image_print

జ్ఞాపకాలసందడి -48

జ్ఞాపకాల సందడి-48 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 25           అమ్మమ్మ, అమ్మ తరంలో ఆడవాళ్ళ బతుకులు. అధ్వాన్నంగా ఉండేవి.  పిల్లలను కనడం పెంచడం వంటింటి చాకిరీతో, రాత్రి పగలు సతమతమవడం తప్ప వారికంటూ వేరే ప్రపంచం ఉండేది కాదు. ప్రతి ఇంటా ఇవే కథలు, ఇదే చాకిరీ. కనీసం ఇంటికో విధవరాలుండేది. చిన్నప్పుడే,  పదేళ్ళకే పెళ్లి చేయడం, కాపురానికి వెళ్ళకుండానే, భర్త పోతే గుండు గీసి, తెల్ల పంచ కట్టించి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -47

జ్ఞాపకాల సందడి-47 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 24           ఆ రోజుల్లో అందరు సుష్ఠుగా తినేవారు పూటపూటా. మధ్యాహ్నం అంత హెవీగ తింటే మళ్లీ  ఏమీ తినలేం ఇప్పుడయితే. సాయంత్రం ఫలహారాలు. మళ్ళీ రాత్రి భోజనాలు. అలా ఐదు రోజులు పెట్టింది పెట్టకుండా మెనూ రాసుకుని వండించేవారు.  ఆ తిండి చూస్తే ఆశ్చర్యం  వేస్తుంది. అప్పటి అరుగుదల శక్తి అలా ఉండేది. పై ఊరి నుంచి  వచ్చిన వారు బండి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -46

జ్ఞాపకాల సందడి-46 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 23          పెళ్ళికి మూడు రోజులుందనగా నాన్న మందీ మార్బలంతో దిగేవారు. ఒక సూపర్ వైజర్, నలుగురు కూలీలను వెంట బెట్టుకుని దిగేవారు. హడావుడి మొదలు. పందిర్లు వేయడం, గాడిపొయ్యి తవ్వించడం, పెరడంతా బాగు చేయడం, గడ్డి గాదం పీకించి, చదును చేయించి, ఎత్తుపల్లాలు లేకుండా నాలుగైదు సార్లు దిమిసా కొట్టించి, నాలుగయిదుసార్లు పేడనీళ్ళు జల్లించే వారు. ఆ రోజుల్లో టేబుల్ మీల్స్ ఎక్కువుండేవి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -45

జ్ఞాపకాల సందడి-45 -డి.కామేశ్వరి  కావమ్మ కబుర్లు – 22           ఆ రోజుల్లో పెళ్లి అంటే రెండు నెలలు ముందే పనులు మొదలుపెట్టే వారు. మంచి రోజు చూసి విఘ్నేశ్వర పూజచేసి పసుపు దంచి, మీదు కట్టేవారు. మీదు అంటే పసుపు గుడ్డలో, పూజ బియ్యం, దంచిన పసుపు వేసి మూటకట్టి దాచి పెళ్లినాడు అవి తలంబ్రాల  బియ్యంలో కలిపేవారు. అంటే పెళ్లి పనులకి శ్రీకారం చుట్టడం అన్నమాట. ముందు అప్పడాలతో మొదలు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -44

జ్ఞాపకాల సందడి-44 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -20          మా నాన్న క్లబ్ నించి తెచ్చే ల.న మ్యాగజైన్స్ లో భారతిలో ఒకే ఒక్క కథ వేసినా, ఎంత మంచి కథలుండేవో! అలా చదివిన పురాణం కథలలో ‘కోతి’ అనే కథ ఈనాటికీ నా మనసులో నిలిచిపోయింది. పురాణంవి ఎన్నో మంచి కథలు చదివి ఆయన అభిమానిని అయిపోయాను.           ఆయన, నీలి, సీతాజడ… పేర్లు గుర్తు లేవు. […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -43

జ్ఞాపకాల సందడి-43 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -18           ఆ రోజుల్లోనే రామచంద్రాపురంలో మంచి లైబ్రరీ ఉండేది. శరత్ బాబు, చలం, కొవ్వలి, జంపన, బకించంద్ర ఛటర్జీ, అడవి బాపిరాజు వగైరా పుస్తకాలుండేవి. నాకు పన్నెండేళ్ళు వచ్చిన దగ్గర నుండి పుస్తకాలు చదివే అలవాటు అబ్బింది. దానికి కారణం మా అక్క అనిచెప్పాలి. లైబ్రరీకి అపుడపుడు నన్ను దొంగతనంగా పంపేది. అపుడు చలం, కొవ్వలి పుస్తకాలు ఇంట్లో పెద్దవాళ్ల చదవనిచ్చే వాళ్ళు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -42

జ్ఞాపకాల సందడి-42 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -16           చిన్నపుడు బాగా పెరిగాం  అంటే ఇన్ని బట్టలు, ఇంతంత బంగారాలు పెట్టుకుని సిరిసంపదల మధ్య పెరిగాం అని కాదు. మామూలు మధ్య తరగతి వాళ్ళమే. ప్రతీ పండక్కీ బట్టలు, ఆడపిల్లలందరికి తలో గొలుసు, రెండు జతల బంగారు గాజులు, చెవులకి దుద్దులు, వేలికి ఉంగరం ఉండేవి అంతే. అలా చిన్నప్పటి నుంచీ అలవాటయి పోయి ఇప్పుడున్నా పెట్టుకో బుద్ధి వేయదు. అత్తవారు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -41

