image_print

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-4     -కల్లూరి భాస్కరం డేవిడ్ రైక్ పుస్తకం గురించి రాద్దామనుకున్నప్పుడు అదింత సుదీర్ఘమవుతుందనీ, ఇన్ని భాగాలకు విస్తరిస్తుందనీ మొదట అనుకోలేదు; ఏ అంశాన్నీ విడిచి పెట్టడానికి వీలులేని, అలాగని అన్ని విషయాలూ రాయడానికీ అవకాశంలేని ఒక సందిగ్ధారణ్యంలో  చిక్కుకుంటాననీ ఊహించలేదు. ఓ మామూలు పుస్తక సమీక్షలా రాయచ్చని అనుకున్నాను. కానీ నేను తనను పట్టుకున్నంత తేలిగ్గా ఈ పుస్తకం నన్ను వదలిపెట్టేలా లేదు. ఇందులో రచయిత మధ్యమధ్య అనివార్యంగా ముందుకు తెచ్చిన పురామానవ […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-1

బొమ్మల్కతలు-1 -గిరిధర్ పొట్టేపాళెం           బొమ్మల్లో నా ఆనందం ఈనాటిది కాదు. వేసిన ప్రతి బొమ్మా ఆర్టిస్ట్ కి సంతృప్తిని ఇవ్వదేమో కానీ సంతోషాన్ని మాత్రం ఇచ్చి తీరుతుంది.           రంగుల్లో బొమ్మలు ఎలా వెయ్యాలో, ఎలాంటి రంగులు కొనాలో, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని రోజుల్లో “కావలి” అనే చిన్న టౌన్ లో మా పెంకుటింట్లో టీనేజ్ లో వేసిన బొమ్మలే అప్పటికీ, ఇప్పటికీ, […]

Continue Reading

చిత్రం-40

చిత్రం-40 -గణేశ్వరరావు  కొందరికి చనిపోయిన తర్వాత గుర్తింపు వస్తుంది, అమెరికన్ ఫోటోగ్రాఫర్ డీయన్ ఏర్బస్ (Diane Arbus) 1971లో ఆత్మహత్య చేసుకున్నాక గుర్తింపు పొందింది. ఆమె ధనిక కుటుంబంలో పుట్టింది, వాళ్ళు ఫాషన్ వస్తువులు అమ్మే వారు, అయినా ఆమె మాత్రం ఎటువంటి మేక్ అప్ వేసుకునేది కాదు, సెంట్ వాడేది కాదు, మెడలో ఒక కెమెరా మాత్రం వేలాడుతూ వుండేది. భర్త ఎలాన్ తో ఫాషన్ యాడ్స్ ఫోటోలు తీసేది. స్టూడియో పని విసుగెత్తి, ఔట్ […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-3

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-3     -కల్లూరి భాస్కరం మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి తోసుకు పోదాం పోదాం పైపైకి *** బాటలు నడచీ పేటలు కడచీ కోటలన్నిటిని దాటండి నదీనదాలూ అడవులు కొండలు ఎడారులా మన కడ్డంకి *** ఎగిరి ఎగిరి ఎగిరి పడుతున్నవి ఎనభై లక్షల మేరువులు తిరిగి తిరిగి తిరిగి సముద్రాల్ జలప్రళయనాట్యం చేస్తున్నవి *** శివసముద్రమూ నయాగరా వలె ఉరకండీ ఉరకండీ ముందుకు *** […]

Continue Reading
Posted On :

చిత్రలిపి

చిత్రలిపి కాలమహిమ! -మన్నెం శారద సాగరుని చేరేముందు సాగు భూమినిమరింత సస్యశ్యామలం చేయాలనిమహోన్నత ఆశయంతోఒండ్రుమట్టిని మోసుకొచ్చి ……….నన్ను నేను నిలువునా పాయలుగా చీల్చుకున్నాను  ఇంత వాననీటికి వాగై వొచ్చిన ఓ పిల్ల సెలయేరువళ్ళూపై మరచి”ఓస్ఇంతేనా “నువ్వన్నట్లు వెకిలిగా నవ్వింది అహో …కాలమహిమ కదా ఇది !!!! ***** మన్నెం శారదనా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-15

ఒక్కొక్క పువ్వేసి-15 తిరిగి జైలుకు తరమాల్సిందే -జూపాక సుభద్ర యిప్పుడు భారత సమాజము తీవ్ర అభద్రతకు ఆందోళనకు గురవుతున్నది. ముఖ్యంగా మహిళలు. ఈ దేశంలో మహిళలు, ముఖ్యంగా హిందూవేతర మతస్తులైన ముస్లిమ్ మహిళలు, దళిత ఆదివాసీ మహిళలు. ఒక వైపు మహిళలు శక్తి స్వరూపులు, వారి హక్కులు రక్షిస్తామనీ, బేటీ బచావో నినాదానాలను ప్రకటిస్తూ… యింకో వైపు నేరస్తుల్ని అందులోనూ, కరుడు గట్టిన నేరస్తులైన, బిల్కిస్ బానో కేసులో శిక్షలు బడ్డ నేరస్తుల్ని విడుదల చేసి, అధికార […]

Continue Reading
Posted On :

