image_print

జ్ఞాపకాల ఊయలలో (భాగం-10)

జ్ఞాపకాల ఊయలలో-10 -చాగంటి కృష్ణకుమారి పఠాభి మాష్టారు గారు పాలికాపునిచ్చి  నన్ను లచ్చమ్మపేటకి  పంపారు కదా ! ఇంట్లోకి అడుగుపెట్టానో లేదో స్కూలు నుండి  తిన్నగా ఇంటికి రాక  పార్వతి ఇంటికెల్లావుట! మేమంతా ఎంత కంగారు పడ్డామో తెలుసా అంటూ మొదలెట్టారు. అన్నదమ్ముల కుటుంబాలుంటున్న ఏక పెనక తాటాకు ఇళ్ల లో ఒక ఇల్లు మాది కదా. ఇంటికీ ఇంటికీ మధ్యనున్న పెరళ్లన్నీ  కలిసే వుండేవి.  మధ్యన గోడలు లేవు. మాఇంటినీ  ప్రక్క ఇంటినీ విడదీసి చూపడానికి […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-9)

జ్ఞాపకాల ఊయలలో-9 -చాగంటి కృష్ణకుమారి కల్లేపల్లి  హైస్కూల్  నేను అక్కడ చదువుకొన్న రోజులలో ఒక తాటాకు పాక.  కొంత మధ్య నున్న   భాగం పైన బంగాళా పెంకులుండేవి ఆభాగానికే గోడలూ గుమ్మం . అది హెడ్ మాస్ఠారుగారి గది, ఆఫీసు కలసి వున్న భాగం .  దానికిరువైపుల భాగాలూ తాటాకులతో నేసిన ఒక షేడ్ అన్నమాట .తరగతి గదులమధ్యన గోడలుండేవి కానీ వాటి చుట్టూతా సగం గోడ ఆపైన వెదురుతో  తయారైన కటకటాలు.గుమ్మాలు లేవు. హెడ్మాస్టారు […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-8)

జ్ఞాపకాల ఊయలలో-8 -చాగంటి కృష్ణకుమారి మాపల్లెటూరు   లచ్చమ్మపేటకు   వెళ్లిన కొన్నాళ్లకి మానాన్న నన్ను అక్కడకి ఓ మైలు దూరంలో నున్న కల్లేపల్లి  హైస్కూలు లో నేరుగా ఫస్ట్ ఫారమ్  (6వ తరగతి)  లో చేర్పించాడు. లచ్చమ్మపేట లోని  మా చాగంటి  కుటుంబాలకి చెందిన ఏఆడపిల్లని  హైస్కూలుకి  అంత దూరలోనున్న వేరే  పల్లెకి  పంపటంలేదు. అయితే కొంతమంది మగపిల్లలు మాత్రం  లచ్చమ్మపేట నుండి కల్లేపల్లి హైస్కూలులో చదువుకొంటున్న వారున్నారు. పొలాలవెంట అడ్దం పడి  వెళ్లాలి.లింగమ్మ చెరువు […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-7)

జ్ఞాపకాల ఊయలలో-7 -చాగంటి కృష్ణకుమారి మాముందు పెరడు లో  పూల మొక్కలను పెంచేవారం.  చాలారకాలే వుండేవి. ప్రధానంగా  గులాబీ … దేశవాళీ గులాబీరంగు గులాబీ– సువాసనలను వెదజల్లేది,  రాటలతోవేసిన  పందిరి మీదకెక్కిన  తీగమల్లి, చామంతులు, కనకాంబరాలు. చామంతులు  చాలారకాలేవుండేవి.కానీ చామంతి,దమ్మిడి చామంతి,తెల్లచామంతి , ముందు ఎర్రగాపూసి క్రమేణా పసుపుడోలుకు మారే చామంతి. వానపడ్డాక  చామంతి  కుదపలనుండి  చిన్ని చిన్ని  మొక్కలను వేరు చేసి విడివిడిగా పాతడం చాలాసరదా గావుండేది. డిసెంబర్  పూల మొక్కలలో  కూడా నీలి. తెలుపు, […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-6)

జ్ఞాపకాల ఊయలలో-6 -చాగంటి కృష్ణకుమారి బడికెళుతూ  చదివే ఒకటవ క్లాసు చదువు  ఆగిపోయాక  రోజంతా ఏమిటి చేస్తుంది ఏ  చిన్నపిల్లైనా?  అందునా “ ఎడపిల్ల “  స్థానంలోనున్న , పదిమందిలో పెరుగుతున్న పసిపిల్ల!  అల్లరి తప్ప.నిజానికి ఆపిల్ల ఆడుకొంటూ వుంటే పెద్దలంతా దానిని అల్లరి కింద జమ కట్టి  తిట్టిపోస్తూవుంటారు. సరే అల్లరనే అందాం. ఏఅల్లరికి ఎప్పుడు ఎందుకు తిట్టేవారూ? ఉదాహరణకి భోజనాలకి  అందరూ కూర్చున్నప్పుడు  పరుగులుపెడుతూ వచ్చి  చూసు కోకుండా  మంచినీళ్ళ గ్లాసును కాలితో తన్ని […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-5)

