image_print

చిత్రలిపి- గుండెనీరయిన కథ !

చిత్రలిపి గుండెనీరయిన కథ ! -మన్నెం శారద అప్పుడసలు గుండె ఒకటుంటుంది తెలియనే తెలియదు బోసినవ్వుల అమాయకత్వం నుండి ఆటపాటల అల్లరిదాకా ‘చిన్నినా పొట్టకు శ్రీరామ రక్ష అనుకుంటూ తిండి గోలేతప్ప  గుండె గో;ల  తెలియదు గాక  తెలియదు  దశలుమారి ,దిశలు తిరిగి వయసు భుజాలపై  రంగు రంగు  రెక్కలు మొలిచి లోకమొక నందనవనంగా కనులకు భ్రాంతి గొలిపి ……..పిదప గుండెజాడ తెలిపింది  ఎర్రని వర్ణపు మధువులు ఒడలంతా వంకరలు పోతూ గిరగిరా తిరిగి  హృదయాన్ని మోహపరచి  మైమరపిస్తున్న వేళ ఒక ధ్యేయం లేక  పువ్వు పువ్వు చుట్టూ తిరుగుతూ  జుంటితేనెలు గ్రోలి మత్తుగా గమ్మత్తుగా గాలిలో పల్టీలు కొడుతున్న  నా రంగుల  రెక్కల్ని ఎక్కడివో మాయదారి ముళ్ళు అతి రక్కసము గా చీల్చి నా రక్తాన్ని […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- “ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని !

చిత్రలిపి ప్రేమా మరి ఈ మనిషికి లేదేం ???” అని ! -మన్నెం శారద ఒకానొక  కాఠిన్యపు  కిరణస్పర్శకు తాళలేక  తల్లడిల్లి ..కరిగి నీరయి న మంచు శిఖరం  ఒకటి ఏరయి సెలయేరయి వాగయి ,వంకయి శాపవిమోచనమొందిన  గౌతమిలా తన ప్రియ సాగర సమాగం కోసం   మహానదిగా మారి  దక్షిణ దిశకు  పరుగులు తీసింది ! పట్టలేని  పరవశం అది ! ఎన్నో ఏళ్ల కల సఫలం  కాబోతున్న సంతోషం అది !  ఆపుకోలేని  ఆనందం తో   గిరులని తరులని ఒరుసుకుంటూ వురుకుతున్న  నదిని  చూసి ఆ చెట్టు అడిగింది ‘ఎక్కడకి  మిత్రమా …అంత వేగం ?దేనికోసం ఆ దుందుడుకు ?”అని పరిహాసంగా . నది ఒకింత […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- నా జ్ఞాపకాల పొత్తంలో నెమలీకవు నీవు!

చిత్రలిపి నా జ్ఞాపకాల  పొత్తంలో  నెమలీకవు నీవు! -మన్నెం శారద ఒకానొక ప్రయాణంలో మనం కలిసేవుంటాం మాటామాటా కలిపే వుంటాం  ఆకుపచ్చని చేలని చూడాలని నేను ఆత్రపడినప్పుడు కిటికీ దగ్గర సీటుని నువ్వు నాకు ఇచ్ఛే వుంటావ్  నేను తెచ్చిన పూరీలు , నువ్వు తెచ్చిన పల్లీలు ఒకరికొకరం పంచుకుని తినే ఉంటాం  అనుకోని వానజల్లు  నా మొహాన విసిరి కొట్టినప్పడు  కిటికీ మూస్తుండగా నలిగిననీ వెలికి నేను తడి రుమాలు చుట్టేవుంటాను . నీ టిక్కెట్ జారీ పడిపోయి టి. సి కి నేను ఫైన్ కట్టినప్పుడు  నువ్వు నా వైపు కృతజ్ఞతగా చూసి  కొద్దిగా మొగమాటపడేవుంటావ్  ఇప్పుడొక్కసారి  నా గమ్యం […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- అమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు ???

చిత్రలిపి అమ్మా …ఆనాడే ఎందుకు చెప్పలేదు ??? -మన్నెం శారద అవునమ్మా …నువ్వు ఆనాడే ఎందుకు చెప్పలేదూ ….తాతయ్య వడిలో కూర్చుంటే తప్పని బాబాయి భుజాలమీద ఊరేగవద్దని ఆటో అంకులు ని ముట్టుకోనివ్వద్దని పక్కింటికి పోవద్దని దోస్తుల్ని నమ్మొద్దని వెన్నెల్లో ఆడొద్దని చుట్టమిచ్చిన చాకోలెట్  అయినా తినవద్దని …..ఇల్లు దాటొద్దని ! ఎన్నో ఎన్నెన్నో  ప్రతి బంధాల మధ్య  నా బాల్యం ఛిద్రమవుతుంటే దారిలేక  కుమిలి  కునారిల్లుతున్నాను  ఇప్పుడిప్పుడే  అర్ధమవుతున్నది …ప్రతిక్షణమూ  నువ్వు  నాకోసం పడుతున్న  వేదన !అనుక్షణమూ  అనుభవిస్తున్న నరకం !కంట్లో వత్తులేసుకుని  నువ్వు  కాసే కాపలా …….ఆఫీసునుండి  ఇంటికి వచ్చాకా  నీ కళ్ళలో ప్రతిఫలించే  ఆనందం !అమ్మా ….ఎన్నాళ్లిలా …ఎన్నేళ్ళిలా … అవునమ్మా […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- ఆశల తీరమది