చిత్రం-39

చిత్రం-39 -గణేశ్వరరావు  షెరాన్ రూథర్ ఫర్డ్ రూప చిత్రకళను అధ్యయనం చేశారు. ఈ తైలవర్ణ చిత్రంలోని వనిత, కెన్యా ప్రాంతంలోని ఒక తండా నాయకుడి భార్య, తన ఫోటో తీస్తున్నప్పుడు, చిత్రం గీస్తున్నప్పుడు ఆమె విరగబడి నవ్వుతూనే ఉందట. ఈ చిత్రంలో కూడా ఆమె నవ్వు మొహాన్ని చూడొచ్చు. తన ఫోటో తీసిన షెరాన్ కు ఆమె తన మెడలోని పూసల దండ బహూకరించింది. ఆ పూసల దండలోని రంగులనే వాడి షెరాన్ ఈ చిత్రాన్ని చిత్రించారు.   […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2 

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-2     -కల్లూరి భాస్కరం శాఖోపశాఖలుగా విస్తరించిన ఒక కుటుంబం గురించి చెప్పేటప్పుడు మనం ‘వంశవృక్ష’మనే మాట వాడుతూ ఉంటాం. ఒకే మూలం నుంచి పుట్టిన కుటుంబమే అయినప్పటికీ తరాలు గడిచిన కొద్దీ ఆ కుటుంబ వారసుల మధ్య దూరం పెరిగి సంబంధాలు తగ్గిపోతూ ఉంటాయి. అసలు ఒకరినొకరు గుర్తించలేని పరిస్థితి వస్తుంది. ఎవరెవరనేది పోల్చుకుని ఉమ్మడి వంశవృక్షం తయారు చేయడం ఒక పెద్ద సవాలవుతుంది. ఒక్క కుటుంబం విషయంలోనే ఇలా ఉంటే, విశ్వమానవకుటుంబం […]

Continue Reading
Posted On :

చిత్రలిపి

చిత్రలిపి ఆత్మగౌరవం ! -మన్నెం శారద రహదారి రాక్షసులకు, రాచ బాటగా మారినప్పుడు ”కష్టమైనా నిష్ఠూరమైనా ముళ్ళ బాటనే నా నడకదారిగా ఎంచుకున్నాను నేను !ఇప్పుడు గాయమోడీ, రక్తాన్ని చిందించే నా అరికాళ్ళే కదానా ఆత్మ గౌరవానికి గీటురాళ్లు!! ***** మన్నెం శారదనా పదహారవ ఏటనుండి కథలు రాస్తున్నాను. నా మొదటి మూడు నవలకి బహుమతులు వచ్చాయి. అనేక కథలు బహుమతులు అందుకున్నాయి. రెండుసార్లు నంది అవార్డ్స్ అందుకున్నాను. తెలుగు యూనివర్సిటీ నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-14

ఒక్కొక్క పువ్వేసి-14 స్వాతంత్ర ఉత్సవాల్ని సంబురించగలమా! -జూపాక సుభద్ర దేశానికి స్వాతంత్ర మొచ్చి నేటికి 75సం|| అయినయని దేశమంతటా వజ్రోత్సవ అమృతోత్సవాలు అట్టహాసంగా జరుగుతున్నయి. వేరే విషయాలు సమస్యలు లేనట్లు  ప్రజలంతా అన్ని సమస్యల నుంచి విముక్తి పొందినట్లు  ఉత్సవాలు చేస్తున్నది భారత ప్రభుత్వము. దేశ సంపద శ్రామికకులాల రక్తం, చెమట నుంచి పెంపొందించబడింది. యివి వారి అభివృద్ధి కోసం జరగాలి. వారి అభివృద్ధి యింకా మిగిలే వుందనే ఎరుక దేశానికి తెలియజేస్తూ జరగాలి. యీ భారత […]

Continue Reading
Posted On :

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-1 

జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-1     -కల్లూరి భాస్కరం చూపితివట నీ నోటను బాపురే పదునాల్గు భువనభాండమ్ముల నా రూపము గనిన యశోదకు తాపము నశియించి జన్మ ధన్యత గాంచెన్ *** లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది నలోకంబగు పెం జీకటి కవ్వల నెవ్వండే కాకృతి వెలుగు నతని నే సేవింతున్ ***           డేవిడ్ రైక్(David Reich)రాసిన WHO WE ARE AND HOW WE GOT HERE అనే […]

Continue Reading
Posted On :

చిత్రలిపి

అక్షరం -మన్నెం శారద అవసరం అలాంటిది ….అర్జెంట్ గా రాయాలి. మరి ….కాగితం. కలం తెచ్చుకున్నానుఏసీ వేసుకుని కాగితంమ్మీద కలం పెట్టేనా ….ఒక్క అక్షరమూ పడదే … అదిలించి బెదిరించినా … అట్టే సోకులు పడకు … అంటూ ఎకసక్కేమాడిఎగిరెగిరి పడ్డాయి … తెల్లబోయి వాటి ఆట చూద్దునా ……..ఓయమ్మో ….. అక్షరాలు ……తక్కువేమీ కాదు కొన్ని అక్షరాలు …కుదురుగా కుదమట్టంగా …!(అ, ఇ, ఉ, ఋ, ఎ,ఐ, ఒ etc ) మరికొన్ని….పక్కనే చేరి సాష్టాంగ పడి కాళ్ళు పట్టుకుని లాగేకుటిల […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-13

