image_print

బొమ్మల్కతలు-27

బొమ్మల్కతలు-27 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ జగమంతా రంగుల నిలయం. ప్రకృతి పరచిన పచ్చదనం, నిర్మలాకాశంలో నిండిన నీలం, వెన్నెల కురిపించే చందమామ తెల్లదనం, నిశీథ రాత్రి కటిక కారుచీకటి లో సైతం కనిపించే నల్లదనం…ఇలా అంతటా, అన్నిటా ఎటు చూసినా రంగులమయ మే. బాల్యంలో మనసున చిలికే తొలి రంగుల చినుకుల ముద్రలు ఎప్పటికీ చెక్కు చెదరవు. అందుకేనేమో అప్పట్లో చిన్నపిల్లలకిష్టమైన బొమ్మలైనా, ఆట వస్తువులైనా, తినుబండారాలైనా అన్నీ ముదురు […]

Continue Reading

చిత్రం-60

చిత్రం-60 -గణేశ్వరరావు  టోనీ ప్రో, కాలిఫోర్నియాకు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహంతో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, పెయింటింగ్ లో శిక్షణ పొందారు.           అతనివి కాల్పనిక చిత్రాలు కావు. ఊహాజనితం కావు. వాస్తవికత నిండినవి. అతను ఎప్పుడూ తన నిజ జీవితంలోని వ్యక్తులను చిత్రించాలని అనుకుంటాడు : తన అందమైన భార్య, పిల్లాడు, తన మిత్రులు, క్లబ్ […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-26

బొమ్మల్కతలు-26 -గిరిధర్ పొట్టేపాళెం           గిరీ..కమాన్…గో…గో…గో…అంటూ చప్పట్లు కొడుతూ స్టేజి మీద మైక్ పట్టుకుని నిలబడ్డ నన్ను ప్రోత్సహిస్తున్నారు మా “విజయవాడ, వి.ఆర్. సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి” స్టూడెంట్స్. దానికి రెండు నిమిషాల ముందే స్టేజి ఎక్కి నిల్చున్నాను. అప్పటి కప్పుడు చీటీలో ఏదో రాసి స్టేజి మీదున్న నాకందించారు. “సెల్ యువర్ క్రియేటివ్ ఐడియాస్” ఇచ్చిన చీటీలో రాసింది మైక్ లో చదివాను. “నా క్రియేటివ్ ఐడియాస్ ని అమ్మమన్నారు” […]

Continue Reading

చిత్రం-59

చిత్రం-59 -గణేశ్వరరావు  మహాకాళి మాత్రమే పది కాళ్ళు, పది చేతులతో చిత్రించబడింది. మరి ఈ ఫోటోలో ఉన్నామె ఎవరు? ఆమె చేతులు ఎన్ని కనిపిస్తున్నాయి? ఏమిటి ఈ మాయాజాలం? ఈ అద్భుతాన్ని చూపిస్తున్న డాన్స్ ఫోటోగ్రాఫర్ లోయిస్ గ్రీన్ ఫీల్డ్ dance photographer గా సుప్రసిద్ధులు.                   సహజ సిద్ధమైన కదలికలను నిశ్చలన ప్రతిబింబాలుగా పట్టుకోవడంలో ఆమె నైపుణ్యం అపారం. నాట్యకారుల అద్భుతమైన నృత్య భంగిమల క్షణాలను […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-25

బొమ్మల్కతలు-25 -గిరిధర్ పొట్టేపాళెం           నా బొమ్మల బాటలో “ఆంధ్రభూమి” సచిత్ర వారపత్రికకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. నా చిన్నప్పుడు నెల నెలా “చందమామ” కొని ప్రతి అక్షరం, ప్రతి బొమ్మా క్షుణ్ణంగా చదివినా, టీనేజ్ రోజుల్లో సహజంగానే చందమామ చదవటం ఆగిపోయింది. అప్పట్లో వార పత్రికలు బంకుల్లో తాళ్ళకి వేళాడుతుంటే ముఖచిత్రాలు చూట్టమో, ఎక్కడైనా దొరికితే బొమ్మలు, జోకుల కోసం తిరగేయటమో తప్ప వాటిల్లో కథలు, శీర్షికలు, ధారావాహికలు […]

Continue Reading

బొమ్మల్కతలు-24

బొమ్మల్కతలు-24 -గిరిధర్ పొట్టేపాళెం            హాలీవుడ్ సినిమాలకు అప్పట్లో, అంటే 1980s లో భారతీయ చలన చిత్ర వెండి తెరలపై చాలా ప్రత్యేకమైన క్రేజ్ ఉండేది. అతి కొద్ది గొప్ప సినిమాలు మాత్రమే పాపులర్ అయ్యేవి, ఎంతగా అంటే చిన్న చిన్న టౌన్ లలో కూడా బాగా ఆడే అంతగా.  జనాలకి ఎక్కువగానే చేరువయ్యేవి, ఎంతగా అంటే అందులోని హీరో పేరు కూడ గుర్తు పెట్టుకునేంతగా. ఇంగ్లీష్ మాటలు అర్ధం కాకపోయినా […]

Continue Reading

చిత్రం-58

చిత్రం-58 -గణేశ్వరరావు  స్విస్ చిత్రకారిణి ఎస్తర్ హ్యూసర్ Esther Huser) మానసిక రోగ నిపుణురాలు, Nature’s painter of photorealism. తన అభిరుచి మేరకు realistic painting వైపు దృష్టి మరలించి పేరు పొందింది, అంతర్జాతీయ బహుమతులు అందుకొంది. అత్యంత సూక్ష్మ వివరాలతో, దిగ్భ్రమ కలిగించే అందాలతో సాధారణ వస్తువులను అసాధారణంగా చిత్రిస్తుంది, ఆమె రంగుల పళ్ళెంలో మహా అయితే 5 రంగులు ఉంటాయి.. వాటి తోనే ప్రకృతి సంపదలోని .. పూలూ, మొక్కలూ, చెట్లూ, కూరల […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-23

బొమ్మల్కతలు-23 -గిరిధర్ పొట్టేపాళెం           అనుకోకుండా కొన్ని కొన్ని అద్భుతంగా చేసేస్తాం, అనుకుని చేసినా అంత బాగా చెయ్యలేమేమో అనుకునేంతలా. ఈ బొమ్మ అలా అనుకోకుండా నేను ఒకప్పుడు చేసిన అద్భుతమే.           సిద్ధార్ధ ఇంజనీరింగ్ కాలేజి, కానూరు, విజయవాడ లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదువుతున్న నాటి రోజులవి. అక్కడ చదివిన నాలుగు సంవత్సరాలు నా బొమ్మల ప్రస్థానంలో ఒక మలుపు తిరిగిన మైలురాయి, కలికితురాయి […]

Continue Reading

చిత్రం-57

చిత్రం-57 -గణేశ్వరరావు            ఇది కథ చెప్పే బొమ్మ. ఈ ‘జాగరణ’ చిత్రాన్ని గీసింది యువ అలంకారిక చిత్ర కళాకారిణి జో ఫ్రాంక్. గతంలోని జ్ఞాపకాలని నెమరువేసుకుంటూ కాలంలోని ఒక క్షణాన్ని చిత్రిస్తుంది. ఆలోచన రేకెత్తించే దృశ్యాలవి ఆమె ఎంచుకున్న వస్తువులు కలుసుకుం టాయి, వాళ్ళ మథ్య మాటలు చోటు చేసుకుంటాయి. తన చిత్ర రచనలో జో ఫ్రాంక్ తాను పరిశీలించిన జీవితం గురించి కథలు చెబుతుంది. తనకు ప్రేరణ డానిష్ […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-22

బొమ్మల్కతలు-22 -గిరిధర్ పొట్టేపాళెం            చూట్టానికి పూర్తయినట్టే కనిపిస్తున్నా నేను కింద సంతకం పెట్టి, డేట్ వెయ్యలేదు అంటే ఆ బొమ్మ ఇంకా పూర్తి కాలేదనే. అలాంటి సంతకం చెయ్యని అరుదైన ఒకటి రెండు బొమ్మల్లో ఇది ఒకటి. ఈ బొమ్మ వేసినపుడు ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో ఉన్నాను. కానీ కాలేజి హాస్టల్లో వేసింది కాదు. నా చిన్ననాటి మా ఊరు “దామరమడుగు” లో శలవులకి “బామ్మ” దగ్గరికి వెళ్ళి ఉన్నపుడు […]