చిత్రలిపి ఆశల తీరమది -మన్నెం శారద గూడు చెదరి  వీడి పోదామనను కున్నప్పుడాచెట్టు కనులు చెదిరే  రంగులతో …మనసు  పొంగే హంగులు  వడలంతా నింపుకుని  వయ్యారంగా ఆగమని ఆకుల కన్నులతో అలవోకగా సైగ చేస్తుంది !  చూరు మీద ఆకులు రాలి ఆకాశం కనిపిస్తున్నప్పుడు  కదలిపోదామిక  అని గాఢంగా  నిట్టూర్చినప్పుడు తారలు కుట్టిన ఆకాశం  కప్పుమీద  దుప్పటిపరచి  తళుకులీనుతూ మురిపిస్తుంది ! నిరాశనిండిన మనసుతో  నాదిక ఈ స్థానం కాదనుకుని  తెల్లారగానే  వీడ్కోలు  తీసుకుందామని  గట్టిగా అనుకుని  నిద్రలేచీ లేవగానే వెలుగుకిరణమొకటి  నా గుడిసెలో  దూరి ధైర్యానికి  భాష్యం చెబుతుంది ! వరదనీటిని చూసి  వలస పోదామంటే  వద్దు వద్దంటూ అలలు ఆర్తిగా  కాళ్ళని చుట్టేసుకుంటాయి ! ప్రకృతంతా  సద్దుమణిగి  పడక వేసినప్పుడు సవ్వడి లేకుండా సాగిపోదామంటే పేరు లేని పక్షి ఒకటి  […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- అగమ్య గమ్యం !

చిత్రలిపి అగమ్య గమ్యం ! -మన్నెం శారద ఆ అడవిదారిలో  ఎందుకు అడుగులువేసానో  నాకయితే తెలియదు కానీ ……ఇంత పత్రి తెచ్చాను   వినాయక చవితని ! పాములూ తేళ్ళుంటాయి,,,వళ్లు తెలియదా  అంటూనే తీసుకుని  పూజ చేసింది అమ్మ ! మళ్ళీ అటెనడిచాను  మరేదో కావాలని ….బయలంతా  పసుపు పారబోసినట్లు విరబూసిన తంగేడు పూలని చూసి మనసు మురిసి  వడినిండా కోసుకుని వచ్చి వరండా లో పోసాను  పిచ్చిపూలన్నీ కోసుకొస్తావ్  ,పనిలేదు నీకంటూ పచ్చదనాన్నంతా ఊడ్చేసింది అక్క ! పెదనాన్నతో నర్సి పట్నం పోయి అడవిలోదూరి  సెలయేటిలో చేపలు పడుతూనే ఇదేం పనని  కోప్పడి ఎత్తుకు పోయాడు  ఆర్దర్లీ ! సీలేరు .చింతపల్లి నన్ను మోహపెట్టి లోపలికంటా తీసుకుపోయాయి కానీ అందుకోవాల్సిందేదో  అందనే లేదు . మళ్ళీ మళ్ళీ […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- రేపటి ఆశాకిరణాలు

చిత్రలిపి రేపటి ఆశాకిరణాలు -మన్నెం శారద ఎడతెరపి లేని వాన …..ఏడాపెడావాయిస్తూ … వరదలై ,వాగులై  కొండలపైనుండి దూకుతూ ….కట్టల్ని తెంచుతూ వారధుల్ని కూల్చుతూ ……. ఇళ్లలో దూరుతూ …..కళ్ళముందే కట్టుగుడ్డల్ని .కూడా మిగల్చని కఠినమైన  కరకురాతి చినుకుల్ని చూసి నిస్తేజమయిపోతుంది మనసు ! ఆహా వాన ! సుదీర్ఘ గ్రీష్మ తాపానికి వడలి ,హడలి ఏ చినుకు కోసం ఎదురుచూసామో …ఆ నీరే కన్నెరయి  బీదసాదల బ్రతుకులు ముంచేస్తుంటే ….కలల పంటల్ని కాలరాస్తుంటే దయమాలిన ప్రకృతి వైపు కలతపడి చూస్తుంది మనసు ! నిర్వీర్యమైన నిరాశ నిలబడదు మరెంతో సేపు …….ఎక్కడినుండో ఒక ఆశాకిరణం నునువెచ్చగా నినుతాకుతుంది ! ఎవరిదో ఒక స్నేహ హస్తం నేనున్నానని చేతులు చాపుతుంది !వాలిన మొక్క  నిరాశపడిన మనసుమరల సేదతీరి  నిలబడతాయి!ప్రయాణం […]

Continue Reading
Posted On :

చిత్రలిపి- నిరంతర అన్వేషిణిని నేను…..

చిత్రలిపి నిరంతర అన్వేషిణిని నేను….. -మన్నెం శారద నడుస్తూనే ఉన్నాను నేను … యుగయుగాలుగా తరతరాలుగా ఏ అర్ధరాత్రో అపరాత్రో నేను తొడుగుకున్న భౌతిక కుబుసాన్ని విడిచి నీకోసం నడక ప్రారంభిస్తాను .. గమనమే గాని గమ్యమెరుగని నా అడుగులు సాగుతూనే ఉంటాయి ఆనీవు ఎవరివో అంతుపట్టని కలత ఆలోచనలలో .. తడబడుతూ తల్లడిల్లుతూ నా హృదయపు తాళం తెరచి నీకై నిరీక్షిస్తూ … క్షితి రేఖని చేరి నా మనో సుమాల పరిమళాన్ని ఆకాశమంతా వెదజల్లుతాను […]

Continue Reading
Posted On :