image_print

అయినా సరే! (కవిత)

అయినా సరే! -బండి అనూరాధ చిగురించి పండి ఎండి రాలి..ఆకుల వంటి వారమే మనం కూడా. ఒక్కోసారి,ఒళ్ళు జలదరించే సత్యాల్లోకి తొంగిచూస్తేనిద్రపట్టని రాత్రుళ్ళలోకి వెళ్ళిపడతామేమోననిఈవలిగానే పట్టీపట్టనట్లుండిపోతాం. భ్రమల నేలలో అన్నీ బరువే అనుకునితేలికగా ఊపిరి తీసుకుంటూచెట్లనీడలో పడిన ప్రాణంలాతెరిపినపడుతూ… ఒక నిద్రకి, కలల చెట్లని పట్టుకెళ్ళివాడని పూలను కోసుకుంటూనిజంలా బ్రతికేస్తూ… వనాలలో వైనాలన్నీ పగటికి పూసివెర్రి నవ్వొకటి నవ్వుకుంటాం. రాలడం తెలియదుగా..ఎప్పుడో..!! ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా […]

Continue Reading
Posted On :

కారబ్బంతి చేను (కవిత)

కారబ్బంతి చేను -అనిల్ డ్యాని మట్టిదారి ముందు మనిషి కనబడడు పొగమంచు దట్టంగా గుండె జలుబు చేసినట్టు ఊపిరి ఆడని ఉక్కిరిబిక్కిరి తనం కుడివైపున ఏపుగా పెరిగిన తాడిచెట్ల నుంచి కమ్మగా మాగిన తాటిపళ్ళ వాసన ఎడమవైపున శ్మశాన వైరాగ్యపు సమాధులు సామూహిక బహిర్భూమి ప్రదేశాలు ప్రవహిస్తున్న మద్రాసు కాలవ నిండా దాని తవ్వకానికి నా పూర్వీకులు చిందించిన చెమట ఒంటిమీద కనీసం రెండైనా గుండీలుండని పల్చటి చొక్కా మోకాళ్ళ పైకి జారకుండా ఉన్న నిక్కరుకి మొలతాడే […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- పద్మశ్రీ విక్రమ్ సేథ్ (భారతీయ ఆంగ్ల కవి)

క ‘వన’ కోకిలలు – 18 :  పద్మశ్రీ విక్రమ్ సేథ్ (భారతీయ ఆంగ్ల కవి)    – నాగరాజు రామస్వామి నింగి, నేల, సముద్రాల సామరస్య సర్వైక్య శ్రావ్య గీతం నా సంగీతం – విక్రమ్ సేథ్. పద్మశ్రీ విక్రమ్ సేథ్ ప్రసిద్ధ భారతీయ కవి. నవలా కారుడు. యాత్రాకథనాల (travelogues) రచయిత. గొప్ప అనువాదకుడు. ఆంగ్లంలో సాహిత్య వ్యవసాయం చేసి విశ్వఖ్యాతి గడించిన కృశీవలుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ, ప్రవాసీ భారతీయ సమ్మాన్, WH […]

Continue Reading

అనుసృజన-ఒంటరి స్త్రీ నవ్వు(హిందీ మూలం: సుధా అరోడా) తెలుగు స్వేచ్చానువాదం: ఆర్ శాంత సుందరి

అనుసృజన ఒంటరి స్త్రీ నవ్వు హిందీ మూలం: సుధా అరోడా అనువాదం: ఆర్.శాంతసుందరి ఒంటరి స్త్రీదాచుకుంటుంది తన నుంచి తననేపెదవుల మధ్య బందీ అయిన నవ్వుని బైటికి లాగినవ్వుతుంది బలవంతంగాఆ నవ్వు కాస్తా మధ్యలోనే తెగిపోతుంది… ఒంటరి స్త్రీ నవ్వటంజనాలకి నచ్చదుఎంత సిగ్గూశరం లేనిదీమెమగవాడి తోడూ నీడా లేకపోయినాఏమాత్రం బాధ లేదు ఈమెకి… నోరంతా తెరిచి నవ్వేఒంటరి స్త్రీఎవరికీ నచ్చదుబోలెడంత సానుభూతి ప్రకటించేందుకు వచ్చినవాళ్ళుదాన్ని వెనక్కి తీసుకుని వెళ్ళిపోతారుఆ సొమ్ము మరోచోట పనికొస్తుందని! ఆ ఒంటరి స్త్రీఎంత అందంగా ఉంటుందో…ఆమె ముఖాన […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాల ఊడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత)

జ్ఞాపకాల ఊడలు (నెచ్చెలి-2023 పోటీలో ద్వితీయ బహుమతి పొందిన కవిత) – దుద్దుంపూడి అనసూయ ఎప్పుడు మొలిచానో ఆమె చెబితే గాని నాకుతెలియనే తెలియదు కానీతన అమృత హస్తాలతో లాల పోయటం విన కమ్మని జోల పాటతోనిదుర పొమ్మని జోకొట్టటం గుర్తొస్తూ ఉంటుంది నడక నేర్చిన సంబరంతోనేను పరుగెడుతుంటేపడిపోకుండా పట్టుకుంటు కోట గోడలా నా చుట్టూచేతులు అడ్డు పెడుతూ పహారా కాయటంగుర్తొస్తూ ఉంటుంది వచ్చీ రాని నా మాటలకేనేనేదో ఘన కార్యం చేసినట్లు నా నత్తి నత్తి మాటలనే నారాయణ మంత్రంలా నాలాగే పలుకుతూ పదే పదే పది మందితో పంచుకోవటంగుర్తొస్తూ ఉంటుంది పాల బువ్వ […]

Continue Reading

రేపటి ఉషోదయాన(ఫ్రెంచ్ మూలం: విక్టర్ హ్యూగో, ఆంగ్లం మూలం: విక్టర్ హ్యూగో, తెలుగు సేత: ఎలనాగ)

రేపటి ఉషోదయాన ఫ్రెంచ్ మూలం: విక్టర్ హ్యూగో ఆంగ్లం: విక్టర్ హ్యూగో తెలుగు సేత: ఎలనాగ రేపటి ఉషోదయాన పల్లె తెల్లబారినప్పుడు నేను బయలుదేరుతాను నువ్వు నా కోసం నిరీక్షిస్తుంటావని తెలుసు అడవిలోంచి, పర్వతాలమీంచి ప్రయాణిస్తాను ఇక ఎంత మాత్రం నీకు దూరంగా ఉండలేను నా దృష్టిని నా ఆలోచనల మీద నిలిపి భారంగా నడుస్తాను చుట్టూ వున్న దేన్నీ పట్టించుకోకుండా ఏ చప్పుడునూ వినకుండా ఒంటరిగా, అజ్ఞాతంగా, వంగిన వెన్నుతో, చేతులను గుణకారపు గుర్తులాగా పెట్టుకుని […]

Continue Reading
Posted On :

అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ(నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత)

అధిగమిస్తూ.. అంబరాన్ని చుంబిస్తూ (నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కవిత) – అవధానం అమృతవల్లి ఆమె ఇప్పుడు  అప్పుడు  పొరలు పొరలుగా విడిపోతూనే ఉంది బంధాలు భాధ్యతల చట్రంలో చెరుకు గడలా నలిగి పోతూనే ఉంది తీపిని పంచుతూ ఎందుకూ పనికిరాని పిప్పిలా మిగిలిపోతూనే ఉంది ఇంటా బయట గౌరవాన్ని నిలబెట్టుకోటానికి నిరంతరం గానుగెద్దులా తిరుగుతూనే ఉంది నిద్ర పొద్దులను తరిమేసి నిశితో స్నేహము చేస్తోంది.. అలిసిపోతున్న శరీరానికి పట్టుదల తైలాన్ని పూసి ముందడుగు వేస్తోంది.. […]

Continue Reading

గాయం రంగు (కవిత)

గాయం రంగు -బండి అనూరాధ బద్ధకం, మగతా, పలు మీమాంశల మధ్యగా కళ్ళుతెరవ చూస్తాను.లోపలెవరో నెగడుని రగిలించినట్లుకళ్ళ మంటలు; కొంచ మాగాక, పక్షులు ఇక ఊరుకోవు.ఒక కిటికీ పక్కగా జామచెట్టూ;మరో కిటికీ పక్కగా వేపచెట్టూ;గది మొత్తం, ఆ రెంటి పై తిరుగాడే పక్షుల భాషే! ఇక నిజంగా లేవబోతానా! అజ్ఞాత చిత్రకారులెవరో, రకరకాల అసంపూర్తి కాన్వాస్లని వదిలిపోయిన చోటులోనే తిరుగాడుతున్న రాత్రికల ఇంకానా కళ్ళలో సజీవచిత్రమై ఉంది. మరి పూర్తి మెలకువలో, అంతా అయోమయం.తెర మొత్తం నీలమూ తెలుపు బూడిదరంగు.ఎర్రని వృత్తంలో ప్రాణం. పశ్చిమంకి […]

Continue Reading
Posted On :

అమ్మ మాట— (కవిత)

అమ్మ మాట -లక్ష్మీ శ్రీనివాస్ నాలుగు గోడల మధ్య నుంచినలుగురి మధ్యలో నిలవాలన్ననలుగురిలో గెలవాలన్ననలుగురిని గెలిపించాలన్నానాలుగు అక్షరాలు నేర్చుకోవాలని  చెబుతూ ఉండేది అమ్మ!! నాలుగు అడుగులు వేయాలన్ననాలుగు రాళ్ళు పోగేయలన్ననలుగురిని సంపాదించు కోవలన్ననలుగురికి సాయం చేయాలన్న నాలుగు అక్షరాలు నేర్చు కోవాలనిచెబుతూ ఉండేది అమ్మ!! గుడి తలుపులు బడి తలుపులుఎప్పుడు ఎదురుచూస్తుంటాయినీ ఎదుగుదలకు తోడ్పడుతుంటాయిగుడి బడి తల్లి తండ్రులు లాంటి వాళ్ళనిమంచి కథలతో ఎన్నే నీతులు బోధిస్తూఎప్పుడు హితాన్ని మరవకూడదనిసత్ మార్గంలో పయనించాలనిపరుల ఘోషకు కారణం కాకూడదనిచెబుతూ ఉండేది అమ్మ!! గెలుపు ఓటములనుస్వేచ్చగా స్వీకరించమంటుఎదురయ్యే […]

Continue Reading
gavidi srinivas

మట్టి ప్రేమ (కవిత)

మట్టి ప్రేమ -గవిడి శ్రీనివాస్ కాసింత కాలం వెళ్ళిపోయాకగుండెలో దిగులు తన్నుకొస్తుంది. జ్ఞాపకాలు పిలుస్తున్నట్లుఊరిపొలిమేర పలవరిస్తున్నట్లుఇంకా సమయమౌతున్నట్లుగూటికి చేరుకోమనే సందేశంవంత పాడినట్లుమనస్సంతా భారంగా ఉంటుంది. కళ్ళలో పొలాలుకన్నీళ్ళలో అనుభవాలుఅనుబంధాలు దొర్లిఇప్పుడున్న చోట నిల్చోనీయవు. పక్షులు ఎంత దూరం కదిలినాగూటిని మరవనట్లుచూపులు ఇంటివైపేదుముకుతుంటాయి. ఉద్దేశం విశ్వమానవుడిగానేఅయినాకాలం పొరలు కదిలిన కొద్దీనా మట్టి వేళ్ళు లాగుతుంటాయి.నా మట్టి ప్రేమనా మూలాలికి  చేర్చుతుంది.ఇప్పుడు కుదురుగా ఉండలేనునా మట్టి పై అలా వాలేవరకూ. ***** గవిడి శ్రీనివాస్గవిడి శ్రీనివాస్  ఆంధ్ర విశ్వవిద్యాలయం విశాఖపట్నం నుండి ఎం.సి.ఏ.పూర్తి చేశారు.  సెయింట్ […]

Continue Reading
Kandepi Rani Prasad

చూస్తూ ఉరుకునేదే లేదు (కవిత)

చూస్తూ ఉరుకునేదే లేదు -డా. కందేపి రాణీప్రసాద్ సహనంగా ఉంటే చాతగాదని కాదుమౌనంగా ఉంటే మతాలు రావని కాదుఓపిక పట్టామంటే ఎదురు తిరగలేరని కాదుభరిస్తున్నామంటే పోరాడలేరని కాదు! నీ పరువెందుకు తీయటమని కావచ్చునీ మీద మిగిలిన ప్రేమ నమ్మకం కావచ్చునీలాగా దిగజారి మాట్లాడలేక కావచ్చునీలాగా అవినీతి వెంట నడవలేక కావచ్చు! అంతేకానీనువ్వేం చేసిన చెల్లుతుందని కాదునువ్వేం మాట్లాడినా నెగ్గుతుందని కాదుఅన్యాయం ఎల్లవేళలా కాపుకాస్తుందని కాదుకాలం కొండలా అడ్డు నిలబడిందని కాదు పదే పదే అవమానిస్తే వెనక్కి తోసేస్తేకావాలని గొప్పదనాన్ని తగ్గించి చులకన […]

