాన్ని నేను కెరటంలా ఎగిసి పడక అలనై ఆగి పోయానేం? ఎందరి మనసుల్లోనో వెలిగిన నమ్మకాన్ని నేను వెలుగులు విరజిమ్మకుండా ఆరిపోయానేం ? […]

Continue Reading
Posted On :

నిస్సహాయిని (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 నిస్సహాయిని (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ప్రసాదరావు రామాయణం నేను రెప్పలు లేని నేత్రిని గుప్పున గాలి వీచి చప్పున నిందాధూళి అక్షిలో పడినా కన్ను గాయమైనా గుండె ఏడ్చినా కాచుకోలేని నిస్సహాయిని ! నేను రెక్కలు రాలిన పక్షిని నక్కజాతి మగాళ్ళు నన్ను కౌగలించినా వేటమృగాడు వెంటాడినా ఎగిరిపోలేని నిస్సహాయిని ! నేను తలుపులు లేని గుడిశను మృచ్చిలిగాడు తచ్చాడినా నా శీలపు గోడకు కన్నం వేసినా గుండెను పెకలించి […]

Continue Reading

తరుణి తరుణం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

తరుణి తరుణం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) -కొత్తపల్లి అజయ్ తరుణి తరుణం భళ్ళున తెల్లారింది! కళ్ళు నులుపుకుంటు ఉదయపు వాకిలిలో.. కళ్ళు తెరిస్తే పేపర్బోయ్ ఎప్పటిలా!? చదువుదామని ఉద్యుక్తురాలినై చేతిలో పేపర్ ఎపుడెపుడాని ఎదురు చూసే రోజురానే వచ్చింది ఎదురు చూసి చూసి కళ్ళు కాయలైనాయి తరుణీ తరుణం!! మహిళాసాధికారత మహిళాబిల్లు!! నవవసంతం వచ్చినట్టైంది ఇక చెల్లవు !! మగధీరుల హుకుంలు! ఇక చెల్లవు!! వళ్ళు హూనంలు ఇక మేముండం!! మగ్గిన […]

Continue Reading
Posted On :

వృద్ధుడు (ఆంగ్ల మూలం : మోహన్ కుమార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

వృద్ధుడు ఆంగ్ల మూలం : మోహన్ కుమార్ తెలుగు సేత:వారాల ఆనంద్ అర్థరాత్రి  టేబుల్ ల్యాంప్ వెలుగులో చదువుకుంటున్న  వృద్ధుడితో  ఓ యువతి అంది  “ తాతయ్యా! నీ ఆరోగ్యం సున్నితమయింది  నీ కంటి చూపు మందగించింది  ఇప్పటికే అర్థరాత్రి అయింది నువ్విక పడుకోవాలి”   వృద్ధుడు తాను చదువుతున్న పుస్తకాన్ని మూసేసి  ఫ్రేం లేని కళ్ళద్దాల్ని తీసేసి నవ్వుతూ అన్నాడు  “ ఓ పక్క తనను చంపడానికి  విషం తయారవుతూ వుంటే  సోక్రటీసు  ఏమి చేస్తున్నాడో […]

Continue Reading
Posted On :

నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం)

నిన్నటి సుమాన్ని నేను! (YESTERDAY’S FLOWER ఆంగ్ల గీతానికి అనువాదం) -వి.విజయకుమార్ నిన్నటి సుమాన్ని నేను మ్రోవితో కడపటి తుషారాన్ని గ్రోలి వేచివున్నాను పుష్పలావికలు నా మృత్యు గీతాన్నాలపించడానికి రానే వచ్చారు కడపటి హేమంత తుషారపు మృత్యు నీడ పరచుకుంది చల్లగా శరత్ చంద్రుడి వీక్షణం దోబూచులాడుతోంది మెల్ల మెల్లగా నిన్నటి సుమసౌరభాలింకా నాలో సజీవంగా రేపటి సుగంధాలకది అవస్యమై ఉండగా నా మరణ గీతిక పల్లవిని పాడుకుంటూ విచ్చేసిన విరికన్నియలు ఇంకా ఆగమించే మగువలకోసం స్వాగత […]

Continue Reading
Posted On :

విముక్తి

విముక్తి -ఇందు చంద్రన్ మబ్బులు మోసుకెళ్తున్నాయి. చుక్కలు పట్టుకునేలోపే తాకి వెళ్లిపోతున్నాయి. నాకంటూ ఏదీ లేదిక్కడ ! నా స్వార్థ కుబుసం కిందనే విడిచిపెట్టొచ్చేసినట్టున్నా. కింద ఒక్కప్పుడు నాకంటూ సృష్టించిన దార్లో ఇప్పుడు ఎందరో తిరుగుతున్నారు. నాకోసం కట్టుకున్న గూట్లో ఎవరో తెలియని వాళ్లుంటున్నారు. నే పోరాడి పోట్లాడి సాధించినవన్నీ వేరొకరు వాడేసుకుంటున్నారు. ఎవరూ నన్ను గుర్తు చేసుకోవట్లేదు. వాళ్ళతో నా జ్ఞాపకాలన్నీ చెరిగిపోయినట్టున్నాయి. నా సమాధి ఉండాల్సిన చోట బిల్డింగ్ మొలుచుకొచ్చినట్టుంది. నా ఆనవాళ్లేవి లేవిప్పుడు […]

Continue Reading
Posted On :

కొండమల్లిపూలు (కవిత)

కొండమల్లిపూలు   -వసీరా కొండమల్లి పూలు ఊరికే రావు కూడా తీసుకొస్తాయి కొత్త రుతువుని పిల్లలకు తీయని సన్నాయిలని వెళ్ళిపోయే వర్షాలు ఇచ్చే తాయిలాన్ని మంచులో పొట్లం కట్టిన వెచ్చని సూరీణ్ణి కొండమల్లి పూలు చూసినప్పుడల్లా నాకెందుకో ఊరికూరికే నవ్వాలనిపిస్తుంది నెత్తిన పోసుకుని పిచ్చి పిచ్చిగా ఆడుకోవాలనిపిస్తుంది పసితనం తీయగా పిలిచి తనలోకి లాక్కుంటుంది జీవితం ముందు చేతులు చాచి నుంచుని స్తుతి గీతాలు పాడాలని పిస్తుంది. ఓ నా జీవితమా! నీ ముందు మోకరిల్లి ప్రార్థించకుండానే పువ్వుల్లోకి […]

Continue Reading
Posted On :

అనుసృజన- శరీరం

అనుసృజన శరీరం హిందీ మూలం: గీత్ చతుర్వేదీ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఇంతసేపటినుంచీ చీకటిని చూస్తున్నావు తదేకంగా అందుకే నీ కనుపాపలు మారాయి నల్లగా పుస్తకాలని కప్పుకున్న తీరు నీ శరీరాన్నే మార్చేసింది కాయితంగా మృత్యువు వస్తే నీటికి వచ్చినట్టు రావాలని అంటూ ఉండేవాడివి అది ఆవిరైపోతుంది చెట్టు మరణిస్తే మారుతుంది తలుపుగా నిప్పుని మృత్యువు మార్చేస్తుంది బూడిదగా నువ్వు మారిపో ఆవు పొదుగుగా కురిసిపో పాల ధారలుగా ఆవిరై నడిపించు పెద్ద పెద్ద ఇంజన్లని అన్నం […]

Continue Reading
Posted On :

కళాత్మక హృదయం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కళాత్మక హృదయం (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ములుగు లక్ష్మీ మైథిలి ఆమె చేతి వేళ్ళు వెదురు బద్దలపై ప్రతిరోజూ నెత్తుటి సంతకం చేస్తాయి పంటి బిగువున బాధను బిగబట్టి పక్షి గూడు అల్లుకున్నట్టు ఎంతో ఓపికగా బుట్టలు అల్లుతుంది ఆమె చేయి తాకగానే జీవం లేని వెదురుగడలన్నీ సజీవమైన కళాఖండాలుగా అందంగా రూపుదిద్దుకుంటాయి తనవారి ఆకలి తీర్చటం కోసం రేయింబవళ్ళు ఎంతో శ్రమిస్తుంది తెగిన వేళ్ళకు ఓర్పును కట్టుగా కట్టుకుని […]

Continue Reading

ఎవరు గొడ్రాలు (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఎవరు గొడ్రాలు (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – నల్లు రమేష్ ఆమె మనసే కోమలం రక్త మాంసాలు కాదు పొరపాటున అబల అని నోరు జారకండి నవ మాసాలు నవ్విపోతాయి ఉడికిన మెతుకే కదా అని నోరు లేని కుందేలును చేయకండి గోరుముద్దలు నొచ్చుకుంటాయి అమ్మ నాన్న తక్కెట్లో నిర్ణయం నాన్నదైనా అమ్మలో అమ్మను చిద్రం చేసి నాన్న తేలిపోతుంటాడు కాస్త నిజం గుండు మింగి సమానమవ్వండి చదువు నదిలో రెండు […]

Continue Reading
Posted On :

గతిర్నాస్తి (కవిత)

గతిర్నాస్తి – శ్రీధర్ రెడ్డి బిల్లా క్రిందికి చూడు మిత్రమా .. దూరాబార దుర్గమ గగనాంతర సీమల పోరాడుతూ మనం సాగిపోతుంటే, భూగోళ వ్యాసం క్షణక్షణానికి తరుగుతూ అగోచరమవుతున్నట్టు లేదూ? ఒడలు లేకుండా , బడలిక లేకుండా , కాయకర్మను మోసుకుంటూ భయాన్ని వెంటేసుకుంటూ యోజనాలెన్ని దాటి వచ్చామో! ప్రయోజనమేమైనా దక్కుతుందంటావా? కనిపిస్తున్నది అదిగో.. కాసుకొని ఉన్నది మనకొరకే కణకణమని నిప్పులు గక్కుకుంటూ కాసారప్రవాహం. సంశయమే లేదు అదే.. వైతరణీ. దాటగలమంటావా? ఆ దరి చేరగలమంటావా ? […]

Continue Reading

స్త్రీ (మరాఠీ మూలం : హీరా బన్సోడే, తెలుగు సేత: వారాల ఆనంద్ )

స్త్రీ మరాఠీ మూలం : హీరా బన్సోడే తెలుగు సేత:వారాల ఆనంద్ నేను నదిని అతను సముద్రం అతనితో నేనన్నాను నా జీవితమంతా నీ కోసం నీ వైపు ప్రవహిస్తూ నీలో కరిగిపోతున్నాను చివరాఖరికి నేను సముద్రాన్నయి పోయా ఒక స్త్రీ ఇచ్చే బహుమతి ఆకాశం కంటే పెద్దది కానీ నువ్వేమో నిన్ను నువ్వు ప్రస్తుతించుకుంటూనే వున్నావు నదివి కావాలని నాలో కలిసిపోవాలని ఎప్పుడూ అనుకోలేదు ఆలోచించలేదు ***** వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, […]

Continue Reading
Posted On :

రొట్టెలు అమ్మే స్త్రీ (కవిత)

రొట్టెలు అమ్మే స్త్రీ – డాక్టర్ ఐ. చిదానందం రోడ్డు పక్కన విశాలం తక్కువైన ఇరుకైన సందులో ఓ కట్టేల పోయ్యి బోగ్గుల మంటలో పోగచూరిన ముఖంతో ఒక స్త్రీ ఒంటరిగా రోట్టెలు అమ్ముతుంది ఎంత అవసరమో ఇంత కష్టము ఎంత తాను మండితే ఇంత ఒంటరి పోరు గ్లోబలీకరణతో గల్లీ గల్లీలలో కర్రీ పాయింట్లు కుప్పలు కుప్పలుగా వున్నా జీవన రణం చేస్తున్న రుద్రమలా ఆ స్త్రీ నిత్యం రొట్టెలు అమ్ముతుంది ప్రపంచీకరణ పాశాణంలా మారిన […]

Continue Reading

అనుసృజన- వీరవనితా!

