కథాకాహళి- కె.సుభాషిణి కథలు
కథా కాహళి (స్త్రీ కంఠస్వరం) – ప్రొ|| కె. శ్రీదేవి కె.సుభాషిణి కథలు సుభాషిణి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాల, కర్నూలులో ఉద్యోగబాధ్యతలు నిర్వ హిస్తున్నారు. ఈమె రాసిన దాదాపు నలబైఐదు కథలు రెండు సంకలనాలుగా వచ్చాయి. సుభాషిణి కథలలో ప్రధానంగా వస్తువైవిధ్యం మూడు ధోరణులలో కనబడుతుంది. మొదటి సంపుటి “మర్మమెల్లా గ్రహించితిని తల్లీ” లోని కథలు కార్పొరేట్ విద్యావ్యవస్థలో చోటుచేసుకొన్న సంసృతిని, దానివలన పర్యావసానాలు, ప్రతిఫలనాల గురించి చర్చించిన కథలు. ముఖ్యంగా కార్పొరేట్ పెట్టుబడి విద్యవ్యవస్థను ఎలా ప్రభావితం చేయగలిగిందో, తన ఉద్యోగ జీవితంలో ఎదురైన అనుభవ చైతన్యం నుంచి రచయిత్రి పట్టుకోగలిగింది. అర్థిక సరళీకృత సంస్కరణల ప్రభావాలను, స్త్రీలపై పడుతున్న అదనపు భారాలను, ఆక్రమంలో […]
Continue Reading