image_print

అప్పుడే మొదలైంది (కథ)

అప్పుడే మొదలైంది (కథ) – డా.కే.వి.రమణరావు తలుపు తెరిచి రూమ్మేట్స్ లోపలికొచ్చిన చప్పుడుకు సగం మగత సగం ఆలోచన ల్లో నుంచి మేలుకుంది తను. వాళ్ళ మాటలు గుసగుసల్లోకి మారాయి. ‘ఫష్ట్ షో సినిమా అప్పుడే ఐపోయిందా’ అనుకుంది. పక్కలు సర్దుకుంటున్నారు. సినీ విశ్లేషణ కొనసాగించబోయింది దివ్య. “ష్.. ప్రతిమ నిద్రలోవుంది. అసలే తనని పిలవకుండా వెళ్ళాం, యింక పడుకో” అంది నందన. వినయ చిన్ననవ్వు తర్వాత నిశ్శబ్దం అలుముకుంది. ఎప్పుడో నిద్రపట్టి తెల్లవార్ఝామునే మెలుకువొచ్చింది తనకి. […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-12 యం.రమేష్ కుమార్ కథ “కిటికీ బయట”

మెరుపులు-కొరతలు యం.రమేష్ కుమార్ కథ “కిటికీ బయట”                                                                 – డా.కే.వి.రమణరావు మనకు ఏదైనా తీవ్రమైన సమస్య వస్తే మన అంతరంగమంతా కల్లోలమైనప్పుడు ఒక్కోసారి బాధంతా మనకే ఉన్నట్టుగా, బయటి ప్రపంచం నింపాదిగా ఏ సమస్యా లేకుండానే నడుస్తున్నట్టుగా అనిపిస్తుంది, నిసృహ కూడా కలుగుతుంది. కానీ బయట కూడా ప్రతివాళ్లూ ఏదోవొక సమస్యను మోస్తూనే ఉంటారు అని చెప్పే కథ ఇది. కథనం పెద్దగానే వున్నా కథ చిన్నది, ఇలా ఉంటుంది. కథ ఉత్తమ పురుషలో చెప్పబడింది, కథ […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-11 మెర్సీ మార్గరెట్ కథ “వర్షం సాక్షిగా”

మెరుపులు-కొరతలు మెర్సీ మార్గరెట్ కథ “వర్షం సాక్షిగా”                                                                 – డా.కే.వి.రమణరావు ఒక క్రిస్టియన్ యువకుడు మరణించాక అతనికి చేయాల్సిన ఉత్తరక్రియల్లో అదే మతంలో రెండు విశ్వాసాలను అనుసరించే రెండు వర్గాలు విభేదించడం గురించి చెప్పడం ఈ కథ ఉద్దేశం. కథాంశం చాలా స్థూలంగా ఇది. కథ చెప్తున్న మనిషి గ్రేసి. ముందురోజు సాయంకాలం నుంచి మరుసటిరోజు సాయంకాలం వరకు జరిగిన సంఘటనలను కాలనుక్రమంలో వరుసగా గ్రేసి వర్ణించడమే కథ. కథా కాలమంతా సన్నగా వర్షం పడుతూనే ఉంటుంది. […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-10 డా.మనోహర్ కోటకొండ కథ “దేవకీ పరమానందం”

మెరుపులు-కొరతలు  డా.మనోహర్ కోటకొండ కథ “దేవకీ పరమానందం”                                                                 – డా.కే.వి.రమణరావు           పేదరికంలో ఉండి, చదువు మీద శ్రద్ధ ఉన్న ఒక కుర్రాడు అలాంటి ఇతర పేద, దిగువ మధ్యతరగతికి చెందిన వ్యక్తుల సహాయంతో చదువుకుని డాక్టరై స్వంతవూర్లో ప్రాక్టీసు పెట్టి సేవ చెయ్యడం ఈ కథ సారాంశం. కథాంశం పాతదే. ఇంచుమించుగా ఇలాంటి కథతో సినిమాలు కూడా వచ్చాయి. కథాంశం పాతదే అయినా చెప్పిన పద్ధతి, చూపించిన కొన్ని తాత్విక […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-9 రాజా అంబటి కథ “గ్రీవెన్స్”

మెరుపులు- కొరతలు రాజా అంబటి కథ “గ్రీవెన్స్”                                                                 – డా.కే.వి.రమణరావు ఇదొక చిన్న కథ. విశాఖపట్నం జిల్లాలోని మారుమూల ప్రదేశాన్ని నేపధ్యంగా తీసుకుని గ్రామీణ ప్రాంతంలో ఇప్పటికీ కొనసాగుతున్న వర్ణవివక్షను చూపించిన కథ. జిల్లా ఆఫీసులోని సహృదయుడైన ఒక చిన్న ఉద్యోగి పరంగా ఈ కథ చెప్పబడింది. స్థూలంగా కథేమిటంటే, విశాఖపట్నం కలెక్టరాఫీసులో గుమాస్తాగా పనిచేస్తున్న విజయ్ అనే ఉద్యోగి కొండల్లోవున్న సురవరం అనే పల్లెనుంచి దొన్ను అనే వ్యక్తి రాసిన ఫిర్యాదును ఒకరోజు చూస్తాడు. ఆ […]

Continue Reading
Posted On :

మెరుపులు- కొరతలు-8 ఉమా నూతక్కి కథ “25వ గంట”

మెరుపులు- కొరతలు ఉమా నూతక్కి కథ “25వ గంట”                                                                 – డా.కే.వి.రమణరావు ఉద్యోగం చేస్తున్న ఒక గృహిణి మీద పడుతున్న అనేక బాధ్యతల వలన ఆమెకు తన స్వంత అభిరుచులకు అనుగుణమైన పనులు చేసుకోవడానికి సమయం దొరక్క పోవడం గురించి ఈ కథ ప్రస్తావిస్తుంది. అలాంటి స్త్రీకి రోజులో కనీసం తనకంటూ ఒక అదనపు గంట, 25వ గంట, ఉంటే బావుంటుందని ఈ కథ నిసృహగా సూచిస్తుంది. ఈ కథ సంప్రదాయ శిల్పంలో కాకుండా ఈ మధ్యకాలంలో […]

Continue Reading
Posted On :

మెరుపులు-కొరతలు- 6 “నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ

మెరుపులు- కొరతలు “నిర్ణయం” శాంతిశ్రీ బెనెర్జీ కథ                                                                 – డా.కే.వి.రమణరావు అన్నివిధాలా బావుండి భార్యపట్ల ప్రేమగా కూడా ఉండి ఒక చిన్న బలహీనతను అదుపులో పెట్టుకోలేని భర్తతో భార్య పడే ఇబ్బంది గురించిన కథ ఇది. పెళ్లైన మగవాళ్లలో చాలా సాధారణంగా కనిపించే ఈ బలహీనతను భార్యలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియని ఒక స్థితిగురించి చాలా క్లుప్తంగా చర్చిస్తుంది ఈ కథ. చిన్నదిగా రాసిన ఈ కథ సారాంశమిది. కథ ఎక్కువ భాగం ఫ్లాష్ బ్యాక్ […]

Continue Reading
Posted On :