అనుసృజన వీరవనితా! హిందీ మూలం: ముక్త అనుసృజన: ఆర్ శాంతసుందరి స్త్రీ దేహం మీద నీలం గుర్తులు రక్తం గడ్డ కట్టిన వైనం అత్యాచారం జరిగిందని చెబుతోంది పాత కథల్లో ఎప్పుడూ బైటికి రాని కథ ఇది అత్యాచారానికి గురైన ప్రతి స్త్రీ శరీరం అందంగా ఉంటుంది ఆ కథల్లో అత్యాచారం చేసే వాడి దౌర్జన్యం ఉండదు అత్యాచారం చేసిన రాజుల గోళ్ళ గురించి గాని పళ్ళ గురించి గాని ఆ కథలు చెప్పవు ఆ కథల్లో […]

Continue Reading
Posted On :

ఊపిరి పోరాటం (కవిత)

ఊపిరి పోరాటం (కవిత) – శ్రీ సాహితి దేశం భరించలేని బాధ ఓ కన్నీటిచుక్క రూపంలో ఆమెని మింగేసింది. చీకటి కాపలా కాసిన నరకానికి సిగ్గుపడ్డ పగలు నిజాలకు చిక్కి శల్యమైనది. మంచం పట్టిన నమ్మకం మరణశయ్యపై చేరి దేశాన్ని ఓ మాట అడిగింది.. ఆడపిల్ల “ఊపిరి పోరాటం” చేయాలా? అని. సిగ్గుతో దేశం చచ్చిపోయింది ***** సాహితి -మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీ లో బి.ఫార్మసీ చదువుతున్నాను.నాకు […]

Continue Reading
Posted On :

శిఖరంపై “ఆమె” (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

 శిఖరంపై “ఆమె” (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – డా.కటుకోఝ్వల రమేష్ శీలాన్ని దునుమాడే అసభ్య పద బంధం బ్రతుకు పోరులో ధీరైన ఆమెను ఇసుమంతైనా కృంగదీయదు ముఖ కవలికల్ని చూడని ఏ చరవాణిలోనో.. మాట పరం పరలు పొడిపొడిగా వెగటుగా రాలిపోవచ్చు కానీ…… నిన్ను నిలువునా చీల్చి నీ అణువణువులో నిండిన అహంకార అశ్లీల ధ్వని తరంగాల్ని సరిచేసే శస్త్ర చికిత్స వెనువెంటనే మొదలవుతోంది హాలో.. ట్రోలర్ నీ వికృత అవివేక […]

Continue Reading

రాగమాలిక (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

రాగమాలిక (నెచ్చెలి-2024 కవితల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – బి.వి. శివ ప్రసాద్ తెల్లవారే జాము మరెంతో మిగిలేవుంటుంది నేను సుషుప్తిలో గురకలు తీస్తూనేవుంటాను కానీ నీ సగం నిద్ర కళ్ళు మాత్రం నిన్ను నిర్దాక్షిణ్యంగా వంటగదిలోకి ఈడ్చుకుపోతాయి నీ రోజువారీ రాగమాలిక మూడవ ‘కాలం’ లో మొదలౌతుంది బ్రేక్ఫాస్ట్ బిలహరి రాగాన్నీ, లంచ్ బాక్సులు సర్దే మధ్యమావతి రాగాల్నీ ఆలపించి అలసట థిల్లానా పాడుకుంటూనే ఆఫీసుకు చేరుకుంటావు అక్కడ నీతోటివారూ, అధికారులూ మరో […]

Continue Reading

అద్దం (సిల్వియా పాత్ “ది మిర్రర్” కు అనువాదం)

అద్దం – వి.విజయకుమార్ రజితాన్నీ, నిఖార్సైన దాన్నీ. ముందస్తు అంచనాలు లేనిదాన్ని. చూసిందాన్ని చూసినట్టు అమాంతం మింగేయటమే నాపని. రాగద్వేషాల ముసుగులేం లేవ్, ఉన్నదాన్ని ఉన్నట్టే అన్నీ నేనేం కృూరురాల్ని కాదు, కాకపోతే నిజాయితీ దాన్ని నాలుగు మూలల చిట్టి దేవుడి నేత్రాన్ని ఇంచుమించు రోజంతా ఎదుటి గోడ తలపుల్లోనే చూపులన్నీ పెచ్చులూడే ఆ గౌర వర్ణపు గోడ మీదే అది నా హృదయంలో భాగమనుకుంటాను కానీ అదేమో మిణుకు మిణుకు మంటుంది. ముహాలూ, చీకటీ దోబూచులాడుతూ […]

Continue Reading
Posted On :

సూర్యుడు (అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

సూర్యుడు అస్సామీ మూలం : నిర్మల్ ప్రభా బొర్దోలోయ్ తెలుగు సేత:వారాల ఆనంద్ సూర్యుడు ఉదయిస్తే తుపాకుల మోతతో ఉదయిస్తాడా లేదు లేదు సూర్యుడు ఉదయిస్తే రాత్రి చీకట్లోంచి మంద్రంగా ఏడ్చే పక్షి గొంతులోంచి ఉదయిస్తాడు ***** వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం మేకర్. నాలుగు దశాబ్దాలకు పైగా ఫిలిం సొసైటీ ఉద్యమంలో పని చేసారు. పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవలల్లో జ్యూరీగా వున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో నంది […]

Continue Reading
Posted On :

అనుసృజన- ప్రవాహం

అనుసృజన ప్రవాహం హిందీ మూలం: రామ్ దరశ్ మిశ్ర్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఒక పరిమళభరితమైన అల ఊపిరితో కలిసి అలా అలా వెళ్ళిపోతుంది ఒక కూనిరాగమేదో చెవులని అలవోకగా తాకుతూ ప్రవహిస్తూ వెళ్ళిపోతుంది. అదృశ్య రూపం ఒకటి స్వప్నంలా కళ్ళలో తేలి వెళ్ళిపోతుంది. ఒక వసంతం గుమ్మంలో నిలబడి నన్ను పిలిచి వెనుదిరుగుతుంది. నేను ఆలోచిస్తూ ఉండిపోతాను. అలని చుట్టెయ్యాలనీ స్వరాలని పోగుచేసుకోవాలనీ రూపాన్ని బంధించాలనీ వసంతంతో- ఒకటి రెండు నిమిషాలు నా గుమ్మంలో నిలబడరాదా […]

Continue Reading
Posted On :

షరతులు వర్తిస్తాయి (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

 షరతులు వర్తిస్తాయి (నెచ్చెలి-2024 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – పెనుగొండ సరసిజ ఇక్కడ నీ ఆశలకు లక్ష్యాలకు ఏం దిగుల్లేదు. ఇక్కడ సమానత్వానికి స్వేచ్ఛకి ఏం కొదవలేదు. ఎలాగంటావా? నీ ఆశలవైపు ఆశగా చూస్తావ్. ఓ దానికేం !అంటూ కొన్ని ఆంక్షలు జోడించి బేశుగ్గా అనుమతిస్తారు. నీ లక్ష్యం చెప్పాలనుకున్న ప్రతిసారి షరా మామూలుగా షరతులన్నీ చెప్పి మరీ పంపిస్తారు . నీకేం పరవాలేదంటూనే పడినా, లేచే కెరటం లాంటి నీ పక్కటెముకల్ని పట […]

Continue Reading
Posted On :

కాశీలో శవాలు (మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ )

కాశీలో శవాలు మగధ్ మూలం : ఇంగ్లీష్ అనువాదం : శ్రీకాంత్ వర్మ తెలుగు సేత:వారాల ఆనంద్ కాశీ చూసావా అక్కడ శవాలు వస్తూ వుంటాయి పోతూ వుంటాయి శవాలదేముంది శవాలు వస్తాయి పోతాయి అయితే ఈ శవం ఎవరిదని అడగనా రోహితాస్వునిదా? కాదు కాదు అన్నీ రోహితస్వునివి కావు అతని శవాన్ని దూరం నుంచే గుర్తించొచ్చు దూరం నుంచి కాకపోయినా దగ్గరి నుంచయినా గుర్తించొచ్చు ఒకవేళ దగ్గరి నుంచీ గుర్తించకపోతే అది రోహితస్వునిది కాదు మరి […]

Continue Reading
Posted On :

బాపమ్మ (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

బాపమ్మ (నెచ్చెలి-2024 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – పెనుగొండ బసవేశ్వర్ మా ఇంటి సాయబాన అర్ర తలుపుకు తగిలించిన పెద్ద తాళంకప్పను సూసినప్పుడల్లా ఇంటి ముంగట బజారు గల్మల్ల కూసునే మా బాపమ్మే యాదికొస్తది బొంకలాంటి నోటిని చేతుల కట్టెను ఆడిచ్చుకుంట వచ్చిపోయే వరసైన వాల్లతోటి వాట్లేసుకుంట పొద్దంతా దానికి ఏర్పడకుండ ఆడనే పొద్దుపోయేది అమ్మవచ్చి జర ఇంట్లోకొస్తావా అన్నం తినిపోదువంటే ఇంత అన్నంకూర నాలుగు సల్లసుక్కలు ఏసియ్యరాదే అందరూ తినేది గదేనాయే మనదేమన్నా […]

Continue Reading

అముద్రిత కావ్యం (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

అముద్రిత కావ్యం (నెచ్చెలి-2024 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు పుట్టినది ‘పాప’ అన్న మాట చెవుల బడితే చాలు పుడమి లోపలికి కూరుకుపోయిన భావనలు ఆమె బడికి పోతానని అడిగితే చాలు వళ్ళంతా వాచేలా బడిత పూజలు వయసు ఉబికి వస్తున్నదంటే చాలు ఉరికి మించిన భయంకరమైన ఆంక్షల శిక్షలు కట్టుకున్న గుడ్డలో నుంచి కాయం గాయపడేలా గుచ్చుకునే ఆకలి చూపుల శూలాలు అగ్నిహోత్రం సాక్షిగా ఆవిరయిపోయిన కొద్దిపాటి స్వేచ్ఛా స్వాతంత్రయాలు […]

Continue Reading

అమ్మకు నేనేం చేశాను? (కవిత)

అమ్మకు నేనేం చేశాను?  -డా. మూర్తి జొన్నలగెడ్డ తననొప్పులుపడి తాను తన రక్తం పంచిస్తేను ఈ లోకానికి వేంచేశాను బువ్వెడితే భోంచేశాను జోకొడితే పడకేశాను విసిగించి వేధించాను సహనానికి ప్రశ్నయ్యాను మరుగయ్యి కవ్వించాను కనుపించి నవ్వించాను అమ్మేమరి అన్నింటానూ, తలపైన చమురయ్యేను నిగనిగల నలుగయ్యేను శ్రీరామునిరక్ష య్యేను నట్టింట్లో పండగతాను పండగలో విందుగతాను విందుల్లో సందడిగాను నా చదువుల్లో జ్ఞానంగాను నా సందెలలో ధ్యానంగాను బరువుల్లో బాసటగాను నేనడిచే బాటగ తాను ఎన్నెన్నని నే చెబుతాను ఆ […]

Continue Reading

ది బిచ్ (అమ్మ తల్లి)

ది బిచ్ (అమ్మ తల్లి) -వి.విజయకుమార్ నాకు ముందే తెలుసు నువ్వీ వీధిలో నెలలు నిండి భారంగా తిరుగుతున్నప్పడే యేదో ఒక రోజు గంపెడు బిడ్డలతో ప్రత్యక్షమౌతావనీ ముత్యాల్లాంటి పసిబిడ్డల్ని వేసుకుని దీనంగా చూస్తూ నా అశక్తతను ప్రశ్నిస్తావని! కడుపు నిండా పాలు తాగి వళ్ళో ఈ బుజ్జిగాడు గోముగా గీరుతూ వెచ్చని పరుపు మీద గుర్రుగా చూస్తూ ఈ దేశపు దొరబాబులా వెచ్చగా ఇక్కడ! నెల కూడా నిండని నీ పసికూనలు వర్షపు చినుకుల్లో ముద్దయి […]

Continue Reading
Posted On :

యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత)

యోధ..! (నెచ్చెలి-2024 పోటీలో ప్రథమ బహుమతి పొందిన కవిత) -బి.కళాగోపాల్ విట్రియోల్ నా ముఖాన్ని కాల్చేస్తూ చర్మాన్ని మండిస్తూ / శిరోజాలు అంటుకు పోయి కనుగుడ్లు చితికిపోయి / ముక్కురంధ్రాలు మూసుకుపోయి చెవులు తెగిపడి / చెంపలు కరిగి బొమికెలు తేలి నన్నో వికృతశిలగా మారుస్తున్న/ ఆ విషపు ద్రావణ బుడ్డి మురుగునీటి పక్కన/ విసిరిన వాడి అహాన్ని సంతృప్తి పరుస్తూ వికటాట్టహాసం చేయసాగింది../ మెడ దిగువన పాలిండ్లు ఉడికిపోతూ తోలుత్తిత్తిలా దేహం ఊగిసలాడుతుంటే/ మంట గాయం […]

Continue Reading
Posted On :

స్మృతి లేఖనం (బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సయ్యద్ శంశూల్ హక్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

స్మృతి లేఖనం బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సయ్యద్ శంశూల్ హక్ తెలుగు సేత:వారాల ఆనంద్ నేనెవరో తెలియాల్సిన అవసరం లేదు నేను గుర్తుండాల్సిన అవసరమేముంది నన్నెందుకు జ్ఞాపకం చేసుకోవాలి దానికి బదులు నా పెట్టుడు పళ్ళని సాయంత్రపు సినిమాని నా ఉమ్మనీటిని గుర్తుంచుకోండి నీను వచ్చాను, చూశాను కానీ ఏ దిష్టి బొమ్మ విప్లవంలోనూ గెలవలేకపోయాను ఓ యాత్రికుడా నువ్వొకవేళ బంగ్లాదేశ్ లో పుట్టి వుంటే నా లోతయిన ఆవేదనని ఖచ్చితంగా అర్థం చేసుకోగలుగుతావు ***** […]

