దుఃఖపుమిన్నాగు (కవిత)
దుఃఖపుమిన్నాగు -డా.కె.గీత దుఃఖం జీవితం అడుగున పొంచి ఉన్న మిన్నాగు ఎప్పుడు నిద్రలేస్తుందో దానికే తెలీదు ఎప్పుడు జలజలా పాకుతుందో ఎవరికీ తెలీదు ఎగిసిపడ్డప్పుడు మాత్రం ఎప్పటెప్పటివో నిశ్శబ్ద వేదనలన్నీ ఒక్కోటిగా తవ్వుకుంటూ జరజరా బయటికి పాక్కొస్తుంది దాని పడగ నీడలో ప్రతిరోజూ నిద్రిస్తున్నా ఏమీ తెలియనట్టే గొంతు కింద ఎడమ పక్క సిరలు ధమనులు చుట్ట చుట్టుకుని బయట పడే రోజు కోసం తపస్సు చేస్తుంటుంది ఒక్కసారి నెత్తుటి గంగలా బయట పడ్డదా దాని తాండవం […]
Continue Reading