జ్ఞాపకాల సందడి-41 -డి.కామేశ్వరి   కావమ్మ కబుర్లు -15           కరెంట్ అంటే ఆ రోజుల్లో మాకు తెలిసిన అర్థం దీపాలు దాంతో వెలుగుతాయని. మరి ఈ నీళ్లలో కరంట్ ఏమిటో అంతుబట్టక పోయినా, కారు ఉన్న పడవ ఒక పక్కకి లాగేయడం, అందరు భయపడి కరెంట్ లాగేస్తుంది అని అరవడం… ఇదంతా ఏమిటో తెలియక భయపడిపోయాం పిల్లలందరం. పదేళ్ల పిల్లకి ఏం తెలుస్తాయి ఈ విషయాలు?  ఇప్పటిలా ఏం ఎక్సపోజర్ ఉండేది […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -40

జ్ఞాపకాల సందడి-40 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -13           ఆయనకి పప్పు అంటే కందిపప్పు వేయించి పప్పు వండడం కాదు, కందులు వేయించి పప్పులు విసిరి, పొట్టు  తీసి వండాలి. పప్పు సన్నని సెగ మీద కుంపటి మీద ఉడికిన ఆ పప్పు రుచి తల్చుకుంటే ఇప్పటికీ నోరు ఊరుతుంది.  అలాటి కమ్మని పప్పు అన్నంలో నెయ్యి వేసుకుని తినే ఆ రుచి సామిరంగా ఉంటుంది.  అలా ఒకో ముద్దకి ఒకో […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -39

జ్ఞాపకాల సందడి-39 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -11 మా అమ్మ           అమ్మ అంటే వేళవేళకి కమ్మగా వండి పెట్టేదన్న అర్ధమే మాకు తెల్సిన అర్ధం ఆనాడు. ఎందుకంటే ఎప్పుడు చూసిన వంటింట్లోనే ఉండేది అమ్మ. మా అమ్మమ్మ గారి ఇల్లులా  ధర్మసత్రంలా కాకపోయినా ఆరుగురు పిల్లలున్నాయిల్లు. ఆవిడా వంటలు చేస్తూ, టిఫిన్లు చేస్తూ.,పప్పులుఉప్పులూ బాగుచేస్తూనో, మజ్జిగ చేస్తూనో, చదన్నలు పెడుతూనో., వంటిల్లు తన సామ్రాజ్యం అన్నట్టుండేది . మా నాన్నగారు […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -38

జ్ఞాపకాల సందడి-38 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -9 మా తాతగారు            మా తాతగారు చల్ల కామేశ్వరరావు గారు. ఆ రోజుల్లో పెద్ద లాయరు .పెద్దాపురం లో పుట్టి కాకినాడలో ఇంటరు, మద్రాస్ లో లా చదివి, కాకినాడలో లాయరుగా ప్రాక్టీస్ పేట్టి, ఆయన ఆ రోజుల్లో బాగా ఆర్జించారు. మా తాతగారు ఆరడుగుల పొడుగుతో చక్కగా ఉండేవారు. మా అమ్మమ్మయితే ఏంతో అందగత్తె కిందేలెక్క. పచ్చటిచ్చాయ.  కళ కళలాడే మొహం. […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -37

జ్ఞాపకాల సందడి-37 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -8 మా అమ్మమ్మ (రెండవ భాగం)           అపుడు బంధువుల మధ్య సహాయ సహకారాలు, అభిమానాలు, ఆప్యాయతలు కాదనలేని అవసరాలుండేవి. కనుక పిల్లలను పంపడానికి వాళ్ళు ఆలోచించేవారు కాదు. ఇంట్లో పెట్టుకోడానికి వీళ్ళు అభ్యంతరం చెప్పే వాళ్ళు కాదు. ఆ రోజుల్లో మా నాన్న గారికి తరచుగా ట్రాన్స్ఫర్లు అవుతూ ఉండడంతో బదిలీ అయి వెళ్లే ఊర్లలో చదువులు, స్కూల్స్ సరిగాలేక అమ్మమ్మగారింట్లో అక్కను, […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -36

జ్ఞాపకాల సందడి-36 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -5 వారాలబ్బాయి (మొదటి భాగం)           వారం అంటే పల్లెల నించి చదువుకోడానికి వచ్చే బీద అబ్బాయిలు కలిగిన  వారింట ‘వారంలో ఒక రోజు మీ ఇంట భోజనం పెట్టండి’ అని అడిగి, ‘ఫలానా రోజు మీ ఇంటికి వస్తాను’ అని చెప్పడం అన్న మాట. అలా బ్రాహ్మణ ఇళ్లల్లో ఏడు రోజులు వారం కుదుర్చుకుని ఆ ఇంటి అరుగు మీద పడుకుని, నూతి […]

Continue Reading
Posted On :

జ్ఞాపకాలసందడి -35

జ్ఞాపకాల సందడి-35 -డి.కామేశ్వరి   కావమ్మ  కబుర్లు -4            ఆ రోజుల్లో కరెంట్ ఉండేది కాదు అన్ని ఊళ్ళల్లో. .పెద్ద పట్టణాల్లో తప్ప. కిరసనాయిలు, దీపం లాంతరు పెట్టుకుని పిల్లలు అందరూ చుట్టూ కూర్చుని చదువుకునే వారం. అందుకే ఎక్కువగా ఉదయం పూట  ఎక్కువ చదువుకునే వారం . ఆరు గంటలకల్లా లేపేసేవారు. కాలకృత్యాలు తీర్చుకుని, స్నానం చేసి ఏడు నించి తొమ్మిది వరకు చదువుకుని, చద్దన్నాలు తినేసి స్కూలూకి వెళ్లి, […]

Continue Reading
Posted On :