Continue Reading

చిత్రం-56

చిత్రం-56 -గణేశ్వరరావు  ఈ తైలవర్ణ చిత్రం పేరు ‘స్వప్న సౌందర్యం’, చిత్రకారుడు క్లైవ్ బ్రయంట్. వాల్ట్ విట్మన్ కవిత ‘అశాశ్వత అమరత్వం’ నుంచి స్ఫూర్తి చెంది దీన్ని గీసాడు: ఎల్ల కాలం ఏదీ వుండదు. ప్రతీదీ కాలగర్భంలో కలిసి పోవాల్సిందే. జరామరణాలు ఎవరూ తప్పించుకో లేరు. అయితే ఇక్కడో వైరుధ్యం ఉంది: కళాకారుడు మరణిస్తాడు, కాని అతను సృష్టిం చిన కళాకృతి అతని తర్వాత కూడా నిలుస్తూ అతనికి అమరత్వం కల్పిస్తుంది, తన చిత్రానికి పెట్టిన పేరులో […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-21

బొమ్మల్కతలు-21 -గిరిధర్ పొట్టేపాళెం           ఈ పెయింటింగ్ లోని నిండైన “తెలుగుదనం” తెలుగు వారిట్టే గుర్తుపట్టేయ గలరు. ఆ చీరకట్టు, నుదుటిన గుండ్రని బొట్టు, చందమామ వెన్నెల పడి ఆ చందమామ కన్నా నిండుగ మెరిసిపోతున్న పెద్ద కళ్ళతో అందమైన “వెలుగు” లాంటి తెలుగమ్మాయి. ఈ పెయింటింగ్ కి మూలంగా నేను తీసుకున్న పెయింటింగ్ వేసిన చిత్రకారుడు “ఉత్తమ్ కుమార్”. అప్పట్లో ఆంధ్రభూమి వారపత్రిక, ఆంధ్రభూమి దినపత్రిక ఆదివారం స్పెషల్ సంచికల్లో […]

Continue Reading

బొమ్మల్కతలు-20

బొమ్మల్కతలు-20 -గిరిధర్ పొట్టేపాళెం         ఈ పెయింటింగ్ చూడగనే ఠక్కున మదిలో మెదిలేది “వి. ఆర్. సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి, విజయవాడ” కాలం, ఆ కాలేజి లో “కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్” డిగ్రీ చేస్తున్న నాలుగేళ్ళ పాటు గడచిన ఒంటరి పెయింటింగ్ ప్రయాణం, ఆ ప్రయాణం లో “పెయింటింగ్” మెటీరియల్ కోసం విజయవాడ బుక్ షాపులు మొత్తం గాలిస్తూ సరికొత్త దారులు వెతుకుతూ ముందుకి సాగిన వైనం.           తొమ్మిదేళ్ళ వయసులో ఆరేళ్ళు ఇంటికి […]

Continue Reading

చిత్రం-55

చిత్రం-55 -గణేశ్వరరావు  62 ఏళ్ళ ఇటలీ దేశస్థుడు పీయర్ బాల్యం నుంచీ బొమ్మలు వేయడంలో ఆసక్తి కనబరిచే వాడు. తన ప్రతిభను పెంచుకోవలంటే పూర్తిగా కళకే అంకితం అవ్వాలని గ్రహించాడు. ప్రకృతి మధ్య గడపడానికి ఇష్టపడేవాడు, కొండాకోనలను చుట్టివచ్చేవాడు, గుహల్లోని రాళ్ళను పరిశోధించే వాడు. అది అతడి కళ పైన ప్రభావం చూపింది. నిజానికి అతడి చిత్రాల ఉపరితలాలు కొండ రాళ్ళ గరుకుతనాన్ని గుర్తు చేస్తాయి. దాని కోసం అతను తన కాన్వాస్ లపై పాల రాతి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-19

బొమ్మల్కతలు-19 -గిరిధర్ పొట్టేపాళెం        ప్రతి మనిషికీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో తనకి తెలియని దాన్ని శోధించి తెలుసుకుని సాధించాలని పడే తపనా, చేసే ప్రయత్నాల వెంట కృషి తోడై తాననుకున్న దానికన్నా ఎక్కువగా సాధించిన సందర్భాలు కొన్నైనా ఉండి ఉంటాయి. వెనుదిరిగి చూసినపుడల్లా అప్పుడున్న పరిస్థితుల్లో ఇది నేనే చేశానా అని అనిపిస్తూ అబ్బురపరుస్తూ ఆ సందర్భాలు గుర్తొచ్చినపుడల్లా మదిలో మళ్ళీ మళ్ళీ అద్భుతంగా సందడి చేస్తూనే ఉంటాయి.     […]

Continue Reading

బొమ్మల్కతలు-18

బొమ్మల్కతలు-18 -గిరిధర్ పొట్టేపాళెం           ఇంకా ఓనమాలు కూడా దిద్దలేదు, అప్పుడే మహాగ్రంధం రాసెయ్యాలన్న తపన అన్నట్టుగా ఉండే రోజులవి, నా బొమ్మల జీవితంలో. ఒక అందమైన దృశ్యం ఏదైనా పత్రికలోనో, క్యాలెండర్ లోనో కనిపిస్తే చూసి పరవశించిపోవటమే కాదు, దాన్ని నా చేత్తో అచ్చం అలాగే అచ్చుగుద్ది మరింతగా మైమరచిపోవాలనే తపన. గ్రాఫైట్ పెన్సిల్ తో బూడిద రంగు బొమ్మల నుంచి, ఇంక్ తో బ్లాక్ అండ్ వైట్ బొమ్మలు […]

Continue Reading

చిత్రం-54

చిత్రం-54 -గణేశ్వరరావు  చూశారా ఈ చిత్రాన్ని? అగస్తీనా నిజంగా అందంగా ఉందా? మీలో సౌందర్య భావాన్ని కలుగజేస్తోందా?           ఇది సుప్రసిద్ధ చిత్రకారుడు విన్సెంట్ వాంగో వేసిన చిత్రం అని తెలిసినప్పుడు మన అభిప్రాయం మారుతుందా? కళలకు స్థిరమైన విలువ ఉంటుందా? టిప్పు సుల్తాన్ ఆయుధాలు, నెపోలియన్ టోపీ కొన్నికోట్లకు అమ్ముడయ్యాయి; అభిమానులు కట్టిన ఆ వెల, వాటి అసలు విలువేనా? ఇలాటి అదనపు విలువలకు ప్రమాణాలు ఏమిటి? ఈ నేపథ్యంలో ఒక ఆసక్తికరమైన […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-17

బొమ్మల్కతలు-17 -గిరిధర్ పొట్టేపాళెం           సాగర సంగమం – నాకు అమితంగా నచ్చిన అత్యుత్తమ తెలుగు చిత్రం. ఏదైనా ఒక కళాత్మకమైన పనితనాన్ని పరిశీలించి చూస్తే ఎక్కడోక్కడ ఏదో ఒక చిన్నపాటి లోపం, లేదా ఇంకాస్త మెరుగ్గా చేసుండొచ్చు అన్నవి కనిపించకపోవు. ఎక్కడా ఏ మాత్రమూ మచ్చుకైనా వంక పెట్టలేని పనితీరు మాత్రమే “పరిపూర్ణత్వం” అన్న మాటకి అర్ధంగా నిలుస్తుంది. ఒక్క మనిషి చేసే ఒక పనిలో “పరిపూర్ణత” ని తీసుకురావటం […]

Continue Reading

బొమ్మల్కతలు-16

బొమ్మల్కతలు-16 -గిరిధర్ పొట్టేపాళెం           రాయటం నేర్చిన ప్రతి ఒక్కరూ ఎపుడో ఒకపుడు ఏదో ఒక రేఖాచిత్రం గీసే ఉంటారు. ఒక మనిషినో, పువ్వునో, చెట్టునో, కదిలే మేఘాన్నో, ఎగిరే పక్షులనో, నిండు చందమామనో, లేదా రెండు కొండల మధ్యన పొడిచే సూర్యుడినో. రేఖాచిత్రాలే గుహల్లో వెలుగు చూసిన మొదటి మానవ చిత్రాలు. ఎలాంటి బొమ్మల ప్రక్రియ అయినా మొదల య్యేది ఒక చిన్న రేఖతోనే. సంతకం కింద తేదీ వెయ్యని […]