Continue Reading

క’వన’ కోకిలలు- చైనాదేశ సనాతన కవిత్రయంలో మూడవ మహాకవి తు ఫు :(Tu Fu / Du Fu – 712–770)

క ‘వన’ కోకిలలు – 17 :  చైనాదేశ సనాతన కవిత్రయంలో మూడవ మహాకవి తు ఫు : (Tu Fu / Du Fu – 712–770)    – నాగరాజు రామస్వామి తు ఫు చైనా దేశపు 8వ శతాబ్ది మహాకవి. మానవతావాది. వాంగ్ లీ, లీ పో, తు ఫు లు తాంగ్ రాజుల నాటి సమకాలీనులు, మహాకవులు. వాళ్ళు వరుసగా బౌద్ధ, టావో, కన్ఫ్సూస్యన్ ధర్మాలను తమ కవిత్వంలో హత్తుకున్న కవిశ్రేష్ఠులు. తు […]

Continue Reading

అనుసృజన-ఒంటరి స్త్రీ శోకం(హిందీ మూలం: సుధా అరోడా) తెలుగు స్వేచ్చానువాదం: ఆర్ శాంత సుందరి

అనుసృజన ఒంటరి స్త్రీ శోకం హిందీ మూలం: సుధా అరోడా అనువాదం: ఆర్.శాంతసుందరి ఒకరోజు ఇలా కూడా తెల్లవారుతుందిఒక ఒంటరి స్త్రీభోరుమని ఏడవాలనుకుంటుందిఏడుపు గొంతులో అడ్డుపడుతుంది దుమ్ములాఆమె వేకువజామునేకిశోరీ అమోన్ కర్ భైరవి రాగం క్యాసెట్ పెడుతుందిఆ ఆలాపనని తనలో లీనం చేసుకుంటూవెనక్కి నెట్టేస్తుంది దుఃఖాన్నిగ్యాస్ వెలిగిస్తుందిమంచి టిఫిన్ ఏదైనా చేసుకుందామని తనకోసంఆ పదార్థం కళ్ళలోంచి మనసులోకి జారిఉపశమనం కలిగిస్తుందేమోననే ఆశతోతినేది గొంతులోంచి జారుతుందికానీ నాలుకకి తెలియనే తెలియదుఎప్పుడు పొట్టలోకి వెళ్ళిందోఇక ఏడుపు దుమ్ములా పేగులని చుట్టేస్తుందికళ్ళలోంచి […]

Continue Reading
Posted On :

ఇరాము లేని ఈగురం (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత)

ఇరాము లేని ఈగురం  (నెచ్చెలి-2023 పోటీలో ప్రథమ బహుమతి- డా.కె.గీత ఉత్తమ కవితా పురస్కారం పొందిన కవిత) – పెనుగొండ బసవేశ్వర్ సుక్కకు తెగవడ్డ నాయినతోటి అవ్వకు సుఖం ఎంత దక్కిందో తెల్వదు గానీ దాని సూరునుంచి ఐదు సుక్కలం కారినం శియకూర వండలేదని శిందులేసినోని చేతుల శీమునేత్తరు ఇడిషి శీపురు దెబ్బలు తిన్నా శీకట్లనే సూర్యుణ్ణి కొట్టిలేపేటి శీపురు అవ్వ బజార్ల బర్ల మంద ఎనకాల ఉరుక్కుంట తట్ట నిండ వేడివేడి తళతళ పెండ తీసుకొచ్చి […]

Continue Reading

దేహ దానం (కవిత) 

దేహ దానం     – రేణుక అయోల   ప్రమాదం వార్త చూపుని కప్పేసిన కన్నీటి జడివానలో హాస్పిటల్ ఎమర్జెన్సీ గది ముందు అలజడి అడుగు వేయలేక తడిసిన శిలలలై ఆరని కనురెప్పలు కింద నీటి బొట్టు కంట్లోనే తిరుగుతుంటే మెదడు చనిపోయింది అంటాడు డాక్టరు గుండె ఆగిందా ! అంటే గుండె వుంది కానీ మనిషి చనిపోయారంటే నమ్మలేని వైద్య భాష అవయవ దానం మరో అర్థం కాని ప్రశ్న గుండెని ఆపడం గుండు సూది గుచ్చుకున్ననొప్పి […]

Continue Reading
Posted On :

వృథాగా వలస పోతాను(ఫ్రెంచ్ మూలం: అబ్దుల్లతీఫ్ లాబి, ఆంగ్లం మూలం: ఆండ్రె నఫీస్ – సాహెలీ, తెలుగు సేత: ఎలనాగ)

వృథాగా వలస పోతాను ఫ్రెంచ్ మూలం: అబ్దుల్లతీఫ్ లాబి ఆంగ్లం: ఆండ్రె నఫీస్ – సాహెలీ తెలుగు సేత: ఎలనాగ నేను వృథాగా వలస పోతాను ప్రతి నగరంలో అదే కాఫీ తాగుతూ, ఉద్వేగం లేని సర్వర్ ముఖాన్ని చూసి మార్పు లేని పరిస్థితిని మౌనంగా అంగీకరిస్తాను పక్క టేబుళ్ల దగ్గరి నవ్వు సాయంత్రపు సంగీతాన్ని చెడగొడుతుంది ఒక స్త్రీ అంతిమంగా నిష్క్రమిస్తుంది నా పరాయీకరణను పక్కా చేసుకుంటూ వృథాగా వలస పోతాను నేను ప్రతి ఆకాశంలో […]

Continue Reading
Posted On :

అనఘతల్లి (కవిత)

అనఘతల్లి -శింగరాజు శ్రీనివాసరావు ప్రభానుడు తన ప్రతాపాన్ని ప్రజ్వలింప చేస్తున్నాడు రోహిణి వచ్చిందేమో రోళ్ళు పగిలేటంత భగభగలు సగం కాళ్ళు మాత్రమే కప్పుతున్న పాదరక్షలు వడివడిగా అడుగులు వేస్తూ కదిలి పోతున్నాయి నడినెత్తి మీద మెడలు విరిగేటంతటి భారం మోయకపోతే పొయ్యిలో పిల్లి లేవదు మరి చేతులు మాత్రం ఖాళీగా ఉన్నాయనుకోవడానికి లేదు నవమాసాల భారం నేలను తాకి చంకకు చేరింది బుడి బుడి అడుగులు మరో చేతికి అలంకారమాయె కొంగు చుట్టూచేరి చేతనున్న వాడికి గొడుగైతే […]

Continue Reading

ఊ…ఊ అంటోంది పాప (కవిత)

ఊ…ఊ అంటోంది పాప   -వసీరా ఒక స్వప్నంలో తేలుతోంది పాప పడుకున్న మంచం కల మీద తేలే మరో కలలాగ ఉన్నది మంచం మీద పడుకున్న పాప చిన్నిపాప నిద్రపోతోంది మంచు నిద్రపోయినట్లు మంచు ఉదయం సరస్సు నిద్రపోయినట్లు సరస్సు మీద లేత ఎండ నిద్రరపోయినట్లు మేలిమి ఎండలో సరస్సులోని కలువ నిద్రపోయినట్లు అలా పడుకుని ఉన్న పాప శరీరం బహుశ ఒక స్వప్నం తన చిన్నిశ్వాసలోంచి పాపలోకి ఓ స్వప్నం ప్రవేశించి విస్తరిస్తోంది బేబీ నిశ్వాసంలోంచి […]

Continue Reading
Posted On :

నా నీడ తప్ప (కవిత)

నా నీడ తప్ప -హేమావతి బొబ్బు నా నీడ తప్ప నేను నాకు కనిపించడం లేదు నా లోన ఏదో  సందిగ్ధత అది పెరిగి పెద్దదై చివురు నుండి మ్రానుగా తుఫానుగా మారుతుంటే తుమ్మెదల ఝూంఝూంకారం నాథoగా నాథా కారంగా లోకాన్నంతా అలుముతుంటే విషాదమో ఆనందమో విశదీకరించలేని స్థితి ఛిటికేనవ్రేలుని పట్టుకొన్న చిన్నారి కన్నులలోకి  జారుతున్న కన్నీళ్ళు ఏదో తరుముకొస్తున్నట్లు అంతా వేగంగా కదలిపోతుంటే, ……..ఇక్కడే ఒక్క క్షణం స్తబ్దంగా మిగిలిపోవాలని మారే కాలాన్ని గుప్పెటన బంధించి నీ కౌగిలిలో నిశ్శబ్దముగా ఒదిగి పోవాలని నీ దాహాన్ని తీర్చే నీటి బొట్టునై నీ హృదయాన్ని చేరాలని ……. ***** హేమావతి బొబ్బునేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల  తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా […]

Continue Reading
Posted On :

క(అ)మ్మతనం (కవిత)

క(అ)మ్మతనం  -డా. మూర్తి జొన్నలగెడ్డ కలలోనైనా ఇలలోనైనా కమ్మగ ఉండేదే అమ్మతనం కన్నుల లోనైనా మిన్నుల లోనైనా వెలుగులు నింపేదే ఆ తల్లి పదం గోరు ముద్దల నాడూ ఆలి హద్దుల నేడూ అలసటే ఎరుగని ఆ నగుమోము చూడు అస్సలంటూ చెరగని ఆ చిరునవ్వు తోడు అలసి సొలసిన చిన్నారినీ అలుక కులుకుల పొన్నారినీ అక్కున చేర్చేటి ఆ అమ్మ తోడు అక్కర తీర్చేటి ఆ తల్లి తోడు ఎవరు తీర్చేది కాదు ఆ తల్లి […]

Continue Reading

ఉరి తీయబడ్డ అక్షరాలు (కవిత)

ఉరి తీయబడ్డ అక్షరాలు   –శిలాలోలిత చెంచా గిరీలు నడుస్తున్న కాలమిది సరిహద్దుల మీద నరుకుతున్న కాళ్లు గుండె ఒక్కటే మనుషులొక్కటే మానవత్వం ఒక్కటే అనే విశ్వ మానవ ప్రేమికులు రచన ద్రష్టలు అందరూ అందరూ కలగలవలనే కాంక్షా తీరులు(హితులు) సంకుచిత హృదయాలతో భూమి నుంచి చీల్చుతున్న గండ్రగొడ్డల ధ్వనులు అరమరికలు లేని స్వేచ్ఛ ధోరణలతో ప్రపంచ కవుల తీరొక్కటే అని ఎలుగెత్తుతుంటే కీర్తిలు, భుజకీర్తుల కాలమైపోయింది కొంత _____(?) కొంత నష్టం ఎంపిక లోపాలు లోపాయి కారీతనాలు […]

Continue Reading
Posted On :
gavidi srinivas

సంపూర్ణం…! (కవిత)

సంపూర్ణం…! -గవిడి శ్రీనివాస్ దాహాలు అసంపూర్ణంగానే ఆరంభమౌతాయి. ఆలోచనల సంఘర్షణలోంచి ఒక దారి తళుక్కున మెరుస్తుంది. ఒక లక్ష్యం నిద్రలేని క్షణాల్ని వేలాడదీస్తుంది. జీవితం ఒక్కో పాదముద్రను చెక్కుతూ నిరాడంబరంగా విజయానికో చిరునవ్వు విసురుకుంటూ ముందుకు పోతుంది. ప్రతి క్షణమూ తిరిగిరానిదే. ఇక్కడ ఛేదించాల్సినవి చేయాల్సినవి కొన్ని వుంటాయి. అలా అలా సంతోషాల్ని లిఖిస్తూ కాస్త ముందుకు జరగాలి. అసంపూర్ణం నుంచి సంపూర్ణానికి ఒక్కో అడుగు తొడుగుతూ ఒక్కో మైలురాయి లో చిహ్నాల్ని కొన్ని తీపి గురుతులు […]

Continue Reading

నల్లబడిన ఆకాశం (కవిత)

నల్లబడిన ఆకాశం – డా॥కొండపల్లి నీహారిణి కొంత చీకటి తలుపు తెరుచుకొని వచ్చాక నిన్నటి కారు మేఘం క్రోధమంతా మరచినప్పుడు కొత్త దారిలో చూపుగాలానికి చిక్కుతుంది మసక బారిన దృశ్యాలు కంటి తెరపై టచ్చాడి ఉచ్చులు విడదీసుకుంటూ పెనవేసుకుంటూ గది మొత్తం కథలా కదలాడుతుంది పెదవి విరిచిన ముసలినవ్వొక్కటి నువ్వు పుట్టినప్పటి సంగతులు గతితప్పనీయని మజిలీలనుకున్నది మబ్బులు కమ్మిన నింగి వెనుక ఏమి దాగుందో చీకటిలో కలవాలనే హృదయ జ్యోతులు వ్యధాభరిత వృద్ధాప్యానికి పెనుసవాళ్ళనేమీ విసరవు సన్నగిల్లిన […]