ఒక్కొక్క పువ్వేసి-13 స్వాతంత్ర సంరాంగణ – ఉదాదేవి -జూపాక సుభద్ర వీరాంగణ ఉదాదేవి ఝాన్సీరాణిలాగా చరిత్ర పుస్తకాల్లో, ప్రచారం లో  విస్తృతి చేయబడిన పేరుకాదు. భారత చరిత్ర పుస్తకాలకు తెలియని పేరు చరిత్రలకు వినబడని పేరు. బ్రిటిష్  సైన్యాలతో పోరాడకున్నా, ప్రాణ త్యాగం చేయకున్నా ఝాన్సీరాణి యుద్ధం చేసినట్లు అమరత్వం పొందినట్లు, వీరనారి గా చరిత్ర పుస్తకాల నిండా ప్రచారం. కానీ దళిత మహిళలు వివిధ కాలాల్లో, వివిధ రూపాల్లో, అన్ని సందర్భాల్లో దశల్లో, పోరటాల్లో, తిరుగుబాటుల్లో […]

Continue Reading
Posted On :

చిత్రం-38

చిత్రం-38 -గణేశ్వరరావు  కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే, ‘రాయి, సీసా, గాడిద, చెప్పులు’ మీద కూడా కవితలను ఇస్మాయిల్ వినిపిస్తే, ‘ ఏం కథ మట్టుకు వెనకబడిందా?’ అంటూ వాటి మీద రావి. శాస్త్రి కథలు రాసి పారేశారు. ‘కథలు ఇలా ఉండాలి’ అనీ ఒకరంటే ‘కథలు ఇలా కూడా రాయొచ్చు’ అని మరొకరంటారు.ఎవరి జీవితాలు వారివి, ఎవరి అనుభవాలు వారివి అన్నట్లు కళలు కూడా ఏదో […]

Continue Reading
Posted On :

చిత్రలిపి

చిత్రలిపి -మన్నెం శారద ఆ ఇల్లు తరతరాల తాతలనాటి వైభవం రెండు వీధుల నాక్రమించుకుని వీధంతా విశాలం గా పరచుకుని పరచుకుని నెమరువేస్తున్న మృగరాజులా మారుతున్న తరాలను మత్తుగా చూస్తుండేది . కానీ ఇప్పుడా ఇల్లు పూర్తిగా శిధిలం ! పసుపు కొమ్ము వీరి విరిచినట్లు ఐదడుగుల ఆరంగుళాల అమ్మ మ్మ ముదురురంగు జరీ నేత చీరల్లో అడ్డిగా ,.కంటె ఆభరణాలతో మా చిరు సైన్యం ఆకళ్ళు తీరుస్తూ అటూ ఇటూ తిరుగుతుంటే ఆ ఇంటిలో వెలసిన […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-12

ఒక్కొక్క పువ్వేసి-12 రొమ్ములు కోసి పన్ను కట్టిన ప్రాణ త్యాగి – నాంగేళి -జూపాక సుభద్ర కేరళ రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో బహుజన కులాల మహిళలు తమ చాతిమీద చిన్న గుడ్డ పేల్క వేసుకుంటే పన్ను కట్టాల్సిందే. కేరళ బహుజన కులాల మహిళలు రొమ్ము పన్ను మీద, రొమ్ము పన్నుల్లో కూడా వున్న వివక్షల మీద 17 వ శతాబ్దం నుంచి పోరాడు తున్నారని చరిత్రలు చెపుతున్నాయి. కేరళ బహుజన కులాల మహిళలు తమ చాతి మీద […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- ఇప్పుడయితేనేమి….

చిత్రలిపి ఇప్పుడయితేనేమి…. -మన్నెం శారద భూమి గుండ్రమో..లేక పలకలోరేపు మరో శాస్త్రకారుడుద్భవించి….ఇంకెలానో ఉందన్న వింతలేదు నేను మాత్రం బయలు దేరిన చోటికే వచ్చి చేరాను వయసురాని మనసుకి ఒకటే ఆశ! నీలాల నింగి వంగి ఆకుపచ్చని నేలని స్పృశించిన చోటుని ఆర్తిగా తాకాలని…ఆకాశపూలని తెంచి నా సంచినింపుకోవాలనితారలని నా గుమ్మానికి తోరణంగా కట్టినీలాన్ని వలువగా చేసి నా మేనికి చుట్టుకోవాలని…. తిరిగి తిరిగి అలసిసొలసివున్నచోటకే తిరిగి వచ్చి చేరాను ఇప్పుడయితేనేమి ….అవును ఇప్పుడయితేనేమి??? నా సంచిలో మిగిలేవున్నాయి… నిన్నటి కొన్ని జ్ఞాపకాలురేపోమాపో వికసించబోయే కొన్నితియ్యని రేపటి […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-11

ఒక్కొక్క పువ్వేసి-11 ఆధునిక భారత తొలి వెలివాడ రచయిత్రి -జూపాక సుభద్ర ముక్తా సాల్వే పేరు చరిత్రలో చెరిపేయలేని గొప్ప రచయిత్రి పేరు. 15-02-1855 మరియు 1-03-1855 సంవత్సరం ‘జ్ఞానోదయమ్’ పత్రిక లో ‘మాంగ్ మహారాచ్య దుఖ్విసయి ‘ (Grief of the Mangs and Mahars)( మాoగ్ మహర్ల దుఃఖం) ముక్తా సాల్వే వ్యాసము రెండు భాగాలుగా వచ్చిన రచన. ఆ రచన లేవదీసిన అంశాలు ఆ కాలంలో సంచలనం. ముక్తా సాల్వే రాసిన ఈ […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -7

