నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన)
నిశి దోచిన స్వప్నాలు (ద్వితీయ వార్షిక సంచిక కవితల పోటీ రచన) -డి. నాగజ్యోతిశేఖర్ నిద్ర కూడా ఓ కలే నాకు…. ఒక్కసారైనా….. పనిసూరీడు చొరబడని విశ్రాంతిచీకటిని కనుపాపల్లో నింపుకోవాలి! తుషార బిందు పరిశ్వంగానికి మైమరచి వాలే తృణపుష్పంలా నిద్దుర స్పర్శ కనురెప్పలపై భారంగా ఒరగాలి! ఎగిరిపోతున్న సాయంత్రం పిట్టల్ని కాఫీ కప్పులోకి ఆహ్వానించి వెలుగు కబుర్లు చెప్పాలి! రాత్రి చెట్టుపై నక్షత్రమై వాలి ఇష్టమైన అక్షరాలను కౌగలించుకోవాలి! పారేసుకున్న కలలనెమలీకల్ని రెక్కలుగా చేసుకొని ఏకాంతంలోకి ఎగిరెళ్ళాలి! […]
Continue Reading