Continue Reading

ఔర్ చాలీస్ బాకీహై-

ఔర్ చాలీస్ బాకీహై- -డా||కె.గీత ఇక ఆ తలుపులు ఎంత బాదినా తెరుచుకోవు- తలపులు మాత్రం ఇటువైపు రోదిస్తూ ఇక ఆ ఫోను మోగదు- పాతవేవో సంభాషణలు చెవుల మోగుతూ ఆ వేళ్ల నించి మెసేజీ రాదు- దు:ఖం ఇంకిపోయిన బాధాత్మకవేర్లు గుండెలోతుల్లో పాతుకుపోతూ ఔర్ చాలీస్ బాకీహై- ఔర్ చాలీస్ బాకీహై- ఇంకా వినిపిస్తూనే ఉంది.. అరవయ్యేళ్ళకే తనువు పరిమితం కాదంటూ అనేవారుగా ఔర్ చాలీస్ బాకీహై- నిజమనిపించేంత ఆశాపాశం- తల్చుకున్నప్పుడల్లా ఎంత బావుండేదీ- ఎప్పుడో […]

Continue Reading
Posted On :

ఒక పరివ్రాజక కల (కవిత) 

ఒక పరివ్రాజక కల – శేషభట్టర్ రఘు నా కాలంలో ఆడపిల్లలు గోరింటాకుతో తిరిగినట్టునా మటుకు నేను గొప్పోడిననే ఖ్యాతితో తిరగాలనికలగనేవాడ్నిఅలా అనుకోవటంలోనే ఒక గమ్మత్తయిన మత్తుందనికలలేవీ లేనివాడ్ని సన్యాసి అంటారనివాడికి అడవులు కొండల్లో జపమాలలు తిప్పటమేపనిగా ఉంటుందని అనుకునే వాడ్ని అప్పుడప్పుడూ కన్న కలలన్నీ గుట్టపోసి చూసేవాడ్నిఏం చేయాలో తోచక మళ్ళీ బుర్రలోనే దాచేవాడ్ని బతకటం అంటే జీవితం చేసే నానా రకాల అలజడినిసితారు తీగల్లా సవరించటం కాదు కనకనా ఖ్యాతి కలలు కూడా గడ్డంలాగే నెరిసిపోయాయిఅప్పుడు పిల్లల నాజూకు […]

Continue Reading
Posted On :

ఓపెన్ సీక్రెట్ (కవిత)

ఓపెన్ సీక్రెట్  -నిర్మలారాణి తోట నాకు తెలుసు నాకే కాదు సమస్తనారీలోకానికీ తెలుసు నీ చూపుడు వేలెప్పుడూ నావైపే చూస్తుందని నే కట్టే బట్టా నా పెరిగే పొట్టా అన్నీ నీకు కాలక్షేపసాధనాలే ఆక్షేపణల శోధనలే.. మడతపడ్డ నాలుగువేళ్ళు నిన్నేమని నిలదీస్తున్నాయో నీకెప్పుడూ కనిపించదు నీ కురుచ బుద్దికి నా దుస్తులు పొట్టివైపోతాయి నీ మైక్రోస్కోపిక్ చూపులకు ఆరు గజాల చీరకూ చిల్లులు పడతాయి నువ్వెప్పుడూ “నేను” కాని మాంసపుముద్దనే చూడగలవెందుకో.. చిత్రంగా అనిపిస్తుంది మేము చేసిన బొమ్మలే మమ్మల్ని బొమ్మల్నిచేసి […]

Continue Reading
Posted On :

అనుసృజన-సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్):

అనుసృజన సూఫీ సూక్తులు (రూమీ, హఫీజ్): అనువాదం: ఆర్.శాంతసుందరి ప్రతి ఒక్క వాక్యం ఎంతో అర్ధవంతం. వేదాంత భరితం. సూఫీల నిరంతర అన్వేషణ సంఘర్షణానంతరం వారి మనసులో నిలిచిన భావ సంపద. ఇది మతాతీత మైన అనుభవసారం. 1. నాకు కావాలనుకున్న దాని వెంట నేను పరిగెత్తేటప్పుడు రోజులు ఒత్తిడితో, ఆత్రుత పడుతూ గడిచినట్టనిపిస్తుంది. కానీ నేను సహనం వహించి కదలకుండా కూర్చుంటే, నాకు కావాల్సింది ఏ బాధా లేకుండా నా దగ్గరకు ప్రవహిస్తూ వస్తుంది. దీన్ని నుంచి నేను అర్థం […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- చైనా దేశ సనాతన మరో మహాకవి లీ పో ( 701 – 762 )

క ‘వన’ కోకిలలు – 16 :  చైనా దేశ సనాతన మరో మహాకవి లీ పో ( 701 – 762 )    – నాగరాజు రామస్వామి సాహిత్య స్వర్ణ యుగంగా ఖ్యాతికెక్కిన తాంగ్ రాజుల కవిత్రయం (వాంగ్ వీ, లీ పో, తు ఫు) లో రెండవ వాడు లీ పో. చైనా సంప్రదాయ సాహిత్యాన్ని కొత్త ఎత్తులకు కొని పోయిన మహాకవి. అతని కవిత్వం కాల్పనిక ప్రభ (Romantic brilliance). అతని వచన రచన నెమిలి నడకల నయగారం ( peacock poetry). ఆనాటి “మూడు అద్భుతాలు” […]

Continue Reading

దేహచింతన (కవిత)

దేహచింతన   –చల్లపల్లి స్వరూపారాణి నిజానికి మీకో దేశాన్నే యివ్వాలనుకున్నాదేహాన్నిచ్చి పాఠ్య పుస్తకం అవుతున్నా చచ్చినాక పూడ్చుకోడానికి ఆరడుగుల నేలకోసం యుద్ధాలు చేసే సంతతివైద్య విద్యార్దీ!యిది దేహం కాదు, దేశం ఈ దేహాన్ని జాగ్రత్తగా చదువు!దేశం అర్ధమౌతాది పేగుల్లో అర్ధశాస్త్రముంది చూడు చర్మం సుకుమారి కాదు వెన్నపూసల మర్దనా నలుగుపిండి స్నానం యెరగదు అయినా కళ్ళల్లో ఆకాంతి యెక్కడిదో ఆరా తియ్ !యిక గుండెకాయ గురించి యేమి చెప్పను!యెన్ని కొంచెపు మాటలు రంపంతో కోశాయో!ఆ గాయాలే సాక్ష్యం  వూపిరితిత్తులు నవనాడులు కాసింత గౌరవం కోసమే కొట్టుకునేవి ఈ దేహానికి తలకంటే పాదాలే పవిత్రం రాళ్ళూ రప్పల్లో చెప్పుల్లేకుండా తిరుగాడిన కాళ్ళు యెదురు దెబ్బలతో  నెత్తురు […]

Continue Reading

జీవితం(ఆంగ్లం మూలం: క్యారీ లా మోర్గన్ ఫిగ్స్ తెలుగు సేత: ఎలనాగ)

జీవితం ఆంగ్లం: క్యారీ లా మోర్గన్ ఫిగ్స్ తెలుగు సేత: ఎలనాగ 1 ఆనందపు క్షణం, ఆర్తి నిండిన ఘడియ ఎండ కాసిన ఒక దినం, వాన కురిసిన ఏడు రోజులు శాంతి విరిసిన పక్షం, ఘర్షణ ముసిరిన ఒక మాసం ఇవన్నీ కలిస్తే జీవితమౌతుంది 2 డజను శత్రువుల మధ్య నిజమైన స్నేహితుడొక్కడు, మూసిన ఇరవై గేట్లను మరిపిస్తూ తెరిచివున్న ద్వారాలు రెండు భోగభాగ్యాల సింహాసనం, ఆపైన పాడుకాలపు పట్టాకత్తి మిత్రులారా! ఇవన్నీ కలిస్తే జీవితం […]

Continue Reading
Posted On :

సముద్రం (కవిత)

సముద్రం   -వసీరా ఆకాశాన్ని నెత్తి మీదమోస్తూ సముద్రం ఒక చేపగా మారి ఈదేస్తుంది భూతలం మీద సముద్రం ఎగురుతుంది పక్షిగా మారి నీటిరెక్కలతో నీలమేఘమైపోయి సూరీడికి ఆవిరి స్నానం చేయించి సముద్రమే బడి వరండాలోంచి బయటపెట్టిన చిన్నారుల అరచేతుల మీద చినుకులై మునివేళ్లమీద విరిసిన సన్నజాజులై సముద్రమే చిన్నారుల ముఖాలమీద మెరుపులై ముఖపుష్పాల మీంచి ఎగిరే నవ్వుల సీతాకోక చిలుకలై సముద్రమే సముద్రమే బడిగంటమోగినంతనే చినుకుల మధ్య కేరింతలతో మారుమోగే గాలికెరటాలై సముద్రమే తన సొట్టబుగ్గల మీద […]

Continue Reading
Posted On :
gavidi srinivas

గాయం పాడిన గేయం (కవిత)

గాయం పాడిన గేయం -గవిడి శ్రీనివాస్ ఉండుండీ ఒక్కసారీ దుఃఖ దొంతరల్లోకి జారిపోతాను. ఎప్పటికప్పుడు వ్యూహాలు పదును పెట్టడం కన్నీటిని చెక్కడం సుఖమయ ప్రయాణాలుగా మల్చడం. లోతుగా జీవితాన్ని తరచిచూడటం తడిమి చూడటం ఒక లక్ష్యం వైపు దూసుకు పోవటం నిరంతర శ్రమలోంచి దారుల్ని వెలిగించటం తృప్తిని ఆస్వాదిస్తూ అలా అడుగులు సాగుతుంటాయి . నిద్రలేని రాత్రుల్ని గాయం పాడిన గేయం ఓదార్చుతుంది . మౌన ప్రపంచంలోంచి లేచి భావాలు భాషిల్లుతుంటాయి . ఇక్కడ విషాదమేమిటంటే పరిగెత్తేవేగానికి […]

Continue Reading

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-5

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-5 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)

క ‘వన’ కోకిలలు – 15 :  చైనా దేశ సనాతన మహాకవి వాంగ్-వీ (701-761 C.E.)    – నాగరాజు రామస్వామి మానవ మస్తిష్కాన్ని నిదుర లేపేది కవనం, మనిషిని పరిపూర్ణున్నీ చేసేది సంగీతం. – కన్ఫూస్యస్. చైనా సాహిత్య సంప్రదాయం 3000 సంవత్సరాల సనాతనం. 4 వ శతాబ్దానికి చెందిన చైనాదేశ సాహిత్య జాతిపిత (Father of Chines poetry) క్యూయాన్ (Qu Yuan), 15 వ శతాబ్దపు తాత్విక కవి కన్ఫూస్యస్ (Confucius) ప్రసిద్ధలేకాని, సనాతన చైనా మహా కవులుగా గణన పొందిన వారిలో అగ్రగణ్యులు 8వ శతాబ్దికి చెందిన కవులు వాంగ్-వీ (Wang Wei), లీ-పో (Li […]

Continue Reading

కొత్త లోకం (కవిత)

కొత్త లోకం   –శిలాలోలిత రంగును కోల్పోయి కొల్లగొట్టబడ్డ నీటి మొహం కెరటాలతో తలబాదుకుంటోంది ఆకాశం ఏ రంగు చొక్కాను తొడిగితే అదే తన రంగనుకునే మురిపెం త్రివేణీ సంగమంలో కనిపించే రంగుల తేడా అండమాన్ దీవుల్లో మెరిసే ముదురు నీలం అంగీ ఆకుపచ్చని నలుపుల భ్రమల చెట్టు చుట్టూ తిరుగుతుంటుంది — ఆమె కూడా అంతే కోల్పోయిన బతుకు రంగుల్ని ఏరుకొనే ప్రయత్నమే బతుకంతా ఆమెకైతే ఉచితంగా గాయాల ఎర్ర రంగు కమిలిన శరీరాల పెచ్చులూడిన తనం […]

Continue Reading
Posted On :

మరణదుఃఖం(ఆంగ్లం మూలం: డబ్ల్యు. ఏచ్. ఆడెన్ తెలుగు సేత: ఎలనాగ)

మరణదుఃఖం ఆంగ్లం: డబ్ల్యు. ఏచ్. ఆడెన్ తెలుగు సేత: ఎలనాగ అన్ని గడియారాలను ఆపేయండి టెలిఫోన్ తీగను తెంపేయండి రుచికరమైన బొమికను నోట్లో పెట్టుకున్న కుక్కను మొరగనివ్వకండి పియానోల శబ్దాన్ని ఆపు చేయండి బ్యాండుమేళపు ధ్వనిని తగ్గించి శవపేటికను బయటికి తీసుకురండి ఏడ్చేవాళ్ళను ఇవతలికి రానీయండి విమానాలు దుఃఖంతో పైన చక్కర్లు కొడుతూ “అతడు చనిపోయాడు” అనే సందేశాన్ని ఆకాశంలో రాయనీయండి కపోతాల తెల్లని మెడల చుట్టూ కట్టండి మెడపట్టీలను ట్రాఫిక్ పోలీసు నల్లని చేతితొడుగులను తొడుక్కోనివ్వండి […]