వెనుకటి వెండితెర-7 కన్యాశుల్కం -ఇంద్రగంటి జానకీబాల ఆధునిక తెలుగు సాహిత్యంలో ‘కన్యాశుల్కం’ నాటకానికి ప్రత్యేక స్థానముంది.  అది ఒక నాటకమే అయినా సాహిత్యం లోవున్న అన్ని ప్రక్రియల్ని తలదన్ని నిలబడటం అంటే సామాన్య విషయం  కాదు. ఒకానొక సమయంలో ఆడ పిల్లల్ని కన్యాశుల్కం పేరు తో డబ్బులు తీసుకొని, పెళ్లి కొడుకు ముసలి వాడైనా మూర్ఖుడైనా ఆడ పిల్లల్ని అమ్మేయడం అనే దుష్టసంప్రదాయం వుండేది.  అది కూడా ఆంధ్ర దేశానికి తూర్పున వెళ్తుంటే ఇలాంటి దుర్మార్గం – […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-10

ఒక్కొక్క పువ్వేసి-10 విస్మృత వీర నారి ఝల్కారీబాయి -జూపాక సుభద్ర           చరిత్రను చరిత్రగా కాకుండా ఆధిపత్య కులదృష్టితో చూడడము వల్ల బహుజన కులాలకు చెందిన త్యాగాల చరిత్రలను కనుమరుగు చేయడం జరిగింది. చరిత్రంటే ఆధిపత్య కుల వ్యక్తుల చరిత్రనే చరిత్రగా చూపించుతున్నది ఆధిపత్య కులవ్యవస్థ. భారతదేశ చరిత్రలు తిరగేస్తే అణగారిన కులసమూహాల మహిళలు, మగవారు కనిపించరు. అణగారిన కులాల మహిళల త్యాగాలు, బలిదానాలు, చరిత్ర అంచుల్ని కూడా చేరని వివక్షల […]

Continue Reading
Posted On :

చిత్రలిపి-ఎప్పుడూ అదే కల!

చిత్రలిపి ఎప్పుడూ అదే కల! -మన్నెం శారద నడిరేయి దాటిన ఏ జాముకోఅదాటున ఉలిక్కిపడి నిద్ర లేస్తాను .. ఎవరో తట్టిలేపినట్లు . ఆరుబయట ఆకాశం నేలపై బోర్లించిన బేసిన్ లా!కాలుష్యాన్ని కడిగి జల్లెడ పట్టినట్లుగా నేలకి జారుతున్న నీలపు రంగు ..నేల పచ్చని తాకి పసిడిగా మారి మెరుస్తూ ! అక్కడక్కడా జారిన నలకల్లా నక్షత్రాలు మిణుకు మిణుకు మని కులుకుతూ ..! ఎక్కడిదో ఒక దివ్యగానం వీనులసోకిగుండె తంత్రులని మీటుతూ ….రారమ్మని పిలిచిన భ్రాంతి ! ఆకస్మాత్తుగా నా భుజాలపైవీవెనలా విసురుతున్న […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -6

వెనుకటి వెండితెర-9 చక్రపాణి (1954) -ఇంద్రగంటి జానకీబాల మనిషి జీవితంలో హాస్య రసానికి ఒక ప్రధానమైన పాత్ర ఉంది. రకరకాల సమస్యలతో బాధలతో, ఇబ్బందులతో విసిగి పోయినపుడు, కాస్తంత హాయిగా నవ్వుకుంటే బాగుండుననిపిస్తుంది  ఎవరికైనా. కానీ అది తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు అలవోకగా వచ్చి, ఆనందంగా నవ్వుకునేలా చెయ్యాలి. అలా సహజంగా ఉన్నన్నప్పుడే అది మనసుల్ని తేలిక పరుస్తుంది. భరణీ వారి మొదటి చిత్రం రత్నమాల. తర్వాత లైలామజ్ను, ప్రేమ, చండీరాణీ లాంటి చిత్రాల నిర్మాణం […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-9

ఒక్కొక్క పువ్వేసి-9 ఆధునిక భారత మొదటి ముస్లిమ్ టీచర్ ఫాతిమాషేక్ -జూపాక సుభద్ర ‘ఫాతిమాషేక్’ ఈ మధ్య కాలంలో బాగా వినబడుతున్న ప్రముఖమైన పేరు. ఫాతిమా షేక్, ఆధునిక భారత తొలి టీచర్ సావిత్రి బాయి పూలేతో కలిసి అధ్యాపకురాలి గా, సంస్కర్తగా పని చేసిన ఆధునిక భారతదేశ మొదటి ముస్లిమ్ అధ్యాపకురాలనీ ఆమె కృషిని గురించిన సమాచారాన్ని పుస్తకంగా తెలుగు ప్రపంచానికి తెలియజేసిన జర్నలిస్టు, పరిశోధకులు, రచయిత సయ్యద్ నశీర్ అహమ్మద్ అభినందనీయులు. చరిత్ర పుస్తకాల్లో […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-8

ఒక్కొక్క పువ్వేసి-8 అట్టడుగు కులాలకు మహిళలకు అక్షరాలద్దిన మొదటి టీచర్ సావిత్రీబాయి ఫూలే -జూపాక సుభద్ర కుల వ్యవస్థలో మానవ హక్కులు కోల్పోయిన శూద్ర, దళిత కులాలకు, స్త్రీలకు 1848 లోనే ప్రత్యేక పాఠశాలలు నెలకొల్పి వారికి చదువు చెప్పిన , మొదటి ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే. బతికినంత కాలం స్త్రీ విద్యకోసం, అంటబడని వారికి చదువు నందించడానికి శ్రమించింది.బ్రాహ్మణాధిక్య హిందూసమాజంపై తిరుగు బాటు చేసింది. మద్యపానం పై పోరాడింది. కార్మిక,కర్షక అభ్యున్నతికి ఉద్యమాలు నడిపింది. జ్యోతిబాపూలె […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-7