Continue Reading

చిత్రం-53

చిత్రం-53 -గణేశ్వరరావు  ఫోటోగ్రఫీ అంటే కేవలం ఫోటోలు తీయడం కాదు, ‘అదొక సృజనాత్మక ప్రక్రియ, అనుభూతి.. అనుభవం, ప్రేరణ, ఉద్వేగం.. ఇది కళ, ఇది జీవితం! ఈ రకం ఫొటోగ్రఫీలో – ఆలోచన నుంచి ఆచరణ వరకూ అన్నిటినీ ఆస్వాదిస్తాను’ అంటాడు. మైకేల్.           మైకేల్ డేవిడ్ ఆడమ్స్ న్యూ యార్క్ లో పేరు పొందిన ఫ్యాషన్ & ప్రకటనల ఫోటోగ్రాఫర్. అండర్ వాటర్ ఫోటోగ్రఫీలో ఆయన తర్వాతే మరెవరినైనా చెప్పుకోవాలి. ఆయన […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-15

బొమ్మల్కతలు-15 -గిరిధర్ పొట్టేపాళెం           మనిషి పుట్టుకతోనే చుట్టూ ఉన్న పరిసరాల్నీ, మనుషుల్నీ, జీవుల్నీ చూసి అర్ధం చేసుకోవటం, చదవటం, నేర్చుకోవటం మొదలవుతుంది. మాటా, నడవడికా, ఆచరణా ఇవన్నీ పరిసర ప్రభావాలతోనే మొదలయ్యి నిత్యం ప్రభావితమవుతూ కొంచెం కొంచెం నేర్చుకుంటూ మెరుగులు దిద్దుకుంటూనే ముందుకి సాగిపోతూ ఉంటాయి. ఎంత నేర్చు కున్నా, ప్రతిరోజూ ఏదో ఒకటి, ఎంతో కొంత, కొత్తదనం ఎదురు కాకుండా ఉండదు. రోజూ ఉదయించే సూర్యుడూ ఆకాశంలో ప్రతి […]

Continue Reading

చిత్రం-52

చిత్రం-52 -గణేశ్వరరావు  ‘పుష్పాలంకరణ’ కోసం అన్ని ప్రదేశాల్లో ప్రత్యేకంగా కొన్ని సంస్థలు ఉన్నాయి. . మీరు కోరుకున్న పద్ధతిలో పూలతో వేదికను …పెళ్ళి కూతుర్ని అలంకరిస్తారు, సందర్భానుసారంగా పూలతో ఏ అలంకరణ అయినా ఏర్పాటు చేస్తారు. ఈ సంస్థల సృజనాత్మక శక్తికి పరిమితి లేదు, రక రకాల రంగు రంగుల పూలను ప్రత్యేకంగా ఏర్చి కూర్చి ఒక కొత్త అందాన్ని కళ్ళ ముందు నిలబెడతారు. నవ్యతతో అందరినీ అవి ఆకర్షిస్తాయి. పూలు చెట్టుకి అందాన్నిస్తాయి, కోసిన పూలను […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-14

బొమ్మల్కతలు-14 -గిరిధర్ పొట్టేపాళెం           మొట్ట మొదటి అనుభూతి, తీపైనా, చేదైనా, ఏదైనా జీవితంలో ఎన్నటికీ మరచి పోలేము, ఎప్పటికీ మదిలో పదిలంగా ఉండిపోతుంది. చిన్నప్పడు తిరిగిన పరిసరాలు, మసలిన మనుషులు అయితే మరింత బలంగా మదిలో ముద్ర పడిపోతాయి. నేను పుట్టిన ఊరు “కావలి”, నెల్లూరు జిల్లా, చిన్న పట్టణం. అమ్మమ్మ వాళ్ళ ఊరు, అమ్మ కూడా అక్కడే పుట్టింది. కానీ నా ఊహ తెలిసే నాటికి నాన్న “బుచ్చి […]

Continue Reading

చిత్రం-51

చిత్రం-51 -గణేశ్వరరావు  ఎనభైవ దశకంలో సావిత్రి అనే ఒక  చిత్రకారిణి  మద్రాస్ లో ఉండేది. ఆమె వృత్తి రీత్యా బ్యాంకు ఆఫీసర్. ఆమె హాబీ చిత్రకళ. ఆమె ప్రత్యేకత నగ్న చిత్రాలను గీయటం, ఆ నగ్న చిత్రాలు తనవే కావడం. కొంత కాలం క్రితం వార్తలలోకి ఎక్కిన వ్యక్తీ  – ఇంద్రాణి ముఖర్జీ. ఆమె తన సొంత కూతురిని అందరికీ చెల్లెలిగా పరిచయం చేసేది. Tamara de Lempicka అనే సుప్రసిద్ధ చిత్రకారిణి సావిత్రి, ఇంద్రాణి చేసిన […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-13

బొమ్మల్కతలు-13 -గిరిధర్ పొట్టేపాళెం           చిన్నప్పటి నుంచీ కాయితాలంటే భలే ఇష్టం ఉండేది. పుస్తకాలంటే తెలీని పిచ్చి ఉండేది. ఏ పుస్తకం దొరికినా పూర్తిగా తిప్పందే మనసు ఊరుకునేది కాదు. నచ్చిన బొమ్మలున్న పుస్తకం అయితే ఇంక ఎన్ని గంటలైనా, ఎన్ని సార్లైనా తిప్పుతూ ఉండి పోయేవాడిని. క్వాలిటీ ఉన్న పేపర్ తో మంచి ఫాంట్ ఉన్న ప్రింట్ అయితే మహా సంతోషం వేసేది. ఏ ఊర్లో ఉన్నా లైబ్రరీలకి వెళ్ళి […]

Continue Reading

బొమ్మల్కతలు-12

బొమ్మల్కతలు-12 -గిరిధర్ పొట్టేపాళెం           ఆర్ట్ పై ఉన్న ఇష్టం, నేర్చుకునే వీలు లేక, పత్రికల్లో ఆర్టిస్ట్ లు వేసే ఇల్లస్ట్రేషన్స్ బొమ్మల్నీ, ఫొటోల్నీ చూసి వేస్తూ, స్వీయ సాధనలో ఒక్కొక్క అడుగూ పడుతూలేస్తూనే ముందుకి వేస్తూ, అలా పెన్సిల్ డ్రాయింగ్స్, బాల్ పాయింట్ పెన్ స్కెచెస్ దాటి, ఫౌంటెన్ పెన్ ఇంక్, వాటర్ కలిపి బ్రష్ తో బ్లాక్ అండ్ వైట్ పెయింటింగ్ లా అనిపించే బొమ్మలూ దాటి, కేమెల్ […]

Continue Reading

బొమ్మల్కతలు-11

బొమ్మల్కతలు-11 -గిరిధర్ పొట్టేపాళెం “నీ నును పైటను తాకిన చాలు…గాలికి గిలిగింత కలుగునులే…”           ఈ తెలుగు పాటలోని సి.నా.రె. గారి పదాలతో అప్పుడు నేను చదువుతున్న “విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజి లిటరసీ క్లబ్ బోర్డ్” లో రెండు రోజులు మెరిసి మురిసిన ఈ పెయింటింగ్ నా బొమ్మల్లో ఓ ప్రత్యేకం.           ఈ పెయింటింగ్ లో కనిపించే నలుపుతెలుపుల్లోకి తొంగి చూస్తే అప్పుడే 34 యేళ్ళ జీవితం […]

Continue Reading

చిత్రం-50

చిత్రం-50 -గణేశ్వరరావు  ఇది ఒక అపురూప నీటి రంగుల చిత్రమా? Iceland ఫోటో యా? ఫోటో అయితే, ఎక్కడ తీశారు? స్విట్జర్లాండా? ఇండియాలో ఇలాటి దృశ్యాలు ఉన్నట్టు లేవే! కంగారు పడకండి. ఇది అచ్చంగా ఫోటో యే! ఇండియాలో తీసిందే .. అంతే కాదు, మన కడపలో తీసిందే, తెలుగు గంగ ఫొటోయే! ఇంత అద్భుతమైన ఫోటో ఎవరు తీసారు? ఆగండి, ఆలోచించండి..           ప్రకృతి దృశ్యాలను కెమెరాలో బంధించడం ఒక పెద్ద […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-10