Continue Reading
Posted On :

అప్రమత్తం ( కవిత)

అప్రమత్తం ( కవిత) -కందుకూరి శ్రీరాములు అరచేతిని ఎంత తెరిపిద్దామనుకున్నా తెరుచుకోదు భయాన్ని గుప్పెట్లో నలిపేస్తుంటుంది తిరుగుతుంటాం మాట్లాడుతుంటాం గదంతా వెలుతురున్నా ఎక్కడో ఒక దగ్గర ఓ మూల చీకటి చిటుక్కుమంటుంది బుగులుపులుగు గదంతా తిరుగుతుంటుంది ఎంతకీ తెల్లారనే తెల్లారదు తెల్లారినట్టు భ్రమపడి బాధపడుతుంటాం ! భయం నిశ్శబ్దంలో అపశబ్దపు పదాలు ఆలోచనలో మెదులుతుంటాయి ఏ చెరువు కట్ట తెగినట్టు ఉండదు ఏ పురుగు కరిచినట్టు ఉండదు శబ్దం వినని శబ్దం వినబడుతూ ఉంటుంది ముందు జాగ్రత్తగానే […]

Continue Reading
Posted On :

పుట్టింటి నేల మట్టి ( కవిత)

పుట్టింటి నేల మట్టి ( కవిత) -పరిమి వెంకట సత్యమూర్తి మెట్టింట అడుగిడినా వెంటాడుతూనే ఉండే పుట్టింటి మట్టివాసన!! మూడు ముళ్ళు ఏడడుగులుకొత్త బంధాలు ఏర్పడినాబుడి బుడి నడకలతో బుజ్జాయి మెట్టినింటిలో నడయాడినాపుట్టింటి నేలమట్టి అనుక్షణం వెంటాడుతూనే ఉంటుంది!! కన్నప్రేగు తెంచుకునిపుట్టింటి నేల మీదవాలినప్పటి నుంచికంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రులు!! రక్తం పంచుకుని తనతో పుట్టి పెరిగిన తోబుట్టువులతోఆడుకున్న మధుర బాల్య స్మృతులు!! వారి తీయని జ్ఞాపకాలుమదిలో పది కాలాలు పచ్చగానే ఉంటాయి!! పుట్టినప్పుడే “ఆడ” పిల్ల అని ఈడ పిల్ల కాదు అని […]

Continue Reading

ఈళిక ఎత్తిన కాళిక (కవిత)

ఈళిక ఎత్తిన కాళిక -డా. కొండపల్లి నీహారిణి ఎన్ని కల్లోలాలనైనా క్రీగంట చూసినట్లు ఎన్ని కన్నీటి చెలిమెలనైనా కొనగోటితో తీసేసినట్టు పరాభవాలు అపరాధ భావాలు నీ గుండె దిటవు ముందు బలాదూర్ అయిపోతాయి చినుకుల పలకరింపులు నీ కను దోయి దాటవు కష్టపు కడవలు నిన్ను కాదని ఎక్కడెక్కడ తారాడుతాయి గానీ చలువ మబ్బుల పందిర్లేవి భజంత్రీలు కావు కోపం కొలిమిలోంచి ఎగిసినా ఈటెలు మొనదేరిన మాటలు విన్నా సహనము స్త్రీ సహజాతాల మిధునాలని చెప్పేసి మనసు […]

Continue Reading

మా బిచ్చవ్వ ( కవిత)

మా బిచ్చవ్వ ( కవిత) -ఈ. వెంకటేశ్ గ్రామంలోసూర్యుడు నలుపు రంగుపులుముకుని మేల్కొంటాడుదళితులకు జరుగుతున్నఅన్యాయాలను చూడలేక. గాలి మలయ మారుతంలామెల్లగా తాకుతూ వెళ్ళదుతుఫానుల పెనుగాలులు వీస్తాయిగడీలు ,మేడలునిజాం వారసుల గర్వాన్నిసత్యనాస్ చేస్తాయి. మాది ఊరంటే ఊరు కాదుచైతన్యాన్ని రక్ష మాంసాలుగాకలిగి జీవమున్న జవసత్వాలు కలిగిన పుణ్యభూమి. మా యవ్వ తన అనుభవంతోచెప్పే జీవిత సత్యాలముందునాలుగు వేదాలు నాలుకగీసుకోవడానికి కూడా పనికిరావు. ఉత్పత్తి కులంలో జన్మించివ్యవసాయంలో గిట్టుబాటు కాకదళారీల మధ్య ఒంటరి ఖైదీలాఇప్పటికీ మోసపోతూనే ఉన్నాం.. పనిచేయడం చెమటోడ్చడంతప్ప ఇతర వేషాలు వేయలేని వాళ్ళంఎప్పుడైనా నేను పని […]

Continue Reading
Posted On :

మ్యూజిక్ ( కవిత)

మ్యూజిక్ ( కవిత) -దేశరాజు తెల్లవారని జాముకికాస్త ముందు-వెలుతురు కోసం పచ్చని మొక్కలువెతుకులాడుతూంటాయినిద్దట్లోంచి లేచినా కలలోంచి మేల్కొనని ఆమెతోపరిమళాల మాట కలుపుతాయిస్టౌ పై మరుగుతున్న కాఫీ పొడి పెర్క్యులేటర్ నుంచి గుబాళిస్తుంటుందిగాలి గుడ్డిదిదానికి లింగ, వయోభేదాలు లేవుమా ఇద్దరినీ ఒకేలా అకేలా అల్లుకుంటుందిఇంతలో చిన్న పిట్టలేవో గ్రిల్ కంతల్లోంచి దూరిఊరిస్తున్నట్టుగా దూరంగా వాలి అందమైన పాటలు చూపిస్తాయిఆ దినపు మొదటి కాఫీ సిప్ చేస్తున్న ఇద్దరూ ఇద్దరే-ఇళయరాజా, రెహ్మాన్ తెలియనే తెలియరులయకారుడే, అసలైన సంగీతకారుడు అప్పుడే కాదు, ఎప్పటికీ. ***** దేశ రాజుదేశరాజుగా […]

Continue Reading
Posted On :

త్యాగాల నిలయం ( కవిత)

త్యాగాల నిలయం ( కవిత) -సుధీర్ కుమార్ తేళ్ళపురి ప్రపంచాన్నంతా నిద్రలేపేసూర్యుడికి కూడాతెల్లారిందని చెప్పేదికల్లాపిచల్లే నీ గాజుల చేతులే కదా – నువ్వు లేనిదే నిముషమైనా గడవదని తెలిసికూడాలేని అహాన్ని ప్రదర్శించినప్పుడునీ మౌనంతోనే అందరి హృదయాలనుజయిస్తావు – నిషిద్దాక్షరి, దత్తపది, అప్రస్తుత ప్రసంగాల వంటి వాటితో చేసేఅవధానాలకే గజమాలలుగండపెండేరాలు తొడిగితేఅత్తమామలు , ఆడపడుచులుకన్నవాళ్ళు, కట్టుకున్నవాడు,విరామం లేకుండా వచ్చిపోయేసమస్త బంధుగణంతోఅనునిత్యం నువ్వు చేసే అవధానానికిఎన్ని గజమాలలు వేయాలోఇంకెన్ని గండపెండేరాలు తొడగాలో – కాలాన్ని నడిపించే ఋతువులు ఆరేఅనుకుంటాం కానీమానవజాతి మనుగడ కోసంకనపడకుండా నీలో దాచుకున్నఏడో రుతువే […]

Continue Reading
gavidi srinivas

ఆమె ఒక ప్రవాహం (కవిత)

ఆమె ఒక ప్రవాహం -గవిడి శ్రీనివాస్ నీవు నా ప్రపంచంలోకి ఎప్పుడు సన్న సన్నగా అడుగులు వేశావో తెలీదు కానీ ఒక వెన్నెల వచ్చి తట్టినట్టు ఒక వేకువ లేపి మనసిచ్చినట్టు ఒక పూల తోట అత్తరు వాసనలు నింపినట్టు నా చుట్టూ తీయని పరిమళం నింపావు. నాపై నీ కలల పిట్టలు వాలేవి నాలో ఆరాధన వెలిగేది. నడిచిన దూరాలు ఎక్కిన కొండలు గుండె లోతుల్లోంచి తడిచేసిన దృశ్యాలు కళ్ళను తడుపుతూ అలా కుదుపుతూ ఉండేవి. […]

Continue Reading

గూడు కట్టిన గుండె (కవిత)

గూడు కట్టిన గుండె -బసు పోతన గూడు కట్టిన గుండెను గుట్టు విప్పమని అడిగితే బిక్కుబిక్కు మంటూ చూసింది గుట్టు చప్పుడు కాకుండా దిక్కుమాలినదానిలాకూర్చున్న మనసు చివుక్కుమన్న శబ్దానికి కూడా ఉలిక్కిపడింది. మనసు మనసెరిగిన కళ్ళు రెప్పలతో రహస్యంగా మాటాడి ఓదార్చేందుకు కన్నీటి బొట్టును పంపితే రెప్ప జారిన నీటి బొట్టు పగిలిన మనసులా నేలను తాకి వేల ముక్కలైంది ప్రతి రోజూ పగిలే ముక్కల్ని ఒక్కటిగా చేర్చి అతికించడమే రోజుటి బతుకులో భాగమైంది చితికే మనసుతో […]

Continue Reading
Posted On :

సరిహద్దు సాక్షిగా (కవిత)

సరిహద్దు సాక్షిగా -డా.కె.గీత విరగకాసిన ద్రాక్షతోట సాక్షిగా ‘సరిహద్దు ప్రేమకు అడ్డంకా?’ అని అతను గుసగుసలాడినప్పుడు గుండె గజగజా కొట్టుకున్నా అతని మీద ప్రేమ ఎఱ్ఱసముద్రాన్ని దాటింది మా ప్రేమమాధుర్యమంతా నింపుకున్న పవిత్రభూమి ఇది- ఇందులో దేశాలు ఎన్నో మాకు లెక్క లేదు పరమత సహనం నించి పుట్టిన ప్రేమతో ఏకమైన బంధం ఇది- ఇందులో దేశాల పాత్ర లేనే లేదు ఆ పొద్దు సరిహద్దులో అతని దేశపు వాళ్ళని ఎత్తుకొచ్చేవరకు అతని దేశం నా దేశం […]

Continue Reading
Posted On :

అమృత కలశం

అమృత కలశం – శింగరాజు శ్రీనివాసరావు అనాటమీలో తప్ప ఆవిర్భావంలో తేడా లేదు పలక పట్టకముందే వివక్షకు తెరలేచి చదువుకోవాలనే ఆశను ఆవిరిగా మార్చింది లక్ష్మణరేఖల మధ్య బంధించబడిన బాల్యం గుంజకు కట్టిన గాలిపటమై ఎగరలేక నాలుగు గోడల మధ్య శిలువ వేసుకుంది రేపటి పొద్దు జీవితానికి ముగ్గు పెడుతుందని పరిచయం లేని బంగారు మొలతాడును తెచ్చి పందిరిలో బందీని చేస్తే, మనసులో ఊహలు మసకెక్కాయి ఇంటి పేరు ఎగిరిపోయి, ఇల్లాలు పురుడు పోసుకుంది స్వేచ్ఛకు సంకెళ్ళు […]

Continue Reading

ఉయ్యాల్లో టెర్రరిస్ట్

ఉయ్యాల్లో టెర్రరిస్ట్ -వి.విజయకుమార్ ష్…పారా హుషార్ వీడు మామూలోడు కాడు పనిపిల్ల బుగ్గ కొరికిన కీచకుడు పక్కింటి పిల్ల కొంగు లాగిన దుశ్శాసనుడు తాత మొహాన్నే ఫెడీల్ మని తన్నిన కర్కోటకుడు! సాధించుకోవడం ఎలానో ఎరిగిన కిమ్ వాడు లేస్తూనే జాకీ చానై కిక్ బాక్సింగ్ మొదలెడతాడు చిట్టి రాముడై శరాలు సంధిస్తూ యుద్ధానికి సిద్ధమంటాడు ఎడం కాలితో భూగోళాన్నీ కుడికాలితో చందురుడ్ని అలవోకగా తంతూ వళ్ళు విరుచుకుంటాడు మోనార్క్ నంటూ విర్ర వీగుతాడు బజ్జున్నప్పుడే వీడు […]

Continue Reading
Posted On :

నీ కలని సాగు చేయడానికి (కవిత)

నీ కలని సాగు చేయడానికి   -వసీరా చల్లగా వచ్చిన వరద నీరు వీడని నీడలా….లోపలి నుండి తొలుచుకొచ్చే నీడలా ఇక జీవితకాలపు సహచరిలా స్థిరపడిపోతోందా? నువ్వయితే ఇన్ని సూర్యకిరణాలనీ వాసంత సమీరాల్ని, యేటి ఒడ్డు ఇసుక మీద ఆటల్నీ వదలి చప్పుడు లేకుండా వెళ్ళిపోయావు అప్పుడు తెలియలేదు శూన్యం ఎంత పెద్దదో బహుశా నువ్వు రాలిన ఆకుల మీది రంగుల రెక్కల్ని తీసుకుని జ్వాలలోంచి జ్వాలలోకి , కలని ఖాళీచేసి శూన్యంలోకి వెళ్ళావనుకున్నాను లేదు, నువ్వు శూన్యాన్ని […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఇదిగో చూడండి!

