image_print

జ్ఞాపకాల ఊయలలో (భాగం-2)

జ్ఞాపకాల ఊయలలో-2 -చాగంటి కృష్ణకుమారి మానాన్న  బడికి నాతోపాటూ వచ్చి జడుసుకొనేలా భయంకరంగా వున్న  హెడ్మాస్టర్  గారిదగ్గర  కూర్చోపెట్టి వారు  నాతో  ముచ్చటలాడేలా చేసి  నా  భయం పోగెట్టాడని చెప్పాకదా ! ఇంతకు పదింతలు భయాందోళనలను చెందిన సంఘటన ఒకటుంది.  ఆ ఉదంతంలోనూ  నాన్నదే  ప్రధాన భూమిక. అప్పుడు నాకు మూడేళ్లు నిండి నాలుగో ఏడు నడుస్తూ వుండవచ్చు .అంటే బడి మెట్లు ఇంకా ఎక్కడం మొదలవలేదు. ఎందుకంటే ఆరోజులలో ఈ ‘కెజీ’  చదువులు లేవు.ఏంచక్కా పరుగులుపెడుతూ […]

Continue Reading

నడక దారిలో(భాగం-2)

నడక దారిలో-2 -శీలా సుభద్రా దేవి “నాన్న మీద కవితలు మీరు రాసిన వేమైనా ఉన్నాయా” అని “నాన్న పదం” సంకలనం కోసం ఘంటశాల నిర్మల గారు అడుగుతే ‘లేవు ‘అన్నప్పుడు ‘ఏదైనా రాయండి’ అన్నారు ఒక్క జ్ణాపకాన్ని నాకు ఇవ్వని నాన్నగురించి ఏమి రాస్తాను. నాకు ఊహ తెలిసే సరికే జబ్బు తో ఉన్నారు.అమ్మ వంటి మీద నగలతో సహా అంతా కరిగి పోయింది.మరీమరీ మెదడు మడతలని విప్పగా ఆదివారాలు త్రినాధ స్వామి వ్రతం చేసేవారు […]

Continue Reading

నడక దారిలో(భాగం-1)

నడక దారిలో-1 -శీలా సుభద్రా దేవి నా నుండి బాల్యం ఎప్పుడు జారిపోయిందో తెలియదు.అందరూ బాల్యం జ్ణాపకాలు అపురూపంగా చెప్పుకుంటుంటే నేను గుర్తు తెచ్చుకోటానికి మెదడు పొరల్ని తిరగేస్తూ వెతుక్కుంటాను.నేను ప్రాధమిక పాఠశాలకి వెళ్ళానో లేదో తెలియదు.నాకన్నా పెద్దవాళ్ళైన తోబుట్టువులను అడగాలన్న ఆలోచన వాళ్ళున్నపుడు గుర్తు రాలేదు .అయిదో క్లాసు మాత్రం విజయనగరంలోని పాతబస్టేండుకు దగ్గర ఉన్న ఆశపువీథి లోని పాఠశాలకు వెళ్ళిన గుర్తు..           వినాయక చవితి కి స్కూల్లో పిల్లలచేత […]

Continue Reading

జ్ఞాపకాల ఊయలలో (భాగం-1)

జ్ఞాపకాల ఊయలలో-1 -చాగంటి కృష్ణకుమారి అవి  మారాజునాన్నకాల్చే సిగరెట్టుపెట్టెలలోని తెల్లని ముచ్చికాగితాలు అడిగి పుస్తకాలలో పదిలంగా దాచుకొనే రోజులు;చిన్నిరబ్బరుమూతతోవున్న ఖాళీఅయిన బుల్లిఇంజక్షన్  సీసా రాజునాన్నగారి మెడికల్ షాపు నుండి తెచ్చుకొని పలక తుడుచుకోవడానికి  నీటితో నింపుకొన్న రోజులు.పుస్తకాలలో నెమలి ఈకలను దాచి వాటిమీద మూడు,నాలుగు బియ్యపుగింజలువేసి అది పిల్లలు పెడుతుందని  మాటిమాటికీ  పేజీలు తిరగేసే రోజులు. రాజునాన్న మానాన్న చాగంటి సోమయాజులు( చాసో)కి తమ్ముడి వరస.అప్పుడు నేను చదువు తున్నది విజయనగరం చిన్నిపల్లి వీధిబడిలో ఒకటవ తరగతి.బడిమెట్లుఎక్కగానే […]

Continue Reading