బొమ్మల్కతలు-10 -గిరిధర్ పొట్టేపాళెం           మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ మెయిన్ సబ్జెక్ట్స్ గా, ఇంగ్లీష్, సంస్కృతం లాంగ్వేజెస్ గా ఇంటర్మీడియట్ (11th & 12th Grade) విజయవాడ “ఆంధ్ర లొయోలా కాలేజి” లో ఉత్సాహంగా చేరా. అప్పట్లో లొయోలా కాలేజిలో సీట్ రావటం కష్టం. పదవ తరగతిలో చాలా మంచి మార్కులు తెచ్చుకోవటంతో, నాన్ లోకల్ అయినా నాకు సులభంగానే సీట్ వచ్చింది, చేరిపోయాను. ఆ కాలేజిలో చదివింది రెండేళ్ళే. కాలేజి […]

Continue Reading

చిత్రం-49

చిత్రం-49 -గణేశ్వరరావు  ఒక దానిలో రెండు ఫోటోలు, ఒకటే భావం. దీన్ని ఒకసారి కాదు, ఎన్నోసార్లు చూడాలి. పరిశీలిస్తే అంతరార్థం అవగాహనవుతుంది.           అమెరికాకు చెందిన డేనియల్ ఎగ్యూయా బృందం ఆర్ట్ స్కూల్ ఇలాటి ఫోటోలు తరచూ పోస్ట్ చేస్తుంటుంది.. దీనికి పెట్టిన పేరు ‘మాతృమూర్తి’. వాళ్ళ దృష్టిలో ఇది తల్లి ప్రేమే! ఒక తల్లి పాలివ్వడం కోసం పై దుస్తులను తొలగిస్తుండగా ఒక ఫోటో తీసారు, ఇక రెండో ఫోటో సముద్రాన్ని […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-9

బొమ్మల్కతలు-9 -గిరిధర్ పొట్టేపాళెం దివ్య భారతి – ఒక్క పేరులోనే కాదు ఆమె అందంలోనూ దివ్యం ఉండేది, చూడ చక్కని రూపం. వెండితెర పై అతికొద్ది కాలంలోనే దివ్యమైన వెలుగు వెలిగి 19 ఏళ్ళకే చుక్కల్లో కెగసిన తార. ఇప్పుడెందరికి గుర్తుందో, 1990 దశకంలో అందరికీ తెలిసే ఉంటుంది. బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాల్లో వెండితెర పైకి స్పీడుగా దూసుకొచ్చిన సి(నీ)తార. వచ్చినంత స్పీడుగానే జీవితం తెర పై నుంచీ నిష్క్రమించింది. అప్పటి వార్తాపత్రికల్లో  ఆ(మె) ఆకస్మిక […]

Continue Reading

చిత్రం-48

చిత్రం-48 -గణేశ్వరరావు  ఇంగ్లాండ్ లో స్థిరపడ్డ ఫోటోగ్రాఫర్ ఆడమ్ బర్డ్. కి నగర జీవితం అంటే విసుగు. వీలైనప్పుడల్లా అడవికి వెళ్తుంటాడు. ఒక కాల్పనిక ప్రపంచాన్ని సృష్టించడానికి అక్కడ అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటాడు. అప్పటికే తనకు తెలిసిన కథల పైన దృష్టి పెడతాడు. తాను ఎంపిక చేసిన మోడల్స్ ను అక్కడకు తీసుకెళ్తాడు. అవసరమైన సామగ్రిని చేరుస్తాడు. ఇంచు మించు ఒక సినిమా తీసినంత సందడి చేస్తాడు. కథా నేపథ్యం వివరించి తన మోడల్స్ చేత వాటిలోని […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-8

బొమ్మల్కతలు-8 -గిరిధర్ పొట్టేపాళెం  ఇండియన్ ఇంక్‌ – అప్పట్లో ఈ ఇంక్ చాలా పాపులర్. ప్రత్యేకించి బ్లాక్ అండ్ వైట్ స్కెచింగ్ చెయటానికి ఎక్కువగా ఈ ఇంక్ నే వాడేవాళ్ళు. ఇంచు మించు అన్ని బుక్ షాపుల్లోనూ దొరికేది. ఆ రోజుల్లో ఎవరో ఆర్టిస్టులు తప్ప ఇంకెవరూ వాడని ఇంక్ అయినా అంత సులభంగా అన్ని చోట్లా దొరికేది అంటే, దాని వాడకం చాలా పురాతనమై ఉండాలి. ఆర్ట్ కే కాకుండా ఇంకా చాలా విధాలా వాడుకలో […]

Continue Reading

స్వరాలాపన-23 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-23 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

చిత్రం-47

చిత్రం-47 -గణేశ్వరరావు  అమెరికన్ చిత్రకారిణి ఐరిన్ (Irene Georgopoulon) వస్తువుల సమూహాన్ని, మూర్తి చిత్రాలను పాస్టెల్ రంగుల్లో చిత్రిస్తుంది. పాస్టెల్ రంగుల మాధ్యమంకు మాయాజాలం ఉంది, అది వెలుతురును ప్రతిబింబచేస్తూ, చిత్రం యొక్క ఉపరితల కాంతిని ప్రసరించే టట్లు చేయగలదు. తనకు నచ్చిన వస్తువులను ఐరిన్ సొంతంగా సేకరిస్తుంది, తన సృజనాత్మక శక్తి కి వాటి నుంచి స్ఫూర్తి పొందుతుంది. అత్యంత సామాన్యమైన వస్తువు లను ప్రకాశవంతమైన మూర్తి ( స్టిల్ లైఫ్) చిత్రాలుగా రూపొందిస్తుంది. వ్యక్తుల […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-7

బొమ్మల్కతలు-7 -గిరిధర్ పొట్టేపాళెం          స్కూల్ రోజుల్లో చదువు, ఆటల మీదే ధ్యాసంతా. అందునా రెసిడెన్షియల్ స్కూల్ కావటంతో రోజూ ఆటపాటలున్నా చదువు మీదే అమితంగా అందరి ధ్యాసా. వారానికొక్క పీరియడ్ ఉండే డ్రాయింగ్ క్లాస్ రోజూ ఉంటే బాగుండేదనుకుంటూ శ్రద్ధగా డ్రాయింగ్ టీచర్ శ్రీ. వెంకటేశ్వర రావు సార్ వేసే బొమ్మల్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అంత బాగా వెయ్యాలని ప్రయత్నించేవాడిని. అడపాదడపా బొమ్మలంటే ఆసక్తి ఉన్న ఒకరిద్దరం ఫ్రెండ్స్ ఏవో తోచిన […]

Continue Reading

స్వరాలాపన-22 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-22 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

చిత్రం-46

చిత్రం-46 -గణేశ్వరరావు  మనసులో మాట ముందు చెప్తాను. ఈ ఫోటో నా కెంతో నచ్చింది, దాని నేపథ్యం నచ్చింది, ఫోటోగ్రాఫర్ కనబరచిన సాంకేతిక నైపుణ్యం నచ్చింది.          మెక్సికో నుంచి ఒక పత్రిక వస్తుంది. అందులో అలౌకికమైన డిజిటల్ ఫోటోలు ఉంటాయి, స్వాప్నిక జగత్తులోకి తీసుకెళ్తాయి. ఫోటోల క్రిందనిచ్చే వ్యాఖ్యలు ఆ ఫోటో లకు ఏ మాత్రం తీసిపోవు.          ఉదాహరణకు దీన్ని తీసుకోండి… ‘నీటిలో అమ్మాయి… ఆమె మంచు గడ్డ […]

Continue Reading
Posted On :

స్వరాలాపన-21 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-21 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

చిత్రం-45

చిత్రం-45 -గణేశ్వరరావు  ‘సంపూర్ణ రామాయణం’ సినిమాలో కుంభకర్ణుడిని నిద్రలోంచి భటులు లేపే దృశ్యానికి సహజ చిత్రకారుడు బాపు అద్భుతమైన రూప కల్పన చేశారు. ట్రిక్ ఫోటోగ్రఫీ స్పెషలిస్ట్ రవికాంత్ నగాయిచ్ కు ‘గలివర్స్ ట్రావెల్స్’ సినిమా స్ఫూర్తి కలిగించే ఉండవచ్చు. ఆ చిత్రీకరణ రహస్యాలను ఎవరైనా చెప్పాలనుకున్నా చెప్పలేరు, చేసి చూపించమంటే మాత్రం చూపించగలరు.          ఇక పోతే ఇది ఫోటో యే, తైల వర్ణ చిత్రం కాదు. ఫోటోగ్రఫీ లో అనూహ్యమైన సాంకేతిక […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-6