అనుసృజన ఇదిగో చూడండి! హిందీ మూలం: నీలమ్‌ కులశ్రేష్ఠ అనుసృజన: ఆర్ శాంతసుందరి మట్టిరంగు సహ్యాద్రి కొండల మీద క్యాబ్‌ వెళ్తోంది. మధ్య మధ్య చదునైన రోడ్డు, మళ్ళీ పాములా మెలికలు తిరిగిన కొండ దారిలో పైకి ప్రయాణం. సాపూతారా కొండలు మూడువేల అడుగులే అని అమ్మ ఎంత నవ్విందో, ”ఆహా! గుజరాత్‌ హిల్‌ స్టేషన్‌ ఎంత బావుంది. ఒక మట్టి దిబ్బని ‘హిల్స్‌’ అంటున్నారు” అంది వ్యంగ్యంగా. అమ్మ మాటలకి నాకు కోపం వచ్చింది. ‘ఏమైంది […]

Continue Reading
Posted On :

ఉప్పు (బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సుబోధ్ సర్కార్, తెలుగు సేత: వారాల ఆనంద్ )

ఉప్పు బెంగాలీ మూలం, ఇంగ్లీష్ : సుబోధ్ సర్కార్ తెలుగు సేత:వారాల ఆనంద్ ఉప్పూ దుఃఖం ఇద్దరూ అక్కాచెల్లెళ్ళు వాళ్ళు లేకుండా వున్న సంతోషం సంతోషమే కాదు వ్యాకులత నా కుమార్తె ఆమె నా రక్తనాళాల్లోని విషాన్ని శుభ్రం చేస్తుంది అదృష్టవంతులయిన కవులు మానవ చరిత్ర నుండి మురికిని కడిగేస్తారు మనమంతా అంతరించి పోవడానికి ముందు చట్టపరంగా ‘ప్రేమ’ సంతోషానికి పరాయిదే ***** వారాల ఆనంద్వారాల ఆనంద్, కవి, రచయిత, అనువాదకుడు, సినీ విమర్శకుడు. డాక్యుమెంటరీ ఫిలిం […]

Continue Reading
Posted On :

యక్షిణి (ఆంగ్లమూలం: అనురాధా విజయకృష్ణన్, అనువాదం: ఎలనాగ)

యక్షిణి ఆంగ్లమూలం: అనురాధా విజయకృష్ణన్ తెలుగు సేత: ఎలనాగ ఒక ప్రాచీన కథ ప్రకారం … విరగబూసిన పాలవృక్షం మీద రాత్రివేళ ఆశ్చర్యపోయిన చంద్రుని కాంతిలో పువ్వులు రహస్య దీపాలలా వెలుగుతున్నప్పుడు, లేదా చంద్రుడు లేని చీకటిరాత్రిలో పరిమళాలు పాముల్లా గాలిలో నాట్యం చేస్తూ, ఆటపట్టిస్తూ, భయపెడుతున్నప్పుడు ఆ పాలవృక్షం ఆ స్త్రీ మీద పువ్వుల్ని వర్షిస్తే అప్పుడామె యక్షిణిగా మారుతుంది. ఆమె గోళ్ళు దాహంగొన్న మేలిమి కత్తులుగా మారుతై. అవి ఒక్క ఉదుటున గుండెల్ని అమాంతంగా పెకలించ […]

Continue Reading
Posted On :

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం)

అమ్మ (అమెరికన్ రచయిత్రి గ్వాన్డలిన్ బ్రూక్స్ రాసిన “మదర్” ఆంగ్ల కవితకు అనువాదం) -వి.విజయకుమార్ గర్భస్రావాలు నిన్ను మరవనివ్వవు చేతికందినట్లే అంది, చేజారిన బిడ్డల జ్ఞాపకాల తలపులు మరపురానివ్వవు, పిసరంతో, అసలెంతో లేని జుత్తుతో తడియారని మాంసపు ముద్దలవి, గాయకులో, శ్రామికులో ఎప్పటికీ శ్వాసించని వారు. నువ్వెప్పటికీ దండించలేని వాళ్ళు, అలక్ష్యం చెయ్యని వాళ్ళు మిఠాయిలిచ్చి ఊరుకోబెట్టనూ లేవు. చీకే వారి బొటనివేలి చుట్టూ ఎప్పటికీ ఒక పట్టీని కూడా చుట్టలేవు వొచ్చే దయ్యాల్ని తరిమేయనూ లేవు. […]

Continue Reading
Posted On :

చీకటి (నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ, తెలుగు సేత: వారాల ఆనంద్ )

చీకటి నేపాలీ మూలం, ఇంగ్లీష్ : బిమల్ నీవ తెలుగు సేత:వారాల ఆనంద్ రాత్రి చీకట్లో ఏమయినా జరగొచ్చు పగులుపట్టిన రోడ్డులోంచి ఎగిరిపడ్డ పోట్రాయి కాలికి తగలొచ్చు అంతేకాదు ప్రాణం లేని శిలావిగ్రహాలతో ఢీ కొట్టొచ్చు లేదా భూమ్మీదో వాకిట్లోనో పడిపోవచ్చు తోవదప్పి మురికి కాలువలో పడిపోవచ్చు రోడ్డుపైకి చొచ్చుకొచ్చిన ఏ బంగ్లానో దేవాలయాన్నో దారితప్పి గుద్దుకోవచ్చు, గాయాలపాలు కావచ్చు చీకట్లో ఏమీ కనిపించదు కళ్ళు వున్నా వృధా చీకట్లో ఎలాంటి రక్షణా లేదు చీకట్లో దాక్కొని […]

Continue Reading
Posted On :

ఋణం తీరేలా (కవిత)

ఋణం తీరేలా -చందలూరి నారాయణరావు కాస్త చూడు కళ్ళను తలుపు తట్టి లోపలికి.. రోజూ కలలో నీ గొంతు గుర్తులే నీ చూపు స్పర్శలే… ఎక్కడికి వెళ్ళినా ఏ దూరంలో ఉన్నా రాత్రి ఒడికి చేరక తప్పదు ఏదో కల చిటికిన వ్రేలితో వేకువ దాకా నీతోనేగా మనసు కలవరింత ఒక్కో కవిత రూపంలో ఋణం తీరేలా ***** చందలూరి నారాయణరావుపుట్టినది: ప్రకాశం జిల్లా జె. పంగులూరు. వృత్తి: హైస్కూల్ఉపాధ్యాయులు ప్రవృత్తి: వచన కవిత్వం రచనలు: మనం […]

Continue Reading
gavidi srinivas

సంఘర్షణ లోంచి (కవిత)

సంఘర్షణ లోంచి -గవిడి శ్రీనివాస్ కోర్కెలు ఎక్కిపెట్టే బాణాలు ఎడారి జీవిత ప్రయాణానికి కొలువులౌతాయి. ఇవి ఎప్పటికీ తడి తడిగా ఆనందాల్ని విరబూయలేవు. మనకు మనమే ఇనుప కంచెలు వేసుకుని అసంతృప్తి తీరాలని వెంబడిస్తున్నాం. ప్రకృతి జీవి కదా స్వేఛ్చా విహంగాల పై కలలను అద్దుకుని బతికేది. ఎన్ని రెక్కలు కట్టుకు ఎగిరినా బాధను శ్వాసిస్తే ఏ కాలం ఏం చెబుతుంది. ప్రశ్నించు సమాధానం మొలకెత్తించు లోలోపల అగ్ని గోళాలని రగిలించు. ఎప్పుడు గొంతు విప్పాలో ఎప్పుడు […]

Continue Reading

బోన్సాయ్ (కవిత)

బోన్సాయ్ -డా. లక్ష్మీ రాఘవ బలంగా ఉన్న విత్తుని నేను ఎక్కడపడ్డా ధృడంగా ఉంటా..అనుకున్నా ఆప్యాయత అనే నీరు పుష్కలంగా దొరుకుతుందనుకున్నా ఏపుగా ఎదగాలన్న కోరికతో ఉన్నా విస్తరించి నలుగురికీ ఆశ్రయం ఇచ్చే లక్షణాలు కలిగి ఉన్నా అందుకే అన్నీ దొరికాయని మట్టిని తోసుకుంటూ బలంగా బయటికి వచ్చా. సూర్య కాంతి అందం నన్ను మురిపించి రా అంటూ చేయి చాచింది. ఆహారం సమకూర్చుకుంటూ ఇంకాస్త పైకి లేచి చుట్టూ చూసా.. అందమైన ప్రపంచం పరికరిస్తూంటే పడిందో […]

Continue Reading
Posted On :

అనుసృజన- ఇక అప్పుడు భూమి కంపిస్తుంది

అనుసృజన ఇక అప్పుడు భూమి కంపిస్తుంది మూలం: రిషబ్ దేవ్ శర్మ అనుసృజన: ఆర్ శాంతసుందరి చిన్నప్పుడు విన్న మాట భూమి గోమాత కొమ్ము మీద ఆని ఉందనీ బరువు వల్ల ఒక కొమ్ము అలసిపోతే గోమాత రెండో కొమ్ముకి మార్చుకుంటుందనీ అప్పుడు భూమి కంపిస్తుందనీ . ఒకసారి ఎక్కడో చదివాను బ్రహ్మాండమైన తాబేలు మూపు మీద భూమి ఆని ఉంటుందనీ వీపు దురద పెట్టినప్పుడు ఎప్పుడైనా ఆ తాబేలు కదిలితే భూమి కంపిస్తుందనీ. తరవాతెప్పుడో ఒక పౌరాణిక నాటకంలో […]

Continue Reading
Posted On :

జార్జి-రెక్కవిప్పిన రెవల్యూషన్..!! (కవిత)

జార్జి-రెక్కవిప్పిన రెవల్యూషన్..!! -శోభరమేష్ అది తూర్పు దిక్కు వియత్నాం విప్లవ హోరు గాలులు వీస్తున్న కాలం ! లాటిన్ అమెరికా జాతీయోద్యమాల అగ్ని పర్వతాలు వెదజల్లే లావావేడి గాలులు..! హిమగిరులను మరిగిస్తున్న కాలం సహారాఎడారి దేశాల నల్ల బానిసలు నైలునది కెరటాలై సామ్రాజ్య పునాదులను పెకలించి వేస్తున్న ఝంఝూనిల షడ్జ ద్యానాలు విద్యాచనంలో మర్మోగుతున్న రోజులు పాలస్తీనా విమోచనోద్యమం ఉష్ణరక్త కాసారపు భుగ భుగలు పీడితప్రజల రక్తనాళాలను ఉరుకలు వేయించుతున్న కాలం ఘనీభవించిన ఓల్గాను త్రోసి రాజంటూ […]

Continue Reading
Posted On :

నీకు నా ప్రేమ ఎట్లా చెప్పను, హైదరాబాద్? (మౌమితా ఆలం ఆంగ్ల కవితకు తెలుగుసేత)

నీకు నా ప్రేమ ఎట్లా చెప్పను, హైదరాబాద్? ఆంగ్ల మూలం: మౌమితా ఆలం తెలుగు సేత : ఎన్ వేణుగోపాల్ ఎండోస్కోపీ గదిలోఅక్క నా నొప్పిని లాగేస్తున్నప్పుడునువు రచించిన సుమధుర తెలుగు పదాల ప్రేమనునా నుదుటి మీద అక్షరాలలో అనుభవించాను.పక్కగది లోంచి ప్రతిధ్వనిస్తున్నాయినా బిడ్డల ఏడుపులూ నవ్వులూఅమ్మల అనువాదాల భాషలో.నాకు నీ లిపులూ అక్షరాలూ తెలియవుకాని, హైదరాబాద్నీ ప్రతిఘటన స్వరాలనునా చర్మం మీద స్పర్శలోఅనుభవిస్తూనే ఉంటాను.పొరలు పొరలుగా చిక్కని హలీంనా నోట్లో ఇంకా కదలాడుతున్నదినా పదాలకునీ నాలుక […]