ఒక్కొక్క పువ్వేసి-7 సామాజిక సేవా చరిత్రలో బహుజన మహిళ -జూపాక సుభద్ర భారతదేశంలో బహుజన కులాల మహిళలు ఎస్సీ,ఎస్టీ ,బీసీలు,కొన్ని మైనారిటీ తెగలుగావున్నమహిళల జనాభా సగభాగంగా వున్న ఉత్పత్తి శక్తులు.వీరికి సామాజికంగా ఉత్పత్తి సంబంధిత జీవితమే గాని,నాలుగ్గోడల మధ్య వున్న జీవితాలు కావు. గడప దాటితేనే కడుపు నిండే జీవితాలు. వంట ఇండ్లు లేని జీవితాలు. గట్క/సంకటి/ అంబలి ఇవ్వే,కూర ఎప్పుడో ఒకసారి. పొద్దుగాల మూడు రాళ్ల పొయ్యి,సాయంత్రం పనికి బొయి వచ్చేటాలకు పిల్లి కుక్కలు ఆడే […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-6

ఒక్కొక్క పువ్వేసి-6 మద్యమ్ మత్తు నేరాలకు ఎవరు బాధ్యులు? -జూపాక సుభద్ర ఈ మద్య హుజురాబాద్ బై ఎలక్షన్స్ సందర్బంగా తెలంగాణ ప్రభుత్వము ‘దళిత బంధు’ ను ప్రకటించినట్లు మద్యం షాపుల కేటాయిపుల్లో ఎస్సీలకు 10%, ఎస్టీలకు 5% గౌండ్లవాల్లకు 15% రిజర్వేషండ్లనీ, యింకా నాలుగు వందల నాలుగు (404) మద్యం షాపులు పెంచుతున్నామని ప్రకటించింది.ఈ సంగతి టీవీలో చూసిన మా అటెండర్ విజయ వచ్చి ’ఏందమ్మా ! గీ ముచ్చటిన్నవా, తెలంగాణను ఇదివరకే కల్లుల ముంచి […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-5

ఒక్కొక్క పువ్వేసి-5 సచివాలయంలో అంటరాని బతకమ్మ -జూపాక సుభద్ర సద్దుల బత్కమ్మ పండుగ, తెలంగాణకు, అందులో శ్రమకులాల మహిళలకు ప్రత్యేకమ్. బ్రాహ్మణ, గడీ దొర్సానులు బత్కమ్మలు ఆడరు. భూస్వామ్య మహిళలు ఆడరు. యీ పండగ ఫక్తు శ్రమకులాల మహిళల పండుగ. బత్కమ్మంటే ప్రకృతి పండుగ. బూమంతా పూలు, పచ్చలు, చెరువులతో, పంటలతో కళకళ లాడే పండగ. ఆడపిల్లలంతా పుట్టింటికి చేరేపండగ. కులసమాజంలో అన్నిరంగాల్లో ’కులవివక్షలున్నట్లు, కులనిషేధాలు వున్నట్లు బత్కమ్మ పండుగ మీద కూడా నిషేధాలున్నయి. ‘ఎస్సీ మహిళలు […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -5

వెనుకటి వెండితెర-6 వెలుగు నీడలు -ఇంద్రగంటి జానకీబాల 1950 ల తర్వాత తెలుగులో మంచి సినిమాలు తీసిన సంస్థలలో అన్నపూర్ణా పిక్చర్స్ ఒకటి అప్పటికే విజయా, వాహిని, భరణి లాంటి సంస్థలు కొన్ని ప్రయోగాలు చేస్తూ, సహజ సిద్ధమైన కథలతో సినిమాని రూపొందిస్తూ ప్రేక్షకుల్లోనూ, పరిశ్రమలోనూ మంచి గుర్తింపు పొందుతూ, ఆర్థికంగా కూడా విజయాలు చే చిక్కించుకుంటున్న సమయం అది. ఒక మంచి కథ, అందులో ఆదర్శం సమాజానికి స్ఫూర్తి కలిగించే నీతి సహజత్వం వుండేలా చూస్తున్న […]

Continue Reading

ఒక్కొక్క పువ్వేసి-4

ఒక్కొక్క పువ్వేసి-4 -జూపాక సుభద్ర నేరాలు పట్టని ఘోరాలు ‘సారూ మాది నక్కలగండి, దేవరకొండ పాజెట్టుల భూమికి బాసినోల్లము. భూమి వోయిందని నాకొడుకు సచ్చిపోయిండు. బతికే బతుకుదెరువు లేక నాసిన్నకొడుకు పెండ్లం పిల్లలతోని పట్నమొచ్చి ఆటో తోల్కుంటుండు. నా కోడలు మిషినికుడ్తది. ముగ్గురు పిల్లల్తోని యెట్లనో కాలమెల్లదీత్తండ్రు. వూల్లేమి గాలిపోయిందని మేంగూడ యెక్కువ యీ బస్తిల్నేవుంటము. యిది సింగరేని కాలనీ బస్తంటరు. గీ బస్తిల మాయిండ్లు 10, 20 గజాలల్ల నాలుగు రేకులు దొర్కితె సాలు, గోడలు […]