Continue Reading
Posted On :

అమృత వాహిని అమ్మే కదా (పాట)

అమృత వాహిని అమ్మే కదా (పాట) -డా||కె.గీత ఆనందామృత క్షీరప్రదాయిని అమ్మే కదా అనురాగాన్విత జీవప్రదాయిని అమ్మే కదా ఇల్లాలై ఇలలో వెలసిన ఇలవేలుపు కదా జో లాలై కలలే పంచిన కనుచూపే కదా కడలిని మించే కెరటము ఎగసినా కడుపున దాచును అమ్మే కదా- ఉరుము మెరుపుల ఆకసమెదురైనా అదరదు బెదరదు అమ్మే కదా తన తనువే తరువై కాచే చల్లని దీవెన అమ్మే కదా జీవితమే ఒక ఆగని పోరాటం ఆశనిరాశల తరగని ఆరాటం […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి -డా. టి. హిమ బిందు జాబిల్లి చెంత వెన్నెల రేయి చల్లనిదే.. నిదుర ఒడిలో జోల పాడే రేయి మధురమైనదే ఒంటరి మనసులకు నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే ఒంటరి ప్రయాణంలో గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే అస్వస్థతలో తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే ఆశయాల సాకారంలో సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే… కోప తాపాల నడుమ కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే… ప్రేమ తోడులో ఊసులాడు రేయి ఆనంద నిలయమే…. ఎన్ని రేయిలయినా ప్రతి రేయి ప్రత్యేకమే.. ప్రతి ఉదయం కొత్త ఆశల ఉషోదయమే…. ***** డా. టి. హిమ బిందురంగారెడ్డి జిల్లాలో ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నాను. స్వస్థలం భద్రాచలం. 2005 సం. లో కాకతీయ యూనివర్సిటీ , వరంగల్ లో పర్యావరణ శాస్త్రంలో నీటి కాలుష్యం పై పీ. హెచ్. […]

Continue Reading
Posted On :
Komuravelli Anjaiah

వెంటాడే కల (కవిత)

వెంటాడే కల -కొమురవెల్లి అంజయ్య వెంటాడే కల ప్రశ్నిస్తుంది చేతగానితనాన్ని నిలదీస్తుంది సోమరిపోతు వైఖరిని మొండి బారకుండా, తుప్పు పట్టకుండా ఎప్పటికప్పుడు నూరుతుంది కొత్తగా దారిలో నుంచి పక్కకు జరుగకుండా చూస్తుంది కలలెన్నో ముల్లె కట్టుకొని ఉంటాయి అన్నీ కుమ్మరిస్తాం, ఏరుతాం నచ్చినవి కొన్ని చొక్కాజేబులో దాచుకుంటాం గుండెకు దగ్గరగా విత్తనం ఏదైనా కనిపిస్తే భూమిలో నాటి నీళ్ళు పోసి పెంచుతాం రాళ్ళల్లో రత్నాన్ని మెడలో ధరిస్తాం వెంటాడే కల సాకారం కోసం నా చెమటతో నా […]

Continue Reading

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-4

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-4 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :

స్తబ్ధత అడుగున…(హిందీ మూలం: అమృత భారతి ఆంగ్లం: లూసీ రోజెన్ స్టీన్ తెలుగు సేత: ఎలనాగ)

స్తబ్ధత అడుగున… హిందీ మూలం: అమృత భారతి ఆంగ్లం: లూసీ రోజెన్ స్టీన్ తెలుగు సేత: ఎలనాగ ఒక మట్టిపెళ్ళలా నన్ను విసిరేశాడతడు నాకొక ఆత్మ ఉందనీ, నేను జీవం ఉన్న మనిషిననీ తెలియదతనికి అలా మట్టిపెళ్ళలా నన్ను తన మార్గంలోంచి నా మార్గంలోకి విసిరేస్తూ పోయాడు నా తోవ నిర్లక్ష్యానికి గురైంది సొంతమార్గంలో ప్రయాణిస్తూ పోయాను నేను ప్రతిసారీ నాలోని ఒక ముక్క విరిగి పడిపోయింది కొంత మోహం, సుఖం పట్ల కొంత వ్యసనం, కొంత […]

Continue Reading
Posted On :

ఆ చిరునవ్వు ఆగిపోయింది (కవిత)

ఆ చిరునవ్వు ఆగిపోయింది -పారుపల్లి అజయ్ కుమార్ మనిషి ఎంత ఎత్తు ఎదిగి  ఏం లాభం ? మనసులో మాలిన్యాన్ని నింపుకొని ……. ఎంత చదువు చదివి ఏం ప్రయోజనం ? సంస్కారం అన్నది లేకపోయాక …… కత్తితో పొడిస్తేనో, తుపాకీతో కాలిస్తేనో హత్యా ? మాటలను తూటాలుగా పేల్చి మనసును శకలాలుగా చేయటం హత్య కాదా? ఎన్నో గుండెలపై స్టెతస్కోప్ ను పెట్టి హృదయ స్పందనలను విని ప్రతిస్పందించే గుండెలో హేళనగా, అసహ్యకరమైన రాతల గునపాలు […]

Continue Reading
gavidi srinivas

పల్లె పిలుస్తోంది…! (కవిత)

పల్లె పిలుస్తోంది…! -గవిడి శ్రీనివాస్ చిగురుటాకుల్లో  వెన్నెల చూపుల్లో తడిసిలేలేత గాలులతో మురిసి పల్లె నిండుగా పులకరిస్తోంది. చిన్ని సరదాల్ని సూర్య కిరణాల్ని వొంపుతూముఖం లోంచి ఆనందాలు ఉదయిస్తున్నాయి. ఆరుబయట అట్లానేచిరు నవ్వులు వేచివున్నాయి. పల్లెతనం అమ్మతనం ఎంచక్కాఆప్యాయంగా నిమురుతున్నాయి. వేసవి అయితే చాలుపిల్లలు పల్లెకు రెక్కలు కట్టుకునిఎగురుతున్నారు. మామిడి చెట్ల నీడలోజీడి చెట్ల కొమ్మల్లోఅడుగులు వడివడిగామురిసి పోతున్నాయి. మట్టి పరిమళాల్ని అద్దుకునిమంచు బిందువుల్ని పూసుకునిఎగిరే పక్షుల వెంటఆనందాలు సాగిపోతున్నాయి. కరిగిపోతున్న కలల్ని ఎత్తుకునినా పల్లెలో వాలిపోతాను. దోసిళ్ళలో చిరు నవ్వుల్నివెలిగించుకునిఅలసిన క్షణాల నుంచీఅలా సేదదీరుతుంటాను. ***** గవిడి శ్రీనివాస్గవిడి […]

Continue Reading

మధ్య తరగతి మకరందం (కవిత)

మధ్య తరగతి మకరందం -ఎజ్జు మల్లయ్య అమ్మ నేర్పిన తొలి పలుకుల నుంచి అమ్మ ఒడిలో పడుకున్న వెచ్చని నిద్ర నుంచి అమ్మ మోసిన కట్టెల మోపు నుంచి పాత బట్టలకు కుట్టేసిన సూది దారం నుంచి అమ్మ చేసే పరమాన్నం తిన్న పరమానందం నుంచి నాన్న వాడిన ఉల్లి-బాడిష నుంచి నాన్న చెక్కిన పళుగొర్రు నుంచి నాన్న దున్నిన గుంటిక వరుసల్లోంచి నాన్న పేర్చిన బండి పల్గడి దబ్బల నుంచి నాన్న అల్లిన పుల్జరితట్ట నుంచి […]

Continue Reading
Posted On :

మర్చిపోతున్నారు (కవిత)

మర్చిపోతున్నారు -లక్ష్మీ శ్రీనివాస్   అమ్మ పాలు వదిలిఅమ్మకం పాలు రుచి చూచినప్పుడేఅమ్మ భాషను మరిచి ..అమ్మకం భాషకు బానిస అయ్యారు!స్వేచ్ఛగా తెలుగు భాషనుమాట్లాడడానికి మొహం చాటేసుకుంటూ పరాయి భాషను బ్రతికిస్తూగొప్పగా బ్రతుకుతున్నామనిఅనుకొంటున్నారు కానిబ్రతుకంతా బానిసేనని మర్చి పోయారు !! నేడు పరాయి భాష కోసంప్రాకులాడుతున్న వాళ్లంతావిదేశాలకు పారిపోయికన్న వాళ్ళను అనాధలుగా చేసివాళ్ళ కన్నీటికి కారణమవుతున్నారుతెలుగు జాతి ఆత్మ గౌరవానికితెలుగు భాష మనుగడకు భంగం చేకూరుస్తున్నారుచీకటికి వెలుగు కరువైనట్టుతెలుగుకి తెలుగువాడు మరుగౌతున్నాడు!! పెద్ద పెద్ద చట్ట సభలలోసూటు బూటు వేసుకొనిఅర్ధం కాని పదాలతోఫ్యాషన్ […]

Continue Reading

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-3

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-3 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :

జవాబు జాడ చెప్పడం లేదు… (కవిత)

జవాబు జాడ చెప్పడం లేదు… -చందలూరి నారాయణరావు నా కథలో అడుగుదూరంలో ఓ కొత్త పాత్ర నడుస్తున్న చప్పుడును దగ్గరగా విన్న ఇష్టం కలకు ప్రాణంపోసి…. ప్రవహించే ఊహగా పరిగెత్తె ఆశగా ఎంత వెతికినా నడక ఎవరిదై  ఉందన్న ఒక్క ప్రశ్నకు ఏ క్షణం జవాబు జాడ చెప్పడం లేదు. నెర్రెలు బారిన మోముతో పొడిబారిన కళ్లతో ఏనాడో పుట్టి పెరిగిన ఈ రహస్యమో గుండెలో దాచుకున్న సత్యంగా ఏ గాలికి కొట్టుకురావాలో? ఏ వరదకు నెట్టుకురావాలో? […]

Continue Reading
T. Hima Bindu

తానే (కవిత)

తానే -డా. టి. హిమ బిందు నిస్వార్ధపు లాలిత్యం కురిపించే తల్లీ తానే దూరంగున్నా మమతలో హక్కు కోరే కూతురూ తానే ప్రేమకు సర్వం ధారపోసే అపూర్వం తానే చిలిపి అల్లర్లున్నా కలిమి లేమిలో తోడుగ నిలిచే చెల్లీ తానే పోటీ కొచ్చినా కడుపులో పెట్టుకు చూసే అక్కా తానే సోపతి అనుకునే పతికి సహధర్మచారిణీ తానే అలుపెరగని పతికి ఆలంబన తానే సకలం నీవే అనే పతికి పట్టపు రాణీ తానే కాలం కలిసి రాక […]

Continue Reading
Posted On :

పెదాలు చీకటి పడి (కవిత)

పెదాలు చీకటి పడి – శ్రీ సాహితి మధ్యలో ఓ పేజీలో మాటేసిన ఓ వాక్యం కవాతుకు నిద్ర లేని రాత్రులు తూర్పార పట్టినా గుండెకెత్తలేని కలకు పోగైన జ్ఞాపకాలు నిద్రలో నల్లగా పొంగి పొర్లి పట్టపగలే పెదాలు చీకటి పడి పలుకు స్పర్శలేక ఆకలి కళ్ళు పాత మనసువైపు తీపిగా చూస్తుంటే కొత్త ఆకలికి పాత శరీరంలో లేని రుచి ఉంటుందా? ***** సాహితి -మా ఊరు అద్దంకి, ప్రకాశం జిల్లా, (ఆంధ్రప్రదేశ్.) నేను ప్రస్తుతం […]

Continue Reading
Posted On :
subashini prathipati

నీకు నాకు మధ్యన (కవిత)

నీకు నాకు మధ్యన -సుభాషిణి ప్రత్తిపాటి అప్పుడెప్పుడో… దశాబ్దాల క్రితంఏడేడు జన్మల బంధంనీది నాది అనుకుంటూ…అడుగులో అడుగు వేసినప్పుడుమన మధ్యన ఏముంది?? మహా గొప్పగా చెప్పడానికి!తొలి వలపులతహతహల చెర వీడిన మలి అడుగుల్లో …మది తలుపులేవో మెల్లగా తెరిచాక కదాఅగాధాల లోతులు తెలిసిందికర్కశపు జాడలు చూసింది కన్నీటి వ్యథ ఎదురైంది అప్పుడు మన నడుమదట్టమైన గాజు తెరలుమన నీడలే మనకు శత్రువులైఅనిశ్చితంగా కదలాడేవి! గదిలోపలి గోడలు బీటలు వారిన ఇన్నేళ్ళకు,నాకర్థమయింది,కాలంతో పాటు మంచులా కరిగింది మన మధ్యన ఇన్నాళ్లూ పేరుకున్న *నిశ్శబ్దమని*! శాబ్దికమయినాకే తెలిసిందిహృదయం రవళిస్తుందని, అదేమిటోఁ…. ముసురుకున్న హృదయాకాశంకరుణావృష్టిని ధారపోస్తే […]