Continue Reading
Posted On :

చూపు కవాతు (కవిత)

చూపు కవాతు (కవిత) – శ్రీ సాహితి భయం ప్రేమించినిద్ర గుచ్చుకుని రాత్రికి గాయమైపగటి పెదవుల పైకాలపు నల్లని నడకలకు ఇష్టం చిట్లి బొట్లు బొట్లుగాముఖంలో ఇంకితడిసిన కళ్ళకు పారిన బాధకు ఎండిన కలతో వాడిన నిజంఓడిన మనసుతో ఒరిగిన అలోచనపాత రోజుల వాకిట ఆశకు వ్రేలాడుతూ గతం ముందడగేసిజారిన నిజాలును జాలితో చేతికందిస్తేగడ్డకట్టి కరుడుకట్టిన కోరికల్లోఒక్క కోరికలో కదలికొచ్చినా మనసు చిగుర్లు వేసిజ్ఞాపకాల తేమనరోజూ రోజును గుచ్చి గుచ్చినీ ఆనవాళ్ళు కోసంచూపు కవాతు చేస్తూనే ఉంటుంది.. […]

Continue Reading
Posted On :

నేను (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నేను (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ములుగు లక్ష్మీ మైథిలి నేను లేని ఇల్లు లేదు నేను లేక ఈ జగతి లేదు ప్రతి ఇంట్లో అనుబంధాల పందిరి వేస్తాను మన ఆడపడుచుల పొత్తిళ్ళ నుండి చెత్త కుప్పలోకి విసిరేసే కర్కశత్వానికి సవాల్ ను నేను కొలతలు తప్ప మమతలు తెలియని మృగాళ్ళు ఉన్న జనారణ్యంలో సమానతలంటునే సమాధి చేస్తారు ఎన్నో మైళ్ళ పురోగమనంతో అలుపెరగని పయనాన్ని బాధ్యతల బరువును మోస్తూ ఏ […]

Continue Reading

రథసారథులు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

రథసారథులు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు పంచాక్షరి దిద్దవలసిన వయసున పరక చేతికిచ్చి పనిమనిషి పనికి అక్షరాభ్యాసము చేసిననాడు “పలక నాకు పనికిరాదా” అన్నపలుకు పలకనేలేదు మగవాడి మొలతాడును పురిపెట్టి పసుపుతాడును పేని మెడకు ఉరిబిగించి మరబొమ్మను చేసి ఆడించినా మూగగా రోదించినదే తప్ప నోరుమెదప లేదు పేగుల దారాలు లక్ష్మణరేఖను అడ్డుగా గీస్తే బక్కచిక్కిన మనిషి మీద ఆకలి చీకటి హాహాకారం చేస్తే శబ్దంలేని ఉరుము గుండెల్లోనే ఆగిపోయింది […]

Continue Reading

శిథిల స్వప్నం (కవిత)

శిథిల స్వప్నం (కవిత) – డా.కటుకోఝ్వల రమేష్ భద్రంగా కూడేసుకున్న బ్రతుకు తాలూకు కలలు ముక్కలవ్వటం ఎవ్వరూ తీర్చలేని వెలితి అకస్మాత్తుగా కుప్పకూలిన కాలపు గోడల మధ్య దేహాలు నుజ్జయి పోవటం అత్యంత సహజం కావచ్చు కానీ……… రూపాంతరం చెందని ఎన్నో స్వప్నాలు శిథిలమవుతాయి కూడా… ఒకానొక కాళరాత్రి విరుచుకు పడిన విధి మహావిషాదాల్ని పరచి పోవచ్చు కానీ…….. ప్రపంచ గుమ్మాన కన్నీళ్ళతో మోకరిల్లి చరిచిన వేదనా భరిత గుండె చప్పుళ్ళకు ఎవ్వరూ ఆసాంతం అద్దం పట్టలేరు […]

Continue Reading

అనుసృజన- వంటావిడ – ఇంటావిడ

అనుసృజన వంటావిడ – ఇంటావిడ మూలం: కుమార్ అంబుజ్ అనుసృజన: ఆర్ శాంతసుందరి ఆమె బుల్ బుల్ పిట్టగా ఉన్నప్పుడు వంట చేసిందితర్వాత లేడీగా ఉన్నప్పుడుపూల రెమ్మలా ఉన్నప్పుడుగాలితో పాటు లేత గడ్డిపరకగా నాట్యమాడుతున్నప్పుడుఅంతటా నీరెండ పరుచుకున్నప్పుడుఆమె తన కలల్ని మాలగా అల్లుకుందిహృదయాకాశంలోని నక్షత్రాలని తెంపి జోడించిందిలోపలి మొగ్గల మకరందాన్ని మేళవించిందికానీ చివరికి ఆమెకి వినిపించిందికంచం విసిరేసిన చప్పుడు మీరు ఆమెతో అందంగా ఉన్నావని అంటేఆమె వంట చేసిందిపిశాచి అని తిట్టినా వంట చేసిందిపిల్లల్ని గర్భంలో ఉంచుకుని వంట […]

Continue Reading
Posted On :

పండుటాకు పలవరింత (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

పండుటాకు పలవరింత (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – డా. సమ్మెట విజయ వసంతం వచ్చేసింది పూలవనం పానుపు వేసిందిగుత్తుల గుత్తుల పూలని చూసి గతం తాలూకు గమ్మత్తులను మనసు పదే పదే పలవరిస్తుంది జ్ఞాపకాల హోరు నాలో నేనే మాట్లాడుకునేలా చేయసాగాయి చెవులు వినిపించక కంటి చూపు ఆనక జీవన అవసాన దశలో ఉన్నాను నేను కర్ర సాయం లేనిదే అడుగు ముందుకు పడటం లేదు ఎప్పుడు పిలుపు వస్తుందా అని ఆకాశం […]

Continue Reading
Posted On :

అమ్మ ముచ్చట ( కవిత)

అమ్మ ముచ్చట ( కవిత) -కందుకూరి శ్రీరాములు అమ్మ ఆచ్ పిట్టయ్యి ఎగిరిపోయింది ఇక్కడ గూడూ లేదు మనిషి నీడా లేదు తను ఎటో వెళ్ళిపోతానని తెలియక తన తనువు ఎటో మాయమైందోనని తెలియక పండుగకో పబ్బానికో కట్టుకోవటానికి పెట్టెలో భద్రంగానే దాచుకుంది మూటచుట్టిన పట్టు చీర ! ఎన్నెన్ని ముల్లెలు కట్టుకుందో ఆకలైతే ఆంప్రో బిస్కెట్ ప్యాకెట్! అరగకపోతే సోడా సొంపు ప్యాకెట్! ఎంత క్రమశిక్షణతో ఉన్నా ఎప్పుడూ ఏదో ఒక నలత ! ఒక్కతే […]

Continue Reading
Posted On :

నీకేమనిపిస్తుంది? (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నీకేమనిపిస్తుంది? (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – నర్సింహా రెడ్డి పట్లూరి పెరిగిన దూరానికి రోజురోజుకూ నీ ప్రేమ ధృవంలా కరిగిపోతే.. ఒకప్పటి జ్ఞాపకాల సముద్రం ఉప్పెనై మీద పడ్డట్టుంది. నీకేమనిపిస్తుంది? ఆ చెక్కిళ్ళ చెమ్మని చెరిపిన చేతులు ఇప్పుడు ఎడారులైతే.. ఆ స్పర్శలనే నువ్ చెరిపేస్తే.. నిర్జీవమే నరాల్లో పవ్రహిస్తుంది. మరి నీకేమనిపిస్తుంది? నా నుదుట నీ తడిని ఉత్తలవణ గీతమని నువ్ కొట్టిపడేస్తే తనువణువణువునూ బాణాలు తాకిన బాధ. నీకేమనిపిస్తుంది? ఇరువురి నడుమ ఇంకిపోని మాటల […]

Continue Reading

అనుసృజన- జలియన్ వాలా బాగ్ లో వసంతం

అనుసృజన జలియాన్ వాలా బాగ్ మే వసంత్ (జలియన్ వాలా బాగ్ లో వసంతం) – ఆర్.శాంతసుందరి యహా( కోకిలా నహీ(, కాగ్ హై( శోర్ మచాతే కాలే కాలే కీట్, భ్రమర్ కా భ్రమ్ ఉపజాతే.ఇక్కడ కోయిలలు కూయవు కాకులు గోల చేస్తాయినలనల్లటి పురుగులు తుమ్మెదల్లా భ్రమింపజేస్తాయి కలియా( భీ అధఖిలీ , మిలీ హై( కంటక్ కుల్ సే వే పౌధే , వే పుష్ప్ శుష్క్ హై( అథవా ఝులసే.మొగ్గలు కూడా అరవిచ్చి […]

Continue Reading
Posted On :

కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత)

కోడి కూతలోపే నీకు దిష్టి తీస్తాను ( కవిత) -సుభాషిణి వడ్డెబోయిన కళ్ళ లోగిలిన చూపుపడకేసి కలల ధూపమేసి తలపు తలుపు తెరచుకున్నా కాలం కరుగుతున్నా కానరాననుకోని కాదంటానని కలత పడ్డావేమో! సెలయేటి నవ్వులతో సంచరించిన ఊసులు చిలిపి మాటలతో  చెప్పుకున్న ముచ్చట్లు మనం అనే వనంలో పండు వెన్నెలలో పడి పడి కోసుకున్న పూలనడుగు నా మనసు సువాసనలు చెబుతాయి మన చెలిమి వెలుగు కునుకుతో చీకటికి కునుకాగి జాబిలి జంట కోరికతో సిగ్గుపడి మబ్బు […]

Continue Reading

మరో దుశ్శాసన పర్వంలో..! (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

మరో దుశ్శాసన పర్వంలో..! (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – ఎన్. లహరి నాలో నిత్యం జరిగే సంఘర్షణలకు కాస్త విరామమిచ్చినన్ను నేను వెతుక్కునే ప్రయత్నంలోనాదనుకునే సమూహంలోకి ధైర్యంగా అడుగులేస్తుంటాను నన్ను నేను నిరూపించుకోవడానికి ఎన్ని అడ్డంకులెదురైనా అధిగమిస్తాను ఏమరపాటు జీవితాన్ని కోల్పోమంటుందిమంట గలపిన సంప్రదాయంవిషసంస్కృతి పిడికిళ్ళలో ముడుచుకు పోయింది వింత సమాజం, విభిన్న పోకడలుసంస్కృతీ సాంప్రదాయలకు నెలవంటూ సెలవిస్తూనేవావి వరసులు మరచిపోయి ప్రవర్తించేవిష సంస్కృతి తాండవిస్తోంది కామాంధులు కారణాలెతుక్కొని మరీచేతులు చాస్తుంటారు బంధాలు కరువైన చోట క్షేమ సమాచారాల ప్రసక్తే లేదు ఏకాంతంలో కూడా కారుచీకట్లు కమ్ముకునేలాఅసభ్యకర […]

Continue Reading
Posted On :

కనబడుట లేదు ! ( కవిత)

కనబడుట లేదు ! ( కవిత) -రామ్ పెరుమాండ్ల కళ్ళున్నాచూపులేదు .బహిరంగంగా చూడడం మానేశాకఅంతర్గత అల్లకల్లోలం మరెప్పుడు చూస్తానో !  అక్కడన్ని కిరాతకంగా కుతికె పిసికి చంపిన మరణాలే  అగుపిస్తాయి.అచ్చం మేకపిల్లను అలాల్ చేసినట్లు జీవగంజి ఆశచూపి జీవం తీసుకున్నా క్షణాలెన్నో ,  కంచంలోకి మెతుకులు రావాలంటే కాసిన్ని కుట్రలు నేర్వాలని ,పూటకో పాటందుకున్న రోజులెన్నోనిజమే వేశ్య వేషమేసినా వ్యవస్థలెన్నో  దొంగకొడుకుల రాజ్యానమూగబోయిన నన్ను సందుగలో దాచిన చిన్నప్పటి పలక చీదరించుకొని చెంప చెల్లుమనిన సందర్భాలెన్నో !  నేరం నాదే నేరస్థుడే కనపడుట లేదు. లెక్కతేలనికత్తిపోట్లతో కొన ఊపిరితో తప్పిపోయిన నేను నాకు కనపడుట లేదు. ***** రామ్ పెరుమాండ్లనా పేరు రామ్ […]

Continue Reading
Posted On :

