image_print

సంపాదకీయం- జనవరి, 2022

“నెచ్చెలి”మాట  2022కి ఆహ్వానం! -డా|| కె.గీత  2022వ సంవత్సరం వచ్చేసింది! గత రెండేళ్లుగా అలుముకున్న  చీకట్లని పాక్షికంగానైనా-  పదివిడతల టీకాలతోనైనా-  తొలగిస్తూ మనలోనే ఉన్న  వైరస్  ఓ-మైక్రాన్  కాదు కాదు  ఓ-మేక్సీ లాగా  బలపడుతున్నా  వెనుతిరగకుండా  మనమూ  పోరాడీ పోరాడీ  బలపడుతూ ఉన్నాం కిందపడినా లేస్తూ ఉన్నాం కొత్త ప్రారంభాల  కొత్త ఉత్సాహాల  కొత్త జీవితాల  మేలుకలయికగా- పోరాటం ఎంతకాలమో తెలీదు  ఎవరు  ఎప్పుడు  బలవుతారో తెలీదు  అయినా  తెగని ఆశతో   రొమ్ము ఎదురొడ్డే ధైర్యంతో   వచ్చుకాలము […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- డిసెంబర్, 2021

“నెచ్చెలి”మాట  చిన్న సున్నా (ఓమిక్రాన్) -డా|| కె.గీత  నిన్నమొన్న డెల్టా నుంచి తేరుకోకముందే  ఉల్టా అయింది పరిస్థితి- గ్రీకు అక్షరాలు వరసపెట్టి అయిపోతున్నాయి…    ఆల్ఫా, బీటా గామా, డెల్టా ఎప్సిలాన్, జీటా ఎటా,తీటా, అయోటా కప్పా, లాంబ్డా ము, ను, జి ఓమిక్రాన్…..  మాట వింటేనే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయనీ   ఓమిక్రాన్ (ఓ- మైక్రాన్) అంటే చిన్న సున్నా అట  కానీ  ధైర్యం పెద్ద సున్నా అయ్యేట్టుందనీ  బాధ పట్టుకుందా?!  మరి  వైరస్ కీ దమ్ముంది కంటికి […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- నవంబర్, 2021

“నెచ్చెలి”మాట  తస్మాత్ జాగ్రత్త  -డా|| కె.గీత  కోవిడ్ కాలంలో  ఉద్యోగాల్లేక  డబ్బు వచ్చే మార్గాల్లేక  జనం విలవిల్లాడడం మాట విన్నారా? సానుభూతి పడ్డారా?  అయ్యో… పాపం…   అని సాయం చెయ్యబోయి  చెయ్యికాల్చుకున్నారా? మోసపోయారా? తస్మాత్ జాగ్రత్త! కోవిడ్ కాలంలో మామూలు మోసగాళ్ళేం ఖర్మ  ఘరానా మోసగాళ్లు  ముందుకొచ్చేరు!!   డబ్బు కోసం  పీకెలు కోసెయ్యడం పట్టపగలే దోచెయ్యడం  కనబడ్డ వస్తువల్లా మాయం చేసెయ్యడం  హత్యలు, దోపిడీలు వంటి గొప్ప నేరాలు ఘోరాలే కాకుండా – ఆన్లైన్ లో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- అక్టోబర్, 2021

“నెచ్చెలి”మాట   ఇంటిపట్టు -డా|| కె.గీత  ఒకటో దశ రెండో దశ మూడో దశ …….  ఇలా ఎన్ని దశలు దాటుకుంటూ వెళ్తున్నామో మనకే తెలియదు  అయినా  మొన్నటిదాకా మెడకి తగిలించుకున్న మాస్కు ఇప్పుడసలు ఎక్కడుందో కూడా తెలీదు…  అయినా వాక్సిను తీసుకున్నాం కదా!  ఇంకా కోవిడ్ ఏవిటి? దశలేవిటి  అంటున్నారా? సర్లెండి… ఇలా అనుకోవడమే బావున్నట్టుంది! అన్నట్టు  కోవిడ్ తీరని నష్టాలతోబాటూ  కొన్ని  లాభాల్ని  కూడా కలిగించిదండోయ్-  అందులో మనకి పనికొచ్చే ముఖ్యమైందేవిటంటే  కాలికి బలపం కట్టుకుని […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- సెప్టెంబర్, 2021

“నెచ్చెలి”మాట  సంక్షోభం -డా|| కె.గీత  “మాకేం సంక్షోభల్లేవండీ, హాయిగా ఉన్నాం!”  “హమ్మయ్య జీవితం సుఖంగా గడుస్తూ ఉంది!”  “ఏ బాధల్లేకుండా సంతోషంగా ఉన్నాం!”  అనే వాళ్లెవరైనా ఇప్పుడు అసలు ఉన్నారా?  కరోనా ఒకటి రెండు మూడు అంటూ విశ్వ రూపం దాలుస్తూ ఉంది.  ప్రకృతి విలయాలు చెప్పనే అవసరం లేదు! మహారాష్ట్ర, తెలంగాణా, ఆంధ్రల్లో  అమెరికా సంయుక్తరాష్ట్రాల్లో  అనే తేడా లేకుండా  ఎక్కడా ఎడతెరిపి లేకుండా  వాయుగుండాలు  ఉప్పొంగుతున్న నదులు, వరదలు  కాలిఫోర్నియాలో మళ్లీ కార్చిచ్చులు  హైతీలో […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- ఆగస్టు, 2021

“నెచ్చెలి”మాట   పోటీ ఫలితాలు -డా|| కె.గీత  ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా  నెచ్చెలి కథ, కవితల పోటీల్లో ఉత్తమ పురస్కారాల ఎంపికకు  వినూత్నమైన  ప్రయోగం చేసాం. అదేవిటంటే పురస్కారాల ఎంపికలో నెచ్చెలి సంపాదకులు, నెచ్చెలి నిర్ణయించిన న్యాయనిర్ణేతలు మాత్రమే కాకుండా పాఠకులు కూడా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.  ఇందుకుగాను పాఠకులు ద్వితీయ వార్షికోత్సవ సంచికలో వచ్చిన పోటీ రచనలని చదివి విశేషణాత్మక కామెంట్లు పోస్టు చేశారు. పాఠకుల నుంచి అనూహ్యంగా విశేష స్పందన వచ్చింది. దాదాపు వెయ్యి పైచిలుకు కామెంట్లు […]

Continue Reading
Posted On :

సంపాదకీయం- జూలై, 2021

“నెచ్చెలి”మాట  ద్వితీయ జన్మదినోత్సవం!   మీరూ న్యాయనిర్ణేతలే!! -డా|| కె.గీత  “నెచ్చెలి” మీ అందరి ఆశీస్సులతో రెండో ఏడాది పూర్తి చేసుకుంది!  ముందుగా అడగగానే ఒప్పుకుని ఆత్మీయంగా నెచ్చెలి కోసం తొలి సంచిక నుండీ రాస్తున్న నెచ్చెలి రచయిత్రు(త)లందరికీ  పేరుపేరునా నెనర్లు!  లక్షా పాతిక వేల హిట్లు దాటి మీ అందరి మనసు మెచ్చిన “నెచ్చెలి” తెలుగు అంతర్జాల స్త్రీల పత్రికలలో  అగ్రస్థానంలో నిలవడానికి కారణభూతమైన  పాఠకులైన మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు!  ఈ ద్వితీయ జన్మదినోత్సవ శుభ […]

Continue Reading
Posted On :