బొమ్మల్కతలు-6 -గిరిధర్ పొట్టేపాళెం “తార”లనంటిన నా బొమ్మలు – “స్వర్ణ యుగం” స్కూలు పుస్తకాల్లో, చరిత్ర పుటల్లో గుప్తుల కాలాన్ని నాటి “భారతదేశ స్వర్ణయుగం” గా చదివినట్టు ప్రతి మనిషి జీవితంలోనూ ఇలా ఒక కాలం తప్పకుండా ఉంటుంది. ఏ కాలంలో మన ఉత్సాహం, సంతోషం, జిజ్ఞాస, నైపుణ్యం అన్నీ కలిసి తారాస్థాయిలో ఉరకలేస్తూ ఉంటాయో, అదే మన కాలంలో “మన స్వర్ణ యుగం”. నా బొమ్మల లోకంలో ఆ యుగం తొలినాళ్ళదే. చూసేవాళ్ళు లేకున్నా బొమ్మ […]

Continue Reading

చిత్రం-44

చిత్రం-44 -గణేశ్వరరావు                     ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేధిస్తే, అతని అభిమాని నెపోలియన్ చక్రవర్తి అడ్డుపడ్డాడు.                    ఈ బొమ్మ నేటి కాలానికి […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-5

బొమ్మల్కతలు-5 -గిరిధర్ పొట్టేపాళెం కట్టిపడేసిన కదలిపోయిన కాలం…           ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై తలమునకలుగా ఉండటంలో అదోరకమైన సంతోషం ఉంటుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే తెలియకుండానే ఇవన్నీ అప్పట్లో నేనే చేశానా అన్న ఆశ్చర్యమే ఎంతో గొప్పగా అనిపిస్తుంది. ప్రతి సంక్రాంతి, దసరా, వేసవి శలవులకీ “కావలి” నుంచి “నెల్లూరు” మీదుగా మా సొంత ఊరు “దామరమడుగు” కి వెళ్ళటం మాకు తప్పనిసరి. అలా తప్పనిసరి అయిన పరిస్థితుల్లో అక్కడికి […]

Continue Reading

స్వరాలాపన-20 (మీ పాటకి నా స్వరాలు)

స్వరాలాపన-20 (మీ పాటకి నా స్వరాలు) -డా||కె.గీత మనందరికీ పాటలు వినడం ఇష్టం. మనలో కొందరికి విన్న పాటలు తిరిగి పాడడం ఇష్టం. మరికొందరికి ఆ పాటల్ని వివిధ వాయిద్యాల మీద పలికించడం ఇష్టం. అయితే అలా పలికించేందుకు అవసరమైన స్వరాలు తెలుసుకోవడం ఎలా? సాధారణంగా అవి గురుముఖత తప్ప అందరికీ లభ్యం కావు. నాకున్న జన్మతః వచ్చిన అనేకానేక ఇష్టాల్లో, కళల్లో విన్న ఏ పాటకైనా వెంటనే స్వరాలు కూర్చడం ఒకటి! నాకు తెలిసిన మిత్రులు […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-4

బొమ్మల్కతలు-4 -గిరిధర్ పొట్టేపాళెం            తొలినాళ్ళలో నా పెయింటింగ్స్ మీద తెలుగు “ఆర్టిస్ట్ ఉత్తమ్ కుమార్” గారి ప్రభావం చాలా ఎక్కువగా ఉండేది. అసలు పెయింటింగ్స్ వెయ్యాలన్న తపన ఇంకా చిన్నప్పటి నుంచే ఉన్నా, ఆలోచన మాత్రం అప్పట్లో ఉత్తమ్ గారు ఆంధ్రభూమి వారపత్రిక లో కథలకి వేసున్న ఇల్లుస్ట్రేషన్స్ స్ఫూర్తిగానే నాలో మొదలయ్యింది. ఇంజనీరింగ్ కాలేజి రోజుల్లో కేవలం ఉత్తమ్ గారి బొమ్మలకోసమే విజయవాడ ‘కానూరు’ లో సిద్ధార్థ ఇంజనీరింగ్ […]

Continue Reading

చిత్రం-43

చిత్రం-43 -గణేశ్వరరావు  మాఁలీ క్రేబ్ఏపిల్ కోపం, కసి నిండిన మహిళా చిత్రకారిణి. 19వ శతాబ్దపు ఉద్యమ చిత్రకారుల్లా తాను నమ్మిన విశ్వాసాలకు ప్రాచుర్యం కలిగించేందుకు తన కళను వాడుతుంది. ఫోటో-పాత్రికేయురాలిగా వివాదాస్పద అంశాల మీద దృష్టి పెట్టి అధివాస్తవికత చిత్రాలు చిత్రీకరిస్తూ Wall street అక్రమణ వీధి పోరాటంలో పాల్గొని పలు ఉద్యమాలకి దృశ్య గీతంగా మారింది –  Guantanamo ఖైదీలను, లిబియా పోరాట వీరుల ను, బైరూట్ శరణార్ధులను, ఫెర్గూసన్ పోలీసుల బాధితులను నల్లని రేఖా […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-3

బొమ్మల్కతలు-3 సితార – భానుప్రియ -గిరిధర్ పొట్టేపాళెం           కొన్ని అనుభవాలు జీవితంలో ఎప్పటికీ తాజాగానే నిలిచి ఉంటాయి, మనం ఆ క్షణాల్లో ఆ అనుభవాల్తో పరిపూర్ణంగా ఏకమై ఉంటే. అలా అప్పటి వెలుగు చూడని నా “ఇంకు పెయింటింగుల్లో” పరిపూర్ణంగా ప్రతి క్షణమూ గుర్తున్న వాటిల్లో ఇదొకటి.           సుర్రున మండిస్తూ ముందరి వరండాలోకి కటకటాలగుండా దూసుకొచ్చే సూరీడెండని ఆపగలిగే సాధనాలు అప్పట్లోనూ ఉన్నా, […]

Continue Reading

చిత్రం-42

చిత్రం-42 -గణేశ్వరరావు  11వ శతాబ్దానికి చెందిన రాజరాజ నరేంద్రుడు తన కుమారునికి కన్యను వెతుకుతూ కొడుకు చిత్రాన్ని పొరుగు రాజ్యాలకు పంపి అక్కడి కన్యల చిత్రాలు తెప్పించుకొని చూసేవారట, అలా ఒక రాచకన్య చిత్రాన్ని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెని తన కోడలుగా చేసుకోటానికి బదులుగా తానే చేసుకున్నట్టు వినే ఉంటారు.           ‘చంద్రహారం’ సినిమాలో చందన రాజు తన ఊహా సుందరి చిత్రాన్ని గీయటం చూసే ఉంటారు. ‘ఇది నా […]

Continue Reading
Posted On :

చిత్రం-41

చిత్రం-41 -గణేశ్వరరావు  ఈ బొమ్మ 19 వ శతాబ్దంలో చార్లెస్ చాప్లిన్ వేసింది. విలాసవంతమైన జీవితాలు గడిపే అందమైన యువతుల జీవన విధానాన్ని చూపిస్తూ అతడు ఎన్నో బొమ్మలు వేసాడు. శృంగారం శృతి మించిందని న్యాయనిర్ణేతలు అతగాడి చిత్రాలని నిషేదిస్తే, అతని అభిమాని నెపోలియన్ చక్రవర్తి అడ్డుపడ్డాడు. రెండో బొమ్మ నేటి కాలానికి సంబంధించినది, వేసింది: లారా కసెల్( కెనడా) ఆమె చిత్రాలలో ఒక ప్రత్యేకత ఉంది, అది: గతాన్ని వర్తమానంతో కలుపుతూ గీసిన అపురూపమైన చిత్రకళా […]

Continue Reading
Posted On :

బొమ్మల్కతలు-2

బొమ్మల్కతలు-2 కొల్లేరు సరస్సు  -గిరిధర్ పొట్టేపాళెం            అప్పట్లో వెయ్యాలన్న తపనే నా “పెయింటింగ్ స్టూడియో”! ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ నవ్వారు కుర్చీ, వాల్చిన ప్లాస్టిక్ నవ్వారు మంచం ఇవే నా పెయింటింగ్ ఫర్నీచర్లు. Bril ఇంకు బుడ్డి, అదే ఇంకు బుడ్డీ మూత (ఇదే నా ప్యాలెట్టు), మగ్గుతో నీళ్ళు…ఇవి పక్కన పెట్టుకుని  కూర్చుని బ్రష్షు పట్టుకుంటే గంటలకొద్దీ దీక్షలోకెళ్ళినట్టే, ఇక లేచే పనేలేదు.           […]