మగువ జీవితం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

మగువ జీవితం (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – దయా నందన్ ఏ పనీ లేకుండా ఏ పనీ చేయకుండా కాసేపైనా కళ్ళు మూసుకుని సేదతీరగ ఆశ చిగురించెను మదిలోన…! కానీ కాలమాగునా? కనికరించునా? నీకు ఆ హక్కు లేదని వంట గదిలోని ప్రెషర్ కుక్కర్ పెట్టే కేక, నేలనున్న మట్టి కనిపించట్లేదటే అని మూలనున్న చీపురు పరక, విప్పి పారేసిన బట్టల కుప్ప మా సంగతేమిటని చిలిపి అలక, ఉదయం తిని వొదిలేసిన పళ్ళాలు మధ్యాహ్నం […]

Continue Reading
Posted On :

ఎండిపోయిన చెట్టు (ఆంగ్ల మూలం: సయెదా మిరియమ్ ఇక్బాల్ , తెలుగు అనువాదం: ఆర్.శాంతసుందరి)

అనుసృజన ఎండిపోయిన చెట్టు ఆంగ్ల మూలం: సయెదా మిరియమ్ ఇక్బాల్ అనువాదం: ఆర్.శాంతసుందరి ఎండిపోయిన చెట్టు కోల్పోయింది విత్తనాలన్నిటినీ అవి ఎగిరిపోయాయి దూరంగా సుదూరంగా తెలిసిన ప్రదేశాలకీ తెలియని ప్రాంతాలకీ మొత్తంమీద వెనక్కి రావాలన్న కోరిక లేకుండా. చెట్టు మాత్రం నిలబడే ఉంది మిగిలి ఉన్నానన్న ధైర్యంతో వేళ్ళు తెగి, ప్రేమ కరువై ఒంటరిగా. కొమ్మలు ఆర్తితో ఒంగిపోయాయి వెతకటానికి కోల్పోయిన వేళ్ళనీ , విత్తనాలనీ, తనని అంతకాలం నిలబెట్టిన నేలని కౌగలించుకున్న మనసు విరిగిపోయిన చెట్టు, […]

Continue Reading
Posted On :

హ్యాపీ న్యూ ఇయర్! (కవిత)

హ్యాపీ న్యూ ఇయర్! -బండి అనూరాధ హఠాత్తుగా మాయమైన ఎవరో..ఇంటి ముందు నడుచుకుంటూ మరెవరో..లోనికింకి బయటపడని మరింకెవరో.. చుట్టూ పచ్చదనంలోకి నిన్ను లాగేఅక్కడే వాలిన ఒక పక్షి! ఇలాగా!?కొంత నొప్పిని, కథలోకోకవిత్వంలోకో చొప్పించడం! మరి నువ్వు చూసుకుపోతున్నప్పుడుదారి నిన్ను చూసి నవ్వినట్లనిపించిందా?పక్కలమ్మట గడ్డిపూలనయినా పలకరించావా? సైడు కాలువలో నుండీ బయటకొచ్చీ లోపలికి గెంతులేసే కప్పల సంగతీ?నీలోని బెకబెకల సంగతో మరి!ఆకలేస్తోందా..? అక్షరాలని ఇక కట్టేసిదారిన పంటపొలాలకేసి చూస్తోన్నావా.. మరి వాళ్ళకు తప్పదు; కోత కొయ్యాలీ,.. కుప్పవెయ్యాలీ,..నూర్చాలీ,..  హేయ్…నువ్వు ఇక కవితల్ని తూర్పారపెట్టుకోమాటలజాలిని పొట్టులా విసురుకో Happy new year!! ***** బండి అనూరాధపేరు […]

Continue Reading
Posted On :

ఎందుకు వెనుకబడింది (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

ఎందుకు వెనుకబడింది (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – జగ్గయ్య.జి అరచేతిలో సూర్యున్ని చూపగలదుహృదయాన చంద్రున్ని నిలపగలదు ఎదిరిస్తే పులిలా, ఆదరిస్తే తల్లిలా కోరిన రూపం ప్రదర్శిస్తుంది! తను కోరుకున్నవాడికిహృదయాన్ని పరుస్తుంది ఆకాశమంత ఎత్తుకు ఎదిగితన ఒడిన మనను పసివాడిగా చేస్తుంది! సృష్టి కొనసాగాలన్నాకొనవరకు జీవనం సాగిపోవాలన్నామూలం ఆమె, మార్గం ఆమెవిషయాంతర్యామి విశ్వ జననీ! వెదకకున్నా ఎందైనా కనిపించే ఆమెఎందుకు వెనుకబడిందిమన వెన్నై దన్నుగా నిలచినందుకాతోడుగా అంటూ నీడగా ఉన్నందుకా! సగభాగం తనకు తక్కువేమో సమ భాగం కావాలేమోసూర్యచంద్రులు తన కన్నులుగాపగలూ రాత్రీ మనల్ని వెలుతుర్లో […]

Continue Reading
Posted On :

మూడు చిన్న కవితలు

మూడు చిన్న కవితలు ఆంగ్లమూలం: ఎడ్నా సెయింట్ విన్సెంట్ మిల్లే తెలుగు సేత: ఎలనాగ అవిశ్రాంత వ్యక్తి నా కొవ్వొత్తి రెండు వైపులా వెలుగుతుంది రాత్రంతా వెలగడానికి అది సరిపోదు కానీ నా శత్రువులారా! ఇంకా నా మిత్రులారా! అది అద్భుతమైన వెలుగును ఇస్తుంది గురువారం బుధవారంనాడు నిన్ను నేను ప్రేమిస్తే అది నీకేమిటి? గురువారం నాడు నిన్ను నేను ప్రేమించకపోవడం ఎంతో వాస్తవం ఏమిటి నీ ఫిర్యాదు? అర్థం కావడం లేదు నాకు అవును, బుధవారం […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాల ఇల్లు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

జ్ఞాపకాల ఇల్లు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – అద్దేపల్లి జ్యోతి నాన్న ,అమ్మ వెళ్ళిపోయాక ఇల్లు కారుతోందని తమ్ముడు ఇల్లు పడగొడుతున్నాడు అంటే నా కన్నీరాగలేదు ఆ నాడు ఫ్లోరింగ్ కూడా అవ్వకుండా వచ్చేసిన సందర్భం రాళ్ళు గుచ్చుకుంటుంటే జోళ్ళు వేసుకుని నడిచిన వైనం ఫ్లోరింగ్ అమరాక హాయిగా అనిపించిన ఆనందం నాలుగు దశాబ్దాలు దాటినానా మదిలో ఇంకా నిన్న మొన్నే అన్నట్టున్న తాజాదనంతొలిసారి పెళ్ళిచూపుల హడావిడి నాన్న కొన్న కొత్త కుర్చీల సోయగం పెళ్ళికి ఇంటి ముందు చెట్టు మామిడి కాయలతో స్వాగతం […]

Continue Reading

శిథిలాలు (హిందీ మూలం: మంజూషా మన్, తెలుగు అనువాదం: ఆర్.శాంతసుందరి)

అనుసృజన శిథిలాలు హిందీ మూలం: మంజూషా మన్ అనువాదం: ఆర్.శాంతసుందరి ఎండా, వేడీ, వానా అన్నీ భరిస్తూ మౌనంగా ఉంటాయి పచ్చని నల్లని పాచి పట్టిన గోడలు కూలే గుమ్మటాలు విరిగి పడే గోపురాలు. చుట్టూ పొదలు గోడల నెర్రెల్లో మొలిచే రావి, తుమ్మ మొక్కలు. విరిగిపోయిన కిటికీ పగిలిపోయిన గవాక్షంలో నుంచి బైటకి తొంగిచూసే నిశ్శబ్దం సవ్వడులకోసం, తలుపు తట్టే చప్పుడు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎదురు చూస్తుంది ఎవరైనా తమ వాళ్ళు వస్తారని. […]

Continue Reading
Posted On :

నిశీధి పరదాలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

నిశీధి పరదాలు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – మొహమ్మద్ అఫ్సర వలీషా కునుకులమ్మను ఒడిసి పట్టికలల లోగిలిలో బంధించికనబడని తీరాలకు చేర్చికాసింత సాంత్వన పొందాలని ఉంది…  గాయపడి రక్తమోడుతూగాఢంగా అలుముకునిగది గది నింపుతున్న జ్ఞాపకాల తెరలనుగట్టిగా విదిలించుకునిగెలుపు తీరాలకు చేరాలని ఉంది…  మనసు పలికే మూగ భావాల మంచు తెరలు దింపుతూమస్తిష్కంలో ముసురుకునిమిన్నంటిన ఆలోచనా దారాల పోగులనుమౌనంగా చుట్ట బెడుతూ ఆత్మ విశ్వాసపు దుప్పటితోనిశీధి పరదాలను తొలగించాలని ఉంది…. ! ! ***** మొహమ్మద్ అఫ్సర వలీషానా పేరు […]

Continue Reading

కట్టె మోపు..! (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కట్టె మోపు..! (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – సాయి కిషోర్ గిద్దలూరు మా అవ్వ కట్టెమోపును తీసుకొచ్చేవేళ ఎండకు ఎండని కట్టెమోపుతో తనకు ఎండుతుందానే ఓ నమ్మకం. తాను వచ్చేవెళ తన అరపాదం చూస్తే ముళ్ళతో కుర్చినట్టుంటాది.. అవ్వనడుస్తుంటే నింగిమొత్తం నల్లటి మబ్బులతో చినుకుజల్లు వర్షం కురిసేది అప్పుడే అంబరముకూడా అవ్వబాధ తెలుసుకుంది కాబోలు అవ్వపాదాలు నీటితో తడుస్తుంటే అవ్వ ముఖంలో చిరునవ్వు కనిపించేది. అప్పుడే మా అవ్వతో కట్టెమోపును నేను తీసుకొని మా […]

Continue Reading

వసివాడిన ఆకులు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

వసివాడిన ఆకులు (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – శ్రీధర్ బాబు అవ్వారు వీరులు పుట్టేదెల ‍‍‍‍దగ్ధమైన పౌరుషపు మసి దొర్లుతున్న వేళలో… సడలి ఊగులాడుతున్నా బిగుసుకోవాల్సిన నరాలిపుడు… మారిపోయిందా అంతా… మర్చిపోయామా… గత రుధిర ధారల చరిత కలుగులో దాక్కుందా వీరత్వం. ఇప్పుడు మ్యూజియంలో చిత్రాలై నవ్వుతున్నారు పోరుబాట సాగించిన ముందుతరం… వేళ్ళు పిడికిళ్ళెలా అవుతాయి….! అడుగు భయాందోళనల మడుగైనప్పుడు. వెనుక వెనుకగా దాపెడుతున్నావుగా వడలిపోయిన మెదడును మోస్తున్న తలను… పిడికిలిని మరిచి […]

Continue Reading

స్వేచ్ఛాదీపం (ఆంగ్లమూలం: డబ్ల్యు. బి. యేట్స్, తెలుగు సేత: ఎలనాగ)

స్వేచ్ఛాదీపం ఆంగ్లమూలం: డబ్ల్యు. బి. యేట్స్ తెలుగు సేత: ఎలనాగ లేచి వెళ్తాను స్వేచ్ఛాద్వీపానికి వెళ్ళి, మట్టితో కర్రలతో చిన్నచిన్న కొమ్మలతో ఒక చిన్న గుడిసెను నిర్మించుకుంటానక్కడ నాకోసం పచ్చదనాన్నీ తేనెటీగల కోసం తేనెతుట్టెనూ నెలకొల్పుకుంటాను తేనెటీగల ధ్వని నిండిన డొంకలో హాయిగా నివసిస్తాను అక్కడికి తిన్నగా వచ్చే ప్రశాంతి నాకు దొరుకుతుందక్కడ కీచురాళ్ళు పాడే ఆ స్థలంలో ఉదయం వేళ కొండల అవగుంఠనాల్లోంచి ప్రశాంతి రాలిపడుతుంది అక్కడ అర్ధరాత్రి ఒక ప్రకాశం మధ్యాహ్నం ఊదారంగు కాంతి […]

Continue Reading
Posted On :

దిగులు కళ్ళు (కవిత)

దిగులు కళ్ళు -బండి అనూరాధ దిగులు కళ్ళు చుక్కలని పోల్చుకోలేవు.చీకటి ఇల్లు వెన్నెలని చదువలేదు. పనికిమాలిన తత్వాలకిపేర్లు పెట్టుకుంటూఇంకా నువ్వు వెళ్ళిన వైపే చూస్తూ అక్షరాలతో,  అనేకానేక చింతలతోకాలయాపన చేస్తున్నా. మిగులుగా జీవిస్తూ పోతానుకానీఅప్రమేయతలోనూ సత్యమొకటి ఉంటుంది. అడుగు అడుగుకీ నిబద్ధత చప్పుడుని చేస్తుంది. ఇక,.. ఏ తెల్లారగట్టో కోడి కూస్తుంది.మసకవెలుతురికి చూపు జారుతుంది. అప్పుడు,.. కలల జాడ ఒక ప్రశ్నై పొడుస్తుంది.కళ్ళ ఎరుపు ఒక జవాబై మిగులుతుంది. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా […]