Continue Reading

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-2

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-2 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :

నెల పండుగ (కవిత)

నెల పండుగ – డా॥కొండపల్లి నీహారిణి రాతపూతల్లో కవి దోగాడి భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను తనతో తెచ్చుకున్న జాతి అంతా నాలుగు రోజుల గుండె బరువు కన్నీటి మడుగులో కడిగి దింపలేని ఇరుకును మనసు గోడలకు తెలియని కడుపుదేనని ఐదు దశాబ్దాల నిశ్శబ్ద క్షుత్తు నొప్పి నుండి దాటిరాలేని బతుకు భ్రమ భ్రమలు బతుకైనప్పుడు దాటిరాగల […]

Continue Reading
gavidi srinivas

కొన్ని పరిమళాలు (కవిత)

కొన్ని పరిమళాలు -గవిడి శ్రీనివాస్ నలుగురితో  మాట్లాడుకోవటంపక్షుల కిలకిల రావాలు వినటంవనాలు పచ్చని తోరణాలు కట్టటంమొగ్గలు వీడి గాలితో పలకరించటంగాలి చేరి హృదయాలు వికశించటం ఇసుక తెన్నెల్లో  కూర్చునిఎగసే కెరటాల్ని చూడటం చుట్టూ ఊగే దృశ్యాల్నికళ్ళల్లో వొంపుకోవటంఆస్వాదించటం నాలో సంచరించే కొన్ని పరిమళాలు. వెన్నెల కాంతుల్ని తొడుక్కోవటంవర‌్షధారల్ని నింపుకోవటం ఆశగాఆకాశం వంకాహరివిల్లు వంకాకొంచెం కొత్తగా చూపుల్ని ఆరేసుకోవటంనాకింకా అలానే ఆనందాలు పొద్దు పొడుస్తున్నాయి. దేహమంతా పరవశంతోఅనేక దీపాలుగా వెలుగుతుంది. చిన్ని కొండలనూ ఎక్కి దృశ్యాల్ని నింపుకుంటాను. పిల్లకాల్వలో గెడ్డలలోచేపలు పట్టుకుంటాను కొన్ని పరిమళాల్నినాతో అంటిపెట్టుకుంటాను. ***** గవిడి శ్రీనివాస్గవిడి శ్రీనివాస్  ఆంధ్ర విశ్వవిద్యాలయం […]

Continue Reading

కీ (కవిత)

కీ -లక్ష్మీ శ్రీనివాస్ ఆనాడు కొందరుఊపిరి విడిచిఊపిరి పోసిరిఊరూరు స్వేఛ్చగా ఉండాలని ఆశ పడిరిఆశలు ఆశలుగానే ఉన్నాయి నేడు స్వేచ్ఛఎగరేసిన ప్లాస్టిక్ పక్షిలామారిపోయిందిఎక్కడ వాలమంటే అక్కడ వాలుతుందిపాపం దానికేం తెలుసు ? నేడు సమాజమే”కీ” ఇచ్చే యంత్రంలామారిపోయింది ఆడించే ఆటబొమ్మలా మారిపోయిందిఇంక ఎక్కడ స్వేచ్ఛస్వేచ్ఛ కూడా అక్కడేఎక్కడ ఉంటే “కీ” ***** లక్ష్మీ శ్రీనివాస్టి.శ్రీనివాసులు (లక్ష్మీ శ్రీనివాస్) చిత్తూరు జిల్లా పలమనేరు తాలూకా దగ్గర తాళ్ళపల్లి గ్రామంలో లక్ష్మీదేవి, ఆంజప్పలకు జన్మించారు. ఎం. ఏ, బి. ఏడ్, పూర్తిచేసి, ప్రస్తుతం తెలుగు అధ్యాపకుడిగా మదర్ థెరిస్సా […]

Continue Reading

Expiration (కవిత)

Expiration -బండి అనూరాధ వెళ్ళిపోతే వెళ్ళిపోయావు. ఈ దిగులునూ పట్టుకునివెళ్ళవలసింది.చేతులు ఖాళీలేకపోతేనేం.మనసు అరలో కుక్కుకునైనాపోవలసింది. ఏకాంతాలదొంతరని తివాచీలా పరచి రాజసంగా నడిచి వెళ్ళిపోయావు. దేదీప్యమాన జ్ఞాపకాల రత్నాలు నలిగి అలిగి ప్రకాశించడం మానేసాయి.  మళ్ళీ వస్తావని నా చుట్టూ ఉన్న ఏ పరిసరమూ నమ్మదు. నేనెలా నమ్మేదీ.  మోహం సడలి మైకం వదిలిహ్మ్ ..మజిలీలుండవు.  ముగింపులే ఉంటాయి. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. కవిత్వమంటే ఇష్టం. […]

Continue Reading
Posted On :

సంతోషాన్ని వెతుకుతూ (కవిత)

సంతోషాన్ని వెతుకుతూ -హేమావతి బొబ్బు సంతోషాన్ని వెతుకుతూ కొండ కోనలు తిరుగుచూ ఎక్కడున్నదో తెలియక ఎప్పుడోస్తుందో, అసలు వస్తుందో రాదోనని పబ్బుల్లో ఉందో మబ్బుల్లో ఉందో తాగే మందులో ఉందో చల్లటి చెట్టు నీడలో ఉందో మదిలో ఉందో షాపింగ్ మాల్స్ లో ఉందో పర్స్ లో లేకా ప్రేమించే గుండెలోన హిమాలయాల లోనే కలియతిరుగుచూ కనిపించే ప్రతి హృదయాన్ని నే అడిగా నాకు కొంచెం సంతోషాన్ని ఇవ్వమని విరిసే ప్రతి పువ్వుని అడిగా దారి తప్పిన నా సంతోషాన్ని దరి చేర్చమని మీకు తెలిస్తే తప్పక చెప్పండి నా సంతోషాన్ని రమ్మని పొత్తిళ్ళలో పసిపాపలా పెంచాను నేను దాన్ని మొగ్గలా తొడిగేను అది నా పసిప్రాయంలో యవ్వనాన ఎదిగేను మహావృక్షంగా నడుమొంగిన వయస్సులో నా మెడలు వంచి నడచి పోయెను నేను ఎదిగానని తలచి ***** హేమావతి బొబ్బునేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, ఉన్నత విద్య శ్రీ పద్మావతి మహిళా కళాశాల  తిరుపతి లో జరిగింది. పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుండి […]

Continue Reading
Posted On :

చకోర పక్షి (కవిత)

చకోర పక్షి – గంగాపురం శ్రీనివాస్ జీలకర్ర, బెల్లం విడివడక ముందే గోరింటాకు ఎరుపు ఎల్వకముందే అప్పుల కుప్పలు కరిగించడానికై నెత్తి మీదున్న చెల్లి పెళ్లి కుంపటి దించడానికి చకోర పక్షిలా చక్కర్లు కొడుతూ గొంతుక తడారలేని ఇసుక దిబ్బలపై రెక్కలు తెగి వాలిన ఓ. వలస విహంగామా, ఎన్నో ఆశల ఊసులతో ఎగిరొచ్చిన ఓ. కలల పావురమా హృదయం ద్రవించలేని సాయబుల చేతిలో బందీవై, బానిసవైనావా! ఎడారి దేశంలో రాళ్ళు కరిగి చమురౌతదేమోగానీ, మనసు కరగదని […]

Continue Reading

అనుసృజన-మీనాకుమారి హిందీ కవిత-1

అనుసృజన మీనాకుమారి హిందీ కవిత-1 అనువాదం: ఆర్.శాంతసుందరి అలనాటి మేటి హిందీ నటి మీనా కుమారి అసలు పేరు మాహ్ జబీన్. ఆమె కవయిత్రి అన్న విషయం మీకు తెలుసా? ఆమె మరణించాక గుల్జార్ ఆమె కవితలని సీడీగా రికార్డు చేశారు, మీనా కుమారి తన కవితలను స్వయంగా చదివి రికార్డ్ చేసిన వీడియోలు కొన్ని దొరికాయి. మూల (హిందీ) కవితలను తెలుగులో రాసాను, పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. తెలుగు అనువాదం ఆమె కవితల్లోని భావాన్ని అర్థం […]

Continue Reading
Posted On :

బద్ధకంగా బతికే ఉంటాయి (కవిత)

బద్ధకంగా బతికే ఉంటాయి – శ్రీ సాహితి ఒక్కో రోజుకు బాకీ పడతామో, బాకీ తీరుతుందో తెలియదు. పగలంతా ఊహల్లో ఈత రాత్రంతా మెలకువలో మునక ఊడిగం చేసే ఆలోచనలో విశ్రాంతి లేని నిజాలు వెలుతురును కప్పుకుని ఎండలో ఎగురుతూ చీకటిని చుట్టుకుని చలిలో ముడుక్కుని తలను నేలలో పాతి ఆకాశానికి కాళ్ళను వ్రేలాడుతీసి సంద్రంలా మారిన మెదడులోని తెరలు తెరలుగా కలలు నిద్రను ఢీ కొని బద్దలైన రోజులో బద్ధకంగా బతికే ఉంటాయి. ***** సాహితి […]

Continue Reading
Posted On :

అనుసృజన-‘నీరజ్’ హిందీ కవిత

అనుసృజన ‘నీరజ్’ హిందీ కవిత అనువాదం: ఆర్.శాంతసుందరి స్వప్న్ ఝరే ఫూల్ సే మీత్ చుభే శూల్ సేలుట్ గయే సింగార్ సభీ బాగ్ కే బబూల్ సేఔర్ తుమ్ ఖడే ఖడే బహార్ దేఖతే రహేకారవాన్ గుజర్ గయా గుబార్ దేఖతే రహే (పువ్వుల్లా రాలిపోయాయి కలలు/ ముళ్ళల్లా పొడిచారు మిత్రులు/తోట అందాన్ని దోచుకున్నాయి ముళ్ళపొదలు/నువ్వేమో అలా వసంతాన్నే చూస్తూ నిలబడిపోయావు/బిడారు వెళ్ళిపోయినా అది రేపిన ధూళినే చూస్తూ ఉండిపోయావు) నీంద్ భీ ఖులీ న థీ కి […]

Continue Reading
Posted On :

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ (కవిత)

నీకు నా కృతజ్ఞతలు ప్రభూ -హేమావతి బొబ్బు దప్పికతో ఒయాసిస్సులు వెదకుచూ ఎండమావుల వెంట పరుగులు తీస్తున్నపుడు గుక్కెడు నీటిని ఇచ్చి దప్పికను తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ ఆకలితో నకనక లాడుచున్న కడుపును చేతబట్టి దేశదిమ్మరినై తిరుగుతున్నపుడు గుప్పెడు మెతుకులతో ఆకలిని తీర్చినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాది నా వాళ్లంటూ  ప్రాణం పోయినా మమకారాన్ని చంపుకోలేక నా ఆత్మ దిక్కులేక ఆక్రోశిస్తున్నపుడు అమ్మ కడుపులో ఊపిరి పొసినందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ లోకం పోకడ తెలియక బుడి బుడి నడకలతో చెడుబాట పట్టినపుడు నడక నేర్పడానికి తండ్రివి నీవై నందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ కడుపు నిండిన మనస్సు పండక ప్రేమను కోరుతున్న కట్టెని కాల్చడానికి  నా గుండె దాహాన్ని తీర్చడానికి ప్రియురాలి వై, భార్య వైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ వాలుతున్న శరీరాన్ని వసంతంలో నింపడానికి వయస్సుడుగుతున్నపుడు నా భుజాల చుట్టూ చేతులు వేసి నన్ను నడిపించడానికి నా బిడ్డవైనందుకు నీకు నా కృతఙ్ఞతలు ప్రభూ నాకు పునరుజ్జీవితం ఇవ్వడానికి నాకు మరణాన్ని ప్రసాదిస్తున్నందుకు నీకు నా కృతజ్ఞతలు ప్రభూ ***** హేమావతి బొబ్బునేను హేమావతి బొబ్బు తిరుపతి వాసిని, ప్రాధమిక విద్య తిరుమల శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాలలో, […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి (కవిత)

ఆశయాల సాధనలో నిశ్శబ్ద రేయి -డా. టి. హిమ బిందు జాబిల్లి చెంత వెన్నెల రేయి చల్లనిదే.. నిదుర ఒడిలో జోలపాడే రేయి మధురమైనదే ఒంటరి మనసులకు నిదానంగా నడుస్తూ రేయి మెల్లనిదే ఒంటరి ప్రయాణంలో గుబులు పుట్టిస్తూ సాగిపోయే రేయి భయానకమైనదే అస్వస్థతలో తోడు దొరకని రేయి నరకప్రాయమైనదే ఆశయాల సాకారంలో సహకరించే రేయి నిశ్శబ్ద మైనదే… కోప తాపాల నడుమ కొట్టుమిట్టాడుతున్న రేయి మౌనమైనదే… ప్రేమ తోడులో ఊసులాడు రేయి ఆనంద నిలయమే…. ఎన్ని […]