జ్ఞాపకాల ఊయలలో-5 -చాగంటి కృష్ణకుమారి పల్లె లో మాయిల్లు తాటాకుతో నేసిన  పెనక ఇళ్లు . గోడలన్నీ  మట్టి గోడలే  , లోపల ఇంట్లోని మొత్తం  నేలంతా మట్టి నేలే ! గోడలని  ఎర్ర బంక మట్టిలో  రాగిఅంబలి కలిపి  ఏక మందం లో  చదునుగా వుండేలా అలికి వాటి అందాన్నీ,  తాజాతనాన్నీ కాపాడేవారట!  ఇది నేను తరువాత తెలుసుకొన్న  విషయం . గోడలు 10 అంగుళాల మందం లో  అక్కడక్కడ  అవసరానికి ఏవైనా సామానులు పెట్టుకొనేలా  […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-4)

జ్ఞాపకాల ఊయలలో-4 -చాగంటి కృష్ణకుమారి నా ఒకటవ క్లాసు  చదువును మధ్యలోనే ఆపేసి  మాపల్లె కు వెళ్లాక అక్కడ బడికి ఒకటి రెండు రోజులకన్నా ఎక్కువ పోలేదు.ఒక  చిన్నతాటాకు చదరని  తీసుకొని  బడికి వెళ్లాలి.చదర మీద కూర్చొని  ఇసుకలొ ఎవో కొన్ని తెలుగు పదాలు రాయడం,దిద్దడం వంటివి చేసిన గుర్తుంది.మరి  ఆ బడికి  నన్ను పంపలేదు. ఇంట్లోనే ఏవో నేర్పుతూ వుండేవారు. ఇవి ఏడూ ..  వారముల పేర్లు, ఈ పన్నెండు  నెలల పేర్లు–  అన్న పంథాలో […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-3)

జ్ఞాపకాల ఊయలలో-3 -చాగంటి కృష్ణకుమారి విజయనగరంలో రాజునాన్నగారింట్లో‘ ‘రాజునాన్నగది’కి ఆనుకొనివున్న సావిట్లో  రేడియో వుండేది.  న్యాయపతి రాఘవరావుగారు కామేశ్వరి గార్ల  పిల్లల “ ఆటవిడుపు”  కార్యక్రమానికి “ రారండొయ్ రారండోయ్… పిల్లల్లారా రారండోయ్” పిలుపుని అందుకోవడానికై ఆసావిట్లో మునుముందుగానే అందరూ సమావేశమయ్యేవారు. ఈ రేడియో అన్నయ్యాఅక్కయ్యా  “మొద్దబ్బాయీ , చిట్టిబావా , పొట్టిమరదలూ” తో  కలసి  ఎంత సందడి చేయించే వారో అంతకు పదింతల సందడిని  ఈ రెండు కుటుంబాల పెద్దలు ప్రతీవారం చేసేవారు. ఒకసారి వీళ్ళుచేసిన  […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-2)

జ్ఞాపకాల ఊయలలో-2 -చాగంటి కృష్ణకుమారి మానాన్న  బడికి నాతోపాటూ వచ్చి జడుసుకొనేలా భయంకరంగా వున్న  హెడ్మాస్టర్  గారిదగ్గర  కూర్చోపెట్టి వారు  నాతో  ముచ్చటలాడేలా చేసి  నా  భయం పోగెట్టాడని చెప్పాకదా ! ఇంతకు పదింతలు భయాందోళనలను చెందిన సంఘటన ఒకటుంది.  ఆ ఉదంతంలోనూ  నాన్నదే  ప్రధాన భూమిక. అప్పుడు నాకు మూడేళ్లు నిండి నాలుగో ఏడు నడుస్తూ వుండవచ్చు .అంటే బడి మెట్లు ఇంకా ఎక్కడం మొదలవలేదు. ఎందుకంటే ఆరోజులలో ఈ ‘కెజీ’  చదువులు లేవు.ఏంచక్కా పరుగులుపెడుతూ […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-1)

జ్ఞాపకాల ఊయలలో-1 -చాగంటి కృష్ణకుమారి అవి  మారాజునాన్నకాల్చే సిగరెట్టుపెట్టెలలోని తెల్లని ముచ్చికాగితాలు అడిగి పుస్తకాలలో పదిలంగా దాచుకొనే రోజులు;చిన్నిరబ్బరుమూతతోవున్న ఖాళీఅయిన బుల్లిఇంజక్షన్  సీసా రాజునాన్నగారి మెడికల్ షాపు నుండి తెచ్చుకొని పలక తుడుచుకోవడానికి  నీటితో నింపుకొన్న రోజులు.పుస్తకాలలో నెమలి ఈకలను దాచి వాటిమీద మూడు,నాలుగు బియ్యపుగింజలువేసి అది పిల్లలు పెడుతుందని  మాటిమాటికీ  పేజీలు తిరగేసే రోజులు. రాజునాన్న మానాన్న చాగంటి సోమయాజులు( చాసో)కి తమ్ముడి వరస.అప్పుడు నేను చదువు తున్నది విజయనగరం చిన్నిపల్లి వీధిబడిలో ఒకటవ తరగతి.బడిమెట్లుఎక్కగానే […]

Continue Reading