Continue Reading
Posted On :

ఇప్పుడు పల్లెవుంది! (కవిత)

ఇప్పుడు పల్లెవుంది! -శోభరమేష్ తోట తగలబడి పోతుంటేగోళ్ళు గిల్లుకుంటూనిల్చోన్నవాణ్ణి !గుండెల మీద చితిపేర్చికొరకంచుతో నిప్పంటీస్తేమౌనంగా భరిస్తున్నవాణ్ణినా మూడొందల గడపల బతుకుశ్వాసలో !కల్తీగాలులు వీస్తుంటేనా వెయ్యిన్నూటపదారుకళ్ళ నరీక్షణికి వలసరెక్కలు పోడుచుకొస్తుంటేనా పల్లె పరాయితనంలోకిపరకాయ ప్రవేశం చేస్తుంటేనేనిప్పుడు ప్రేక్షకుణ్ణి మాత్రమేనిలువెల్లా నిరాశల గాయాల తొడిగినక్షతాత్మగాత్రుణ్ణి మాత్రమే మా పల్లెకి కలలమ్మినవాళ్ళే మా రాత్రిళ్ళని దోచుకున్నారుమా ఆశలకి నీరుపోసినవాళ్ళే మా చిరునవ్వులులాగేస్తున్నారుమా పొలాల్లో లంకెబిందెలు చూపిమా పంటలు నూర్చుకున్నారుఉదయ సాయంత్రాలు చిలకలువాలే తోటనితొండలు గుడ్లుపెట్టే బండనేలగా మార్చారుపల్లెబతుకు మీద సమాధికట్టిఅభివృద్ధికి ప్రాణం పోస్తున్నవాళ్ళుమండే కడుపుల పైన […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- ‘రూపసి బెంగాల్ కవి’ జీబనానంద దాస్

క ‘వన’ కోకిలలు – 21 :  ‘రూపసి బెంగాల్ కవి’ జీబనానంద దాస్ (17 Feb 1899 – 22 Oct 1954)    – నాగరాజు రామస్వామి శతాధిక గ్రంథాలు రాసినారాని ఖ్యాతిని, కొందరికి ఒకే ఒక పుస్తకం తెచ్చిపెడు తుంది. పుస్తకం పేరుచెప్పగానే రచయిత పేరు మస్తిష్కంలో తళుక్కు మంటుంది. అజంత స్వప్నలిపి, అనుముల కృష్ణమూర్తి సరస్వతీ సాక్షాత్కారం, నగ్నముని కొయ్య గుర్రం, రాహుల్ సాంకృత్యాయన్ వోల్గా నుంచి గంగకు, ఉన్న లక్ష్మినారాయణ మాలపల్లి, […]

Continue Reading

తుమ్మ చెట్టు (హిందీ మూలం: మంజూషా మన్, తెలుగు అనువాదం: ఆర్. శాంత సుందరి)

అనుసృజన తుమ్మ చెట్టు హిందీ మూలం: మంజూషా మన్ తెలుగు అనువాదం: ఆర్. శాంత సుందరి నా కిటికీ అవతల మొలిచిందొక తుమ్మ చెట్టు దాని ప్రతి కొమ్మా ముళ్ళతో నిండి ఉన్నా నాకెందుకో కనిపిస్తుంది ఆప్యాయంగా . ఇది నాతోబాటే పెరిగి పెద్దదవటం చూశాను. ఆకురాలు కాలం వచ్చినప్పుడల్లా దీని ముళ్ళకి యౌవనం పొడసూపినప్పుడల్లా ఆ ముళ్ళని చూసి అందరి మనసులూ నిండిపోయేవి ఏదో తెలీని భయంతో, అందరూ దూరమైపోతూ ఉంటే ఈ తుమ్మచెట్టుకి దానిమీద […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- కమలా దాస్

క ‘వన’ కోకిలలు – 20 :  కమలా దాస్    – నాగరాజు రామస్వామి మదర్ ఆఫ్ మాడరన్ ఇంగ్లీష్ పొయెట్రి (31 March 1934 – 31 May 2009) “నేను మలబార్ లో పుట్టిన భారతీయ మహిళను. మూడు భాషల్లో మాట్లాడుతాను, రెండు భాషల్లో రాస్తాను, ఒక భాషలో కలలు కంటాను”- కమలా దాస్. కమలా దాస్  ‘మాధవి కుట్టి’ కలంపేరుతో, మళయాలం, ఇంగ్లీషు భాషలలో  బహుళ కవిత్వం రాసిన కవయిత్రి. మాధవ కుట్టి పెళ్ళి తర్వాత కమలా దాస్ అయింది. ముస్లిమ్ మతంలోకి మారాక […]

Continue Reading

కుంభిక (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత)

కుంభిక (నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కవిత) – శింగరాజు శ్రీనివాసరావు తననుతాను చంపుకుంటూ అందరికీ ఆనందాన్ని పంచుతూ తాను ఖట్టికమీదశవమై తపించేవారికి వశమై ఎండిన మనసుకు ఎంగిలి మెరుపులు అద్దుతూ పడకమీద పువ్వులతో పెదాలమీద ప్లాస్టిక్నవ్వులతో తానుకోరని బ్రతుకును విధి విధించిన శిక్షగా పసుపుతాడులేని పడుపుతనమే వంచన ప్రేమకు వారసత్వంగా వెలుగుచూడక నలిగిపోయే వెలయాలి బ్రతుకులు పరువునుపూడ్చే బరువులు కావు సమాజదేహం మీద పచ్చబొట్లు ధరణిఒడిలో మొలకలై పెరిగి మనకు తోబుట్టువులుగా ఎదిగి కాలంకత్తికి […]

Continue Reading

లయాత్మక గుసగుసలు… (రష్యన్ మూలం: జినైడ గిప్పియస్, ఆంగ్లంనుండి అనువాదం: ఎలనాగ)

లయాత్మక గుసగుసలు… రష్యన్ మూలం: జినైడ గిప్పియస్ ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ శబ్దాలు కలగలిసిపోయే చోట లయాత్మక గుసగుసలు కోరుతాను అడుగు లేని సల్లాపాన్ని ఆశగా జీవితాంతం వింటుంటాను దుఃఖపు చెరువులో పెద్దపెద్ద అనిశ్చయాల వలలు విసురుతాను మురికి నిండిన మార్గాల గుండా పయనించి అంతిమంగా సౌకుమార్యాన్ని చేరుకుంటాను అబద్ధపు ఉద్యానవనంలో మెరిసే మంచుబిందువుల కోసం వెతుకుతాను జమచేసిన ధూళికుప్పల్లో ప్రకాశించే సత్యపు గోళాల్ని భద్రపరుస్తాను దిగులు నిండిన కాలంలో ఆత్మవిశ్వాసాన్ని అంచనా వేస్తాను దేహదుర్గాన్ని […]

Continue Reading
Posted On :

అనుసృజన- వ్రుంద్ ( Vrind (1643–1723) )

అనుసృజన  వ్రుంద్ ( Vrind (1643–1723) ) – ఆర్.శాంతసుందరి           వ్రుంద్   (  Vrind (1643–1723) ) మార్వాడ్ కి చెందిన సుప్రసిద్ధ హిందీ కవి. బ్రిజ్ భాషలో దోహాలు రాసాడు. 70౦ నీతికవితలు రాసాడు. అతని దోహాలను కొన్ని చూడండి 1. జైసే బంధన్ ప్రేమ్ కౌ , తైసో బంధ్ న ఔర్ కాఠహి భేదై కమల్ కో , ఛేద్ న నికలై భౌంర్ ప్రేమ […]

Continue Reading
Posted On :

ఎక్కడ వెతికేది? (కవిత)

ఎక్కడ వెతికేది? -శీలా పల్లవి అన్ని చోట్లా ఆశగా వెతికానుదొరక లేదుపోనీ ఎక్కడా దొరకక పోయినాకొద్దిగా కొనుక్కుందాం అని అనుకుంటేకనీసం అమెజాన్ లోనో , ఫ్లిప్ కార్ట్ లోనోదొరుకుతుందని అనుకోడానికిఅదేమైనా వస్తువా?తప్పకుండా దొరుకుతుందనేవిపరీతమైన నా నమ్మకాన్నిజాలిగా చూస్తూఎక్కడా నీకు నేను దొరకను అంటూ వెక్కిరించింది అంతటా ఎండిపోయింది అని అనుకుంటేబీటలు పడిన అంతరాంతరాలలోఏ మూల నుంచోకొద్ది కొద్దిగా ఉబికి వస్తున్న అలికిడి వినిపిస్తుందికానీ జాడ మాత్రం కనిపించలేదునాకు ఎదురుపడిన ప్రతీ పలకరింపులోవెతికాను కానీ దొరకలేదుఅడుగడుగునా తన ఉనికిని […]

Continue Reading
Posted On :

ఇంటికి దూరంగా (కవిత)

ఇంటికి దూరంగా -ఎం.అనాంబిక రాత్రి మెల్లగా గడుస్తుందిగిర్రున తిరిగే ఫ్యాన్ చప్పుడుమాత్రమే నా చెవులలోప్రతిధ్వనిస్తుంది.. ఒక్కొక్కసారి మాత్రం కాలంసీతాకోకచిలుకలా నా నుంచిజారిపోతుంది అంటుకున్నరంగు మాత్రం పచ్చని ముద్రలా మిగిలిపోతుంది.. ఉబ్బిన కళ్ళలో కాంతి తగ్గిపోయినీరసించిన మొహంలో తెలియని తడి అన్నిసార్లూ బాధని చెప్పుకోలేకపోవచ్చు అసలు రాత్రున్నంత మనేదిపగలుండదేందుకో! నిజానికి అప్పుడే ఎన్నోఆలోచనలు మనసు చుట్టూమెదడు చుట్టూ గుప్పుమంటాయి ఆ ఆలోచనల్ని పూరించేసమాధానాలు నాకు ఒక్కటీకనిపించవు. ***** ఎం అనాంబికఅనాంబిక  ఎన్టీఆర్ జిల్లా, తిరువూరు మండలం, గత 2022 […]

Continue Reading
Posted On :

గతపు పెట్టె (కవిత)

గతపు పెట్టె -డా||కె.గీత గతపు పెట్టెని తెరవనే కూడదు బిలబిలా ఎగిరే తూనీగల్తో బాటూ తోకలు విరగదీసి తలకిందులుగా వేళ్ళాడదీసిన ముళ్ళ తాళ్ళు కూడా ఉంటాయి మిలమిలా మెరిసే నక్షత్రాలతో బాటూ అగాధాంధకారంలోకి విసిరేసే ఖగోళాంతరాలు కూడా ఉంటాయి గలగలా పారే జలపాతాలతో బాటూ కాళ్ళకి బరువై ముంచేసే బండరాళ్ళు కూడా ఉంటాయి సువాసనలు అలుముకున్న అడవుల్లో వేటాడే క్రూరమృగాలు పచ్చని పరిమళాల పూల పొదల్లోనే బలంగా చుట్టుకున్న నాగుబాములు ప్రశాంత తామర కొలనుల్లో రహస్యంగా పొంచి […]

Continue Reading
Posted On :

విషాదమే విషాదం(ఫ్రెంచ్ మూలం: జ్యూల్ లఫోర్గె, ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ)

విషాదమే విషాదం ఫ్రెంచ్ మూలం: జ్యూల్ లఫోర్గె ఆంగ్లం నుండి అనువాదం: ఎలనాగ నేను నా అగ్నిని తల్చుకుంటాను ఒక ఆవులింతను నొక్కి బయటికి రాకుండా చేస్తాను గాలి ఏడుస్తుంది వర్షం నా కిటికీ మీద ధారలై కొడుతుంది పక్కింట్లో పియానో మీంచి బరువైన సంగీతకృతి వినిపిస్తుంది బతుకెంత విషాద భరితం జీవితం ఎంత మెల్లగా సాగుతుంది నేను మన భూమికోసం శాశ్వత తారకల అనంత యవనికమీది క్షణపరమాణువు కోసం మన నిస్త్రాణ చక్షువులను చదివిన అతి […]

Continue Reading
Posted On :

ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

ప్రతీరోజు ఆమె ఒక సూర్యోదయం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – డా.కటుకోఝ్వల రమేష్ పొద్దు పొద్దున్నే ఆమె నా ముందు వెచ్చని తేనీరవుతోంది గుమ్మం ముందు వాలిన పేపర్ వైపు నా రెండు కళ్ళూ సారిస్తానా… పత్రికలో ఆమె పదునైన అక్షరాల కొడవలి మెరుగైన లక్షణాల పిడికిలి కన్నీళ్ళు కాటుక కళ్ళల్లో దాచుకొని కమ్మని వంటల విందవుతోంది కాలం కదిలిపోవాలికదా అంటూ.. రాజీ తుపాకిని ఎత్తుకున్న సిపాయవుతోంది లోపలి మనిషి బయటి మనిషీ […]