Continue Reading

బొమ్మల్కతలు-1

బొమ్మల్కతలు-1 -గిరిధర్ పొట్టేపాళెం           బొమ్మల్లో నా ఆనందం ఈనాటిది కాదు. వేసిన ప్రతి బొమ్మా ఆర్టిస్ట్ కి సంతృప్తిని ఇవ్వదేమో కానీ సంతోషాన్ని మాత్రం ఇచ్చి తీరుతుంది.           రంగుల్లో బొమ్మలు ఎలా వెయ్యాలో, ఎలాంటి రంగులు కొనాలో, ఎక్కడ దొరుకుతాయో కూడా తెలియని రోజుల్లో “కావలి” అనే చిన్న టౌన్ లో మా పెంకుటింట్లో టీనేజ్ లో వేసిన బొమ్మలే అప్పటికీ, ఇప్పటికీ, […]

Continue Reading

చిత్రం-40

చిత్రం-40 -గణేశ్వరరావు  కొందరికి చనిపోయిన తర్వాత గుర్తింపు వస్తుంది, అమెరికన్ ఫోటోగ్రాఫర్ డీయన్ ఏర్బస్ (Diane Arbus) 1971లో ఆత్మహత్య చేసుకున్నాక గుర్తింపు పొందింది. ఆమె ధనిక కుటుంబంలో పుట్టింది, వాళ్ళు ఫాషన్ వస్తువులు అమ్మే వారు, అయినా ఆమె మాత్రం ఎటువంటి మేక్ అప్ వేసుకునేది కాదు, సెంట్ వాడేది కాదు, మెడలో ఒక కెమెరా మాత్రం వేలాడుతూ వుండేది. భర్త ఎలాన్ తో ఫాషన్ యాడ్స్ ఫోటోలు తీసేది. స్టూడియో పని విసుగెత్తి, ఔట్ […]

Continue Reading
Posted On :

చిత్రం-39

చిత్రం-39 -గణేశ్వరరావు  షెరాన్ రూథర్ ఫర్డ్ రూప చిత్రకళను అధ్యయనం చేశారు. ఈ తైలవర్ణ చిత్రంలోని వనిత, కెన్యా ప్రాంతంలోని ఒక తండా నాయకుడి భార్య, తన ఫోటో తీస్తున్నప్పుడు, చిత్రం గీస్తున్నప్పుడు ఆమె విరగబడి నవ్వుతూనే ఉందట. ఈ చిత్రంలో కూడా ఆమె నవ్వు మొహాన్ని చూడొచ్చు. తన ఫోటో తీసిన షెరాన్ కు ఆమె తన మెడలోని పూసల దండ బహూకరించింది. ఆ పూసల దండలోని రంగులనే వాడి షెరాన్ ఈ చిత్రాన్ని చిత్రించారు.   […]

Continue Reading
Posted On :

చిత్రం-38

చిత్రం-38 -గణేశ్వరరావు  కుక్క పిల్ల, అగ్గిపుల్ల, సబ్బుబిళ్ళ’ కాదేదీ కవితకు అనర్హం అని శ్రీ శ్రీ అంటే, ‘రాయి, సీసా, గాడిద, చెప్పులు’ మీద కూడా కవితలను ఇస్మాయిల్ వినిపిస్తే, ‘ ఏం కథ మట్టుకు వెనకబడిందా?’ అంటూ వాటి మీద రావి. శాస్త్రి కథలు రాసి పారేశారు. ‘కథలు ఇలా ఉండాలి’ అనీ ఒకరంటే ‘కథలు ఇలా కూడా రాయొచ్చు’ అని మరొకరంటారు.ఎవరి జీవితాలు వారివి, ఎవరి అనుభవాలు వారివి అన్నట్లు కళలు కూడా ఏదో […]

Continue Reading
Posted On :

చిత్రం-37

చిత్రం-37 -గణేశ్వరరావు  19 వ శతాబ్దానికి చెందిన జేమ్స్ మెక్నీల్ విజ్లర్ వేసిన ఈ సమస్యాత్మక తైలవర్ణ (నలుపు-బూడిద రంగు) చిత్రం ‘చిత్రకారుడి తల్లి’ మోనాలిసా లాంటి చిత్రాల్లా ప్రపంచ ప్రసిద్ధి గాంచిoది..           సీదా సాదాగా కనిపిస్తున్న ఈ చిత్రం విలువ 700 కోట్ల రూపాయలు. అమెరికా అధ్యక్షుడు ఈ చిత్రం చూడడం కోసం ప్రత్యేకంగా ఒక ప్రదర్శనకు వెళ్ళాడు, అమెరికా ప్రభుత్వం దీన్ని సంస్కృతి సంపద గా భావించి ఒక […]

Continue Reading
Posted On :

చిత్రం-36

చిత్రం-36 -గణేశ్వరరావు  ఇది తైలవర్ణ చిత్రం అనుకుంటున్నారా? నేను అలాగే అనుకున్నాను. మిమ్మల్ని తప్పు పట్టను. తర్వాత తెలిసింది. ఇది ఫోటో అని. ఈ ఫోటో నా కంట పడగానే ఆశ్చర్యంతో ఒక్క క్షణం నోట మాట రాలేదు. ఒకటి రెండు.. . ఫోటోలను బ్లెండ్ చేస్తుంటారని తెలుసు. ఈ ఫోటోలో మాత్రం కొన్ని ఫోటోలు కలిసిపోయి, ఒక అధివాస్తవికత తైల వర్ణ చిత్రంలా అయింది ! దీన్ని ఎన్నో కోణాల నుంచి చూసినప్పుడు గాని, అది […]

Continue Reading
Posted On :

చిత్రం-35

చిత్రం-35 -గణేశ్వరరావు  కలలు నిజమౌతాయా? కల ఆధారంగా పరిశోధన జరిపి ఓ హత్య కేసుని ఛేదించ వచ్చా? దర్శకుడు తాను కన్న కల ‘118’ తో కలలపై కొత్త అవగాహన కలిగించే ప్రయత్నం చేశాడు. . సినిమావాళ్ళకి కలలు అవసరమేమో కానీ జనం పనులు మానేసి పగటి కలలు కంటూ కూర్చుంటారా? మహా అయితే దీపూ పాడిన ‘కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిలో తేలుతూ ఉంటున్నానే’ పాట వినమంటే వింటారు. కలలు మనస్తత్వంతో […]

Continue Reading
Posted On :

చిత్రం-34

చిత్రం-34 -గణేశ్వరరావు  ముఖ్యమంత్రి ఎంజీఆర్ మరణించాక కూడా తలపైన టోపీని , నల్ల కళ్ళద్దాలని ఉంచేశారు. కారణం ఊహించగలరు. చనిపోయాక కూడా పార్థివ శరీరం చూడాటానికి బాగానే వుండాలన్న ఆలోచనలో తప్పులేదు. జగదేక సుందరి క్లియోపాత్రా శత్రురాజుకి చిక్కకుండా ఉండటం కోసం ఆత్మహత్య చేసుకోవాలని అనుకొంటుంది, ఆ మరణం అనాయాసంగా ఉండాలని మరణించాక కూడా తన అందం చెక్కు చెదరకుండా ఉండాలని ముందుగా మరణ శిక్ష పొందిన ఖైదీలపై పరిశోధనలు జరిపిస్తుంది, ఒక అంగుళం పొడుగు ఉన్న […]

Continue Reading
Posted On :

చిత్రం-33

చిత్రం-33 జాన్ సింగర్ సార్జెంట్ -గణేశ్వరరావు  సుప్రసిద్ధ చిత్రకారుడు జాన్ సింగర్ సార్జెంట్ కి ఫ్రాన్స్ లో గోచరో (Gautreau) తో పరిచయం అయింది. ఆమెది అపురూప సౌదర్యం – కొనదేరిన ముక్కు, ఎత్తైన నుదురు, హంసను గుర్తుకు తెచ్చే మెడ, సన్నని నడుము. ఇసుక గడియారం లాంటి వంపు సొంపులున్న ఆకృతి – ప్రతీ చిత్రకారుడికి ఆమె బొమ్మ గీయాలని, పాలరాతిపై శిల్పం చెక్కాలనీ అనిపించేది . సార్జెంట్ ఆమె వ్యామోహంలో పడ్డాడు. ఆమె చిత్రం […]

