image_print

ఎండి తుమ్మ గజ్జెలు (కవిత)

ఎండి తుమ్మ గజ్జెలు -గుమ్మల సాయితేజ ఆడుతున్న మా అయ్య చెప్పిన ఎండి తుమ్మ గజ్జెలు కట్టి ఆడుతున్న  నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న కొత్త బొబ్బలెక్కిన పెయ్యి ఏడెక్కినకంట్లో నీళ్లు బయటికొస్తేచెమట అనుకోని తుడుసుకుంట  ఆ డముకు డముకు సప్పుల్ల  నా ఏడుపును కలిపేసి పండ్లు ఇకిలిచ్చి కండ్లు సిన్నంగ చేసి నడుం మీదో చేయి నెత్తి మీదో చేయి పెట్టి  భరతనాట్యం అయ్య పిల్ల తిని చాలా రోజులైందయ్య అని పాన్ పరాగ్ ఉమ్మేసుకుంటా చెప్తున్న  మా అయ్య మొహం చూసి నవ్వుతున్న నవ్వుతూ ఆడుతున్న  మూగవోయిన చేయి చూపించి పైసలు ఇచ్చిన పెద్దనాన్న , మామయ్య , పెద్దమ్మలను చూసి పొర్లు దండాలు పెడుతున్న తమ్ముని చూసి అయ్యా […]

Continue Reading
Posted On :