Continue Reading
Posted On :

ప్రమద – కుప్పిలి పద్మ “ఎల్లో రిబ్బన్” మోహలేఖలపై సమీక్ష –

ప్రమద ప్రకృతి ఎదపై  మోహపు ఆనవాళ్ళు! కుప్పిలి పద్మ “ఎల్లో రిబ్బన్” మోహలేఖలు!!   -సి.వి. సురేష్ Many eyes go through the meadow, but few see the flowers in it. —Ralph Waldo Emerson చాల కండ్లు పచ్చిక బయిళ్ళ ను మాత్రమే పరిశీలిస్తాయి. కానీ, కొన్ని కండ్లు మాత్రమే అందులోని పువ్వుల్ని చూడగలుగు తాయి… ఎమెర్సన్  ** ఈ రచయత్రి కనులు ఒక సెకన్లో వందల కొలది  ఫ్రేమ్స్ ను  […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-3

ఒక్కొక్క పువ్వేసి-3 భారతక్రీడలు – కులజెండర్ వివక్షలు   –జూపాక సుభద్ర మగవాల్లు బలాడ్యులనీ, ఆడవాల్లు అబలులనీ అవమానకరంగా ప్రచారంచేస్తున్న ఆదిపత్యకుల మగ సమాజము ఒక్కసారి పొలాలకు, అడవుల్లకు పోయి పనిచేసే ఆడవాల్లను గమనించండి తెలుస్తది శ్రమ కులాల మహిళల ప్రతాపములు, బలాలు. పొలాల్లో మగోల్లకంటే ఎక్కువ బరువులెత్తేవాల్లు మగవాల్లకంటే ధీటుగా పనిచేసే మహిళలు కోకొల్లలుగా కనిపిస్తుంటరు. అడవిలో చెట్లు కొట్టగలరు, పెద్ద పెద్ద మొద్దులు మోయ గలరు. పులుల్ని, విషజంతువుల్ని గూడ వేటాడగలరు. వాల్లకు ఆరుబయలు, […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -4

వెనుకటి వెండితెర-5 -ఇంద్రగంటి జానకీబాల అక్కినేని నాగేశ్వరరావు గారు నటుడిగా బాగా స్థిరపడి, ప్రేక్షకుల్లో అబిమానం సంపాదించి, అతను కనిపిస్తే సినిమా కోసం జనం ఉషారుగా పరుగులు పెట్టే స్థితికి చేరుకున్నాక, చిత్ర నిరామణంలోకి అడుగుపెట్టారు. 1944 లో సినీ రంగప్రవేశం చేసిన యన సుమారు పదేళ్ళు నటులుగానే కొనసాగారు. అప్పట్లో మంచి అభిరుచి, సినిమాపట్ల గొప్ప ఆరాధన, ఆదర్శం ర్పరచుకున్నారు. సినిమా అంటే దాని కొక అర్థం, సార్థకత వుండాలి. సమాజాన్ని ప్రతిఫలించేదిగా వుండాలని భావించి […]

Continue Reading

ప్రమద -పద్మా సచ్ దేవ్

ప్రమద పద్మా సచ్ దేవ్  -సి.వి. సురేష్ (ఇటీవల మరణించిన ప్రసిద్ధ డోగ్రీ కవయిత్రి పద్మా సచ్ దేవ్ మృతికి నివాళిగా ఈ నెల ప్రమదలో వారి గురించిన వివరాలు, వారి కవితకు అనువాదాన్ని అందజేస్తున్నాం-)   2021  ఒక పీడ కల.  ఎందరో మహామహుల్ని కోల్పోయాము.  అలాంటి వారిలో  పద్మా సచ్ దేవ్ ఒకరు. ఈ నెల నాలుగో తేదీ ఆమె శివైక్యం చెందారు.  పద్మా సచ్ దేవ్ ప్రసిద్ధ డోగ్రీ కవయిత్రి,  నవలా రచయిత్రి.  […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-2

ఒక్కొక్క పువ్వేసి-2 మరియమ్మలు మనలేని భారత్   –జూపాక సుభద్ర ఈ దేశంలో మరియమ్మ వంటి దళిత మహిళల మీద బైటి మనుషులు కాదు, ప్రభుత్వ పోలీసు యంత్రాంతమే హత్య చేసినా పౌర సమాజాలు పలుకయి, ఒక్క కొవ్వొత్తి వెలగది, ఒక్క నిరసన నినదించది, ఒక్క అక్షరమ్ అల్లుకోదు, ఏ ఉద్యమ దుకాణాలు ఉలకవు, మహిళా కమిషండ్లకి, సంగాలకు మనసురాదు. చీమ చిటుక్కమన్నా డైరెక్ట్ లైవులతోని చెప్పిందే పదిసార్లు చెప్పి సంచలనాలు వండే టీవీ చానెల్లు యీ […]

Continue Reading
Posted On :