Continue Reading
Posted On :

చిత్రం-32

చిత్రం-32 -గణేశ్వరరావు  ‘ధనమేరా అన్నిటికి మూలం’ అనే పాట ఉంది, అన్నిటికీ ‘ఆడదే’ ఆధారం అంటూ మొహమ్మద్.అఫ్సర వలీషా ఒక కవిత రాశారు. ఆడదే లేకపోతే అడ్వర్టైజ్మెంట్ రంగం ఉంటుందా? టోనీ లాంటి రూప చిత్రకారులు ఉండేవారా? ‘తల్లి ప్రేమ’ లాంటి చిత్రాన్ని చూడగలిగే వాళ్ళమా? టోనీ ప్రో, కాలిఫోర్నియా కు చెందిన చిత్రకారుడు. తండ్రి ప్రోత్సాహం తో చిన్న తనంలోనే ప్రముఖ చిత్రకారులను కలుసుకున్నాడు. స్టూడియోలను దర్శించాడు, గ్రాఫిక్ డిజైనర్ అవడం కోసం అకడమిక్ ఫిగర్ డ్రాయింగ్, […]

Continue Reading
Posted On :

చిత్రం-31

చిత్రం-31 -గణేశ్వరరావు  ఈ కళాత్మక చాయా చిత్రం తీసినది పారిస్ కు చెందిన మార్తా (moth art అన్న దానికి బదులుగా ఈ పేరు ను వాడుతుంది ఆమె, అసలు పేరు చెప్పదు). సాధారణమైన రూప చిత్రాలపై ఆమె ఎంత పట్టు సాధించిందో అన్న దానికి ఈ ఫోటో ఒక రుజువు. తన మోడల్స్ హావభావాలను శక్తివంతంగా కెమెరా లో బంధిస్తుంది. ఆమె తీసిన ప్రతీ ఫోటో ఒక కథను చెబుతుంది. ఫోటోలోని అమ్మాయి ఒక్క చూపు […]

Continue Reading
Posted On :

చిత్రం-30

చిత్రం-30 -గణేశ్వరరావు  ఇది పాల్ గాగెన్ వేసిన చిత్రం. పేరు : ‘ఇవాళ మేం మార్కెట్ కి వెళ్ళం!’. పాల్, విన్సెంట్ వాంగో మిత్రుడు, అతనిలాగే తన జీవితకాలం లో గుర్తింపు పొంద లేదు, తోటి చిత్రకారులను ప్రభావితం చేసాడు. అయన మరణం తర్వాత, ఒక ఆర్ట్ డీలర్ చొరవ వలన ఆయన వేసిన చిత్రాలు అమ్ముడయాయి, క్రమంగా గుర్తింపు లభించింది. అది అలా ఉంచితే, ఈ చిత్రాన్ని – దాని వెనుక ఉన్న కథ తెలియకపోతే […]

Continue Reading
Posted On :

చిత్రం-29

చిత్రం-29 -గణేశ్వరరావు  మేరీ జిన్స్ మల్టీమీడియా ఆర్టిస్ట్( ఒహియో) యాభయ్యవ పడిలో అకాలమరణం చెందారు. కార్టూనిస్ట్ గా అంతర్జాతీయ బహుమతులు అందుకున్నారు. ఆమె తన విశ్వాసాలకు అనుగుణంగా నిబద్ధత తో కార్టూన్ లు గీసేవారు. నిజమైన ప్రజాస్వామ్యం అంటే ఏమిటో నేర్పడానికి ప్రయతించేవారు. వాదాలకు అతీతంగా స్పందించిన మానవతావాదికార్టూన్ అంటే నవ్వించేది అని మనలో కొందరు అనుకుంటారు. ఒక వ్యంగ్య చిత్రంగా దాని లక్ష్యం రాళ్లు రువ్వడం, అయితే అవి దేని గురించి అయినా అవ్వొచ్చు – […]

Continue Reading
Posted On :

చిత్రం-28

చిత్రం-28 -గణేశ్వరరావు  అన్నిటికీ ఆడదే ఆధారం!పొద్దు తిరుగుడు పువ్వు కథ విన్నారా?చార్లెస్ లా ఫొస్ 17వ శతాబ్ద నికి చెందిన ఫ్రెంచ్ చిత్రకారుడు, అతని చిత్రాల లోని రంగులు ప్రకాశవంతంగా కనిపిస్తాయి, అలంకారిక శైలిలో ఉంటాయి. ఆయన చారిత్రాత్మక కుడ్య చిత్రాలు కొన్ని ప్రసిద్ధి చెందాయి. ఆయన చిత్రాలు అప్పటిలో ప్రాచుర్యం ఉన్న కథల మీద ఆధారపడి ఉండటం మూలాన , అవి కేవలం కంటికి ఇంపుగా మాత్రమే కాక మనసును కూడా రంజింప చేస్తాయి. ఈ […]

Continue Reading
Posted On :

చిత్రం-27

చిత్రం-27 -గణేశ్వరరావు  కొందరు చిత్రకారులు ‘వస్తువు’ కు కాక ‘శిల్పానికి ‘ ప్రాధాన్యం ఇస్తారు. వారి చిత్రాలు రూప రహితంగా వుంటాయి. అవి అర్థం కావడం కష్టం. మనకు మొట్ట మొదట ఇలాటి చిత్రాలను పరిచయం చేసినది పద్మశ్రీ ఎస్వీ రామారావు. గుడివాడకు చెందిన వీరు అమెరికాలో స్థిరపడ్డారు. మన దేశం లోని చిత్రకారులు(ఉదా. రాజా రవి వర్మ) అలంకారిక చిత్రకారులు కాగా పాశ్చాత్య దేశ చిత్రకారులు (ఉదా. పికాసో) చాలా మంది నైరూప్య చిత్రకారులు. రామారావు […]

Continue Reading
Posted On :

చిత్రం-26

చిత్రం-26 -గణేశ్వరరావు  ఆస్ట్రేలియా లో ఉన్న క్యురేటర్ వసంతరావు ‘వసంతఋతువు’ మీద ఒక online చిత్రకళా ప్రదర్శన ఏర్పాటు చేసారు. అందులో పసుపులేటి గీత చిత్రానికి ఒక స్థానం కల్పించారు, అంతే కాదు, ఆమెనూ, ఆమె చిత్ర రచనని అద్భుతంగా పరిచయం చేసారు. వారి వ్యాఖ్యలు – తిరుగులేని తీర్పు లాటివి.పసుపులేటి గీత బహుముఖ ప్రజ్ఞావంతురాలు – పాత్రికేయురాలు, కవయిత్రి, చిత్రకారిణి..’వస్తువు’ కు చిత్రకారిణి గీత ఎంతో ప్రాముఖ్యం ఇచ్చారు. ఆమె చిత్రంలో – ‘తీయని ఊహలు […]

Continue Reading
Posted On :

చిత్రం-25

చిత్రం-25 -గణేశ్వరరావు  స్మార్ట్ ఫోన్ ల ధర్మమా అని ఇప్పుడు ఐదేళ్ళ పిల్ల కూడా సెల్ఫీ లు తీసేస్తోంది. వీళ్ళ సంగతి అలా ఉంచితే, ఫోటోగ్రఫీ వృత్తి లో రాణించే వారిలో అసామాన్యులు అక్కడక్కడా కనిపిస్తున్నారు. అందమైన వాళ్ళు ఎంత మంది లేరు? అయితే వీరిలో మోడలింగ్ రంగంలో పేరు తెచ్చుకుంటున్న వాళ్ళు ఎంత మంది ఉన్నారు? సూపర్ మోడల్స్ ని ఒక ప్రత్యేక కోణం నుంచి చూపించే వారే ఫోటోగ్రఫీ లో విజయం సాధిస్తారు. ఇప్పుడు […]

Continue Reading
Posted On :