Continue Reading
Posted On :

నేతన్నలూ! (అనువాద కవిత)

నేతన్నలూ! -దాసరాజు రామారావు ఆంగ్లమూలం – సరోజినీ నాయుడు తెల్లారగట్లనే నేత పనిలో పడ్డ నేతన్నలూ! అర్ధనగ్న దుస్తుల నెందుకు నేస్తరు?… పాలపిట్ట నీలపు రెక్క లాంటిది కాకుండా మేం పురిటి బిడ్డకు రాజస మొలికే నిలువు శేర్వాణీలను నేస్తం- చీకట్లొస్తున్నా నేస్తూనే వున్న నేతన్నలూ! మిరుమిట్లు గొలిపే వస్త్రాల నెందుకు నేస్తరు?… నెమలి లాంటి ఉదా, ఆకుపచ్చల సహజాకర్షణ లేకుండా మేం మహారాణికి పెళ్ళి కళ తొంగి చూచే మేలిముసుగులను నేస్తం- కర్కశమైన శీతల శరత్తులో ఇంకనూ పని నిష్టలో […]

Continue Reading

ఆలాపన (కవిత)

ఆలాపన -బండి అనూరాధ నిదానంగా కురిసే ప్రేమని పెనుగాలులు అసలేమీ చెయ్యలేవు. దీపాలు కొండెక్కడం మామూలుకాదు. నానాతంటాలూ పడి ఏదో అనాలని చూస్తారుకానీ కాంతిలో తేలిపోతారు ఎవరివి హృదయాలని వెతకకుఎక్కడ మనుష్యులూ అని తిరుగకువిరిగిపోయిన ముక్కల్లో లెక్కలు చూడకుదూరమైనసూదుల్లాంటిభావాల్లో తలనుదూర్చినిన్ను నువ్వు గుచ్చుకోకుగ్రహించుదారంలేనివి ఆధారాలు కావెప్పుడూ  అయినా పలకరింపుల్లేని ప్రేమల్లో విహరించడంద్వంద్వాల్లో మరణించడంఇప్పుడసలేమీ బాగోదు సంధిచేసేవాళ్ళకి తెలియదువిసిరివెయ్యబడిన రాళ్ళు మునిపటిలా దొరకవనిఎరవేసేవన్నీ వ్యర్ధవెన్నెలప్రయత్నాలనీనూ పెనుగాలులు నిజాలని కరుచుకుని ప్రేమని తెలుసుకునే రోజొకటి రావొచ్చుప్రయాణం తప్పనప్పుడు, ప్రేమ మృత్యువంత అందంగా ఉండితీరుతుంది. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 19. బరసే బుందియా సావన్ కీ సావన్ కీ మన్ భావన్ కీ (వాన చినుకులు కురుస్తున్నాయి వర్షాకాలం మనసుకి ఎంత ఆహ్లాదకరం !) సావన్ మే ఉమగ్యో మేరో మన్ భనక్ సునీ హరి ఆవన్ కీ ఉమడ్ ఘుమడ్ చహు దిసా సే ఆయో దామిని దమకే ఝరలావన్ కీ ( వర్షాకాలంలో నా మనసు ఉప్పొంగుతుంది హరి వచ్చే సవ్వడి విన్నాను మరి […]

Continue Reading
Posted On :

అంతస్సూత్రం (కవిత)

అంతస్సూత్రం -పి.లక్ష్మణ్ రావ్ మండుతున్న అగ్ని కొలిమి పైభూతలాన్ని పెనంగా పెట్టిచంద్రుడ్ని అట్టుగా‌‌పోస్తుంది అమ్మ ! అట్టు మధ్య చిన్నచిన్న రంధ్రాలేచంద్రునితో జత కలిసే తారలు ! ముఖస్తంగా చంద్రుడువెన్నెలై మెరుస్తున్నాక్రింద అమావాస్య చీకటిదాగి వుందనేది నర్మగర్భం ! అట్టుని అటూ ఇటూ తిరగేయడమేశుక్ల పక్షం, కృష్ణ పక్షం ! ఓ చిన్నారీ !వెన్నెల కురిపించే చంద్రునికేచీకటి వెలుగులున్నట్లుజీవితంలోకష్టసుఖాలు సమానమే తండ్రీ ! నోరూరించే అట్టులోనూదాగివున్న రహస్యమదే! ఒకవైపే వుంటే మాడిపోద్దిరెండు వైపులా తిరగేస్తుంటేనేరుచులు పంచుతాది ! ***** లక్ష్మణ్ రావ్ పోతుబరినేను సాహిత్య రంగంలో 2004లో అడుగుపెట్టాను. నానీలు,హైకూలు, […]

Continue Reading

కొత్త రంగు (కవిత)

కొత్త రంగు -లక్ష్మీ శ్రీనివాస్ ఈ రంగుల ప్రపంచంలో ఈ రంగుకు రూపం ఉండదు ఇదొక వింత రంగు మార్కెట్లో దొరికే రంగుల కంటే చాలా చిత్రమైనది దుర్గుణ వర్ణాలతో కూడి మనిషి రూపాన్ని మార్చేస్తుంది ఈ రంగు పులుముకొన్న మనుషుల్లో ప్రేమలకు అనురాగాలకు మంచితనానికి మానవత్వానికి బంధాలకు బంధుత్వాలకు బాధ్యతకు  భరోసాకు తేడా తెలియని మనిషిగా ఒక వింత మనిషిగా ఒక విచిత్ర వేష భాష ధారణతో వికృత చేష్టలతో విహరిస్తుంటారు. ఈ రంగులద్దుకొన్న మనుషుల్ని కాస్తా గుర్తించండి […]

Continue Reading
gavidi srinivas

అదే వర్షం…! (కవిత)

అదే వర్షం…! -గవిడి శ్రీనివాస్ వేకువల్లే వేయి కలలు వెలిగించుకుని తూరుపు కాంతులు పూసుకుని చూపులు మార్చుకున్న రోజులు కళ్ల పై వాలుతున్నాయ్ . హాయిని గొలిపే ప్రపంచమంటే కళ్ళలో  వెలిగే దీపాలు దారిచూపటం . మనసున ఊగే భావాలు ఊరించటం అలరించటం అంతే కదా … వర్షాల ఊయల్లో అలా ఊగిపోవటం బంధాల్ని ముడిపెట్టుకోవటం కదూ… ఇంతలా వెన్నెల  ఆకాశాన్ని వొంచి తల నిమురుతూంటేనూ… లోలోపల జ్ఞాపకాలు  తడుముతుంటేనూ… ఏదో వెన్నెల వాకిలి వొలికి చిలికి […]

Continue Reading

దుఃఖపుమిన్నాగు (కవిత)

దుఃఖపుమిన్నాగు -డా.కె.గీత దుఃఖం జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు ఎగిసిపడ్డప్పుడు మాత్రం ఎప్పటెప్పటివో నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ జరజరా బయటికి పాక్కొస్తుంది దాని పడగ నీడలో ప్రతిరోజూ నిద్రిస్తున్నా ఏమీ తెలియనట్టే గొంతు కింద ఎడమ పక్క సిరలు ధమనులు చుట్ట చుట్టుకుని బయట పడే రోజు కోసం తపస్సు చేస్తుంటుంది ఒక్కసారి నెత్తుటి గంగలా బయట పడ్డదా దాని తాండవం […]

Continue Reading
Posted On :

సమయం (కవిత)

సమయం -బండి అనూరాధ ఎండకి గొంతెండిన మొక్కలకి నీళ్ళిస్తూ సాయంత్రంలో నేను.మొక్కలకి పైగా సాయంత్రంపై వీచే గాలుల్లో గూళ్ళకి చేరుతూ పక్షులు. ముసురుకుంటున్న చీకట్లలో సమయం.రాత్రిని అంటుకుంటున్న చలిగాలులు.బయటకి చూస్తే నలుపు. గుబురుచెట్ల మధ్యన అంధకారం.మొదళ్ళ మౌనం. ఇంకొంచం గడిచిన సమయం.మరింత సాగిన రాత్రి. నడినెత్తిన సగం చంద్రుడు.అరవెన్నెల్లో ఆకాశం. లోపలా బయటా ఒకే నిశ్శబ్దం. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి గ్రామం. ప్రస్తుత నివాసం కృష్ణా జిల్లా తాడిగడప గ్రామం. చదువు ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్. […]

Continue Reading
Posted On :

ఎప్పటికీ నిండని కుండ (కవిత)

ఎప్పటికీ నిండని కుండ -పాపినేని శివశంకర్ ‘చావదురా ఈ పాము / చప్పిడి దెబ్బలకు / భావించి వైరాగ్యమనే/ బడితెదెబ్బబడితె గాని’ అంటూ అప్పుడెప్పుడో మా అమ్మ పాడిందొక తత్త్వం. ఇప్పుడైతే ‘నిండదురా ఈ కుండ / మెండైన సంపదల్తో’ అని పాడేదేమో. కాకికి దప్పికైనప్పుడు అడుగున నీళ్లున్న కుండని గులకరాళ్లతో నింపి దాహం తీర్చుకొంది. కానీ,             ఈ కుండలు నిండవు. ఎవరికుండా నిండటం లేదు. నువ్వు కొండల్ని పిండిచేసి కూరినా నిండదు. ఎన్నికార్లు, అద్దాల మేడలూ, […]

Continue Reading

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 17. ఓ జీ హరీ కిత్ గయే నేహా లగాయే నేహా లగాయే మన్ హర్ లియో రస్ భరీ టేర్ సునాయే మేరే మన్ మే ఐసీ ఆవే మరూ జహర్ విష్ ఖాయకే (మహానుభావా హరీ ! ప్రేమలో బంధించి ఎక్కడికెళ్ళిపోయావయ్యా? ప్రేమిస్తున్నానని చెప్పి నా మనసు దొంగిలించావు తీయటి మాటలెన్నో చెప్పావు ప్రస్తుతం నా మనసు ఇంత విషం తాగి చనిపోమంటూంది) ఛాడి […]

Continue Reading
Posted On :

అమ్మసంచి (కవిత)

అమ్మసంచి -బంగార్రాజు కంఠ నువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక నాజూకుతనంనువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక చలాకీ చిరునామానువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఆశల తేనెపట్టునువ్వు పుట్టక ముందుఅమ్మ ఒక ఉరికే వాగునీరు నువ్వు పుట్టాకతన సమస్తం గాలికి గిరాటుకొట్టాకఇక నువ్వే తన బంగరుకొండ తప్పో ఒప్పోపదినెలలు ఈ భూమిని మోసిన అమ్మకు తప్పఎవరికీ వుండదు ఆ చారికల సంచిప్రపంచం మొత్తం మీద అమ్మకి తప్ప ఎవరికీ నచ్చవుకడుపు మీది ఆ బాధానంద ముద్రలుపొత్తికడుపు మొత్తం కత్తితో చీరినట్టునువ్వూ నేనూ చీరే వుంటాం పొట్టలో […]

Continue Reading
Posted On :

ఓటమి ఎరుగని తల్లి (కవిత)

ఓటమి ఎరుగని తల్లి -శింగరాజు శ్రీనివాసరావు కడుపు సంచి ఖాళీగా వున్న దేహాన్ని గర్భసంచి బరువు సమం చేసింది బక్కచిక్కిన శరీరపు ఒడిలోకి చచ్చుబడిన పిండం ప్రాణం పోసుకుంది నవ్వే బిడ్డకు నడకలేని కాళ్ళు దిష్టి చుక్కల్లా.. దరిద్రానికి తోబుట్టువులా అవిటితనం.. అసంపూర్ణ పుష్పాన్ని చూసి ఆమె దూషించలేదు నడవలేని కన్నయ్యవని మురిసి రొమ్ముపీకను నోటికందించింది తరువుకు కాయ బరువు కాదని తనయుడి భారాన్ని భుజాన వేసుకుంది కదలలేని కాయం మోయలేనంత ఎదిగితే నడుము వంచి గజమై […]

Continue Reading

రోజు ఇలాగే (కవిత)

రోజు ఇలాగే -మహెజబీన్ రోజు ఇలాగే కొత్తగా మొదలవుతుంది జీవితం తొలిసారి చూసినట్టు ప్రతీ సూర్యోదయం అద్భుతమే సంధ్యా సాయంకాలం ప్రతీ రోజు వర్ణ చిత్ర మవుతుంది చూసినప్పుడల్లా సముద్రం ఆశ్చర్యమవుతుంది పుట్టినప్పటి నుండి చూస్తున్ననీలాల గగనమే, అయినా తనివి తీరదు నక్షత్రాల్నిచెల్లా చెదురుగా పడేసుకున్న రాత్రి ఆకాశం, దాని మీద కురిసే వెన్నెల చూపు తిప్పనీదు ప్రతీ ఋతువు కొత్తగా కనిపిస్తుంది వచ్చిన ప్రతీసారి వసంతం కొత్త రంగుల్నిఇచ్చి వెళుతుంది వాన కురిసిన ప్రతీసారి అహ్లాదమే […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 15. ఓ రమైయా బిన్ నీంద్ న ఆవే బిరహా సతావే ప్రేమ్ కీ ఆగ్ జలావే (అయ్యో , నా ప్రియుడు ఎడబాటుతో నాకు కంటిమీద కునుకే రాదే విరహతాపం వేధిస్తోందే ప్రేమ జ్వాల దహించివేస్తోందే !) బిన్ పియా జ్యోత్ మందిర్ అంధియారో దీపక్ దాయ న ఆవే పియా బిన్ మేరీ సేజ్ అనూనీ జాగత్ రైన్ బిహావే పియా కబ్ ఆవే […]