ప్రమద -శిరీష బండ్ల

ప్రమద శిరీష బండ్ల ఆంగ్ల ఇంటర్వ్యూ: Molly Kearns తెలుగు అనుసృజన : సి.వి. సురేష్   ఈ నెల 11న అమెరికాకు చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ ఓ వ్యోమనౌకను నింగిలోకి పంపిస్తూంది. ఈ వ్యోమనౌకలో వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అధిపతి సర్ రిచర్డ్ బ్రాన్సన్, మరో ఇద్దరు కంపెనీ ప్రతినిధులతో కలిసి తెలుగు యువతి, సంస్థ ఉపాధ్యక్షురాలు శిరీష బండ్ల అంతరిక్షంలోకి వెళ్లబోతున్నారు. ఈ సందర్భంగా శిరీష బండ్లతో ఇంటర్వ్యూని తెలుగులో నెచ్చెలి పాఠకుల కోసం […]

Continue Reading
Posted On :

ఒక్కొక్క పువ్వేసి-1

ఒక్కొక్క పువ్వేసి-1 స్మశానంలో కూడా చావని ఆంక్షలు   –జూపాక సుభద్ర ఈ మద్య ఒక సెలెబ్రిటీ భర్త చనిపోతే… భర్త శవయాత్రతో పాటు సాగింది నిప్పు కుండతో…. పాడెమోసింది, అంతిమ సంస్కారాలు నిర్వహించింది. దీనిమీద ఆమెను తిట్టిపోసిండ్రు హిందూకులాలు. ‘ఒక ఆడది పాడెమోయొచ్చా, శవయాత్రలో నడవొచ్చా, చితికి నిప్పు పెట్టొచ్చా’ హిందూ సనాతన విలువలు తుంగలో తొక్కిందనీ విమర్శల మీద విమర్శలు. ఆడవాల్లు అంతరిక్షంలోకి పోతున్న యీ కాలంలో యింకా యీ మగ ధిపత్యాలేంటి? మాదుక్కాలమీద […]

Continue Reading
Posted On :

వెనుకటి వెండితెర -3

వెనుకటి వెండితెర-3 పెళ్ళిచేసి చూడు (1952) -ఇంద్రగంటి జానకీబాల రకరకాల భావోద్వేగాలు, ఆదర్శాలు, కళారాధన, కాల్పనిక ఊహలూ గల మంచి మంచి దర్శకులు సినిమాపట్ల ఆకర్షితులై, తెలుగు సినిమాల్లోకి వచ్చారు. సినిమా తీయాలంటే ఆలోచనలు, అభిరుచీ వుంటే చాలదు. డబ్బు బాగా పెట్టుబడి పెట్టగల ధనవంతులు కూడా వుండాలి. సినిమా అనేది ఒక లాటరీలాంటిదే గ్యారంటీగా డబ్బు తిరిగి వస్తుందని ఎవ్వరూ చెప్పలేరు. సినిమా ప్రేక్షకుడికి నచ్చాలీ, డబ్బులు పెట్టి టికెట్ కొనుక్కొని సినిమాహాల్లోకి రావాలి. అదీ […]

Continue Reading

వెనుకటి వెండితెర -2

వెనుకటి వెండితెర-2 -ఇంద్రగంటి జానకీబాల స్ఫూర్తి పొందాల్సిన అవసరం నిజమైన మేధావులు-సంఘం పట్ల అవగాహన, సానునభూతి వున్నవారూ – తెలుగు సినిమా పరిశ్రమలోకి వచ్చి పనిచేయడం మొదలుపెట్టిన కాలం 1950 నుంచి 1960. అప్పుడు వున్న సినిమా చరిత్రను పరిశీలిస్తే – ఎల్.వి. ప్రసాద్- పి. పుల్లయ్య- సి. పుల్లయ్య- కె.వి. రెడ్డి, బి.ఎన్. రెడ్డి లాంటి సుప్రసిద్ధ దర్శకులు కనిపిస్తారు. వారెప్పుడూ మంచి కథల కోసం వేట సాగించేవారు. కథలు ఇతర భాషలవైనా, అది సినిమాగా […]

Continue Reading

వెనుకటి వెండితెర -1

వెనుకటి వెండితెర-1 -ఇంద్రగంటి జానకీబాల తెలుగువారు చాలా తెలివైన వారు, కార్యశూరులు, ఉత్సాహవంతులు, ధైర్యం కలవారు అని చెప్పడానికి మనకి చరిత్రలో చాలా సందర్భాలే స్ఫురణకొస్తాయి. ముఖ్యంగా సినిమా నిర్మాణం విషయంలో మన పెద్దలు చాలామందికంటే ముందు వున్నారని చెప్పుకోక తప్పదు. భారతీయ చలనిత్ర నిర్మాణంలో టాకీ (మాట్లాడే సినిమా) వచ్చిందనగానే తెలుగులోనూ టాకీలు తీయాలని ఉత్సాహపడి ప్రయత్నాలు మొదలుపెట్టినవారిలో దక్షిణాదిని తెలుగువారు మొదటివారు. 1931లోనే హెచ్.ఎమ్. రెడ్డిగారు తెలుగు సినిమా నిర్మాణ కార్యక్రమం మొదలుపెట్టారు. సినిమా […]

Continue Reading

ప్రమద -అమండా గోర్‌మన్

ప్రమద అమండా గోర్‌మన్ –సి.వి.సురేష్  1998 లో  లాస్ ఏంజెల్స్ లో జన్మించింది.  ఆమె తల్లి జాన్ విక్స్. 6th గ్రేడ్  ఇంగ్లీష్ ఉపాధ్యాయురాలు. సింగల్ మదర్. అమండ గోర్మన్ మరియు గబ్రియలి ఇద్దరూ కవల పిల్లలు. టెలివిజన్ సౌకర్యం కూడా తక్కువగా ఉన్న ప్రాంతం, వాతావరణం లో పెరిగింది.  తన యవ్వన దశను Weird child  గా పెరిగానని అనుకుంటుంది. తన తల్లి ప్రోత్సాహం తో చదవడం, రాయడం పైన బాగా దృష్టి పెట్టింది. చాల […]