చిత్రం-23

చిత్రం-23 -గణేశ్వరరావు  ఇది బృందావన్ ‘క్వారంటైన్’ ఫోటో, వితంతువుల క్వారంటైన్. ‘అసుంటా’ ‘అస్పృశ్యత’ మడి-ఆచారాలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఆటవిక దశనుంచే ఉన్నాయి.ఎవడిని తాకితే ఏమౌతుందో, దేన్నీ తాకితే ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆటవిక మానవుడు భయంతో తల్లడిల్లి పోయేవాడు. ఆటవికులు చచ్చిపోతే వాళ్ళ వస్తువులను వాళ్ళతో పాతేసే వాళ్ళు. మన మతాచారాలు ఆటవికుల భయం నుంచే పుట్టాయని అనిపిస్తోంది.ఇప్పుడు కరోనా భయంతో మనం పాటిస్తున్న నియమాలను భవిష్యత్తులో చరిత్రకారులు ఎలా తీసుకుంటారో ఊహించగలమా?ఈ ఫోటోలో గేటుకు […]

Continue Reading
Posted On :

చిత్రం-22

చిత్రం-22 -గణేశ్వరరావు  వివియన్ ఈ ఫోటో ను ఎలా తీసారన్నది మన ఊహకు అందని విషయం. దీనిలో ఎన్నో ఎంతో పొందికగా … చక్కగా అమరాయి.. ఫోటోలో reflection, silhouette, exposure, అన్నీ కలిసి ఉన్నాయి. పైగా అన్నీ కలిసి దీన్ని ఒక సృజనాత్మక ‘సెల్ఫీ ‘ గా చూపిస్తున్నాయి. ఇంకొన్ని అంశాలను గమనార్హం. షాప్ లోపల కూర్చున్న వ్యక్తులు .. గ్లాస్ విండో ముందు నిల్చుని తమని ఎవరో ఫోటో తీస్తున్న సంగతి గమనించినట్లు తెలుస్తోంది. […]

Continue Reading
Posted On :

చిత్రం-21

చిత్రం-21 -గణేశ్వరరావు  ఈ కళాత్మక చాయా చిత్రం తీసినది పారిస్ కు చెందిన మార్తా (moth art అన్న దానికి బదులుగా ఈ పేరు ను వాడుతుంది ఆమె, అసలు పేరు చెప్పదు). సాధారణమైన రూప చిత్రాలపై ఆమె ఎంత పట్టు సాధించిందో అన్న దానికి ఈ ఫోటో ఒక రుజువు. తన మోడల్స్ హావభావాలను శక్తివంతంగా కెమెరా లో బంధిస్తుంది. ఆమె తీసిన ప్రతీ ఫోటో ఒక కథను చెబుతుంది. ఫోటోలోని అమ్మాయి ఒక్క చూపు […]

Continue Reading
Posted On :

చిత్రం-20

చిత్రం-20 -గణేశ్వరరావు  ఛాయా చిత్రాలు..ఫోటోలు షూట్ చేయడానికి, వాటిని పోస్ట్ చేయడానికి మధ్య ఎంతో తతంగం విధిగా చోటు చేసుకుంటుంది. ఒకప్పుడయితే ఫోటోలు తీసిన వెంటనే వాటిని పంపేవారు, పత్రికలు యథాతథంగా వాటినే ప్రచురించేవి. ఇప్పుడు ఫోటో చూడగానే తెలిసిపోతోంది, ఫోటో షాప్ ధర్మమా అని అది ఎంత మారిపోయిందో!ఎవరైనా చెబుతారు – ఫోటోగ్రఫీ ప్రక్రియలలో నీటి అడుగున ఫోటోలు తీయడం (underwater ఫోటోగ్రఫీ) ఎంత కష్టమైనదో అని. కారణాలు ఊహించగలరు. ముందు మీకు ఒక ఆరితేరిన మోడల్ దొరకాలి, నీళ్ళలో మునిగినప్పుడు […]

Continue Reading
Posted On :

చిత్రం-19

చిత్రం-19 -గణేశ్వరరావు  ఆర్టెమిజా జెంటిలెక్సి 17వ శతాబ్దపు ఇటాలియన్ చిత్రకారిణి. ఆమె 1620లో గీసిన ఈ చిత్రం పేరు – జూడిత్, హోలోఫర్నెస్ తల నరకడం. ఓల్డ్ టెస్టమెంట్లోని కథ. అస్సిరియన్ ఆర్మీ జనరల్ హోలోఫర్నెస్ జుడిత్ ఉన్న నగరాన్ని ముట్టడి చేస్తాడు. బాగా తాగి ఉంటాడు. ఆమె అదే అదనుగా అతని తల నరికి, తన సేవకురాలితో సొంత ఊరికి తిరిగి వస్తుంది. ఈ ఇతివృత్తాన్ని ఆర్టెమిజా అందరినీ అబ్బురపరచేటట్టు స్పష్టమైన దృశ్య రూపంలో చూపుతుంది. […]

Continue Reading
Posted On :

చిత్రం-18

చిత్రం-18 -గణేశ్వరరావు  కొందరు గొప్ప వారు తమ జీవితకాలం లో కీర్తి ప్రతిష్ట లను అనుభవించ కుండానే పోతుంటారు, విన్సెoట్ వాన్గొ తను గీసిన ఒకే ఒక బొమ్మని అమ్ముకో గలిగేడు. మరి కొందరి విషయం లో అదృష్టం ఎప్పుడూ వారి వెంటే ఉంటుంది, ఫ్రాన్స్ చిత్రకారిణి ఎలిజబెత్ వీజీ ల బ్ర న్ గీసిన 900 చిత్రాలన్నీ ఆమ్ముడయాయి – అదీ ఆమె జీవించిన 18వ శతాబ్దంలో. ఆ రోజుల్లో స్త్రీలకి విద్యా సంస్థ లలో […]

Continue Reading
Posted On :

చిత్రం-17

చిత్రం-17 -గణేశ్వరరావు  గత పదేళ్లలో ఆఫ్రికన్ చిత్రాలకు డిమాండ్ బాగా పెరిగింది. ముఖ్యంగా ఇర్మా స్టెర్న్ చిత్రాలకు. చిత్రకళా ప్రపంచంలో ఆమె విశ్వవ్యాప్తంగా పేరు పొందింది. 1966లో ఆమె మరణించింది. ఆ మధ్య   ఆమె గీసిన లేడి కళ్ళ భారతీయ వనిత బొమ్మ $3 మిలియన్ల కు అమ్ముడయింది. 2015 లో ఒక లండన్ ఫ్లాట్ లో వంట గదిలో నోటీస్ బోర్డు లా వాడుతున్న ఆమె చిత్రం బయట పడింది. మండేలా సహాయార్థం అది […]

Continue Reading
Posted On :

చిత్రం-16

చిత్రం-16 -గణేశ్వరరావు  ‘ఆలోచనలు కలలతో మొదలవుతాయి, ఎప్పటినుంచో నా కల ‘plein air ‘ పదాలకి ప్రాచుర్యం తీసుకొని రావాలని !’ అంటాడు పత్రికాసంపాదకుడు ఎరిక్. ఆ ఫ్రెంచ్ పదాలకి అర్థం ‘ఆరు బయట’ అని. ప్రకృతి దృశ్యాలని ప్రత్యక్షంగా చూస్తూ వాటిని చిత్రించడం! అభయారణ్యంలో మీరు తిరుగుతూ ఉన్నప్పుడు మీ ముందు ఒక లేడి దూకడం చూస్తారు, చేతిలోని కెమెరా తో ఫోటో తీయడానికి ప్రయత్నిస్తారు. అదే మీరు ఒక చిత్రకారుడు అయితే..ఆ దృశ్యాన్ని కళ్ళల్లో […]

Continue Reading
Posted On :

చిత్రం-15

చిత్రం-15 -గణేశ్వరరావు  కళా హృదయం కలవారు తమ పరిసరాలలో వున్న వాటి నుంచి తరచూ సృజనాత్మక ప్రేరణను పొందుతుంటారు. వాటిని తమ కళా ప్రక్రియలలోకి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.రష్యన్ ఫోటోగ్రాఫర్ క్రిస్టినా తన కెమెరా తీసుకొని ప్రపంచం అంతా పర్యటిస్తుంటుంది. ఫ్యాషన్, ఆర్కిటెక్చర్ రంగాలు కలిసే వుంటాయి. క్రిస్టినా తన ట్రావెల్ ఫోటోగ్రఫీ లో ఆ రెండూ ఎలా కలిసిపోతాయో చూపిస్తుంది.ఆమె అందమైన రూప చిత్రాలను ఎన్నో తీసింది, ఆ సిరీస్ లో సుందరమైన ప్రకృతి దృశ్యాల నేపథ్యంలో […]

Continue Reading
Posted On :