Continue Reading

దుఃఖమేఘం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

దుఃఖమేఘం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – చొక్కర తాతారావు కురిసి కురిసి తడిసి ముద్దయ్యింది ఎన్ని దుఃఖమేఘాలు కమ్ముకున్నాయో ఒంటరితనం వదిలినట్టులేదు కన్నీళ్ళు ఆగట్లేదు హృదయం లేని కాలం భారంగా కదులుతోంది కష్టాలు కన్నీళ్ళు కలిసిపోయాయి గుండె నిండా సముద్రం పగలు రాత్రి ఒకటే వాన చుట్టూ శూన్యం బతుకంతా వేదన ఏ దారీ లేదు అంతా ఎడారే! ఆశలు ఆవిరై కలలు మిగిలాయి పేగుబంధం ప్రేమబంధం ఒకప్పుడు అమ్మతనం ఇప్పుడొక అస్పృశ్యవస్తువు […]

Continue Reading
Posted On :

నీవో బ్రతుకు మెట్టువు (కవిత)

నీవో బ్రతుకు మెట్టువు -డా. కొండపల్లి నీహారిణి టీ నీళ్ళు మరుగుతున్నాయి కమ్మని వాసన తన రుచులు అవి అని గొప్పలుబోతున్నది ఉదయం వెంటేసుకొచ్చే హుషారు సమయాలు చేయాల్సిన పని ఒక్కటే వెన్నంటి ఉన్న విషయాన్ని కాసేపు మరచిపొమ్మన్నది ఎల్లలు లేనిది ఆకాశానికే కాదు హృదయాలకు కూడా! కావాల్సినంత ఓపిక కాలేని విసుగు మసిగుడ్డను పక్కన్నే పడిఉన్న పట్కారును పక్క దిగని పిల్లలను పనికెళ్ళాల్సిన పెనిమిటినీ సముచిత భావముద్రలుగా ఆమెతోబాటు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయి తద్ధితాలో కృదంతాలో మాటమాటకు […]

Continue Reading

క’వన’ కోకిలలు- మహాకవి జయంత మహాపాత్ర

క ‘వన’ కోకిలలు – 19 :  మహాకవి జయంత మహాపాత్ర    – నాగరాజు రామస్వామి ఒడిసా గడ్డ మీద నడయాడుతున్న మహాకవి జయంత మహాపాత్ర. సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ ఫెల్లోషిప్, పద్మశ్రీ లాంటిపలు ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన సాహిత్యకారుడు. ఇంగ్లీష్ కవిత్వాన్ని భారతదేశంలో పాదు కొల్పిన ముగ్గురు వైతాళికులు A.K. రామానుజన్, R. పార్థసారధి, జయంత మహాపాత్ర. ఈ సమకాలీన కవిత్రయంలో మొదటి ఇద్దరు ముంబాయ్ వాళ్ళు కాగా, మహాపాత్ర ఒరిస్సాకు చెందిన […]

Continue Reading

ఆమె అనంతం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

ఆమె అనంతం (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – సుంక ధరణి ఓ గాయం తగిలినప్పుడు ఓ ఆకలి తడిమినప్పుడు ఓ తోడు అడిగినప్పుడు ఓ వ్యథ కమ్మినప్పుడు బ్రతుకు శూన్యాలు గుర్తుకొచ్చి బండరాళ్లై జడత్వంలో మునుగుంటే విరబూసిన పత్తి కొమ్మ తెల్లనవ్వులా ఎరుపు పులిమిన బొగెన్విలియా పూరెమ్మలా రాగబంధాల్ని పూయిస్తూ రాతిరేఖల్ని మారుస్తూ ఓడిపోయిన ఓదార్పుల్ని కొంగున ముడుచుకొని సమస్తాణువుల మీదుగా దిశ చూపే తారకలుగా స్త్రీ, సోదరి, సతి… స్థాయిలేవైనా సమతోత్భవ […]

Continue Reading
Posted On :

నువ్వు -నేను (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత)

నువ్వు – నేను (నెచ్చెలి-2023 పోటీలో ప్రత్యేక బహుమతి పొందిన కవిత) – జి. రంగబాబు నువ్వు..తూరుపమ్మ నుదుట మెరిసిన సిందూర బొట్టుగా సూర్యుణ్ణి వర్ణిస్తావు పూట గడవక రోజు కూలికై పరుగులెత్తే శ్రమైక జీవుల పాలిట స్వేదాన్ని చిందించే సామ్రాజ్యవాది సూరీడు..అంటాన్నేను..! రేయి సిగలో విరిసిన సిరిమల్లె.. నింగిలో తళుకులీనే జాబిల్లి.. అంటావు నీవు..! దీపమైనా లేని చిరుగు పాకల బరువు బతుకుల ఇళ్ళలోకి దూరే ఫ్లోరోసెంట్ బల్బు ఆ చందమామ అంటాన్నేను కొండల నడుమ […]

Continue Reading
Posted On :

వర్షానికి ఉత్తరం(డారి మూలం: రెజా మొహమ్మది, ఆంగ్లం: హమీద్ కబీర్ నిక్ లేర్డ్ తెలుగు సేత: ఎలనాగ)

వర్షానికి ఉత్తరం డారి మూలం: రెజా మొహమ్మది ఆంగ్లం: హమీద్ కబీర్ నిక్ లేర్డ్ తెలుగు సేత: ఎలనాగ ప్రియమైన వర్షమా! చలికాలం గడచిపోయింది వసంతం కూడా చివరిదశను చేరుకుంది తోట నిన్ను ఎంతగానో మిస్ అవుతోంది నువ్వు కనపడని ఈ పరిస్థితి ఎప్పుడు ముగుస్తుంది? వర్షమా, ఓ వర్షమా! కరుణ నిండిన చల్లని హృదయమున్న వర్షమా! ఎడారుల నుండి, పర్వతాల నుండి, అరణ్యాల నుండి వీచే గాలికి ఎగిరే పాదచారి కాళ్ళ ఎర్రెర్రని ధూళి తప్ప […]

Continue Reading
Posted On :

అయినా సరే! (కవిత)

అయినా సరే! -బండి అనూరాధ చిగురించి పండి ఎండి రాలి..ఆకుల వంటి వారమే మనం కూడా. ఒక్కోసారి,ఒళ్ళు జలదరించే సత్యాల్లోకి తొంగిచూస్తేనిద్రపట్టని రాత్రుళ్ళలోకి వెళ్ళిపడతామేమోననిఈవలిగానే పట్టీపట్టనట్లుండిపోతాం. భ్రమల నేలలో అన్నీ బరువే అనుకునితేలికగా ఊపిరి తీసుకుంటూచెట్లనీడలో పడిన ప్రాణంలాతెరిపినపడుతూ… ఒక నిద్రకి, కలల చెట్లని పట్టుకెళ్ళివాడని పూలను కోసుకుంటూనిజంలా బ్రతికేస్తూ… వనాలలో వైనాలన్నీ పగటికి పూసివెర్రి నవ్వొకటి నవ్వుకుంటాం. రాలడం తెలియదుగా..ఎప్పుడో..!! ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా […]

Continue Reading
Posted On :

కారబ్బంతి చేను (కవిత)

కారబ్బంతి చేను -అనిల్ డ్యాని మట్టిదారి ముందు మనిషి కనబడడు పొగమంచు దట్టంగా గుండె జలుబు చేసినట్టు ఊపిరి ఆడని ఉక్కిరిబిక్కిరి తనం కుడివైపున ఏపుగా పెరిగిన తాడిచెట్ల నుంచి కమ్మగా మాగిన తాటిపళ్ళ వాసన ఎడమవైపున శ్మశాన వైరాగ్యపు సమాధులు సామూహిక బహిర్భూమి ప్రదేశాలు ప్రవహిస్తున్న మద్రాసు కాలవ నిండా దాని తవ్వకానికి నా పూర్వీకులు చిందించిన చెమట ఒంటిమీద కనీసం రెండైనా గుండీలుండని పల్చటి చొక్కా మోకాళ్ళ పైకి జారకుండా ఉన్న నిక్కరుకి మొలతాడే […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- పద్మశ్రీ విక్రమ్ సేథ్ (భారతీయ ఆంగ్ల కవి)

క ‘వన’ కోకిలలు – 18 :  పద్మశ్రీ విక్రమ్ సేథ్ (భారతీయ ఆంగ్ల కవి)    – నాగరాజు రామస్వామి నింగి, నేల, సముద్రాల సామరస్య సర్వైక్య శ్రావ్య గీతం నా సంగీతం – విక్రమ్ సేథ్. పద్మశ్రీ విక్రమ్ సేథ్ ప్రసిద్ధ భారతీయ కవి. నవలా కారుడు. యాత్రాకథనాల (travelogues) రచయిత. గొప్ప అనువాదకుడు. ఆంగ్లంలో సాహిత్య వ్యవసాయం చేసి విశ్వఖ్యాతి గడించిన కృశీవలుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ, ప్రవాసీ భారతీయ సమ్మాన్, WH […]

Continue Reading

అనుసృజన-ఒంటరి స్త్రీ నవ్వు(హిందీ మూలం: సుధా అరోడా) తెలుగు స్వేచ్చానువాదం: ఆర్ శాంత సుందరి

అనుసృజన ఒంటరి స్త్రీ నవ్వు హిందీ మూలం: సుధా అరోడా అనువాదం: ఆర్.శాంతసుందరి ఒంటరి స్త్రీదాచుకుంటుంది తన నుంచి తననేపెదవుల మధ్య బందీ అయిన నవ్వుని బైటికి లాగినవ్వుతుంది బలవంతంగాఆ నవ్వు కాస్తా మధ్యలోనే తెగిపోతుంది… ఒంటరి స్త్రీ నవ్వటంజనాలకి నచ్చదుఎంత సిగ్గూశరం లేనిదీమెమగవాడి తోడూ నీడా లేకపోయినాఏమాత్రం బాధ లేదు ఈమెకి… నోరంతా తెరిచి నవ్వేఒంటరి స్త్రీఎవరికీ నచ్చదుబోలెడంత సానుభూతి ప్రకటించేందుకు వచ్చినవాళ్ళుదాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారుఆ సొమ్ము మరోచోట పనికొస్తుందని! ఆ ఒంటరి స్త్రీఎంత అందంగా ఉంటుందో…ఆమె ముఖాన […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాల ఊడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

జ్ఞాపకాల ఊడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – దుద్దుంపూడి అనసూయ ఎప్పుడు మొలిచానో ఆమె చెబితే గాని నాకుతెలియనే తెలియదు కానీతన అమృత హస్తాలతో లాల పోయటం విన కమ్మని జోల పాటతోనిదుర పొమ్మని జోకొట్టటం గుర్తొస్తూ ఉంటుంది నడక నేర్చిన సంబరంతోనేను పరుగెడుతుంటేపడిపోకుండా పట్టుకుంటు కోట గోడలా నా చుట్టూచేతులు అడ్డు పెడుతూ పహారా కాయటంగుర్తొస్తూ ఉంటుంది వచ్చీ రాని నా మాటలకేనేనేదో ఘన కార్యం చేసినట్లు నా నత్తి నత్తి మాటలనే నారాయణ మంత్రంలా నాలాగే పలుకుతూ పదే పదే పది మందితో పంచుకోవటంగుర్తొస్తూ ఉంటుంది పాల బువ్వ […]

Continue Reading

రేపటి ఉషోదయాన(ఫ్రెంచ్ మూలం: విక్టర్ హ్యూగో, ఆంగ్లం మూలం: విక్టర్ హ్యూగో, తెలుగు సేత: ఎలనాగ)

రేపటి ఉషోదయాన ఫ్రెంచ్ మూలం: విక్టర్ హ్యూగో ఆంగ్లం: విక్టర్ హ్యూగో తెలుగు సేత: ఎలనాగ రేపటి ఉషోదయాన పల్లె తెల్లబారినప్పుడు నేను బయలుదేరుతాను నువ్వు నా కోసం నిరీక్షిస్తుంటావని తెలుసు అడవిలోంచి, పర్వతాలమీంచి ప్రయాణిస్తాను ఇక ఎంత మాత్రం నీకు దూరంగా ఉండలేను నా దృష్టిని నా ఆలోచనల మీద నిలిపి భారంగా నడుస్తాను చుట్టూ వున్న దేన్నీ పట్టించుకోకుండా ఏ చప్పుడునూ వినకుండా ఒంటరిగా, అజ్ఞాతంగా, వంగిన వెన్నుతో, చేతులను గుణకారపు గుర్తులాగా పెట్టుకుని […]

Continue Reading
Posted On :