Continue Reading
Posted On :

ప్రమద -రాజేశ్వరి

ప్రమద రాజేశ్వరి రామాయణం –సి.వి.సురేష్  “In spite of difference of soil and climate, of language and manners, of laws and customs, in spite of things silently gone out of mind and things violently destroyed, the Poet binds together by passion and knowledge the vast empire of human society, as it is spread over the whole earth, […]

Continue Reading
Posted On :

ప్రమద -ఫణిమాధవి కన్నోజు

ప్రమద ఫణిమాధవి కన్నోజు –సి.వి.సురేష్  నిన్నేదైతే గాయపరిచి౦దో దాన్ని గురించి గట్టిగా, చాల స్పష్టంగా రాయమని ఎర్నేస్ట్ హెమ్మింగ్వే చెప్తారు. Write hard and clear about what hurts – EARNEST HEMINGWAY కవిత్వం ఎలా పుట్టుకొస్తుంది అన్న అంశం పై షరోన్ ఒల్డ్స్ తన “The dead and living” పుస్తకం లో అనేక అంశాలను చెప్పుకొస్తూ.. “Out of memory—a dress I lent my daughter on her way back to college;” అనే ఒక […]

Continue Reading
Posted On :

ప్రమద -నందిని సాహు

ప్రమద నందిని సాహు –సి.వి.సురేష్    “నా కలం నాలిక పై ఎప్పుడైతే పదాలు నర్తిస్తాయో.ఏది కూడా దాచుకోకుండా..ఏ దాన్ని, వదలకుండాపొంగి పొరలే నదిలా నేను  భాష ను అనుభూతిస్తాను నా మది అంతః పొదల నుండి కట్టలు తెంచుకొని కవిత్వం వెల్లువై ప్రవహిస్తుంది… మీరెందుకు కవిత్వాన్ని రాస్తారు? అన్న ప్రశ్నకు …ఆమె కోట్ చేసిన సమాధానం ఇది. తన ఏడవ తరగతి లోనే మాతృ బాష అయిన ఒడియ లో మొదటి పోయెమ్ ను రాసిన నందిని సాహు  ఒరిస్సా లోని జి. ఉదయ గిరి లో […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ-2

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ-2 -వసుధారాణి  ఉత్తరం అన్ని హంగులతో పూర్తి చేసి మా అక్కయ్యా వాళ్ళింటి పక్కన పెట్టిన తపాలా డబ్బాలో వేసేసాం.ఇక మేము అనుకున్న వారికి అది చేరటం , మేము అందులో  పొందుపరిచిన విషయం వారి మీద చూపబోయే ప్రభావం గురించి ఊహల్లోకి వెళ్లిపోయాం. ఇంతలోకి మా కిషోర్ బాబు అసలు విషయం చెప్పాడు.వాడికి ఓ అలవాటు ఉంది ఏది వద్దు అంటే అది చేయటం.ఆ విషయంలో వాడి మాట వాడే […]

Continue Reading
Posted On :

ప్రమద -శృతి హాసన్(ఒక మాట దొర్లితే-కవిత)

ప్రమద శృతి హాసన్ ఒక  మాట దొర్లితే (కవిత) –సి.వి.సురేష్  నవంబర్ 20, 2013 లో ఒకరోజు ఉదయాన్నే ఆమె తన ఇంట్లో ఉండగా, ఒక దుండగుడు ఇంటి తలుపు తట్టి, ఆమె తలువు తీసాక,  “నువ్వు నన్నెందుకు గుర్తు పట్టడం లేదు. ఎందుకు మాట్లాడటం లేదు”? అని ప్రశ్నించాడు.”నువ్వెవరో నాకు తెలియదు” అని ఆమె బదులిచ్చింది. అయితే ఆ దుండగుడు ఆమె గొంతు పట్టుకొని లోపలికి చొరబడేందుకు ప్రయత్నించాడు. వెంటనే, ఆమె అతన్ని వెనక్కు తోసి, […]

Continue Reading
Posted On :

ఇట్లు  మీ వసుధా రాణి- ఉత్తరాల వేళ

ఇట్లు మీ వసుధారాణి ఉత్తరాల వేళ -వసుధారాణి  ప్రతి విషయాన్నీ తెలుసుకోవాలనే ఉత్సుకత ,ఉత్సాహం ఎక్కువగా ఉండే బాల్యావస్థలో చక్కటి మార్గదర్శనం చేయటానికి మాకు దొరికిన మార్గదర్శి మా కృష్ణానందం బావగారు.మా రెండవ అక్కయ్యా,బావగార్లయిన సావిత్రి,కృష్ణానందం (ఇద్దరూ జువాలజీ లెక్చరర్లు)వాళ్ళ పిల్లలు చిన్నారి,కిషోర్ తో పాటు నన్ను కూడా వారింట పుట్టిన పిల్లలా చూసేవాళ్ళు.మా బావగారు పిల్లల పెంపకం గురించి మా కాలం కంటే చాలా ముందు ఆలోచనలు చేసి మా ముగ్గురి పెంపకం కొంచెం ప్రయోగాత్మకం […]

Continue Reading
Posted On :