Continue Reading
Posted On :
T. Hima Bindu

స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్ (కవిత)

స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్ -డా. టి. హిమ బిందు నిశ్శబ్దంగా వింటున్నాను ఆశ్చర్యంగా చూస్తున్నాను కళకళలాడే అందమైన అలంకారాల అరుదైన అందాలు చూస్తున్నాను అంతకన్నా మించిన సృజనా శైలిలు చూస్తున్నాను ఆనంద క్షణాలలో కంటి వెలుగులు చూసి సంతోషిస్తున్నాను దుఃఖ సమయాన కన్నీటి సాగరాల అలలకు విలవిల లాడుతున్నాను గుస గుసల చెవుల కోరుకుల్లు మింగుడు బడక ముసి ముసి నవ్వులతో ముడుచుకు పోతున్నాను! గల గల నవ్వుల జల్లులు, ఏడిపించడాలు, ఓదార్పులు తీపి కబుర్లు, మిఠాయిల […]

Continue Reading
Posted On :
gavidi srinivas

పొలం ఒక బంధం (కవిత)

పొలం ఒక బంధం -గవిడి శ్రీనివాస్ కాసిన్ని చినుకులు రాలటం కాబోలు నాల్గు మడి సెక్కలు సూర్యుణ్ణి చూసి మురిసిపోతున్నాయి. ఉత్సాహం ఉత్సవమౌతూ కళ్ళల్లో వరి కలల కాంతులు దర్శిస్తున్నాడు రైతు . గుంపు కొంగల బారులా వరినాట్లు నాటిన ఆడోళ్ళు. నిజమే కదా మట్టిని తాకిన పాదాలు మొక్కలై  ఎదుగుతుంటాయి . నడిచిన  మట్టి మీద మమకారపు  పొరలు విప్పుకుంటాయి . అస్థిత్వాన్ని నెత్తిన ఎత్తుకుని పంట చేల కోసం పాట మొలుస్తుంది . రేపటి భయాలని […]

Continue Reading

Raw Beauty (కవిత)

Raw Beauty -బండి అనూరాధ ఈ పొద్దూ వానొచ్చినదితనదారిన తాను పోయినదిఎవరి దారిన వాళ్ళు పోవాలిగా ఇక్కడ మిగిలినది చూస్తే- కొంత మట్టీ కొంత ఇసుకాకొన్ని రాళ్ళూ మరికొన్ని మొక్కలూవిరిసిన ఒకే ఒక రోజా పువ్వు పాకుడుపట్టిన పాతగోడ,..తడికి మరింత పచ్చగా మెరుస్తూగాయమంత పచ్చిగా.. గోడకు పాకించిన మనీప్లాంట్ ఆకులనుండీఅప్పుడప్పుడూఒక్కో మిగులు వాన చుక్కా.. నా కళ్ళు ఇక విదిలించలేని చినుకులేనా అవి!?ఎవరో తమ అసలుకి పోయారు.నొప్పై, ఇదిగోనేను ఇలాగ నవ్వుతున్నానా!? పట్టిచూడడం అందం.పట్టించుకోకపోవడం పెను విషాదం. ***** బండి అనూరాధపేరు అనూరాధ బండి. స్వస్థలం […]

Continue Reading
Posted On :

కలను ఏ కన్నీళ్లు ఆపలేవు (కవిత)

కలను ఏ కన్నీళ్లు ఆపలేవు – శ్రీ సాహితి నిద్రను హత్యచేసిన ఆ కల పట్టపగలు ఎన్నో రాత్రులను మోసుకుంటూ ఏ రోజుకు చిక్కకుండా ఏ గంటకు పట్టుపడక నగ్నంగా తిరుగుతుంది. ఎదురొచ్చిన ముఖంపై చెంబుడు కబుర్లు చల్లి చిందుల్ని ఏరుకుంటూ పసి హృదయంలో లోతుగా పాకిన ఇష్టం పెద్దయ్యాక వటవృక్షమై ఇప్పుడు కలకు కళ్ళతో పనిలేక కాలంతో ముడి వీడి కోరికగా మారి మనసులో మాటైయింది…చూపైయింది… చప్పుడైంది….చిత్రమైంది. ఇక కాలు ఆగేదాక కళ్ళు ఆరేదాకా ఏ […]

Continue Reading
Posted On :

వేయి మాటల ఉప్పెన (కవిత)

వేయి మాటల ఉప్పెన -చందలూరి నారాయణరావు కోపానికి చీల్చుకొచ్చిన లోపలి మనిషి నోరు బయట పుట్టపలిగి వంద నాలుకల వేయి మాటల ఉప్పెన నాలుగు కళ్ళుగుండా వేలమైళ్ళ మీటవేసి మెదడును ఖాళీ చేసిన రక్తం పాదాలకి చేరి తలలో పాతపగను తాకి మొగ్గలేసిన సమస్య పచ్చని గాయమై ఎర్రగా నవ్వింది. ఆ నల్లని రోజు నిండా నిమిషానికో గాయానికి స్రవించే అరుపుల తరంగాలు చెవుల్లో పొంగి పొర్లి పక్కనున్న రోజుపై చింది పగలు చీకటి దుప్పటి కప్పుకుంటే […]

Continue Reading

క’వన’ కోకిలలు- ఆధునిక బెంగాల్ కవయిత్రులు ఓ నలుగురు

క ‘వన’ కోకిలలు – 14 :  ఆధునిక బెంగాల్ కవయిత్రులు ఓ నలుగురు     – నాగరాజు రామస్వామి “అజ్ఞాత అప్సర నా ఆత్మను అపహరించిన ఆ మంచు మంటల వేళ, నాకు దేహంలేదు, అశ్రువులు లేవు; ఓకవితల మూట తప్ప.” – ఎలీనా శ్వార్ట్స్. నాడు ఆ మూటలను బుజాల మీద మోసే వారు కవులు;కొంత ఆలస్యంగా నైతేనేమి, ఈ నాడు నెత్తిన పెట్టుకుంటున్నారు కవయిత్రులు. కళలకు, కవిత్వానికి కాణాచి బెంగాల్. సాహిత్య క్షేత్రంలో మౌళికమైన మార్పులు 19వ శతాబ్దం చివర నుండి 20వ శతాబ్దపు తొలి దశకాలలో వచ్చిన పునర్వికాస (Renaissance) దశలో చోటుచేసుకున్నవి. ఆ కాలంలోనే […]

Continue Reading

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 13. కో బిరహినీ కో దుఖ్ జాణే హోమీరా కే పతి ఆప్ రమైయాదూజో నహీ కోయీ ఛాణే హో(ఒక విరహిణి అనుభవించే దుఃఖం ఎవరికి అర్థమౌతుంది?మీరాపతి ఒక్క ఆ గిరిధరుడే తప్ప ఆమెకి ఇంకే ఆధారమూ లేదు)రోగీ అంతర్ బైద్ బసత్ హైబైద్ హీ ఔఖద్ జాణే హోసబ్ జగ్ కూడో కంటక్ దునియాదర్ద్ న కోయీ పిఛాణే హో(రోగి మనసులో ఉండేది ఆ వైద్యుడేఆయనకే […]

Continue Reading
Posted On :

ఎండి తుమ్మ గజ్జెలు (కవిత)

ఎండి తుమ్మ గజ్జెలు -గుమ్మల సాయితేజ ఆడుతున్న మా అయ్య చెప్పిన ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ఆడుతున్న  నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న కొత్త బొబ్బలెక్కిన పెయ్యి ఏడెక్కినకంట్లో నీళ్లు బయటికొస్తేచెమట అనుకోని తుడుసుకుంట  ఆ డముకు డముకు సప్పుల్ల  నా ఏడుపును కలిపేసి పండ్లు ఇకిలిచ్చి కండ్లు సిన్నంగ చేసి నడుం మీదో చేయి నెత్తి మీదో చేయి పెట్టి  భరతనాట్యం అయ్య పిల్ల తిని చాలా రోజులైందయ్య అని పాన్ పరాగ్ ఉమ్మేసుకుంటా చెప్తున్న  మా అయ్య మొహం చూసి నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న  మూగవోయిన చేయి చూపించి పైసలు ఇచ్చిన పెద్దనాన్న , మామయ్య , పెద్దమ్మలను చూసి పొర్లు దండాలు పెడుతున్న తమ్ముని చూసి అయ్యా […]

Continue Reading
Posted On :
gavidi srinivas

యుద్ధం ఒక అనేక విధ్వంస దృశ్యాలు (కవిత)

యుద్ధం  ఒక అనేక విధ్వంస దృశ్యాలు -గవిడి శ్రీనివాస్ యుద్ధం ఎపుడు విధ్వంసమే విద్వేషాలే యుద్దానికి మూల ధాతువులు . ఆధిపత్యం పోరు ప్రాణాల్ని ఛిద్రం చేస్తుంది . అండ చూసుకొని ఒక చిన్న దేశం అంగ బలం చూసుకొని ఒక పెద్ద దేశం యుద్దానికి తెరలేపాయి. శూన్యాన్ని విధ్వంసం చేసి ఆకాశాన్ని అల్లకల్లోలం చేసి రక్తపు మడుగుల వాసన తో యుద్ధం తడిసిపోతోంది. నాటో వ్యూహాల మధ్య దేశాల దేహాలు తగలబడిపోతున్నాయి. ఇప్పుడు బతకడమంటే మూడో ప్రపంచ […]

Continue Reading

అబద్ధమాడని నిజం (కవిత)

అబద్ధమాడని నిజం -చందలూరి నారాయణరావు నిత్యం వారిద్దరి విందులో రుచిగల మాటలు అబద్దమాడని నిజాలు ప్రియమైన వంటకాలు. ఎదుటపడని కలయికలో ఎదమాటున సంగతులు మధురంగా మైమరిపించే మనసూరించే ఇష్టాలు. నిద్రమంచానే చూపులు ముఖాల్లో ఏరులా ప్రవహించి సంతోషసారాన్ని ఇచ్చి పదునుగా ప్రవర్తించి రోజూ గుప్పెడు అనుభావాల్ని ఒకరిలో మరొకరు చల్లుకుని ముసురుపట్టి మెరుపులతో జోరుగా కురుసుకుంటారు తనివితీరా తడిసిన తలపులకు మన్ను వెన్నులో పదాల మొలకలు పుట్టపగిలి ఉదయించుకుంటారు వాక్యాల మెరుపులతో కౌగిలించుకుంటారు. కవితల విరుపులతో రెపరెపలాడతారు… […]

Continue Reading

ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు? (కవిత)

ఎందాకని జ్ఞాపకాలకు రుచౌతావు?  – శ్రీ సాహితి ఎన్నాళ్ళని ఆ ఒక్క ప్రశ్నను ఈడ్చుకుంటూ దగ్గరతనాన్ని కలగంటూ దూరాన్ని మోస్తావు? చాటేసిన ముఖంతో మౌనాన్ని తప్పతాగి వేళకు మనసుకు రాని జవాబుకు ఎన్ని రాత్రులను తీవాచిగా పరుస్తావు? చూపలరిగి చుక్కలై అలిసిన ఆశకు దప్పిక తీర్చాలని కన్నీళ్లను గొంతులో రహస్యంగా ఎందాకని దాస్తావు? కాలం తొక్కిడికి ఒరిగిన కోరికను సున్నితంగా చేరదీసి కడుపున దాచి ఎందాకని గుట్టుఔతావు? కళ్ళకు తెలియకుండా కన్న కలను కరిగి ఆరకుండా చెదరి […]

Continue Reading
Posted On :

భవిత (కవిత)

భవిత – టి. వి. యెల్. గాయత్రి చెట్టులేదు చేమ లేదుచిట్టడవు లెక్కడ? లేనే లేవుపులుగు పోయి పుట్ర పోయిపశుల జాతి పోయి పోయివెనకడుగై కనుమరుగైగతము లోకి జారి పోతేఒంటరిగా వేదనతోభగభగమని మండి పోతూవేడి పుట్టే వాడి సెగలుపుడమి తల్లి కక్కు తుంటేఎక్కడ? ఎక్కడ? నీ భవిత?చెప్ప వోయి వెఱ్ఱి మనిషి! గాలి నిచ్చి జీవమిచ్చి చేవ నిచ్చి మేలుచేయుచెట్టు చేమ పెంచ వోయి!చేర దీసి నీరు పెట్టిభూత కోటి బ్రతుకు పట్టిభూమాతకు బహుమతిగాపచ్చదనము పెరగనీయి! ***** టి. వి. […]

Continue Reading
subashini prathipati

ఆరాధనాగీతి (కవిత)

ఆరాధనాగీతి -సుభాషిణి ప్రత్తిపాటి పాత పుస్తకాలుతిరగేస్తుంటే నెమలీక జారిపడింది,ఎన్ని దశాబ్దాల నాటిదోఇంకా శిథిలం కాలేదుగుండెలో దాచుకున్నతొలివలపులా ఇంకామెరుపులీనుతూనే ఉంది! ఊరంతామారిపోతోందిపాతభవనాలన్నీ రాళ్ళగుట్టలవుతుంటేఅల్లుకున్న నా జ్ఞాపకాలన్నీచెంపలపై చెమ్మగా జారసాగాయి!అదిగో ఆ రంగువెలసినఅద్దాలమేడ కిటికీ మాత్రంతెరిచే ఉందిఅక్కడినుంచి ఒకప్పుడునన్ను తడిమిన పద్మనేత్రాలులేకపోవచ్చుకానీఆ ఆరాధనా పరిమళం మాత్రంఇప్పటికీనాకు నిత్యనూతనమే!!మా కళాశాలకుపాతబడిన విద్యార్థిగావెళ్లాను,అన్నీ నవాంశలే అక్కడ,కొత్త గదులు,చెట్లుఒక్కటిమాత్రమేనన్ను హృదయానికిహత్తుకుందిపాత మిత్రుడిలా..నా వేళ్ళు తడిమిన ఆ పుటలన్నీవిశ్వభాషలో నన్నుపలకరించాయి,నన్ను సేదతీర్చాయిచంటిపాపను చేసి లాలించాయితాదాత్మ్యతలోకాలం తెలీనేలేదు.సముద్రం వైపునడిచాను.తీరం హంగులు దిద్దుకుంది గానీ…అలల దాహమే ఇంకాతీరినట్టు లేదునా బాల్యంలోలాగేఒకటే […]

Continue Reading

తూకం (కవిత)

తూకం -రూపా దూపాటి అందమైన మనిషిని పువ్వుతో పోల్చడం తప్పేమీ కాదు! కానీ ఒక అబ్బాయిని రోజా పువ్వులా ఉన్నావు అనడాన్ని నేను ఇప్పటి వరకు వినలేదు!! వండు కోవడం, తినడం మానవ అవసరాలే! కానీ మీ బాబుకు వంట వచ్చా అని పెళ్లి కుదుర్చుకున్న సంఘటన నేను ఇప్పటి వరకు చూడలేదు!! స్వతంత్రం మనకి ఎపుడో వచ్చింది! కానీ ఆడపిల్ల ఒంటరిగా తిరుగుతున్నప్పుడు ధైర్యంగా ఉన్న మనసును నేను ఇప్పటి వరకు తారసపడలేదు!! అమ్మాయి, అబ్బాయి […]

Continue Reading
Posted On :

అనుసృజన-మీరా పదావళి (తరువాయి గీతాలు)

అనుసృజన మీరా పదావళి (తరువాయి గీతాలు) అనువాదం: ఆర్.శాంతసుందరి 11. రాధా ప్యారీ దే డారో నా బంసీ మోరీయే బంసీ మే మేరో ప్రాణ్ బసత్ హైవో బంసీ హో గయీ చోరీ(రాధా , నా బంగారూ!  నా మురళిని ఇచ్చెయ్యవా?నా ప్రాణాలన్నీ ఈ మురళిలోనే ఉన్నాయిదాన్నే ఎవరో దొంగిలించారు)కాహే సే గాఊం కాహే సే బజాఊంకాహే సే లాఊం గైయా ఘేరీ(ఇక నేను దేన్ని వాయిస్తూ పాడను?అసలు దేన్ని వాయించను?మురళి లేనిదే గోవుల్ని కూడగట్టుకుని […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- కశ్మీరీ కవయిత్రులు

క ‘వన’ కోకిలలు – 13 :  కశ్మీరీ కవయిత్రులు    – నాగరాజు రామస్వామి కశ్మీర్ సాహిత్య భావుకతకు, కవిత్వ రచనకు మూల స్వరూపాన్ని కల్పించిన తొలితరం కవయిత్రులో ముఖ్యులు లాల్ దేడ్, హబా ఖటూన్, రూపా భవాని, ఆర్నిమాల్ ముఖ్యులు. 14వ శతాబ్దపు మార్మిక కవయిత్రిలాల్ దేడ్. హబా ఖటూన్ 16వ శతాబ్దానికి, రూపా భవాని 17వ శతాబ్దానికి, ఆర్నిమాల్ 18వ శతాబ్దానికి చెందిన తొలి కవయిత్రులు. కశ్మీరీ కవితా స్రవంతి రెండు పాయలుగా ప్రవహించింది. లాల్ […]

Continue Reading

వివక్ష?! (కవిత)

వివక్ష?! -అనురాధ నాదెళ్ల వివక్షా? అలాటిదేం లేదే. భారత రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది- కులం, మతం, వర్గం, లింగం, భాష ఇలాటి భేదాలేవీ ఉండవని, అన్నిటా అందరూ సమానమేననీ! అంటే వివక్షలంటూ ఉండవన్నమాట! మరి, ఈ పదం ఎలా పుట్టిందంటారా? భలే సులువు! ఇంట్లోంచి, మనుషుల్లోంచి, ఆలోచనల్లోంచి, అహంకారాల్లోంచి అలా వైనవైనాలై, రాజ్యాంగ నిర్మాతలకు తోచని ఎన్నో మార్గాల్లోంచి పుడుతూనే ఉంది! వారి మేధకు అందని దారుల్లో పెత్తనం చేస్తూనే ఉంది. ముందుగా ఏదైనా ఒక ఇంటి […]

Continue Reading
Posted On :
rajeswari diwakarla

తల్లి చీర (కవిత)

తల్లి చీర -రాజేశ్వరి దివాకర్ల మమతల వాలుకు చిక్కి వలస వెళ్ళిన వాళ్ళిద్దరు తిరిగి రాని సమయాలకు ఎదురు చూపుల ఇల్లు మసక బారిన కళ్ళతో ఇసుక రాలిన చిన్న శబ్దానికైనా ఇటుక గోడల చెవిని ఆనించు కుంది. విశ్రాంతి పొందిన ఉత్తరాలు కొన్ని బ్యాంకు జమా బాపతు తాఖీదులు కొన్ని పిల్లల పుట్టిన రోజులకు గుడి పూజల తారీఖుల పిలుపు రివాజులు కొన్ని గాలి వాటుకు ఎగిరి ధూళి కమ్ముకున్న నేలకు ఒరుసుకున్నాయి. సంవత్సర చందాలకు […]

Continue Reading

చూపు చెంగున….. (కవిత)

  చూపు చెంగున….. -చందలూరి నారాయణరావు నేను అనుకోలేదు నా కవిత ఓ బంధానికి పెద్దమనిషి అవుతుందని… ఓ మనసుకు చుట్టరికంతో చిత్రాలు చేస్తుందని… ఓ సంతోషాన్ని వరంగా బలమై నిలుస్తోందని…. ఓ కదలికను పుట్టించి కలగా దగ్గరౌతుందని… ఓ కమ్మనిమాట సువాసనతో మనసు నింపుతుందని ఓ ఆనందాన్ని పంచే అందాన్ని మదికిస్తుందని…. ఎప్పుడు పుట్టిందో? ఎక్కడ పెరిగిందో? ఎలా ఎదురైందో మరి? ఇప్పుడు నాకై అనిపించేలా నాలో ఇష్టమై నా కవిత కొంగున ఆమె బంగారం. […]

Continue Reading
gavidi srinivas

తీపి దుఃఖాలు (కవిత)

తీపి దుఃఖాలు -గవిడి శ్రీనివాస్ ఒక అసంపూర్ణ సంధ్యాకాలం నీ విచ్చిన సంతోషంతో నువ్ పంపిన సందేశంతో ఇక్కడ నీ జ్ఞాపకాల్ని ధ్యానిస్తున్నా . ఒక్క మాట చెప్పు నీ తపస్సులో ఉషస్సుని చూస్తున్న నాకు ఈ తీపి దుఃఖాలు ఓదారుస్తాయా ..! నీ చూపులు వెన్నెల్ని కురుస్తున్నపుడు నీ ఊహలు తూనీగల్ని ఎగరేస్తున్నపుడు నీ కన్నుల్లో అఖండ దీపాలు వెలుగుతున్నపుడు నిశ్చేష్ఠుడనై నిర్ఘాంత పోయినపుడు ఆ ఉఛ్వాస నిశ్వాసాల్లో ధ్వనించిన అనురాగ మధురిమల్ని  ఏరుకుంటున్నపుడు నాలో […]

Continue Reading

చెరగని చిరునామా (కవిత)

చెరగని చిరునామా  -రామ్ పెరుమాండ్ల రాత్రి వాహనాలన్ని ఇంటికెళ్ళాయి .కానీ ఫుట్ పాత్ పైకి ఎవరొస్తారో తెలియదు.కడుపులో ఖాళీలను పూరించడానికి ఈ లోకం ఏ ఒక్క అవకాశం ఇవ్వను లేదు .ఆకలిని వెతికి వెతికి అలిసిన కన్నులు కునుకు కోసం దారి వెతుకుతున్నాయి . ఈ దేశం చేసిన సంతకాల చట్టాలు రోజూలాగే తన ఖాళీ సంచిలో నింపుకోవడానికి వెళితే చెత్త కుప్పలో విరివిగా దొరికాయి .అయిన తనకేం తెలుసు బడి లేదు బలపం లేదు . అలా ఆ కాగితాలను పరుపుగా ఇటుక పెళ్లను దిండుగా జేసుకున్నాడు .తన ఖాళీకడుపుపై […]

Continue Reading
Posted On :

పెళ్లయ్యాక ..! (కవిత)

పెళ్ళయ్యాక ..! – సిరికి స్వామినాయుడు నీ కళ్ళు .. కలువ రేకులన్నప్పుడు అనుకోలేదుకలలు చిక్కేసి నన్నో కబోదిని జేస్తావనీ ..! నీ మోము .. పున్నమి చందమామన్నపుడు పసిగట్టలేదురోజుకో వెలుగురేకును కోల్పోయిన వెన్నెలపూవును జేస్తావనీ ..! ఆకాశంలో .. సగం నీవన్నపుడు అర్ధం జేసుకోలేదుమసిగుడ్డల్లాంటి ఆమాస పూటల్ని మొహాన కొడతావనీ ..! గుడిలో దేవత ఇల మీదికొచ్చిందన్నపుడైనా ఊహించలేదుఇంటికి  నన్నో జీతం భత్యం లేని పని మనిషిని చేస్తావనీ ..! బతుకుబండికి మనిద్దరం  రెండెద్దులమన్నప్పుడైనా బోధపడలేదునన్నో గానుగెద్దుని చేసి గంతలు కడతావనీ .. ! చిన్నీ బుజ్జీ ..‌ యన్న  ప్రేమ పిలుపుపెళ్లయ్యాక .. ఒసే గిసేంటూ  బుసలెందుకు […]

Continue Reading

అనుసృజన-మీరా పదావళి

అనుసృజన మీరా పదావళి అనువాదం: ఆర్.శాంతసుందరి భక్తి అనే మాటకి ఆరాధన, విశ్వాసం, అంకిత భావం లాంటి అనేక అర్థాలు ఉన్నాయి. భారతీయ భాషల్లోని సాహిత్యంలో భక్తి విభిన్న రూపాల్లో వ్యక్తమయింది. హిందీ సాహిత్యంలో భక్తి సాహిత్యం 1375 నుంచి 1700 వరకు అని నిర్ణయించడమైంది. ఈ నాలుగు శతాబ్దాలలోనే తులసీదాస్, సూరదాస్, మీరాబాయి, కబీర్ వంటి కవులు తమ కావ్యాలనీ , కవితలనీ, పదాలనీ రాశారు. తులసీదాస్ ది దాస్యభక్తి (తులసీదాస్ రచించిన ‘రామ్ చరిత్ […]

Continue Reading
Posted On :

క’వన’ కోకిలలు- సమకాలీన సాహిత్య ప్రస్థానంలో భారతీయ ఆంగ్ల కవయిత్రులు

క’వన’ కోకిలలు – 12 :  సమకాలీన సాహిత్య ప్రస్థానంలో భారతీయ ఆంగ్ల కవయిత్రులు    – నాగరాజు రామస్వామి For women, poetry is not a luxury. It is a vital necessity of our existence.             – Audre Lorde, Black American Poetess.           సాహిత్యాకాశం లో కవిత్వం నిండు జాబిలి. అన్ని ప్రక్రియల్లోకి మేలిమి. కవిత్వ రచనలో, […]

Continue Reading